
చిత్తూరు, చంద్రగిరి :రాష్ట్రంలోని పేద ప్రజలు సకాలంలో వైద్యం అందక మృతి చెందకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలో నుంచి పుట్టిన 108 వాహనాన్ని ఇలా నెడుతున్నారు. చంద్రగిరిలో శుక్రవారం ఒక అత్యవసర కేసును ఆస్పత్రికి తరలించేందుకు మధ్యాహ్నం 2–30 గంటల ప్రాంతంలో 108 బయలుదేరింది. అయితే వాహనం స్టార్ట్‌కాలేదు. సిబ్బంది దాన్ని నెడుతూ ఆపసోపాలు పడిన అనంతరం స్టార్టయ్యింది. నెల రోజులుగా ఈ వాహనం పరిస్థితి ఇలాగే ఉందని..సమాచారం అందినా అధికారులు మరమ్మతుల గురించి పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు.