breaking news
-
క్షుద్ర పూజల కలకలం.. నర బలి ఇచ్చారా..?
తూర్పు గోదావరి: మండలంలోని వెదురుపాకలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కంచి వెంకటరమణ (38) పాల వ్యాపారం చేస్తు న్నాడు. శుక్రవారం రాత్రి పాలకేంద్రం వద్ద వ్యాపారం ముగిసిన అనంతరం ఇంటికి చేరుకోలేదు. రాత్రి 9 గంటల తర్వాత కూడా రాకపోవడంతో వెంకట రమణ కు భార్య విజయలక్ష్మి కాల్ చేయగా ఫోన్ కలవలేదని సమాచారం. ఇదిలా ఉండ గా శనివారం ఉదయం వెదురుపాక నుంచి ఆరికరేవుల వెళ్లే దారిలో వెంకట రమణ పంట బోదెలో పడి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి, ఇంటికి సమాచారం అందించారు. అతడి మృతదేహం కాలువలో పడి ఉండగా, మోటార్ సైకిల్ వంతెనపై ఉంది. అక్కడకు సమీపంలోనే క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉండటం స్థానికంగా అలజడి రేపింది. తలపై బలమైన గాయం వెంకట రమణ తలపై బలమైన గాయం ఉండటంతో అతడిని ఎవరైనా హత్య చేసి కాలువలో పడవేసి ఉంటారని భావిస్తున్నారు. క్షుద్రపూజల నేపథ్యంలో ఎవరైనా అతడిని హత్య చేశారా? లేక హత్య చేసి, కేసును తప్పుదోవ పట్టించడానికి క్షుద్ర పూజలు చేసినట్లు సృష్టించారా అనేది మిస్టరీగా మారింది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై జి.నరేష్, ఏఎస్సై పి.వెంకటేశ్వరరావులు సిబ్బందితో సంఘటన స్థలాని కి చేరుకుని విచారణ చేపట్టారు. రామచంద్రపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, మండపేట రూరల్ సీఐ కె.శ్రీధర్ కుమార్ కూడా అక్కడకు చేరుకున్నారు. వెంకట రమణకు ఎవరితోనైనా పాత కక్షలున్నాయా, వివాహేతర సంబంధం వంటి కారణాలు, రాత్రి షాపు మూసేసిన తర్వాత ఎక్కడికి వెళ్లాడు, అతడి వెంట ఎవరున్నారు, ఈ హత్యలో ఎవరి ప్రమేయం ఉండి ఉంటుంది, హత్యకు అసలు కారణాలేమై ఉంటాయనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. వెంకట రమణకు భార్య విజయలక్షి్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శుక్రవారం రాత్రి వరకూ అందరితో మాట్లాడిన అతడు ఉదయానికి విగతజీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తాము ఎలా జీవించాలని కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సంఘటనపై భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. -
Oct 22nd 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand & AP Political Updates చంద్రబాబు లేఖపై రాజమండ్రి జైలు అధికారుల ట్విస్ట్ చంద్రబాబు పేరుతో విడుదలైన లేఖ జైలు నుండి రాలేదు ఆ లేఖతో రాజమండ్రి జైలుకు సంబంధం లేదని వెల్లడి జైలు నుండి ఏ ముద్దాయి అయినా తన సంతకంతో లేఖ విడుదల చేయ్యాలంటే ముందుగా మాకు తెలియజేయాలి జైలర్ పరిశీలించి, ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది - జైలర్ సంతకం, స్టాంప్ వేసి కోర్టులకు లేదా ప్రభుత్వ అధికారులకు, కుటుంబ సభ్యులకు ఇస్తారు చంద్రబాబు పేరుతో విడుదలైన ముద్రణ కరపత్రం జైలు నుండి జారీ చెయ్యలేదు ఆ లేఖతో రాజమండ్రి జైలుకు సంబంధం లేదు రేపు రాజమండ్రిలో జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీ మధ్యాహ్నం ఒంటిగంటకు రాజమండ్రి చేరుకోనున్న పవన్ ఇరు పార్టీలు పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున మధ్యాహ్నం 3 గంటలకు మంజీరా హోటల్లో 7:30 PM, అక్టోబర్ 22, 2023 రేపు రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో పవన్, లోకేష్ ► రాజమండ్రి జైలుకు మంగళవారం దసరా సెలవు ప్రకటించిన అధికారులు ► రేపు చంద్రబాబుతో పవన్, లోకేష్ ములాఖత్ ఉండే అవకాశం ► రేపు మ.2గంటలకు పవన్, లోకేష్ ఉమ్మడి సమావేశం ► అనంతరం చంద్రబాబును కలవనున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ► ఎన్ని సీట్లలో ఎవరు పోటీ చేయాలన్నదానిపై టిడిపి, జనసేన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ► దసరా సెలవుల కారణంగా వచ్చేవారం కోర్టులకు సెలవులు ► జైల్లోనే దసరా పండుగ జరుపుకోనున్న చంద్రబాబు 4:30 PM, అక్టోబర్ 22, 2023 లోకేష్ వీపరీత పోకడలు : YSRCP ► రోజుకో పిలుపుతో నవ్వులపాలవుతోన్న లోకేష్ ► దసరా రోజు రావణాసుర దహనం తరహాలో కాగితాలు కాల్చాలని పిలుపు ► ఇప్పటికే పళ్లెం-గంట, సైరన్లు, హారన్లు, కొవ్వొత్తులు అంటూ కామెడీ నిరసనలు ► జనం పట్టించుకోకపోవడంతో మరిన్ని ప్రయోగాలు ► తప్పు చేయలేదని జనం చెవిలో పూలు పెట్టేకంటే.. కోర్టు ముందు వాదించొచ్చుగా? ► 17a సవరణ అంటూ వాదనలు వినిపించేకంటే.. మేం తప్పు చేయలేమని ధైర్యంగా ఎందుకు చెప్పడం లేదు? ► ఇన్నాళ్లు ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లకు మీరిచ్చిన సలహాలు ఇవేనా? ► తప్పు చేసిన వాళ్లు అరెస్ట్ చేసిన తీరును మాత్రం తప్పుబడుతున్నారా? ► ఇంతకంటే మీ దగ్గర కేసు నుంచి బయటపడే మరో మార్గం లేదా? ► మీరు చేసిన తప్పులు ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? ► నంగనాచి కబుర్లు, పిచ్చి ప్రదర్శనలు చేస్తే సానుభూతి కాదు కదా.. ఉన్న 23 సీట్లు కూడా ఊడిపోతాయని మీకు అర్థం కావడం లేదా? 4:00 PM, అక్టోబర్ 22, 2023 జైల్లో ఉన్నా.. ఆగని చంద్రబాబు సానుభూతి యత్నాలు ► తెలుగు ప్రజలకు జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ ► నేను జైలులో లేను.... ప్రజల హృదయాల్లో ఉన్నానంటూ మభ్యపెట్టే ప్రయత్నం ► ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరంటూ వ్యాఖ్యలు ► తాను ఇన్నాళ్లు చేసిన తప్పుల గురించి లేఖలో ప్రస్తావించలేదేందుకు? ► విలువలు, విశ్వసనీయత అని చెప్పిన చంద్రబాబుకు తాను చేసిన తప్పులు కనిపించలేదేందుకు? ► 45ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా నీతిగా బతికారా? ► పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్నది వాస్తవం కాదా? ► పార్టీని, ప్రభుత్వాన్ని లాక్కుని గెంటేశారన్నది నిజం కాదా? ► అధికారంలో ఉన్న 14 ఏళ్లు తన వాళ్ల మేళ్ల కోసం ప్రయత్నించింది నిజం కాదా? ► మన వాళ్లు బ్రీఫ్డ్ అంటూ ఓటుకు కోట్లు గుమ్మరించలేదా? ► రాష్ట్ర ప్రగతి కంటే తన వాళ్ల బాగే బెటరని చంద్రబాబు నమ్మలేదా? ► స్కిల్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేవలం బయటపడ్డ నేరాలే, మిగతా వాటి సంగతేంటీ? ► ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని గోబెల్స్ ప్రచారంతో ప్రజల కళ్లకు గంతలు కట్టలేదా? ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులను సంపాదించింది ఎట్లా? ► కొడుకు స్టాన్ఫోర్డ్ విద్య ఖర్చు కట్టిందెవరో ప్రజలకు చెప్పరా? ► జూబ్లీహిల్స్‌లో తన ఇంటిని కట్టిందెవరో చంద్రబాబు ప్రజలకు చెప్పగలరా? ► ముందు మీ నిజాయతీని మీరు ప్రశ్నించుకోండి.. తర్వాత ప్రజలకు నీతులు చెప్పండి: YSRCP 1:30 PM, అక్టోబర్ 22, 2023 అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ పెద్దలు, వారి మనుష్యులు ♦నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) 12:00 PM, అక్టోబర్ 22, 2023 తప్పు చేసింది కాక.. మళ్లీ సానుభూతి రాజకీయాలా? : మంత్రి అంబటి ► స్కిల్ స్కాంలో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారు ► కోర్టు కూడా ఆధారాలను నమ్మింది కాబట్టే రిమాండ్ కు పంపింది ► సీఐడీ న్యాయవాదులపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ► నిజం గెలవాలి అంటూ భువనేశ్వరి పొలిటికల్ డ్రామా మొదలు పెడుతున్నారు ► లోకేశ్ తలాతోకా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు ► సింపతీ కోసమే భువనేశ్వరి యాత్రకు సిద్ధమవుతున్నారు ► లోకేశ్ టీడీపీని బతికించడానికి పనికి రాడు ► రాజకీయాలను వ్యాపారం చేసిన వ్యక్తి చంద్రబాబు ► తప్పు చేసిన వారెవరైనా శిక్ష అనుభవించాల్సిందే ► దేశంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబుకు ఎవ్వరూ మద్ధతుగా లేరు ► పవన్ తప్ప చంద్రబాబును చూసేందుకు ఎవరైనా వచ్చారా? ► టీడీపీతో ఉన్న ఒప్పందంతో పవన్ వచ్చాడు ► నిజం గెలుస్తుంది కాబట్టే దోషులు జైలుకు వెళుతున్నారు ► లోకేశ్ ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మరు ► పవన్ కు ఏ విషయంపైనా అవగాహన లేదు ► విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తప్పా? ► వ్యవస్థలను మేనేజ్ చేసిన ఘనుడు చంద్రబాబు 11:40 AM, అక్టోబర్ 22, 2023 బాలకృష్ణను ఎందుకు దూరం పెట్టారు? ► ఉన్నఫళాన ఏపీ నుంచి బాలకృష్ణను గెంటేసిన చంద్రబాబు ► ఏపీలో ఉండొద్దు, తెలంగాణకు పరిమితం కావాలని బాలకృష్ణకు ఆదేశాలు ► తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ప్రచారం చేయాలని సూచనలు ► బావ చంద్రబాబు ఆదేశాలపై బాలకృష్ణ మనస్తాపం ► ఇంకెన్నాళ్లు అల్లుడి పేరు చెప్పి తనను దూరం పెడతారని ఆవేదన ► అసలు పార్టీ పెట్టిందే తండ్రి ఎన్టీఆర్, అయినా పెత్తనమంతా చంద్రబాబు చేతిలోనే.! ► రాజకీయాలు పక్కనబెట్టి సినిమాలు, సినీ ఫంక్షన్లతో బాలయ్య బిజీ బిజీ ► బాలకృష్ణ ఏపీ నుంచి దూరం జరిగాక.. నందమూరి కుటుంబంలోనూ ఇబ్బందికరపరిస్థితులు ► ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా బ్రాహ్మణి దగ్గర కనిపించని సోదరుడు మోక్షజ్ఞ ► తొలుత బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి యాత్ర చేస్తుందని ఘనంగా ఎల్లోమీడియా ప్రచారం ► అసలు పార్టీ సారథ్యమే బ్రాహ్మణి చేపడుతుందని బ్యానర్ వార్తలు రాసిన ఎల్లో మీడియా ► తెర వెనక ఏం జరిగిందో కానీ.. అటు బాలకృష్ణ, ఇటు బ్రాహ్మణి పార్టీ కార్యక్రమాలకు దూరం ► కేవలం క్యాండిల్ ర్యాలీ, పళ్లెం-గంట నిరసనలకు పరిమితమైన బ్రాహ్మణి 11:10 AM, అక్టోబర్ 22, 2023 స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారు: మంత్రి అంబటి ► కోర్టు కూడా ఆధారాలను నమ్మింది.. కాబట్టే రిమాండ్‌కు పంపింది ► సీఐడీ న్యాయవాదులపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ► నిజం గెలవాలి అంటూ భూవనేశ్వరి పొలిటికల్ డ్రామా మొదలుపెడుతున్నారు ► లోకేష్ తలాతోకా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు 9:15 AM, అక్టోబర్ 22, 2023 బాబు పిటిషన్లకు వెకేషన్ ఎఫెక్ట్ ► ఇవ్వాళ్టి నుంచి (అక్టోబర్ 22) అక్టోబర్ 29వరకు సుప్రీంకోర్టుకి సెలవులు ► విజయదశమి పర్వదినం కారణంగా వారం పాటు న్యాయస్థానానికి సెలవులు ► సెలవుల తర్వాత కోర్టు ముందుకు విచారణకు రానున్న బాబు పిటిషన్లు 9:10 AM, అక్టోబర్ 22, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు గురించి పది పాయింట్లు.. తండ్రీ కొడుకులు ఏం చేశారంటే.? 1. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2016 డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రారంభించారు. రూ.149కే కేబుల్ ప్రసారాలు, 200 చానళ్లతో టీవీ, ఫోన్ సౌకర్యం ఇస్తామని ప్రకటించారు. 2. ఫైబర్‌నెట్ ప్రాజెక్టును బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు. రూ.333 కోట్ల బిడ్డింగ్ ముగియటానికి ఒక్క రోజు ముందు టెరాసాఫ్ట్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన APTS వీసీ సుందర్‌ను బదిలీ చేశారు. టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగించారు. 3. టెరాసాఫ్ట్ సంస్థకు 14 ఏళ్లు డైరెక్టర్ ఎవరంటే హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసిన దేవినేని సీతారామయ్య 4. బహిరంగ మార్కెట్లో అత్యంత నాణ్యమైన సెట్‌టాప్ బాక్స్ రూ.2,200కే దొరుకుతుండగా చంద్రబాబు సర్కారు మాత్రం రూ.4,400 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలో ఉత్పత్తి చేసినట్లు వేమూరి అంగీకరించారు. 5. APSFL నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల చేశారు. అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి ఇచ్చారు. ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటైంది. నెట్వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బును బదిలీ చేశారు. ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ తదితరులకు వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీలన్నింటి చిరునామా, టెరా సాఫ్ట్వేర్ అడ్రస్ ఒక్కటే. 6. ఈ డబ్బంతా పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు రూటు అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇన్కమ్ టాక్స్ కూడా శ్రీనివాస్‌కు, చంద్రబాబుకు నోటీసులిచ్చింది. 7. హెరిటేజ్‌తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణప్రసాద్కి టెరా సాఫ్ట్‌తో అనుబంధం ఉంది. ఈవీఎంల దొంగతనం కేసు నమోదైన వ్యక్తికి చెందిన సంస్థకు ఈ ప్రాజెక్టును ఇచ్చారు. టెండర్ల పర్యవేక్షణ కమిటీలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. ఆయనే టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా ఉంటూ తన సొంత సంస్థ టెరా సాఫ్ట్‌కు పనులు ఇచ్చేసుకున్నారు. 8. ఐదేళ్లూ చంద్రబాబు వద్దే పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఉండింది. ఆ శాఖ పరిధిలోనిదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్. నిబంధనల మేరకు సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి మాత్రమే ఆ శాఖలోని ఫైళ్లపై సంతకం చేయాలి. ఇతర మంత్రులు సంతకం చేయకూడదు. 9. లోకేశ్ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్‌ను 2017 సెప్టెంబర్ 14న APSFLకు సలహాదారుగా నియమించారు. అప్పటి నుంచి టెండర్లలో గోల్ మాల్ పెద్ద ఎత్తున జరిగినట్టు తేలింది. లోకేశ్ వద్ద ఉన్న శాఖలకు, APSFLకు సంబంధం లేదు. అయినా తన తండ్రి శాఖలోని ఫైల్ తెప్పించుకున్న లోకేశ్.. 2017 నవంబర్ 12న బీబీఎన్‌ఎల్‌తో ఎంవోయూ ఫైల్‌పై సంతకం చేశారు 10. కేంద్రం అనుమతి లేకుండా అంచనా వ్యయం రూ.500 కోట్లకుపైగా పెంచేసి వేమూరి సంస్థకు ఖరారు చేశారు. BBNL మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. 8:55 AM, అక్టోబర్ 22, 2023 కోర్టులపై వక్రభాష్యాలకు సమాధానాలు ఇవిగో ► కోర్టులకు ఎదురవుతున్న సవాళ్లకు ఇటీవల ఇండియా టుడే కాంక్లేవ్‌లో సూటిగా, స్పష్టంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ సమాధానాలు ప్రశ్న : కోర్టుల స్వతంత్రత గురించి మీరేమంటారు? తీర్పు ఇచ్చే సమయంలో మీపై ఒత్తిడులుంటాయా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ : ► ఒక జడ్జిగా నాకు 23ఏళ్లుగా అనుభవం ఉంది. ► ఒక కేసులో ఇలా ఉండండి, ఇలా తీర్పు చెప్పండి అని ఏ ఒక్కరు మాపై ఒత్తిడి తీసుకురారు, తీసుకురాలేదు. ► ప్రతీ రోజూ సుప్రీంకోర్టులో ఉదయాన్నే బెంచ్ మీదకు వెళ్లకముందు జడ్జిలందరూ కలిసి కాఫీ తాగుతాం. ► కానీ ఏ ఒక్కరు ఇంకొకరి కేసు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించబోరు ► ఇక హైకోర్టులోనయితే ఈ సున్నితమైన పరిస్థితి మరింత ఎక్కువ. ► కొన్ని సార్లు సింగిల్ బెంచ్‌లో జడ్జి ఇచ్చిన తీర్పును అదే హైకోర్టులోని మరో ఇద్దరు జడ్జిలు సమీక్షించాల్సి ఉంటుంది. ► ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోరు. ► ఎవరి కేసునయితే నేను సమీక్షించబోతున్నానో.. అదే జడ్జితో కలిసి భోజనం చేయవలిసిన పరిస్థితి ఉంటుంది. ► భోజనం షేర్ చేసుకుంటాం. అయితే కేసులను మాత్రం షేర్ చేసుకోం. ► అది మేం తీసుకున్న శిక్షణలో భాగం. ► అంతెందుకు మాపై ప్రభుత్వంలో ఉన్న ఏ వ్యవస్థ నుంచి ఒత్తిడి రాదు. ► ఇది నా ఒక్కరి గురించి చెప్పడం లేదు. మొత్తం దేశంలోని న్యాయవ్యవస్థ గురించి చెబుతున్నాను. 8:40 AM, అక్టోబర్ 22, 2023 యాత్రలకు బయల్దేరుతున్న భువనేశ్వరీ, లోకేష్ ముందు వీటికి సమాధానాలు చెబుతారా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్‌ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 8:40 AM, అక్టోబర్ 22, 2023 బలమైన ఆధారాలు vs పసలేని వాదనలు ► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబువి అత్యంత బలహీనమైన వాదనలంటున్న న్యాయకోవిదులు ► తనను అరెస్ట్ చేసిన విధానమే చంద్రబాబు చెప్పుకుంటున్న ఏకైక పాయింట్ ► ఎల్లోమీడియాలో చెప్పేదొకటి, కోర్టుల ముందు వాదించేది ఒకటి ► ప్రజలను నమ్మించడానికి తెలుగుదేశం, ఎల్లో మీడియా అబద్డాల ప్రచారం ► 17A కింద అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమంటూ గగ్గోలు ► తప్పు చేయలేదు అని కోర్టు ముందు బలంగా చెప్పుకోలేని దుస్థితి ► కోర్టుల ముందు తప్పనిసరి పరిస్థితుల్లో నిజాల ఒప్పుకోలు ► పీకల్లోతు ఆరోపణలు, ప్రతీ దాంట్లో బాబుకు వ్యతిరేకంగా ఆధారాలు ► ఏకంగా 13 చోట్ల స్వయంగా సంతకాలు చేసిన చంద్రబాబు ► ఈ కేసులో చంద్రబాబు తప్పించుకోవడం కష్టమంటున్న లాయర్లు 8:20 AM, అక్టోబర్ 22, 2023 బాబు జైలుకు వెళ్తే .! ► బాబు అరెస్ట్ అనగానే టిడిపి సానుభూతి గేమ్ లు ► బాబు అరెస్ట్ వల్ల నిజానికి ప్రభావం పడేది టిడిపి పైన : మంత్రి అంబటి "అవినీతి బాబు"ని అరెస్ట్ చేస్తే మరణించింది 154 మంది కాదు ! మీ తెలుగుదేశం పార్టీనే!@iTDP_Official@JaiTDP — Ambati Rambabu (@AmbatiRambabu) October 21, 2023 8:00 AM, అక్టోబర్ 22, 2023 జైల్లో బాబు కుశలం ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు క్షేమం ► హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సెంట్రల్ జైల్ అధికారులు ► అన్ని పరీక్షల్లో నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ► BP 130/80 ► పల్స్ 71/మినిట్ ► రెస్పిరేటరీ రేటు 13/మినిట్ ► SP ఓటు 97% ► ఫిజికల్ యాక్టివిటీ : గుడ్ ► లంగ్స్ క్లియర్ ► RBS 138 mg/dl 7:45 AM, అక్టోబర్ 22, 2023 జైల్లో బాబు @ 43వ రోజు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో 43వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ► నిలకడగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం ► యధావిధిగా చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల ► ఆందోళనలు నిలిపివేసి స్తబ్దంగా మారిపోయిన టిడిపి వర్గాలు ► రేపు రాజమండ్రిలో ఉమ్మడి కార్యాచరణ కోసం భేటీకానున్న లోకేష్ ,పవన్ కళ్యాణ్ ► భేటి అనంతరం ఉమ్మడి కార్యాచరణ విడుదల 7:15 AM, అక్టోబర్ 22, 2023 ఇదేందయ్యా ఇదీ.. ►చంద్రబాబు కోసం టీడీపీ నేతలు తిప్పలు మాములుగా లేవు ►సానుభూతి కోసం సినిమా రేంజ్లో ఎల్లో బ్యాచ్ ప్లాన్ ►టీడీపీ నేతల ప్లాన్ అట్టర్‌ప్లాప్ ►బాబు కోసం మరణించిన 150 మంది పేర్లు చెబుతారా ఎల్లో బ్యాచ్? అదేంటి వర్లా మీ నాయకుడు పోయాడా….? బతికుండగానే ఆయన్ను మీరు పోయాడని అంటున్నారంటే, ఏదో బలంగానే కోరుకుంటున్నట్టున్నారు, కొంపదీసి ఆయన సీటు కోసం పోటీ నా ఏంటీ? 🤭 ఇంతకీ ఆ అసువులు బాసిన 150 మంది పేర్లేమి? #JokerTDP pic.twitter.com/EOqWjG6HOb — YSR Congress Party (@YSRCParty) October 21, 2023 అన్ని పిటిషన్లు విచారణ వాయిదా! ►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న ►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న ►కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై విచారణ 26వ తేదీకి వాయిదా ►ములాఖత్‌ల పెంపు పిటిషన్‌పైనా సానుకూలంగా దక్కని ఏసీబీ కోర్టు తీర్పు ►స్కిల్ కేసులో ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్‌కు బెయిల్ పిటిషన్ ఇంతకీ తెలంగాణలో టీడీపీకి ఎంత సీను? ► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా ► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి తెలంగాణలో అంత సీను ఉందా? ► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం ► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 ) ► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714) ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు? ► మా తండ్రి చంద్రబాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో బీజేపీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► ఏ సర్వేలోనయినా తెలుగుదేశం ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా? -
హత‘విధీ’.. ఆనందాన్ని చిదిమేసింది
కారంపూడి: ప్రసవ వేదన పడుతున్న భార్యను ఆస్పత్రిలో చేర్చి.. ఆస్పత్రి ఖర్చులకోసం డబ్బు తీసుకుని బైక్‌పై వెళ్తున్న భర్త ప్రమాదవశాత్తూ బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. భార్యను తరలించిన అంబులెన్స్‌లోనే అతడిని కూడా అదే ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాలు విడిచాడు. అప్పటికే భార్య ప్రసవించగా.. పుట్టిన పాపను కూడా చూసుకోకుండా ఆ తండ్రి కన్ను మూయడంతో అక్కడి వారి హృదయాలు బరువెక్కాయి. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా కారంపూడి ఇందిరా నగర్ కాలనీ గనిగుంతలుకు చెందిన బత్తిన ఆనంద్ (33) భార్య రామాంజనికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో శుక్రవారం 108లో గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు రక్తం తక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె వెంట వాళ్ల అమ్మ, చిన్నమ్మ, ఆశా వర్కర్ ఏసమ్మ వెళ్లారు. భర్తను కూడా అంబులెన్స్ ఎక్కమంటే ఆస్పత్రి ఖర్చులకు డబ్బు తీసుకు వస్తానని ఆగిపోయాడు. శనివారం వేకువజామున డబ్బు తీసుకుని బైక్‌పై నర్సరావుపేట బయలుదేరాడు. మార్గమధ్యంలో జూలకల్లు అడ్డరోడ్డు వద్ద రోడ్డు పక్కన కంకర చిప్స్ ఉండటంతో బైక్ అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కాగా.. కొంతసేపటి వరకు ఎవరూ చూడకపోవడంతో చాలా రక్తం పోయింది. ఆ తరువాత ఓ వ్యక్తి గమనించి 108కు ఫోన్ చేయడంతో భార్యను ఆస్పత్రి తీసుకెళ్లిన అంబులెన్సే వచ్చి అతన్ని కూడా నర్సరావుపేటలో భార్య ఉన్న ఆస్పత్రికే తీసుకెళ్లింది. అప్పటికే రక్తం ఎక్కువగా పోవడంతో ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే ఆనంద్ మృతి చెందాడు. అదే ఆస్పత్రిలో ఉన్న భార్యకు సకాలంలో సరైన వైద్యం అందడంతో ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను కూడా చూసుకునే భాగ్యానికి నోచుకోని ఆనంద్ మృతి ఘటన బంధుమిత్రులను కలచి వేస్తోంది. ఇదిలా ఉంటే రామాంజనికి ఇది నాలుగో కాన్పు. ఇంతకుముందు ఇద్దరు అమ్మాయిలు.. ఒక అబ్బాయి ఉన్నారు. -
Oct 21st 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand & AP Political Updates తూర్పుగోదావరి జిల్లా. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై 9వరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సెంట్రల్ జైల్ అధికారులు నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం బీ పీ 130/80 పల్స్..71/మినిట్ రెస్పిరేటరీ రేటు...13/మినిట్ ఎస్ పీ ఓటు...97శాతం ఫిజికల్ యాక్టివిటీ... గుడ్ లంగ్స్... క్లియర్ ఆర్ బీ ఎస్..138 mg/dl 7:00 PM, అక్టోబర్ 21, 2023 ఇంతకీ.. చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడిందెవరు? ► తెలుగుదేశం మీటింగ్ లో లోకేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఎల్లో మీడియా ► నా తల్లికి సేవా కార్యక్రమాలు తప్ప.. రాజకీయాలు తెలియదు : లోకేష్ ► గవర్నర్‌ను కలిసేందుకు కూడా నా తల్లి వెళ్లలేదు : లోకేష్ ► ఇప్పుడు నా తల్లి, భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ విమర్శిస్తున్నారు : లోకేష్ ► నా తల్లి.. బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారని చెబుతున్నారు : లోకేష్ ► మరీ జైల్లో క్షేమంగా ఉన్న చంద్రబాబుపై సానుభూతి కోసం మీరేం ప్రచారం చేశారు? ► జైల్లో కేజీ బరువు పెరిగినా.. కొంపలు మునిగిపోతున్నాయంటూ ఎల్లో మీడియాలో వార్తలు రాయించింది ఎవరు? ► మా నాన్నకు స్టెరాయిడ్లు ఇస్తున్నారు.. ఆయన ఆరోగ్యం ఏమై పోవాలి అంటూ దొంగ ఏడ్పులు ఏడ్చింది ఎవరు? ► మా భర్త చంద్రబాబు కిడ్నీలకు ప్రమాదం ఉందని ప్రకటనలు చేసిన భువనేశ్వరీకి డైరెక్షన్ ఎక్కడిది? ► దోమలు, చన్నీళ్లు, ఏసీలు అంటూ లేనివన్ని ఎందుకు అంటగట్టారు? ► ఎప్పటినుంచో ఉన్న స్కిన్ ఎలర్జీని హఠాత్తుగా తెరపైకి ఎందుకు తెచ్చారు? ► ఎల్లో మీడియాలో తప్పుడు వార్తలు అచ్చేస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందనుకున్నారా? ► మీరు ప్రారంభించిన విష క్రీడ మీ వరకు వచ్చేసరికి మీకు బాధ కలిగిందా? ► ఇంకెన్నాళ్లు జనాల ముందు అసత్యాలు, అబద్దాలు వల్లె వేస్తారు? 6:50 PM, అక్టోబర్ 21, 2023 అయ్యా.. మీరు పాటిస్తున్న సిద్ధాంతమేంటీ? చెబుతున్న నీతులేంటీ? ► పబ్లిక్ మీటింగ్‌ల్లో దిగజారి బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా నిలిచిన పవన్ కళ్యాణ్ ► ఇటీవల జనసేన మీటింగ్‌లో చెప్పులు చూపించిన పవన్ కళ్యాణ్ ► తీవ్ర విమర్శలు రావడంతో కొత్త సిద్ధాంతం వల్లె వేస్తోన్న పవన్ ► అధికార ప్రతినిధులు జాగ్రత్తగా మాట్లాడాలి : పవన్ ► కులాలు, మతాల గురించి పరిమితులకు లోబడి మాట్లాడాలి : పవన్ ► రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి కానీ నోరు జారొద్దు : పవన్ ► అధికార ప్రతినిధుల కోసం వచ్చే నెలలో వర్క్ షాప్ ఏర్పాటు: పవన్ కల్యాణ్ 6:35 PM, అక్టోబర్ 21, 2023 ఓటుకు కోట్లు దొంగలు వాళ్లు ► తెలంగాణ భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ► కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి హరీష్ రావు ► ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి ఇప్పుడు దొంగ మాటలు చెబుతున్నారు ► బిజెపితో పోరాటం మా DNAలో ఉంది అని రాహుల్ గాంధీ అన్నారు. మరి రేవంత్ రెడ్డి DNAలో ఏముంది? ► రేవంత్ DNAలో టిడిపి ఉందా? కాంగ్రెస్ ఉందా? ► రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి DNA మ్యాచ్ కావడం లేదు ► ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి 6:14 PM, అక్టోబర్ 21, 2023 ఇంతకీ తెలంగాణలో టిడిపికి ఎంత సీను? ► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా ► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి తెలంగాణలో అంత సీను ఉందా? ► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం ► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 ) ► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714) ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు? ► మా తండ్రి చంద్రబాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో బీజేపీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► ఏ సర్వేలోనయినా తెలుగుదేశం ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా? 5:44 PM, అక్టోబర్ 21, 2023 మన పొత్తు ఎవరితో? జనసేనలో అనుమానాలు ► జనసేన అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్ భేటీ ► హాజరైన 21 మంది రాష్ట్ర అధికార ప్రతినిధులు ► అసలు జనసేన పార్టీ ఎవరితో పొత్తు అని పార్టీలో ప్రశ్నలు ► అధికారికంగా బీజేపీతో కొనసాగుతున్న ఒప్పందం ► రాజమండ్రి జైలు ముందు టిడిపితో పొత్తు అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ► ఇంతకీ జనసేన పొత్తు బీజేపీతోనా? టిడిపితోనా? ► ఒక వేళ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు మిగిలే సీట్లు ఎన్ని? ► అసలు జనసేన తరపున ఖర్చు పెట్టుకోవాలా లేదా అన్నదానిపై అభ్యర్థుల్లో సందేహాలు 5:20 PM, అక్టోబర్ 21, 2023 తెలంగాణలో బీజేపీతో, ఏపీలో సైకిల్ తో ► హైదరాబాద్ : బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో జనసేన ► జనసేనకు కేటాయించే స్థానాలపై బీజేపీలో దాదాపుగా స్పష్టత ► కూకట్ పల్లి, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, పాలేరు, ఇల్లందు, మధిర ► కొత్తగూడెం, అశ్వరావుపేట, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, కోదాడ కేటాయించే ఛాన్స్ ► ముందు 36 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ► 36 కాస్తా 12కు వస్తాయా అన్న అనుమానాలు ► పోటీ చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తెలంగాణలో ఎందుకు అడుగు పెట్టలేదని పార్టీలో ప్రశ్న 5:05 PM, అక్టోబర్ 21, 2023 రాజమండ్రికి బ్రేక్ ►రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు భువనేశ్వరి, బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ ►ములాఖత్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ కు కుటుంబ సభ్యులు ►నాలుగు రోజుల్లో చంద్రగిరికి వస్తానని చెప్పిన భువనేశ్వరీ 4:45 PM, అక్టోబర్ 21, 2023 ఎవరి భవిష్యత్తుకు గ్యారంటీ ? ► నవంబర్ 1 నుంచి లోకేష్ ‘భవిష్యత్ కు గ్యారెంటీ’ ► ఎవరూ పట్టించుకోకపోవడంతో గద్గద స్వరంతో లోకేష్ స్పీచ్‌లు ► నిన్నటిదాకా పీxxx అన్న లోకేష్ ఇప్పుడు సానుభూతి కోసం గేమ్‌లు ► ఎవరి భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేందుకు బస్సు యాత్రలు చేస్తున్నావు? ► ముందు నువ్వు ఎమ్మెల్యే కావడానికి గ్యారంటీ ఉందా? ► మీ పార్టీ పొత్తుల్లేకుండా సింగిల్‌గా పోటీ చేస్తుందన్న గ్యారంటీ ఉందా? ► ఎన్నికల ముందు ఘనంగా ప్రకటించే మ్యానిఫెస్టో మాయం చేయబోరన్న దానికి గ్యారంటీ ఉందా? ► ఇచ్చిన ఏ హామీలోనైనా నిలబడడానికి గ్యారంటీ ఉందా? ► హెరిటేజ్ కోసం ప్రభుత్వ డెయిరీలు మూసివేయబోమన్నదానికి గ్యారంటీ ఉందా? ► అసలు ప్రజల ముందుకెళ్లి నాకు ఇందుకోసం ఓటు వేయండని చెప్పే గ్యారంటీ ఉందా? ► ఏం ఉద్ధరించారని ఓటేయాలని మిమ్మల్ని అడిగితే పారిపోకుండా ఉంటారని గ్యారంటీ ఉందా? ► బయటపడ్డ అన్ని స్కాంల్లో తప్పు చేయలేదని కోర్టు ముందు చెప్పుకోలేని మీ తీరుకు ఏం గ్యారంటీ? ► మేనేజర్ తప్పు చేస్తే ఓనర్‌ను పట్టుకుంటారా అంటూ డొంక తిరుగుడు మాటలు చెప్పవని గ్యారంటీ ఏంటీ? ► మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అంటూ ఓటుకు కోట్లు గుమ్మరించి బేరాలు సాగించబోరన్నదానికి గ్యారంటీ ఉందా? 4:20 PM, అక్టోబర్ 21, 2023 రంగంలోకి భువనేశ్వరీ.. నిజంగా నిజమే చెబుతారా? ► చంద్రగిరి నుంచి ఈ నెల 25 నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి ► మహిళల్లో సానుభూతి కోసం భువనేశ్వరీని రంగంలోకి దించిన బాబు ► నిజమే.. నిజం గెలవాలి, భువనేశ్వరీ నిజం చెప్పాలంటున్న YSRCP ► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి ► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి ► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి ► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి ► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి ► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి ► రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని హెరిటేజ్ పేరిట ముందే ఏ రకంగా భూములు కొన్నారో నిజం చెప్పాలి ► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి ► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి ► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి 3:35PM, అక్టోబర్ 21, 2023 టీడీపీ, నారా లోకేష్‌లకు ఇక భవిష్యత్ లేదు: మంత్రి ఆదిమూలపు సురేష్ ►టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకుంటే 48 గంటల్లో విడిపిస్తా అని.లోకేష్ అన్నాడు ►వాళ్ళ నాన్న జైలుకి వెళ్లి ఇన్ని రోజులైనా ఎందుకు బెయిలు తేలేకపోయాడు ►పాపం పండిపోయి చంద్రబాబు జైలుకి వెళ్లారు ►యువగళం యాత్ర ఎందుకు లోకేష్ ఆపేశాడు ►ఏ యాత్ర చేసిన టీడీపీ, లోకేష్‌లకు భవిష్యత్ లేదని తేలిపోయింది 2:30PM, అక్టోబర్ 21, 2023 చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ ఫైర్ ►అవినీతి చేయడంలో చంద్రబాబు కాకలు తీరిన యోధుడు ► చంద్రబాబు రాష్ట్రాన్ని లూఠీ చేశారు.. అవినీతిని విశృంఖలం చేశారు ►చంద్రబాబు,లోకేష్ తోడు దొంగలు ►బాబు అవినీతి సామ్రాజ్యం...అక్రమాస్తుల మీద సీబీఐ విచారణ కోరే సత్తా ఉందా? ►బాబును అరెస్ట్ చేసి నంద్యాల నుంచి విజయవాడ తెస్తే ఒక్కడూ కూడా వెంట రాలేదు ►చంద్రబాబు అరెస్ట్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు ►చంద్రబాబు ఏనాడైనా ఎవరికైనా అండగా నిలిచారా? ►మీ పార్టీ పెత్తందారుల పార్టీ కాబట్టే ఎవ్వరూ మీకు మద్దతివ్వడం లేదు ►ఆస్తులపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా? ►చేతగాని చవట సన్నాసులందరూ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు ►పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు ►చంద్రబాబు నిజాయితీపరుడంటూ కబుర్లు చెబుతున్నారు ►చంద్రబాబు అందరివాడు కాదు ►మా వాడు అని ఆయన సామాజికవర్గం వారు చెప్పుకుంటున్నారు ►పెత్తందార్ల పక్షాన నిలబడి పేదలను విస్మరించినందునే చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదు ►గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయింది ►పెత్తందారుల పక్షాన పవన్ పాలేరులా మారాడు ►ఇంగ్లిష్ మీడియంపై పవన్ అర్థం లేని విమర్శలు చేస్తున్నారు ►సీఎం జగన్ పరిపాలన ఒక సువర్ణయుగంగా ఉందని ప్రజలే చెబుతున్నారు 1:00 PM, అక్టోబర్ 21, 2023 చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ ►ములాఖత్‌లో చంద్రబాబును కలిసిన కుటుంబసభ్యులు ►చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, రామకృష్ణ అక్టోబర్ 21, 2023, 11:57 AM న్యాయవ్యవస్థకు ఓ తలనొప్పిగా చంద్రబాబు సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి సూటి ప్రశ్నలు ►న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోట్లు వెదజల్లుతున్నారు ►పేరుమోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తున్నారు ►మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం ►ఇవన్నీ వింతే కదా? ►ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 50కు పైగా పిటిషన్లు వేశారు ►వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతున్నాయి ►ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వాళ్ళకే తెలియనంత గందరగోళం ►పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టులకు ఈయనో తలనొప్పిలా మారాడు ►న్యాయ వ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉంది ►మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్థం ఏమిటి పురందేశ్వరి గారు? ►వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం అన్యాయమా? అక్టోబర్ 21, 2023, 11:50 AM అన్ని పిటిషన్లు విచారణ వాయిదా! ►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న ►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న ►కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై విచారణ 26వ తేదీకి వాయిదా ►ములాఖత్‌ల పెంపు పిటిషన్‌పైనా సానుకూలంగా దక్కని ఏసీబీ కోర్టు తీర్పు ►స్కిల్ కేసులో ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్‌కు బెయిల్ పిటిషన్ అక్టోబర్ 21, 2023, 10:58 AM అసాంఘిక శక్తులకు గుణపాఠం నేర్పాలి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ వ్యాఖ్యలు ►నూజివీడు, అంగళ్ళు, పుంగనూరులో పోలీసు సోదరుల మీద ప్రతిపక్షాలు దాడులు చేశాయి. ►తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వని న్యాయస్థానాల మీద సైతం ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయి. ►ఇలాంటి అసాంఘిక శక్తులకు మనం గుణపాఠం నేర్పాలి. ►అప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుంది. నూజివీడు, అంగళ్ళు, పుంగనూరులో పోలీసు సోదరుల మీద ప్రతిపక్షాలు దాడులు చేశాయి. అంతేకాకుండా తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వని న్యాయస్థానాల మీద సైతం ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయి. ఇలాంటి అసాంఘిక శక్తులకు మనం గుణపాఠం నేర్పాలి. అప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుంది. - సీఎం వైయస్ జగన్… pic.twitter.com/OSizn9ZZR3 — YSR Congress Party (@YSRCParty) October 21, 2023 అక్టోబర్ 21, 2023, 10:40 AM టీడీపీ దృష్టిలో పవన్ వాడిపడేసే వస్తువు మంత్రి చెల్లుబోయిన వేణు కామెంట్స్ ►జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ►రాజకీయ విలువలకు పవన్ ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు? ►తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు దేనికి సంకేతం? ►పవన్‌ను టీడీపీ ఒక టూల్‌గా టీడీపీ వాడుకుంటోంది ►కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ ప్రయత్నం ►ముద్రగడను చంద్రబాబు తీవ్రక్షోభకు గురి చేశారు ►మరోసారి కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడానికే చంద్రబాబు ప్రయత్నం ►చంద్రబాబు మోసానికి కాపులు నష్టపోతారని పవన్ గ్రహించాలి ►చంద్రబాబు శకం ముగిసింది ►చంద్రబాబు చట్టాలకు అతీతుడనుకుంటున్నారు ►దేశంలోని చట్టాలు తనకు వర్తించవనే భ్రమలో బాబు ఉన్నారు ►18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబుకి నేడు బెయిల్ రావడం లేదు అక్టోబర్ 21, 2023, 08:35 AM ముందు స్కిల్.. ఆ తర్వాతే ఫైబర్‌నెట్ ►ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు ► స్కిల్‌డెవలప్‌మెంట్ కుంభకోణంలో క్వాష్ పిటిషన్ విచారణ చేపట్టిన ధర్మాసనం ముందుకే.. ఫైబర్‌నెట్ పిటిషన్ కూడా ►ముందు స్కిల్ స్కామ్ పిటిషన్ తీర్పు వెల్లడిస్తామన్న ద్విసభ్య ధర్మాసనం ►ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ నవంబర్ 9కి వాయిదా అక్టోబర్ 21, 2023, 07:56 AM రాజమండ్రిలో పవన్-లోకేష్ భేటీ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ప్రతిరోజు చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు ►చంద్రబాబుతో ఇవాళ మరోసారి ములాఖత్ కానున్న కుటుంబ సభ్యులు ►ప్రజా స్పందన లేకపోవడంతో నిలచిపోయిన టిడిపి దీక్షలు ►జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ కోసం సిద్ధమవుతున్న టీడీపీ ►ఈనెల 23న రాజమండ్రిలో పవన్ కల్యాణ్, లోకేష్ భేటీ అక్టోబర్ 21, 2023, 07:24 AM మనసంతా బాబే ► తెలంగాణ ప్రచారంలో బిజీగా ఉన్నా.. రేవంత్ మనసంతా బాబేనంటున్న నెటిజన్లు ► తన గురువు చంద్రబాబు జైల్లో ఉండడంతో ప్రచారంలో నీరసంగా కనిపిస్తోన్న రేవంత్ ► కీలక సమయంలో తనకు గురువు నుంచి సూచనలు లేకపోవడంతో బాధలో రేవంత్ అక్టోబర్ 21, 2023, 07:20 AM నేడు తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశం ► ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యలయంలో ఎన్టీఆర్ భవన్లో సమావేశం ► చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రజలకు ఏం చెప్పాలన్నదానిపై చర్చ ► జనసేన, తెలుగుదేశం సమన్వయం ఎలాగన్నదానిపై చర్చ ► భువనేశ్వరీ కార్యక్రమం నిజం గెలవాలి కార్యక్రమంపై వివరించనున్న లోకేష్ ► యువగళం ఎందుకు నిలిపివేశామన్న దానిపై పార్టీ నేతలకు వివరించనున్న లోకేష్ ► బాబు ష్యూరిటీ యాత్రను బస్సులో తానే నిర్వహిస్తానంటున్న లోకేష్ ► పాదయాత్ర చేసేకంటే బస్సులో యాత్ర బెటరన్న ఆలోచనలో లోకేష్ అక్టోబర్ 21, 2023, 07:18 AM నేడు బాబుతో ములాఖత్ ► నేడు చంద్రబాబుతో కుటుంబసభ్యులు, ముఖ్యనేతల ములాఖత్ ► మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో ములాఖత్ కానున్న కుటుంబసభ్యులు ► చంద్రబాబుతో ములాఖత్ కానున్న నారా లోకేష్, భువనేశ్వరి, టీడీపీ నేతలు అక్టోబర్ 21, 2023, 07:08 AM స్కిల్ కేసులో చంద్రబాబు ►చంద్రబాబు నాయుడిపై స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ కేసు ►స్కిల్ స్కామ్‌లో కింది కోర్టుల్లో దక్కని ఊరట ►ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేత ► హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ ► గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారంటూ.. 17ఏని వర్తిస్తుందంటూ చంద్రబాబు తరపు లాయర్ల వాదన ► నేరం జరిగిన నాటికి 17ఏ సెక్షన్ లేదని.. కేసు కీలక దశలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సర్వోన్నత న్యాయస్థానానికి ఏపీ సీఐడీ విజ్ఞప్తి ►వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం ►నవంబర్ 8న తీర్పు అక్టోబర్ 21, 2023, 07:05 AM చంద్రబాబు రిమాండ్ @42 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ ► నంద్యాలలో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రిమాండ్ విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ► నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 42వ రోజుకి చేరిన జ్యుడీషియల్ రిమాండ్ ► 7691 నెంబర్‌తో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ► స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది వసతి ►కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనం, స్కిన్ ఎలర్జీ దృష్ట్యా ఏసీ వసతి ►ప్రత్యేక బృందంతో రోజుకి మూడుసార్లు వైద్య పరీక్షలు ►తాజాగా.. ఐదోసారి జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►నవంబర్ 1వరకు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో చంద్రబాబు -
Oct 20th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases Arrest Remand Court Hearings And Political Updates 20:49, అక్టోబర్ 20, 2023 మనసంతా బాబే.! ► తెలంగాణ ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నా.. రేవంత్ మనసంతా బాబు గురించే ► బాబు ఎప్పుడొస్తాడు? తనకు ఎలా దారి చూపిస్తాడు? ► తెలంగాణ ఎన్నికల కీలక సమయంలో బాబు గైడెన్స్ లేకుండా ఎలా పని చేసేది? 19:49, అక్టోబర్ 20, 2023 రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691 చంద్రబాబు ఆరోగ్యం కుశలం ► రాజమండ్రి జైల్లో చంద్రబాబు క్షేమంగా ఉన్నారన్న డాక్టర్లు ► ఇవ్వాళ్టి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన డాక్టర్లు 19:39, అక్టోబర్ 20, 2023 యాక్షన్ ఎవరిపై.? రియాక్షన్ ఎవరిపై ? ► రాజమండ్రిలో ఈ నెల 23 న టీడీపీ - జనసేన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ ► పైకి పొత్తుల ప్రకటన, లోలోన గుంభనంగా మంతనాలు ఈ పొత్తుతో నాకేంటీ అన్న చందాన టీడీపీ, జనసేన నాయకులు ఎంత లాభపడదాం? ఎన్ని సీట్లలో పోటీ చేద్దాం? గెలిచే సీట్లు ఎన్ని? కచ్చితంగా ఓడే సీట్లు ఎన్ని? పైకి ఉద్యమ కార్యాచరణ, లోన సమన్వయ సమస్య ఇప్పటికిప్పుడు పక్క పార్టీకి ఎలా జై కొట్టేది? పోటీకి అవకాశం లేనపుడు సాగిలపడడమెందుకు? అసంతృప్తిని కప్పిపుచ్చేందుకు అటు పవన్, ఇటు లోకేష్ రకరకాల ప్రయత్నాలు 19:19, అక్టోబర్ 20, 2023 ముఖ్యమంత్రి ఆశలకు మంగళం ► జనసేన కార్యవర్గానికి స్పష్టత ఇచ్చిన పవన్ ► సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యం ► ముఖ్యమంత్రి పదవి అంటే ఇష్టమే, సుముఖమే ► కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పదవి గురించి ఆలోచించే పరిస్థితి లేదు ► ఈరోజు మన ప్రాధాన్యం సీఎం పదవి కాదు ► జనసేన కార్యకర్తలకు ఇబ్బందులు ఉన్నా టిడిపితో కలిసి వెళ్లాలి ► గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలి ► ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుంది ► ఒకరి అండదండలు లేకుండా జనాదరణతో ఇంతదూరం వచ్చాం ► 150 మంది క్రియాశీల సభ్యులతో పార్టీ ప్రారంభమైంది ► ప్రస్తుతం పార్టీలో 6.5 లక్షల మందికి పైగా సభ్యులున్నారు ► పార్టీపరంగా ఏ నిర్ణయమైనా నేను ఒక్కడినే తీసుకునేది కాదు ► ప్రజల్లో ఉన్న భావాన్ని పలు నివేదికల ద్వారా తెప్పించుకున్నా ► మన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీల సభ్యులే ► క్రియాశీల సభ్యుల అభిప్రాయాలు నివేదిక రూపంలో తీసుకుంటున్నా ► అందరి అభిప్రాయాల మేరకే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నా 18:18, అక్టోబర్ 20, 2023 2 ములాఖత్ లకు ఓకే ►చంద్రబాబుకు జైల్లో రెండు లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ►చంద్రబాబుకు భద్రత దృష్ట్యా రెండు ములాఖత్‌లను ఒకటికి కుదించిన జైలు అధికారులు ►లీగల్ ములాఖత్‌లు మూడుకి పెంచాలని మరోసారి పిటిషన్ వేసిన చంద్రబాబు న్యాయవాదులు ►వివిధ కోర్టులలో కేసులు ఉండటంతో మూడు ములాఖాత్‌లు ఇవ్వాలని కోరిన బాబు తరపు న్యాయవాదులు ►రెండు ములాఖత్ లను అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు 17:20 అక్టోబర్ 20, 2023 నవంబర్ 9కి ఫైబర్ గ్రిడ్ కేసు ►ఏసీబీ కోర్టులో ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై నిర్ణయం వాయిదా ►పైబర్‌నెట్ పీటీ వారెంట్‌పై నిర్ణయం నవంబర్ 10కి వాయిదా ►సుప్రీంకోర్టులో ఫైబర్‌నెట్ కేసుపై విచారణ ఉన్నట్లు సీఐడీ మెమో ►సీఐడీ మెమో ఆధారంగా ఏసీబీ కోర్టులో విచారణ నవంబర్ 10కి వాయిదా ►ఫైబర్‌నెట్ స్కామ్‌లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ నవంబర్9కి వాయిదా ►తొలుత నవంబర్8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ►నవంబర్9న విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాది విజ్ఞప్తి 15:10, 20 అక్టోబర్ 20, 2023 హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ ఖాళీ ►బీఆర్ఎస్లో చేరిన టీటీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ► రావులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ ►కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు అధికారం లోకి వచ్చింది బీఆర్ఎస్: రావుల ►కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుంది ►మేము అభివృద్ది కోసం పోటీ పడ్డాం కానీ వ్యక్తుల కోసం ఏనాడూ పోటీ పడలేదు 14:05 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్ వాయిదా ►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్ విచారణ వాయిదా ►ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►చంద్రబాబు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడీకి ఆదేశం ►ఈ నెల 26వరకు సమయం కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►పీపీ విజ్ఞప్తితో పిటిషన్ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 13:55 అక్టోబర్ 19, 2023 టీడీపీ శ్రేణుల్లో వైరాగ్యం ►చంద్రబాబు అరెస్ట్‌తో పాతాళానికి పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ►నాయకత్వ లేమితో పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ►మాటిమాటికి ఢిల్లీకి పోతున్న నారా లోకేష్ ►హడావిడి చేసి.. ఆపై సినిమాలతో బిజీ అయిన నందమూరి బాలకృష్ణ ►సగం సినిమా షూటింగ్‌లతో.. సగం రాజకీయాలతో అయోమయస్థితిలోకి జనసేన క్యాడర్‌ను నెట్టేసిన పవన్ ► సింపథీ కోసం నారా భువనేశ్వరి యాత్ర తెరపైకి ►బాబు అరెస్ట్ అప్పటి నుంచి.. ఇచ్చిన నిరసనల పిలుపునకు ప్రజల నుంచి కనీసం స్పందన లేని వైనం ►న్యాయస్థానాల్లోనూ వరుసగా తగులుతున్న దెబ్బలు.. దక్కని ఊరట ►పండుగ తర్వాత కూడా పరిస్థితి మారకుంటే.. తమ దారి తాము చూసుకోవాలని భావిస్తున్న కొందరు నేతలు 13:34 అక్టోబర్ 19, 2023 స్కిల్ స్కామ్ లో బయటపడింది గోరంత! డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కామెంట్స్ ►దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు చంద్రబాబు ►చంద్రబాబు అరెస్టు అయిన బాధ ఆయన కుటుంబ సభ్యుల్లో కనిపించలేదు.. ►చంద్రబాబు బాధలో ఉంటే బాలకృష్ణ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు? ►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే జైలు నుంచి రాజకీయం చేస్తున్నారు ►బాబు అనారోగ్యంగా ఉంటే కేజీ బరువు ఎలా పెరుగుతారు? ►చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సీబీఐ విచారణ కోరవచ్చు కదా! ► రూ. 371 కోట్ల అవినీతిలో అడ్డంగా దొరికిపోయారు కాబట్టి జైలు జీవితం అనుభవిస్తున్నారు ►స్కిల్ స్కామ్ లో బయటపడింది కేవలం గోరంత మాత్రమే ►చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో వెతికి తీస్తే కొండంత అవినీతి బయటపడుతుంది నారా బ్రాహ్మణి ట్వీట్స్ వెనుక అత్తమామల వేధింపులే కారణం అయ్యుండొచ్చు. @brahmaninaraతో గొడవపడి అప్పట్లో నారా భువనేశ్వరి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. నారా ఇంటిగుట్టు వాళ్లకి మాత్రమే తెలుస్తుంది. - మాజీ మంత్రి పేర్నినాని #GajaDongaChandrababu#EndofTDP pic.twitter.com/slTX4WCgm5 — YSR Congress Party (@YSRCParty) October 20, 2023 13:06 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో మరో రెండు పిటిషన్లు బాకీ ►ఏసీబీలో కోర్టులో ఇవాళ ఇంకా రెండు విచారణకు రావాల్సిన చంద్రబాబు పిటిషన్లు ►ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ విచారణపై నిర్ణయం తీసుకోనున్న ఏసీబీ కోర్టు ►సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదాతో.. ఏసీబీ కోర్టులోనూ వాయిదా పడే అవకాశం ►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు ►ఈ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు 12:55 అక్టోబర్ 19, 2023 ఓడిపోయే స్థానాలు మనకొద్దు సార్ ►మంగళగిరిలో జనసేన సీనియర్లు, ముఖ్యనేతలతో భేటీ కానున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ►టీడీపీతో పొత్తు, వారాహి యాత్రపై చర్చించనున్న పవన్ ►టీడీపీ ముందర జనసేన డిమాండ్లు ఉంచాలని పవన్‌పై ఒత్తిడి చేయనున్న సీనియర్లు ►పాతికా, ముప్ఫై కాదు.. జనసేనకు యాభై సీట్లు కేటాయించాలి ►సామాజిక వర్గ బలం ఉన్న నియోజకవర్గాలతో పాటు అడిగిన నియోజకవర్గాలే ఇవ్వాలి ►ఓడిపోయే స్థానాలను అంటగట్టొద్దు ►వారాహి యాత్ర అంతటా చేయడం దండగ ►పోటీ చేసే స్థానాల్లోనే చేద్దాం ►పవన్ కల్యాణ్‌కు రెండు సీట్లు ఇవ్వాలి.. రెండు చోట్లా పోటీకి టీడీపీ వాళ్లు కృషి చేయాలి ►టీడీపీకి సమాన గౌరవం జనసేనకు ఇవ్వాలి ►టీడీపీ రెబల్స్‌కు జనసేనలోకి పంపకూడదు ►పార్టీని నమ్ముకున్న వాళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి ►లిక్కర్, పెట్రోల్.. ఇలా మొత్తం ఎన్నికల ఖర్చంతా టీడీపీనే భరించాలి 12:32 అక్టోబర్ 19, 2023 లాయర్ల కోట్ల ఫీజులకు డబ్బెక్కడది?: లక్ష్మీ పార్వతి ►చంద్రబాబు కేసుల కోసం సీనియర్ లాయర్లు ►40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పని చేస్తున్నారు ►సీనియర్ లాయర్లకు రోజు రూ.కోటి నుంచి రూ.2.50 కోట్లు ఫీజు ►లాయర్ల ఫీజుకే కోట్లకు పైగా ఖర్చు ఉండొచ్చు ►2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పారు ►లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడ్నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు తెలపాలి ►దాచుకున్న అవినీతి సొమ్మును లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా? 11:22 అక్టోబర్ 19, 2023 క్వాష్ తర్వాతే ఫైబర్ నెట్ సంగతి ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 9వ తేదీకి వాయిదా ►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు పెండింగ్‌లో ఉందని.. అది ఇచ్చేవరకు ఆగాలని బాబు లాయర్లకు సూచించిన సుప్రీంకోర్టు ►ఆ తర్వాతే ఫైబర్ నెట్ కేసు సంగతి చూస్తామని వెల్లడి ►చంద్రబాబు జైలులోనే ఉన్నారు కదా, మీరు ఇంటరాగేషన్ చేసుకోవచ్చు కదా: జడ్జి ►క్వాష్ పిటిషన్‌పై 8వ తేదీన తీర్పు ఇస్తామన్న ధర్మాసనం ►క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ ►ఇవాళ లిఖిత పూర్వక వాదనల సమర్పణకు ఆఖరు తేదీ ►17ఏ సెక్షన్‌పైనా సాగిన వాడీవేడి వాదనలు ►స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్‌కు సుప్రీం నో ► నేరుగా తుది తీర్పే ఇస్తామని చంద్రబాబు లాయర్లకు స్పష్టీకరణ ►నవంబర్ 8 కోసం ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిన టీడీపీ శ్రేణులు 10:59 అక్టోబర్ 19, 2023 ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ►విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్ వాదనలు సిద్ధార్థ లూథ్రా వాదనలు: ►పిటిషనర్‌పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది ►ఫైబర్‌నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు ►ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు ►చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపాం -- ►వాదనల తర్వాత తదుపరి విచారణ నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు ►వ్యక్తిగత ఇబ్బంది కారణంగా ఆ మరుసటి రోజుకి విచారణ కోరిన లాయర్ లూథ్రా ► సరేనన్న ధర్మాసనం ► నవంబర్ 9దాకా.. చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని, పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం 10:49 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ ►చంద్రబాబు లీగల్ ములాఖత్ పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు ►లీగల్ ములాఖత్‌లను పెంచాలని గురువారం పిటిషన్ వేసిన బాబు లాయర్లు ► వివిధ కోర్టుల్లో చంద్రబాబు కేసుల విచారణలు ఉన్నందునా.. లీగల్ ములాఖత్‌ల సంఖ్య మూడుకి పెంచాలని పిటిషన్లో కోరిన లాయర్లు ► అత్యవసర విచారణ కోరగా.. సాధ్యం కాదన్న కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశం ►ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదంటూ ఇవాళ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ►సరైన లీగల్ ఫార్మట్‌లో మరోసారి పిటిషన్ ఫైల్ చేయమని సూచన 10:15 అక్టోబర్ 19, 2023 చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్‌నెట్ స్కాం ►ఫైబర్‌నెట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీఐడీ అభియోగాలు ►టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనం దోపిడీ ►రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు లూటీ చేశారు ►బాబు హయాంలో 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగింది ►2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు ►చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కామ్ ►హెరిటేజ్‌తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా వీరు దోపిడీ ►బ్లాక్ లిస్టులో ఉన్న టెరా కంపెనీకి టెండర్ ►అభ్యంతరం తెలిపిన ఏపీటీఎస్ వీసీ అండ్ ఎండీ సుందర్ బదిలీ ►టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడి యా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగింపు ►ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల ►అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి చేరిక ►ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటు!! ►అప్పటికప్పుడు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా డబ్బుల తరలింపు ►నెట్వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బు బదిలీ ►ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమకు చేరిక ►పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బంతా చివరకు చంద్రబాబు వద్దకు ►ఫైబర్ గ్రిడ్ స్కామ్ సూత్రధారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లే అని సీఐడీ దర్యాప్తులో వెల్లడి 09:45 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో మూడు పిటిషన్లపై విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు చంద్రబాబు మూడు పిటిషన్లపై విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ ►సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ►నేడు ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డ్స్ పిటిషన్‌పై విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు ►ఈ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు ►సీడీఆర్ పిటిషన్ నేడు విచారించనున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబుకి లీగల్ ములాఖాత్ల సంఖ్య మూడుకి పెంచాలని గురువారం బాబు లాయర్ల పిటిషన్ ►అత్యవసర విచారణకు నిరాకరించిన ఏసీబీ కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశం ►నేడు లీగల్ ములాఖత్‌ల పిటిషన్‌పైనా విచారణ జరిగే అవకాశం 08:55 అక్టోబర్ 19, 2023 బాబు ఆరోగ్యం.. నారా ఫ్యామిలీ అల్లిన కథలు ►గురువారం వర్చువల్ విచారణ టైంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన జడ్జి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? చంద్రబాబు : ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : జైల్లో డాక్టర్లున్నారు కదా, రోజూ చెక్ చేస్తున్నారా? చంద్రబాబు : అవును, రోజూ డాక్టర్లు చెక్ చేస్తున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : డాక్టర్లు హెల్త్ రిపోర్ట్ ఇస్తున్నారా? చంద్రబాబు : అవును, డాక్టర్లు ఏ రోజుకారోజు హెల్త్ రిపోర్టు ఇస్తున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? చంద్రబాబు : జెడ్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిని నేను, నాకు సెక్యూరిటీపై అనుమానాలున్నాయి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : మీకున్న సందేహాలను రాతపూర్వకంగా ఇవ్వండి, పరిశీలిస్తాం ఇవి చంద్రబాబు స్వయంగా జడ్జి ఎదుట చెప్పిన మాటలు.. మరి నారా ఫ్యామిలీ ఏమంటోంది? మా నాన్నకు స్టెరాయిడ్స్ : గత వారం తనయుడు నారా లోకేష్ బాబు చంద్రబాబు ఆరోగ్యం విషమంగా ఉంది, ఆయన కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం : చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ►ఈ ఆరోపణలన్నీ వట్టివేనని తేల్చిన కోర్టు విచారణ ►లోకేష్, భువనేశ్వరీ అసత్య ఆరోపణలు ఎందుకు? ►స్టెరాయిడ్స్, కిడ్నీలు ఎక్కడినుంచి అల్లిన కథలు? ►టీడీపీ పతనం నేపథ్యంలోనే.. సానుభూతి కోసం అసత్యాల ప్రచారమా? 08:36 AM, అక్టోబర్ 20, 2023 తీర్పు ఎప్పుడన్న దానిపై ఉత్కంఠ ►చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ ►స్కిల్ డెవెలప్మెంట్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏపై వాడీవేడిగా సాగిన వాదనలు ►ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి ఇవాళ(శుక్రవారం) ఆఖరిరోజు ►వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ ►నేరుగా తీర్పు ఇస్తామంటూ.. బాబు లాయర్లు చేసిన మధ్యంతర బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం ►21 నుంచి 29 దాకా కోర్టుకు దసరా సెలవులు ►ఎలాంటి తీర్పు వస్తుందో? ఎప్పుడు వస్తుందోనని చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళన 08:15 AM, అక్టోబర్ 20, 2023 టీడీపీ ఆశలన్నీ ఆ ఫలితం మీదే! ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ఇవాల్టి నుండి చంద్రబాబుకు మరో 14 రోజులు రిమాండ్ కొనసాగింపు ►నవంబర్ 1 వరకు రిమాండ్‌లోనే చంద్రబాబు ►సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ ఫలితంపైనే టీడీపీ ఆశలు ►జైల్లో చంద్రబాబుకు యధావిధిగా కొనసాగుతున్న ఆరోగ్య పరీక్షలు ►సుప్రీంలో క్వాష్ పిటిషన్ ఫలితం తేలాకే ప్రారంభం కానున్న భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర 07:43 AM, అక్టోబర్ 20, 2023 సుప్రీంలో బాబు ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ ►సుప్రీం కోర్టులో నేడు ఫైబర్ నెట్ స్కామ్ కేఏసు విచారణ ►ఫైబర్ నెట్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ ► ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణ ► హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ►విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►9వ నెంబర్ కేసుగా లిస్ట్ అయిన పిటిషన్ ►ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపుల్లో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు ►చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ టేరా సాప్ట్ కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ►బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడం పై అవినీతి ఆరోపణలు ► ఇవాళ్టి సుప్రీం ఆదేశాల తర్వాతే.. పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం 07:30, అక్టోబర్ 19, 2023 అన్నీ నిజాలే చెప్పాలి ► నిజం గెలవాలి పేరిట యాత్రలో నారా భువనేశ్వరీ నిజం చెప్పాలి ► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి ► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి ► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి ► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి ► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి ► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి ► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి ► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి ► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి 07:10 AM, అక్టోబర్ 20, 2023 చంద్రబాబుకు భద్రతా అనుమానాలు ►జైల్లో తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు ►గురువారం వర్చువల్ విచారణ సందర్భంగా జడ్జితో ప్రస్తావించిన బాబు ►అలాంటి సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని బాబుకి సూచించిన కోర్టు ►చంద్రబాబు రాసిన లేఖను సీజ్ చేసి సమర్పించాలని అధికారులకు కోర్టు ఆదేశం ►ఆరోగ్య సమస్యలూ ఉన్నాయని జడ్జితో చెప్పిన చంద్రబాబు ►అధికారుల్ని వివరణ కోరిన ఏసీబీ న్యాయమూర్తి ►ప్రత్యేక వైద్య బృందం ఉందన్న అధికారులు ►వైద్య నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని ఆదేశించిన ఏసీబీ జడ్జి 07:10 AM, అక్టోబర్ 20, 2023 వెకేషన్ బెంచ్‌కు బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ►సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ను తోసిపుచ్చిందని గుర్తు చేసిన సీఐడీ తరపు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణ చేపట్టలేమన్న హైకోర్టు ►విచారణను దసరా తర్వాతకి వాయిదా వేసిన కోర్టు ► వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని రిక్వెస్ట్ చేసిన బాబు లాయర్లు ►బాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం ►చంద్రబాబు ఆరోగ్య సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లిన బాబు లాయర్లు 06:55 AM, అక్టోబర్ 20, 2023 వివిధ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లు ►ఫైబర్ నెట్ కేసులో నేడు చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ►ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న ద్విసభ్య ధర్మాసనం ►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ ►ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ ►నేడు లిఖిత పూర్వక వాదనలు సమర్పించనున్న ఇరుపక్షాల న్యాయవాదులు ►తీర్పు దసరా తర్వాతే వెలువడే అవకాశం? ►ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్ కేసు విచారణ నవంబరు 7కి వాయిదా ►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ ►సుప్రీంలో ఫైబర్‌నెట్ కేసు విచారణ ఉండడంతో.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు హాజరు పెండింగ్ ► సుప్రీం ఆదేశాల తర్వాతే.. ఫైబర్ నెట్ కేసులోనూ పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే ఛాన్స్ 06:35 AM, అక్టోబర్ 20, 2023 చంద్రబాబు రిమాండ్ @41 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ ► నంద్యాలలో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రిమాండ్ విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ► నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజుకి చేరిన జ్యుడీషియల్ రిమాండ్ ► 7691 నెంబర్‌తో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ► స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది వసతి ►కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనం, స్కిన్ ఎలర్జీ దృష్ట్యా ఏసీ వసతి ►ప్రత్యేక బృందంతో రోజుకి మూడుసార్లు వైద్య పరీక్షలు ►తాజాగా.. గురువారం ఐదోసారి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►నవంబర్ 1వరకు రిమాండ్ పొడిగింపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రం అట్టుడికిపోతున్నట్లు JaiTDP, ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కానీ.. ఇప్పటి వరకూ ఒక్కరోజూ కూడా ఎక్కడా హెరిటేజ్‌ని మూసిన దాఖలాలు కనిపించలేదు. నేను వస్తున్నా అంటూ గప్పాలు కొట్టిన బాలయ్య.. హైదరాబాద్‌కి వెళ్లిపోయి కులాసాగా సినిమా పూర్తి చేసుకుని ఈరోజు… pic.twitter.com/C9SXh0EKTU — YSR Congress Party (@YSRCParty) October 19, 2023 -
మధ్యంతర బెయిల్ కుదరదు
సాక్షి, అమరావతి: స్కిల్ స్కాంలో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు రాష్ట్ర హైకోర్టు మరోసారి ఝలక్ ఇచ్చింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కుదరదని తేల్చిచెప్పింది. అలాగే, ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని.. ఈ వ్యాజ్యం తేలేలోపు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ప్రధాన పిటిషన్, అనుబంధ పిటిషన్ల తదుపరి విచారణను వాయిదా వేసింది. మరోవైపు.. ఈ విషయంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యాలను దసరా సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు ఏర్పాటయ్యే వెకేషన్ కోర్టు ముందుంచుతూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు చేసిన అభ్యర్థన మేరకు హైకోర్టు ఈ మేర ఉత్తర్వులిచ్చింది. నిజానికి.. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మరో న్యాయమూర్తి ముందు మధ్యంతర బెయిల్ కోసం వాదనలు వినిపించేందుకు వీలుగా చంద్రబాబు న్యాయవాదులు వెకేషన్ కోర్టు ముందుంచాలన్న అభ్యర్థనను తెరపైకి తెచ్చారు. ఇదే సమయంలో.. చంద్రబాబు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వారు కోర్టు దృష్టికి తీసుకురావడంతో, చట్ట ప్రకారం ఆయనకు జైలులో తగిన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. అంతేకాక.. తదుపరి విచారణ సమయంలో చంద్రబాబు వైద్య నివేదికలను కోర్టు ముందుంచాలని కూడా జైలు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే, ఈ బెయిల్ పిటిషన్లు ఎప్పుడు విచారణకు వస్తాయి.. ఏ న్యాయమూర్తి ముందు విచారణకు వస్తాయన్న విషయాలు రెండు మూడ్రోజుల్లో తెలిసే అవకాశముంది. చంద్రబాబుకు చర్మ సమస్యలున్నాయి.. ఈ సందర్భంగా చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు ఆరోగ్యస్థితికి సంబంధించిన వైద్య నివేదికలను మెమో రూపంలో కోర్టు ముందుంచామని చెప్పారు. చంద్రబాబుకు కొన్ని వైద్య పరీక్షలు అవసరమని వైద్యులు ఆ నివేదికల్లో పేర్కొన్నారని వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. సుప్రీంకోర్టు 17ఏపై తీర్పును రిజర్వ్ చేసింది కదా, ఆ తీర్పు ప్రభావం ఈ పిటిషన్లపై ఉంటుంది కదా? అని ప్రశ్నించారు. కొంతమేర ఉంటుందని, అందుకే తాము ప్రధాన బెయిల్ పిటిషన్లో వాదనలు వినిపించడంలేదని, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంలో వాదనలు వినిపిస్తున్నామని లూథ్రా, దమ్మాలపాటి చెప్పారు. మధ్యంతర బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకు ఉందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచిచూడటం మంచిదన్నారు. ఆ తీర్పు ప్రభావం ఈ వ్యాజ్యాలపై ఉన్నప్పుడు, ఆ తీర్పు కోసం వేచిచూడటంలో తప్పులేదన్నారు. మధ్యంతర బెయిల్‌ను ‘సుప్రీం’ తోసిపుచ్చింది.. అనంతరం.. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న చంద్రబాబు అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించిందన్నారు. అందువల్ల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదన్నారు. అసలు చట్టంలో ఎక్కడా కూడా మధ్యంతర బెయిల్ ప్రస్తావనే లేదని తెలిపారు. ఈ సమయంలో లూథ్రా జోక్యం చేసుకుంటూ.. అదనపు ఏజీ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బెయిల్ పిటిషన్ 19న హైకోర్టులో ఉందని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పడంతో తమ మధ్యంతర బెయిల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం సాధ్యంకాదని తేల్చిచెప్పారు. వైద్య పరీక్షల విషయంలో ఏం చేయాలగమో అది చేస్తామన్నారు. వ్యక్తిగత వైద్యునితో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అనుమతిచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. దీనిపై పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. తామే వైద్య పరీక్షలు చేయించి తామే తిరిగి జైలుకు తీసుకొస్తామన్నారు. వ్యక్తిగత వైద్యునితో వైద్య పరీక్షలకు మీకేం అభ్యంతరమని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై తాను అధికారులతో మాట్లాడి చెప్పాల్సి ఉంటుందని, అందువల్ల విచారణను కొద్దిసేపు వాయిదా వేయాలని కోర్టును కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను మ. 2.15 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం తరువాత మారిన స్వరం.. తిరిగి మధ్యాహ్నం విచారణ మొదలు కాగా, చంద్రబాబు న్యాయవాదులు వ్యూహాన్ని మార్చారు. మధ్యంతర బెయిల్ సాధ్యంకాదని హైకోర్టు తేల్చిచెప్పడంతో కొత్త అభ్యర్థనను తెరపైకి తెచ్చారు. మరో న్యాయమూర్తి ముందు మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకునేందుకు వీలుగా, తమ బెయిల్, మధ్యంతర బెయిల్ వ్యాజ్యాలను దసరా సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు ఏర్పాటయ్యే వెకేషన్ కోర్టు ముందుంచాలని న్యాయమూర్తిని అభ్యరి్థంచారు. దీంతో న్యాయమూర్తి వారి అభ్యర్థనపట్ల సానుకూలంగా స్పందించి ఆ మేర ఉత్తర్వులు జారీచేశారు. -
స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను ఇంకోసారి పొడిగించింది ఏసీబీ కోర్టు. నవంబర్ 1వ తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణ సమయంలో తన ఆరోగ్యం, భద్రత గురించి జడ్జి ఎదుట చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా చంద్రబాబును ఏసీబీ జడ్జి ముందు హాజరుపరిచారు అధికారులు. ఆ సమయంలో ఆరోగ్యం ఎలా ఉంది? అని చంద్రబాబును ఏసీబీ జడ్జి ఆరా తీశారు. అయితే తనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని ఆయన జడ్జికి చెప్పారు. దీంతో అధికారుల్ని జడ్జి వివరణ కోరారు. మెడికల్ టీం ఉందని, ఎప్పటికప్పుడు ఆయనకు వైద్యపరీక్షలు జరుపుతోందని అధికారులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. మెడికల్ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని జడ్జి ఆదేశిస్తూ.. చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించారు. మరోవైపు సెక్యూరిటీ విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పడంతో.. ఏమైనా అనుమానాలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని కోర్టు సూచించింది. అలాగే చంద్రబాబు రాసే లేఖను సీల్ చేసి తనకు పంపాలని అధికారుల్ని జడ్జి ఆదేశించారు. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
Oct 19th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest Legal Issues & Political Updates 21:00, అక్టోబర్ 19, 2023 జనసైనికులకయినా అర్థమవుతోందా? : YSRCP ► సంక్షేమ పథకాలపై ఇన్నాళ్లు ఏం చెప్పారు? ► ఎన్నికల వేళ ఇప్పుడేమి చెబుతున్నారు? మీకు ఏ కోశానా సిగ్గూ ఎగ్గూ లేనట్లుంది @JanaSenaParty! మిమ్మల్ని అలగా జనం అని టీడీపీ వాళ్లు తిడుతున్నా వాళ్ళ గుమ్మం ముందే నిలబడతారు. వాళ్ళ పల్లకీ మోయడానికి రెడీగా ఉంటారు. అన్నిటికీ మించి మీకు వాళ్ళు విదిలించిన సీట్లెన్ని? అందులో మళ్ళా @JaiTDP రెబెల్స్ పోటీ చేసే స్థానాలెన్ని? మీరు… https://t.co/BxOIbe5769 — YSR Congress Party (@YSRCParty) October 19, 2023 20:50, 19 అక్టోబర్, 2023 చంద్రబాబు, పవన్‌లపై మంత్రి అమర్నాథ్ ఫైర్ ►ఏపీలో జరిగే ఎన్నికలు లోకల్, నాన్ లోకల్ మధ్య పోటీ ►నాలుగేళ్లుగా చంద్రబాబు, పవన్ ఒక్క పండుగ కూడా ఏపీలో జరుపుకోలేదు ►పవన్, చంద్రబాబు నాన్ రెసిడెంట్ ఆంధ్రులు ►చంద్రబాబు జైల్లో ఉన్నాడనే బాధ టీడీపీ కార్యకర్తల్లో ఉంది కానీ కుటుంబ సభ్యుల్లో కనిపించడం లేదు 20:45, అక్టోబర్ 19, 2023 నిజమే.. నిజం గెలవాలి ► భువనేశ్వరీ నిజంగా ప్రజలకు నిజం చెప్పాలి.! ► నిజం గెలవాలి పేరిట యాత్రలో భువనేశ్వరీ నిజం చెప్పాలి ► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి ► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి ► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి ► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి ► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి ► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి ► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి ► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి ► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి 20:22 అక్టోబర్ 19, 2023 వారెవ్వా.. కుటుంబం నుంచి ఇన్ని డ్రామాలా? ► మా నాన్నకు స్టెరాయిడ్స్ : గత వారం లోకేష్ ► చంద్రబాబు ఆరోగ్యం విషమంగా ఉంది, ఆయన కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం : భువనేశ్వరీ ఈ ఆరోపణలన్నీ వట్టివేనని తేల్చిన కోర్టు విచారణ ఇవ్వాళ చంద్రబాబుతో మాట్లాడిన న్యాయమూర్తి ACB కోర్టు న్యాయమూర్తి : ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? చంద్రబాబు : ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి ACB కోర్టు న్యాయమూర్తి : జైల్లో డాక్టర్లున్నారు కదా, రోజూ చెక్ చేస్తున్నారా? చంద్రబాబు : అవును, రోజూ డాక్టర్లు చెక్ చేస్తున్నారు ACB కోర్టు న్యాయమూర్తి : డాక్టర్లు హెల్త్ రిపోర్ట్ ఇస్తున్నారా? చంద్రబాబు : అవును, డాక్టర్లు ఏ రోజుకారోజు హెల్త్ రిపోర్టు ఇస్తున్నారు ACB కోర్టు న్యాయమూర్తి : ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? చంద్రబాబు : Z కేటగిరి భద్రత ఉన్న నాయకుడిని నేను, నాకు సెక్యూరిటీపై అనుమానాలున్నాయి ACB కోర్టు న్యాయమూర్తి : మీకున్న సందేహాలను రాతపూర్వకంగా ఇవ్వండి, పరిశీలిస్తాం ఇవి చంద్రబాబు చెప్పిన పాయింట్లయితే, లోకేష్, భువనేశ్వరీ అసత్య ఆరోపణలు ఎందుకు? స్టెరాయిడ్స్, కిడ్నీలు ఎక్కడినుంచి అల్లిన కథలు? సానుభూతి రావాలంటే అసత్యాలను ప్రచారం చేయాల్సిందేనా? ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో సాక్ష్యాధారాలతో దొరికిపోయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకి ఏసీబీ కోర్టు నవంబరు 1 వరకూ రిమాండ్‌ని పొడిగించింది. జైలులో సెక్యూరిటీపై తనకి అనుమానాలు ఉన్నాయని @ncbn డ్రామాలాడే ప్రయత్నం చేసినా.. మీ అనుమానాలను… — YSR Congress Party (@YSRCParty) October 19, 2023 19:33, అక్టోబర్ 19, 2023 తెలంగాణ ఎన్నికల్లో టిడిపి తీరు దేనికి సంకేతం? ► తెలంగాణలో 63 చోట్ల పోటీ చేయాలని తెలుగుదేశం యోచన ► అతి కష్టమ్మీద 63 మందిని పోటీకి ఒప్పించిన టిడిపి లీడర్లు ► కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చేలా అభ్యర్థుల ఎంపిక ► కాంగ్రెస్ అభ్యర్థి ప్రత్యర్థి సామాజిక వర్గం నుంచి అభ్యర్థుల ఎంపిక ► తద్వారా కాంగ్రెస్‌కు పరోక్షంగా లబ్ది జరిగేలా వ్యూహం ► ఒక్కటంటే ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేని తెలుగుదేశం ► అయినా రేవంత్ రెడ్డి కోసం అభ్యర్థులను దించుతోన్న చంద్రబాబు ► రెండు రోజుల కింద టిటిడిపి లీడర్లతో భువనేశ్వరీ మంతనాలు ► బక్కని నర్సింహులును రాజమండ్రి పిలిపించిన భువనేశ్వరీ ► ములాఖత్‌లో చంద్రబాబు ఇచ్చిన సూచనలను బక్కనికి తెలిపిన భువనేశ్వరీ 18:39, అక్టోబర్ 19, 2023 రేపు సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ ►రేపు(శుక్రవారం) సుప్రీంకోర్టులో బాబు ఫైబర్‌నెట్ స్కామ్ కేసు విచారణ ►ఫైబర్‌నెట్ స్కామ్‌లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని బాబు పిటిషన్ ►విచారించనున్న జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►ఫైబర్‌నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపులో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు 16: 59, 19 అక్టోబర్, 2023 తెలంగాణ టీడీపీలో ఖాళీ ►టీటీడీపీకి షాక్ ఇచ్చిన రావుల చంద్రశేఖర్ రెడ్డి ►రేపు కారెక్కనున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి ►ఇప్పటికే చర్చలు జరిపిన రావుల 16:25, 19 అక్టోబర్, 2023 ఈ టైంలో బాలయ్య సినిమా రిలీజా? :::విశాఖలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్ ►చంద్రబాబు కోసం బాలయ్య సినిమాను ఎందుకు ఆపలేదు ►చంద్రబాబు బాధలో ఉంటే ఎందుకు సినిమా రిలీజ్ చేశారు ►హెరిటేజ్‌ను ఎందుకు మూయలేదు? ►హెరిటేజ్‌కు లాభాలు వచ్చాయని ఇప్పటికే ఆ సంస్థ ప్రకటించింది. ►బాబు కోసం హెరిటేజ్ మూయరు.. బాలయ్య సినిమా ఆపరు ►ప్రజలు మాత్రం బాబు కోసం నిరసనలు చేయాలా? ►జగన్ హయాంలో స్కీంలు , బాబు హయాంలో స్కామ్‌లు ►బాబును అరెస్ట్ చేస్తే హైదరాబాద్‌లో గొడవలు ఏమిటి? ►బాబు కేజీ పెరిగితే 5 కేజీలు బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ►చట్టం ముందు అందరూ సమానమే 15:00 , 19 అక్టోబర్, 2023 చంద్రబాబు బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్‌కు బదిలీ ►స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ► విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ►దసరా సెలవుల తర్వాతే విచారిస్తామన్న హైకోర్టు ► వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని కోరిన బాబు లాయర్లు ►బెయిల్ పిటిషన్ విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ ►అదే సమయంలో.. చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్‌తో వైద్య పరీక్షలకు అనుమతిచ్చిన హైకోర్టు 14:55, 19 అక్టోబర్, 2023 నిజం గెలుస్తోంది.. కనుకే బాబు జైలుకెళ్లారు :::ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి కామెంట్స్ ►నిజం గెలుస్తోంది..అందుకే బాబు జైలుకెళ్లాడు! ►40 ఏళ్ళుగా నిజాన్ని సమాధి చేసిన బాబుపై నేడు నిజం గెలుస్తుంది! ►నిజం గెలవాల్సింది న్యాయస్థానాల్లో కానీ.. రోడ్ల మీద కాదు..! ►నిజం గెలవాలనుకునే వాళ్ళు 17ఏని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు? ►జైల్లో బాబు భద్రతకు వచ్చిన ప్రమాదమేమీ లేదు ►నందమూరి వారసుల్ని నారా వారు ఇంకా తొక్కుతూనే ఉన్నారన్నది నిజం కాదా? ►నారా కుటుంబం భవిష్యత్తుకే గ్యారంటీ లేదు.. ప్రజలకేం గ్యారంటీ ఇస్తారు? ►టీడీపీకి పట్టిన శని నారా లోకేష్! ► టీడీపీ నాయకులు ఇప్పటికైనా జాగ్రత్తపడాలి ►జైల్లో కూర్చొని కూడా చంద్రబాబు కుట్రలు 13:51, 19 అక్టోబర్, 2023 ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ►ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ చంద్రబాబు లాయర్లు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకి రోజుకి లీగల్ ములాఖాత్ల సంఖ్య మూడుకి పెంచాలని పిటిషన్ ►వెంటనే విచారణకు స్వీకరించాలని కోర్టుకు విజ్ఞప్తి ►ఇప్పటికిపుడు విచారణ సాధ్యంకాదన్న ఏసీబీ కోర్టు ►ఈ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడీ తరపు న్యాయవాదులకి ఏసీబీ కోర్టు ఆదేశం 13:32, 19 అక్టోబర్, 2023 సుప్రీంలో రేపు ఫైబర్ కేసు పిటిషన్ విచారణ ►ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ► రేపు విచారించనున్న సుప్రీంకోర్టు ►కేసుల విచారణ జాబితాలో 9వ కేసుగా చంద్రబాబు పిటిషన్ ►సుప్రీంలో పెండింగ్‌తో పీటీ వారెంట్‌పై నిర్ణయాన్ని రేపటికే వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ► రేపటి దాకా అరెస్ట్ చేయొద్దని సీఐడీకి సుప్రీం సూచన 12:50, 19 అక్టోబర్, 2023 ములాఖత్ ప్లీజ్ ► ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ► జైల్లో ములాఖత్ లు పెంచాలని పిటిషన్ దాఖలు ► రోజుకు మూడు సార్లు ములాఖత్ ఇవ్వాలని విజ్ఞప్తి ► జైలు అధికారుల తీరు పై చంద్రబాబు లాయర్ల పిటిషన్ 12:50, 19 అక్టోబర్, 2023 చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. ►ఏసీబీ కోర్టులో చంద్రబాబుకి మరోసారి ఎదురుదెబ్బ ►చంద్రబాబుకి మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపు విధించిన కోర్టు ►నవంబర్ 1 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►ఈరోజు ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబుని వర్చువల్ విధానంలో హాజరుపరిచిన జైలు అధికారులు ►చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితులని అడిగి తెలుసుకున్న ఏసీబీ న్యాయమూర్తి ►తన సెక్యూర్టీ విషయంలో కొన్ని అనుమానాలున్నాయన్న చంద్రబాబు. ►ఏమైనా అనుమానాలుంటే రాతపర్వకంగా ఇవ్వాలన్న న్యాయమూర్తి. ►చంద్రబాబు రాసే లేఖను తనకు పంపించాలని జైలు అధికారులకు న్యాయమూర్తి ఆదేశం. ►హైకోర్టులో స్కిల్ స్కాం కేసు పెండింగ్‌లో ఉందని చంద్రబాబుకు చెప్పిన జడ్జి. ►ఆరోగ్యం ఎలా ఉందని జైలు అధికారులను ప్రశ్నించిన జడ్జి. ►మెడికల్ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సబ్మిట్ చేయాలన్న ఏసీబీ కోర్టు. 11:55 AM, 19 అక్టోబర్, 2023 చంద్రబాబుకి హైకోర్టులో షాక్ ►సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉంది కదా: హైకోర్టు ►కాబట్టి, బెయిల్ పిటిషన్‌పై మేం విచారణ జరపలేం: హైకోర్టు ►చంద్రబాబుకి వ్యక్తిగత డాక్టర్‌తో టెస్టులకు సంబంధించి లంచ్ తర్వాత విచారిస్తాం: హైకోర్టు ►విచారణ మధ్యాహ్నానికి వాయిదా 11:40 AM, 19 అక్టోబర్, 2023 స్కిల్ కేసులో బాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ►సుప్రీంలో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది నిజమేనా? అని లూథ్రాను అడిగిన హైకోర్టు న్యాయమూర్తి ►సుప్రీంలో చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి రిపోర్టులు అందజేయలేదు: లూథ్రా ►మధ్యంతర బెయిల్ ఇవ్వమని సుప్రీంలో మేం మౌఖికంగా మత్రమే అడిగాం: లూథ్రా ►చంద్రబాబు ఆరోగ్యం సరిగ్గా లేదు కాబట్టే.. బెయిల్పిటిషన్పై వెంటనే విచారణ జరపండి: లూథ్రా ►చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్‌తో ఆయనకు పరీక్షలు జరిపేందుకు మీకేమైనా అభ్యంతరం ఉందా? అని పొన్నవోలును అడిగిన జడ్జి 11:34 AM, 19 అక్టోబర్, 2023 మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది: పొన్నవోలు ►స్కిల్ కేసులో బాబు బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు ► సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని ఆయన లాయర్ సాల్వే సుప్రీం కోర్టుకు తెలిపారు ►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది ►సుప్రీం కోర్టులో పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉంది ►సుప్రీంలో బెయిల్ పిటిషన్ ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నప్పడు.. విచారణ చేయొద్దని హైకోర్టును మనవి 11:30 AM, 19 అక్టోబర్, 2023 రెండువారాల మధ్యంతర బెయిల్ ఇవ్వండి: లూథ్రా ►స్కిల్ కేసులో బాబు బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు ►వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు లాయర్ లూథ్రా ►చంద్రబాబు హెల్త్ కండిషన్‌పై మోమో దాఖలు చేశాం ►వైద్యులు సిఫార్సు చేసిన అంశాల్ని కోర్టుకు వివరించిన లూథ్రా ►చంద్రబాబు ఆరోగ్యంగా ఇబ్బందిగా మారుతోంది ►చంద్రబాబుకు రెండు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వండి 11:27 AM, 19 అక్టోబర్, 2023 బాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం ►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బెయిల్ కోసం పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ►ఇప్పటికే బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు ►కింది కోర్టులో ఊరట దక్కకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 11:15 AM, 19 అక్టోబర్, 2023 రామోజీ జీవితమే కుట్రల మయం.. ►ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకుని ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించే రామోజీరావు అంతరంగమంతా కుట్రలు, కుతంత్రాలే ►తన ఎదుగుదలకు దోహదపడిన వ్యాపార భాగస్వామిని ముంచిన వ్యక్తి రామోజీ ►వారి కుటుంబాన్ని బెదిరించి సంతకాలు తీసుకుని మార్గదర్శి షేర్లను బదిలీ చేయించుకున్న వ్యక్తి రామోజీరావు ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకుని ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించే రామోజీరావు అంతరంగం అంతా కుట్రలు, కుతంత్రాలే. తన ఎదుగుదలకు దోహదపడిన వ్యాపార భాగస్వామిని ముంచడమే కాకుండా.. వారి కుటుంబాన్ని బెదిరించి సంతకాలు తీసుకుని మార్గదర్శి షేర్లను బదిలీ చేయించుకున్న వ్యక్తి రామోజీరావు.… pic.twitter.com/r68KoQ1L1j — YSR Congress Party (@YSRCParty) October 19, 2023 10:20 AM, 19 అక్టోబర్, 2023 కోర్టులు.. పిటిషన్లు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు ►రేపు క్వాష్ పిటిషన్‌పై విచారణ.. రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఇరువర్గాలకు ద్విసభ్య ధర్మాసనం ఆదేశం ►తీర్పు దసరా తర్వాతే వెల్లడించే అవకాశం! ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీం కోర్టులో విచారణ ►ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారెంట్‌పై రేపు(శుక్రవారం) ఏసీబీ కోర్టు విచారణ ►ఐఆర్ఆర్ కేసులో బెయిల్ పిటిషన్ నవంబర్ 7కు వాయిదా ►నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ ►ఏపీ హైకోర్టులో నేడు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఊరట ఇవ్వకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 10:15 AM, 19 అక్టోబర్, 2023 900 పేజీల కౌంటర్ దాఖలు ►స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ ►ఏసీబీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన బాబు లాయర్లు ►900పేజీల కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ ► కౌంటర్లో చంద్రబాబు పాత్ర, సాక్ష్యాల ప్రస్తావన ►రూ.371 కోట్లు ఎలా దుర్వినియోగం అయ్యాయి.. ఎవరికి ఎలా చేరాయి అనేది వివరణ ►టీడీపీ ఖాతాలోకి ఎలా వెళ్లిందనేది కౌంటర్లో ప్రస్తావన ►దర్యాప్తు కీలక దశలో ఉంది.. బెయిల్ ఇవ్వొద్దని వాదించే అవకాశం ►సాక్ష్యులను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలియజేయనున్న సీఐడీ 8:45 AM, 19 అక్టోబర్, 2023 పొత్తు సరే, దుడ్ల సంగతేంటీ? ► నేడు కాకినాడలో జనసేన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల భేటీ ► ఉమ్మడి కార్యాచరణపై లోకేష్ తో చర్చించే అవకాశం ► పవన్ కళ్యాణ్ బేషరతుగా మద్ధతిచ్చాడు కాబట్టి.. తమ డిమాండ్ల సంగతి లోకేష్ ముందుంచనున్న జనసేన ఇన్ ఛార్జ్ లు ► కొన్ని స్పష్టమైన షరతులను లోకేష్ ముందుంచనున్నట్టు వెల్లడిస్తోన్న జనసేన సీనియర్లు ► తమ సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలన్నీ తమకే కేటాయించాలి ► 175 స్థానాల్లో కనీసం 50 చోట్లయినా జనసేన అభ్యర్థులు పోటీకి నిలబడాలి ► జనసేన ముసుగులోకి టిడిపి లీడర్లను ప్రవేశపెట్టకూడదు ► అప్పటికప్పుడు జనసేనలోకి టిడిపి లీడర్లను చొప్పించి వారికి టికెట్ లు ఇవ్వకూడదు ► జనసేన అభ్యర్థులకయ్యే ఖర్చులను తెలుగుదేశం భరించాలి ► తెలుగుదేశం సభలకు వచ్చే జనసేన కార్యకర్తలకు పెట్రోల్ నుంచి లిక్కర్ వరకు అన్ని ఖర్చులు టిడిపి చూసుకోవాలి ► జనసేన అభ్యర్థులు నిలబడే చోట తెలుగుదేశం పూర్తి సహకారం అందించాలి ► జనసేన అభ్యర్థులను, కార్యకర్తలను బ్రాండ్ వేరు, బ్రీడ్ వేరు అంటూ చిన్నచూపు చూడకూడదు 8:15 AM, 19 అక్టోబర్, 2023 యువగళం ఎందుకు ఆపేశానంటే.? ► ఎల్లుండి (ఈ నెల 21న) టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ► నారా లోకేష్ అధ్యక్షతన జరగనున్న సమావేశం ► యువగళంకు మంగళం అన్న విషయాన్ని చెప్పనున్న లోకేష్ ► తండ్రి జైల్లో ఉన్న కారణంగా తనకు ఢిల్లీలో పని ఉందని చెబుతోన్న లోకేష్ ► చంద్రబాబు బయటకు వచ్చేవరకు ఇక యువగళంతో పనేమి ఉందంటున్న లోకేష్ ► అదే విషయాన్ని పార్టీ క్యాడర్ కు వివరించనున్న లోకేష్ ► పార్టీ తరపున తల్లి భువనేశ్వరీ పర్యటిస్తుందని చెప్పనున్న లోకేష్ ► భువనేశ్వరి ఏం మాట్లాడాలి? ఏ ఏ సబ్జెక్టులు మాట్లాడాలో కసరత్తు చేస్తోన్న టిడిపి సీనియర్లు ► సానుభూతి రావడానికి ఏమేం మార్గాలున్నాయో పరిశోధిస్తోన్న టిడిపి సీనియర్లు 8:05 AM, 19 అక్టోబర్, 2023 బాబు మెడికల్ రికార్డులు కావాలి ► చంద్రబాబు కుటుంబ సభ్యుల పిటిషన్ పై నేడు విచారణ ► మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ ► ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు 8:00 AM, 19 అక్టోబర్, 2023 నేడు హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ► స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ ► ఏసీబీ కోర్టు బెయిల్ డిస్మిస్ చేయడంతో హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ ► నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ ► వర్చువల్ గా (వీడియో కాన్ఫరెన్స్) ACB కోర్టు ముందు చంద్రబాబును హాజరు పరచనున్న అధికారులు 7:40 AM, 19 అక్టోబర్, 2023 జైలులో చంద్రబాబు @40వ రోజు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 40వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►నిలకడగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం ►నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ గడువు ►సాయంత్రం బ్లూజీన్ యాప్‌లో ఏసీబీ న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్టనున్న అధికారులు ►సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పైనే టీడీపీ ఆశలు ►ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన ప్రజా స్పందన లేకపోవడంతో అరెస్టుపై ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నారా భువనేశ్వరి 7:30 AM, 19 అక్టోబర్, 2023 హెరిటేజ్ నాదే.. నటుడు మోహన్‌బాబు ►చంద్రబాబు మోసం చేశాడన్న మోహన్‌బాబు ►హెరిటేజ్ నాదే అని కామెంట్స్ ►హెరిటేజ్ ఫుడ్స్ తన షేర్స్ ఎక్కువన్న మోహన్‌బాబు హెరిటేజ్ నాదే .... మోసం చేసి బాబు లాక్కున్నాడు ! - సినీనటుడు మోహన్ బాబు #KhaidiNo7691#HeritageFoods #NaraBrahmani#GajaDongaChandrababu #EndOfTDPpic.twitter.com/JL9Z5Vrqqa — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 18, 2023 7:15 AM, 19 అక్టోబర్, 2023 పీక్ స్టేజ్‌కు ఎల్లో బ్యాచ్ పైత్యం ►టీడీపీ నీచ రాజకీయాలు ►అక్రమాలకి పాల్పడిన చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీకి పిచ్చెక్కిపోతోంది. ►న్యాయబద్ధంగా ప్రజాక్షేత్రంలో సీఎం వైయస్ జగన్‌ని ఎదుర్కొనే దమ్ములేక దొడ్డిదారిన నీచ రాజకీయాలు ►సీఎం జగన్ కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం ►రాజకీయాలతో సంబంధంలేని మహిళలపై పోస్టులు సీఎం వైయస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక.. ఆయన కుటుంబసభ్యులపై @JaiTDP, @JanaSenaParty లు దుష్ప్రచారానికి ఒడిగట్టాయి. రాజకీయాలతో సంబంధంలేని మహిళలను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్న మీకు.. రానున్న ఎన్నికల్లో మహిళలే తగిన బుద్ధి చెబుతారు. Save Women From TDP. pic.twitter.com/bzT3ad4ua6 — YSR Congress Party (@YSRCParty) October 18, 2023 అక్రమాలకి పాల్పడిన చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీకి పిచ్చెక్కిపోతోంది. న్యాయబద్ధంగా ప్రజాక్షేత్రంలో సీఎం వైయస్ జగన్‌ని ఎదుర్కొనే దమ్ములేక దొడ్డిదారిన నీచ రాజకీయాలకి పాల్పడుతోంది. Save Women From TDP pic.twitter.com/JmlcmtZAde — YSR Congress Party (@YSRCParty) October 18, 2023 7:00 AM టీడీపీలో పెరుగుతున్న ఆందోళన ►అటు చంద్రబాబు అరెస్ట్.. ఇటు రామోజీ రావు ►వరుస కేసుల్లో బయటికొస్తున్న అక్రమాలు ►ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసింది ఎవరు? ►14 కేసుల్లో స్టే తెచ్చుకున్న బాబుకు ఇప్పుడు చిక్కొచ్చి పడిందన్న ఆందోళనలో తమ్ముళ్లు ►ఓటుకు కోట్లు కేసులో వాట్ ఐ యామ్ సేయింగ్ అంటూ అడ్డంగా దొరికినా.. తప్పించుకోగలిగామన్న భావనలో తమ్ముళ్లు ►ఎన్నో పెద్ద అడ్డంకులు దాటి ఇప్పుడిలా దొరికిపోయామేంటన్న బాధలో తమ్ముళ్లు ►ఇటు రాజగురువు రామోజీ విషయంలోనూ బోలెడు ఆందోళన ►ఈనాడు బిల్డింగ్స్ విషయంలో ఓనర్లను బెదిరించినా మేనేజ్ చేసి బయటపడ్డ రామోజీ ►రోడ్డు ఎక్స్ టెన్షన్ పేరిట ప్రభుత్వం ఇచ్చిన కాంపన్సేషన్ నొక్కేసినా కేసులు లేకుండా బయటపడ్డ రామోజీ ►మార్గదర్శి ఫైనాన్స్ పేరిట ప్రజల సొమ్మును పక్కదారి పట్టించినా.. తప్పించుకున్న రామోజీ ►ఇప్పుడు కొత్తగా చిట్ ఫండ్స్ షేర్ల విషయంలో అసలు రూపం బయటపడడంతో తలలు పట్టుకుంటోన్న టీడీపీ లీడర్లు ►ఇన్నాళ్లు తాము అవినీతి చేయలేదని నమ్మించి, ఇప్పుడు ఆధారాలు బయటపడడంతో క్రెడిబిలిటీ కోల్పోయామన్న బాధలో టీడీపీ 6:50 AM యువగళానికి మంగళమేనా.? ► జనంలోకి వెళ్లే విషయంపై టీడీపీలో మల్లగుల్లాలు ► యువగళం పునఃప్రారంభించాలని తొలుత యోచన ► చంద్రబాబు జైల్లో ఉండడంతో యువగళంపై అనాసక్తి ► ఇప్పుడు రోడ్లపై తిరిగే సమయం లేదన్న లోకేష్ ► చంద్రబాబు తరహాలో వారానికి ఒకటి రెండు సభలకు పరిమితం కావాలన్న యోచనలో లోకేష్ ► మహిళలు, వృద్ధుల్లో సానుభూతి తెచ్చుకునేందుకు భువనేశ్వరీని రంగంలోకి దించాలన్న ప్లాన్ ► నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరిని రోడ్డెక్కించేందుకు ప్రణాళిక ► ఇప్పటికే భువనేశ్వరీ కోసం ప్లాన్ చేసిన యాత్ర విఫలం ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత భారీగా చేపట్టాలని ప్లాన్ ఫెయిల్ ► ఇప్పుడు మరోసారి భువనేశ్వరీతో మాట్లాడి ఒప్పించిన టిడిపి సీనియర్లు ► భువనేశ్వరీకి ఇప్పటివరకు లేని రాజకీయ అనుభవం ► ఏం మాట్లాడితే ఎక్కడ ఎసరు వస్తుందన్న ఆందోళనలో సీనియర్లు ► అయినా తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కనున్న భువనేశ్వరీ ► ఇటీవలే హెరిటేజ్ షేర్ల గురించి నోరు జారి పార్టీని ఇబ్బందుల్లో పడేసిన భువనేశ్వరీ ► ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఏమో కానీ.. తేడా వస్తే పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన -
రామోజీ, శైలజా కిరణ్‌పై చర్యలన్నీ 8 వారాలు నిలిపివేత
సాక్షి, అమరావతి : మార్గదర్శి సహ వ్యవస్థాపకుడు గాదిరెడ్డి జగన్నాథ రెడ్డి (జీజే రెడ్డి) షేర్లను అక్రమంగా బదలాయించిన వ్యవహారంపై నమోదైన కేసులో నిందితులైన ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు, మార్గదర్శి ఎండీ అయిన ఆయన కోడలు శైలజా కిరణ్‌పై తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీకి ఒక్క రోజే గడువిచ్చిన న్యాయస్థానం తన తండ్రి జీజే రెడ్డికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఉన్న వాటాల కోసం వెళితే రామోజీరావు తనను తుపాకీతో బెదిరించి, తమ వాటాలను శైలజా కిరణ్ పేరిట అక్రమంగా బదలాయించారంటూ యూరి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ నెల 13న కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ ఈ నెల 16న రామోజీ, శైలజా కిరణ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. సాధారణంగా క్వాష్ పిటిషన్లలో ఆ కేసు పూర్తి వివరాలను తెలుసుకొని, కోర్టు ముందుంచేందుకు పోలీసులకు న్యాయమూర్తులు వారం, మూడు రోజులు ఇలా కొంత గడువు ఇస్తారు. రామోజీరావు, శైలజా కిరణ్ వ్యాజ్యాలు న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి ముందుకు మంగళవారం విచారణకు వచ్చాయి. పూర్తి వివరాలు కోర్టు ముందుంచేందుకు రెండు రోజులు గడువివ్వాలన్న సీఐడీ స్పెషల్ పీపీ వై.శివకల్పనారెడ్డి వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఒక్క రోజే గడువిచ్చి, విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం రామోజీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, శైలజా కిరణ్ తరఫున మరో సీనియర్ న్యాయవాది నాగముత్తు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. షేర్లు కొన్నందుకు యూరి రెడ్డికి చెక్కు రూపంలో చెల్లించామని, వాటాలను బదలాయిస్తూ ఆయన సంతకాలు కూడా చేశారని తెలిపారు. ఆ తర్వాత ఆయన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కి ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు అక్కడ పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు సీఐడీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. మార్గదర్శి అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నాం కాబట్టే సీఐడీకి ఫిర్యాదు చేశారు సీఐడీ తరఫున వై.శివకల్పనా రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అత్యంత కీలకమైన ఎస్‌హెచ్–4 ఫారంను వ్యాజ్యాలతో జత చేయలేదని, దీనిని కోర్టు తప్పక పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మార్గదర్శి అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణ జరుపుతోందన్న విషయం తెలిసి ఫిర్యాదుదారు తమకు ఫిర్యాదు చేశారని వివరించారు. మార్గదర్శికి ఏపీలో కూడా శాఖలున్నాయన్నారు. వాటాల బదిలీ డాక్యుమెంట్లపై ముద్రించిన స్టాంపు ఎక్కడిదో పరిశీలించాల్సి ఉందన్నారు. అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. దర్యాప్తునకు సంబంధించిన కేసుల్లో యాంత్రికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్పిందంటూ ఆ కేసు గురించి శివకల్పన ప్రస్తావించారు. అన్ని కేసులూ తనకు తెలుసునని న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి అన్నారు. రామోజీ, శైలజా కిరణ్‌పై తదుపరి చర్యలన్నీ 8 వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘మణప్పురం’లో బంగారం మాయం
కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్ సంస్థలో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ సంస్థ బ్రాంచ్ హెడ్ మరో వ్యక్తితో కలిసి ఏకంగా రూ.6కోట్లకు పైగా విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలను స్వాహా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కంకిపాడు ఎస్ఐ కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటపావని(30) ఏడాది నుంచి కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్ సంస్థ బ్రాంచి హెడ్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ బ్రాంచ్‌లో 1,477 మంది ఖాతాదారులు 16 కిలోల బంగారు ఆభరణాలను తనఖా పెట్టి రుణాలు పొందారు. సోమవారం రాత్రి బ్రాంచ్ హెడ్‌గా ఉన్న పావని విధులు ముగించుకుని వెళ్లారు. ఆమె మంగళవారం విధులకు హాజరుకాలేదు. కొందరు ఖాతాదారులు తాము తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకునేందుకు మంగళవారం మణప్పురం బ్రాంచ్‌కు వచ్చారు. వారు ఇచ్చిన రశీదుల ప్రకారం చూడగా, బ్రాంచ్‌లో ఆభరణాలు కనిపించలేదు. దీంతో సిబ్బంది తమ సంస్థ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కంకిపాడు బ్రాంచిలోని రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం సంస్థ ఉన్నతాధికారులు అర్ధరాత్రి సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో బుధవారం గన్నవరం డీఎస్పీ జయసూర్య, సీసీఎస్, కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు పోలీసులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. మొత్తం 951 మంది ఖాతాదారులకు సంబంధించిన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించలేదని తేల్చారు. అపహరణకు గురైన బంగారు ఆభరణాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.6కోట్లకు పైగా ఉంటుంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం రూ.3.08 కోట్ల విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని మణప్పురం అధికారులు పేర్కొన్నారు. ఖాతాదారుల్లో ఆందోళన మణప్పురం కంకిపాడు బ్రాంచ్‌లో పది కిలోలకు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలియడంతో తనఖా పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నమ్మకంగా పని చేస్తున్న సిబ్బందే బంగారం చోరీ చేశారని తెలిసి నివ్వెరపోతున్నారు. మరోవైపు ఈ బ్రాంచ్‌లో సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదని పోలీసులు గుర్తించారు. రెండు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసినా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మణప్పురం ఆఫీసు కింద ఉన్న షాపుల సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలే పోలీసుల విచారణకు తోడ్పడ్డాయి. బ్రాంచ్ హెడ్ పావని పనే... బంగారు ఆభరణాల చోరీ వెనుక బ్రాంచి హెడ్‌గా పనిచేస్తున్న రెడ్డి వెంకట పావని హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమె సోమవారం రాత్రి విధులు పూర్తి^ó సుకున్న అనంతరం తనతోపాటు వచ్చిన మరో వ్యక్తితో కలిసి కార్యాలయం మూసివేసి కారులో వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. సీసీ ఫుటేజ్‌లో కారు నంబరు ఆధారంగా దావులూరు టోల్గేట్ వద్ద వివరాలు సేకరించారు. ఈ మేరకు బంగారు ఆభరణాల చోరీలో పావనికి సహకరించిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. -
చంద్రబాబు కన్నింగ్ ప్లాన్.. శ్రీనివాస్ ఎక్కడ?
స్కిల్ స్కాంలో వందల కోట్ల రూపాయలను హవాలా మార్గం ద్వారా లోకేష్‌కు అందించిన కిలారు రాజేష్ నెల రోజులకుపైగా అజ్ఞాతంలో ఉండి హఠాత్తుగా సీఐడీ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఒక రోజు విచారణ తర్వాత మళ్లీ మాయం. మరి చంద్రబాబు నాయుడి పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఎక్కడ ఉన్నట్లు?. శ్రీను విదేశాలకు చెక్కేశాడా? లేక కిలారు రాజేష్ మాయ మాటలు చెప్పినట్లు అతగాడు కూడా ఏపీలోనో ఢిల్లీలోనో దాగి ఉన్నాడా?. స్కిల్ కార్పొరేషన్లో అసలు కుంభకోణమే జరగలేదని వాదిస్తున్న టీడీపీ నేతలు కానీ.. వారికి వంతపాడే ఎల్లో మీడియా కానీ ఏ తప్పూ జరగకపోతే పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్ ఎందుకు పారిపోయారో? ఎందుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన వెంటనే విచారణకు హాజరు కాలేదో చెప్పాలంటున్నారు న్యాయ రంగ నిపుణులు. రూ.371 కోట్లు అవినీతి బాగోతంతో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం గుడ్డిగా విడుదల చేసిన 371 కోట్ల రూపాయల్లో 241 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా తరలించిన ఘరానా దొంగలు.. ఆ తర్వాత ఆ డబ్బును హవాలా మార్గంలో బాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్.. లోకేష్ సన్నిహిత సహచరుడు కిలారు రాజేష్‌లకు పంపారు. ఆ ఇద్దరూ డబ్బు అందుకున్నట్లు ఇప్పటికే ఆధారాలు వెలికి తీసింది ఈడీ. తాము అందుకున్న డబ్బును వారు చంద్రబాబు, లోకేష్‌లకు అందజేశారని ఆరోపణ. అందులో రూ.27 కోట్ల రూపాయలను చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ ఖాతాలో జమ చేసిన ఆధారాలను కూడా సీఐడీ సేకరించి కోర్టు ముందు ఉంచిన సంగతి తెలిసిందే. సీఐడీ ప్రశ్నల వర్షం.. చంద్రబాబు అరెస్ట్‌కు నాలుగు రోజుల ముందు సెప్టెంబరు 5న హవాలా లావాదేవీపైనే విచారించడానికి శ్రీనివాస్‌కు.. లోకేష్ కుడిభుజం కిలారు రాజేష్‌లకు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. అంతే రాత్రికి రాత్రే ఇద్దరూ మాయం అయిపోయారు. ఇద్దరూ విదేశాలకు చెక్కేశారని ప్రచారం జరిగింది. నెల రోజుల తర్వాత నేనిక్కడే ఉన్నా అంటూ కిలారు రాజేష్ సీఐడీ ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఇన్ని రోజులూ ఏ కలుగులో దాగున్నావని పోలీసులు అడిగితే రాజేష్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలేశాడు. ఇక రెండో కీలక నిందితుడు పెండ్యాల శ్రీనివాస్ కూడా బయటకు వస్తే దర్యాప్తు మరింత వేగంగా ముందుకు సాగుతుంది. అంతే కాదు, ఆ డబ్బు ఏ ఖాతాలోకి పంపారో కూడా తేలిపోతుంది. అయితే, శ్రీనివాస్ మాత్రం అడ్రస్ లేకుండా పోయాడు. నిజంగానే చంద్రబాబు కానీ.. శ్రీనివాస్ కానీ ఏ పాపం ఎరక్కపోతే, ఏ నేరానికి పాల్పడకపోతే సీఐడీ నోటీసులు ఇచ్చిన మరునాడే విచారణకు హాజరయ్యేవారు. అలా జరగలేదంటే వాళ్లు తప్పు చేసినట్లు రుజువైనట్లే అంటున్నారు నిపుణులు. శ్రీనివాస్ గురించే ఢిల్లీలో ఓ చానెల్ డిబేట్లో నారా లోకేష్ మాట్లాడుతూ శ్రీనివాస్ అర్జంట్‌గా అమెరికాకి పిక్నిక్ వెళ్లాడని చెప్పారు. ఏ పిక్నిక్కు వెళ్లాడు? ఎవరు పంపించారు? తిరిగి ఎప్పుడు రావాలని చెప్పారు? అన్నవి లోకేష్ చెప్పలేదు. కాకపోతే శ్రీనివాస్ కూడా ఎక్కడో దూరాన టీవీల ముందు కూర్చుని చంద్రబాబు అరెస్ట్ తర్వాత తాను భాగస్వామి అయిన కుంభకోణం గురించి కోర్టుల్లో ఏం విచారణ జరుగుతోందో.. తమ గురించి ఏమనుకుంటున్నారో గమనిస్తూనే ఉండచ్చు. కాకపోతే, ఏదో ఒక రోజున కిలారు రాజేష్లానే శ్రీనివాస్ కూడా సీఐడీ ముందు కనిపించి నేను కూడా ఏపీలోనే ఉన్నానని ఓ కథ చెప్పినా చెప్పవచ్చంటున్నారు విశ్లేషకులు. -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు. -
Oct 18th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Legal Updates and Party matters 8:40 PM, అక్టోబర్ 18, 2023 వెంటాడుతున్న పాపాలు, పార్టీలో పెరుగుతున్న ఆందోళన ► అటు చంద్రబాబు అరెస్ట్.. ఇటు రామోజీ రావు ► వరుస కేసుల్లో బయటికొస్తున్న అక్రమాలు ► ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసింది ఎవరు? ► 14 కేసుల్లో స్టే తెచ్చుకున్న బాబుకు ఇప్పుడు చిక్కొచ్చి పడిందన్న ఆందోళనలో తమ్ముళ్లు ► ఓటుకు కోట్లు కేసులో వాట్ ఐ యామ్ సేయింగ్ అంటూ అడ్డంగా దొరికినా.. తప్పించుకోగలిగామన్న భావనలో తమ్ముళ్లు ► ఎన్నో పెద్ద అడ్డంకులు దాటి ఇప్పుడిలా దొరికిపోయామేంటన్న బాధలో తమ్ముళ్లు ► ఇటు రాజగురువు రామోజీ విషయంలోనూ బోలెడు ఆందోళన ► ఈనాడు బిల్డింగ్ ల విషయంలో ఓనర్లను బెదిరించినా మేనేజ్ చేసి బయటపడ్డ రామోజీ ► రోడ్డు ఎక్స్ టెన్షన్ పేరిట ప్రభుత్వం ఇచ్చిన కాంపన్సేషన్ నొక్కిసేనా కేసులు లేకుండా బయటపడ్డ రామోజీ ► మార్గదర్శి ఫైనాన్స్ పేరిట ప్రజల సొమ్మును పక్కదారి పట్టించినా.. తప్పించుకున్న రామోజీ ► ఇప్పుడు కొత్తగా చిట్ ఫండ్స్ షేర్ల విషయంలో అసలు రూపం బయటపడడంతో తలలు పట్టుకుంటోన్న టిడిపి లీడర్లు ► ఇన్నాళ్లు తాము అవినీతి చేయలేదని నమ్మించి, ఇప్పుడు ఆధారాలు బయటపడడంతో క్రెడిబిలిటీ కోల్పోయామన్న బాధలో టిడిపి 8:35 PM, అక్టోబర్ 18, 2023 చంద్రబాబు, రామోజీ దొందు దొందే : సజ్జల ► చంద్రబాబు అరెస్ట్ విషయంలో టిడిపి తీరు వింతగా ఉంది ► టిడిపికి అధికారం ఇస్తే ఆపార్టీ అధినేత అవినీతికి పాల్పడ్డారు ► చంద్రబాబు తప్పుచేసినట్టు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి ► చంద్రబాబు పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నారు ► మార్గదర్శి షేర్ హోల్డర్ ను బెదిరించి రామోజీ షేర్లు బదిలీ చేయించుకున్నారు ► రామోజీ బెదిరింపుల పర్వం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది ► చంద్రబాబు, రామోజీ తప్పులు చేసి ప్రజల మద్దతు కోరుతున్నారు ► పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు ► మార్గదర్శి షేర్ హోల్డర్ జీజే రెడ్డి కుటుంబాన్ని బెదిరించి షేర్లు బదిలీ చేయించుకుంది రామోజీ ► చంద్రబాబు రామోజీ ఎంత నీచమైన మనుషులో నిరూపితమైంది ► రామోజీ ఎదుగుదలకు కారణమైన జీజే రెడ్డి కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాలి ► జీజే రెడ్డి కుటుంబ సభ్యులను బెదిరించి బలవంతంగా షేర్లు లాక్కున్నారు ► సిఎం అయిన రెండు నెలలకే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు ► కోర్టులు తీర్పులు ఎలా ఉన్నా వీళ్ల నిజస్వరూపం ప్రజలకు అర్ధమవుతోంది ► ఆధారాలు పరిశీలించాకే కోర్టు చంద్రబాబును రిమాండ్ కు పంపింది ► అక్రమ కేసులైతే కోర్టు సమర్ధించదు కదా ► కుటుంబసభ్యులే చంద్రబాబును అవమానిస్తున్నారు ► చంద్రబాబుకున్న చర్మవ్యాధులు తీవ్రమైనట్టు అసత్య ప్రచారం చేశారు:సజ్జల 8:25 PM, అక్టోబర్ 18, 2023 PT వారంట్ పై 20న వాయిదా ► ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టు నిర్ణయం వాయిదా ► పీటీ వారెంట్ పై నిర్ణయం ఈనెల 20కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 8:15 PM, అక్టోబర్ 18, 2023 యువగళానికి మంగళమేనా.? ► జనంలోకి వెళ్లే విషయంపై టిడిపిలో మల్లగుల్లాలు ► యువగళం పునఃప్రారంభించాలని తొలుత యోచన ► చంద్రబాబు జైల్లో ఉండడంతో యువగళంపై అనాసక్తి ► ఇప్పుడు రోడ్లపై తిరిగే సమయం లేదన్న లోకేష్ ► చంద్రబాబు తరహాలో వారానికి ఒకటి రెండు సభలకు పరిమితం కావాలన్న యోచనలో లోకేష్ ► మహిళలు, వృద్ధుల్లో సానుభూతి తెచ్చుకునేందుకు భువనేశ్వరీని రంగంలోకి దించాలన్న ప్లాన్ ► నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరిని రోడ్డెక్కించేందుకు ప్రణాళిక ► ఇప్పటికే భువనేశ్వరీ కోసం ప్లాన్ చేసిన యాత్ర విఫలం ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత భారీగా చేపట్టాలని ప్లాన్ ఫెయిల్ ► ఇప్పుడు మరోసారి భువనేశ్వరీతో మాట్లాడి ఒప్పించిన టిడిపి సీనియర్లు ► భువనేశ్వరీకి ఇప్పటివరకు లేని రాజకీయ అనుభవం ► ఏం మాట్లాడితే ఎక్కడ ఎసరు వస్తుందన్న ఆందోళనలో సీనియర్లు ► అయినా తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కనున్న భువనేశ్వరీ ► ఇటీవలే హెరిటేజ్ షేర్ల గురించి నోరు జారి పార్టీని ఇబ్బందుల్లో పడేసిన భువనేశ్వరీ ► ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఏమో కానీ.. తేడా వస్తే పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన 19:55 PM, అక్టోబర్ 18, 2023 టీడీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యింది ►చంద్రబాబు ప్రజల ఆస్తి అట. ►ఆయన కోసం పోరాడాల్సిన బాధ్యత జనానిదేనట ►మైండ్ బ్లాక్ అయిన టీడీపీ నేతలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ►చంద్రబాబు గారేమో ప్రజలే తన ఆస్తి అనుకుని ఖజానాకు కన్నం వేశారు. ►చంద్రబాబు దొరికినంత దోచుకున్నారు. ►ఆయనేమీ దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త కాదు. ►గొప్ప క్రీడాకారుడు కాడు. ►ఆధారాలతో సహా దొరికి జైలుపాలైన నిందితుడు ►అన్నింటికి మించి.. వెన్నుపోటుదారుడు. :::వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘చంద్రబాబు ప్రజల ఆస్తి. ఆయన కోసం పోరాడాల్సిన బాధ్యత జనానిదే’ అంటూ మైండ్ బ్లాక్ అయిన టీడీపీ నేతలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. చంద్రబాబు గారేమో ప్రజలే తన ఆస్తి అనుకుని ఖజానాకు కన్నం వేశారు. దొరికినంత దోచుకున్నారు. ఆయనేమీ దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త కాదు. గొప్ప క్రీడాకారుడు కాడు.… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 18, 2023 చంద్రబాబు మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని కబ్జా చేస్తే.. తనకు ఆర్థికంగా అండగా నిలిచిన జీజే రెడ్డి కుటుంబాన్ని రామోజీ వెన్నుపోటు పొడిచాడు. వీరిద్దరి నిజస్వరూపం ఏంటో ప్రజలకు అర్థమవుతోంది. - వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి#GajadongaChandrababu… pic.twitter.com/t6ujubQN7g — YSR Congress Party (@YSRCParty) October 18, 2023 18:46 PM, అక్టోబర్ 18, 2023 చంద్రబాబు కేసులు అన్నీ తెలుసు ►ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన టీడీపీ బృందం ►చంద్రబాబు కేసు వివరాల్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం ►స్కిల్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ కేసుపై 50 పేజీల నివేదిక ఇచ్చాం ►ఏపీ పరిణామాల్ని తెప్పించుకుని.. కేంద్రానికి నివేదించాలని కోరాం ►ఈ మూడు కేసులపై టీడీపీ వేసిన పుస్తకాలను గవర్నరుకు అందించాం. ►ఈ కేసు మొత్తం అంశాలన్ని తనకు తెలుసని గవర్నర్ చెప్పారు. ►కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి ఇంత కంటే మాట్లాడనని గవర్నర్ అన్నారు. :::టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 17:15 PM, అక్టోబర్ 18, 2023 ముగిసిన ములాఖత్ ►చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో కుటుంబ సభ్యుల ములాఖత్ ► గంటపాటు సాగిన ములాఖత్ ► ములాఖత్ తర్వాత ఏం మాట్లాడకుండా వెళ్లిపోయిన నారా లోకేష్ 17:04 PM, అక్టోబర్ 18, 2023 సీడీఆర్ పిటిషన్ విచారణ వాయిదా ►కాల్ డేటా రికార్డుల పిటిషన్ విచారణ 20వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్స్ తో పాటు పోలీస్ అధికారుల జాబితా కావాలని ఏసీబీ కోర్టు లో పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►గతంలో వేసిన సీడీఆర్ పిటిషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఏసీబీ కోర్టు ►పిటిషన్‌ను కరెక్షన్ చేసి తీసుకురావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు సూచించిన ఏసీబీ కోర్టు ►లీగల్ ప్రొవిజన్ ప్రకారం పిటీషన్ లోని అంశాలను ప్రస్తావించాలని సూచించిన కోర్టు ►లీగల్ ప్రొవిజన్ ప్రకారం కరెక్షన్ చేసి మరోసారి పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►విచారణ 20వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి ►సీడీఆర్ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు వినిపించిన సీఐడీ తరపు స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ వివేకానంద ►సీడీఆర్ పిటీషన్ కి విచార్హత లేదని వాదించిన వివేకానంద ►కౌంటర్ ఆర్గ్యూమెంట్స్ వినిపించాల్సిన చంద్రబాబు తరపు న్యాయవాదులు 15:52 PM, అక్టోబర్ 18, 2023 ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పై నిర్ణయం వాయిదా ►ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పై నిర్ణయం 20కి వాయిదా ► ఈ పిటిషన్‌పై ఇవాళ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చాల్సిన అధికారులు ►సుప్రీం కోర్టులో ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ►శుక్రవారం విచారణ చేపడతామన్న ధర్మాసనం ►ఆలోపు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని సీఐడీ తరపు న్యాయవాదులకు సూచన ►సుప్రీం సూచన మేరకు.. నిన్ననే మెమో దాఖలు చేసిన సీఐడీ 15:50 PM, అక్టోబర్ 18, 2023 కాసేపట్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ►నాలుగు గంటలకు ములాఖత్ కానున్న భువనేశ్వరి , నారా లోకేష్ , బ్రాహ్మణి 13:44 PM, అక్టోబర్ 18, 2023 చంద్రబాబు, రామోజీల బండారం బయటపడింది ►చంద్రబాబు తప్పు చేసినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి ►చంద్రబాబు పట్ల ప్రభుత్వం ఏదో అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారు ►పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు ►షేర్ హోల్డర్లను బెదిరించి షేర్లు బలవంతంగా తన పేరిట రాయించుకున్న రామోజీరావు ►రామోజీ బెదిరింపుల పర్వం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది ►మార్గదర్శి షేర్ హోల్డర్ జీజే రెడ్డిని బెదిరించిన చరిత్ర రామోజీరావుది ►అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడ్డ చరిత్ర చంద్రబాబుది ►చంద్రబాబు, రామోజీరావులు తప్పులు చేసి ప్రజల మద్దతు కోరుతున్నారు ►కోర్టుల తీర్పు ఎలా ఉన్నా.. వీళ్ల నిజస్వరూపం మాత్రం ప్రజలకు అర్థమవుతోంది :::తాడేపల్లిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 13:37 PM, అక్టోబర్ 18, 2023 సీడీఆర్ పిటిషన్లో కీలక మలుపు ►కాల్ డేటా రికార్డుల పిటిషన్‌ని కరెక్షన్ చేసి తీసుకురావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు సూచించిన ఏసీబీ కోర్టు ►లీగల్ ప్రొవిజన్ ప్రకారం పిటిషన్ లోని అంశాల్ని ప్రస్తావించాలని సూచించిన ఏసీబీ కోర్టు ►విజయవాడ ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్‌పై విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ డేటా ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►కోర్టు తాజా ఆదేశాలతో.. కరెక్షన్ వేసి మరో పిటిషన్ వేయనున్న బాబు లాయర్లు ►కాల్ డేటా రికార్డ్స్ పిటీషన్ కి విచార్హత లేదని ఇప్పటికే వాదనలు వినిపించిన సీఐడీ న్యాయవాది స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ వివేకానంద ►రిప్లై ఆర్గ్యూమెంట్స్ వినిపించనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు, ఆ తర్వాత సీఐడీ అధికారులు మాట్లాడిన కాల్ డేటా రికార్డులు ఇవ్వాలని పిటిషన్లో ప్రస్తావన 13:15 PM, అక్టోబర్ 18, 2023 ఇన్నర్ రింగ్‌రోడ్ కేసు విచారణ వాయిదా ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ►విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 11:00 AM, అక్టోబర్ 18, 2023 నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►చంద్రబాబుతో నేడు నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్ ►ములాఖత్ కోసం ఢిల్లీకి ఏపీకి నారా లోకేశ్ ►రాజమండ్రి చేరుకున్న లోకేశ్. 10:50 AM, అక్టోబర్ 18, 2023 రామోజీ క్వాష్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం ►రామోజీ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ప్రారంభం ►సీఐడీ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన రామోజీ, శైలజ ►రామోజీ తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూథ్రా. ►శైలజ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది నాగముత్తు ►రామోజీ క్వాష్ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా 10:00 AM, అక్టోబర్ 18, 2023 ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌పై నేడు విచారణ ►ఇన్నార్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంపై నేడు హైకోర్టులో విచారణ ►ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బాబు పిటిషన్చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ ►మార్గదర్శి షేర్ల బదలాయింపు వ్యవహారంలోనూ విచారణ ►రామోజీరావు, శైలజ క్వాష్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ 9:15 AM, అక్టోబర్ 18, 2023 సీఎం జగన్‌కే మా ఓటు.. ►అవినీతికి పాల్పడ్డాడు కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. ►పవన్ కల్యాణ్‌కు ఓటేసే ప్రసక్తే లేదు ►సీఎం జగన్‌కే మరోసారి మా ఓటు అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికాడు కాబట్టే.. చంద్రబాబు జైల్లో ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్‌కు ఓటేసే ప్రసక్తే లేదు. సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం @ysjagan గారికే మా ఓటు. - సామాన్య మహిళ అభిప్రాయం#PublicVoice #AndhraPradesh #EndofTDP pic.twitter.com/5mGaHVXHmN — YSR Congress Party (@YSRCParty) October 18, 2023 8:50 AM, అక్టోబర్ 18, 2023 జైలులో చంద్రబాబు @39వ రోజు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 39వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ►ప్రతీరోజూ మూడుసార్లు చంద్రబాబుకు ఆరోగ్య పరీక్షలు ►చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు ►భద్రతా కారణాలు రీత్యా చంద్రబాబు లీగల్ ఇంటర్వ్యూలు రోజుకు ఒకటి మాత్రమే ఉండే విధంగా కుదించిన అధికారులు ►జైల్లో రెండు వేలకు పైగా ఉన్న ఖైదీలకు ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకున్న జైలు అధికారులు 8:00 AM, అక్టోబర్ 18, 2023 ఈనాడు, జ్యోతిపై సెటైర్లు.. జర్నలిస్ట్ సాయి ►వినేవాడు వెర్రోడు అయితే.. రాసే వ్యక్తి రామోజీ ►ఆంధ్రజ్యోతికి సెటైరికల్ పంచ్ వినేవాడు వెర్రోడు అయితే ... రాసేవాడు రామోజీ...#KhaidiNo7691 #BanYellowMedia pic.twitter.com/7mzcJH5sSL — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 18, 2023 ఇలా వుంటుంది మరీ..పచ్చ మీడియా ప్రచారం...#KhaidiNo7691 #BanYellowMedia pic.twitter.com/x4xRoBghYq — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 18, 2023 6:50 AM, అక్టోబర్ 18, 2023 బాబు హెల్త్ బులిటెన్ పిటిషన్‌పై నేడు విచారణ ►చంద్రబాబు హెల్త్ బులెటెన్ విషయంలో పిటిషన్ ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరపు లాయర్ల పిటిషన్ ►విజయవాడ ఏసీబీ కోర్టులో బాబు లాయర్ల పిటిషన్ ►కౌంటర్ వేయాలని సీఐడీని ఆదేశించిన కోర్టు ►నిన్న సాయంత్రం దాఖలు చేసిన సీఐడీ తరపు న్యాయవాదులు ►నేడు విచారణ జరిగే అవకాశం 6:40 AM, అక్టోబర్ 18, 2023 ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు ►ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారెంట్‌పై నేడు చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉంది ►అయితే.. సుప్రీం కోర్టు ఫైబర్ నెట్‌పై దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా వేసింది ►విచారణ జరిగే శుక్రవారం దాకా అరెస్ట్ చేయొద్దని సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీకి కోర్డు సూచించింది ►అదే అంశాన్ని మెమో ద్వారా ఏసీబీ కోర్టుకు తెలిపిన సీఐడీ ►మళ్లీ ఎప్పుడు హాజరుపర్చాల్సిందీ ఏసీబీ కోర్టు నేడు నిర్ణయించే అవకాశం. 6:30 AM, అక్టోబర్ 18, 2023 పచ్చకళ్లదాలు తీసి.. వాస్తవాలు చూడు రామోజీ ►చంద్రబాబు హయాంలోనే ఈ-చలానాల స్కామ్ ►స్కామ్‌కి సూత్రధారైన నాటి డీజీపీని నియమించింది బాబే ►వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక స్కామ్‌పై ఎంక్వైరీ ►డీజీపీ పేరు, స్కాం జరిగిన సమయం రాయకుండా జాగ్రత్తలు 6:20 AM, అక్టోబర్ 18, 2023 టీడీపీ శ్రేణుల్లో కొత్త గుబులు ►చంద్రబాబు అరెస్ట్‌పై.. టీడీపీ శ్రేణుల్లో కొత్త టెన్షన్ ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ ►స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ కుదరదన్న ధర్మాసనం.. నేరుగా తీర్పు ఇస్తామని వెల్లడి ►శుక్రవారానికి విచారణ వాయిదా ►కానీ, శుక్రవారం లిఖిత పూర్వక వాదనలు సమర్పించనున్న ఇరుపక్షాల న్యాయవాదులు ►ఈ నెల 23 నుంచి 28 దాకా దసరా సెలవులు ►తీర్పు ఆలస్యం అవుతుందేమోనన్న ఆందోళనలో టీడీపీ శ్రేణులు 6:10 AM, అక్టోబర్ 18, 20233 చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల ►చంద్రబాబు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసిన రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ►స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై.. 38 రోజులుగా రిమాండ్ ఖైదీ 7691 నెంబర్‌తో ఉన్న చంద్రబాబు ►జైల్లో స్నేహా బ్యారక్‌లో ప్రత్యేక గదిలో చంద్రబాబు ►ప్రతిరోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు ►కోర్టు ఆదేశాల మేరకే ఇంటి భోజనానికి అనుమతి ►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ►బాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల అనవసర రాద్ధాంతం ►బరువు తగ్గారని కుటుంబ సభ్యుల తప్పుడు ప్రచారం ►ప్రతిరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు ►స్కిల్ ఎలర్జీ.. ఆపై కోర్టు ఆదేశాలతో బాబు కోసం టవర్ ఏసీ ఏర్పాటు ► హెల్త్ బులిటెన్లోనూ పూర్తి వివరాలు వెల్లడి. -
‘కిలారు’ డుమ్మా
సాక్షి, అమరావతి: ఊహించిందే జరుగుతోంది! స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కుట్రలకు తెర తీసిన టీడీపీ.. కీలక సాక్షులను ప్రభావితం చేస్తోంది. ఈ స్కామ్‌లో అక్రమ నిధుల తరలింపులో కీలక పాత్రధారిగా ఉన్న లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ సీఐడీ దర్యాప్తునకు డుమ్మా కొట్టడమే దీనికి నిదర్శనం. తాడేపల్లిలో సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయంలో సోమవారం విచారణకు హాజరైన ఆయన రెండో రోజు మంగళవారం మాత్రం ముఖం చాటేశారు. సిట్ అధికారులు తనను ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానంటూ నమ్మబలికిన కిలారు రాజేశ్ రెండో రోజు మాత్రం గైర్హాజరయ్యాడు. తాను ప్రస్తుతం విచారణకు రాలేనని, దసరా తరువాత వస్తానంటూ ఈ మెయిల్ పంపడం గమనార్హం. తొలుత పరారై.. టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణాల్లో నారా లోకేశ్, కిలారు రాజేశ్ ప్రధాన పాత్ర పోషించినట్లు సీఐడీ ఇప్పటికే గుర్తించింది. అదే విషయాన్ని సీఐడీ అదనపు డీజీ సంజయ్ ప్రకటించడంతో ఆందోళనకు గురైన మాజీ సీఎం చంద్రబాబు వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లాలని కిలారు రాజేశ్‌ను ఆదేశించారు. దీంతో ఆయన చాలా రోజులు అదృశ్యమయ్యారు. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసాని అప్పటికే విదేశాలకు పరారు కావడం గమనార్హం. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీఐడీ తరపు న్యాయవాదులు ఇదే వ్యవహారాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కేసు దర్యాప్తునుచంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని, సాక్షులను బెదిరిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అనివార్యంగా హాజరు.. అనివార్యంగా హాజరు కావాల్సి రావడంతో సోమవారం సిట్ కార్యాలయానికి వచ్చిన కిలారు రాజేష్ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. కీలక ఆధారాలను ప్రదర్శిస్తూ సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడంతో బెంబేలెత్తారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు, కాంట్రాక్టులకు సంబంధించిన పత్రాల గురించి సిట్ అధికారులు ప్రశి్నంచినట్లు సమాచారం. ప్రస్తుతం అవి తనవద్ద లేవని, ఇంట్లో ఉన్నాయని, సమయం ఇస్తే వాటిని తెస్తానని చెప్పిన కిలారు రాజేశ్ మర్నాడు పత్తా లేకుండా పోవడం గమనార్హం. లోకేశ్ వార్నింగ్‌తో మళ్లీ అజ్ఞాతంలోకి స్కిల్ స్కామ్‌లో నిధుల మళ్లింపుపై సిట్ కీలక ఆధారాలను సేకరించినట్లు గుర్తించిన లోకేశ్, ఆయన న్యాయ నిపుణుల బృందం కిలారు రాజేశ్ వరుసగా రెండో రోజు విచారణకు హాజరైతే మరిన్ని ఆధారాలు వెలుగు చూడటం ఖాయమని ఆందోళన చెందింది. సిట్ అధికారులు అడిగిన పత్రాలను ఇవ్వొద్దని, రెండో రోజు విచారణకు హాజరుకావొద్దని అతడిని లోకేశ్ ఆదేశించినట్లు సమాచారం. కేసు విచారణకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించవద్దని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని లోకేష్ హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో దసరా తరువాత మాత్రమే విచారణకు వస్తానంటూ మెయిల్ పంపిన కిలారు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటూనే సాక్షులను ఈ స్థాయిలో బెదిరిస్తున్న చంద్రబాబు బెయిల్‌పై బయటకు వస్తే ఈ కేసులో కీలక సాక్షులను మరింత ఒత్తిడికి గురి చేసిదర్యాప్తును పూర్తిగా పక్కదారి పట్టించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కిలారు రాజేశ్ గైర్హాజరును న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. -
మాపై సీఐడీ కేసు కొట్టేయండి
సాక్షి, అమరావతి : తమపై సీఐడీ తాజాగా నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్ హైకోర్టును ఆశ్రయించారు. రామోజీరావు తమను తుపాకీతో బెదిరించి, సంతకాలు ఫోర్జరీ చేసి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమకున్న షేర్లను ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ అయిన శైలజా కిరణ్ పేరు మీద అక్రమంగా బదలాయించుకున్నారని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో వాటాదారు అయిన జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. యూరి రెడ్డి ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉండటంతో సీఐడీ అధికారులు రామోజీరావు ఏ1గా, శైలజా కిరణ్ ఏ2గా కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ రామోజీరావు, శైలజా కిరణ్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి మంగళవారం విచారణ జరిపారు. రామోజీరావు, శైలజా కిరణ్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, నాగముత్తు, హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సీఐడీ తరఫున స్పెషల్ పీపీ వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలు మొదటిసారి విచారణకు వస్తున్నందున కేసు పూర్తి వివరాలను తెలుసుకుని, వాటిని కోర్టు ముందుంచాల్సి ఉందని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని శివకల్పనారెడ్డి కోరారు. లూథ్రా జోక్యం చేసుకుంటూ.. ఈలోపు పిటిషనర్లను అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. ఈలోపు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పోసాని వెంకటేశ్వర్లు కోరారు. ఇందుకు న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈలోపు పిటిషనర్ల విషయంలో కఠిన చర్యలేవైనా తీసుకోబోతున్నారా.. అని శివకల్పనారెడ్డిని ప్రశ్నించారు. ఈలోపు ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అవసరం లేదని, పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతామని శివకల్పనారెడ్డి చెప్పారు. బుధవారం వరకు కఠిన చర్యలు తీసుకోబోమంటే విచారణను వాయిదా వేస్తానని న్యాయమూర్తి తెలిపారు. దీంతో అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని శివకల్పనారెడ్డి చెప్పారు. దీనిని రికార్డ్ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
బాబుకు నో రిలీఫ్
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకి మధ్యంతర బెయిలు మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులోనూ మధ్యంతర బెయిలు ఇవ్వాలన్న చంద్రబాబు విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణ శుక్రవారం చేపడతామని పేర్కొంది. అప్పటి వరకూ చంద్రబాబును అరెస్టు చేయొద్దని చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఇరుపక్షాల వాదనలు పీసీ చట్టం సెక్షన్ 17ఏ పైనే జరిగాయి. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రంజిత్‌కుమార్, నిరంజన్‌రెడ్డి వాదించగా, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్దార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. తొలుత సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ సెక్షన్ 17ఏ ఈ కేసుకు వర్తించదని చెప్పారు. ఇది 2018 కన్నా ముందు జరిగిన నేరమని, ఆ సమయంలో ఉనికిలోనే లేని చట్టం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. 2018 జూన్‌లోనే విచారణ ప్రారంభించామని తెలిపారు. ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ నేరాలు ఉన్నాయా.. లేదా.. అనేది చూడాలని చెప్పారు. సెక్షన్ 17ఏ నిజాయితీపరులకే తప్ప అవినీతిపరులకు రక్షణ కవచం కాకూడదని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అవినీతి జరిగిందని స్పష్టంగా కనిపిస్తోందని, అటువంటప్పుడు సెక్షన్ 17ఏ అసలు వర్తించదని చెప్పారు. రూ. వందల కోట్ల కుంభకోణం దర్యాప్తును అడ్డుకోవడానికి ఈ సెక్షన్‌ను ఉపయోగించరాదని అన్నారు. 2015–16లో చట్టంలో లేనివి వర్తించవని చెప్పారు. సెక్షన్ 17ఏ భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. పీసీ చట్టానికి సంబంధం లేని అభియోగాలపై విచారించే పరిధి ప్రత్యేక కోర్టుకు ఉందని పలు కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ గట్టిగా వాదనలు వినిపించారు. ఒక వ్యక్తి పీసీ చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం నిందితుడు అయితే.. ఏదైనా కారణాలతో పీసీ చట్టం నేరాలను దాని నుంచి తొలగించినప్పటికీ, ప్రత్యేక న్యాయమూర్తి మిగిలిన ఐపీసీ కింద సెక్షన్లపై చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం విచారణ చేయొచ్చని తెలిపారు. ఈ కేసులో ప్రత్యేక కోర్టు నిందితుడి విడుదలకు నిరాకరించిందని తెలిపారు. ప్రస్తుత కేసులో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నామని, డిశ్చార్జి ఉందా లేదా అనేది పక్కనపెడితే.. పోలీసుల దర్యాప్తులో పీసీ లేదా పీసీయేతర అభియోగాల మధ్య తేడా లేనప్పుడు ఎఫ్ఐఆర్ను ఎలా క్వాష్ చేస్తారని ప్రశ్నించారు. ఇది రాజకీయ కక్ష కాదని, కేంద్ర దర్యాప్తు సంస్థల ఆరోపణలపైనా దర్యాప్తు జరిగిందని తెలిపారు. ఒకవేళ సెక్షన్ 482 విచక్షణ ప్రకారం రిలీఫ్ ఇవ్వాలంటే దానికి కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయన్నారు. ఈ కేసుకు ఆ అర్హత కూడా లేదని కౌంటర్ అఫిడవిట్‌ను పరిశీలిస్తే అర్థం అవుతుందని తెలిపారు. సుప్రీంకోర్టే ప్రాథమిక విచారణ చేయాలనుకోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగా తన వాదనలను సమర్థించే వేర్వేరు తీర్పులను ధర్మాసనం ముందుంచారు. 40 రోజులుగా జైల్లో ఉన్నారు బెయల్ ఇవ్వండి చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కక్ష సాధింపులు నిరోధించేందుకే 17ఏ ఉందని, ఇది చట్టం కల్పించిన రక్షణ అని చెప్పారు. రాష్ట్ర వాదన చూస్తుంటే.. సెక్షన్ 17ఏ అమాయకులైన వారికే వర్తిస్తుందన్నట్లుందని చెప్పారు. నిర్దోషులని నిర్ధారించడానికి నిర్దోషిత్వంపై ముందుగా విచారణ నిర్వహించాలంటూ ప్రొవిజన్ తలక్రిందులు చేస్తున్నారని ఆరోపించారు. జీఎస్టీ చెల్లింపులకు, ప్రభుత్వానికి ముడిపెడుతున్నారన్నారు. 2021లో విచారణ ప్రారంభించి ఆధారాల కోసం మళ్లీ వెదుకుతున్నారని ఆరోపించారు. ఈ కేసులో సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చెప్పారు. 40 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారని, మద్యంతర బెయిలు ఇవ్వాలని సాల్వే అభ్యర్థించారు. సాల్వే వాదనలను లూథ్రా సమర్థించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను 19కి వాయిదా వేసిన హైకోర్టు చంద్రబాబు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు ఉత్తర్వులు సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్లో తదుపరి విచారణను నెల 19వ తేదీకి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ ఏసీబీ కోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా, చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు
సాక్షి, అమరావతి: ‘రామోజీరావు పచ్చి మోసం చేశారు. తొలుత మమ్మల్ని ఓ గదిలో నిర్బంధించి, తుపాకీతో బెదిరించి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్లు బదిలీ చేయించుకోవాలని ప్రయత్నించారు. ప్రాణా లు దక్కించుకొనేందుకు ఆయనిచ్చిన ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు పెట్టి బయట పడ్డాం. షేర్లు మాత్రం బదిలీ చేయలేదు. ఆ తర్వాత ఫోర్జరీ సంతకాలతో మాకున్న 288 షేర్లను ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు బదలాయించుకున్నారు’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి చెప్పారు. తమ షేర్లను బదిలీ చేసి రామోజీ మోసానికి పాల్పడ్డారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని సీఐడీని, న్యాయస్థానాన్ని కోరారు. యూరి రెడ్డి మంగళవారం తన న్యాయవాది శివరామిరెడ్డితో కలిసి విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రామోజీరావు ఏ విధంగా తమ షేర్లను అక్రమంగా బదలాయించుకున్నదీ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. తుపాకితో బెదిరించి.. మా తండ్రి జీజే రెడ్డి చనిపోయిన తరువాత మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా అన్నయ్య మార్టిన్ రెడ్డి, నేను మా వాటా షేర్ల కోసం ఎన్నో ఏళ్లు రామోజీరావును సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి 2016లో హైదరాబాద్‌లో ఆయన్ని కలిశాము. మాకు డివిడెండ్ కింద చెక్ ఇచ్చారు. ఆ తరువాత మా షేర్లపై సర్టిఫికెట్ అడిగితే ఓ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు. మమ్మల్ని లోపల ఉంచి తలుపులు వేసేశారు. చాలాసేపటి తరువాత రామోజీరావు వచ్చి ఖాళీ స్టాంపు పేపర్లు ముందు పెట్టారు. వాటిపై సంతకాలు చేయమన్నారు. మేము నిరాకరించడంతో మా తలలకు తుపాకి గురి పెట్టి ‘సంతకాలు పెడతారా లేదా.. మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరు ఇక్కడ’ అని బెదిరించారు. అది ఆయన సామ్రాజ్యం. అంతా ఆయన మనుషులే. మా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేరు. ఆ సమయంలో అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడతామనుకోలేదు. ఆయనకు ఎదురు చెబితే ప్రాణాలు దక్కవన్నది అర్థమైంది. కేవలం ప్రాణాలు కాపాడుకొనేందుకే ఆ ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు చేసి బయటకు వచ్చాం. షేర్ల బదిలీకి మేము అంగీకరించలేదు. షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి చేయలేదు. రామోజీరావు మాకు ఇచ్చిన చెక్‌ను కూడా నగదుగా మార్చుకోలేదు. చట్ట ప్రకారం ఇది చెల్లదు కంపెనీల చట్టం ప్రకారం ఏదైనా షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి కావాలంటే మూడు అంశాలు తప్పనిసరి. ప్రతిపాదన (ఆఫర్), ఆమోదం (యాక్సెప్టెన్సీ), ప్రతిఫలం బదిలీ (కన్సిడరేషన్) తప్పనిసరి. మా షేర్ల బదిలీ విషయంలో ఆ మూడూ జరగలేదు. షేర్లు బదిలీ చేస్తామని మేము ఎక్కడా చెప్పలేదు. అందువల్ల ప్రతిపాదనే లేదు. రామోజీరావు కోరినా మేము ఆమోదించలేదు. అందువల్ల యాక్సెప్టెన్సీ లేదు. మా షేర్ల బదిలీకి ప్రతిఫలంగా మాకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలమూ దక్కలేదు. కాబట్టి మేము షేర్లు విక్రయించామన్న రామోజీరావు వాదన చెల్లదు. ఆయన వాదన పూర్తిగా అబద్ధం, మోసపూరితం. చేతి అప్పు అంటూ బుకాయింపు మా తండ్రికి చేతి అప్పుగా ఇచ్చిన దానికి ప్రతిఫలంగానే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి నిధిని సమకూర్చారని రామోజీరావు ముందుగా బుకాయించారు. చేతి అప్పు తీర్చాలి అంటే నగదు ఇస్తారు గానీ కంపెనీలో పెట్టుబడి పెడతారా అని మేము ప్రశ్నిస్తే రామోజీరావు సరైన సమాధానం ఇవ్వలేదు. అనంతరం షేర్లు బదిలీ చేయాలని మమ్మల్ని తుపాకీతో బెదిరించారు. ఫోర్జరీ సంతకాలతో షేర్ల బదిలీ.. ఆర్వోసీకి ఫిర్యాదు మేము సమ్మతించకపోయినా, చెక్‌ను నగదుగా మార్చుకోకపోయినా మా వాటా 288 షేర్లను రామోజీరావు ఆయన కోడలు శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారని 2017లో గుర్తించాం. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి వెళ్లి సంబంధిత పత్రాలను పరిశీలిస్తే అసలు విషయం తెలిసింది. పలు పత్రాల్లో మా సంతకాలను ఫోర్జరీ చేశారు. దీనిపై అప్పట్లోనే ఆర్వోసీకి ఫిర్యాదు చేశాను. సీఐడీ దర్యాప్తుతో ధైర్యం వచ్చి.. రామోజీరావు తుపాకీతో బెదిరించారని కొందరికి మా ఆవేదన చెప్పుకున్నా అప్పట్లో ఫలితం లేకపోయింది. దాంతో ఫిర్యాదు చేసేందుకు ధైర్యం సరిపోలేదు. ఆయన రాజకీయ పరపతి ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వ్యవస్థలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల సొమ్ము అక్రమ పెట్టుబడులకు మళ్లించిన వ్యవహారంలో ఏపీ సీఐడీ రామోజీ, ఇతరులపై కేసు నమోదు చేసింది. సోదాలు నిర్వహిస్తోంది. దాంతో మాకు ధైర్యం వచ్చింది. అందుకే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని సీఐడీకి కొన్ని నెలల క్రితం ఫిర్యాదు చేశాము. సీఐడీ అధికారులు నాలుగైదు నెలలపాటు మా ఫిర్యాదును పరిశీలించారు. ఆధారాలు తెమ్మన్నారు. మేము ఇచ్చిన ఆధారాలను పరిశీలించారు. మా ఫిర్యాదు సరైనదే అని నిర్ధారించుకున్న తరువాతే కేసు నమోదు చేశారు. మూలధన నిధి ఏపీ నుంచే వచ్చింది కాబట్టి.. మా తండ్రి జీజే రెడ్డి కృష్ణా జిల్లాలోని తన వ్యవసాయ భూమి ద్వారా వచ్చిన ఆదాయాన్నే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడిగా పెట్టారు. అంటే మూలధన నిధిని ఏపీ నుంచే సమీకరించారు. ఆ పెట్టుబడితోనే మా పేరిట 288 షేర్లు వచ్చాయి. ఆ షేర్లనే రామోజీరావు ఆయన కోడలు శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారు. అందుకే ఈ కేసు ఏపీకి సంబంధించినదని న్యాయ నిపుణులు చెప్పారు. దాంతోనే ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశాం. మాకు జరిగిన అన్యాయంపై సీఐడీని సంప్రదించాం. సీఐడీ, న్యాయస్థానం మా ఆవేదనను గుర్తించి న్యాయం చేస్తాయని విశ్వసిస్తున్నాం. శైలజ పేరిట అప్పుడు 100 షేర్లే.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ పేరిట 2017 వరకు 100 షేర్లే ఉన్నాయి. జీజే రెడ్డి పేరిట మాత్రం 288 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి షేర్లను అక్రమంగా బదిలీ చేసిన తరువాత ప్రస్తుతం శైలజ కిరణ్ పేరిట 388 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి తప్ప మిగిలిన షేర్ హోల్డర్లంతా రామోజీ కుటుంబ సభ్యులే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఆరుగురు షేర్ హోల్డర్లే ఉన్నారు. ఎందుకంటే ఆ సంస్థ ఏనాడూ పబ్లిక్ ఇష్యూ జారీ చేయలేదు. ఉన్న ఆరుగురు షేర్ హోల్డర్లలో అయిదుగురు రామోజీరావు కుటుంబ సభ్యులే. జీజే రెడ్డి ఒక్కరే బయట వ్యక్తి. ఆయన పేరిట ఉన్న షేర్లను కూడా అక్రమంగా శైలజ కిరణ్ పేరిట బదిలీ చేశారు. ఆ అక్రమ వ్యవహారానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని ఇతర షేర్ హోల్డర్లు.. అంటే రామోజీ కుటుంబ సభ్యులు సహకరించారు. రామోజీరావు పెద్ద గూడుపుఠాణికి పాల్పడ్డారు. -
స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్‌కు నిరాకరణ
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తూ.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే వాదనలు ముగిసే సమయంలో ఆయన తరపు లాయర్లు మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థించగా.. కోర్టు అందుకు నిరాకరించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట మంగళవారం వాడీవేడిగా వాదనలు సాగాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అయితే వాదనల సమయంలో ప్రత్యేక కోర్టుల విచారణ అధికారం గురించి రోహత్గీ ప్రస్తావించారు. అయితే వాదనలు ముగియడంతో శుక్రవారానికి పిటిషన్‌ను వాయిదా వేసింది ధర్మాసనం. శుక్రవారం ఇరుపక్షాల లాయర్లు లిఖిత పూర్వక వాదనలు అందజేయనున్నారు. అయితే ఈ నెల 23 నుంచి 28 దాకా కోర్టుకి దసరా సెలవులు ఉన్నాయి. దీంతో.. దసరా తర్వాతే చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు వెల్లడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోహత్గీ సుదీర్ఘ వాదనలు ‘‘ఈ కేసులో 17ఏ సెక్షన్ వర్తించదు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు. 17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సెక్షన్ అవినీతిపరులకు రక్షణ ఛత్రం కాకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే’’ అని రోహత్గీ వాదించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుంది. అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. అవినీతి నిరోధం కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి.. అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. న్యాయపరిధికి సంబంధించి వివాదం లేదు.. ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉంది. రూ.వందల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 422 సీఆర్పీసీ కింద క్వాష్ చేయలేం. ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్ష కూడా వేయవచ్చు’’ అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయపరిధి ఉంటుందన్నారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు ఉన్నాయన్నారు. జీఎస్టీ, ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని తెలిపారు. ‘‘నేరం జరిగిందా లేదా? ఎఫ్ఐఆర్ నమోదైందా? లేదా? అంతవరకే పరిమితం కావాలి. అవినీతి నిరోధక, సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు. ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ను ఎలా క్వాష్ చేస్తారు.మీరు అవినీతి ఆరోపణలు వర్తించవంటున్నారు.. మరి ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయి’’ అని రోహత్గీ వాదించారు. ‘‘మీరు కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చింది.. చట్టం అమల్లోకి వచ్చాక కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉటుంది?’’ జస్టిస్ బోస్ ప్రశ్నించారు. ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు.. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని రోహత్గీ కోరారు. వర్చువల్‌గా హరీష్ సాల్వే వాదనలు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపించారు. చట్టసవరణను ముందు నుంచి వర్తింపజేసే అంశంపై పలు తీర్పులను ఉటంకిస్తూ వాదనలు వినిపించారు. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుంది. రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు 17ఏ ఉంది. సెక్షన్ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుంది. ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదు. రిమాండ్ రిపోర్టు, కౌంటరు అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయి. విపక్ష నేతలను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17ఏ వర్తిస్తుంది అని వాదించారు. మధ్యంతర బెయిల్‌కు నిరాకరణ 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారు. కోర్టు సెలవుల దృష్ట్యా దయ చేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తాం అని సాల్వే కోరారు. ఈ క్రమంలో మరో లాయర్ సిద్ధార్థ లూథ్రా సైతం న్యాయమూర్తులకు అదే విజ్ఞప్తి చేశారు. అయితే మధ్యంతర బెయిల్ ప్రస్తావన లేదన్న జస్టిస్ అనిరుద్ధ బోస్.. ప్రధాన కేసులో వాదనలు విన్నామని, తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేశారు. -
Ramoji : రామోజీరావు ఘరానా మోసం, CID కేసు, వెంటనే క్వాష్ పిటిషన్
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్‌ఫండ్ చైర్మన్ రామోజీరావు నుంచి మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఆయనపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు వెళ్లింది. మార్గదర్శిలతో తమక రావాల్సిన వాటాల కోసం వెళ్తే.. రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు గాదిరెడ్డి యూరిరెడ్డి. మార్గదర్శి వ్యవస్థాపకులు జీ జగన్నాథరెడ్డి రెడ్డి కొడుకే ఈ యూరిరెడ్డి. తన తండ్రి వాటా షేర్లు తమకు ఇవ్వకుండా రామోజీరావు మోసం చేశారని.. గతంలో స్వయంగా కలిసి షేర్ల గురించి అడిగితే రామోజీరావు తుపాకీతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారాయన. యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ ఫిర్యాదు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు.. 420, 467, 120-B, R/w 34 ప్రకారం కేసు నమోదు అయ్యింది. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అవినీతి అక్రమాల పుట్ట కదిలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మధ్యే తమ షేర్‌హోల్డింగ్‌పై స్పష్టత రావడంతోనే. ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్లు ఫిర్యాదుదారుడు యూరిరెడ్డి పేర్కొన్నారు. యూరిరెడ్డి ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన తన తండ్రి జీజే రెడ్డి.. జెకోస్లోవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా నవభారత్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలను స్థాపించారు. అదే జిల్లాలోని పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావుని.. కమ్యూనిస్ట్ నేత అయిన కొండపల్లి సీతారామయ్య ఉద్యోగం కోసం జీజే రెడ్డికి రికమండ్ చేశారు. దీంతో ఢిల్లీలోని తన కంపెనీలో రామోజీరావుకు టైపిస్ట్ కమ్ స్టెనో ఉద్యోగం ఇప్పించారు జీజే రెడ్డి. అయితే రామోజీరావు తన బిజినెస్ స్కిల్స్ చూపించి.. తన తండ్రికి దగ్గరయ్యారని, ఆపై చిట్‌ఫండ్‌కంపెనీ కోసం రూ.5 వేలు పెట్టుబడి కూడా పెట్టారన్నారు. ప్రతిగా మా నాన్నకు(జీజే రెడ్డికి) రామోజీరావు షేర్లు కేటాయించారు.. అని ఫిర్యాదులో యూరిరెడ్డి పేర్కొన్నారు. 1985లో తన తండ్రి జీజే రెడ్డి మరణించిన తర్వాత షేర్ల గురించి తెలియదు. అయితే.. 2014లో సాక్షిలో వచ్చిన కథనం ఆధారంగానే తనకు తన తండ్రి మార్గదర్శిలో ఎంత కీలకంగా వ్యవహరించారో తెలిసొచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారాయన. గుమాస్తా రామోజీ .. మరి ఎలా ఓనర్ అయ్యాడు? వాటాల కోసం పలుమార్లు సంప్రదించే యత్నం చేశాం. కానీ, రామోజీరావు మమ్మల్ని కలవలేదు. ఎట్టకేలకు 2016లో తనను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు రామోజీరావు. నా తండ్రి పేరు మీద ఉన్న షేర్లు నా పేరు మీద బదలాయించామని ఆయన్ని కోరాను. దానికి ఆయన.. కొంతకాలానికి బదిలీ చేస్తానని చెప్పారు. తిరిగి ఆయన్ని కలిశాక.. నా పేరిట షేర్లు బదిలీ చేయడానికి నా సోదరుడిని నుంచి అఫిడవిట్‌పై నో అబ్జెక్షన్ సంతకం చేయమన్నారు. అయితే అక్కడ ఓ ఖాళీ అఫిడవిట్ కాగితలం ఉండడంతో మేం అభ్యంతరం వ్యక్తం చేశాం. ఆ సమయంలో కోపంతో ఉన్న తుపాకీతో బెదిరించి కాగితాలపై బలవంతంగా సంతకాలు కూడా చేయించుకున్నట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. కానీ, ఆ కాగితాలు చెల్లవని.. ప్రస్తుతం మార్గదర్శి మోసాలు వెలుగు చూస్తుండడం, ఆ షేర్లు శైలజా కిరణ్ పేరు మీద బదలాయించడంతో.. దర్యాప్తు సంస్థను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారాయన. అలా ఫిర్యాదు, ఇలా క్వాష్ పిటిషన్ యూరి రెడ్డి ఫిర్యాదుతో ఆంధ్రప్రదేశ్ CID పోలీసులు కేసు నమోదు చేయగానే.. రామోజీ రావు ఎక్కడ లేని తొందర చూపించారు. ఆఘమేఘాల మీద ఆయన లీగల్ టీం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ నమోదు చేశారు. కేవలం కొన్ని గంటల్లోనే క్వాష్ పిటిషన్ వేయడం సామాన్యులెవరికీ సాధ్యం కాని విషయం. ఈ కేసు నేడు హైకోర్టు ముందు విచారణకు రానుంది. యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ ఫిర్యాదు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు.. 420, 467, 120-B, R/w 34 ప్రకారం కేసు నమోదు అయ్యింది. ఈ FIRను సవాలు చేస్తూ క్వాష్ పిటిషన్ వేసింది రామోజీ టీం. -
కిలారు రాజేష్ సైలెన్స్.. మళ్లీ విచారణ
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ నేత కిలారు రాజేష్‌ను ఏపీ సీఐడీ సోమవారం తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో స్కామ్‌కు సంబంధించి ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు అధికారులు యత్నించారు. అయితే విచారణలో అధికారులు వేసిన ప్రశ్నలకు మౌనంగా ఉండడం.. కొన్నింటికి తెలియదనే సమాధానం ఇవ్వడంతో మరోసారి విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు ఆయన్ని కోరారు. స్కిల్ స్కామ్‌కు సంబంధించి కిలారు రాజేష్‌కు సీఐడీ అధికారులు 25 ప్రశ్నల దాకా అడిగినట్లు తెలుస్తోంది. ఇవాళ ఏడు గంటలపాటు రాజేష్ విచారణ కొనసాగింది. ప్రధానంగా మనోజ్ వాసుదేవ్ పార్థసానితో సంబంధాలపైనా ప్రశ్నలు వేసింది. అయితే.. పార్థసాని ఎవరో తనకు తెలియదని రాజేష్ సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో సీఐడీ అధికారులు పార్థసానితో జరిగిన వాట్సాప్ ఛాటింగ్, నగదు ట్రాన్జాక్షన్స్ వివరాలను కిలారు రాజేష్ ముందు పెట్టడంతో ఆయన ఖంగుతిన్నారు. అధికారులు అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలారు. ఆపై.. నారా లోకేష్‌తో పరిచయం, వ్యాపారాల గురించి సీఐడీ ఆరా తీసింది. కానీ, దానికి ఆయన సైలెంట్‌గా ఉండిపోయారు. ఆపై షెల్ కంపెనీల నుంచి వచ్చిన నగదును ఎవరెవరికి చేరవేశారని ఆరా తీశారు అధికారులు. కానీ, ఆ ప్రశ్నకు కూడా తెలియదంటూనే సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. చివరగా.. చంద్రబాబు, లోకేష్‌లతో జరిపిన మెయిల్స్ సంభాషణలపైనా సీఐడీ ఆరా తీసింది. తాను మెయిల్స్ చేయలేదు అనడంతో.. కొన్ని మెయిల్స్ వివరాల్ని రాజేష్ ముందు పెట్టారు అధికారులు. అది చూసి ‘‘తెలియదు.. గుర్తు లేదు..’’ అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఈ క్రమంలో కీలక ప్రశ్నలకే ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి రేపు(మంగళవారం, అక్టోబర్ 17న) విచారణకు రావాలని కిలారు రాజేష్‌ను సీఐడీ కోరింది. స్కిల్ స్కామ్‌కు సంబంధించిన విచారణ కోసం హాజరు కావాలని సీఐడీ అధికారులు కిలారు రాజేష్‌కు నోటీసులు జారీ చేశారు. అంతకు ముందు ఆయన ఈ కేసులో అరెస్ట్ భయంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. స్కిల్ కేసులో రాజేష్‌ను నిందితుడిగా చేర్చలేదని, అవసరమైతే సీఆర్పీసీ 41 A ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తామని సీఐడీ, కోర్టుకు తెలిపింది. -
Oct 16th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Case : Legal and Political Updates 08:49PM, అక్టోబర్ 16, 2023 న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు టిడిపి కొత్త వ్యూహం ► ఏపీ టుమారో పేరిట సంతకాల సేకరణ ► 36 లక్షల డిజిటల్ సంతకాలు సేకరించామంటూ ప్రచారం ► చంద్రబాబు బయటకు రావాలంటూ డిమాండ్లు ► ఢిల్లీకి వెళ్లి సీజేఐ ఆఫీస్ లో డిజిటల్ సంతకాలు పత్రాలు అందజేత ► చంద్రబాబు బయటకు రావాలంటే ఇదేనా మీకు తెలిసిన పద్ధతి? ► కోర్టులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి బయటపడాలనుకుంటున్నారా? ► సంతకాలు తేగానే చేసిన నేరం పోతుందా? ► చంద్రబాబు అనుభవం ఏపీకి అవసరమని చెబుతున్న వాళ్లు చంద్రబాబు చేసిన తప్పుల గురించి మాట్లాడరా? ► చంద్రబాబు తప్పు చేయలేదని కోర్టుల్లో సీనియర్ లాయర్లు ఎందుకు చెప్పడం లేదు? ► కేవలం అరెస్ట్ చేసిన విధానాన్ని మాత్రమే చూపి కేసు కొట్టేయమని ఎందుకు అడుగుతున్నారు? ► రేపు కేసు బెంచ్ మీదకు వస్తున్న సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయంలో సంతకాలు ఎలా ఇస్తారు? ► అసలు మీరు ఇచ్చిన సంతకాలకు ఎంత విశ్వసనీయత ఉంది? ► రేపు ఇంకొకరు కోటి సంతకాలు తెస్తే.. తప్పును ఒప్పు అంటారా? 06:49PM, అక్టోబర్ 16, 2023 ఏసీబీ కోర్టులో బాబు లాయర్ల మరో పిటిషన్ ►చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక ఇవ్వాలంటూ పిటిషన్ ►ఏసీబీ కోర్టులో సోమవారం పిటిషన్ వేసిన చంద్రబాబు లాయర్లు ►వైద్యులు రిపోర్ట్స్ ఇవ్వడానికి నిరాకరించారన్న బాబు లాయర్లు ►అయితే.. చంద్రబాబు ఆరోగ్యం రిపోర్ట్లు మెయిల్స్‌లో వచ్చాయన్న జడ్జి ►కాపీ అందిన తర్వాత ఇస్తామని బాబు లాయర్లకు తెలిపిన జడ్జి 06:05PM, అక్టోబర్ 16, 2023 ముగిసిన కిలారు రాజేష్ విచారణ.. రేపు మళ్లీ ►స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ విచారణ ►టీడీపీ నేతను ఏడు గంటలపాటు విచారించిన ఏపీ సీఐడీ అధికారులు ►పాతిక దాకా ప్రశ్నలు సంధించినా.. తెలియదనే సమాధానాలు ►మౌనం.. దాటవేత ధోరణి ప్రదర్శన ►చివరకు లోకేష్‌తో పరిచయం కూడా గుర్తు లేదని బుకాయింపు ►ఆధారాలను సీఐడీ అధికారులు ముందు పెట్టడంతో నీళ్లు నమిలిన కిలారు రాజేష్ ►మనోజ్ వాసుదేవ్ పార్థసాని తెలియదంటే.. వాట్సాప్ ఛాటింగ్, నగదు ట్రాన్జాక్షన్స్ ముందు పెట్టిన అధికారులు ►చివరకు.. చంద్రబాబు, లోకేష్‌తో జరిగిన మెయిల్స్ సంభాషణపైనా అడ్డంగా దొరికిపోయిన వైనం ►రేపు(మంగళవారం, అక్టోబర్ 17న) విచారణకు రావాలని కిలారు రాజేష్‌ను కోరిన సీఐడీ 05:55PM, అక్టోబర్ 16, 2023 చంద్రబాబు అరెస్ట్‌కు జనం రియాక్షన్ అందుకే లేదు ►చంద్రబాబు తప్పు చేయలేదని టీడీపీ వాళ్లే చెప్పడం లేదు ►కేవలం సాంకేతిక అంశాలు చూపించి మాత్రమే కేసు కొట్టేయాలంటున్నారు ►చంద్రబాబు జనం నుంచి వచ్చిన నాయకుడు కాదు ►నాయకుడు జనం నుండి వస్తే ప్రజల స్పందన వేరేగా ఉంటుంది ►చంద్రబాబు అరెస్టై 37 రోజులు గడుస్తున్నా ప్రజల వద్ద నుంచి ఎటువంటి స్పందన లేదు ►తమ పని తాము చేసుకుంటున్నారు ►టీడీపీ నాయకులు కూడా కొన్ని రోజులు ఆందోళన చేసినట్టు తూతూ మంత్రంగా చేసి సర్దేసుకున్నారు ►ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ గురించి ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు ►నాయకుడు కోసం ప్రజల స్వచ్ఛందంగా రోడ్లపైకి రావాలి :::ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు 05:13PM, అక్టోబర్ 16, 2023 సుప్రీంలో రేపు ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ ►విచారణ చేయనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►కోర్టు నెంబర్ 6 లో ఐటం నెంబర్ 3గా లిస్టు అయిన చంద్రబాబు కేసు ►ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు 05:08PM, అక్టోబర్ 16, 2023 స్కిల్ స్కామ్ కేసులో కొనసాగుతున్న కిలారు రాజేష్ విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ నేత, నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్‌ను విచారిస్తున్న సీఐడీ ►కిలారు రాజేష్‌ను 25 ప్రశ్నలు అడిగిన సీఐడీ ►మనోజ్ వాసుదేవ్ పార్ధసానితో సంబంధాలపై రాజేష్‌కు ప్రశ్నలు ►పార్థసాని ఎవరో తెలియదన్న కిలారు రాజేష్ ►వాట్సాప్ చాటింగ్, నగదు ట్రాన్జాక్షన్స్ వివరాలను రాజేశ్ ముందుంచిన సీఐడీ 04:48PM, అక్టోబర్ 16, 2023 సుప్రీంలో రేపు చంద్రబాబు స్కిల్ స్కాం కేసు విచారణ ►మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ చేయనున్న ధర్మాసనం ►కేసు విచారిస్తున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ►సెక్షన్ 17- A చంద్రబాబుకు వర్తింపజేయాలని వాదిస్తున్న ఆయన తరపు న్యాయవాదులు ►2015లోనే స్కిల్ స్కాంలో నేరం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన ఏపీ ప్రభుత్వం ►2018 జూన్ లోనే ఈ అంశంపై విచారణ ప్రారంభమైందని న్యాయస్థానానికి వెల్లడించిన ప్రభుత్వం ►2018 జులై నెలలో సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని, కనుక ఈ చట్టం బాబుకు వర్తించదని స్పష్టం చేస్తున్న ప్రభుత్వం 03:56PM, అక్టోబర్ 16, 2023 ఢిల్లీకి మళ్లీ లోకేష్ బాబు ►మళ్లీ ఢిల్లీ బాట పట్టిన టీడీపీ యువనేత, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబు ►చంద్రబాబు కేసుల్లో రేపు కీలక పరిణామం ► సుప్రీంకోర్టులో మంగళవారం బాబు పిటిషన్లపై విచారణ ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ ► మరోవైపు స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్‌పైనా విచారణ ►విచారణ చేపట్టనున్న జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ►సీనియర్ లాయర్లతో సంప్రదింపులు జరపనున్న లోకేష్ ►చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా 03:32PM, అక్టోబర్ 16, 2023 తెలంగాణ రాజకీయాలపై భువనేశ్వరి ఫోకస్? ►నారా భువనేశ్వరి నుంచి మాజీ ఎమ్మెల్యే , టీటీడీపీ సీనియర్ నేత నర్సింహులుకు అత్యవసర పిలుపు ►హుటాహుటిన రాజమండ్రి బయల్దేరిన బక్కని నర్సింహులు ► తెలంగాణ రాజకీయాలపై భువనేశ్వరి దృష్టిసారించడంపై సర్వత్రా చర్చ ►బాలయ్య నుంచి నారా కుటుంబం అది కూడా లాగేసుకుంటుందనే టాక్ 03:29PM, అక్టోబర్ 16, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ►ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ►విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన ఏపి హైకోర్టు ►అప్పటివరకు చంద్రబాబు ముందస్తు బెయిల్ పొడిగింపు ►ఏసిబీ కోర్టులో పీటీ వారెంట్ పై కూడా అప్పటివరకు విచారించవద్దని ఆదేశాలు ►ముందస్తు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన సిఐడీ 03:28PM, అక్టోబర్ 16, 2023 అమరావతి అసైన్డ్ భూముల కేసుపై హైకోర్టులో విచారణ ►అసైన్డ్ భూముల కేసులో ఇప్పటికే పూర్తయిన విచారణ ►కొత్త ఆధారాలు పరిగణనలోకి తీసుకుని విచారించాలని సిఐడీ మరో పిటిషన్ ►సీఐడీ అధికారుల వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ►సీఐడీ అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను పరిశీలించిన హైకోర్టు ►హైకోర్టుకు ఆడియో ఫైల్స్‌ను అందించిన సిఐడీ తరపు న్యాయవాదులు ►రేపు మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో అందింస్తామన్న సీఐడీ ►సీఐడీ పిటిషన్ విచారణపై అభ్యంతరం తెలిపిన నారాయణ తరపు లాయర్లు ►తీర్పు ఇచ్చే సమయంలో మళ్లీ పిటిషన్ సరికాదన్న నారాయణ తరపు లాయర్లు ►వేరే కేసులోని ఆధారాలు ఈకేసులో ఎలా దాఖలు చేస్తారన్న నారాయణ తరపు లాయర్లు ►కేసు రీఓపెన్‌కు అభ్యంతరాలుంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలన్న హైకోర్టు ►విచారణ వచ్చేనెల 1కి వాయిదా వేసిన హైకోర్టు 03:11PM, అక్టోబర్ 16, 2023 నారాయణ భార్య పిటిషన్ డిస్పోజ్ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి నారాయణ భార్య పిటిషన్ ►రమాదేవితో పాటు నారాయణ బావమరిది రావూరి సాంబశివరావు కూడా పిటిషన్ ►నారాయణ బినామీ ప్రమీల కూడా ముందస్తు కోసం పిటిషన్ ►హైకోర్టులో మూడు పిటిషన్లపై విచారణ ►41A నోటీసులు ఇచ్చామని న్యాయస్థానానికి చెప్పిన సీఐడీ తరపు లాయర్లు ►మూడు పిటిషన్లు డిస్పోస్ చేసిన హైకోర్టు 03:10PM, అక్టోబర్ 16, 2023 చంద్రబాబుకి ఆల్రెడీ సంకెళ్లు పడ్డాయి ►మాకు కూడా సంకెళ్లు వేయండి అన్నట్లు తెలుగుదేశం పిలుపునిస్తోంది ►టీడీపీ తలపెట్టిన న్యాయానికి సంకెళ్లు కార్యక్రమానికి ప్రజలనుండి స్పందన కరువైంది ►24 గంటల్లో ఐదు నిమిషాలు మాత్రమే కార్యక్రమానికి పిలుపునివ్వడం సిగ్గుచేటు ►ఆ కార్యక్రమం చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు ►చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691 నెంబర్ ద్వారా కోర్టు పరిధిలో ఉన్నాడు ►చంద్రబాబు ఆరోగ్యం పై అనుమానం ఉంటే కోర్టుకి తెలియజేయండి ►కోర్టు పరిధిలోకి వెళ్ళినాక ప్రభుత్వం ఏమి చేయలేదు ►ఖైదీకి ఏ సదుపాయాలు ఉంటాయో చంద్రబాబుకి అవే ఉంటాయి ►చంద్రబాబుకి ప్రైవేటు వైద్యం కావాలని పవన్ కళ్యాణ్ ఎందుకు కోర్టుని అడగట్లేదు ►పవన్ కళ్యాణ్ షూటింగ్స్ తో ఫామ్ హౌస్ లో బిజీగా ఉంటాడు ►చంద్రబాబు మీద పవన్ కల్యాణ్ ముసలి కన్నీరు కారుస్తున్నాడు ►చంద్రబాబు ఎప్పుడు పోతాడా టిడిపిని జనసేనలో కలుపుకుందామని పవన్ తాపత్రయ పడుతున్నాడు ►అంతేగాని చంద్రబాబు మీద పవన్ కి ప్రేమ లేదు ►టీడీపీ వాళ్ళని చూసి వాళ్ళ కేడరే నవ్వుకుంటుంది ►చంద్రబాబు ఉక్కు సంకల్పం ఉన్న మనిషి కాదు.. తప్పుమనిషి ►30 రోజులకే చంద్రబాబు తుప్పు బయటపడింది ►చంద్రబాబుకి లేని రోగం లేదంటూ కుటుంబ సభ్యులే దేశం మొత్తం ప్రచారం చేస్తున్నారు ►చంద్రబాబు రోగాలు ఈ నెల రోజుల్లో వచ్చినవి కావు ►చంద్రబాబు ఇంకా దేనికీ పనికిరాడని కుటుంబ సభ్యులే చెబుతున్నారు :::మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు 12:59PM, అక్టోబర్ 16, 2023 ►ఇన్నర్‌రింగ్‌రోడ్ స్కామ్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండి(బుధవారం)కి వాయిదా వేసిన హైకోర్టు ►500 పేజీల కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ 12:54PM, అక్టోబర్ 16, 2023 ►తెలంగాణలో టీడీపీ చాలా బలంగా ఉంది : కాసాని జ్ఞానేశ్వర్ ►బాలకృష్ణ తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తారు ►80 మంది అభ్యర్ధులను నిలబెట్టాలనుకుంటున్నాం ►అన్నీ చోట్ల బాలకృష్ణ ప్రచారం చేస్తారు 12:49PM, అక్టోబర్ 16, 2023 రాజమండ్రి ►హెల్త్ రిపోర్ట్స్ నివేదిక అడిగిన చంద్రబాబు లాయర్లు ►చంద్రబాబు హెల్త్ రిపోర్ట్స్ ఇచ్చేందుకు నిరాకరించిన జైలు అధికారులు ►హెల్త్ రిపోర్ట్స్ కోర్టుకు సబ్మిట్ చేశాం ►అవసరమైతే కోర్టు నుంచి తీసుకోవాలన్న జైలు అధికారులు 12:05 PM, అక్టోబర్ 16, 2023 నందమూరి, నారా ఒకే లైన్లో ఉన్నారా? ► చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాల మధ్య బేధాబిప్రాయాలొచ్చాయా? ► బావ చంద్రబాబు జైల్లో ఉంటే, బాలయ్య సినిమా ఫంక్షన్లో బిజీ బిజీగా ఎందుకుంటున్నారు? ► బ్రాహ్మణిని సొంత కుటుంబ సభ్యులు కనీస మాత్రం పట్టించుకోవడం లేదా? ► సినిమా ఫంక్షన్లకు హాజరయి జోకులు వేసే మోక్షజ్ఞ... అక్క బ్రాహ్మణీకి సంఘీభావం ఎందుకు తెలపలేదు? ► ఇన్నాళ్లు రాజమండ్రిలో బ్రాహ్మణీ ఉంటే కనీసం పరామర్శించలేదెందుకు? ► ఏపీ రాజకీయాల్లో బాలకృష్ణను తలదూర్చొద్దని చంద్రబాబు చెప్పడమే కారణమా? ► కేవలం తెలంగాణ రాజకీయాలకు మాత్రమే బాలకృష్ణను పరిమితం కావాలన్న బాబు సూచన నచ్చలేదా? ► నిరసన కార్యక్రమాల్లో బాలకృష్ణ భార్య వసుంధర ఎందుకు కనిపించడం లేదు? ► గతంలో హిందూపురం ఎన్నికల్లో ప్రచారంలో యాక్టివ్ గా కనిపించిన వసుంధర ఇప్పుడు నారా కుటుంబంపై కినుక వహించారా? ► ఇప్పుడెందుకు వదిన భువనేశ్వరీ పక్కన వసుంధర కనిపించడం లేదు? ► క్యాండిళ్ల ర్యాలీ, సంకెళ్ల ర్యాలీలో భువనేశ్వరీకి సొంత కుటుంబం నుంచి అంతగా మద్ధతెందుకు రాలేదు? ► హఠాత్తుగా బాబు కుటుంబ సభ్యులంతా రాజమండ్రి నుంచి వెళ్లిపోయారెందుకు? 11:55AM, అక్టోబర్ 16, 2023 నవంబర్ లో నారాయణ పిటిషన్ ►అసైన్డ్ భూముల కుంభకోణంలో మాజీ మంత్రి నారాయణ, ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ నవంబర్1కి వాయిదా 11:50AM, అక్టోబర్ 16, 2023 రింగ్ రోడ్ మాయ కేసులో బెయిల్ పిటిషన్లు ► ఇన్నర్ రింగ్ అలైన్మెంట్ స్కామ్‌లో నారాయణ కుటుంబ సభ్యుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ మధ్యాహ్నం గం. 2.15కి వాయిదా ►ఏపీ హైకోర్టులో నారాయణ కుటుంబ సభ్యుల ముందస్తు బెయిల్ పిటిషన్ ►ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్‌లో నారాయణ భార్య రమాదేవి, బావమరిది సాంబ శివరావు,నారాయణ బినామీ ప్రమీల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. 11:20 AM, అక్టోబర్ 16, 2023 చంద్రబాబుకు మరో షాక్ ►అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ ►ఈ కేసులో ఇప్పటికే పూర్తైన విచారణ ►నేడు తీర్పునిచ్చేందుకు సిద్దమైన కోర్టు ►ఈ కేసులో కొత్త ఆధారాలు ఉన్నాయని కోర్టులో పిటిషన్ వేసిన సీఐడీ ►సీఐడీ వేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు ►కొత్త ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్ ►కోర్టుకు ఆడియో ఆధారాలు అందజేసిన సీఐడీ ►రేపు వీడియో ఆధారాలు అందజేస్తామని కోర్టుకు తెలిపిన సీఐడీ ►కొత్త ఆధారాల నేపథ్యంలో కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ మరో పిటిషన్ ►సీఐడీ పిటిషన్లను విచారించిన కోర్టు. ►కేసు రీ ఓపెన్ చేయడంపై ఏమైనా అభ్యంతరాలుంటే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు ►విచారణ నవంబర్ 1వ తేదీకి వాయిదా. 11:10 AM, అక్టోబర్ 16, 2023 CID విచారణకు కిలారు రాజేష్ ►స్కిల్ స్కాంలో విచారణకు హాజరైన కిలారు రాజేష్ ►సిట్ కార్యాలయంలో కిలారు రాజేష్‌ను విచారిస్తున్న సీఐడీ ►ఇన్నర్ రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్ కుంభకోణాల్లో రాజేష్ కీలక పాత్రధారి ►అక్రమంగా నిధుల తరలింపులోనూ రాజేశం కీలకం ►నారా లోకేశ్‌కు రాజేష్ అత్యంత సన్నిహితుడు ►లోకేశ్ యువగళం పాదయాత్రలో రాజేష్ కీలక పాత్ర. 10:30 AM, అక్టోబర్ 16, 2023 ఎల్లో బ్యాచ్ ఓవరాక్షన్.. ►చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ నేతలు ఏం చేస్తున్నారో వారికే తెలియట్లేదు. ►రోడ్లపై బ్యాండ్ మేళం డ్రెస్సులు వేసుకుని ఓవరాక్షన్ ►వీడియోలపై నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్. ఒడియమ్మ పర్పామెన్సో 😂😂😂😂 పక్కన అ బ్యాండ్ మేళం డ్రస్సులు ఎందుకు...🤔 ఓరి నీ అమ్మ బడవ ఎవడికి వాడే ఇరగదీస్తున్నారు కదరా... అంతేలే డబ్బులు ఊరికే రావు కదా... 🤣🤣#PackageStarPK#KhaidiNo7691 #PawanaKalyan #JokerTDP#GajaDongaCBN pic.twitter.com/YnTFfJpz2K — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 15, 2023 9:10 AM, అక్టోబర్ 16, 2023 లోకేష్ కు సేఫ్ సీటు ఎక్కడ? మామకు వెన్నుపోటు తప్పదా? ► మంగళగిరివైపు చినబాబు సందేహంగా చూపులు ► తనకు సేఫ్ సీటు కావాలంటూ ముందే కమిటీకి తేల్చిచెప్పిన చినబాబు ► మంగళగిరిలో మళ్లీ ఓడితే తన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అవుతుందన్న ఆందోళన ► లోకేష్ ముందు నాలుగు ప్రతిపాదనలు పెట్టిన టిడిపి సీనియర్లు ► ఎక్కడయితే గెలవగలవో తేల్చుకోవాలని సూచించిన టిడిపి సీనియర్లు 1. హిందూపురం - సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ ► హిందూపురంలో బాలకృష్ణ సీటుకు ఎసరు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ► అక్కడ టిడిపి 2019లో గెలిచింది కాబట్టి ఈ సారి అల్లుడు అడుగుపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ► తానే పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన బాలకృష్ణ ► అల్లుడి కోసం త్యాగం చేస్తాడా? తండ్రి తరహాలో మామకు వెన్నుపోటు తప్పదా? 2. గుడివాడ - సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని ► గుడివాడలో తమ సామాజిక వర్గం ఉందన్న ఆలోచనలో తెలుగుదేశం ► అబ్బో.. కొడాలి నానిని తట్టుకోవడం కష్టమని తేల్చేసిన చినబాబు వర్గం ► ఘోరంగా ఓడిపోతే.. అసలుకే ఎసరు వస్తుందని స్పష్టం చేసిన చినబాబు వర్గం 3. పెనమలూరు - సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ► పెనమలూరులో ఇప్పటివరకు టిడిపి ఇన్ ఛార్జ్ బొడ్డేటి ప్రసాద్ ► పెనమలూరు అయితే తమ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారన్న యోచనలో టిడిపి సీనియర్లు ► పార్థసారథి బలంగా ఉన్నారన్న సర్వేల రిపోర్టులు చూపించిన చినబాబు వర్గం ► కృష్ణా జిల్లా అయినా పెనమలూరులో నెగ్గడం అతి కష్టం అని తేల్చిన చినబాబు వర్గం 4. విజయవాడ ఈస్ట్ - సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ► విజయవాడలో పార్టీ పరిస్థితి బాగుందన్న టిడిపి సీనియర్లు ► 2019లో ఈస్ట్ నుంచి గద్దె రామ్మెహన్ రావు గెలిచాడన్న సీనియర్లు ► ఈ నియోజకవర్గం ఎంచుకుంటే గ్యారంటీ ఉండొచ్చేమో అని సూచన ► విజయవాడ అయినా ఈస్ట్ లో కచ్చితంగా గెలిచే సీను లేదంటున్న లోకేష్ వర్గం ► సమన్వయ కమిటీ సభ్యులకు ముందే సూచనలు ► తెలుగుదేశం, జనసేన సామాజిక వర్గం రెండు వర్గాలు బలంగా ఉన్న నియోజకవర్గాల లిస్టు ఇవ్వాలన్న లోకేష్ 8:50 AM, అక్టోబర్ 16, 2023 రాజమండ్రి నుంచి చంద్రబాబు హెల్త్ బులెటిన్ ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు క్షేమంగా ఉన్నారు ► నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ► ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు టవర్ ఏసీ ఏర్పాటు ► BP 140/80 ► పల్స్..70/మినిట్ ► రెస్పిరేటరీ రేటు...12/మినిట్ ► SPO2 - 96% ► బరువు 67కేజీలు ► ఫిజికల్ యాక్టివిటీ... గుడ్ 8:40 AM, అక్టోబర్ 16, 2023 నేడు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ► చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ► స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 8:30 AM, అక్టోబర్ 16, 2023 నేడు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ ► అసైన్డ్ భూముల కోసం జీవో41 కేబినెట్ ఆమోదం లేకుండా తీసుకొచ్చారని చంద్రబాబు, నారాయణపై సీఐడీ మోపిన కేసులపై తీర్పు ► ఐఆర్ఆర్ కేసులో నారాయణ భార్య రమాదేవి, సాంబశివరావు, ప్రమీల ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టులో విచారణ ► అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో సీఐడీ నమోదు చేసిన 2 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని నారాయణ పిటిషన్ ► అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో సీఐడీ నమోదు చేసిన 2 కేసులను క్వాష్ చేయాలని నారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ 8:00 AM, అక్టోబర్ 16, 2023 చంద్రబాబు రాజమండ్రి జైలులో @37వరోజు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 37వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు బ్యారక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేసిన జైలు అధికారులు ►చంద్రబాబు ఆరోగ్యం స్థిరంగా ఉందంటూ మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అధికారులు ►చర్మ సంబంధిత సమస్య మినహా చంద్రబాబుకు మరే రకమైన ఆరోగ్య సమస్య లేదని స్పష్టం చేసిన వైద్యుల బృందం 7:42AM, అక్టోబర్ 16, 2023 ►అసైన్డ్ భూముల కేసులో నేడు ఏపీ హైకోర్టు తీర్పు ►అమరావతిలో అసైన్డ్ భూముల సేకరణలో చంద్రబాబు, నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని కేసు ►ఇప్పటికే హైకోర్టులో ముగిసిన విచారణ, నేడు తీర్పు ►కేసు రీ ఓపెన్ చేయాలని సీఐడీ రెండు పిటిషన్లు 7:05 AM, అక్టోబర్ 16, 2023 అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. ►స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన చంద్రబాబు ►‘సెక్షన్ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు బెడిసికొట్టిన ప్లాన్ ►ఈ కేసు 2020లో నమోదైందని బుకాయిస్తున్న టీడీపీకి షాక్ ►టీడీపీకి కేంద్ర జీఎస్టీ విభాగం లేఖతో ఎదురుదెబ్బ ►టీడీపీ సర్కారు హయాంలోనే స్కిల్ స్కామ్ మూలాలు వెలుగులోకి వచ్చాయని, దీనిపై 2017లోనే కేసు నమోదైందని ఆ లేఖలో స్పష్టం ►జీఎస్టీ విభాగం లేఖ వెలుగులోకి రావడంతో ఈ కేసులో కీలక ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టైంది. 7:00 AM, అక్టోబర్ 16, 2023 2017లోనే కేసు నమోదు.. ►చంద్రబాబు బృందం ఎతుగడలను కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ విభాగం చిత్తు చేసింది. ►కేంద్ర జీఎస్టీ డైరెక్టర్ జనరల్ (డీజీ) రాసిన లేఖ తాజాగా వెలుగులోకి రావడంతో టీడీపీ పన్నాగం బెడిసికొట్టింది. ►స్కిల్ స్కామ్ కేసు 2017లోనే నమోదై దర్యాప్తు కూడా అప్పుడే మొదలైనట్లు స్పష్టమైంది. ►దీంతో, చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదని తేటతెల్లమైంది. ►2017 మే నెలలో పుణెలో కొన్ని షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో జీఎస్టీ విభాగం భారీ అక్రమాలను గుర్తించింది. 07:10PM, అక్టోబర్ 15, 2023 ►టీడీపీకి మరోసారి షాక్ ఇచ్చిన ప్రజలు ►అట్టర్ ఫ్లాప్ అయిన న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం ►లోకేశ్ పలుపును పట్టించుకోని జనం ►చంద్రబాబు సంఘీభావంగా న్యాయానికి సంకెళ్లు అంటూ టీడీపీ కార్యక్రమం ►ప్రజల నుంచి కరువైన స్పందన. చేతులు కాలినా.. ఎల్లో మీడియా ఆకులు పట్టుకుంటోందా? అసత్యాలతో ఏమార్చే ప్రయత్నం చేస్తోందా? ► చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే లోకేష్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, హోం మంత్రిని కలవడానికి లోకేశ్ ప్రయత్నించారు : ఎల్లో మీడియా ► కారణం తెలియదు గానీ అమిత్ షా అపాయింట్మెంట్ నెల తరువాత కానీ లోకేశ్‌కు లభించలేదు : ఎల్లో మీడియా ► కలిసిన తర్వాత కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు : ఎల్లో మీడియా ► ఇంతగా చంద్రబాబును నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు రాలేదు : ఎల్లో మీడియా ► బీజేపీ పట్టించుకోవడం లేదు కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రతీకారం తీర్చుకుంటుందని ఎల్లోమీడియా భ్రమలు ► ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా చక్రం తిప్పాలని ఎల్లోమీడియా సామాజిక వర్గం ప్రయత్నిస్తోందని ప్రచారం ► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా ► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి అంత సీను ఉందా? ► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం ► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 ) ► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714) ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు? ► మా బాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో మీ పార్టీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► ఏ సర్వేలోనయినా మీ ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా? వెంటాడుతున్న అమరావతి పాపం ► అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసుల్లో కీలక పరిణామం ► కేసులను రీ ఓపెన్ చేయాలని ఏపీ హైకోర్టులో CID పిటిషన్లు ► CID వేసిన రెండు పిటిషన్లను విచారణకు అనుమతించిన హైకోర్టు పొత్తులో ఎవరి వాటా ఎంత? ► జనసేనతో సమన్వయంకోసం ఐదుగురు సభ్యులతో తెలుగుదేశం పార్టీ కమిటీ ► కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, తంగిరాల సౌమ్య ► కమిటి సభ్యులుగా పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ ► తెలుగుదేశం జనసేన మధ్య ఎన్నికల సంబంధిత అంశాలపై చర్చ ► ఎక్కడెక్కడ తెలుగుదేశం పోటీ చేయాలి? జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి? ► ఇప్పటివరకు కీలక నేతల విషయంలోనూ లోపించిన స్పష్టత ► పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు? లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడు? ► గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిన లోకేష్ ► ఈ సారి తనకు సేఫ్ సీటు కావాలని ముందే సూచించిన లోకేష్ ► మంగళగిరిలో మళ్లీ డౌటు ఉందంటూ పార్టీ సర్వేల్లో వెల్లడి ► తనకు కుప్పం ఇచ్చి చంద్రబాబు మరో చోట పోటీ చేయాలన్న యోచనలో లోకేష్ ► కచ్చితంగా గెలిచే సీట్లు ఎవన్న దానిపై టిడిపి సీనియర్ల దృష్టి ► తమ సామాజిక వర్గ ఓటర్లు ప్రభావం ఉన్న సీట్లపై కమిటీ లెక్కలు ► తన సీటు సంగతి ముందు తేల్చాలని పట్టుబడుతున్న పవన్ కళ్యాణ్ ► తమకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని ఇప్పటి నుంచే జనసేన నేతల్లో గుబులు ► ఓడిపోయే స్థానాలకు తమకు అంటగడతారన్న భయంలో జనసేన నేతలు ► కమిటీ భేటీలకు ముందే రెండు పార్టీల్లో అనుమానాలు, సందేహాలు -
2017లోనే ‘స్కిల్’ కేసు: కేంద్ర జీఎస్టీ విభాగం
సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన మాజీ సీఎం చంద్రబాబు ‘సెక్షన్ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. ఈ కేసు 2020లో నమోదైందని బుకాయిస్తున్న టీడీపీ వాదనకు కేంద్ర జీఎస్టీ విభాగం లేఖ ద్వారా తెర దించింది. టీడీపీ సర్కారు హయాంలోనే స్కిల్ స్కామ్ మూలాలు వెలుగులోకి వచ్చాయని, దీనిపై 2017లోనే కేసు నమోదైందని ఆ లేఖలో స్పష్టం చేసింది. జీఎస్టీ విభాగం లేఖ వెలుగులోకి రావడంతో ఈ కేసులో కీలక ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టైంది. సాంకేతిక సాకు ఎత్తుగడ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమంటూ టీడీపీ వ్యూహాత్మకంగా ఓ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. సీమెన్స్‌కు తెలియకుండా, ఆ కంపెనీ ముసుగులో సాగించిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని టీడీపీ గానీ ఆయన న్యాయవాదులు గానీ చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. 2018 నవంబరు నుంచి అమలులోకి వచ్చిన 17 ఏ సెక్షన్ ప్రకారం చంద్రబాబుకు రాజ్యాంగ రక్షణ లభిస్తుందని మాత్రమే అడ్డగోలుగా వాదిస్తున్నారు. 2017లోనే కేసు నమోదు.. చంద్రబాబు బృందం ఎతుగడలను కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ విభాగం చిత్తు చేసింది. ఈమేరకు కేంద్ర జీఎస్టీ డైరెక్టర్ జనరల్ (డీజీ) రాసిన లేఖ తాజాగా వెలుగులోకి రావడంతో టీడీపీ పన్నాగం బెడిసికొట్టింది. స్కిల్ స్కామ్ కేసు 2017లోనే నమోదై దర్యాప్తు కూడా అప్పుడే మొదలైనట్లు స్పష్టమైంది. కాబట్టి చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదని తేటతెల్లమైంది. 2017 మే నెలలో పుణెలో కొన్ని షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో జీఎస్టీ విభాగం భారీ అక్రమాలను గుర్తించింది. నకిలీ ఇన్వాయిస్లతో జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డ కంపెనీలను గుర్తించి విస్తృతంగా సోదాలు జరిపింది. వీటిలో స్కిల్లర్ అనే కంపెనీ కూడా ఉంది. దీనిపై నాడే తీగ లాగడంతో చంద్రబాబు ప్రభుత్వ అవినీతి డొంకంతా కదిలింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు (ఏపీఎస్ఎస్డీసీ) పరికరాలను సరఫరా చేసినట్లు చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్లు తేలింది. ఆ ఇన్వాయిస్లను చూపించే ఏపీఎస్ఎస్డీసీ నుంచి నిధులు పొందినట్లు నిర్ధారణ అయింది. దీనిపై జీఎస్టీ విభాగం 2017 మే నెలలోనే కేసు నమోదు చేసింది. పూర్తి స్థాయిలో విచారించి ఆధారాలతో సహా కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. పాత కేసులకు పాత చట్టమే ఏపీఎస్ఎస్డీసీ నిధులు దారి మళ్లడంపై విచారించాలని సూచిస్తూ ఏపీ ఏసీబీ విభాగానికి 2018 ఫిబ్రవరిలోనే సమాచారం ఇచ్చింది. ఈమేరకు కేంద్ర జీఎస్టీ ఇంటలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ లేఖ రాశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు ఒత్తిడితో ఏసీబీ విభాగం ఆ కేసును తొక్కిపెట్టింది. అంటే స్కిల్ స్కామ్ బయటపడిందీ... కేసు నమోదైంది 2017లోనే అని స్పష్టమవుతోంది. అప్పటికి 17ఏ సెక్షన్ అమలులోకి రాలేదు. ఆ సెక్షన్ 2018 జూలైలో చేయగా 2018 నవంబరు నుంచి అమలులోకి వచ్చింది. కాబట్టి స్కిల్ స్కామ్ కేసులో నిందితుడు చంద్రబాబుకు 17ఏ సెక్షన్ కింద రక్షణ లభించదన్నది నిర్ధారణ అయినట్టేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పాత కేసులకు పాత చట్టమే వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు. అవినీతికి పాల్పడి ఆధారాలతోసహా అడ్డంగా దొరికిన చంద్రబాబు సాంకేతిక సాకులతో తప్పించుకునేందుకు చేస్తున్న యత్నాలు ఫలించవని వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర జీఎస్టీ ఇంటలిజెన్స్ విభాగం డీజీ లేఖతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టినట్టేనని చెబుతున్నారు. -
Oct 15th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Case LIVE Updates, Legal and Political matters 09:05PM, అక్టోబర్ 15, 2023 నారాయణ గుట్టు విప్పేవాళ్లున్నారు : నారాయణ సొంత తమ్ముని భార్య పొంగూరి ప్రియ ► నారాయణ గుట్టుమట్లు నాకు తెలుసు.. ► ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆయనకు స్థలాలు ఉన్నాయో నాకు తెలుసు ► ఇన్నర్ రింగ్ రోడ్ ఎంక్వైరీలో నారాయణ తో పాటు నన్ను కూడా CID విచారిస్తే అన్ని విషయాలు చెబుతా. ► ఒక పర్సన్ వల్ల తీగలాగితే డొంక కదులుతుంది. ► రింగ్ రోడ్ భూముల విషయంలో ఆయన ఏమేం చేశారో మీకు తెలుస్తుంది. ► ఆ పర్సన్ ఎవరో ఎంక్వైరీలో మీకు నేను చెబుతాను. ► ఈ సమాచారం దర్యాప్తులో మీకు కీలకంగా మారుతుంది 08:35PM, అక్టోబర్ 15, 2023 CBI విచారణ కోరితే టీడీపీకి ఎందుకు కోపం : ఉండవల్లి ► స్కిల్ స్కామ్ కేసును జీఎస్టీ అధికారులు వెలికితీశారు. ► ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరగాలి. ► స్కిల్ స్కామ్‌లో ఫైళ్లు మాయం చేశారని చెబుతున్నారు. ► స్కిల్ స్కామ్ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ► పుణె జీఎస్టీ అధికారుల విచారణలో ఇది బయటపడింది. ► ఈ ప్రాజెక్ట్‌తో సంబంధంలేదని సీమెన్స్ కంపెనీ చెప్పింది. ► చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీ లేఖ రాసింది. ► చంద్రబాబు ఎందుకు ఎవరి మీదా చర్యలు తీసుకోలేదు?. ► సీబీఐ విచారణ చేస్తే ఫైళ్లు ఎలా తగలబడ్డాయో తెలుస్తుంది. ► చంద్రబాబు పీఏ శ్రీనివాస్ దేశం వదిలి పారిపోయారు ► బెయిల్‌పై పిటిషన్ వేయకుండా కేసు కొట్టేయాలని వాదిస్తున్నారు ► తప్పు చేయలేదని చెప్పుకునే వాళ్లు CBI దర్యాప్తుతో నిరూపించుకోవచ్చు 08:15PM, అక్టోబర్ 15, 2023 చేతులు కాలినా.. ఎల్లో మీడియా ఆకులు పట్టుకుంటోందా? అసత్యాలతో ఏమార్చే ప్రయత్నం చేస్తోందా? ► చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే లోకేష్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, హోం మంత్రిని కలవడానికి లోకేశ్ ప్రయత్నించారు : ఎల్లో మీడియా ► కారణం తెలియదు గానీ అమిత్ షా అపాయింట్మెంట్ నెల తరువాత కానీ లోకేశ్‌కు లభించలేదు : ఎల్లో మీడియా ► కలిసిన తర్వాత కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు : ఎల్లో మీడియా ► ఇంతగా చంద్రబాబును నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు రాలేదు : ఎల్లో మీడియా ► బీజేపీ పట్టించుకోవడం లేదు కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రతీకారం తీర్చుకుంటుందని ఎల్లోమీడియా భ్రమలు ► ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా చక్రం తిప్పాలని ఎల్లోమీడియా సామాజిక వర్గం ప్రయత్నిస్తోందని ప్రచారం ► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా ► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి అంత సీను ఉందా? ► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం ► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 ) ► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714) ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు? ► మా బాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో మీ పార్టీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► ఏ సర్వేలోనయినా మీ ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా? 08:15PM, అక్టోబర్ 15, 2023 వెంటాడుతున్న అమరావతి పాపం ► అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసుల్లో కీలక పరిణామం ► కేసులను రీ ఓపెన్ చేయాలని ఏపీ హైకోర్టులో CID పిటిషన్లు ► CID వేసిన రెండు పిటిషన్లను విచారణకు అనుమతించిన హైకోర్టు 07:45PM, అక్టోబర్ 15, 2023 పొత్తులో ఎవరి వాటా ఎంత? ► జనసేనతో సమన్వయంకోసం ఐదుగురు సభ్యులతో తెలుగుదేశం పార్టీ కమిటీ ► కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, తంగిరాల సౌమ్య ► కమిటి సభ్యులుగా పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ ► తెలుగుదేశం జనసేన మధ్య ఎన్నికల సంబంధిత అంశాలపై చర్చ ► ఎక్కడెక్కడ తెలుగుదేశం పోటీ చేయాలి? జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి? ► ఇప్పటివరకు కీలక నేతల విషయంలోనూ లోపించిన స్పష్టత ► పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు? లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడు? ► గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిన లోకేష్ ► ఈ సారి తనకు సేఫ్ సీటు కావాలని ముందే సూచించిన లోకేష్ ► మంగళగిరిలో మళ్లీ డౌటు ఉందంటూ పార్టీ సర్వేల్లో వెల్లడి ► తనకు కుప్పం ఇచ్చి చంద్రబాబు మరో చోట పోటీ చేయాలన్న యోచనలో లోకేష్ ► కచ్చితంగా గెలిచే సీట్లు ఎవన్న దానిపై టిడిపి సీనియర్ల దృష్టి ► తమ సామాజిక వర్గ ఓటర్లు ప్రభావం ఉన్న సీట్లపై కమిటీ లెక్కలు ► తన సీటు సంగతి ముందు తేల్చాలని పట్టుబడుతున్న పవన్ కళ్యాణ్ ► తమకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని ఇప్పటి నుంచే జనసేన నేతల్లో గుబులు ► ఓడిపోయే స్థానాలకు తమకు అంటగడతారన్న భయంలో జనసేన నేతలు ► కమిటీ భేటీలకు ముందే రెండు పార్టీల్లో అనుమానాలు, సందేహాలు 07:25PM, అక్టోబర్ 15, 2023 చంద్రబాబుకు హానీ చేయాల్సిన పని ప్రభుత్వానికి లేదు : ఎంపీ మోపిదేవి ► బాబుకు ప్రమాదం ఏదైనా ఉంటే అది కుటుంబ సభ్యుల నుంచే ► చంద్రబాబు కుటుంబంలోనే దొంగలు ఉన్నారు ► చంద్రబాబు చుట్టూ దొంగలను పెట్టుకొని ప్రభుత్వంపై బురద చల్లటం సరైన పద్ధతి కాదు ► 13 చోట్ల సంతకాలు పెట్టి సీఐడీకి అడ్డంగా దొరికిన దొంగ బాబు ► బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మానసికంగా కుంగిపోయి బరువు తగ్గుతారు ► కానీ చంద్రబాబు జైలులో ఉండి కూడా కేజీ బరువు పెరిగారు ► జైల్లో ఉండి కూడా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు ► కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు జైలు జీవితం గడుపుతున్నారు ► గతంలో స్టేలతో తప్పించుకుని తిరిగిన ఘనత చంద్రబాబుది ► చంద్రబాబు పాపం పండింది జైలుకి వెళ్లారు : ఎంపీ మోపిదేవి 07:10PM, అక్టోబర్ 15, 2023 ►టీడీపీకి మరోసారి షాక్ ఇచ్చిన ప్రజలు ►అట్టర్ ఫ్లాప్ అయిన న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం ►లోకేశ్ పలుపును పట్టించుకోని జనం ►చంద్రబాబు సంఘీభావంగా న్యాయానికి సంకెళ్లు అంటూ టీడీపీ కార్యక్రమం ►ప్రజల నుంచి కరువైన స్పందన 04:25PM, అక్టోబర్ 15, 2023 చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ ఫైర్ ►చంద్రబాబు అరెస్ట్ ను ప్రజలు పట్టించుకోవట్లేదు ►ప్రజలు టీడీపీని మర్చిపోతారనే భయంతో రోజుకో డ్రామా ఆడుతున్నారు ►టీడీపీ ఇచ్చే పిలుపులకి స్పందన కరువైంది ►దత్తపుత్రుడు, లోకేష్ ప్రజల సమస్యలపై మాట్లాడటం మానేశారు ►టీడీపీ కన్నీటి గాథలకు కరిగిపోయే వారు ఎవరూ లేరు ►టీడీపీ పిలుపునకు నియోజకవర్గానికి పదిమంది మాత్రమే వస్తున్నారు ►పవన్ అవనిగడ్డ సభ ఫ్లాప్.. పెడన సభ అట్టర్ ►వారాహి ఫ్లాప్ అవడంతో పవన్ ప్యాకప్ చెప్పేశాడు ►అర్హులందరికీ పథకాలు అందిస్తున్నాం.. వచ్చేది మా ప్రభుత్వమే 12:30 PM బాబు భూ స్కాంపై సీఐడీ రెండు పిటిషన్లు ►అమరావతి రాజధాని ముసుగులో చంద్రబాబు, టీడీపీ నాయకులు అక్రమాలు వెలుగులోకి.. ►భూ స్కాంపై సీఐడీకి కొత్త ఆధారాలు ►అమరావతి అసైన్డ్ భూముల కేసుని రీఓపెన్ చేయాలంటూ హైకోర్టులో రెండు పిటిషన్లు 11:55 AM దోపిడీలో నీ వాటా ఎంత పవన్?.. అడపా శేషు ►పవన్ దమ్ముంటే మూడో భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలు చెప్పాలి ►రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబుకు మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ వాటా ఎంత? ►బినామీల పేరుతో అమరావతిలో ఎన్ని ఆస్తులు సమకూర్చుకున్నారో చెప్పాలి ►గజ దొంగ జైలులో ఉంటే.. చిల్లర దొంగ పవన్ బయట ఉన్నాడు పవన్ దమ్ముంటే మూడో భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలు చెప్పాలి రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబుకు మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ వాటా ఎంత? బినామీల పేరుతో అమరావతిలో ఎన్ని ఆస్తులు సమకూర్చుకున్నారో చెప్పాలి గజ దొంగ జైలులో ఉంటే.. చిల్లర దొంగ పవన్ బయట ఉన్నాడు#PackageStarPK#PawanKalyan pic.twitter.com/RYG81DyIeg — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 15, 2023 11:50 AM రోజులన్నీ ఒకేలా ఉండవు.. ►దశాబ్దాలుగా ప్రజలు మోసం చేస్తూ బ్రతుకుతున్న ఎల్లో మీడియా ►అవినీతిని, అక్రమ దందాను ప్రశ్నించిన వారిపై ఎల్లో మీడియాతో దాడి ►వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్టు.. మీకు అదే గతి ►మీ అక్రమాలను ప్రశ్నించేవాళ్లంతా డబ్బుకు దాసోహం అవుతారు అనుకోవడం మీ అజ్ఞానం. .@JaiTDP మీరు, మీ చెంచా మీడియా కలిసి దశాబ్దాలుగా ప్రజలని మోసం చేస్తూ బతికేస్తున్నారు. మీ అవినీతిని, మీ అక్రమ దందాను ప్రశ్నించినవాళ్లమీద మీ బానిస మీడియాతో దాడిచేసి వాళ్ళ వ్యక్తిత్వాలను దెబ్బతీస్తుంటారు. రోజులన్నీ ఒకేలా ఉండవు. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్లు.… https://t.co/1XQmCFWI1S — YSR Congress Party (@YSRCParty) October 15, 2023 11:30 AM బాబు హెల్త్‌పై ఫ్యామిలీ సభ్యులే తప్పుడు ప్రచారం: మంత్రి అంబటి ►చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు ►చంద్రబాబుపై కక్ష పెంచుకోవాల్సిన అవసరం మాకు లేదు. ►చంద్రబాబు తప్పు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి ►అందుకే ఎంత మంది సీనియర్ న్యాయవాదులను పెట్టినా బెయిల్ దొరకలేదు ►చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే అబద్దాలు చెప్పారు. ►చంద్రబాబు ఆరోగ్యంపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. ►చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని 35 రోజుల నుంచి కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదు. ►చంద్రబాబుకు ఎప్పటినుంచో చర్మ సమస్యలు ఉన్నాయి. ►ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ ఏసీ ఇవ్వలేదు.. కానీ, చంద్రబాబుకు ఇచ్చారు. 8:00 AM HYD మెట్రోలో ఎల్లో బ్యాచ్ ఓవరాక్షన్ ►ఐటీ ఉద్యోగుల ముసుగులో మెట్రోలో టీడీపీ నేతల రభస ►టీడీపీ నేతలకు షాకిచ్చిన మెట్రో ప్రయాణికులు ►నిరసన కార్యక్రమాలు విజయవాడలో చేసుకోవాంటూ చీవాట్లు ►ఇబ్బంది పెట్టొదంటూ ప్రయాణికుల వార్నింగ్ ►పలువురు టీడీపీ నేతలు అరెస్ట్, కేసు నమోదు హైదరాబాద్ లో Let’s Metro for CBN కార్యక్రమంలో @jaiTDP కి చుక్కెదురు! మెట్రో లో ఓవర్ యాక్షన్ చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై ఫైర్ అయిన ప్రయాణికులు. నిరసనలు ఎక్కడ చేయాలో అక్కడ చేయండి, ఇక్కడికి వచ్చి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దూ అంటూ టీడీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చిన… pic.twitter.com/rE4HaCqosY — YSR Congress Party (@YSRCParty) October 14, 2023 7:40 AM గారడీ విద్యలో ఎల్లో బ్యాచ్.. ►చంద్రబాబుపై సానుభూతి కోసం ఎల్లో సర్కస్ ఫీట్లు ►తప్పుచేసిన వారికి శిక్ష తప్పదు ►కోర్టుల్లో శిక్ష నంచి ఎవరూ తప్పించుకోలేరు. మీ విన్యాసాలు ఇక చాలించండి. అధికారంలో ఉన్నప్పుడు @ncbn రాష్ట్రానికి మంచి చేశారో.. ఆ ముసుగులో తన వందిమాగధులకు దోచిపెట్టి రాష్ట్రాన్ని ముంచేశాడో ప్రజలకు బాగా తెలుసు. స్కిల్ స్కామ్‌లో వందల కోట్లు మింగేసి చట్టానికి దొరికిపోయినా ఇంకా సానుభూతి కోసం మీరు సర్కస్ ఫీట్లు చేయడానికి… https://t.co/laZjpk2zkd — YSR Congress Party (@YSRCParty) October 14, 2023 7:30 AM మాజీ మంత్రి నారాయణపై షాకిచ్చిన పొంగూరు ప్రియ ►ఏపీ సీఐడీకి పొంగూరు ప్రియ విజ్ఞప్తులు ►సోమవారం జరిగే విచారణలో నారాయణ ఏమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉంది ►నారాయణకు అన్నీ తెలుసంటూ వీడియో విడుదల ►ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆయనకు స్థలాలు ఉన్నాయో తనకు తెలుసన్న ప్రియ ►ఈ కేసులో భాగంగా తనను కూడా విచారించాలని విజ్ఞప్తి ►నారాయణ కేసు విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర తన స్థలం ఆయనకు గుర్తు ఉందన్నారు. ►ఒక రకంగా ఈ సమాచారం దర్యాప్తులో మీకు హెల్ప్ అవుతుంది 7:00 AM చంద్రబాబు ఆరోగ్యంపై అపోహలొద్దు ►చంద్రబాబు హైప్రొఫైల్ ప్రిజనర్ ►చంద్రబాబు పట్ల ఎవరూ నిర్లక్క్ష్యంగా లేరు ►ఆయన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉన్నాం ►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు ►ప్రతీరోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు చేయిస్తున్నాం ►డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేం ఫాలో అవుతున్నాం ►డాక్టర్లు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పిస్తాం ►24 గంటలు చంద్రబాబుకి జైలు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు ►అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకున్నాం ►ఎవరితో ఎలా నడుచుకోవాలో మాకు తెలుసు ►ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకుంటున్నాం ►చంద్రబాబు మెడికల్ రిపోర్ట్‌ను ఆయన లాయర్లే అడిగారు ►మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలా? అని చంద్రబాబును అడిగాం ►చంద్రబాబు అనుమతితోనే ఆయన రిపోర్ట్‌ను న్యాయవాదులకు ఇచ్చాం ►నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు ►హైప్రోఫైల్ ఖైదీల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం ►చంద్రబాబు ఆరోగ్య విషయంలో ఎలాంటి అపోహలు వద్దు ::: జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ 6:55 AM, అక్టోబర్ 15, 2023 చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు ►చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించాం ►ఐదుగురు వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది ►చంద్రబాబుతో స్వయంగా మాట్లాడాం ►బాబును ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదు ►చంద్రబాబుకి స్కిన్ అలర్జీ ఉంది ►బాబు వ్యక్తిగత డాక్టర్లను సంప్రదించి మరీ ట్రీట్మెంట్ ఇచ్చాం ►రిమాండ్‌కు రాకముందు బాబుకి ఎలాంటి వ్యాధులు ఉన్నాయో మాకు తెలియదు ►చంద్రబాబు వేసుకుంటున్న మందులను మాకు చూపించారు ►చంద్రబాబుకి ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదు :::ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శివకుమార్ చంద్రబాబు కోసం ఏసీ ఫిక్స్ చేయండి ►చంద్రబాబు లాయర్ల హౌజ్ మోషన్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ ►వైద్యులుతోనూ, జైళ్ల శాఖాధికారులతోనూ మాట్లాడిన ఏసీబీ జడ్జి ►చంద్రబాబుకి స్కిన్ ఎలర్జీ మాత్రమే ఉందని తెలిపిన వైద్యులు ►మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవని వెల్లడి ►చంద్రబాబు ఉన్న బ్యారెక్‌లో తక్షణమే ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశం ►వైద్యుల సూచనలు అమలు చేయాలని జైళ్ల శాఖకు ఆదేశం ► కోర్టు ఆదేశాలానుసారం వ్యవహరిస్తామని ముందే చెప్పిన జైళ్ల శాఖ డీఐజీ చంద్రబాబు ఒక్కడే జైలుకు వెళ్లలేదు ► ఈ దేశంలో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చెయ్యడం కొత్త కాదు ►ఎందరో రాజకీయ నాయకులు కోర్టు ముందు విచారణకు నిలబడ్డారు. ►ఎవరూ సానుభూతి ఆటలు ఆడలేదు ► బీహార్‌లో పశుదాణా స్కాంలో లాలూ అరెస్టయ్యారు ► తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జయలలిత జైలుకెళ్లారు ► ఉత్తరప్రదేశ్‌లో మాయావతిపై కేసు పెట్టారు ► న్యాయ స్థానం ముందు అందరూ సమానం ► రూల్ ఆఫ్ లా ఇన్ ఇండియాకు ఎవరు కూడా అతీతులు కాదు ► కోర్టు విచారణ ఎప్పుడు కూడా ఆధారాల మీద ఉంటుంది ► చంద్రబాబు నాయుడు ఏ తప్పు చెయ్యలేదని ఆధారాలు లేకపోతే కోర్టు ఆయనని జైలుకు పంపదు.! ::: చంద్ర బాబు నాయుడు అరెస్ట్ పై మేధావుల అభిప్రాయం -
చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటుకు అనుమతి
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం ఏసీ ఏర్పాటు చేయించాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. చంద్రబాబుకి ఉన్న చర్మ సమస్యల కారణంగా.. ప్రభుత్వ వైద్యుల సూచనల్ని జైలు అధికారులు పాటించేలా ఆదేశించాలంటూ శనివారం రాత్రి హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు బాబు తరపు లాయర్లు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన కోర్టు.. రాజమండ్రి సెంట్రల్ జైల్ స్నేహా బ్లాక్‌లో ఆయన ఉంటున్న ప్రత్యేక గదిలో ఏసీ ఏర్పాటు చేయించాలని జైళ్ల శాఖను ఆదేశించింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వైద్యులుతోనూ, జైళ్ల శాఖాధికారులతోనూ మాట్లాడారు ఏసీబీ న్యాయమూర్తి. చంద్రబాబుకి స్కిన్ ఎలర్జీ మాత్రమే ఉందని వైద్యులు తెలపగా.. స్కిన్ ఎలర్జీ కాకుండా మరే ఇతర ఆరోగ్య సమస్యలున్నాయా? అని జడ్జి అడిగారు. స్కిన్ ఎలర్జీ కాకుండా మరే రకమైన ఆరోగ్య సమస్యలు చంద్రబాబుకి లేవని వైద్యులు, న్యాయమూర్తికి తెలిపారు. దీంతో.. చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు ఉంటున్న బ్యారక్‌లో ఏసీ ఏర్పాటు చేయించాలని, వైద్యుల సూచనల్ని తప్పకుండా అమలు చేయాలని అధికారుల్ని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలకు సీఐడీ తరపున న్యాయవాది వివేకానంద ‘‘కోర్టు ఆదేశాల్ని తూ.చా. తప్పకుండా పాటిస్తామ’ని తెలిపారు. దీంతో ఈ రాత్రికే చంద్రబాబు కోసం ఏసీ(టవర్ ఏసీ) ఏర్పాటు చేయనున్నారు అధికారులు. చంద్రబాబు ఆరోగ్యంపై అపోహలు, అసత్యాలు ప్రచారంలోకి రావడంతో.. జైళ్ల శాఖ స్పందించింది. ఆయన్ని పరీక్షించిన వైద్య బృందంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ అనుమానాల్ని నివృత్తి చేయించింది. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని.. ఆయన యాక్టివ్గానే ఉన్నారని.. ఆస్పత్రి అవసరం లేదని తెలిపింది. రోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే స్కిన్ ఎలర్జీ కారణంగా కూల్ ఎన్విరాన్మెంట్ సిఫార్సు చేశామని వైద్యులు తెలిపారు. ఆ వెంటనే చంద్రబాబు తరపు లాయర్లు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అనారోగ్య లక్షణాలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని.. జైలులో ఏసీ ఏర్పాటు చేయించేలా జైలు అధికారుల్ని ఆదేశించాలని పిటిషన్లో కోరింది. ఏసీ ఏర్పాటు చేయకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. స్కిన్ ఎలర్జీ కారణంగా చల్లని ప్రదేశంలో చంద్రబాబు ఉంటే సరిపోతుందన్న ప్రభుత్వ డాక్టర్ల సూచనల్ని పిటిషన్లో ప్రస్తావించారు బాబు లాయర్లు. -
Oct 14th 2023: చంద్రబాబు కేసు అప్ డేట్స్
Chandrababu Naidu Arrest Cases Remand Updates 20:33PM, అక్టోబర్ 14, 2023 చంద్రబాబు కోసం ఏసీ ఫిక్స్ చేయండి ►చంద్రబాబు లాయర్ల హౌజ్ మోషన్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ ►వైద్యులుతోనూ, జైళ్ల శాఖాధికారులతోనూ మాట్లాడిన ఏసీబీ జడ్జి ►చంద్రబాబుకి స్కిన్ ఎలర్జీ మాత్రమే ఉందని తెలిపిన వైద్యులు ►మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవని వెల్లడి ►చంద్రబాబు ఉన్న బ్యారెక్‌లో తక్షణమే ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశం ►వైద్యుల సూచనలు అమలు చేయాలని జైళ్ల శాఖకు ఆదేశం ► కోర్టు ఆదేశాలానుసారం వ్యవహరిస్తామని ముందే చెప్పిన జైళ్ల శాఖ డీఐజీ 19:29PM, అక్టోబర్ 14, 2023 ఏసీ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు న్యాయవాదుల తరపు హౌస్ మోషన్ పిటిషన్ ►జైలులో చంద్రబాబు బ్యారక్‌లో ఏసీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్ ►అనారోగ్య లక్షణాలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారనీ పిటిషన్ దాఖలు ►స్కిన్ అలర్జీ ఉంది గనుక కూల్ వెదర్ లో ఆయన ఉంచాలని రికమెండ్ చేశామన్న వైద్య బృందం ►డాక్టర్ల సూచనల్ని ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోర్టుకు బాబు లాయర్ల విజ్ఞప్తి 19:10PM, అక్టోబర్ 14, 2023 బాబు అసలు రంగు బయటపెట్టిన సీమెన్స్ ►స్కిల్ స్కామ్‌లో సీఐడీ దర్యాప్తుతో సంచలనాలు వెలుగులోకి ►సీమన్స్ కంపెనీ లిఖిత పూర్వకంగా చెప్పిన విషయాలేంటి? ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న :3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు లో మీరు 90 శాతం పెట్టుబడితో 10 శాతం ప్రభుత్వం పెట్టుబడితో స్కిల్ సెంటర్స్ పెట్టడానికి డిజైన్ టెక్ తో కలిసి ఒప్పందం చేసుకున్నారా..? ►సీమెన్స్ సమాధానం: అలాంటి ఒప్పందం మేము చేసుకోలేదు, 90 శాతం పెట్టుబడి పెట్టి ప్రాజెక్ట్ చేసే పద్దతి మా దగ్గరలేదు. ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : 3300 కోట్ల ఈ ప్రాజెక్టులో భాగంగా మీకు డిజైన్ టెక్ నుండి గాని స్కిల్ కార్పొరేషన్ నుండి గానీ ఏమైనా పర్చేజ్ ఆర్డర్ వచ్చిందా..? ►సీమెన్స్ సమాధానం : ఈ ప్రాజెక్టు లో భాగంగా మాకు ఎటువంటి పర్చేజ్ ఆర్డర్ రాలేదు..2015 లో డిజైన్ టెక్ నుండి 3 సార్లు మొత్తంగా 58 కోట్ల రూపాయలకు మాకు ఆర్డర్ వచ్చింది,మేము సప్ప్లై చేశాం. ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : ప్రస్తుతం సుమన్ బోస్ ఎక్కడున్నారు?? వారు అసలు ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్ట్ ని ఒప్పందం చేసుకునే అర్హత ఉందా..? ►సీమెన్స్ సమాధానం : సుమన్ బోస్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, 2018 లో వారు మా కంపెనీలో లేరు,ఇక ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్టులను మేము చేయం,ఇలాంటి ఒప్పందం చేసుకోవదానికి సుమన్ బోస్ కి ఆ అర్హత లేదు,ఇక ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్లు మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం ఇలాంటి ఒప్పందం కూడా లేదు 19:05PM, అక్టోబర్ 14, 2023 ఫైబర్ గ్రిడ్ కుంభకోణం జరిగిందిలా ►వచ్చే వారం సుప్రీంకోర్టు ముందుకు ఫైబర్ గ్రిడ్ కేసు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన సీఐడీ 18:59PM, అక్టోబర్ 14, 2023 చంద్రబాబు ఒక్కడే జైలుకు వెళ్లలేదు ► ఈ దేశంలో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చెయ్యడం కొత్త కాదు ►ఎందరో రాజకీయ నాయకులు కోర్టు ముందు విచారణకు నిలబడ్డారు. ►ఎవరూ సానుభూతి ఆటలు ఆడలేదు ► బీహార్‌లో పశుదాణా స్కాంలో లాలూ అరెస్టయ్యారు ► తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జయలలిత జైలుకెళ్లారు ► ఉత్తరప్రదేశ్‌లో మాయావతిపై కేసు పెట్టారు ► న్యాయ స్థానం ముందు అందరూ సమానం ► రూల్ ఆఫ్ లా ఇన్ ఇండియాకు ఎవరు కూడా అతీతులు కాదు ► కోర్టు విచారణ ఎప్పుడు కూడా ఆధారాల మీద ఉంటుంది ► చంద్రబాబు నాయుడు ఏ తప్పు చెయ్యలేదని ఆధారాలు లేకపోతే కోర్టు ఆయనని జైలుకు పంపదు.! ::: చంద్ర బాబు నాయుడు అరెస్ట్ పై మేధావుల అభిప్రాయం 18:45PM, అక్టోబర్ 14, 2023 ప్రెస్ మీట్లో పచ్చ మీడియా అత్యుత్సాహం ►చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్య బృందంతో జైళ్ల శాఖ డీఐజీ ప్రెస్‌మీట్ ► స్కిన్ అలర్జీ ఉంది గనుక కూల్ వెదర్ లో ఆయన ఉంచాలని రికమెండ్ చేశామని స్పష్టం చేసిన వైద్యుల బృందం ► ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ ►చంద్రబాబుని మీడియాకు చూపించాలంటూ యెల్లో మీడియా ఓవరాక్షన్ ►జైలు నిబంధనల పట్టింపు లేకుండా ఇష్టానుసారం ప్రశ్నలు ►మీడియా ప్రశ్నలతో షాక్ తిన్న జైల్ అధికారులు, వైద్య బృందం ►ఆయనకు శరీరంలో ఎక్కడెక్కడ సమస్య ఉందన్న విషయాన్ని మీడియాముఖంగా వెల్లడించలేమని వైద్యుల స్పష్టీకరణ ►రూల్స్ తెలుసుని మాట్లాడాలన్న జైళ్ల శాఖ డీఐజీ 18:39PM, అక్టోబర్ 14, 2023 చంద్రబాబు ఆరోగ్యంపై అపోహలొద్దు ►చంద్రబాబు హైప్రొఫైల్ ప్రిజనర్ ►చంద్రబాబు పట్ల ఎవరూ నిర్లక్క్ష్యంగా లేరు ►ఆయన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉన్నాం ►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు ►ప్రతీరోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు చేయిస్తున్నాం ►డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేం ఫాలో అవుతున్నాం ►డాక్టర్లు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పిస్తాం ►24 గంటలు చంద్రబాబుకి జైలు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు ►అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకున్నాం ►ఎవరితో ఎలా నడుచుకోవాలో మాకు తెలుసు ►ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకుంటున్నాం ►చంద్రబాబు మెడికల్ రిపోర్ట్‌ను ఆయన లాయర్లే అడిగారు ►మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలా? అని చంద్రబాబును అడిగాం ►చంద్రబాబు అనుమతితోనే ఆయన రిపోర్ట్‌ను న్యాయవాదులకు ఇచ్చాం ►నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు ►హైప్రోఫైల్ ఖైదీల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం ►చంద్రబాబు ఆరోగ్య విషయంలో ఎలాంటి అపోహలు వద్దు ::: జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ 18:15PM, అక్టోబర్ 14, 2023 చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు ►చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించాం ►ఐదుగురు వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది ►చంద్రబాబుతో స్వయంగా మాట్లాడాం ►బాబును ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదు ►చంద్రబాబుకి స్కిన్ అలర్జీ ఉంది ►బాబు వ్యక్తిగత డాక్టర్లను సంప్రదించి మరీ ట్రీట్మెంట్ ఇచ్చాం ►రిమాండ్‌కు రాకముందు బాబుకి ఎలాంటి వ్యాధులు ఉన్నాయో మాకు తెలియదు ►చంద్రబాబు వేసుకుంటున్న మందులను మాకు చూపించారు ►చంద్రబాబుకి ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదు :::ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శివకుమార్ 18:00PM, అక్టోబర్ 14, 2023 అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు ► అసైన్డ్ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టు ►నారా , నారాయణ నల్లధనం నెట్వర్క్ బట్టబయలు ►అమరావతిలోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ రైతులను బెదిరించి భూములు కొట్టేశారు ►ఎన్‌స్పైర నుంచి ఆర్కే హౌసింగ్‌కు నిధుల బదిలీ.. అక్కడి నుంచి బినామీలకు నగదు ►అసైన్డ్ రైతుల భూముల లూటీ ►తమ బినామీలకే భూసమీకరణ ప్యాకేజీ స్థలాలు దక్కేలా వ్యూహం ►అవినీతి నెట్‌వర్క్‌ను బట్టబయలు చేసిన సిట్ దర్యాప్తు ►పచ్చగద్దల జాబితాలో గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, రావెల తదితరులు ►ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ వియ్యంకుడు కూడా ►రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు ♦నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) 16:57PM, అక్టోబర్ 14, 2023 జైల్లో బాబు రాజకీయ మంతనాలు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రాజకీయాలు ►ఇవాళ ములాఖత్‌లో కలిసిన నారా లోకేష్, భువనేశ్వరి ►టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ►చంద్రబాబుకు వైద్య పరీక్షలు, మందులతో పాటు పలు విషయాలు అడిగి తెలుసుకున్న కుటుంబ సభ్యులు ►తండ్రితో ఢిల్లీ అమిత్ షా మీటింగ్ గురించి చెప్పిన నారా లోకేష్ ►పాదయాత్ర వాయిదా గురించి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన భువనేశ్వరి ►జైల్లో ఉక్కపోత గురించి చెప్పిన చంద్రబాబు ►30 నిమిషాల పాటు చంద్రబాబుతో మాట్లాడిన కుటుంబ సభ్యులు ►ఆపై తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు చర్చించినట్లు చెప్పిన కాసాని 16:20PM, అక్టోబర్ 14, 2023 ముగిసిన చంద్రబాబు ములాఖత్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ►శనివారం మధ్యాహ్నాం ములాఖత్ అయిన కుటుంబ సభ్యులు ►గంటపాటు కొనసాగిన ములాఖత్ ►ఎవరు కలుస్తారనే దానిపై చివరిదాకా స్పష్టత ఇవ్వని కుటుంబ సభ్యులు ►చివరకు.. ములాఖత్ అయిన భువనేశ్వరి, లోకేశ్, టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ►చంద్రబాబును చూడగానే బాధ కలిగింది: కాసాని ►తెలంగాణలో టీడీపీ పోటీకి సంబంధించి పలు సూచనలు తీసుకున్నా: కాసాని 14:51PM, అక్టోబర్ 14, 2023 ములాఖత్‌లోనూ టీడీపీకి లేని స్పష్టత ►చంద్రబాబు నాయుడు ములాఖత్ విషయంలోనూ కొరవడిన స్పష్టత ►రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్దకు వచ్చిన భార్య నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కొందరు టీడీపీ నేతలు ►కుటుంబ సభ్యులతో పాటు టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ కూడా ►ములాఖాత్‌లో చంద్రబాబును ఎవరెవరు కలుస్తారనే దానిపై టీడీపీకే లేని స్పష్టత 14:35PM, అక్టోబర్ 14, 2023 చంద్రబాబుకు.. పవన్ సినిమాలోలాగే అవుతుందేమో! ►చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యుల నుంచి హాని ఉండొచ్చు! ►‘కెమెరామెన్ గంగతో రాంబాబు’లో జరిగినట్లే జరిగే అవకాశం లేకపోలేదు ►పవన్ నటించిన ఆ సినిమాలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు మధ్య జరిగే సన్నివేశాలాగా జరిగే అవకాశం ఉంది ►తనను కుటుంబీకులే కుట్ర చేసి అంతం చేస్తారనే భయం చంద్రబాబుకి ఉంది ►ఆనాడు కట్టుకున్న భర్త.. తన కన్నతండ్రిని వెన్నుపోటు పొడిచి అధికారంలో రావడమే కాదు.. చావుకు కారణమైనా భువనేశ్వరి కనీసం స్పందించలేదు ►చంద్రబాబుకు ఇప్పుడు ఏమైనా జరిగితే లోకేష్, భువనేశ్వరి బాధ్యత వహించాలి. :::డిప్యూటీ సీఎం సత్యనారాయణ కొట్టు కామెంట్స్: 14:20PM, అక్టోబర్ 14, 2023 చిత్రవిచిత్రమైన నిరసన ►మరో నిరసనకు పిలుపు ఇచ్చిన టీడీపీ ►చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వరుస నిరసనలు ► ఏ ఒక్కదాన్ని పట్టించుకోని ప్రజలు ►టీడీపీ శ్రేణులే దూరంగా ఉంటున్న వైనం ►తాజాగా న్యాయానికి సంకెళ్లు పేరుతో నిరసనకు పిలుపు ►రేపు(ఆదివారం) సాయంత్రం నిరసన పాటించాలని ప్రకటన ►సాయంత్రం 07:00గం. నుంచి 07:05 దాకా చేతులు కట్టేసుకోవాలని ప్రజలకు పిలుపు ► ఇళ్ల నుంచి బయటకు వచ్చి సంకెళ్లతో ఫొటోలు, వీడియోలు దిగాట. ►వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి చంద్రబాబుకి సంఘీభావం తెలపాలంటూ టీడీపీ పిలుపు 01:30PM, అక్టోబర్ 14, 2023 చంద్రబాబుతో కాసేపట్లో కుటుంబసభ్యుల ములాఖత్ ►ఢిల్లీ నుంచి రాజమండ్రి చేరుకున్న నారా లోకేష్ ►తల్లి భువనేశ్వరితో కలిసి ములాఖత్‌కు వెళ్లనున్న లోకేష్ ►5 కేజీల బరువు తగ్గారంటూ భువనేశ్వరి, బ్రాహ్మణి ఆందోళన ►ప్రభుత్వాస్పత్రిలో వీఐపీ ఐసీయూ సిద్ధం చేసిన వైద్య సిబ్బంది ► ప్రత్యేక వార్డును శుభ్రం చేసిన ఆస్పత్రి సిబ్బంది ►జైలు నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవంటున్న ఆస్పత్రి సిబ్బంది ►దినచర్యలో భాగంగానే ఐసీయూను సిద్ధం చేశామని వెల్లడి 01:00PM, అక్టోబర్ 14, 2023 ► రాజమహేంద్రవరం టీడీపీ క్యాంపు కార్యాలయానికి నారా లోకేష్ ► టీడీపీ క్యాంపు కార్యాలయంలో లోకేష్ ను కలిసిన కాసాని జ్ఞానేశ్వర్ ► బుచ్చయ్య, చినరాజప్ప, జవహర్, కాసాని జ్ఞానేశ్వkHSy సమావేశమైన లోకేష్ ►మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ 012:30PM, అక్టోబర్ 14, 2023 ►చంద్రబాబుతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ ►ములాఖత్ తర్వాత చంద్రబాబు ఆరోగ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ►అచ్చెన్నాయుడు చెప్పినట్లు ప్రభుత్వం నడవదు : మంత్రి చెల్లుబోయిన వేణు ►తెలుగు డ్రామా పార్టీగా టీడీపీ మారింది ►నిబంధనల ప్రకారమే జైలు అధికారులు నడుచుకుంటున్నారు ►చంద్రబాబు బరువు తగ్గారని అసత్య ప్రచారం చేస్తున్నారు 11:50AM, అక్టోబర్ 14, 2023 హైదరాబాద్‌లో టీడీపీ ఐటీ వింగ్ పేరిట ఓవరాక్షన్ ►టీడీపీ ఐటీ వింగ్‌పై మెట్రో ప్రయాణికుల ఫైర్ ►లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరిటి టీడీపీ అతి ►టీడీపీ ఐటీ వింగ్ పేరుతో ఓ వర్గం డ్రామా ►టీడీపీ నేతలకు షాక్ ఇచ్చిన మెట్రో ప్రయాణికులు ►హైదరాబాద్‌లో అరిస్తే ఏమీ అవ్వదంటూ టీడీపీ వింగ్‌పై మెట్రో ప్రయాణికుల ఆగ్రహం 11:28AM, అక్టోబర్ 14, 2023 ఎన్నాళ్ళీ తెలుగు డ్రామాల పార్టీ నాటకాలు?: విజయసాయిరెడ్డి ఫైర్ ►చంద్రబాబుకు ఇంటి భోజనం అందుతోంది ►జైలులో ప్రత్యేక గది కేటాయించారు ►ప్రతిరోజు మూడుసార్లు ముగ్గురు డాక్టర్లు చెక్ అప్ చేస్తున్నారు ►8 మంది పోలీసులు కాపలాగా ఉన్నారు ►తాను నేరాలకు తగిన శిక్ష అనుభవించేందుకు చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు ►నెలరోజులు జైలులో ఉండేసరికి పూర్తి విశ్రాంతితో చంద్రబాబు గారు కిలో బరువు పెరిగారు. ►ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా పోయాయని సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారు. ►స్కామ్స్ లో బెయిల్ రాకపోయేసరికి అలజడి సృష్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నట్లు రుజువైంది. నెలరోజులు జైలులో ఉండేసరికి పూర్తి విశ్రాంతితో చంద్రబాబు గారు కిలో బరువు పెరిగారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా పోయాయని సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారు. స్కామ్స్ లో బెయిల్ రాకపోయేసరికి అలజడి సృష్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నట్లు రుజువైంది. ఎన్నాళ్ళీ తెలుగు డ్రామాల… pic.twitter.com/FvpkwM5kEE — Vijayasai Reddy V (@VSReddy_MP) October 14, 2023 10:35AM, అక్టోబర్ 14, 2023 అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్ ►అసైన్డ్ భూముల కేసులో సీఐడీ సరికొత్త ఆధారాలు ►రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు ►చంద్రబాబు, పొంగూరు నారాయణ మీద అభియోగాలు ►ఈ కేసు విచారణ జరగకుండా మార్చి 19న హైకోర్టు స్టే ►కేసును కొట్టేయాలంటూ నారాయణ సైతం క్వాష్ పిటిషన్ దాఖలు ►క్వాష్ పిటిషన్‌పై విచారణ తర్వాత అక్టోబర్ 16కు తీర్పు వాయిదా ►ఈ క్రమంలోనే మళ్లీ ఓపెన్ చేయాలని సీఐడీ తాజా పిటిషన్ 10:00AM, అక్టోబర్ 14, 2023 ►ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న నారా లోకేష్. ►గన్నవరం నుంచి రోడ్డు మార్గాన రాజమండ్రి వెళ్లనున్న లోకేష్. ►చంద్రబాబుతో ములాఖత్‌కు ధరఖాస్తు చేసుకున్న కుటుంబ సభ్యులు. 90:50AM, అక్టోబర్ 14, 2023 ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అవసరం లేదన్న డాక్టర్లు ►చంద్రబాబుకు రాజమండ్రి ఆసుపత్రిలో వీఐపీ గది సిద్ధం ► అందుబాటులో రెండు ఆక్సిజన్ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్, వెంటిలేటర్, వైద్య పరికరాలు, మందులు ►ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి చెందిన వైద్యుడితో పాటు ఇద్దరు క్యాజువాలిటీ డాక్టర్లు, మరో ఇద్దరు స్టాఫ్ నర్సుల కేటాయింపు 9:30AM, అక్టోబర్ 14, 2023 ►రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన జైలు అధికారులు ►7 అంశాల పైన నిన్న వైద్య పరీక్షలు, నివేదిక వెల్లడించిన జైలుశాఖ అధికారులు ►చంద్రబాబు కిలో బరువు పెరిగారన్న జైలు శాఖ డీఐజీ రవికిరణ్ ►- 5 కిలోలు బరువు తగ్గారన్న కుటుంబసభ్యుల ఆందోళన అసరం లేదని తేల్చిన డాక్టర్ 7:15AM, అక్టోబర్ 14, 2023 ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 35వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబు భద్రత ఆరోగ్య విషయంలో నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసిన జైలు అధికారులు ►స్నేహ బ్యారక్ లో చంద్రబాబు ఉన్న గదిలో 8 ఫ్యాన్లు ఏర్పాటు చేసిన అధికారులు ►అత్యవసర పరిస్థితి ఏర్పడితే చికిత్స అందించేందుకు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ముందు జాగ్రత్త చర్యగా ఒక వీఐపీ రూమును సిద్ధం చేసిన అధికారులు ►నెల రోజులు వ్యవధి లో జైల్లో ఒక కిలో బరువు పెరిగిన చంద్రబాబు ►చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారంటూ రెండో రోజు కూడా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన జైలు అధికారులు 7:00AM, అక్టోబర్ 14, 2023 ఉండవల్లి అరుణ్‌కుమార్ పిటిషన్‌పై హైకోర్టు స్పందన ►చంద్రబాబు, అచ్చెన్న, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ సహా 44 మందికి నోటీసులు ►కౌంటర్లు దాఖలు చేయాలంటూ... విచారణ నవంబరు 10కి వాయిదా ►సీబీఐకి ఇవ్వాలని నాలుగేళ్ల క్రితమే మా వైఖరిని చెప్పాం ►ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు: రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ►ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి ►హైకోర్టును కోరిన ఉండవల్లి తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ప్రభుత్వ న్యాయవాది రోహత్గీ ప్రశ్నలు ►ఏమీ తెలియదంటూ.. 17ఏ రక్షణ కావాలంటే ఎలా? ►ఇవి రెండూ పరస్పర విరుద్ధ వాదనలు కాదా? ►చంద్రబాబు క్వాష్ పిటిషన్లో ఏపీ ప్రభుత్వ న్యాయవాది రోహత్గీ ప్రశ్నలు ►నిజాయితీపరుల రక్షణకే 17ఏ... గత ఘటనలకూ పాత చట్టాలు వర్తిస్తాయి ►ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు చేశాయి... కోర్టుకు నివేదన ►చంద్రబాబుకు డబ్బు చేరినట్లు ఎలా గుర్తించారని ప్ర శ్నించిన ధర్మాసనం ►షెల్ కంపెనీల ద్వారా బాబు, ఆయన పార్టీ ఖాతాల్లోకి చేరిందన్న రోహత్గీ ►ఒప్పందం సీఎం స్థాయిలోనే జరిగిందని కూడా వెల్లడి ►తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామా ►చంద్రబాబుకు అనారోగ్యమంటూ టీడీపీ హడావుడి ►ఆసుపత్రిలో చేర్చేందుకే ‘అనారోగ్యం’ పథకం.. బాబు బరువు తగ్గలేదు.. జైలుకొచ్చాక మరో కిలో పెరిగారు ►ఇంటి భోజనం.. మూడు పూట్లా ఆరోగ్య పరీక్షలు.. పూర్తి ఆధారాలతో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన జైళ్ల శాఖ ►బాబు జైల్లో.. చినబాబు ఢిల్లీలో.. నైరాశ్యంలో తమ్ముళ్లు ►ఇప్పట్లో బెయిల్ రాదనే సానుభూతి ఎత్తుగడ ►బెడిసికొట్టిన రాజకీయ కుతంత్రం చంద్రబాబుపై పోసాని ధ్వజం ►జైలులో ఉంటూ బయట అల్లర్లకు చంద్రబాబు కుట్ర ►తండ్రిని చంపి భర్త సీఎం కావాలని భువనేశ్వరి కోరుకున్నారు ►అందుకే ఎన్టీఆర్ చేసిన పాపాలే ఆయనకు ఆ గతి పట్టించాయని ప్రచారం చేశారు ►ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టించి, అన్యాయంగా బలితీసుకున్న పాపానికే తన భర్త జైలులో ఉన్నారని భువనేశ్వరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ►ఎన్టీఆర్‌కు విలువలు లేవని చంద్రబాబు చెప్పారు.. ►చంద్రబాబు న్యాయస్థానం ఆదేశాలతో జైలులో వందల మంది పోలీసుల రక్షణలో ఉన్నారు. ►ఇంక అన్యాయం ఎక్కడ? లోకేశ్ ఢిల్లీ వెళ్లి.. తన తండ్రిని అవినీతి కేసుల నుంచి బయటపడేయండి అంటూ ప్రాధేయపడుతున్నారు ►ప్రజలు తమ కోసం ప్రభుత్వంపై రాళ్లు వేయట్లేదనే భువనేశ్వరి ఏడుపు ►కులపిచ్చిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఇందుకే ►పురందేశ్వరి సిద్ధాంతం, వ్యక్తిత్వం లేని నాయకురాలు -
సుప్రీంలో చంద్రబాబు రెండు పిటిషన్ల విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. స్కిల్‌డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో క్వాష్ పిటిషన్‌తో పాటు ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వేర్వేరు పిటిషన్లు వేశారాయన. ఈ క్రమంలో ఇవాళ రెండు పిటిషన్లు విచారణకు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు వినిపించారు. ‘‘ఐదేళ్ల కిందట జరిగిన నేరానికి కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చట్టం అనుమతిస్తుంది. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారనేది ముఖ్యం కాదు. నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టం ఆధారంగానే విచారణ జరగాలి. కొన్ని చట్టాలను సవరించిన ఆ చట్టంలోని మిగిలిన భాగం అలాగే కొనసాగుతుంది. 17ఏ చట్టం తర్వాత జరిగిన కేసులకే వర్తిస్తుందని.. సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవినీతి అనేది ఎప్పుడు ఉద్యోగ బాధ్యత కిందకు రాదు. 17ఏ చట్టంం ప్రాథమిక విచారణకే వ్యతిరేకం అయినప్పుడు.. కేసులు ఎలా విచారిస్తారు. 17ఏ విషయంపై నాలుగు హైకోర్టులు చెప్పిన తీర్పులు చంద్రబాబుకి వ్యతిరేకంగానే ఉన్నాయి. నేరం జరిగిన సమయానికి 17ఏ లేదు కాబట్టి.. ఇది బాబుకి వర్తించదు. ఈ కేసులో నేరం జరిగినట్లు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇది ఎక్కడా ఉద్యోగ బాధ్యతగా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 17ఏ చంద్రబాబుకు వర్తించదు. ఈ కేసులో నేరం జరిగినట్లు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. ఇది ఎక్కడా ఉద్యోగ బాధ్యతగా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 17ఏ చంద్రబాబుకు వర్తించదు.. ఇది అవినీతికి సంబంధించిన చట్టం. అవినీతి పరుల్ని కాపాడే చట్టం కాదు. చంద్రబాబు కేసు ఉద్యోగ బాధ్యత కిందకు రాదు కాబట్టి 17ఏ వర్తించదు. గతంలో నేరం జరిగి.. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసినా 17ఏ వర్తించదు. చంద్రబాబుది సాక్ష్యాలు తారుమారు చేయడం.. ప్రజాధనం లూటీ చేసిన కేసు. అరెస్ట్ చేసిన వెంటనే సెక్షన్ 482 కింద క్వాష్ అడగడం ఎంత వరకు కరెక్టో కోర్టు నిర్ణయించాలి. పోలీసులకు కనీసం విచారణ చేసే అవకాశం ఇవ్వకుండా క్వాష్ కోరడం ఎంత వరకు సబబు. స్కిల్ స్కాం కేసు విచారణ ప్రాథమిక దశలో ఉంది. ఈ సమయంలో చంద్రబాబు క్వాష్ సరికాదు. 17ఏ చట్టం రాకముందు జరిగిన నేరాలకు.. 17ఏ వర్తించదని నాలుగు హైకోర్టులు తీర్పు ఇచ్చాయి. 17ఏ వర్తిస్తుందని ఏమైనా తీర్పులున్నాయా? అని ప్రశ్నించిన బెంచ్ అలా తీర్పులు వచ్చినట్లు నా దృష్టికి రాలేదు.. రోహత్గీ 17ఏ వర్తిస్తుందని తీర్పులు ఉన్నాయి.. చంద్రబాబు తరపు న్యాయవాది లాయర్ లూథ్రా రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ.. ‘‘కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు.. విచారణను అడ్డుకోవద్దని సుప్రీం కోర్టు పలుమార్లు తీర్పు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చంద్రబాబు చెబుతున్నారు. మరి నిర్ణయాలతో సంబంధం లేకుంటే.. 17ఏ ఎలా వర్తిస్తుంది?. 17ఏ అనేది కేవలం అధికార బాధ్యతలకు సంబంధించిన సెక్షన్. నేనే ఈ నిర్ణయాలకు బాధ్యుడిని అని చంద్రబాబు అంటేనే సెక్షన్ 17ఏ వర్తిస్తుంది. ఈ కేసులో 2018 జూన్ 5వ తేదీన జీఎస్టీ డీజీ రాసిన లేఖ చాలా కీలకం. విచారణ 2018లోనే ప్రారంభమైంది అని చెప్పడానికి ఇది తిరుగులేని సాక్ష్యం. జీఎస్టీ డీజీ రాసిన లేఖపై హైకోర్టులోనూ వాదనలు జరిగాయి. జీఎస్టీ రాసిన సమయంలో చంద్రబాబే సీఎంగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరుగుతోందని.. 2017లోనే ఒక విజిల్ బ్లోయర్ లేఖ రాశారు. విజిల్ బ్లోయర్ పేరు చెప్పకుండా ఉండే చట్టం.. ఇంకా అమల్లో ఉందా? అని రోహత్గీని అడిగిన సుప్రీం కోర్టు విజిల్ బ్లోయర్తన గుర్తింపును చెప్పకుండా ఉండే హక్కు ఉంది: రోహత్గీ ..14మే 2017లో మరోసారి విజిల్ బ్లోయర్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరుగుతోందని పుణే జీఎస్టీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రత్యేక చట్టానికి సవరణ 6ఏను గతంలో సుప్రీం కోర్టు కొట్టేసింది. విచారణ సంస్థలను విచారణ నుంచి అడ్డుకునేందుకు సవరణ చేయలేదు’’ అని రోహత్గీ వాదించారు. దాదాపు గంటన్నరపాటు సాగిన వాదనల అనంతరం పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది ధర్మాసనం. చంద్రబాబుని అరెస్ట్ చేస్తారేమో? ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వాయిదా వేసింది. అయితే.. పీటీ వారెంట్ ప్రకారం చంద్రబాబుని సోమవారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చాల్సి ఉందని, ఆ రోజు హాజరుపరిస్తే గనుక ఈ కేసులో అరెస్ట్ చేస్తారని చంద్రబాబు లాయర్ లూథ్రా విచారణ వాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రోజు హాజరుపరిస్తే అరెస్టు చేస్తారని, అప్పుడు ఈ పిటిషన్ నిరర్థకం అవుతుందని లూథ్రా ధర్మాసనానికి వివరించారు. ఆ దశలో సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి జోక్యం చేసుకుని.. ‘‘సోమవారం అరెస్టు ఉండద’’ని సీఐడీ తరఫున హామీ ఇచ్చారు.