
18 హెలికాప్టర్లు, 12 విమానాలు సిద్ధం: సుశీల్ కుమార్ షిండే
ఫైలిన్ తుపాన్ బాధితులకు సహాయక, పునరావాస చర్యలు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే చెప్పారు.
ఫైలిన్ తుపాన్ బాధితులకు సహాయక, పునరావాస చర్యలు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే చెప్పారు. 18 హెలీకాప్టర్లు, 12 విమానాలు, రెండు యుద్ధ నౌకల్ని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవరసమైన చోట వీటిని మోహరించినట్టు షిండే చెప్పారు.
ఒడిషాలో 5.5 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో లక్ష మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు మంత్రి తెలియజేశారు. ఒడిషాలో ఎనిమిది, ఆంధ్రప్రదేశ్లో మూడు జిల్లాల్లో ఫైలిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. మొత్తం 500 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.