సీపీఎస్‌ రద్దుతో రెండులక్షల కుటుంబాల్లో ఆనందం..

2 lakhs families happy with CPS cancels - Sakshi

కడప సిటీ: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ప్రకటించడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర రెండోరోజు మంగళవారం వేంపల్లెలో కొనసాగుతున్న సమయంలో వేంపల్లె జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద పలు సంఘాల ఉపాధ్యాయులు ఆయన్ను కలిశారు. సీపీఎస్‌ విధానం రద్దయితే రాష్ట్రంలో రెండు లక్షల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ వైఎస్సార్‌టీఎఫ్‌ తరుఫున జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 పీఆర్సీ బకాయిలు, డీఏలు ఏకీకృత సర్వీసు నిబంధనలు వంటి సమస్యలపై వారు వైఎస్‌ జగన్‌తో మాట్లాడారు. ఈ సమస్యల పరిష్కరించాలని కోరారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌టీఎఫ్‌ సజ్జల వెంకటరమణారెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అమర్‌నాథరెడ్డి, రెడ్డప్పరెడ్డి, అబ్బాస్, పిట్ట రమణ, కృష్ణారెడ్డి, ప్రకాష్, ఎస్టీయూ, యూటీఎఫ్‌ నేతలు నరసింహరెడ్డి, రఘునాథరెడ్డి, సంగమేశ్వరెడ్డి, చెరుకూరి శ్రీనివాసులు, రంగారెడ్డి, రాజశేఖర్, శివారెడ్డి, మనోహర్‌రెడ్డి, ధర్మారెడ్డి, మునిరెడ్డి, అలీ, ఓబుల్‌రెడ్డి, సుబ్రమణ్యం ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top