సముద్రంలో వేటకు వెళ్లి, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలానికి చెందిన 11 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు.
సముద్రంలో వేటకు వెళ్లి, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలానికి చెందిన 11 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. దాదాపు వారం రోజుల నుంచి వీరి ఆచూకీ లభ్యం కావట్లేదని స్థానికులు మెరైన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేశారు. యు.కొత్తపల్లి మండలంలోని రామన్నపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు మత్స్యకారులు ఎం.రమణకు చెందిన పడవలో ఆగస్టు మూడో తేదీన సముద్రంలో చేపల వేటకు బయల్దేరారు.
తమ పడవలో డీజిల్ అయిపోయిందని, అందువల్ల నడి సముద్రంలో తాము ఇరుక్కుపోయామని వాళ్లు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపారు. ఈ ఐదుగురిని కాపాడేందుకు మరో ఆరుగురు మత్స్యకారులు ఆగస్టు ఐదో తేదీన బయల్దేరారు. కానీ, వాళ్ల ఫోన్లు కూడా ప్రస్తుతం పలకట్లేదు. దీంతో మొత్తం 11 మంది మత్స్యకారుల సమాచారం తెలియట్లేదు. మెరైన్ పోలీసు అధికారులతో పాటు రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు వీరి ఆచూకీ తెలుసుకోడానికి గాలింపు చర్యలు ప్రారంభించారు.