పట్టణాభివృద్ధి శాఖ ఉద్యోగులకూ 60 ఏళ్లే... | 60 years of age limit for ubran development job | Sakshi
Sakshi News home page

పట్టణాభివృద్ధి శాఖ ఉద్యోగులకూ 60 ఏళ్లే...

Jun 29 2015 9:42 PM | Updated on Sep 3 2017 4:35 AM

అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల పరిధిలో పనిచేసే ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసు 58 ఏళ్లనుంచి 60 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది.

సాక్షి, హైదరాబాద్: అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల పరిధిలో పనిచేసే ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసు 58 ఏళ్లనుంచి 60 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా కేపిటల్ రీజియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ), తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా), విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వుడా), పుట్టపర్తి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పుడా) పరిధిలోని ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయస్సు మిగతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నట్టే 60 ఏళ్లు ఉంటుంది.

అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలలో పనిచేస్తున్న సుమారు 600 మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. పలు పర్యాయాలు పదవీ విరమణ వయసు పెంపుపై వినతి పత్రాలు ఇచ్చామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని మున్సిపల్ ఉద్యోగుల సంఘం నేత వర్మ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement