అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి.
అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. అందులో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా యలమంచిలిలోని పెద్దపల్లి హైవే జంక్షన్ వద్ద బుధవారం జరిగింది. అమలాపురం నుంచి టెక్కలి వెళ్తున్న బస్సు హైవే జంక్షన్ వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో రెండు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాల య్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అందులో 5గురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అంటున్నారు.