ఎస్కార్ట్ కళ్లుగప్పి నిందితుడి పరార్ | A convicter escapes from Railway Escort | Sakshi
Sakshi News home page

ఎస్కార్ట్ కళ్లుగప్పి నిందితుడి పరార్

Jun 25 2015 11:44 PM | Updated on Sep 3 2017 4:21 AM

కాలకృత్యాలు తీర్చుకు వస్తానని చెప్పి ఎస్కార్ట్ కళ్లుగప్పి ఓ నిందితుడు పరారైన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.

నెల్లూరు(క్రైమ్): కాలకృత్యాలు తీర్చుకు వస్తానని చెప్పి ఎస్కార్ట్ కళ్లుగప్పి ఓ నిందితుడు పరారైన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నై మోరూరుకు చెందిన జి.మురళీని ఈ ఏడాది జనవరిలో సూళ్లూరుపేట రైల్వే పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అతను మైనర్ కావడంతో రిమాండ్ నిమిత్తం తిరుపతిలోని జువైనల్ హోమ్‌కు తరలించారు.

నెల్లూరు జువైనల్ కోర్టులో వాయిదా ఉండటంతో నెల్లూరు పోలీసులు నిందితునితో పాటు మరో ఇద్దరు జువైనల్స్‌ను తిరుపతి నుంచి గురువారం తీసుకొచ్చారు. తిరిగి తిరుపతికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మురళీ కాలకృత్యాలు తీర్చుకుని వస్తానని చెప్పి గోడచాటుకు వెళ్లి ఉడాయించాడు. దీంతో నెల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement