breaking news
-
తిరువూరులో ఉద్రిక్తత.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
తిరువూరులో ఎన్నిక అప్డేట్.. విజయవాడ:ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్👉తిరువూరు మున్సిపాల్టీ ఛైర్ పర్సన్ ఎన్నికల్లో పోలీసులు టిడిపి కార్యకర్తల్లా వ్యవహరించారు👉20 మంది సభ్యులున్న కౌన్సిల్ లో వైఎస్సార్సీపీ 17 , టిడిపి 3 గెలిచింది👉ఉపఎన్నిక నేపధ్యంలోవైఎస్సార్సీపీ అభ్యర్ధినే గెలిపించాలనివైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు👉టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్,టిడిపి గూండాలు గుంపులుగా వచ్చారు👉మా పై దాడిచేసేందుకు టిడిపి నేతలకు పోలీసులు మద్దతిచ్చారు👉మా పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలను పోలీసులే కిడ్నాప్ చేశారు👉ఇంతకంటే నీచంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యవహరించదు👉స్వచ్ఛంధంగా వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్నానని చెప్పినా నిర్మలను లాక్కెళ్లారు👉ఛైర్మన్ పదవి కోసం చంద్రబాబు దగ్గర్నుంచి టిడిపి ఎమ్మెల్యే వరకూ అందరూ దిగజారిపోయారు👉ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు👉రేపటి ఎన్నిక సజావుగా జరపాలని ఎన్నికల కమిషనర్ ను కోరాం👉రేపు మా కౌన్సిలర్లకు భద్రత కల్పించమని కోరాం 👉కూటమి కుట్రలతో తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా. 👉వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన కూటమి నేతలు. పోలీసులు సమక్షంలోనే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ మూకల దాడులు. ఎన్నిక జరగకుండా కూటమి నేతల వ్యూహం. అల్లర్లు సృష్టించిన పచ్చ నేతలు👉తిరువూరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హల్చల్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరుకాకుండా దాడికి యత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై చెప్పులు విసిరి, బాటిళ్లు విసురుతూ టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. 👉తిరువూరులో పోలీసులు, టీడీపీ దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు రోడ్డుపై భైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.👉టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని చోద్యం చూస్తూ పోలీసులు అక్కడే నిలబడ్డారు. ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతల వ్యూహానికి పోలీసులు సహకరిస్తున్నారు. రౌడీయిజం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టలేదు. బలం లేకపోయినా రౌడీయిజంతో గెలవడానికి టీడీపీ అల్లర్లు. తిరువూరులో టీడీపీ ఉద్రిక్తత సృష్టిస్తోంది.👉తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓవరాక్షన్‌కు దిగారు. ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు.👉తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హల్చల్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీ నేతలను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ కొలికపూడి, టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ వారినే బెదిరిస్తూ లోపలికి దూసుకెళ్లారు. దీంతో, వాగ్వాదం జరిగింది.👉మరోవైపు.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు మద్దతుగా పార్టీ నేతలు దేవినేని అవినాష్, మొండితోక అరుణ్ కుమార్, నల్లగట్ల స్వామిదాస్, షేక్ ఆసిఫ్ తిరువూరు చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. నేడు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. -
తిరువూరు ఎన్నిక.. వైఎస్సార్సీపీ నేతలు హౌస్ట్ అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్: నేడు తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయడంతో నేడు చైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు తిరువూరు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. శాంతిభద్రతల సాకుతో వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎన్నికల్లో బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. కూటమి ప్రభుత్వ వైఖరి, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘తిరువూరులో బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీకి 17 మంది కౌన్సిలర్ల బలం ఉంది. టీడీపీకి ఉన్నది కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే. ముగ్గురు కౌన్సిలర్లతో ఏవిధంగా గెలవాలనుకుంటున్నారు. అధికార బలంతో మున్సిపాల్టీ, నగర పాలక సంస్థలను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఎన్నికల్లో మీరు ఏం చెప్పి గెలిచారు. రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తామని ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి?. తిరువూరు వెళ్లొద్దని మా పై ఆంక్షలు పెట్టడమేంటి?. వెళితే అరెస్ట్ చేస్తామని వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. ఏపీలో పోలీసు రాజ్యం నడిపిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తిరువూరు వెళ్లి తీరుతాం. తిరువూరు మున్సిపాల్టీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం’ అని అన్నారు. మరోవైపు.. సోమవారం ఉదయమే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ..‘శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపించి వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్టు చేయటం కరెక్ట్ కాదు. రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాయటమే అవుతుంది. వైఎస్సార్సీపీకి 17 మంది కౌన్సిలర్ల మద్దతు ఉండగా తెలుగుదేశం పార్టీకి కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం తిరువూరు మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఫలితం మాత్రం శూన్యం’ అని అన్నారు. ఇక, వైఎస్సార్సీపీ తరఫున 17 మంది కౌన్సిలర్లు ఉండగా, టీడీపీ నుంచి ముగ్గురు గెలుపొందారు. ఎన్నికల్లో గెలించేందుకు బలం లేకపోయినప్పటికీ టీడీపీ కుట్రలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తూ తమ వైపు తిప్పుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. -
రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం
నెల్లూరు(బారకాసు): ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెగబడిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) మెంబర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం లేని స్కామ్‌లు సృష్టించి కక్ష సాధింపులకు దిగుతోందని ధ్వజమెత్తారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. ఏపీలో పనిచేయాలంటేనే బ్యూరోక్రాట్స్ భయపడుతున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. మైనింగ్ మాఫియాను పోషిస్తున్న చంద్రబాబు నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు మైనింగ్ మాఫియాను బాబు పెంచి పోషిస్తున్నారు. జిల్లాలో దాదాపు 180 మైన్లు ఉంటే అందులో కేవలం 25 నుంచి 30 మాత్రమే నడుస్తున్నాయి. వేమిరెడ్డి వల్ల అనేక క్వారీలు ఇంకా మూతపడే ఉన్నాయి. వేమిరెడ్డి కంపెనీ పెట్టుకోవడం తప్పా అంటూ టీడీపీ నాయకుడు బీద రవిచంద్రయాదవ్ వత్తాసుగా మాట్లాడారు. తాను తప్ప ఇంకెవరూ మైనింగ్ వ్యాపారాలు చేసుకోకూడదన్న ఎంపీ దురాశ వల్ల నెల్లూరు జిల్లాలో దాదాపు 10 వేల మంది ఉపాధి కోల్పోతున్నారు.260 మందికిపైగా క్వార్ట్జ్æ ఎగుమతిదారులుంటే ఎంపీ వేమిరెడ్డికి చెందిన కంపెనీ ఒక్కటే వ్యాపారం చేయడం వెనుక మతలబు ఏంటి? ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసుకుందామనిపోతే వారిని బెదిరిస్తున్నారు. ఎంపీ మైనింగ్ అక్రమాలపై నేను ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత కొంతమందిని పిలిపించుకుని మాట్లాడుకున్నారని తెలిసింది. లోకల్ మైన్లన్నీ ఎంపీ కంపెనీకి చేయాలట. ఎక్స్‌పోర్టర్ చైనా కంపెనీకి అమ్ముకుంటామని వాళ్లతో చెప్పారు. ఇదే జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ కావడం తథ్యం. లీజు గడువు ముగిసిన వాటిలో అక్రమ మైనింగ్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఫ్యాక్టరీ పెడతానని ఇంకా శంకుస్థాపన చేయకుండానే వేల టన్నులు చైనాకి ఎక్స్‌పోర్టు చేస్తున్నాడు. 50 ఏళ్ల పరి్మషన్ గడువు ముగిసిపోయిన ఏడెనిమిది మైన్స్, పట్టా భూములను తన గుప్పెట్లో పెట్టుకుని అక్రమంగా మైనింగ్ చేస్తూ ఏడాదికి రూ.250 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైనే దోపిడీకి స్కెచ్ వేశాడు. ఇవి నిజంకాదని నిరూపిస్తే ఎంపీకి క్షమాపణలు చెప్పడానికీ సిద్ధం. మా హయాంలో పారదర్శకంగా మైనింగ్ గత ప్రభుత్వంలో ఎవరి మీద ఎలాంటి ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛగా మైనింగ్ చేసుకోనిచ్చాం. టాప్ టెన్ ఎక్స్‌పోర్టర్ల లిస్ట్ చూస్తే అందులో టీడీపీ వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. మా ప్రభుత్వ పారదర్శక విధానాలకు ఇంతకన్నా వేరే రుజువులు అవసరం లేదు. -
దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
సాక్షి, అమరావతి: తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ.దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండాపోయింది. చంద్రబాబు, అధికారపార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.పోలీస్స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు... ఫిర్యాదుదారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ పోస్టు చేశారు. తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. @ncbn, అధికారపార్టీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025 -
అప్పుడేం జరిగిందో గుర్తులేదా?: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: ఏపీలో కొత్త రాజకీయం మొదలైందంటూ.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. గతంలో అక్కడక్కడ గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేదని.. కానీ కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడిని అణగదొక్కాలన్న ఆలోచనతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకెళ్తుందని దుయ్యబట్టారు.‘‘ఎన్నడూ లేని విధంగా ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతుంది. కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే భ్రష్టు పట్టిపోయింది. వైఎస్సార్సీపీ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు.. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. కనీసం ఈ కేసులో ఎటువంటి ఆధారాలు కూడా లేవు’’ అని మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘కొంతమంది పోలీసులు పచ్చ చొక్కా వేసుకోకుండానే టీడీపీ కార్యకర్తల పని చేస్తున్నారు. చంద్రబాబు అనుకూల మీడియా వైఎస్ జగన్‌ని కూడా అరెస్టు చేస్తారంటూ ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో ఉంచింది. 40 శాతం ఓట్ షేర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ జగన్‌ను అక్రమ కేసుల్లో జైలుకు పంపడంతో రెండు శాతానికి పడిపోయింది. ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడుచు పెట్టుకుపోయింది. రేపు కూటమి పరిస్థితి కూడా అంతే. ఇవాళ మాకు పాఠాలు నేర్పుతున్నారు.. రేపు అవి వారికి గుణపాఠాలవుతాయి’’ అని మహేష్‌రెడ్డి చెప్పారు.మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ధైర్యంగా ఎదుర్కొంటాం.. న్యాయ పోరాటం చేస్తాం. మీరు ఎన్ని కేసులు పెడితే అంత బలపడతాం. ఈ రోజు కొన్ని నియోజకవర్గాల్లో సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై కచ్చితంగా కేసులు పెడతాం’’ అని కాసు మహేష్‌రెడ్డి హెచ్చరించారు. -
రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట
సాక్షి, అమరావతి/సాక్షి,నెట్వర్క్: ఎన్నికల హామీలు అమలుచేయకపోవడం.. రాజకీయ కక్ష సాధింపులతో టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు మరోసారి తెరతీశారని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్టని.. దాని అమలులో భాగంగానే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైనా కక్ష సాధిస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి, సాకే శైలజానాథ్, అంబటి రాంబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, వరుదు కళ్యాణి, మార్గాని భరత్‌రాం శనివారం వేర్వేరుచోట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని వారు హెచ్చరించారు. ఎవరెవరు ఏమన్నారంటే..ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్టులు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రిటైర్డ్ అధికారులను అక్రమంగా అరెస్టుచేసింది. వైఎస్ జగన్‌ను బలహీనపరచాలనే దురుద్దేశంతోనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా అసలు జరగని మద్యం స్కాంలో రిటైర్డ్ అధికారులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్టుచేయడం విడ్డూరం. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపిన చంద్రబాబు సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – భూమన కరుణాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి లిక్కర్ స్కాంలో అసలు దోషి బాబే..లిక్కర్ స్కాంలో అసలు దోషి చంద్రబాబే. ఆధారాలతో సహా సీఐడీకి దొరికిన ఆయన, సీఎం కాగానే కేసు దర్యాప్తును అడ్డుకున్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో అప్పట్లో బార్లకు చంద్రబాబు మేలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ కుంభకోణం జరగకపోయినా జరిగినట్లు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టుచేశారు. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలోనే భారీ లిక్కర్ స్కాం జరిగింది. అందులో చంద్రబాబు నిందితుడు. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుచేసి, వాటి యజమానులకు దాదాపు రూ.1,300 కోట్ల లాభం చేకూర్చారు.2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కూడా అదే స్థాయిలో మద్యం స్కాం జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కాంలో ఇలాంటిది ఉందా? ఇక మద్యం షాపులను ప్రభుత్వం నడిపిస్తే ఆదాయం వస్తుందా? ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఆదాయం వస్తుందో టీడీపీ నేతలు చెప్పాలి. ఏపీలో ఉన్న అన్ని డిస్టిలరీలకు అనుమతులిచ్చింది చంద్రబాబే. అంతేకాక.. 69 శాతానికి పైగా ఆర్డర్లు నాలుగైదు డిస్టిలరీలకే ఇచ్చారు. ఇదంతా స్కాం కాదా? పైగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం నడిపే మద్యం షాపులను తిరిగి ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. – సాకే శైలజానాథ్, మాజీమంత్రి జైలు అధికారుల మార్పులో బాబు కుట్ర..విజయవాడ జైలు అధికారులను హఠాత్తుగా మార్చడం వెనుక చంద్రబాబు భారీ కుట్ర ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్లో అరెస్టయిన వారంతా విజయవాడ జైలులో ఉన్నందున వారిని వేధించేందుకే తాము చెప్పినట్లు నడుచుకునే అధికారులను అక్కడ నియమించారు. ఒకవైపు సంబంధంలేని అంశాల్లో కొందరు ప్రభుత్వాధికారులపై తప్పుడు కేసులు బనాయించడం, అక్రమ అరెస్టులతో వారిని జైలులో హింసించాలన్నదే చంద్రబాబు కుతంత్రంగా కనిపిస్తోంది. 2018–19లో లిక్కర్ ఆదాయం దాదాపు రూ.16,900 కోట్లు అయితే.. 2023–24లో అది రూ.24,700 కోట్లు. నిజంగా, చంద్రబాబు చెబుతున్నట్లుగా వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగితే ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం ఎలా పెరిగింది? వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గి ఆదాయం పెరిగింది. అదే ఇప్పుడు బాబు హయాంలో లిక్కర్ సేల్స్ పెరిగి ఆదాయం తగ్గింది. దీని మతలబు ఏమిటో చంద్రబాబే చెప్పాలి. ఈ తగ్గిన ఆదాయం ఎవరి జేబుల్లోకి పోతోంది? ఇది స్కాం కాదా? – మార్గాని భరత్, వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ అణిచివేయాలనుకుంటే మరింత బలోపేతమవుతాం..వైఎస్సార్సీపీని అణిచివేయాలని చూస్తే మరింత బలోపేతమవుతాం. గతంలో ఒకసారి వైఎస్సార్సీపీని అణగదొక్కాలని కాంగ్రెస్‌తో చంద్రబాబు జట్టు కట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండాపోయింది. అధికారంలోకి వచ్చిఏడాదైనా ఎన్నికల హామీలను అమలుచేయడంపై చంద్రబాబు దృష్టిపెట్టలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమయ్యారు. వైఎస్ జగన్ బలహీనపరిచేందుకు లిక్కర్ స్కామ్ సృష్టించారు. – అంబటి రాంబాబు, మాజీ మంత్రిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టులు..చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోవడంతోపాటు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దుచేసి, మద్యం షాపులు, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకి దమ్ముంటే ఆయనపై నమోదైన ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కాం, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్ధం కావాలి.– ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుబాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజకీయ అరాచకం ఎక్కువైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ నాయకులపైనే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్‌లపై కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. కొందరు అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. సర్వీస్‌లో ఉన్న వారినే కాకుండా రిటైర్డ్ అధికారులనూ అరెస్టు చేస్తున్నారు. ఒక్క ఆధారం లేకపోయినా లిక్కర్ స్కాం జరిగిందంటూ తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చివరకు హైకోర్టు న్యాయమూర్తులు అక్షింతలు వేసినా సిగ్గులేకుండా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోంది. వైఎస్ జగన్‌ను నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. – గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు లిక్కర్ స్కాం రూ.10వేల కోట్లు..మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.3,200 కోట్ల మేర లిక్కర్ స్కాం జరిగిందంటూ అనవసర యాగీ చేస్తున్న టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పడంలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఘాటుగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి బ్రాందీ షాపు నుంచి పోలీస్‌స్టేషన్‌కు, ఎక్సైజ్ స్టేషన్‌కు మామూళ్లు అందుతున్నాయని, తమ ప్రభుత్వంలో మామూళ్ల ప్రస్తావనే లేదన్నారు. ప్రస్తుతం ప్రతి మద్యం షాపు యజమాని ఎక్సైజ్ శాఖకు రూ.70 వేలు, పోలీస్‌స్టేషన్‌కు రూ.30 వేలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా చెల్లిస్తున్నారని, కిందిస్థాయి నుంచి అమరావతి వరకు ఎవరి వాటా వారికి చేరుతోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. తద్వారా నెలకు సుమారు రూ.100 కోట్ల వరకు మద్యం మామూళ్లు యువరాజు లోకేశ్‌కు అందుతున్నాయని ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,200 కోట్ల అవినీతి జరుగుతోందన్నారు. ఇక డిస్టలరీల నుంచి నేరుగా చంద్రబాబుకు ఏడాదికి రూ.1,000 కోట్లు అందుతోందన్నారు. నక్కలు, తోడేళ్లు కలిసి రూ.1,000 కోట్లు తింటే.. సింహం ఏకంగా రూ.1,000 కోట్లు ఆర్జిస్తోందన్నారు. ఇలా కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీకి సంబంధించి రూ.10వేల కోట్లకు పైగా అవినీతి జరుగుతుంటే.. జగన్ ప్రభుత్వంలో రూ.3,200 కోట్లు అవినీతి జరిగిందని చెబుతున్నారన్నారు.ఇదే అత్త కోడలికి సుద్దులు చెప్పడం అని రాచమల్లు ఎద్దేవా చేశారు. ఆరు పథకాలను అమలుచేయలేని చంద్రబాబు 60 కేసులు పెట్టి 60 మందిని జైలుకు పంపాడని, ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతున్నాడన్నారు. మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వానిది అంతా దోపిడీ అని, ఐదేళ్లలో రూ.10వేల కోట్ల అవినీతి జరుగుతుందని, టీడీపీ నేతలకు దమ్ముంటే ఎవరైనా దీనికి సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. – మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి..అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గరపడ్డాయి. రాజ«దాని పేరుతో కూటమి ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటోంది. హామీల అమలును విస్మరించి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. – ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేరాష్ట్రంలో శాంతిలేదు..రాష్ట్రంలో ఎక్కడా శాంతి లేదు.. ప్రజలకు భద్రత అసలు లేదు. ఏపీలో పోలీస్ వ్యవస్థ చంద్రబాబు కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. శనివారం అనంతపురం జిల్లా రాప్తాడులో దంపతులను టీడీపీ రౌడీమూకలు చంపినట్లు ప్రాథమిక సమాచారం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలోనే ఈ హత్యలు జరిగి ఉంటాయి. – గోరంట్ల మాధవ్, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ -
Nara Lokesh: మనల్ని ఎవడ్రా ఆపేది.. చినబాబు పెద్ద ప్లాన్!
ఆల్రెడీ ఐదేళ్ల క్రితమే మంత్రి పదవి చేసేసారు.. పైగా ఈ ఐదేళ్ళలో బోలెడు ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది.. క్యాడర్ తో కలిశారు..కలుస్తున్నారు.. పార్టీలో పెద్దరికం కూడా చేస్తున్నారు.. పైగా పాదయాత్ర పేరిట మరిన్ని మార్కులు.. ఇవన్నీ సరిపోవా ఏమి.. గమ్మున మా చిన్నోడికి పెద్ద పదవి ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబు మీద కుటుంబం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో మే 27.. 28.. 29 తేదీల్లో కడపలో నిర్వహించే మహానాడులో చినబాబు స్టేచర్ పెరిగిపోవాలి.. లేదంటే ఇంట్లో గొడవలు అవుతాయి.. గిన్నెలు గాల్లోకి లేస్తాయి అనే అల్టిమేటం రావడంతో చిన్నోడికి పెద్ద పదవి ఇవ్వక తప్పడంలేదు. పోనీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం వంటి పదవులు ఇవ్వాలంటే అటు బీజేపీ ఒప్పుకోవాలి.. పవన్ ఊ కొట్టాలి.. ఇవన్నీ అయ్యేది కాదు.. కూటమి ప్రభుత్వంలో ఇంకో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి కేంద్రంలోని బిజెపి పెద్దలు సుతరామూ ఒప్పుకోవడం లేదు.వాస్తవానికి ప్రభుత్వంలో పార్టీలో లోకేష్ ఇప్పుడు నంబర్ టూ గా ఉంటున్నారు.. పేరుకే చంద్రబాబు కానీ పదవులు.. ప్రాజెక్టులు.. పంచాయతీలు అన్నీ లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా ఎలివేషన్ ఉండాల్సిందే అనే డిమాండ్ కూడా క్యాడర్ నుంచి వచ్చేలా లోకేష్ ప్లాన్లు వేస్తున్నారు. వీలైనప్పుడల్లా కొందరితో చంద్రబాబుకు రికమెండ్ చేయిస్తున్నారు. దీంతో ఇప్పుడు కడప మహానాడులో చినబాబుకు పెద్దపదవిని కట్టబెట్టేపనిలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్..లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే పదవుల్లో ఆయన్ను కూర్చోబెట్టి ఇక పవన్ కళ్యాణ్ కు సరిసమాన హోదా ఇవ్వడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది.. అనే ట్యాగ్ లైన్ మీద హడావుడి చేసే జనసేన నాయకులకు.. క్యాడర్ కు లోకేష్ ఇప్పుడు పోటీగా నిలబడతారని అంటున్నారు.. అప్పుడు లోకేష్ కూడా పవన్ కు సమానమైన హోదా.. గుర్తింపు వస్తుందని. అప్పుడు ఆయన్ను ఎవరూ ఆపలేరని క్యాడర్ సంబరపడుతోంది. -సిమ్మాదిరప్పన్న -
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్
విజయవాడ: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మద్యం కేసులో తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలం సృష్టించి అరెస్ట్ చేసిన రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి ఏసీబీ కోర్టు మూడు రోజుల రిమాండ్ విధించింది. వీరిని మే 20వ తేదీ వరకూ రిమాండ్ ఇస్తూ తీర్పునిచ్చింది. అదే సమయంలోవీరి వయసును దృష్టిలో పెట్టుకుని జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. వీరికి వెస్ట్రన్ కమోర్డ్, మంచం, దిండు, దుప్పటి, డ్రై ఫ్రూట్స్ వంటి వాటికి అనుమతి ఇచ్చింది కోర్టు. అంతే కాకుండా ధనుంజయరెడ్డికి కావాల్సిన ఇన్సులిన్ ఇంజక్షన్లు స్టోర్ చేసుకునేందుకు ఫ్రిజ్ సదుపాయం కల్పించాలని కోర్టు ఆదేశించింది.ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు..రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టుకు ఆధారాల్లేవని, ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పష్టం చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ పై ఈరోజు(శనివారం) విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి.. ఈ కేసుకు సంబంధించి కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల తరఫున న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ సక్రమం కాదు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు. ఇద్దరి అరెస్ట్‌కు అధారాల్లేవ్. కోర్టుకు కూడా అరెస్ట్ కు సంబంధించిన ఆధారాలు ఏవీ ఇవ్వలేదు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చట్ట విరుద్ధం. సిట్ కు ఈ కేసు విచారించే అర్హత లేదు.అసలు రూ. 3200 కోట్లు స్కామ్ కి అసలు ఆధారాలు ఏవి?, రూ. 3200 కోట్లు స్కామ్ ఆధారాలు కోర్టుకి కూడా ఇవ్వలేదు.ప్రభుత్వ సొంత కార్పొరేషన్ రికార్డుల్లో ఉన్న సమాచారం కూడా ఇవ్వలేదు. గత 5 ఏళ్ల పాలనలో లిక్కర్ ఆదాయం పెరిగింది. లిక్కర్ వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది. మరి రూ. 3200 కోట్లు స్కామ్ ఎక్కడ జరిగింది?, రూ. 16 వేల కోట్ల నుండి రూ. 24 వేల కోట్లకు ఆదాయ పెరిగింది. మరి ప్రభుత్వంకి నష్టం ఎక్కడొచ్చింది. అరెస్ట్ కారణాలను కూడా కాపీ పేస్ట్ చేశారు. ఇది రాజకీయ ప్రేరేపితం కూడా అయ్యి ఉండొచ్చు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది’ అని శ్రీరామ్ స్పష్టం చేశారు. -
‘సంపద సృష్టిస్తామన్న ప్రభుత్వం.. చెత్తను తొలగించలేకపోతోంది’
విశాఖ: సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పెద్దలు.. వీధుల్లో చెత్తను కూడా తొలగించాలేకపోతున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రస్తుతం కూటమి నేతలు హామీలు అమలు చేయలేక ఫస్ట్రేషన్ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఇక చిన్నపాటి వర్షానికి ప్రపంచస్థాయి రాజధాని అని బాబు చెప్పుకుంటున్న అమరావతి మునిగిపోయిదంటూ చురకలంటించారు బొత్స.‘వైఎస్సార్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, అప్పటి వరకు నాయకులు, కార్యకర్తలు వేచి ఉండాలి.. కూటమి హనీమూన్ టైమ్ అయిపోయింది. ఇప్పటికే పోరాటాలు మొదలు పెట్టాము. నిర్దిష్టమైన ఉద్దేశాన్ని పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని న్యాయస్థానం కూడా చెప్పింది. అధికారులు మీద తప్పుడు కేసులు పెడతారా?, తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిదా? అని ప్రశ్నించారు.మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెడితే పరిస్థితి ఏమిటి.. సీజ్ ద షిప్ ఏమైంది?, మాట చెప్పే ముందు మనం ఏమి చేస్తున్నామో ఆలోచించాలి. నిజం నిలకడ మీద తేలాలి తప్ప.. ఉద్దేశాలను ఆపాదించడం సరైన విధానం కాదు’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.అధికారుల అరెస్టులు ఏ మాత్రం సహించదగినవి కాదు, వాటిని ఖండిస్తున్నాం. నన్ను 60 రోజులు జైల్లో పెట్టారు, మేము అధికారంలోకి వచ్చిన తరువాత.. నన్ను జైల్లో పెట్టిన వారిని, ఒక్కరోజైనా జైలులో ఉంచాలనే ఆలోచన మంచిది కాదు. సరైన విధానంలో విచారణ జరగకుండా అరెస్టులు చేయడం తప్పు. కాలం ఎప్పుడూ ఒకరి పక్షమే ఉండదని బొత్స గుర్తు చేశారు.వ్యక్తిగత సిబ్బందిని అరెస్ట్ చేయాలని అనుకుంటే అప్పుడు మీకు పీఏలు లేరా?, వ్యవస్థలను తమ పని తాము చేసుకొనివ్వకపోవడం వల్లే సమస్యలు ఏర్పడుతున్నాయి. సంపద సృష్టిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు వీధుల్లో చెత్తను కూడా తొలగించలేక పోతున్నారు. హామీలు అమలు చేయలేక, ఫ్రస్టేషన్లో వున్నారు. చిన్నపాటి వర్షానికే అమరావతి మునిగిపోయిందిని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
ప్రతి అక్రమ అరెస్టుకు ప్రతిఫలం అనుభవిస్తారు: మార్గాని భరత్
తాడేపల్లి: ఎన్నికల సమయంలో హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం.. వేధింపులే లక్ష్యంగా అరెస్టుల పర్వం కొనసాగిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. రెడ్‌బుక్ పేరుతో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లని సైతం వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం దెబ్బకి పారిశ్రామిక వేత్తలు కూడా ఏపీ నుండి పరారవుతున్నారని భరత్ స్పష్టం చేశారు. ''చంద్రబాబు గత పాలనలో భారీగా లిక్కర్ స్కాం జరిగింది. రూ.5 వేల కోట్లకు పైగా నిధులను కొల్లగొట్టారు. ఆ కేసులో చంద్రబాబు నిందితుడు. కానీ జగన్ ప్రభుత్వంలో రూ.24 వేల కోట్ల ఆదాయం వచ్చింది. జగన్ హయాంలో లిక్కర్ స్కాం జరిగి ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వచ్చింది?'' అని మార్గాని భరత్ ప్రశ్నించారు.‘ఇప్పుడు చంద్రబాబు పాలనలో మళ్ళీ తమ మనుషులకు దోచి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. వాట్సప్‌లో కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. పర్మిట్ రూములు పెట్టి అమ్ముతున్నారు. మరి ఇంత చేసినా ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు రావటం లేదు?, ఆ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?, దీనిని డైవర్షన్ చేసేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారు’ అని భరత్ వివరించారు.చంద్రబాబు.. జగన్ చుట్టూ ఉన్న వారిని టార్గెట్ చేశారు. నిజాయితీ కలిగిన అధికారులను పక్కన పెట్టి తమకు కావాల్సిన వారిని సిట్‌లో వేశారు. వారి ద్వారానే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తించాలి. ఇప్పుడు చేస్తున్న ప్రతి అక్రమ అరెస్టుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రతిఫలం అనుభవిస్తారు’ అని భరత్ హెచ్చరించారు.రాష్ట్రంలో ఏ పంటకూ సరైన ధరలు లేకపోవడంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అక్రమ కేసులు ఆపి, ముందు రైతాంగానికి మేలు చేయండి. దావోస్ వెళ్ళి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తీసుకు రాలేక పోయారు. జిందాల్ ఏపీ నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఇవి మాత్రమే కాకుండా.. జైళ్లలో అధికారులను కూడా ఉన్నపళంగా బదిలీలు చేయటం వెనుక కారణం ఏంటి?, జైళ్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని భరత్ వెల్లడించారు. -
‘చంద్రబాబు.. లిక్కర్ స్కామ్‌కు అర్థం మీ వద్దే ఉంది వెతుక్కోండి’
తాడేపల్లి: నాణ్యమైన మద్యం, తక్కువ ధరలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాన్ని మోసం చేశారని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. విమర్శించారు. దేశంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు కూటమి ప్రభుత్వం పెట్టింది పేరని ఎద్దేవా చేశారు శైలజానాథ్,ఈ రోజు(శనివారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. మద్యం వ్యాపారంలో చంద్రబాబు ఎక్స్ పర్ట్. అని స్పష్టం చేశారు. ‘చంద్రబాబు చేసిన అన్ని వ్యవహారాలు ప్రజలు మర్చిపోతారనే భావనలో ఉంటారు. చంద్రబాబు ప్రభుత్వం లోనే డిస్టలరీలకు అనుమతి ఇచ్చారు. చంద్రబాబు వ్యవహారం గురువింది గింజ సమేతలా ఉంటుంది. నూతన పాలసీ విధానంలో మద్యం అమ్మకాలు ప్రైవేటుకి ఇవ్వడంలో కూడా అవకతవకలు జరిగాయి. టీడీపీ స్థానిక నాయకులకు భాగస్వామ్యం ఉంది. రండి చూపిస్తాం... బెల్ట్ షాప్ లు లేని గ్రామం లేదు.. మేము చూపిస్తాం. అసలు మద్యం స్కాం అనేది ఇప్పుడు మీ ప్రభుత్వం లోనే నడుస్తోంది. మీ ప్రభుత్వ హయాంలో రోజు రెవెన్యూ లోటు కనిపిస్తుంది.మీరు సంవత్సర కాలంలో ఏం చేశారు?, లిక్కర్ కేసులో ఉన్న ఆధారాలు ఏంటి?, భయాన్ని క్రియట్ చేసి రాజ్యం నడుపుదాం అనుకుంటున్నారా?, చంద్రబాబు ఎన్నికల్లో గెలుపుకోసం ఏమైనా ప్రకటనలు చేస్తారని మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన సాగించాలి. చంద్రబాబుపై సీఐడీ పెట్టిన కేసు ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు?, ఇప్పటికైనా కక్ష పూరిత వేధింపులు ఆపండి. మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది. మీ సీనియర్లతో చర్చించి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోండి. మీ సచ్చీలతను నిరూపించుకోండి. చంద్రబాబు.. లిక్కర్ స్కామ్ కు అర్థం మీ వద్దే ఉంది వెతుక్కోండి’ అంటూ ధ్వజమెత్తారు శైలజానాథ్. -
‘పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు’
నెల్లూరు: పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. హామీల అమలును గాలికొదిలేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. మద్యాన్ని మాత్రాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి.. ‘పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్ట్ దుర్మార్గం. గత ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన మద్యం విషయాన్ని లిక్కర్ స్కాంగా మార్చారు. జరగని లిక్కర్ స్కామ్‌ని జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఈ కేసులో నేతలతో పాటు సీనియర్ అధికారులకు ఇరికించారు.చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని ధ్వజమెత్తారు చంద్రశేఖర్ రెడ్డి. -
ఆ అరెస్ట్‌ల వెనుక కుట్ర కోణం: అంబటి
సాక్షి, గుంటూరు: కేసులు పెట్టి అరెస్ట్‌లు చేస్తే బెదిరిపోయేది లేదని.. వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదన్నారు.‘‘రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో పని చేశారని ధనుంజయ రెడ్డి , కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు నీచపు రాజకీయాలు కొత్త ఏమీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి వైఎస్ జగన్‌ను అక్రమ కేసులతో జైలులో పెట్టి, ఇబ్బంది పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తాం’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లాడనే కోపంతో వైఎస్సార్సీపీ నేతలను, గత ప్రభుత్వ హయాంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నారు. పులి మీద చంద్రబాబు, నారా లోకేష్ స్వారీ చేస్తున్నారు. ఆ స్వారీ చేయటం ఆపగానే ఆ పులి ఇద్దరిని మింగేస్తుంది. అమ్మ ఒడి వంటి పథకాలను ప్రజలు అడగకుండా చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు. ధనుంజయ రెడ్డి,కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
‘పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్ట్‌లు’
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబుకి పాలన చేతకాక, హామీలు అమల్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.హామీల అమలు విషయంలో అన్నివర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకులు వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అవినీతికి ఆస్కారం లేకపోయినా మద్యం స్కామ్ జరిగినట్టు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు.వైఎస్సార్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేసి, మద్యం షాపులు తగ్గించి, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతులిచ్చాడని, గత వైఎస్సార్సీపీ పాలనలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. గత మా వైఎస్సార్సీపీ పాలనలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిందని గుర్తు చేశారు.రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. వీధివీధినా బెల్ట్ షాపులు తెరిచి 24 గంటలూ ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి దమ్ముంటే తన మీద నమోదైన ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కాం, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్దం కావాలని డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని, ఐఏఎస్, ఐపీఎస్‌లనే కాకుండా పారిశ్రామికవేత్తలను కూడా బెదిరిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ వేధింపులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అరాచక పాలనతో ఎంతోకాలం ప్రజాచైతన్యాన్ని అడ్డుకోలేరని అన్నారు. రాబోయే రోజుల్లో వైయస్సార్సీపీ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలతో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
‘సకల శాఖలకు మంత్రి లోకేష్.. అందుకే పవన్‌కు మోదీ చాక్లెట్’
సాక్షి, అనంతపురం: టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల. రాష్ట్రంలో సకల శాఖల మంత్రిగా నారా లోకేష్ కొనసాగుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను మంత్రి నారా లోకేష్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగ సాక్షాలు.. అబద్ధపు స్టేట్మెంట్స్తో ఈ అరెస్ట్ జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉంది. సోలార్ ప్రాజెక్టులను ఏపీలో విస్తారంగా తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. వైఎస్సార్సీపీ తెచ్చిన సోలార్ ప్రాజెక్టులను తాను తెచ్చినట్లు నారా లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ పాలనలో 22వేల కోట్ల రూపాయల విలువైన సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో భాగంగానే రెన్యూ సంస్థ ఏపీలో పెట్టుబడులు. ఏపీలో నారా లోకేష్ సకల శాఖ మంత్రి.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలను మంత్రి లోకేష్ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను ఎందుకు ఆపేశారో చంద్రబాబు, లోకేష్ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు?. ప్రభుత్వ వసతి గృహంలో అమ్మాయిలను ఎలుకలు కొరికినా స్పందించలేదు. రెండు రోజుల అనంత పర్యటనలో నారా లోకేష్ సాధించింది శూన్యం.రాష్ట్రంలో 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. డిప్యూటీ సీఎం పదవి వచ్చాక అదృశ్యమైన మహిళల వ్యవహారంపై పవన్ ఎందుకు మాట్లాడరు. పవన్ కళ్యాణ్.. పిఠాపురం పీఠాధిపతి. అందుకే ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ చాక్లెట్ ఇచ్చారు’ అని చెప్పుకొచ్చారు. -
చంద్రబాబు కుట్ర ఇదే: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండపడ్డారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల అరెస్ట్‌లను ఖండిస్తూ తిరుపతి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియోను విడుదల చేశారు. ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీని నాశనం చేయాలని, వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వైఎస్సార్సీపీపై కక్షతో నిరంతరం దుర్మార్గంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్‌ను బలహీనపరచాలని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను వేధింపులకు గురి చేయడమే కాకుండా చివరికి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలడం లేదు...గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారనే కక్షతో తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం, సూపర్ సిక్స్ విషయంలో ఏడాది కాలంలో ఎటువంటి హామీని అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా లేని మద్యం స్కామ్‌లో సీనియర్ ప్రభుత్వ అధికారులుగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి సర్వీస్ కాలంలో చిత్తశుద్దితో, నిజాయితీతో పనిచేసిన సమర్థులైన అధికారులుగా వీరు పేరు సంపాదించుకున్నారు...తప్పుడు ఆరోపణలతో వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికే వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన చేయకుండా, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటకాగారనే నెపంతో సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేయడం అత్యంత దారుణం. ఇలా చేస్తుంటే ఏ ప్రభుత్వ అధికారి చిత్తశుద్దితో పనిచేస్తారు? ఎక్కడా జరగని మద్యం కుంభకోణంను సృష్టించి, దీనిలో వైఎస్ జగన్‌ను ఇరికించి, అరెస్ట్ చేయాలనే కుట్రతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు...ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి, ఇదే తరహాలో పాలన సాగించాలని అనుకుంటే ప్రజలు సరైన సమయంలో బుద్ది చెబుతారు. శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు చేస్తున్న తప్పులను కృష్ణుడి మాదిరిగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రతి పదిహేను రోజులకు ఒక డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రయోగిస్తూ, గత వైయస్ఆర్సీపీపై ఏదో ఒక ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపడం ద్వారా చంద్రబాబు సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతీకార చర్యలను చూసి రేపు మన భవిష్యత్తు ఏమిటీ అనే ఆత్మ మథనం అధికారుల్లో ప్రారంభమైంది’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. -
బాబూ.. కూటమి సంక్షేమం ఉత్తుత్తి మాటేనా?
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రభావం ప్రస్తుత అధికార కూటమిపై బాగానే ఉన్నట్టుంది. ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చిన జగన్ ఒక పక్కనుంటే.. ఇంకోపక్క ఒకటి అర కూడా అమలు చేయని కూటమి ఇంకోవైపున ఉంది. రెండింటినీ పోల్చుకుంటున్న ప్రజలు అసంతృప్తిని వెళ్లగక్కుతుంటే.. దాన్ని చల్చార్చలేక కూటమి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోంది. రెడ్‌బుక్ పేరుతో సృష్టిస్తున్న ఆరాచకాలు.. జగన్‌పై లేనిపోని అభాండాలు వేయడం వంటివి ఎన్ని చేస్తున్నా ప్రజల్లో అసంతృప్తిని మాత్రం ఇసుమంత కూడా తగ్గడం లేదు.ఈ విషయం కూటమి నేతలకూ బాగానే అర్థమైంది. ఎక్కడికెళ్లినా జగన్‌కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గకపోవడం కూడా కూటమి నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా తన స్వరాన్ని కొంత మార్చుకుంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. సూపర్‌సిక్స్ హామీల్లో అన్నీ కాకపోయినా కొన్నింటినైనా అమలు చేసినట్లు కనిపించాలని సంక్షేమ రాగం ఎత్తుకున్నాయి!. అయితే ఇందులోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు. సంక్షేమ కార్యక్రమాల పేరిట టీడీపీ కార్యకర్తలకు నిధుల పందేరానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయాలు కొన్నింటిని గమనిస్తే.. పార్టీ కేడర్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టమవుతుంది.టీడీపీ కార్యకర్తలకు గతంలో పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు, ఉపాధి హామీ పనులకు సంబంధించి సుమారు రూ.650 కోట్ల చెల్లించేందుకు నిర్ణయించారు. ఈ స్కీమ్‌ల కింద పనులు చేయకుండా చేసినట్లు చూపించడం, పలు అవకతవకలు పాల్పడినందున అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి నిధుల మంజూరును నిలిపి వేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఇలాంటి పనుల బిల్లులు సుమారు రూ.1000కోట్ల మేర చెల్లించారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో రూ.650 కోట్ల నిధులు పంచబోతున్నారు. విశేషం ఏమిటంటే టీడీపీ కార్యకర్తలే ఈ పనులు చేపట్టారని పార్టీ అంగీకరించడం!. పాలిట్ బ్యూరో నిర్ణయాన్ని ప్రజలు వేరే రకంగా భావించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంక్షేమ స్కీములు అమలు చేయబోతోందని, సంక్షేమ క్యాలెండర్ తీసుకురాబోతోందని, దీని ద్వారా ప్రతి నెల ఒక స్కీము అమలు చేయాలని నిర్ణయించారని ఉచిత సిలిండర్లకు సంబంధించి నగదు ముందుగానే లబ్దిదారుల ఖాతాలలోకి వేయాలని నిర్ణయించారంటూ, సంక్షేమ సందడి అంటూ ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది. టీడీపీ ఈ మాత్రం నిర్ణయాలైనా తీసుకుందంటే అది జగన్ ఎఫెక్ట్ అని తెలుస్తూనే ఉంది.ఉదాహరణకు ఈ మధ్య కాలంలో జగన్ రెండు, మూడు సార్లు అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఎప్పుడు వెళ్లినా అశేష జనసందోహం తరలివచ్చి ఆయనను ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తూ జై కొడుతోంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన పరామర్శకు వెళ్లినప్పుడు, సింహాచలంలో గోడ కూలి మరణాలు సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి వెళ్లినప్పుడు కూడా జనం అభిమానం ఎంతటిదో అంతా గమనించారు. జగన్ ప్రభుత్వంలో మద్యం స్కాం అంటూ తప్పుడు కేసు పెట్టినా జనం పట్టించుకోవడం లేదని అర్థమైంది. దాంతో సంక్షేమం అమలు చేయబోతున్నామని ప్రజలను ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఇందులో ఒక నిజాయితీ ఉందా అన్న చర్చ వస్తోంది. ఉదాహరణకు ప్రభుత్వం మూడు వంట గ్యాస్ సిలిండర్ల హామీ నెరవేర్చడంలో భాగంగా ముందుగానే వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలో వేయాలని పాలిట్‌బ్యూరో నిశ్చయించిందట.జనసేన, బీజేపీలతో కూడా మాట్లాడి దీనిపై తుది నిర్ణయం చేస్తారట. నిజంగానే వంటగ్యాస్ వినియోగుదారులందరికీ ఈ రకంగా డబ్బు వేస్తారా?. మళ్లీ ఇందులో ఏ లిటిగేషన్ పెడతారో తెలియదు. ఎందుకంటే ఇప్పటికి ఏడాది పూర్తి అవుతున్నా, ఒక సిలిండర్ మాత్రమే.. అది కూడా అరకొరగా ఇచ్చి కథ నడిపించారు. అంటే ఒక ఏడాదికి రెండు సిలిండర్ల డబ్బు ఎగవేసినట్లు అవుతుంది. నిజంగానే రెండు లేదా, మూడు సిలిండర్ల నగదు ఇచ్చి ఉంటే దానిని విస్తారంగా ప్రచారంలో పెట్టడానికి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకునేవారు కదా?. వెయ్యి రూపాయల పెన్షన్ అదనంగా ఇవ్వడానికే చంద్రబాబు లక్షల రూపాయల ఖర్చు పెట్టి హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ సభలు పెట్టి హడావుడి చేస్తున్నారు. అలాంటిది అందరికి సిలిండర్ల డబ్బు ఇస్తే ఇంకెంత హడావుడి చేసేవారు? ఇప్పుడైనా నిజంగానే మూడు సిలిండర్ల డబ్బు వినియోగదారులకు ఇస్తారా? అందుకు అవసరమైన బడ్జెట్ ఉందా అంటే అనుమానమే. ఎందుకంటే బడ్జెట్ లో ఈ స్కీమ్‌కు వంద కోట్లే కేటాయించారని, అది ఎలా సరిపోతుందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఆలోచిస్తే ఇది నిజమే కదా అనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో సుమారు కోటి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనుకుంటే ఎన్ని కోట్లు అవసరం అవుతాయి. మరి ఇప్పుడు కొత్తగా ఏమైనా నిధులు కేటాయిస్తారా అన్నది చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే ఇది ప్రచారం కోసమే అన్న సంగతి అర్థం చేసుకోవడం కష్టం కాదు. తల్లికి వందనం గురించి ఇప్పటికి పలు వాయిదాలు వేశారు. మళ్లీ జూన్ అంటున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మరో రెండు నెలలు పడుతుందని చెబుతున్నారు. మహిళలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి చెప్పడం లేదు. అలాగే నిరుద్యోగ భృతిని ఏం చేశారు?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అని ఆర్భాటంగా చెప్పారు. ఆ మాట గురించి ఏంటి?. జగన్ ఆయా స్కీమ్‌లను పద్ధతి ప్రకారం అమలు చేస్తే శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. ఎన్నికలు వచ్చేసరికి తాము రెండు, మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని ఊదరగొట్టారు. అధికారం వచ్చాక అప్పులు పుట్టడం లేదని ఒకసారి, సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేసేశామని ఇంకోసారి, అప్పులు చేసి సంక్షేమం అమలు చేయలేమని మరోసారి చెప్పారు.ఇలా ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలకు ఏం ఉపయోగం?. పాలిట్‌బ్యూరోలో ప్రస్తావనకు వచ్చిన ఇంకో విషయం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి.. దావోస్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబడులు రాలేదు కానీ.. ఏడాది కాలంలో రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు వచ్చేశాయని డమ్మీ ప్రచారం మొదలుపెట్టింది కూటమి!. ఇలాంటి అబద్ధాలే.. చంద్రబాబు ప్రభుత్వంపై అపనమ్మకాన్ని రోజు రోజుకూ పెంచుతున్నాయి!.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏ ఆధారాలతో వారిని అరెస్ట్ చేశారు?: రాచమల్లు
సాక్షి, కడప: కూటమి ప్రభుత్వం చేసే అరెస్ట్‌లు కుట్రలో భాగమేనని వైఎస్సార్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. మద్యం పాలసీతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు సంబంధమే లేదన్నారు. కక్ష సాధింపుల్లో భాగంగానే వారిని అరెస్ట్ చేశారన్నారు.ఏ సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్ట్ చేశారో ప్రభుత్వం చెప్పగలదా? అంటూ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నిలదీశారు. ‘‘సత్యప్రసాద్ అనే చిన్న ఉద్యోగిని బెదిరించారు. అతని బెదిరించి వారికి కావాల్సిన స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను బెదిరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు ధైర్యంగా పనిచేయగలుగుతున్నారా?. ఐఏఎస్, ఐపీఎస్‌లు జైళ్లకు పోవాల్సిందేనా?’’ అంటూ రాచమల్లు దుయ్యబట్టారు.‘‘కొన్ని బ్రాండ్లే అమ్మారు.. అన్ని బ్రాండ్లు అమ్మలేదని ఆరోపణ.. కూటమి ప్రభుత్వం ఆరోపణలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కూటమి ప్రభుత్వం చర్యలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఎవరిని జైలుకు పంపాలని ఉద్దేశంతో అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు?. రూ.3,200 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో ఆధారాలతో చెప్పగలరా?. చంద్రబాబు మద్యం పాలసీ అత్త నీతులు చెప్పినట్లుంది. ఎన్నికలకు ముందు మద్యం ధరలు తగ్గిస్తామన్నారు.. తగ్గించారా?’’ అంటూ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. -
ఈ అరెస్టులు అప్రజాస్వామికం: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని.. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టులను ఖండిస్తున్నామని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కక్ష రాజకీయాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని.. ప్రభుత్వాధికారులను, మాజీ ప్రభుత్వాధికారులపై కూడా రాజకీయ విరోధం చూపిస్తున్నారంటూ బొత్స మండిపడ్డారు.చంద్రబాబు తీసుకొచ్చిన తప్పుడు సంప్రదాయాలు రాష్ట్రానికి చేటు చేస్తాయి. లిక్కర్ వ్యవహారంలో ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపడం లేదు. కాని.. బెదిరించి, భయపెట్టి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కల్తీ జరుగుతోందని ఆరోపించారు. మరి ఇప్పుడు అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఖజానా వల్ల నష్టం వచ్చిందన్నారు. మరి ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా ఆదాయాలు ఎందుకు పెరగడంలేదు?’’ అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.కక్ష రాజకీయాలు తార స్థాయికి.. గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కక్ష రాజకీయాలు తార స్థాయికి చేరాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను ఇప్పటికే టార్గెట్‌చేసి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వాధికారులపైనా చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌కు మంచివి కావు. చంద్రబాబు కక్ష రాజకీయాలు రాష్ట్రాన్ని, ప్రజలను దెబ్బతీస్తాయి...పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడంవల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. వాగ్దానాల అమలు లేదు, ఏ వర్గంకూడా సంతోషంగా లేరు. రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రతలేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుడు రాజకీయాలు మాని, రాష్ట్రంపై చంద్రబాబు దృష్టిపెట్టాలి. అణచివేసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత సద్దుమణగదు’’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు.. మేరుగ నాగార్జునధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు చర్య అని.. ప్రతిపక్ష పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోంది. ఈ అరెస్ట్‌లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని మేరుగ నాగార్జున హెచ్చరించారు.చంద్రబాబువి కక్ష రాజకీయాలు: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుమాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. ఈ అరెస్టులు అప్రజాస్వామికం. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. విపక్ష పార్టీ నేతలతో పాటు ప్రభుత్వాధికారులతో పాటు మాజీ అధికారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహనరెడ్డిల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాను.వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ధనుంజయ రెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు. వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు. ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు. ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము. ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం. అక్రమ కేసుల్లో అరెస్టయిన వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. తగిన న్యాయ సహాయం అందిస్తాం.పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. తిరుపతి ఎంపీ గురుమూర్తిచంద్రబాబువి కక్ష రాజకీయాలు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. -
‘కుట్రతోనే లిక్కర్ స్కామ్ అంటూ అక్రమ కేసు’
కాకినాడ: తమ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ,వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పని చేస్తోందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో నిజంగా తప్పు జరిగి ఉంటే, నిష్పాక్షికంగా జరిపే ఎలాంటి విచారణనైనా స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు విచారణల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని, ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండ గడతామని కాకినాడలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.బొత్స ఇంకా ఏం మాట్లాడారంటే..కూటమి ప్రభుత్వం దారుణ వ్యవహారంకూటమి ఏడాది పాలనలో పార్టీల హనీమూన్ ముగిసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. కూటమి పాలనలో అవినీతి, దోపిడీ తప్ప ప్రజా సంక్షేమం, అభివృద్ది ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయ కక్ష సాధింపులకే మొత్తం సమయాన్ని వెచ్చిస్తున్నారు.ఎన్నికల మందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు పెట్టుబడి సాయం, ప్రతి కుటుంబానికి ఏటా మూడు ఉచిత సిలిండర్లు, ఏటా 4 లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెలా ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేల భృతి, ఆడబిడ్డ నిధి కింది ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. కానీ, ఏడాది గడుస్తున్నా వాటిలో ఏదీ అమలు చేయడం లేదు.మరోవైపు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అంతులేని అవినీతి. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కేవలం 99 పైసలకే దాదాపు 3 వేల కోట్ల విలువైన భూముల అప్పగింత. ఇంకా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ.. ‘సీజ్ ది షిప్’ అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నానా హంగామా చేశారు. ఒక్క బియ్యం గింజ కూడా అక్రమంగా రవాణా చేయడానికి వీలులేదని అన్నారు. కానీ ఒక్క దానిపైనా చర్యలు లేవు. పోలీసుల జులుంతో ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. అందుకే ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు.తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారు?ఏడాది పాలనలోనే ఏకంగా రూ.1.59 లక్షల కోట్లు అప్పులు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతలా ఏడాదిలో అప్పులు చేయలేదు. ఇంత అప్పులు తెచ్చి ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు చేశారు? మా హయాంలో అప్పులు చేసినా, వివిధ పథకాల కింద రూ.2.73 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. మరి కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు దేనికి వినియోగించారో చెప్పాలి. సంపద సృష్టిస్తాను. అది తనకు బాగా తెలుసు అని ప్రచారం చేసిన చంద్రబాబు, మరి ఇన్ని అప్పులు, ఇంత తక్కువ సమయంలో ఎందుకు చేశారు? అప్పు చేయడం. ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేయడం చంద్రబాబుకు బాగా అలవాటు.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొంత అప్పు చేసినా, ఆ ఖర్చులకు ఒక అర్థం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, తీర ప్రాంతాల్లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, బోగాపురం ఎయిర్పోర్ట్.. ఇలా ఉత్పాదకతకు దోహదం చేసే వాటికి ఖర్చు చేశాం. మాట ఇస్తే, దాన్ని తప్పకుండా నెరవేర్చాలనేది జగన్‌గారి విధానం. అందుకే ఎన్నికల ముందు, టీడీపీ కూటమి మాదిరిగా, అడ్డగోలు హామీలు ఇవ్వలేదు.పార్టీ కార్యాచరణ. నిర్ణయాలువైఎస్సార్సీపీ అయిదు జిల్లాల ముఖ్య నేతలతో ఈరోజు (శుక్రవారం) సమావేశం నిర్వహించాం. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీల ఏర్పాటు, ప్రతి జిల్లాలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకున్నాం. అలాగే గోదావరి జిల్లాల్లో ధాన్యం సేకరణపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడంతో పాటు, తీర ప్రాంతాల్లోని ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని నిర్ణయించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో పొగాకు రైతులు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పొగాకు రైతులు ఇదే సమస్యలపై ఇబ్బంది పడుతున్నారు.దీనిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పొగాకు రైతులను కలిసి నేరుగా వారితో మాట్లాడనున్నారు. తదుపరి పొగాకు కొనుగోళ్ళపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ పరంగా కార్యాచరణను ఖరారు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పొగాకు మద్దతు ధర లభించని సందర్భంగా మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆ మొద్దునిద్ర నుంచి ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు రైతుల పక్షాన పోరాడతామని బొత్య సత్యనారాయణ హెచ్చరించారు. -
మద్యం కేసు రాజకీయ ప్రేరేపితం: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు రాజకీయ ప్రేరేపితమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీలో రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెడుతున్నట్టు సుప్రీంకోర్టుకు సైతం అర్థమైందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ని టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.‘‘చంద్రబాబు రూ.370 కోట్లు లూఠీ చేసినట్టు ఆధారాలతో సహా దొరికారు. ఏలేరు స్కాం నుంచి అనేక కేసులు విచారణ కూడా జరగకుండా స్టేలు తెచ్చుకున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారు. దానిమీద ఒక్కరోజైనా వైఎస్ జగన్‌ని జైల్లో ఉంచాలని చంద్రబాబు తొందర పడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కక్షసాధింపు పనిలో పడ్డారు. స్కిల్ కేసులో చంద్రబాబే స్వయంగా అక్రమాలకు పాల్పడ్డారు. నిధుల విడుదల అక్రమమని తెలిసినా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు డ్రా చేశారు. ఆధారాలతో సహా స్కిల్ కేసులో దొరికారు’’ అని పేర్ని నాని గుర్తు చేశారు.‘‘బ్రీఫ్డ్ మీ కేసులో టేపులతో సహా దొరికారు.. కానీ లిక్కర్ కేసులో జగన్‌కు ఏం సంబంధం?. ఆయన ఎక్కడైనా సంతకాలు పెట్టారా?. ఈ కేసులో నిజాయితీగా వ్యవహరించిన వినీత్ బ్రిజిలాల్‌ను తప్పించారు. తమకు వత్తాసు పలికే ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్‌ను వేసి లిక్కర్ కేసు నడుపుతున్నారు. కేసు నిలుస్తుందా? లేదా? అనేది పక్కన పెట్టి జగన్ అరెస్టే లక్ష్యంగా కేసు నడుపుతున్నారు. ఇందుకోసం ఎన్ని పాపాలు, తప్పులు చేయాలో అవన్నీ సిట్‌తో చేయిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జగన్ వెనకడుగు వేయరు..చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, అచ్చెన్నాయుడు.. వీరంతా లిక్కర్ కేసు మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు, ఆరోపణలు చేశారు. అనేక కేసుల్లో దొరికిన దొంగ చంద్రబాబు. లక్షా 50 వేల కోట్లు అప్పు చేసి, ఆ డబ్బును ఏం చేశారో చెప్పటం లేదు. రాష్ట్ర ఆదాయాలు భారీగా పడిపోయాయి. సంపద సృష్టి ఇంకెప్పుడు చేస్తారు?. ప్రత్యేక విమానాల్లో విహారాలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల కోసం మూడు హెలికాఫ్టర్లు కొనబోతున్నారు. ప్రజల సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు’’ అని పేర్ని నాని నిలదీశారు.మీరు చేస్తున్న తప్పుడు పనులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. లిక్కర్ కేసులో ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ ఆఫీస్ నుంచి వాట్సప్‌లో వచ్చిన ప్రశ్నలను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వంశీ కేసులో కోట్ల రూపాయలను లాయర్లకు ఇస్తున్నారు. ప్రజల డబ్బును టీడీపీ నేతల అవసరాలు, కక్షసాధింపు కోసం ఖర్చు చేస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర డమ్మీ మంత్రి. ఆయన ఇంటి పక్కనే బెల్టుషాపు పెట్టినా చూస్తూ కూర్చున్న చేతగాని మంత్రి’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. -
‘చంద్రబాబు నిర్వాకం.. పదివేల మంది టీచర్లకు డిమోషన్’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. సీఎం చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయని అన్నారు.ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యారంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తోంది. టీచర్లు సైతం విద్యారంగాన్ని బతికించమంటూ ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న కన్ఫ్యూజన్ పాలనతో విద్యారంగం నాశనం అవుతోంది. సరైన విధానం లేకుండా 9 రకాల స్కూళ్లను చంద్రబాబు తెస్తున్నారు. వైఎస్ జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయి. చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయి.ఒకవైపు సర్ప్లస్ చూపిస్తూ మరోవైపు డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్న సర్ప్లస్ టీచర్లను ఏం చేయబోతున్నారు?. గందరగోళంగా మారిన వ్యవస్థపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి. సబ్జెక్టు టీచర్లను పక్కన పెడితే పిల్లలకు క్వాలిటీ విద్య ఎలా అందుతుంది?. విద్యా వ్యవస్థను నాశనం చేయవద్దు’ అంటే వ్యాఖ్యలు చేశారు. -
వంశీపై కూటమి కుట్రలు.. మరో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వంశీపై తాజాగా మరో కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరంలో మైనింగ్ అక్రమాలపై ఏడీ ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.ఇప్పటికే వంశీకి ఐదు కేసుల్లో బెయిల్ మంజూరు అయినప్పటికీ కూటమి సర్కార్ మాత్రం తప్పుడు కేసులతో వంశీకి బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్‌పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇంతలో నిన్న నూజివీడు పోలీసులు.. వంశీపై పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈరోజు మరో కేసు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్‌పై 58 పేజీలతో గనుల శాఖ ఏడీ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, క్రైమ్ నెం.142/2025తో గన్నవరం పీఎస్‌లో వంశీపై కేసు నమోదైంది. ఇలా.. వంశీపై ఏదో ఒక కేసు పెడుతూ వంశీకి బెయిల్ రాకుండా కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. సర్కార్ తీరు కారణంగా వంశీ.. 90 రోజులుగా విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. -
బాబూ.. మీడియాతో పెట్టుకోకు!
ఎవరైనా బలవంతంగా ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం?. ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీసులే వ్యక్తుల ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడితే? చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే? ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని హరిస్తూ అరాచకాలకు పాల్పడితే? ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇదే.ఏపీ ప్రభుత్వం మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి మరీ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ చివరికి ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న మీడియా గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి నివాసంపై పోలీసుల దాడిని కూడా ఈ కోణంలోనే చూడాలి. టీడీపీ, అధికారంలోకి వచ్చినప్పటి జనసేన, బీజేపీ కూటమి దుశ్చర్యలకు అంతు లేకుండా పోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ మీడియాపై ఒక కన్నేసే ఉంచుతారు. బాకా మీడియాను ఒకరకంగా, వైఫల్యాలను, ప్రభుత్వ స్కామ్‌లను బయటపెట్టే మీడియాను మరో రకంగా చూస్తారు. మాట వినని జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకు వస్తారు కూడా. అనుకూలంగా ఉండే మీడియాకు రకరకాల రూపాలలో మేళ్లు చేస్తారు. తద్వారా ఆ యాజమాన్యాలను తన గుప్పెట్లో ఉంచుకుంటారు.1995లో తన మామ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వర్గం మీడియా ద్వారా ఆయనపైనే వ్యతిరేక ప్రచారం అనండి.. దుష్ప్రచారం చేయించిన చరిత్ర చంద్రబాబుది అని అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నవారు చెబుతుంటారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉంటూనే ఆయన తెలివిగా ఎన్టీఆర్ ప్రతిష్టను తగ్గించే వ్యూహాలు అమలు చేశారని ఆరోపణలున్నాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను బాగా వాడుకోగలిగేవారు. ఈనాడు చూడడానికే అసహ్యంగా ఉండే ఘోరమైన కార్టూన్లు ఎన్టీఆర్‌పై వేసేది. అయినా ఆ రోజుల్లో ఈ పత్రికలపై ఎన్టీఆర్ కేసులు పెట్టలేదు.మామను కూలదోసి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పాలన మాటెలా ఉన్నా అనుకూల మీడియా వ్యవస్థనైతే బాగానే ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్‌లు జరిగినా, జరగకపోయినా, కల్పిత కథనాలకు కొదవ ఉండేది కాదు. అదే టైమ్‌లో రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లే వ్యూహాలు పక్కాగా అమలయ్యేవి. ఆ రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే కొన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు నిలిపివేసే వారు. కానీ ఇప్పటిలా బరితెగించి మరీ కేసులు పెట్టేవారు కాదనే చెప్పాలి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు కొత్తకాదు. అయితే, ఆ హామీలను అమలు చేయకపోయినా ఎవరూ వాటిని గుర్తు చేయకూడదు! అందుకోసం ఆయన నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.2014లో రైతుల సంపూర్ణ రుణమాఫీ కావచ్చు.. కాపుల రిజర్వేషన్ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు. చంద్రబాబు పంథా ఒక్కటే. తనకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే అనుకూల మీడియా చేత వాటిని అణచివేసే ప్రయత్నం చేయడం. అంశం ఏదైనా.. టీవీ ఛానళ్లలో అనుకూల ప్రచారమే సాగాలన్నది ఆయన ఆకాంక్ష. కాపుల రిజర్వేషన్ విషయమే తీసుకుందాం.. ఇచ్చిన హామీ అమలుకు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపడితే ఆ విషయం ప్రజలలోకి వెళ్లనీయకుండా కొన్ని టీవీ చానళ్లను బ్లాక్ చేయడానికి యత్నించారు. ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అధికార పార్టీపై వ్యతిరేక వార్తలు రాయాలని జర్నలిస్టులకు నూరి పోస్తుంటారు. దానికి తగినట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ఉన్నవి, లేనివి కల్పించి వార్తలు ఇచ్చేవి. ఈ మీడియా 2019-2024 మధ్యలో ముఖ్యమంత్రి జగన్‌పై కక్కినంత విషం బహుశా ప్రపంచంలోనే మరే మీడియా కక్కి ఉండదు. ఇందుకోసం పచ్చి అబద్ధాలు రాసేందుకూ వెనుకాడలేదు ఈ సంస్థలు.టీడీపీ మీడియా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్‌ను కించపరిచేలా కథనాలు ఇచ్చినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు దారుణమైన వ్యాఖ్యలు చేసినా అప్పట్లో ఎవరిపై కేసులు పెట్టలేదు. కానీ 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. సాక్షి మీడియా అణచివేతకు యత్నిస్తూనే ఉన్నారు. పలువురు విలేకరులపై పోలీసు కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఎప్పుడో మూడేళ్ల క్రితం శిలాఫలకం పడవేశారంటూ అప్పటి ఎమ్మెల్యేతోపాటు విలేకరిపై కూడా కేసు పెట్టారట. అప్పుడు ఏం చేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక, టీడీపీ, జనసేన వారు లెక్కలేనని శిలా ఫలకాలను ధ్వంసం చేసినా ఒక్క కేసు నమోదు కాలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎవరెవరో ఫిర్యాదు చేయడం పోలీసులు హుటాహుటిన వైఎస్సార్సీపీ వారిని అరెస్టు చేయడం సాధారణమై పోతోంది.ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ ‘రెడ్ బుక్’పేరుతో కక్ష రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ?. చాలా సింపుల్ ప్రభుత్వ తప్పులు ఎవరూ ఎత్తి చూపకూడదు. సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన 150 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎవరూ ప్రశ్నించకూడదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరుల అసత్యపు ప్రచారాన్ని ఎవరూ గుర్తు చేయకూడదు. ఏడాది తిరగకుండానే కూటమి ప్రభుత్వం చేసిన రూ.1.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు? దేనికి ఖర్చుపెట్టారు? అని ఎవరూ అడగకూడదు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను ఎవరూ వెలికి తీయకూడదు. సాక్షి మీడియా ఇవన్నీ చేస్తున్నందునే చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి దాడి చేస్తోంది.నిజానికి సాక్షి మీడియా ప్రతీ వార్తనూ ఆధార సహితంగానే రాస్తుంది. సౌర శక్తి ఒప్పందాలనే తీసుకుందాం. జగన్ హయాంలో యూనిట్‌కు రూ.2.49లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఎల్లోమీడియా..లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగిపోయిందని ప్రచారం చేశాయి. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందేమిటి? అదే విద్యుత్తును రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నారు. అంటే.. యూనిట్‌కు దాదాపు రెండు రూపాయలు ఎక్కువ పోసి కొంటున్నారన్నమాట. అయినా సరే.. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో ఒక్క వార్త కూడా రాలేదు. సాక్షి మాత్రం పక్కా ఆధారాలతో జరిగిన అవినీతిని వివరించారు. సౌర శక్తి కొనుగోళ్ల విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.అలాగే.. విశాఖలో టీసీఎస్‌కు 99 పైసలకు ఎకరా భూమి ఇవ్వడం, ఊరు, పేరు లేని ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టడం, అమరావతి రాజధాని నిర్మాణాల పేరుతో అధిక రేట్లకు ఇష్టారాజ్యంగా టెండర్లు కేటాయించడం, అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టడం పెన్షన్లు మినహా మరే హామీ అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి నెలకొనడం మొదలైన వార్తలను సాక్షి మీడియా ఇస్తోంది. ఏలికలకు ఇది పంటికింద రాయిలా మారింది. దీంతో సాక్షిని ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో ఆధారాలు లేని మద్యం స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్సీపీ నేతల అరెస్టుకు చంద్రబాబు.. పోలీసులను ప్రయోగించారు. నిందితులు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిలో ఉన్నారన్న అనుమానం వచ్చిందని పోలీసులు.. చెప్పా పెట్టకుండా విజయవాడలో ఆయన ఇంటిపై పడ్డారు. నిజంగా అలాంటి అనుమానం ఉంటే ఏమి చేయాలి? సెర్చ్ వారంటే ఇచ్చి సోదాలు చేయాలి. అసలు ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి అంత ధైర్యంగా వెళ్లారంటే ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.సాక్షి సిబ్బందిని మానసికంగా వేధించడానికి ఇలా చేసినట్లు తెలుసుకోవడం కష్టం కాదు. ఇంత మాత్రానికే సాక్షి మీడియా వణికిపోతుందా?. 2008 నుంచి సాక్షి మీడియా ఇలాంటి ఆటుపోట్లను ఎన్నింటినో ఎదుర్కొంది. ఈ మీడియాను దెబ్బతీయడానికి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి ఎన్ని కుట్రలు పన్నింది.. ఎన్ని కేసులు పెట్టించింది తెలియనిది కాదు. 2014 టర్మ్‌లో కూడా సాక్షిని లేకుండా చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. తిరిగి ఈ టర్మ్‌లో అంతకన్నా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలకు తెగిస్తున్నారు. ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి వాటిని సమర్థంగానే ఎదుర్కొన్నారు. పోలీసులు మూడు గంటలపాటు అక్కడ ఉన్నా వారికి ఏమీ దొరకలేదు. దాంతో వారు సైలెంట్‌గా వెళ్లిపోక తప్పలేదు. సెర్చ్ వారంట్ లేకుండా వెళ్లడం ద్వారా పోలీసులు దుశ్చర్యకు పాల్పడినట్లు అయింది.ఇక, ఎమర్జన్సీలో సైతం ఇందిరాగాంధీ ఇలాంటి పద్దతులు అనుసరించి మీడియా గొంతు నులమాలని విశ్వయత్నం చేశారు. కానీ, అంతిమంగా ఆమె ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. తొలుత ఇందిరాగాంధీ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత తెలుగుదేశంను తన అధీనంలోకి తెచ్చుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అవే పద్దతులు అవలంభిస్తున్నారు. చరిత్ర చెప్పిన పాఠాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఓటమి తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రెడ్‌బుక్ మరువను: మంత్రి నారా లోకేశ్
గుంతకల్లు/గుత్తి : ‘రెడ్‌బుక్‌ను ఎట్టి పరిస్థితిల్లోనూ మర్చిపోను.. టీడీపీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన అందరూ మూల్యం చెల్లించుకోకతప్పదు. టీడీపీ కార్యకర్తలపై ఉన్న కేసులన్నీ ఎత్తేపిస్తా’ అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారాలోకేశ్ పేర్కొన్నారు.గురువారం ఆయన అనంతపురం జిల్లా గుత్తి మండలం రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి నారా లోకేష్.. మాట్లాడుతూ ఏ సమావేశానికి వెళ్లినా పార్టీ కేడర్ రెడ్‌బుక్ గురించి అడుగుతున్నారని, ప్రతి ఒక్కరి చిట్టా విప్పి, చేయాల్సిన పని చేస్తానన్నారు. కాకపోతే కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని చెప్పారు. వైఎస్ జగన్ నిర్వహకం వల్లే కరెంటు బిల్లుల్లో ట్రూఅప్ చార్జీలు వేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం స్కూల్ మూసివేస్తుందని వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో 45 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఇప్పడు ఆ సంఖ్య 33 లక్షలకు పడిపోయిందన్నారు. అనంతపురానికి రూ.22 వేల కోట్ల విలువైన భారీ సోలార్ విండ్ ప్రాజెక్టు వస్తుందని వెల్లడించారు. అనంతరం ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు.