తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి.
పులివెందుల : తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. సమైక్యాంధ్రులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 72 గంటల బంద్ కొనసాగుతోంది. పులివెందులలో 72 గంటలు, ప్రొద్దుటూరులో రెండు రోజుల పాటు బంద్ జరగనుంది.
మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, సమన్వయకర్త మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో కమలాపురంలో బంద్ కొనసాగుతోంది. ఇక ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేటలో బంద్ జరుగుతోంది. కాగా
విద్యాసంస్థలను బంద్ చేస్తున్నట్టు కళాశాలల జేఏసీ ప్రకటించగా... సీమాంధ్ర జేఏసీ పిలుపుతో ఏపీఎన్జీవోలు, ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు, విద్యార్థి జేఏసీ, న్యాయవాద జేఏసీలు సంయుక్తంగా 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి.