ఆటోను ఢీకొన్న లారీ.. ఏడుగురికి గాయాలు | 7 injured in a road accident | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న లారీ.. ఏడుగురికి గాయాలు

Jun 17 2015 9:45 PM | Updated on Sep 3 2017 3:53 AM

వేగంగా వెళ్తున్న లారీ ముందున్న ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉన్న ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.

గుంటూరు: వేగంగా వెళ్తున్న లారీ ముందున్న ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉన్న ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కొమ్మెరపుడి నుంచి సత్తెనపల్లి వెళ్తున్న ఆటోను గుంటూరు నుంచి సత్తెన పల్లి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఏడుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement