breaking news
-
విశాఖ జంట హత్యల కేసు.. వివాహేతర సంబంధమే కారణం!
విశాఖ: నగరంలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేస్ లో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రసన్న కుమార్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్ర బాబు, లక్ష్మీల హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆర్థిక లావాదేవీలతో పాటు వివాహేతర సంబంధం కూడా కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా.. హత్య గావించబడ్డ లక్ష్మీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యగావించబడ్డ యోగేంద్ర కుటుంబంతో నమ్మకంటూ వారిని మిశ్రా హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.హత్యకు గురైన దంపతులు ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. అదే సమయంలో రాజీవ్‌నగర్‌లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య పథకాన్ని ప్రసన్న కుమార్ మిశ్రా అమలు చేశాడు. దీనిపై విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడారు. డబుల్ మర్డర్ కేసు గురుంచి సీఎం కూడా మమ్మల్ని అడిగారు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడు. హత్యలకు వివాహేతర సంబంధమే కారణం. నిందితుడు ప్రసన్న కుమార్ మిస్రాకు యోగి బాబు దంపతులతో కొన్ని ఏళ్లుగా పరిచయం. మిశ్రా భార్యకు లక్ష్మితో స్నేహం ఉంది. కోవిడ్ సమయంలో మిశ్రా భార్య మృతి చెందింది. అనంతరం లక్ష్మితో సాన్నిహిత్యం ఏర్పరుచుకున్నాడు మిశ్రా.నిందితుడు ఒరిస్సా రాష్ట్రం పూరీకి చెందినవాడు. 2012 లో దుబాయిలో ఓ జ్యువెలరీ షాప్ లో పని చేస్తూ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు మిశ్రా. 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఐదు లక్షల రూపాయల అప్పు తీర్చుటకు ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడులక్ష్మి మృతదేహం నుండి 4.5 తులాల బంగార ఆభరణాలు, స్కూటీ దొంగలించాడు నిందితుడు. దొంగలించిన సొత్తును పూరీలో అమ్మి సొమ్ము చేసుకొన్న నిందితుడు. నిందితుడు వద్ద నుండి నాలుగు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు చేదించడానికి పది బృందాలు నియమించాం’ అని సీపీ తెలిపారు. -
భీమవరంలో సైకో హల్చల్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: భీమవరంలో సైకో ప్రజలను భయాందోళనలకు గురి చేశాడు. తన కూడా తెచ్చుకున్న కత్తితోనే తన శరీరాన్ని కోసుకున్న సైకో వీరంగం సృష్టించాడు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతిచెందాడు. ఉండి గ్రామంలోని పేదపేటకు చెందిన గాతల క్రాంతికుమార్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.మరో ఘటనలో.. అన్న కొడుకుపై కత్తితో దాడిమరో ఘటనలో ఇంట్లో ఫ్యాన్ ఏర్పాటుపై వివాదం ఏర్పడి అన్న కొడుకుపై చిన్నాన దాడి చేసిన సంఘటన పరిమెళ్లలో చోటు చేసుకొంది. పెంటపాడు ఎస్సై కె.స్వామి తెలిపిన వివరాల ప్రకారం పరిమెళ్లకు చెందిన అన్నదమ్ములు వెన్నపు రాంబాబు, తన అన్న వెన్నపు రామకృష్ణలు రెండు పోర్షన్ల ఇంట్లో ఉంటున్నారు. బుధవారం రాంబాబు తన ఇంట్లో సీలింగ్ ప్యాన్ బిగించుకుంటున్నాడు. ఈ విషయంపై అన్న కొడుకైన నాగరాజుతో వాగ్వాదం జరిగింది. రాత్రి మళ్లీ ఘర్షణ పడగా.. చాకుతో నాగరాజుపై రాంబాబు దాడికి చేశాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
విషాదం.. కరెంట్ తీగలు తగిలి వైఎస్సార్సీపీ నేత కుమారుడు మృతి
సాక్షి, సత్యసాయి: హిందూపురంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి వైఎస్సార్సీపీ నేత కుమారుడు అశ్విన్ ఆరాధ్య(11) మృతిచెందాడు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కన్న కొడుకు చనిపోవడంతో తల్తి బోరున విలిపిస్తోంది.వివరాల ప్రకారం.. హిందూపురానికి చెందిన వైఎస్సార్సీపీ నేత వాల్మీకి లోకేష్ కుమారుడు అశ్విన్ ఆరాధ్య. వేసవి సెలవులు కావడంతో అశ్విన్ తన స్నేహితులతో కలిసి ముద్దిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో బాల్ తీసుకునేందుకు వెళ్లగా అక్కడే ఉన్న కరెంట్ తీగలు తగలి షాక్ కొట్టింది. దీంతో, అశ్విన్ అక్కడికక్కడే మృతిచెందాడు. కొడుకు మృతి విషయం తెలిసిన తల్లి బోరును విలపిస్తూ కన్నీరుపెట్టుకుంది.మరోవైపు.. కూటమి సర్కార్ పాలనలో అక్రమ కేసుల కారణంగా వాల్మీకి లోకేష్ ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం వాల్మీకి లోకేష్ జైలులో ఉండగా.. కొడుకు మరణ వార్త విని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. కొడుకు అశ్విన్ ఆరాధ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వాల్మీకి లోకేష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
వైఎస్సార్సీపీ నేతలపై కక్ష
రేణిగుంట/కొలిమిగుండ్ల: వైఎస్సార్సీపీ నేతలపై కక్ష గట్టి నష్టం చేకూర్చిన ఘటనలు తిరుపతి, నంద్యాల జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ చెలికం నాగరాజురెడ్డి తన పొలం (లీజు)లో ఉన్న 100 టన్నుల టేకు కొయ్యలను కట్ చేయించి గ్రామ శివారులో ఉన్న తన స్థలంలో నిల్వ చేశారు. ఇది తెలుసుకున్న కొందరు గురువారం అర్ధరాత్రి వాటికి నిప్పు పెట్టారు. టేకు కలప ఉంచిన ప్రాంతంలో మంటలు ఎగుస్తుండటంతో స్థానికులు గుర్తించి నాగరాజురెడ్డికి సమాచారం ఇచ్చారు.మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. అవి పూర్తిగా కాలిపోవడంతో రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు తనను భయభ్రాంతులకు గురిచేసేందుకు తగులబెట్టారని ఆయన మండిపడ్డారు. ఇందుకు కారకులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో నంద్యాల జిల్లా హనుమంతుగుండంలో వైఎస్సార్సీపీ నేత పాణ్యం ఖాన్బాదర్కు చెందిన పొలానికి కొందరు వ్యక్తులు శుక్రవారం నిప్పు పెట్టారు.గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి గుండం వద్ద ఉన్న ఎకరం పొలంలో పశువుల మేత కోసం గడ్డి సాగు చేశాడు. కొందరు ఉద్దేశ పూర్వకంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది. బోరులో నుంచి తీసి పక్కన పెట్టిన 40 పైపులు దగ్ధమయ్యాయి. నీళ్లు పారించేందుకు ఏర్పాటు చేసిన పది లింక్ పైపులు, స్టార్టర్ బాక్స్, విద్యుత్ తీగ కాలిపోయింది. రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఖాన్బాదర్, రమీజాబి దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. పక్కనే ఉన్న గడ్డివామికి కూడా నిప్పంటించి వెళ్లారు. అయితే అదే సమయంలో పొలంలోకి వచ్చిన రమీజాబి గమనించి మంటలను ఆర్పేసింది. బాధితుడు వైఎస్సార్సీపీ తరఫున 2024 ఎన్నికల్లో ఏజెంట్‌గా కూర్చున్నాడు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత డిసెంబర్లో టీడీపీ నాయకులు పట్టుబట్టి ఇతన్ని వీఓఏగా తొలగించారు. భార్య రమీజాబి చాలా ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో మేటీగా పని చేస్తోంది. ఆమెను మేటీగా తొలగించాలని టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా తమను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో టీడీపీ నాయకులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని ఖాన్బాదర్ దంపతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొలిమిగుండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.పాలన మరచి పగబట్టారు : ఎంపీ గురుమూర్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పాలనను మరచి కేవలం వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. ఇనగలూరు సర్పంచ్ చెలికం నాగరాజురెడ్డికి చెందిన టేకు కొయ్యలకు నిప్పంటించిన ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. బాధితుడు నాగరాజు రెడ్డికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మరచి, రెడ్ బుక్ రాజ్యాంగ పాలనను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
నంద్యాల: జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు, గుంటూరు ప్రధాన జాతీయ రహదారిపై బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలు కాగా, అందులో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో దైవదర్శనానికి వెళ్లి బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్, రాజీవ్ నగర్ లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. -
యువతి దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ విశాఖ
సాక్షి,విశాఖ: కూటమి పాలనలో మహిళలు,చిన్నారులకు రక్షణ లేకుండా పోతుంది. రాష్ట్రంలో మహిళలపై రోజుకో దాడులు, హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా, విశాఖలో దారుణం చోటు చేసుకుంది. యువతి దారుణ హత్యకు గురైంది. హత్య అనంతరం యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు.బీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దాకమర్రి ఫార్చ్యూన్ లే అవుట్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
విశాఖలో విషాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ షాక్‌కు గురై సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందింది. మురళీనగర్‌లో ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండో అంతస్తు నుంచి కేబుల్ వైర్ ద్వారా పై అంతస్తు నుండి పాల ప్యాకెట్ తీస్తున్న క్రమంలో జీవీ పద్మావతి(29) విద్యుత్ షాక్‌కు గురైంది. ఆమె భర్త అజయ్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.మరో విషాద ఘటనలో..ప్రేమ వివాహానికి అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ చెందిన యువకుడు గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అక్కయ్యపాలెంలోని జగన్నాథపురానికి చెందిన కొణతాల లోకనరేంద్ర(29) సొంతంగా క్యాబ్ నడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. యువతి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఫోర్త్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.ఇరు కుటుంబాల సమక్షంలో ఇరువురికి సంబంధం లేనట్టు ఉంటామని ఒప్పకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 9న యువతికి పెళ్లి చేసేందుకు ముహూర్తం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న యువకుడు ఆ అమ్మాయినే చేసుకుంటానని తల్లిదండ్రుల్ని బతిమాలాడు. వారు నిరాకరించడంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పోలీసులకు తెలిపి, యువతితో మాట్లాడించి బయటకు రప్పించేందుకు ప్రయతి్నంచారు. అయినా స్పందన లేకపోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని, మరణించి ఉన్నాడు. తండ్రి చంద్రరావు ఫిర్యాదు మేరకు సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
మధుమతి అనుమానాస్పద మృతి.. వివాహేతర సంబంధమే కారణం
సాక్షి, ఎన్టీఆర్: ఏపీకి చెందిన ప్రముఖ తెలుగు యూట్యూబర్ మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. మధుమతి తన అమ్మమ్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట మండల పరిధిలోని ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి(22) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఇన్స్టాగ్రామ్ (Instagram)లో రీల్స్ చేస్తూ తనకుంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. అదేవిధంగా లక్షల్లో సబ్స్క్రైబర్లు ఆమె సొంతం. ఈ క్రమంలోనే మధుమతికి అప్పటికే వివాహం అయిన ప్రతాప్ (Prathap)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు వివాహేతర బంధానికి దారి తీసింది.అయితే, ఉన్నట్టుండి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తాజాగా మధుమతి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా.. అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, తమ కుమార్తె ఆత్మహత్యకు ప్రతాప్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మధుమతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో యూట్యూబర్ అనుమానాస్పద మృతిఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో మధుమతి అనే యూట్యూబర్ అనుమానాస్పద మృతిఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22)కి తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్‌తో వివాహేతర సంబంధంతమ కుమార్తెను తీసుకెళ్లి ప్రతాపే ఉరి వేసి చంపేశాడని ఆరోపిస్తున్న… pic.twitter.com/mKLsLE3UjK— Telugu Scribe (@TeluguScribe) May 2, 2025Video Credit: Telugu Scribe -
తిరుమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం
తిరుమల: తిరుమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తుంబుర తీర్థం వద్ద అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
భూమికపై విచక్షణా రహితంగా దాడి చేసిన భర్త
గుడివాడరూరల్: అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో భర్త విచక్షణా రహితంగా దాడి చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మట్టా అశోక్, భూమికలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న అశోక్ చెడు అలవాట్లకు బానిసై తరచూ అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఇటీవల జరిగిన గొడవతో భార్య భూమిక పిల్లలను తీసుకుని సమీపంలో నివాసముంటున్న తల్లి రాణి ఇంటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం తన బట్టలు తీసుకునేందుకు చెల్లి అనుష్కతో కలిసి భర్త అశోక్ ఇంటికి వెళ్లిన భూమికపై భర్త కత్తితో విచక్షణా రహితంగా మొఖంపై దాడి చేసి పొట్టలో పొడిచాడు. అడ్డుకోబోయిన చెల్లిపై కూడా దాడి చేయడంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. అనంతరం అశోక్ పరారయ్యాడు. గాయపడిన వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. భూమిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ తరలించారు. బాధితురాలి తల్లి రాణి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వి.దీరజ్ వినీల్, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఇందిరానగర్ కాలనీలోని సంఘటనా స్థలానికి డీఎస్పీ వెళ్లి పరిశీలించారు. -
నెల్లూరులో కారు బీభత్సం.. ఆరుగురి దుర్మరణం
నెల్లూరు, సాక్షి: కారు బీభత్సంతో బుధవారం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులంతా నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్‌గా తెలుస్తోంది. పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం ఘటనలో మృతులు మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా పోలీసులు ప్రకటించారు. గాయపడిన నవనీత్ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక.. ఈ దుర్ఘటనలో షాప్‌లో ఉన్న రమణయ్య సైతం మృతి చెందాడు. బుచ్చిరెడ్డిపాలెం లో ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరై కారులో విద్యార్థులు తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఇద్దరిని బలిగొన్న అతివేగం
బిట్రగుంట(నెల్లూరు): అతి వేగం ఇద్దరు స్నేహితుల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన కొడవలూరు మండలం నార్తురాజుపాళెం సమీపంలో ఆంజనేయస్వామి గుడి వద్ద హైవేపై సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బోగోలు పంచాయతీ బేతనీయపేటకు చెందిన షేక్ మన్సూర్‌బాషా (26), విశ్వనాథరావుపేట రామస్వామిపాళెంకు చెందిన బత్తుల ప్రవీణ్‌కుమార్ (26) చిన్ననాటి నుంచి స్నేహితులు. మన్సూర్‌కు వివాహమై రెండేళ్ల కుమారుడు ఉండగా, ప్రవీణ్‌కుమార్ అ వివాహితుడు. మన్సూర్ బిట్రగుంటలోనే వాహనాలకు నేమ్ బోర్డులు, స్టిక్కర్లు వేసే షాపు నిర్వహిస్తున్నాడు. ప్రవీణ్‌కుమార్ గౌరవరం టోల్‌ప్లాజా వద్ద పని చేస్తున్నాడు. స్నేహితులిద్దరూ పనిమీద సోమవారం నెల్లూరు వెళ్లారు. రాత్రి సుమారు 11.30 గంటల తర్వాత బైక్‌పై ఇంటికి బయలు దేరారు. బాగా ఆలస్యం కావడంతో త్వరగా ఇంటికి చేరుకొందామని బైక్‌ను వేగంగా నడుపుకొంటూ వచ్చారు. 12 గంటల ప్రాంతంలో నార్తురాజుపాళెం ఆంజనేయస్వామి గుడి వద్ద ఆగి ఉన్న లారీని అదే వేగంతో వెనుక వైపు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న స్నేహితులు మన్సూర్, ప్రవీణ్‌కుమార్ అక్కడకక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏఎస్సై గంధం ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
ఏజెన్సీలో ఎదురుకాల్పులు
సాక్షి, పాడేరు: అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు, వై.రామవరం, జీకే వీధి మండలాల సరిహద్దు పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులతో మార్మోగింది. సోమవారం ఉదయం, మధ్యాహ్న సమయంలో అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 15 మంది మావోయిస్టులు త్రుటిలో తప్పించుకున్నారు. దీంతో అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగి అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా కూంబింగ్ మావోయిస్టుల సంచారంపై సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం ఎస్పీ అమిత్‌బర్ధర్ ఆదేశాలతో కొద్ది రోజుల నుంచి విస్తృతంగా కూంబింగ్ చేపట్టింది. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో కాకులమామిడి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో 15 మంది మావోయిస్టులు పోలీసులకు ఎదురుపడి కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసు బలగాలూ మావోయిస్టులపై కాల్పులు జరిపాయి. మావోయిస్టులు సామగ్రి వదిలి తప్పించుకున్నారు. గాలింపు చర్యలను పోలీసులు కొనసాగిస్తున్న నేపథ్యంలో మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కాంటవరం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అక్కడా మావోయిస్టులు వదిలిపెట్టిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల్లో కీలకనేతలు గాజర్ల రవి, జగన్‌లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కిట్ బ్యాగులలో కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. కొందరు మావోయిస్టులకు గాయాలయ్యాయనే అనుమానంతో పోలీసులు కూంబింగ్‌ను విస్తతం చేశారు. 8 రకాల సామగ్రి స్వాదీనం రెండు ఎదురు కాల్పుల సందర్భంగా మావోయిస్టులకు చెందిన 8 రకాల సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అమిత్‌బర్ధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్, అమ్యూనిషన్, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలు, కిండల్ ట్యాబ్, మావోయిస్టు సాహిత్యం, దుస్తులు, ఔషధాలు, సిరింజీలు, కిట్‌బ్యాగులు, టార్పాలిన్, వండిన భోజనం, ఇతర లాజిస్టిక్స్‌ను మావోయిస్టులు వదిలిపెట్టి పారిపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల జాడపై సమాచారం ఉంటే ప్రజలు తమకు తెలియజేయాలని కోరారు. -
గుత్తి: రాయలసీమ ఎక్స్‌ప్రెస్ భారీ దొంగతనం.. 30 తులాల బంగారం..
సాక్షి, అనంతపురం: నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (Rayalaseema Express)లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఐదుగురు దుండగులు అర్ధరాత్రి రైలులోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు.వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గుత్తి వద్ద రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. దాదాపు 30 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. దీనిపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపిన సమయంలోనే దుండగులు చోరీకి పాల్పడ్డారు. రైలులోని 10 బోగీల్లో దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
గోరంట్ల మాధవ్‌కు ఊరట.. బెయిల్ మంజూరు
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఊరట లభించింది. మాధవ్‌తో పాటు ఆయన అనుచరులకు గుంటూరు కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి 20 వేలుతో కూడిన పూచీకత్తు పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే.. ఐటీడీపీ కార్యకర్త అయిన చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నించారంటూ నగరంపాలెం పోలీసులు మాధవ్‌ను, ఆయన అనుచరులు ఐదుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తి రిమాండ్ విధించగా తొలుత రాజమండ్రి జైలుకు తరలించారు. అక్కడి ఆయనకు బెయిల్ లభించలేదు. తాజాగా ఆయన మరో పిటిషన్ వేయగా.. బెయిల్ మంజూరు అయ్యింది. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
అనకాపల్లి జిల్లా: జిల్లాలోని దేవరాపల్లి రిసార్ట్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నడింపల్లి సత్యనారాయణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు విశాఖ సీతమ్మధారకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. గత కొంతకాలంగా కుటుంబ సభ్యులు దూరంగా ఉన్న సత్యనారాయణ.. బకాయిలు ఉన్న వారికి బకాయిలు తీర్చకపోవడం వలన ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో వెల్లడించారు. తన ఆత్మహత్యకు సంబంధించి 12 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
తిరుపతిలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
తిరుపతి, సాక్షి: జిల్లాలో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. పాకాల మండలం తోటపల్లి దగ్గర ఓ కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న కంటైనర్ లారీని కారు వెనకనుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. -
విషాదం.. జర్మనీలో ప్రకాశం జిల్లా విద్యార్థిని మృతి
సాక్షి, గిద్దలూరు రూరల్: ఉన్నత చదువుల నిమిత్తం జర్మనీకి వెళ్లిన ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం కంచిపల్లె గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని అనారోగ్యంతో ఈనెల 21న మృతి చెందింది. ఆమె భౌతికకాయాన్ని సోమవారం గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.వివరాల ప్రకారం.. కంచిపల్లె గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు షేక్ మహబూబ్ బాషా కుమార్తె రెహనాబేగం (28) జర్మనీలోని హాల్ పట్టణంలో పోస్టు గాడ్యుయేషన్ పూర్తి చేసింది. బయో మెడికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసేందుకు 2022లో జర్మనీకి వెళ్లింది. గతేడాది నుంచి ఆమె బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ అక్కడే తుదిశ్వాస విడిచింది. మహబూబ్‌బాషాకు ఇద్దరు కుమార్తెలు కాగా రెహనాబేగం పెద్ద కూతురు. మృతదేహం ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది. సోమవారం కంచిపల్లె గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. -
రూ.1,000 కోట్లు హాంఫట్
మాటలతో మైమరపిస్తున్నారు.. ఆకాశాన్ని తెచ్చి అరచేతిలో పెడతామని ఆశలు కల్పిస్తున్నారు.. కో అంటే కోట్లు అలా వచ్చి పడతాయని నమ్మబలుకుతున్నారు. వందకి వెయ్యి, లక్షకి పది లక్షలు అంటూ ఆశల గాలం వేస్తున్నారు. ఇలా నరసరావుపేట కేంద్రంగా ఆర్థిక నేరగాళ్లు ప్రజలను నిండా ముంచేస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటి వరకు ఏకంగా సుమారు రూ.1,000 కోట్ల వరకు ప్రజలకు కుచ్చు టోపీ పెట్టారు. అత్యాశను ఆయుధంగా చేసుకుని సొమ్మంతా లాగేసుకున్నారు. రూ.వెయ్యి కోట్లకుపైగా స్కాములు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో మోసగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. సాక్షి, నరసరావుపేట/ నరసరావుపేట టౌన్: రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అడ్డాగా మారుతోంది. సాయి సాధన చిట్‌ఫండ్ స్కామ్, యానిమేషన్ పేరిట వందల కోట్ల రూపాయల వసూలు చేసిన ఘరానా మోసం ఇప్పటికే వెలుగుచూశాయి. ఈ రెండు స్కాంలలో మోసపోయిన బాధితులు నరసరావుపేటలోనే అధికంగా ఉన్నారు. కొత్తగా మరో రెండు గొలుసుకట్టు సంస్థలు ప్రజలను నిండా ముంచేస్తుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక నేరగాళ్లు అనేక మార్గాల్లో మోసాలకు తెగబడుతున్నారు. నరసరావుపేట కేంద్రంగా జరిగిన సాయిసాధన చిట్‌ఫండ్ స్కాం నాలుగు నెలల క్రితం వెలుగు చూసింది. అదే విధంగా యూపిక్స్ యానిమేషన్ స్కాం ఏడు నెలల నుంచి పెట్టుబడిదారులకు డబ్బులు ఇవ్వకుండా బోర్డు తిప్పేసింది. డబ్బులు ఇస్తానని నిర్వాహకుడు కొన్ని నెలలుగా మభ్యపెడుతూ వచ్చి, చివరకు పరారయ్యాడు. న్యాయం చేయాలంటూ ఐదు రోజులుగా బాధితులు అధికారులను వేడుకొంటున్నారు. ఈ రెండు వ్యవహారాల్లో సుమారు రూ.800 కోట్లు పెట్టుబడులు పెట్టి నరసరావుపేట వాసులు నిండా మునిగారు. తాజాగా మరో రెండు గొలుసుకట్టు ఆర్థిక మోసాలు వెలుగులోకి రావడం కలవరపాటుకు గురిచేస్తోంది. వీటిలో నరసరావుపేటవాసులు మరో రూ.200 కోట్ల దాకా పెట్టుబడులుపెట్టినట్టు తెలుస్తోంది. క్రిప్టో పేరుతో కొట్టేశారు! మరోవైపు క్రిప్టో కరెన్సీ రూపంలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ మరో సంస్థ నరసరావుపేటలో భారీగా పెట్టుబడులు ఆకర్షించింది. వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. తీరా పెట్టుబడులు పెట్టాక.. ఈ సంస్థలో పెట్టిన కరెన్సీ విలువ అమాంతం పతనమైందని, ఇప్పడు విత్‌డ్రా చేసుకోవడం మంచిది కాదంటూ చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో మార్కెట్లోకి మరో ఆన్లైన్ కరెన్సీ తెరపైకి వచ్చి కొత్తగా నగదు వసూలు చేస్తున్నారు. మే 21న అంతర్జాతీయ ఎక్సే్ఛంజ్‌లో లిస్ట్ అవుతోందంటూ చెప్పుకొస్తున్నారు. ఏమాత్రం గ్యారెంటీ లేని క్రిప్టో కరెన్సీలో రూ.కోట్లు పెట్టుబడి పెట్టి వాటిని వెనక్కి తెచ్చుకోలేక పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 25 రోజులుగా విత్‌డ్రా నిలిపివేత.. గొలుసుకట్టు ఆర్థిక సంస్థకు సంబంధించి 25 రోజులుగా నగదు ఉపసంహరణ నిలిపివేశారు. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి రోజూ 1.8 శాతం వడ్డీ రూపంలో ఇస్తారని నమ్మబలికారు. మూడు నెలల్లో పెట్టుబడి డబుల్ అవుతుందని ఆశ చూపించారు. అడిగిన వెంటనే అసలు తిరిగి ఇచ్చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ పెట్టుబడులన్నీ అమెరికన్ డాలర్ల రూపంలో పెట్టాల్సి ఉండటంతో ఏజెంట్లే నగదును ఎక్స్చేంజ్ చేసి మరీ పెట్టుబడులు పెట్టించారు.దీనికోసం నరసరావుపేటలోని పలు ప్రముఖ రోడ్లలో ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసి ఏజెంట్ల ద్వారా భారీగా నగదుని పెట్టుబడులుగా పెట్టించారు. నగదు నిలిపివేయడంతో పెట్టుబడిదారులు కార్యాలయాల నిర్వహకులు, ఏజెంట్లపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే కంపెనీ షట్‌డౌన్ చేసిందని, మరో ప్లాట్‌ఫాంలో త్వరలో కార్యకలాపాలు కొనసాగుతాయని, మీ డబ్బుకు ఢోకాలేదంటూ చెప్పుకొస్తున్నారు. -
అఖిలను బలితీసుకున్నది.. బ్లాక్‌మెయిలే..!
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఫిబ్రవరిలో జరిగిన ఇంజినీరింగ్ విద్యార్థిని అఖిల (23) ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రేమజంటలు, మద్యం తాగేవారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలుచేసే పల్లపోతుల అనిల్‌కుమార్‌రెడ్డి అరాచకాలకు అఖిల బలైందని తాజాగా వెల్లడైంది. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడైన అనిల్‌కుమార్‌రెడ్డిని శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను మన్నూరు పోలీసుస్టేషన్లో ఆదివారం రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్‌హెగ్డే తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరుకు చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి కడప టౌన్, పాలకొండలు, ఔటర్‌రింగ్‌రోడ్డు, పులివెందుల టౌన్ ఔటర్ రింగ్ రోడ్, కదిరిరోడ్డులోని బట్రపల్లె మార్గాలలో ప్రేమ జంటలను, మద్యం తాగేవారిని టార్గెట్ చేసుకునేవాడు. పోలీసుశాఖకు చెందిన వాడినని చెప్పి.. వారి పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకునేవాడు. కేసు నమోదుకాకుండా చూడాలంటే డబ్బులివ్వాలని బెదిరించి వసూలు చేసేవాడు. కొందరివద్ద లాక్కునేవాడు. ఈ నేపథ్యంలో రిమ్స్ హాస్పిటల్ సమీపంలోని వాటర్‌ఫాల్ చూడటానికి వెళ్లిన అఖిల, ఆమె స్నేహితుల నుంచి వారి వివరాలను, డబ్బును తీసుకున్నాడు. అనంతరం అఖిల, ఆమె స్నేహితులకు ఫోన్‌చేసి బ్లాక్మెయిల్ చేయసాగాడు. దీంతో భయపడిన అఖిల రాజంపేటలోని ఒక హాస్టల్లో ఫిబ్రవరి 3న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విచారణలో అనిల్‌కుమార్‌రెడ్డి బ్లాక్‌మెయిలే దీనికి కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడిపై ఇప్పటికే గుత్తి పోలీసుస్టేషన్లో పొక్సో, అనంతపురం త్రీటౌన్ పీఎస్‌లో దొంగతనం, ప్రొద్దుటూరు రూరల్ పోలీసుస్టేషన్లో రేప్ అటెంప్ట్ కేసులున్నాయి. దొంగతనం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉంది. -
AP: కాంగ్రెస్ నేత దారుణ హత్య
అనంతపురం: జిల్లాలోని గుంతకల్లులో కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణహత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ నారాయణను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. కాంగ్రెస్ లక్ష్మీనారాయణ కారును టిప్పర్ తో ఢీకొట్టారు దుండగులు. ఆపై లక్ష్మీ నారాయణపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ కుమారుడు వినోద్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. -
Visakha: జంట హత్యల కేసులో ఏం జరిగింది..?
విశాఖ: నగరంలోని చోటు చేసుకున్న జంట హత్యల కేసు పోలీసులకు కాస్త తలనొప్పిగా మారింది. దోపీడీ దొంగలు పనై ఉంటుందని తొలుత భావించిన పోలీసులకు ఆ అనావాళ్లు ఏవీ కనిపించడం లేదు. హత్యకు గురైన యోగేంద్ర(66), లక్ష్మీ(58) ఇంట్లో ఎటువంటి చోరీ జరగలేదని గుర్తించారు పోలీసులు. వారికి సంబంధించిన బంగారం ఆభరణాల్లో కొన్నింటిని ఇంట్లోనే గుర్తించారు. అయితే పాత కక్ష్యల కారణంగానే హత్య చేశారని భావిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు గుర్తించారు.ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారు..ఈ జంట హత్యల కేసులో దుండగులు ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా.. అత్యంత పకడ్బందీగా నేరానికి పాల్పడటంతో కేసు ఛేదన పోలీసులకు సవాల్‌గా మారింది. ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి కేసు దర్యాప్తును అన్ని కోణాల్లోనూ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. హత్యకు గురైన యోగేంద్రబాబు, ఆయన భార్య లక్ష్మి సుమారు 40 ఏళ్లుగా గాజువాకకు సమీపంలోని రాజీవ్‌నగర్ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారుయోగేంద్రబాబు నావల్ డాక్‌యార్డ్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. స్థానిక గ్లోరియా(ఎయిడెడ్) పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైర్ అయిన లక్ష్మి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వారికి ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదని స్థానికులు చెబుతున్నారు. వారి ఇద్దరు పిల్లలు శృతి, సుజన్ వివాహాలు చేసుకుని అమెరికాలో స్థిరపడటంతో.. ఇంట్లో వీరిద్దరు మాత్రమే ఉంటున్నారు. ఎవరితోనూ గొడవలు లేని వీరిని ఇంత దారుణంగా ఎవరు, ఎందుకు హత్య చేశారన్నది అంతుపట్టని ప్రశ్నగా మారింది.హత్య కోసం అదను చూసుకున్నారా?హత్యకు గురైన దంపతులు గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లు సమాచారం. పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న దాని ప్రకారం గురువారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఈ హత్య జరిగి ఉండవచ్చు. అదే సమయంలో రాజీవ్‌నగర్‌లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుండగులు తమ పని కానిచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. పాత కక్ష్యల నేపథ్యంలో అదను చూసుకుని కాపు కాసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇంటికి బంధువులు వస్తే కానీ తెలియలేదు..శుక్రవారం రాత్రి వరకు ఈ దారుణం వెలుగులోకి రాలేదు. మృతుల బంధువుల కుమార్తె వారిని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి తాళం వేసి ఉండటం, లోపల ఫోన్ మోగుతుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి తలుపులు తెరవగా ఈ ఘోరం వెలుగుచూసింది. ఘటన జరిగిన సమయంలో పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వంటివి దర్యాప్తునకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. వారి పిల్లలు అమెరికా నుంచి వచ్చిన తర్వాతే ఇంట్లో ఏయే వస్తువులు, ఎంత నగదు, బంగారం పోయిందనే వివరాలు కచ్చితంగా తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. -
పాకిస్థాన్ నుంచి ఆపరేట్.. విశాఖలో లోన్ యాప్ ముఠా అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లోన్ యాప్.. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలను పోలీసులు గుర్తించారు.ఈ ముఠా లోన్ యాప్‌ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతోంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో సహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోన్ యాప్‌లో రూ. 2 వేల రూపాయలు అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నరేంద్ర భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. బంధువులకు పంపించారు. దీంతో అవమాన భారంతో పెళ్లయిన 40 రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.పాకిస్థాన్ కేంద్రంగా ఈ ముఠా నడుస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సుమారు భారత్ నుంచి 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు గుర్తించిన పోలీసులు.. 18 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్‌లు, రూ.60 లక్షల రూపాయల నగదును ఫ్రిజ్ చేశారు. -
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
కొన్ని క్షణాలకు ముందు పక్కనే భర్త.. ఆడుకుంటూ బిడ్డలు.. సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది.నీళ్లలో ఆడుకుంటున్న చిన్నారులు మునిగిపోతుండగా కాపాడేందుకు ప్రయతి్నంచిన భర్త కళ్ల ముందు కడతేరిపోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. సరదాలతో నిండిన ఆ కుటుంబంలో ఇప్పుడు ఆమె ఒక్కతే మిగిలింది. ఇక ఒంటరిగానే బతకాలి. చిన్నారులు దేవుడితో సమానం అంటారు. ఆ దేవునికి అభం శుభం తెలియని పసిబిడ్డలపై జాలి కూడా కలగలేదేమో. వారితోపాటు తండ్రిని తీసుకెళ్లిపోయిన విషాద ఘటన మాటల్లో చెప్పలేనిది. బిడ్డల్లారా అప్పుడే నూరేళ్లు నిండాయా..దేవుడా ఏమిటీ ఘోరం అంటూ స్థానికుల కంటతడి పెట్టించిన విషాదకర ఘటన ఇది.ములకలచెరువు: బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్తున్న తల్లిని చూసి అమ్మా మేము వస్తామంటూ ఇద్దరు పిల్లలు వెంట వెళ్లారు. వీళ్లతో పాటు పొరుగింటి చిన్నారి కూడా వెళ్లింది. వీరు ముగ్గురు చెరువు నీటిలో ఆడుకుంటూ మునిగిపోతుంటే చూసిన తండ్రి కాపాడేందుకు నీళ్లలోకి దిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలోని పెద్దచెరువులో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే... జగనన్న కాలనీలో ఈశ్వరమ్మ(34), మల్లే‹Ù(38) నివాసం ఉంటున్నారు. వీరికి లావణ్య(12) నందకిషోర్(09) సంతానం. వీరి ఇంటి పక్కనే నందిత(11) అనే బాలిక ఉంటోంది. వీరు ముగ్గురు సమీపంలోని పెద్దచెరువు వద్దకు వెళ్లారు. బట్టలు ఉతుక్కుంటున్న ఈశ్వరమ్మ, మల్లే‹Ùలు పిల్లలు ఆడుకుంటున్నారని వారి పనిలో నిమగ్నమయ్యారు. చెరువు కుంటలో ఆడుకుంటూ పిల్లలు మునిగిపోయారు. వీరి అరుపులు వినిపించకపోవడంతో పిల్లల కోసం మల్లేష్ కుంటలోకి దూకాడు.వారిని కాపాడే ప్రయత్నంలో అతను కూడా నీటిలో మునిగిపోయాడు. ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో ములకలచెరువులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్లేదుటే పిల్లలు, భర్త మునిగి చనిపోతుంటే వారిని కాపాడేవారి కోసం ఈశ్వరమ్మ గట్టిగా కేకలు వేసింది.అయితే సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో పక్కనే ఉన్న రాజీవ్నగర్లోకి పరుగెత్తుకెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వెంటనే స్థానికులు చెరువు వద్దకు పరుగుతీసి కాపాడేందుకు ప్రయతి్నంచారు. అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. ఒంటరిగా మిగిలి... ఈశ్వరమ్మ, మల్లేష్ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి పిల్లలు లావణ్య ఆరోతరగతి, నందకిషోర్ ఐదోతరగతి చదువుతున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లే పిల్లలు సెలవులు కావడంతో బట్టలు ఉతికేందుకు వెళ్లిన తల్లి వెంట వచ్చారు. చెరువులో నీటిని చూసి మురిసిపోయిన చిన్నారులు ఆడుకుంటూ మడుగులో పడి ఊపిరాడక చనిపోయారు. కాపాడేందుకు వెళ్లిన మల్లేష్ సైతం మునిగి చనిపోయాడు. భర్త పిల్లలు దూరం కావడంతో ఈశ్వరమ్మ ఒంటరిగా మిగిలిపోయింది. కళ్లెదుటే భర్త పిల్లలు చనిపోవడంతో అమె బోరున విలపించడం చూసి చూపరులు కంటతడిపెట్టారు.తోడుగా వెళ్లి... జగనన్న కాలనీలో ఉంటున్న మల్లే‹Ù, ఈశ్వరమ్మ ఇంటి పక్కనే మంజుల, వెంకటరమణలు ఉంటున్నారు. వీరికి నందిత అనే కుమార్తె ఉంది. ఇరుగు పొరుగు కావడంతో సఖ్యతతో ఉండేవారు.ముగ్గురు చిన్నారులు కలిసి ఆడుకునేవారు. శనివారం లావణ్య, నందకిషోర్ ఈశ్వరమ్మ వెంట వెళుతుండగా నేను వస్తానని నందిత వెళ్లింది. చెరువులో ఆడుకుంటూ ముగ్గురు మునిగి చనిపోయారు. ఒక్కగానొక్క కుమారై మృతి చెందడంతో అయ్యో దేవుడా మేమేం పాపం చేశాం అంటూ మంజుల, వెంకటరమణలు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెల్లికి ఆస్తిలో వాటా.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి..
సాక్షి, విజయనగరం జిల్లా: పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ నడుపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం తల్లిదండ్రులనే కన్న కొడుకు హత్య చేశాడు. తల్లిదండ్రులను కన్నకొడుకు ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడు. అక్కడిక్కడే తండ్రి అప్పలనాయుడు (60), తల్లి జయమ్మ (58) మృతి చెందాడు. కుమారుడు పాండ్రంగి రాజాశేఖర్ (25) పరారీలో ఉన్నాడు.ఆస్తి తగాదా నేపథ్యంలోనే దాడి చేసినట్టు బంధువులు అంటున్నారు. తల్లిదండ్రులు ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో రాజశేఖర్ అనే వ్యక్తి వారిపై కక్ష పెంచుకున్నాడు. కొంతకాలంగా ఈ వివాదం నడుస్తోంది. కుమార్తెకు ఇచ్చిన భూమిని చదును చేస్తుండగా తనను అడ్డుకోవడంతో తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగిన రాజశేఖర్.. అనంతరం వారిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాడు. పూసపాటిరేగ మండలంలో జరిగిన అమానవీయ ఘటనతో మృతుల బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.