YS Jagan: పులివెందుల పర్యటన సూపర్‌ సక్సెస్‌ | People's Faith Turns Into A Movement, Special Story On Super Success Of YS Jagan Pulivendula Tour, Check Highlights Inside | Sakshi
Sakshi News home page

YS Jagan: పులివెందుల పర్యటన సూపర్‌ సక్సెస్‌

Nov 27 2025 11:56 AM | Updated on Nov 27 2025 2:10 PM

Special Story on Super Success Of YS Jagan Pulivendula Tour

వైఎస్‌ జగన్‌ అంటే ఒక అభిమానం.. ఒక అనుబంధం.. ఒక బాధ్యత.. ఒక భరోసా.  మొత్తంగా వెరిసి చూస్తే కష్టాల్లో ఉన్న ప్రతీ గుండెకి జగన్‌ ఒక నమ్మకం.  జగన్‌పై ఉన్న ఆ నమ్మకమే ‘జన కెరటమై’ కేరింతలు కొడుతుంది. కష్టాల కన్నీటిలో ఉన్న ప్రజలకి జగన్‌ ఆప్యాయ పలకరింపు.. కొండంత ఆశగా మారుతంది.

YS Jagan YSR District Tour Day2 Highlights Photos1

పులి వెందుల పర్యటన సూపర్‌ సక్సెస్‌
జగన్‌ అంటే జన సునామీ.  వైఎస్‌ జగన్‌ తలపెట్టిన పులివెందుల పర్యటన సూపర్‌ సక్సెస్‌తో ఈ విషయం మరోసారి రుజవైంది. వైఎస్‌ జగన్‌ మూడు రోజుల పులివెందుల పర్యటనలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజల్ని కలుసుకున్నారు. దారి పొడవునా వైఎస్‌ జగన్‌కు అందిన ఫిర్యాదులతో పాటు మద్దతు ధర లేక అల్లాడిపోతున్న అరటి రైతుల్ని జగన్‌ పరామర్శించారు. వారి కష్టాలను ఫిర్యాదులను స్వీకరించారు. ఇక ప్రజాదర్బార్‌ పేరుతో కూడా పులివెందుల క్యాంప్‌ ఆఫీస్‌లో సమీక్షలు చేశారు. అయితే జగన్‌ ఎక్కడకి వెళ్లినా జనాభిమానం పోటెత్తుతంది. జై జగన్‌ నినాదాలతో హోరెత్తితుంది. 

ది. పులివెందుల పర్యటనతో జగన్‌ అనే నమ్మకం మాకు ఎప్పడూ అండగానే  ఉంటుందనేది రుజువు అవుతూనే ఉంది కాబట్టే జై జగన్‌ నినాదంతో గ్రాండ్‌గా సంఘీభావం తెలిపారు అక్కడి  ప్రజలు.

దోపిడీనే నడుస్తుంది.. హామీల అమలు లేదు
పులివెందుల అరటి రైతుల్ని పరామర్శించిన క్రమంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. ‘సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ గాలికెగిరిపోయా­యి. అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఇస్తాన­న్నా­డు. అలా ఏటా రూ.18 వేలు. అలా వారికి రూ.­36 వేలు బాకీ. నిరుద్యోగ భృతి నెలకు రూ.­3 వేలు ఇస్తానన్నాడు. అలా రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అమ్మ ఒడి రూ.15 వేలు అన్నాడు. రూ.2 వేలు కట్‌ చేశారు. రూ.13 వేలు కూడా ఇవ్వకుండా రూ.8 వేలు, రూ.9 వేలు మాత్రమే ఇచ్చారు. అందులోనూ 30 లక్షల మందికి కోత పెట్టారు. పెన్షన్లు కొత్తవి ఇవ్వకపోగా, ఐదు లక్షలు కట్‌ చేశా­రు. మా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తే, ఈ రోజు 61 లక్షల మందికే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఎవ్వరూ సంతోషంగా లేరనేందుకు ఈ లెక్కలే నిదర్శనం’ అని మండిపడ్డారు.

YS Jagan YSR District Tour Day2 Highlights Photos8

ప్రజలతో కలిసి మరింతగా ఉద్యమిస్తాం  
చంద్రబాబూ ఇప్పటికైనా మారండి. ఇలాగే ఉంటూ రైతులను పట్టించుకోకపోతే.. విద్యార్థులు, ప్రజల­ను ఇలాగే కష్టాలపాలు చేస్తామంటే వారితో కలిసి మ­రింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రాబోయే రోజుల్లో వీళ్లందరి తరఫున తీవ్రమైన ఉద్యమాలు ఖాయం. చంద్రబాబును గద్దె దింపే కాలం త్వరలో­నే వస్తుంది. దేవుడు కూడా మొట్టికాయలు వేస్తాడు’ అని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.

YS Jagan YSR District Tour Day2 Highlights Photos22

కష్టమొచ్చిన ప్రతీ ఒక్కరి ధైర్యం జగన్‌..
‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అనేది దివంగత ప్రియతమ నేత వైఎస్సార్‌ మాట.  వైఎస్సార్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి కారణమైన చప్పుడే ‘ నేనున్నాను.. నేను విన్నాను’. మరి ‘ నేనున్నాను.. అండగా ఉంటాను.. అవసరమైతే అడ్డంగా నిలబడిపోతాను’ అనేది వైఎస్‌ జగన్‌ బాట. అధికారంలో ఉన్నప్పుడు అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమాన్ని అందించి.. ప్రజల ఆలనా పాలనా చూసుకుని అండగా ఉన్నారు. ఇప్పుడు అదే ప్రజలకి కష్టమొచ్చింది అందుకే అవసరమైతే అడ్డంగా నిలబడిపోతాను అంటున్నారు వైఎస్‌ జగన్‌. మనకు ఏదైనా కష్టమొస్తే ఎవరైనా కనీసం మాట సాయం చేస్తే బాగుండు అనుకుంటాం. ఆ సమయంలో నేను ఉన్నాను.. అంతా నేను చూసుకుంటాను అనే ధైర్యం ఒకటి మన దగ్గరికొస్తే ఎలా ఉంటుఉంది. అది దేవుడు పంపించినట్లే అనుకుంటాం. ఇప్పుడు ఏపీ రాష్ట ప్రజలకు కష్టమొచ్చింది.. దాన్ని చూసుకోవడానికి జగన్‌ రూపంలో ఒక భరోసా లభించింది.

జగన్‌ది ఒకటే మాట.. చెప్పానంటే చేస్తాను.. చేసేదే చెబుతాను అనేది ఆయన సూత్రం. మరి ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఏరుదాటాకా తెప్పతగలేసిన చందంగా మారిపోయింది. ఇప్పుడు జగన్‌ చేసేది పోరాటం.. అధికార పార్టీ  కపట వైఖరిపై.

అధికారంలో ఉన్నారు కాబట్టి.. కష్టాలు, నష్టాలు చవిచూస్తున్న ఏపీ ప్రజానీకాన్ని పట్టించుకోమనే వైఎస్‌ జగన్‌ పోరాడుతున్నారు. ప్రకృతి విపత్తలు వస్తే ప్రజల్ని పట్టించుకోరు.. రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వారికేమైనా భరోసా కల్పిస్తున్నారంటే అదీ లేదు. ఇలా ప్రతీదాంట్లోనే ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరునే జగన్‌ ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఆదుకోవాల్సింది ప్రభుత్వమేనని..  దాన్ని తప్పించుకుని తిరుగుతున్న ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.  నికార్సైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ చర్యలను ఎండగడుతున్నారు.

YS Jagan YSR District Tour Day2 Highlights Photos23

ఎక్కడకేగినా.. ఎందు అడుగిడినా..
జగన్‌ పర్యటనలకు జన సునామీ అనేది కొత్తగా తెలుసుకోవాల్సిందేమీ కాదు. అది అందరికీ అనుభవమే  వైఎస్‌ జగన్‌ చేసిన ఓదార్పు యాత్ర వద్ద నుంచి మొదలుకొని చూస్తే నేటి వరకూ ఆ ఆదరణ ఎక్కడా తగ్గలేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌క వచ్చిన సందర్భంలో వైఎస్‌ జగన్‌కు జనం పోటెత్తారు. తెలంగాణలో వైఎస్సార్‌సీపీ లేదు. అయినా జగన్‌ హైదరాబాద్‌కు వచ్చిన క్రమంలో ‘ జై జగన్‌ నినాదం’ హోరెత్తిపోయింది.  అది చూసిన కొంతమంది కూడా ఓర్వలేనితనాన్ని ప్రదర్శించారు. ఏదో బూటకపు మాటలు చెప్పే యత్నం చేశారు. వారికి తెలియదేమో.. అభిమానం ఉంటే అభిమాన నాయకుడ్ని చూడటానికి ఇక్కడ ప్రాంతాలతో సంబంధం ఉండదనే విషయం. జగన్‌ వెళుతున్న పర్యటనలకు జనాన్ని కట్టడి చేయాలంటే అది కుదిరే పనికాదు. అభిమానం నోటికి తాళం వేయాలంటే కూడా అంతకంటే కదరదు.  దటీజ్‌ జగన్‌.

ఇదీ చదవండి:
కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement