జగన్ సీఎం అయ్యాడని శ్రీశైలానికి పాదయాత్ర

3 Boys Travelling Towards Srisailam After Jagan Became a Chief Minister - Sakshi

యర్రగొండపాలెం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, యర్రగొండపాలెం ఎమ్మెల్యే డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ విద్యాశాఖ మంత్రిగా నియమితులైన సందర్భంగా ముగ్గురు యువకులు హైదరాబాదులోని లోటస్‌పాండ్‌ నుంచి శ్రీశైలం వరకు చేపట్టిన పాదయాత్ర మంగళవారం యర్రగొండపాలెం చేరింది. వీరికి పార్టీ సీనియర్‌ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం, సురేష్‌ మంత్రి కావాలని లోటస్‌పాండ్‌నుంచి శ్రీశైలానికి పాదయాత్ర చేస్తామని వైపాలేనికి చెందిన యువకులు దగ్గుల కాశిరెడ్డి, అఖిల్‌బాష, అశోక్‌రెడ్డిలు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా వారు ఈ నెల 11వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు కె.ఓబులరెడ్డి, ఎన్‌.వెంకటరెడ్డి, జి.వెంకటరెడ్డి, ఒ.సుబ్బారెడ్డి, వెంకటస్వామి, రామచంద్రయ్య, రాములునాయక్, జి.రామిరెడ్డి, పి.శ్రీను, వై.రాంబాబు, అంకిరెడ్డి, పెద్దకాపు వెంకటరెడ్డి, జి.రామిరెడ్డి, జయరావులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top