పట్టణంలోని మార్కాపురం రోడ్డు మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ఉన్న రాంబాబు కిరాణా షాపులో నిల్వ ఉన్న 25క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని
25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
Feb 4 2014 11:43 PM | Updated on Sep 2 2017 3:20 AM
వినుకొండ, న్యూస్‌లైన్: పట్టణంలోని మార్కాపురం రోడ్డు మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ఉన్న రాంబాబు కిరాణా షాపులో నిల్వ ఉన్న 25క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారు లు మంగళవారం దాడిచేసి పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్ సిబ్బంది సుబ్రమణ్యం తెలిపారు. కిరాణా నిర్వాహకునిపై 6 ఏ కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ సిబ్బంది కోటేశ్వరరావు, సీఎస్‌డీటీ జాన్‌కుమార్, వీఆర్‌వో సుబ్బయ్య ఉన్నారు.
Advertisement
Advertisement