టెక్కలి తీరంలో ముగ్గురు యువకులు గల్లంతు | 3 youth missing at Tekkali beach | Sakshi
Sakshi News home page

టెక్కలి తీరంలో ముగ్గురు యువకులు గల్లంతు

Sep 19 2015 6:01 PM | Updated on Sep 3 2017 9:38 AM

సముద్రంలో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో శనివారం సాయంత్రం జరిగింది.

టెక్కలి (శ్రీకాకుళం) : సముద్రంలో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడులో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల ప్రకారం.. టెక్కలిలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న 9 మంది విద్యార్థులు సముద్ర స్నానానికి భావనపాడులోని తీరంలోకి దిగారు.

ఆటలు ఆడుకుంటూ స్నానం చేస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తూ ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైనవారు నేపాల్‌కు చెందిన రాజ్‌కుమార్‌గిరి(21), దేవక్ గుప్తా(20), సుమిత్‌పటేల్(21)గా గుర్తించారు. స్నానానికి దిగిన విద్యార్థులందరూ నేపాల్‌కు చెందిన విద్యార్థులేనని తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement