గోదావరిలో పడిన 'తుఫాన్':22 మంది దుర్మరణం | 22 feared Killed after van falls into dowleswaram barrage in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గోదావరిలో పడిన 'తుఫాన్':22మంది దుర్మరణం

Jun 13 2015 6:33 AM | Updated on Sep 3 2017 3:41 AM

గోదావరిలో పడిన 'తుఫాన్':22 మంది దుర్మరణం

గోదావరిలో పడిన 'తుఫాన్':22 మంది దుర్మరణం

వేగంగా వెళ్తున్న క్రూజర్(తుఫాన్) వాహనం అదుపుతప్పి దవళేశ్వరం వద్ద గోదావరి నదిలో పడింది.

రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న క్రూజర్(తుఫాన్) వాహనం అదుపుతప్పి ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 9మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 23మంది ఉన్నట్లు తెలుస్తోంది.  విశాఖ జిల్లా అచ్యుతాపురం వాసులు తీర్థయాత్రల్లో భాగంగా తిరుపతి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ కూడా మృతి చెందాడు. దాదాపు 50 అడుగుల పైనుంచి పడటంతో వాహనం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను క్రేన్ల సాయంతో వెలికి తీశారు. ఈ ప్రమాదం నుంచి ఒక పాప, ఒక బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా పాప ఈగల సంధ్య కూడా మృతి చెందింది. ఈ ఘటనలో మృతిచెందిన వారిని రమణ, వెంకట లక్ష్మి, సాయి, రాజా, కార్తీక్, కోసమ్మ, నవిత్, నవ్య, ప్రసాద్, అన్నపూర్ణ, లలిత, హర్ష, గోపి, కొండమ్మ, సంధ్యలుగా గుర్తించారు. మరికొంతమంది మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement