సరిగ్గా ఎలక్షన్‌ కోడ్‌కురెండు రోజుల ముందు...

108 Ambulance Services Scheme Special Story - Sakshi

రావులపాలెం నుంచి యానాంకు ఏటిగట్టు రోడ్డులో బైక్‌పై వెళ్తున్నాం. దారిపొడవునా ఓవైపు పచ్చని పంటపొలాలు, మరోవైపు గౌతమి గోదావరి నది ఉండటంతో ప్రయాణం ఆహ్లాదంగా సాగుతోంది. మావారు డ్రైవింగ్‌ చేస్తుండగా మా పాప, నేను కబుర్లు చెప్పుకొంటున్నాం.ఈ రహదారిలో రద్దీ చాలా తక్కువ. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న కోటిపల్లి గ్రామం దాటాం. కొట గ్రామం సమీపిస్తుండగా ఓ సంఘటన మమ్మల్ని కదిలించింది.

మర్చిపోగలమా? ప్రాణదాతను
ఇంతకీ మాకు కనిపించిన ఘటన ఏంటంటే...!
ఢీకొని ఎంత సేపయిందో కానీ, రెండు బైక్‌లు బాగా దెబ్బతిని పడి ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు, ఇంకో పాప, మరో బాబు తీవ్ర గాయాలతో రక్తమోడుతూ కదల్లేకుండా ఉన్నారు. పరిసరాల్లోనూ ఎవరూ లేరు. మాకు ఒక్కసారిగా మతి పోయింది. దగ్గర్లో ఏ గ్రామముందో, హాస్పిటల్‌ ఎక్కడుందో తెలియదు. వారిని తీసుకెళ్దామంటే మా బైక్‌పై సాధ్యమవదు. ఏదైనా వాహనం వచ్చినా వాళ్లు ఎక్కించుకుని హాస్పిటల్‌కు తీసుకెళ్తారా? ఇలా ఎన్నో ఆలోచనలు. ఈలోగా నా చెయ్యి మొబైల్‌ మీదకు వెళ్లింది. 108 నంబరుకు డయల్‌ చేయబోయా. అప్పుడే అనిపించింది...! ఇలాంటి సర్వీసు ఎంత మంచిదో కదా అని! ఏ సమయంలో ఎక్కడ ప్రమాదం జరిగినా దారినపోయే వాళ్లు సైతం సమాచారం అందించి ప్రాణాలు నిలపడం అనే భావన నన్ను కదిలించింది. ఇంతటి మంచి పథకాన్ని రాన్రాను ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయో? అనుకున్నా.  చివరగా ఓ విషయం... ‘అసలు ఈ పథకానికి రూపకల్పన చేసిన ఆ మహనీయుడిని మర్చిపోగలమా? అది జన్మ జన్మలకైనా...?’ అని...!
పంపిన వారు: జాస్మిన్‌ కప్పల; తూర్పుగోదావరి.‘సాక్షి... మీరూ రాయొచ్చు’ శీర్షికకు స్పందనగా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top