నంది వర్ధనం

25 Lakhs Release From CM Releaf Fund For Girls Child - Sakshi

మానవత్వం పరిమళించిన వేళ ..బాలికకు చేయూత

సీఎం రిలీఫ్‌ఫండ్‌ నుంచి రూ.25 లక్షలు మంజూరు

కాలేయ వ్యాధితో బాధపడుతున్న బాలికకు జగన్‌ సాయం

ఎమ్మెల్యే ద్వారంపూడి చొరవతో తప్పిన గండం

శస్త్ర చికిత్సతో కుటుంబ సభ్యుల్లో ఆనందం

కాకినాడ: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలికకు రూ.25 లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా మంజూరు చేసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నెల 2వ తేదీన గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించడానికి కరప వచ్చిన సీఎం జగన్‌కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పట్టణానికి చెందిన ఎం.నందిని కాలేయవ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతోందని తెలియజేశారు.

అప్పట్లో సానుకూలంగా జగన్‌ స్పందించారు. గత రెండు రోజులుగా నందిని పరిస్థితి విషమించడంతో నగర ఎమ్మెల్యే ద్వారంపూడి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌ ద్వారా తండ్రి వెంకటరమణ చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని  సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లగా హుటాహుటిన స్పందించి రూ.25 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో యశోద ఆసుపత్రి  వైద్యులు నందినికి గురువారం శస్త్రచికిత్స చేశారు. నందిని ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే ద్వారంపూడికి, సీఎం జగన్‌కు  బాలిక తండ్రి, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top