64 సిలిండర్ల పట్టివేత | 64 cylinders seized in karimnagar district | Sakshi
Sakshi News home page

64 సిలిండర్ల పట్టివేత

Jan 4 2014 2:57 AM | Updated on Sep 2 2017 2:15 AM

పౌరసరఫరాల శాఖ అధికారులు శుక్రవారం జగిత్యాల, మెట్‌పల్లి పట్టణాల్లో దాడులు చేసి 64 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పట్టుకున్నారు. జగిత్యాల, మంథని, హుజూరాబాద్, మెట్‌పల్లి, మల్యాల, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన డీటీసీఎస్‌లు ఇంక్‌షాప్ అలీ, రాజేష్, రమేష్, రాజేశ్వర్, రవికాంత్‌లతోపాటు పుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ ఈ దాడులు చేశారు.

జగిత్యాల/మెట్‌పల్లి, న్యూస్‌లైన్ : పౌరసరఫరాల శాఖ అధికారులు శుక్రవారం జగిత్యాల, మెట్‌పల్లి పట్టణాల్లో దాడులు చేసి 64 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పట్టుకున్నారు. జగిత్యాల, మంథని, హుజూరాబాద్, మెట్‌పల్లి, మల్యాల, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన డీటీసీఎస్‌లు ఇంక్‌షాప్ అలీ, రాజేష్, రమేష్, రాజేశ్వర్, రవికాంత్‌లతోపాటు పుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ ఈ దాడులు చేశారు. జగిత్యాలలో 19 దుకాణాల్లో 33 సిలిండర్లను స్వాధీనం చేసుకుని అందరిపై 6ఏ కేసు నమోదు చేశారు.
 
 మెట్‌పల్లిలో జిల్లా అసిస్టెంట్ గ్రేన్ మర్చంట్ అధికారి కాశీవిశ్వనాథ్ ఆధ్వర్యంలో అధికారులు పలు బృందాలుగా విడిపోయి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న హాస్టళ్లతోపాటు వ్యాపారుల గోదాముల్లో తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న 31 సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
 
 రూ.2.70 లక్షల సోయా స్వాధీనం
 మెట్‌పల్లి పట్టణం చైతన్యనగర్‌లోని ఓ గోదాంలో ఎనగందుల అజయ్ అనే వ్యాపారి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.2.70లక్షల విలువైన 132క్వింటాళ్ల సోయాను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. అరుణ్ అనే మరో వ్యాపారి గోదాంలో కూడా తనిఖీలు చేయగా.. సోయా, నువ్వుల నిల్వలు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. ఇవి కుప్పులుగా పోసి ఉండడంతో శనివారం వాటిని తూకం వేసి మొత్తం విలువ ఎంతనో నిర్ధాస్తామని కాశీవిశ్వనాథ్ తెలిపారు. ఈ దాడుల్లో పెద్దపల్లి, సుల్తానాబాద్, వేములవాడ, భీమ్‌దేవరపల్లి, గంగాధర, మల్యాల డీటీసీఎస్‌లు అంజన్న, రవీందర్, నాగార్జున, ఫారూఖ్, అశోక్ ప్రసాద్, లక్ష్మారెడ్డి, రాజేశ్వర్, ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌లు నిజాముద్దీన్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement