భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధం | భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధం

Dec 12 2014 1:47 AM | Updated on Sep 2 2017 6:00 PM

భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధం

భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధం

ఇంద్రకీలాద్రి పై భవానీదీక్షల విరమణకు అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి.

ఐదు రోజుల్లో ఏడు లక్షల మంది భక్తులు రాక...
 
విజయవాడ  :ఇంద్రకీలాద్రి పై భవానీదీక్షల విరమణకు అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు దీక్షల విరమణ జరుగుతుంది ఐదు రోజుల్లో సుమారు ఏడు లక్షల మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున  దేవస్థానం సిబ్బందితో పాటు ఇతర దేవస్థానాల నుంచి సుమారు 325 మంది అదనపు సిబ్బందిని దేవస్థానంలో వినియోగిస్తున్నారు.
 
శుక్రవారం తొలిరోజు కావడంతో...

దీక్ష విరమణలకు తొలి మూడు రోజులే కీలకంగా ఆలయ అధికారులు బావిస్తున్నారు. శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భవానీ భక్తులు భారీగానే తరలివస్తారు. అయితే దీక్షలు విమరణ చేయకపోవచ్చని, శని,ఆదివారాల్లో దీక్షలు విరమిస్తారని ఆలయ అర్చకులు చెబుతున్నారు.  
 
జల్లుస్నానాలు, క్యూలైన్లు, వాటర్ ప్యాకెట్లు సిద్ధం...
 
నదిలో పవిత్ర స్నానాలు చేసే వారి కోసం జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. నీటిపారుదలశాఖ గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసింది. భవానీఘాట్, పున్నమిఘాట్, పద్మావతి ఘాట్‌లలో కూడా స్నాన ఘట్టాలు ఏర్పాటుచేశారు.  భక్తులు దీక్షా వస్త్రాలను నదిలోకాని, స్నానఘట్టాల్లో కాని పడవేయకూడదని నదిలో వేయాలని ఆలయ అర్చకులు సూచిస్తున్నారు. వికలాంగులు, వృద్ధులకు కొండ కింద నుంచి ఆలయ ప్రాంగణానికి చేరుకునేందుకు వీల్ చైర్స్‌ను అందుబాటులో ఉంచారు.  రైల్వేస్టేషన్, బస్టాండ్లనుంచి భవానీలు అమ్మవారి సన్నిధికి చేరుకునేందుకు దేవస్థానం బస్సులతో పాటు పలువురు దాతలు అందించిన బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు.
 
కొండ దిగువన హోమగుండాలు ...
 
కొండ దిగువన మెట్లమార్గంలో దేవస్థానం అధికారులు హోమగుండాలను ఏర్పాటు చేశారు. అలాగే భక్తుల సౌకర్యార్ధం జమ్మిదొడ్డిలోనూ ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులతో పాటు ఆలయ ఈవో సీహెచ్.నర్సింగరావు భక్తులకు కల్పించిన సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దు : ఈవో

భవానీ దీక్ష విరమణలకు విచ్చేసే భవానీలు, భవానీ భక్తులకు స్నానఘాట్లలో  ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేయాలని దుర్గగుడి ఈవో సీహెచ్. నర్సింగరావు ఆలయ అధికారులను ఆదేశించారు. దీక్ష విరమణకు చేపట్టిన ఏర్పాట్లను గురువారం ఆలయ ఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహా మండపంలో ఏర్పాటు చేసిన లడ్డూ తయారీ కేంద్రాన్ని గురువారం ఆలయ ఈవో పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. కాగా ప్రముఖ దేవస్థానాల నుంచి భవానీ దీక్ష విరమణ మహోత్సవాలకు  డెప్యూటేషన్‌పై రావాల్సిన సిబ్బంది సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement