9 వైద్య కళాశాలల్లో కొత్త విభాగాలు

9 New Departments in Medical Colleges - Sakshi

కొత్త విభాగాల ఏర్పాటుకు రాష్ట్ర వైద్య విద్యా శాఖ సన్నద్ధం 

దీనివల్ల పీజీ వైద్య సీట్లు పెరిగే అవకాశం 

ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్‌కు ప్రాధాన్యం 

సాక్షి, అమరావతి: పెరుగుతున్న వైద్య అవసరాలు, కొత్తరకం జబ్బులను ఎదుర్కోవడానికి బోధనాస్పత్రులను మరింత బలోపేతం చేయాలని సర్కార్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లేని కొత్త విభాగాలను వాటిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ నిర్ణయించింది. 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా ఇందులో 9 బోధనాస్పత్రుల్లో అవసరాన్ని బట్టి కొత్త విభాగాలు, కొన్ని చోట్ల ఉన్న విభాగాల్లోనే అదనపు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. బోధనాస్పత్రికి వెళ్తే ఎక్కడా ‘ఈ జబ్బుకు వైద్యం లేదు’ అనే మాట రాకుండా చేయాలన్నదే సర్కార్‌ ఉద్దేశం. దీనికి తగ్గట్టు పడకలు, డాక్టర్లు ఇలా అన్నీ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. కొత్త విభాగాలు ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్‌లో పీజీ వైద్య సీట్లు కూడా పెరగనున్నాయి. 

వైద్య కళాశాలలు – విభాగాలు.. 
గుంటూరు మెడికల్‌ కాలేజ్‌: ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ, సర్జికల్‌ అంకాలజీ, మెడికల్‌ అంకాలజీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్‌), యూరాలజీ (అదనపు యూనిట్‌) 
కర్నూలు మెడికల్‌ కాలేజ్‌: ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, నియోనెటాలజీ, పీడియాట్రిక్‌ సర్జరీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్‌), యూరాలజీ (అదనపు యూనిట్‌) 
ఎస్వీఎంసీ, తిరుపతి: ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ 
ఆంధ్రా మెడికల్‌ కాలేజ్, విశాఖపట్నం: ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, నియోనెటాలజీ, సర్జికల్‌ అంకాలజీ, మెడికల్‌ అంకాలజీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్‌), యూరాలజీ (అదనపు యూనిట్‌), కార్డియాలజీ (అదనపు యూనిట్‌) 
ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్, అనంతపురం: పీడియాట్రిక్‌ సర్జరీ  
రంగరాయ మెడికల్‌ కాలేజ్, కాకినాడ: ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్‌) 
ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్, కడప: ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, నియోనెటాలజీ 
ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్, శ్రీకాకుళం: ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ 
ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్, ఒంగోలు: ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, పీడియాట్రిక్‌ సర్జరీ.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top