డబ్బు కోసమే గొంతు కోశారు | 3 persons in police custady at prakasam distirict | Sakshi
Sakshi News home page

డబ్బు కోసమే గొంతు కోశారు

Feb 19 2015 3:59 PM | Updated on Aug 29 2018 8:36 PM

ఆటో డ్రైవరును బ్లేడుతో గొంతుకోసి హత్య చేసిన నిందితులను ప్రకాశం జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

ప్రకాశం : ఆటో డ్రైవరును బ్లేడుతో గొంతుకోసి హత్య చేసిన నిందితులను ప్రకాశం జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు...కర్నూలు జిల్లా మహానంది మండలం గోకవరం గ్రామానికి చెందిన జాకీర్ హూస్సేన్(23)ను ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఫిబ్రవరి 3వ తేదీన ముగ్గురు వ్యక్తులు  ఒంగోలుకు వెళ్లాలంటూ జాకీర్ ఆటోను కిరాయికి మాట్లాడుకున్నారు. ఆటో ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కిష్టంశెట్టి పల్లి దగ్గరకు వచ్చిన తర్వాత జాకీర్‌ను బ్లేడుతో గొంతు కోసి చంపేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు.

నిందితులు...ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన డి. రాజేశ్(20), కె. బహుదూర్(20), మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన డి. వెంకటేశ్‌లుగా గుర్తించారు. వారు డబ్బు కోసమే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాక నిందితులు పాత నేరస్తులుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
(మార్కాపురం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement