సత్తెనపల్లిలో అయిదుగురు ఆత్మహత్య | 5 members Family suicide in Sattenapalli | Sakshi
Sakshi News home page

సత్తెనపల్లిలో అయిదుగురు ఆత్మహత్య

Mar 24 2014 3:42 PM | Updated on Sep 2 2017 5:07 AM

సత్తెనపల్లిలో అయిదుగురు ఆత్మహత్య

సత్తెనపల్లిలో అయిదుగురు ఆత్మహత్య

సత్తెనపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

గుంటూరు: సత్తెనపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. బాదం ప్రసాద్ అనే వ్యక్తి కుటుంబం మొత్తం ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ కుటుంబానికి చెందిన అయిదుగురు  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వారు ఆత్మహత్యచేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పులబాధ తాళలేకే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు  స్థానికులు చెబుతున్నారు.

స్థానికుల కథనం ప్రకారం ప్రసాద్ పలువురి వద్ద అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చినవారు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. 50 వేల రూపాయలు ఇచ్చిన ఒక వ్యక్తి నిన్న ఇంటి వద్దకు వచ్చి నానా గొడవ చేసి వెళ్లాడు. తన బాకీ తీర్చమని ఒత్తిడి చేశాడు. ప్రసాద్కు అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దాంతో తొలుత తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి హత్య చేశాడు. ఆ తరువాత తన తల్లికి, భార్యకు పురుగుల మందు ఇచ్చి, తనూ తాగాడు. మొత్తం అయిదుగురు మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement