breaking news
-
తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొట్టాయి. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు. రెండుకార్లలో కలిపి మరో 8మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులను దివ్యప్రియ(25), రమాదేవి (50), గనిష్క (19 నెలలు)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావు సైతం సహాయక చర్యలో పాల్గొన్నారు. చదవండి: TS: వాహనదారులకు హెచ్చరిక.. ఆ వెబ్సైట్లో చలాన్లు కడితే ఇక అంతే.. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు… pic.twitter.com/C48xYsOfY2— Telugu Scribe (@TeluguScribe) January 2, 2024 -
నూతన సంవత్సరంలో పెనువిషాదం
బేస్తవారిపేట/ఆగిరిపల్లి: నూతన సంవత్సరం వేళ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే... ప్రకాశంజిల్లా బేస్తవారిపేట మండలంలోని పాపాయిపల్లెకు చెందిన నల్లబోతుల పవన్‌కళ్యాణ్ (19), పిక్కిలి రాహుల్ (19), గుజ్జుల శ్రీనివాసులు (20) స్నేహితులు. వీరు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మోటార్ సైకిల్‌పై గిద్దలూరు వైపు వెళ్తున్నారు. అదే సమయంలో గిద్దలూరు నుంచి కంభం వైపు బొలేరో వాహనం (లగేజీ ట్రక్) వెళ్తోంది. బేస్తవారిపేట మండలంలోని చెట్టిచర్ల బస్టాండ్ సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేపై బొలేరో, మోటార్ సైకిల్ వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న పవన్ కళ్యాణ్‌పై పెట్రోల్ పడటంతో అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు. బైక్‌పై ఉన్న రాహుల్, శ్రీనివాసులు తలకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మోటార్ సైకిల్, బొలేరో వాహనం రెండూ మంటల్లో దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. సమాచారం అందుకున్న బేస్తవారిపేట ఎస్సై బి.నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కంభం అగ్నిమాపక దళ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మృతదేహాలను కంభం ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పాపాయిపల్లె తీసుకెళ్లారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఏలూరు జిల్లాలో బైక్ నేలబావిలో పడి ఇద్దరు యువకులు మృతి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామంలో బైక్ నేలబావిలో పడి ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడిన ఘటన సోమవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన తలశిల కృష్ణ చైతన్య (24), నున్న గ్రామానికి చెందిన శెట్టి సాయికుమార్ (24), నున్న రాకేష్ (25), మరో ఇద్దరు స్నేహితులతో కలసి ఆదివారం కనసానపల్లిలోని రాకేష్ మామిడి తోటలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఉదయం కృష్ణచైతన్య, సాయికుమార్, రాకేష్ ఒకే బైక్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా, గేదె అడ్డురావడంతో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న నేలబావిలోకి దూసుకుపోయింది. వీరి వెనుకే మరో బైక్‌పై వస్తున్న ఇద్దరు స్నేహితులు గమనించి వెంటనే కనసానపల్లి సర్పంచ్ అమ్మిశెట్టి సంజీవరావు సాయంతో వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికే నీటిలో మునిగిపోవడంతో కృష్ణ చైతన్య, సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. రాకేష్‌ను బయటకు తీసి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఈ ఘటనపై ఎస్ఐ చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేట్రేగిన టీడీపీ–జనసేన మూకలు..మంత్రి రజిని కార్యాలయంపై రాళ్ల దాడి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి/సత్తెనపల్లి : టీడీపీ, జనసేన మూకలు గుంటూరులో విధ్వంసానికి తెరలేపాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని కొత్త కార్యాలయంపై ఆ మూకలు రాళ్ల దాడిచేశాయి. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు చంద్రమౌళినగర్ మెయిన్‌రోడ్డులో మంత్రి రజిని వైఎస్సార్సీపీ నియోజకవర్గ నూతన కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నారు. సోమవారం ఉదయం ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా, ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత టీడీపీ, జనసేన కార్యకర్తల ముసుగులో కొందరు గూండాలు పెద్ద సంఖ్యలో బైక్‌లపై ర్యాలీగా వచ్చారు. ముందుగా పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నూతన సంవత్సర వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 12 గంటల తర్వాత కేక్ కటింగ్ నిర్వహించారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా.. తెలుగుదేశం, జనసేన జిందాబాద్.. అంటూ నినాదాలు చేస్తూ మంత్రి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. కార్యాలయం మొత్తం టీడీపీ రౌడీమూకలు విసిరిన రాళ్లతో నిండిపోయింది. అడ్డుకున్న పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఆఫీసు సెక్యూరిటీ మాసారపు చిరంజీవి అడ్డుకోబోతే అతనిపైనా దాడిచేశారు. కార్యాలయం ప్రారంభానికి సంబంధించిన ఫ్లెక్సీలను టీడీపీ మూకలు చించివేశాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు మేడా ప్రకాష్, సాధు రఘు, మద్దులూరి రామబ్రహ్మం, పుల్లా రేవంత్, కోనేటి సాయిమణికంఠ, పాములపాటి రాంబాబుతోపాటు మరో 24 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సుమారు వంద మంది పాల్గొన్నట్లు పట్టాభిపురం పోలీసులు నిర్ధారించారు. మిగిలిన వారిపైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. పథకం ప్రకారమే దాడి.. ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే.. మంత్రి రజినిని ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్సార్సీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంద్రమౌళినగర్లో పార్టీ కార్యాలయాన్ని ఆమె ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమెకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రత్యర్థులు దాడికి దిగినట్లు తెలిసింది. మరోవైపు.. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కూడా రజినిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సామాజికవర్గం ఎక్కువగా ఉండే ప్రాంతంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడాన్ని సహించలేని తెలుగుదేశం నేతలు ఈ దాడిని ప్రేరేపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీసీ మహిళపై టీడీపీ రౌడీయిజం : మంత్రి రజిని ఈ ఘటనపై మంత్రి రజిని స్పందిస్తూ.. తన పార్టీ కార్యాలయంపై దాడి టీడీపీ గూండాల అధికార దాహానికి పరాకాష్ట అని మండిప డ్డారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక బీసీ మహిళ పోటీచేయడాన్ని చూసి తట్టుకోలేక టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారన్నారు. వారికి ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ధ్వంస రచనకు తెరతీశారని ఆమె ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందన్నారు. వాహనాల ద్వారా బస్తాల్లో రాళ్లు తీసుకొచ్చి పార్టీ కార్యాలయంపై విసిరారని.. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. మంత్రి కార్యాలయంపైనే టీడీపీ రౌడీమూకలు దాడులకు పాల్పడ్డాయంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థంచేసుకోవచ్చన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణే ఉండదన్నారు. ఇలాంటి వారి చేతుల్లో అధికారం పెడితే.. రాష్ట్రం సర్వనాశనమవుతుందని మంత్రి చెప్పారు. భౌతిక దాడులతో నైతికంగా తమను దెబ్బతీయాలని చూస్తున్నారని.. తమ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడం ఎవరి తరం కాదని రజిని హెచ్చరించారు. టీడీపీ దౌర్జన్యాలు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో గుంటూరు ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. దాడి దుర్మార్గం : ఎమ్మెల్యే మద్దాళి గిరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీసీ మహిళ పోటీచేయడాన్ని టీడీపీ గూండాలు సహించలేకపోతున్నారని స్థానిక ఎమ్మెల్యే మద్దాళి గిరి తెలిపారు. బీసీలను అందలం ఎక్కిస్తామంటూ ఓ పక్క మాయమాటలు చెబుతూ మరోవైపు బీసీలపై ఇలా దాడులకు తెగబడటం టీడీపీకే చెల్లిందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దాడులు చేసిన వారికి ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించారు. బలహీనవర్గాలపై టీడీపీ, జనసేన దాడులు : మంత్రి జోగి ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్ కూడా స్పందిస్తూ.. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీల వారు సంఘ విద్రోహశక్తులుగా, గూండాలుగా మారి బలహీనవర్గాలపై దాడులకు తెగబడుతున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌లు తమ శ్రేణులను రెచ్చగొడుతూ.. ఇతర పార్టీలపై దాడులు చేయిస్తున్నారని.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో స్థిర నివాసం కూడా లేని వీరు సీఎం జగన్‌పై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న వీరికి రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెబుతారన్నారు. టీడీపీ, జనసేన కలిశాకే అరాచకాలు : మంత్రి అంబటి ఇక టీడీపీ, జనసేన పార్టీల కలయిక ప్రజాప్రయోజనాల కోసం కాదని, అరాచకం సృష్టించేందుకేనని.. గుంటూరులో బీసీ మహిళ మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడి ఇందులో భాగమేనని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి రజినీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం టీడీపీ దాష్టీకమని, దీనిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసిన తర్వాతే అరాచకాలు పెరిగాయన్నారు. చంద్రబాబునాయుడు నిరాశా నిస్పృహల్లో ఉన్నాడని, పవన్‌కల్యాణ్ ఒక అరాచక శక్తి అని ఆయన నిప్పులు చెరిగారు. ‘ఎర్ర’బుక్కులో పేర్లు రాసుకుని అధికారంలోకి వస్తే అధికారుల తాటతీస్తానని లోకేశ్ హెచ్చరిస్తున్నాడని, టీడీపీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పంను కనీసం మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్‌గా కూడా చేసుకోలేని చంద్రబాబుకి ఇప్పుడు ఎన్నికల ముందు అక్కడి ప్రజలు గుర్తుకొచ్చారని అంబటి విమర్శించారు. అంతకుముందు.. ఆయన రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఈ ఏడాదంతా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. -
మంత్రి రజిని ఆఫీస్‌పై దాడి.. 30 మంది అరెస్ట్
గుంటూరు, సాక్షి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు తమ చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి 30 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కార్యాలయంపై దాడి చేసింది టీడీపీ-జనసేన కార్యకర్తలనే పోలీసులు ధృవీకరించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని కార్యాలయంపై గుర్తు తెలియని ఆగంతకులు దాడులు చేశారు. ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడడంతో పాటు ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినా.. రౌడీ మూక వెనక్కి తగ్గలేదు. చివరికి దాడికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఇది టీడీపీ-జనసేన కార్యకర్తల పనిగా తేల్చారు. పచ్చమూక దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి రజిని.. బీసీ అయిన తనను దాడులతో భయపెట్టలేరన్నారు. ఓటమి భయంతో.. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారామె. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారామె. మరోవైపు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే మంత్రి రజినీ కార్యాలయంపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఎవరున్నా విడిచిపెట్టేది లేదు: మంత్రి రజిని వార్నింగ్ -
అర్ధరాత్రి ఎల్లో బ్యాచ్ ఓవరాక్షన్.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి
సాక్షి, గుంటూరు: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆఫీసు అద్దాలు ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించేశారు. వివరాల ప్రకారం.. న్యూ ఇయర్ సందర్భంగా విడదల రజిని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం తెలుగుదేశం, జనసేన నాయకులు ఓవరాక్షన్ చేశారు. మంత్రి విడుదల రజిని కార్యాలయంపై ఎల్లో బ్యాచ్ రాళ్లు విసిరారు. అనంతరం, మంత్రి కార్యాలయంలోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఆఫీసు అద్దాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలను చించేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ, జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు. అయితే, మంత్రి రజిని ఈరోజు గుంటూరు వెస్ట్‌లో ఏర్పాటు చేసిన తన ఆఫీసును ప్రారంభించడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో దాడి జరిగింది. -
భార్య మృతి.. ఆ కొద్ది సేపటికే భర్త కూడా!
చిల్లకూరు(తిరుపతి జిల్లా): కష్టసుఖాల్లో ఇన్నాళ్లూ తనతో పాటు నడిచిన తన అర్ధాంగి మృతిని భర్త తట్టుకోలేకపోయాడు. భార్య మరణించిన కొద్ది సేపటికే తాను ప్రాణాలు విడిచాడు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు దళితవాడలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కడివేడు గ్రామానికి చెందిన పల్లిపాటి నాగూరయ్య(68), రమణమ్మ(60)లు భార్యా భర్తలు. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు. వీరందరికి వివాహాలు జరిపించి మనవళ్లు, మనమరాళ్లతో సంతోషంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా, రమణమ్మకు ఇటీవల ఆరోగ్యం దెబ్బతిని మంచానికే పరిమితమైంది. వృద్ధాప్యంలోనూ నాగూరయ్య కూలి పనులకు వెళ్లి.. వచ్చిన డబ్బుకు తోడు ప్రభుత్వం అందించే పింఛన్‌తో ఆమెకు వైద్యం చేయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె శనివారం వేకువజామున ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని గమనించిన రమణయ్య.. కుటుంబ సభ్యులను మేల్కొలిపి, తాను ఓ చోట అలా కూర్చుండి పోయాడు. నిద్ర లేచిన దగ్గర్నుంచి ఏమీ మాట్లాడకుండా ఉన్నాడని.. కుమారులు తండ్రి దగ్గరకు వెళ్లి కదిలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచి ఉన్నాడు. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మరణించడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. -
కోడెల శివరామ్ వేధింపులతోనే మా బిడ్డ ఆత్మహత్య
పట్నంబజారు: కోడెల శివరామ్ వేధింపులు భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన మృతుడి తల్లి విలపిస్తున్నారు. మేడికొండూరు పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరేచర్లకు చెందిన కొల్లోజు ఫణీంద్రసాయి(22) నాలుగేళ్ల కిందట గుంటూరు నాజ్‌సెంటర్ డీమార్ట్‌లో గేట్ ఇన్చార్జిగా పనిలో చేరి సూపర్వైజర్గా ఎదిగాడు. కోడెల శివరామ్‌కు సంబంధించి వ్యక్తిగత పనులు కూడా చూస్తుండేవాడు. నగదుకు సంబంధించిన లావాదేవీలతో పాటు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని కనస్ట్రక్షన్లకు చెందినవి కూడా చూస్తుంటాడు. కొంతకాలం కిందట ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సెల్ స్విచ్ఛాఫ్ చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కంపెనీకి సంబంధించిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడంటూ కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో డీమార్ట్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యం కుదుటపడ్డాకవచ్చిన ఫణీంద్రసాయి.. రూ.2 లక్షలను తిరిగి ఇచ్చారని సాటి ఉద్యోగులు చెబుతున్నారు. అనంతరం పలు కారణాల రీత్యా ఫణీంద్ర అక్కడ ఉద్యోగం మానేశాడు. కొద్ది రోజుల తర్వాత యాజమాన్యం పిలిపించి తిరిగి ఉద్యోగంలో పెట్టుకుంది. ఈ నెల ప్రారంభంలో తిరిగి అనారోగ్యం తిరగబెట్టడంతో చికిత్స పొంది.. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో కోడెల శివరామ్ అనుచరుడైన నాయక్ నాలుగు రోజులుగా ఇంటికి వచ్చి ఫణీంద్రను భయభ్రాంతులకు గురిచేయడం ప్రారంభించాడు. ఉద్యోగానికి రావాలని లేకుంటే సార్ ఊరుకోరని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఫణీంద్ర గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కోడెల శివరామ్, నాయక్‌లు అకారణంగా వేధింపులకు గురిచేయడంతోనే తమ బిడ్డ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి కొల్లోజు నాగమణి ఆరోపిస్తున్నారు. నిత్యం నాయక్ వచ్చి, కోడెల శివరామ్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడే వాడంటూ ఆమె విలపించారు. తన కుమారుడి మృతికి కారణమైన కోడెల శివరామ్, అతని అనుచరుడు నాయక్‌లపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
చిత్తూరు జిల్లా: దళితులపై టీడీపీ వర్గాల దాడి
గంగవరం(చిత్తూరు జిల్లా): దళితులపై టీడీపీకి చెందిన అగ్రవర్ణాలవారు దాడులకు పాల్పడిన ఘటనలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గురువారం మీడియా ఎదుట బాధితులు తమ ఆవేదన వెళ్లగక్కారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ మబ్బువారిపేట దళితవాడలో దాదాపు 30 ఇళ్లలో ప్రజలు నివాసం ఉంటున్నారు. వీళ్లందరికీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ అంటే అమితమైన అభిమానం.దీన్ని జీర్ణించుకోలేని ఇదే గ్రామంలో టీడీపీకి చెందిన అగ్ర కులస్థులు నిత్యం కులం పేరుతో దూషించడం, అవమానించడం వంటివి పరిపాటిగా సాగిస్తున్నారు. బుధవారం రాత్రి వారు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటుండగా.. టీడీపీకి చెందిన అల్లరిమూకలు దుర్గ, గోవర్ధన్, రాకేష్ మరి కొంతమంది అనుచరులతో వెళ్లి అక్కడ గొడవలు సృష్టించారు. ఇంతలో రవి అనే వ్యక్తి అందరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. అందరూ కలిసి అతనిపై పైశాచికంగా దాడి చేశారు. అడ్డొచ్చిన మహిళల పైనా దాడులకు పాల్పడి కులం పేరుతో దూషించినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు దళితులపై దాడి విషయాన్ని ఎమ్మెల్యే వెంకటేగౌడ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్ఐ ప్రతాప్‌రెడ్డిని వివరణ కోరగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఇదీ చదవండి: మా అవినీతినే బయటపెడతారా.. మీ అంతు చూస్తాం -
అనకాపల్లి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద ప్యారడైజ్ అపార్ట్మెంట్లో ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను రామకృష్ణ, దేవి, వైష్ణవి, జాహ్నవిగా గుర్తించారు. అప్పులు బాధలు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కీచక టీచర్.. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పవిత్రమైన ఉపాధ్యాయుడి స్థానంలో ఉండి.. పదో తరగతి చదువుతున్న బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడిన జనకేశ్వరరావుకి 25 ఏళ్లు జైలు శిక్షతో పాటు, 50 వేల రూపాయలు జరిమానాను కోర్టు విధించింది. విశాఖలోని నాలుగోవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 ఏడాదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి ఆధారాలతో కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. బాధితురాలికి 4 లక్షల 50 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. బాధితులకు న్యాయం జరిగేలా వాదనలు వినిపించిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణకి బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ఇదీ చదవండి: సినిమా స్టోరీలా.. పరువు హత్య -
స్కిల్ కేసు.. ఉండవల్లి పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, గుంటూరు: చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుపై దాఖలైన పిటిషన్‌ను ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. స్కిల్ స్కామ్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. 14 మంది ప్రతివాదులు పలు కారణాలతో నోటీసులు తీసుకోలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం.. ఇతర కారణాలతో నోటీసులు వెనక్కి విషయాన్ని ప్రస్తావించారాయన. పైగా ఈ కేసులో కొందరు ప్రతివాదులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీలోనూ ఉన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఆయా ప్రతివాదులకు పేపర్ ప్రకటన ద్వారా నోటీసులు ఇస్తామన్నారు. ఈ విషయంపై మెమో ఫైల్ చేసినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో.. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది హైకోర్టు. -
యూపీఐ పేమెంట్లే మోసగాళ్ల టార్గెట్
సాక్షి, అమరావతి: దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల్లో యూపీఐ మోసాలే అత్యధికంగా ఉంటున్నాయి. డిజిటలీకరణ పెరుగుతున్న కొద్దీ అధికమవుతున్న ఆర్థిక నేరాల్లో యూపీఐ మోసాలదే అగ్రస్థానం. ‘అనాటమీ ఆఫ్ ఫ్రాడ్స్–2023’ పేరిట కాన్పూర్ ఐఐటీ, డిజిటల్ బ్యూరో కన్సల్టెన్సీ ప్రక్సీస్ సంస్థ విడుదల చేసిన నివేదిక యూపీఐ మోసాల తీవ్రతను వెల్లడించింది. దేశంలో రోజుకు సగటున 23 వేల డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు పెరుగుతుండటాన్ని సైబర్ ముఠాలు అవకాశంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయని ఆ నివేదిక చెప్పింది. ప్రస్తుతం దేశంలో 90.50 కోట్ల మందిగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు 2027నాటికి 100.14 కోట్లకు చేరతారని అంచనా వేసింది. 2019లో దేశంలో డిజిటల్ చెల్లింపులు 36 శాతం ఉండగా 2023 ఏప్రిల్ నాటికి 57 శాతానికి పెరిగాయి. 2027నాటికి డిజిటల్ చెల్లింపులు 74 శాతానికి చేరుతాయని అంచనా. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు ప్రధానంగా యూపీఐ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తగిన అవగాహన కల్పించాలని పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. అప్రమత్తతే రక్షా కవచం సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తతే రక్షా కవచం. వినియోగదారులు తగిన అవగాహన కలిగి ఉండాలని సీఐడీ ఎస్పీ (సైబర్ క్రైమ్ విభాగం) హర్షవర్ధన్ రాజు చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ఆయన చేసిన సూచనలు ఇవీ... ► డిజిటల్ చెల్లింపులు చేసే డివైజ్‌ల ‘పిన్’ నంబర్ల గోప్యత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పిన్ నంబర్లుగానీ ఓటీపీ నంబర్లుగానీ ఎవరికి తెలియజేయకూడదు. దీర్ఘకాలంగా ఒకే పాస్‌వర్డ్‌ను కొనసాగించకూడదు. పాస్‌వర్డ్‌ను నియమిత కాలంలో మారుస్తూ ఉండాలి. ► ఫేక్ యూపీఐ సోషల్ మీడియా హ్యాండిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చే అన్ని యూపీఐ హ్యాండిల్స్ విశ్వసనీయమైనవి కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ వినియోగదారుల యూపీఐ వివరాలను తెలపాలని ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోరవు. ఏదైనా ఆర్థిక సంస్థగానీ యాప్‌గానీ యూపీఐ వివరాలను కోరితే ఆ సంస్థ కచి్చతంగా మోసపూరితమైనదని గుర్తించి వెంటనే బ్లాక్ చేయాలి. ► పబ్లిక్ వైఫై, సురక్షితం కాని నెట్‌వర్క్‌ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయకూడదు. ► మొబైల్ ఫోన్లలో ట్రాన్సాక్షన్ అలెర్ట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మీ బ్యాంకు చెల్లింపులకు సంబంధించిన సమాచారం వెంటనే మీకు ఎస్ఎంఎస్ ద్వారా తెలిసే సౌలభ్యం ఉండాలి. మీ అనుమతిలేకుండా ఏదైనా చెల్లింపు జరిగితే వెంటనే గుర్తించి బ్యాంకును సంప్రదించి తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ►సైబర్/యూపీఐ మోసానికి గురయ్యామని గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయించాలి. ఫిర్యాదు చేయాలి. సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్ పోర్టల్ (నంబర్ 1930)కు గానీ ఏపీ సైబర్ మిత్ర (వాట్సాప్ నంబర్ 9121211100 )కుగానీ ఫిర్యాదు చేయాలి. భద్రతపై బ్యాంకుల దృష్టి సైబర్ మోసాలు పెరుగుతుండటంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైబర్ భద్రతపై దృష్టిసారించాయి. సైబర్ భద్రత మౌలిక వసతులను పెంచుకునేందుకు నిధులు వెచి్చస్తున్నాయి. దేశంలో 43 ఆర్థిక సంస్థలు సైబర్ భద్రత కోసం నిధుల వెచ్చింపును భారీగా పెంచగా.. 17 శాతం ఆర్థిక సంస్థలు స్వల్పంగా పెంచాయి. కాగా 35 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. 2 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను స్వల్పంగా తగ్గించగా 3 శాతం సంస్థలు బడ్జెట్‌ను భారీగా తగ్గించాయి. -
అనంతపురం జిల్లాలో బస్సు-ట్రాక్టర్ ఢీ: నలుగురి మృతి
సాక్షి, అనంతపురం జిల్లా: గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను వోల్వో బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను బస్సు ఢీకొట్టింది. మృతులను గుత్తి మండలం మామిడూరు గ్రామానికి చెందిన రైతులు చిన్నతిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: సూర్యోదయాన్ని చూసి వస్తుండగా.. -
'సలార్' రిలీజ్: ప్రభాస్ వీరాభిమాని మృతితో..
శ్రీసత్యసాయి, సాక్షి: సలార్ సినిమా రిలీజ్ నేపథ్యంలో అభిమానులు పండుగు చేసుకుంటుండగా.. ఊహించని విషాదం చోటుచేసుకుంది. ధర్మవరంలో థియేటర్ వద్ద ప్రమాదవశాత్తూ ఓ వీరాభిమాని మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ కేంద్రంలోని రంగా సినిమా థియేటర్లో 'సలార్' సినిమా విడుదల సందర్భంగా బాలరాజు(27) థియేటర్ ఆవరణలో సలార్ మూవీ బ్యానర్ కడుతున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఫ్లెక్సీ రాడ్ పైనున్న హై వోల్టేజ్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే దగ్గరలోని హాస్పిల్‌కి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు బంధువులు, ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద న్యాయం చేయాలంటూ, మృతిచెందిన బాలరాజు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ఇవి కూడా చదవండి: కామారెడ్డిలో దారుణం: క్షణికావేశంలో కొడుకును పొడిచి, ఆపై తండ్రి కూడా.. -
వైఎస్సార్ సీపీ నేత హత్యకు కుట్ర ?
మాచర్ల: మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఓ వైఎస్సార్ సీపీ మండల స్థాయి నాయకుడిని చంపేందుకు పన్నిన కుట్ర గురువారం భగ్నమైంది. దీనికోసం కర్నూలు జిల్లాకు చెందిన కిరాయి హంతకులకు కొందరు సుఫారీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మాచర్లలోని ఆర్అండ్బీ ప్రాంతంలో గురువారం సాయంత్రం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఇద్దరిని వైఎస్సార్ సీపీ దుర్గి మండల నాయకుడు మన్నెయ్య, అతని అనుచరులు పట్టుకున్నారు. వారిని స్థానిక పోలీసులకు అప్పగించగా వెంటనే స్పందించిన పోలీసులు ఆ పరిసరాల్లో ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురు కిరాయి హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వీరి నుంచి నాలుగు కత్తులు, రెండు కారం పొడి ప్యాకెట్లు దొరికినట్లు తెలుస్తోంది. వీరంతా కర్నూలు జిల్లాకు చెందిన సుఫారీ గ్యాంగ్ ముఠా అని, బుధవారం మధ్యాహ్నం పట్టణానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడిని చంపేందుకు వచ్చినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత వివరాలు తెలుపుతామని మాచర్ల పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ మాచర్ల ఇన్చార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించిన రోజు నుంచి హత్యా రాజకీయాలు పురుడుపోసుకున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు నియోజకవర్గంలో భయాందోళలను కలిగిస్తున్నారు. ఎన్నూడు లేనివిధంగా వైఎస్సార్సీపీ నేతను చంపేందుకు సుఫారీ గ్యాంగ్‌ను రప్పించడం కలకలం రేపుతోంది. -
పెళ్లైన ఐదు రోజులకే.. గోదావరిలోకి దూకిన నవదంపతులు
పెనుగొండ, పశ్చిమ గోదావరి: ఏ కష్టం వచ్చిందో తెలియదు. నవ దంపతులు గోదావరిలో దూకారు.. వరుడు ప్రాణాలతో బయట పడగా.. వధువు కోరాడ సత్యవతి మృతి చెందింది.. అయితే వరుడుపై వధువు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వడలి గ్రామానికి చెందిన కోరాడ సత్యవతి(19)ని తండ్రి లేకపోవడంతో తాతే పెంచి ఈ నెల 15న ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన కే శివరామకృష్ణతో వివాహం జరిపించాడు. వీరు మంగళవారం రావులపాలెం సినిమాకు అని చెప్పి వెళ్లారు. శివరామకృష్ణ కథనం ప్రకారం ఇద్దరూ సిద్ధాంతం బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బ్రిడ్జి నుంచి ఆర కిలో మీటరు దూరంలో ఉన్న శివరామకృష్ణ కేదారీఘాట్ సమీపంలో రక్షించమని అరవడంతో మత్స్యకారులు కాపాడారు. విషయాన్ని వధువు బంధువులకు చెప్పి తణుకు ప్రభుత్వాసుపత్రికి వైద్యం చేయించుకోవడానికి వెళ్లిపోయాడు. వధువు గల్లంతు కావడంతో బంధువులు గాలింపు చర్యలు చేపట్టి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శివరామకృష్ణను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వధువు కోరాడ సత్యవతి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. శివరామకృష్ణ హత్య చేశాడంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వడలి గ్రామస్తులు భారీగా పెనుగొండ పోలీస్ స్టేషన్‌కు తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సత్యవతి హత్య చేసి గోదావరిలో పడేయడమో చేసుంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై ఎస్‌ఎన్‌వీవీ రమేష్‌లు గ్రామస్తులకు సర్ధి చెప్పి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, అనుమానాలు పెట్టుకోవద్దంటూ భరోసా ఇచ్చారు. -
అమెరికాలో విజయవాడ మెడికో మృతి
విజయవాడ: అమెరికాలో విజయవాడకు చెందిన ఓ యువతి దుర్మరణం చెందింది. ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లిన ఆమె కారులో ప్రయాణిస్తూ అనూహ్యంగా ప్రాణాలు పొగొట్టుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ రూరల్ ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) నగరంలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ డిగ్రీ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్ చేయడానికి అమెరికాలోని షికాగోకు వెళ్లారు. బుధవారం కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీకవడంతో డ్రైవర్‌తో పాటు జహీరా నాజ్ స్పృహ తప్పారు. వెంటనే వాళ్లను ఆసుపత్రికి తరలించగా.. జహీరా మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతికి సంబంధించి వైద్య నివేదికపై స్పష్టత రావాల్సి ఉంది. -
అనంతపురం: రూ. 46 లక్షల చోరీ ఘటన.. అంతా డ్రామా..
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో ఐడీబీఐ బ్యాంక్ వద్ద జరిగిన చోరీ ఘటనను 12 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. చోరీ చేసింది క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ ఏజెంట్ పోతురాజుగా నిర్ధారించారు. ఏజెంట్ స్నేహితులను నిందితులుగా తేల్చారు. కేసు వివరాలను ఎస్పీ అన్భురాజన్ వివరించారు. ఏటీఎం ఉద్యోగిగా పనిచేస్తున్న పోతురాజు.. డబ్బుపై కాజేయాలని భావించి తన స్నేహితులతో కలిసి మాస్టర్ ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు నుంచి డబ్బు తీసుకొస్తున్న టైమ్‌లో దోపిడీ జరిగినట్లు చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. తనపై దాడి చేసి డబ్బు తీసుకెళ్లారని తప్పుడు ఫిర్యాదు చేశారు. అయితే ఆడిన అబద్దం సరిగ్గా అతక్కపోవడంతో దొంగతనం డ్రామా బయటపడింది. పోతురాజు సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అతడిని విచారించగా.. స్నేహితులతొ కలిసి చోరీ డ్రామా ఆడినట్లు గుర్తించారు. మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 46,55,723 నగదు, రెండు మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు. డబ్బుపై అత్యాశతోనే పోతురాజు చోరీ నాటకం ఆడినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. -
పూర్వ విద్యార్థినిపైలైంగిక దాడికి యత్నం
విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థినిపై అదే ప్రాంతంలోని ఫ్లైవుడ్ ఫ్యాక్టరీకి చెందిన ఉత్తరాది కార్మికుడు మంగళవారం లైంగిక దాడికి యతి్నంచాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. పార్వతీపురానికి చెందిన ఆమె 2021లో ఇక్కడి కళాశాలలో సీఎస్సీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆ కళాశాలను మరో యాజమాన్యం నిర్వహిస్తోంది. కాగా.. సర్టిఫికెట్ల కోసం వచ్చిన ఆమెపై మద్యం సేవించిన కార్మికుడు నిర్మానుష్య ప్రాంతంలో దాడికి యత్నించాడు. ఇది గమనించిన పశువుల కాపరులు(మహిళలు).. ఆమెను రక్షించి తీసుకువెళ్లారు. కళాశాల సిబ్బంది ఫిర్యాదుతో భీమిలి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆమెను భీమిలి స్టేషన్‌కు తరలించి.. ఆమెతో పాటు స్థానికులను విచారించారు. వారు చెప్పిన వివరాలతో దాకమర్రి, బోడమెట్టపాలెం పరిసర ప్రాంతాల్లోని ఫ్లైవుడ్ ఫ్యాక్టరీల్లో గాలించి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. భీమిలి సీఐ డి.రమేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జమ్ములో ఏపీ జవాను మృతి
తుని రూరల్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవానుగా జమ్ములో విధులు నిర్వహిస్తున్న తంతటి కిరణ్ కుమార్ (41) సోమవారం బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. తుని మండలం హంసవరం గ్రామం ఆయన స్వస్థలం. కిరణ్‌కుమార్ మృతి సమాచారం తెలియడంతో ఆయన భార్య విజయకుమారి, సోదరుడు రవికుమార్ హుటాహుటిన జమ్మూ వెళ్లారు. వారికి కిరణ్ కుమార్ పార్థివ దేహాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో అప్పగించారు. భర్త మృతదేహాన్ని చూసి విజయకుమారి కన్నీరు మున్నీరుగా విలపించారు. రాత్రికి విశాఖపట్నానికి చేరుకుని తెల్లవారుజామున మృతదేహాన్ని గ్రామానికి తీసుకువస్తామని బంధువులు తెలిపారు. కిరణ్‌కుమార్ మృతదేహానికి బుధవారం ఉదయం అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కిరణ్ కుమార్‌కు భార్యతో పాటు కుమారుడు జతిన్ (12), కుమార్తె మెర్సీ (10), తల్లిదండ్రులు జాన్, భాగ్యవతి ఉన్నారు. దేశ సేవలో ఇద్దరు కుమారులు హంసవరం గ్రామానికి చెందిన జాన్, భాగ్యవతి దంపతులకు ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూండగా రెండో కుమారుడైన కిరణ్ కుమార్ 2005లో సీఆర్పీఎఫ్లో చేరారు. మూడో కుమారుడు రవికుమార్ ఆర్మీలో చేరాడు. ఇద్దరు కొడుకులు దేశ రక్షణలో సేవలు అందిస్తూండటం తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్నిచ్చిందని, కిరణ్ కుమార్ మృతి పుత్రశోకాన్ని మిగిల్చిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. కిరణ్ కుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులను సర్పంచ్ రాయి మేరీ అవినాష్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
బస్సులో కన్నుమూసిన బిడ్డ.. తల్లడిల్లిన తల్లి హృదయం
యలమంచిలి/యలమంచిలి రూరల్: ఏ వ్యాధి సోకిందో? ఏం జరిగిందో తెలీదు కానీ.. తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న రెండేళ్ల బాబు అస్వస్థతకు లోనయ్యాడు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే ప్రాణాలు కోల్పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డకు తన చేతుల్లోనే నూరేళ్లు నిండిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. విగతజీవిగా మారిన పసిబిడ్డను పట్టుకుని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది. యలమంచిలి ప్రభుత్వాస్పత్రి వద్ద సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది తెలియజేసిన వివరాలు.. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లులో నివాసముంటున్న కర్రి కుమారి రెండేళ్ల కుమారుడు చెర్రీ కొంతకాలంగా తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. సోమవారం విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు తీసుకెళ్లి బస్సులో పెనుగొల్లు వస్తుండగా యలమంచిలి సమీపాన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. తల్లి కుమారి తన బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలన్న తాపత్రయంతో యలమంచిలిలో బస్సు దిగి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే చెర్రీ మృతి చెందినట్టు డ్యూటీ డాక్టర్ సుభాష్ ధ్రువీకరించారు. ఎన్నో కష్టాలు పడుతూ బిడ్డకు చికిత్స చేయించినా రెండేళ్లకే నూరేళ్లు నిండిపోయాయని తల్లి కుమారి గుండెలు బాదుకుంటూ విలపించింది. తన కొడుకుని బతికించమని వేడుకుంటూ చూపరులను కంటతడి పెట్టించింది. మృతి చెందిన చెర్రీ తండ్రి తాతాజీ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. భార్య కుమారితో విభేదాల కారణంగా కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. తండ్రి వచ్చేవరకూ చెర్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుదరదంటూ భర్త తరపు వారు ఆస్పత్రి వద్ద భార్య, ఆమె కుటుంబీకులతో వాగ్వాదానికి దిగారు. కారులో మృతదేహం తరలింపును అడ్డుకున్నారు. -
Viveka Case: ‘నాపై ఒత్తిడి తెస్తున్నారు’
సాక్షి, వైఎస్సార్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై పులివెందుల పోలీసులు కేసు నమోదుచేశారు. కోర్టు ఆదేశాల మేరకే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసులో తనను బెదిరిస్తున్నారని వివేకాకు పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని.. ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో పిటిషన్లో వివరించారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న అన్బురాజన్‌ను కలిసి వినతిపత్రం అందచేసినా.. ఫలితం లేకపోవడంతోనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు.. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి సునీత, రాజశేఖరరెడ్డి, రాంసింగ్‌పై కేసు నమోదుచేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 156 (3) కింద పులివెందుల పోలీసులు శనివారం కేసు నమోదుచేశారు. -
ఓటీపీలతో రూ.6.90 లక్షలకు కుచ్చుటోపీ
పెద్దదోర్నాల: ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం మీ అకౌంట్లోకి జమ చేస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్లోని నగదు మొత్తాన్ని కాజేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఐనముక్కలలో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘరానా మోసంలో గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు నగదు పోగొట్టుకున్నారు. ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన గ్రామానికి చెందిన చిట్యాల ఆంజనేయరెడ్డి అనే యువకుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం ఒక్కసారే అకౌంట్లో పడుతుందని, ఫోన్ పే ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మాట్లాడాలని సూచించాడు. తొలుత అకౌంట్ నుంచి కొంత మొత్తం కట్ అయి తిరిగి పడుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. తనది ఆండ్రాయిడ్ ఫోన్ కాకపోవడంతో ఆ యువకుడు గ్రామానికి చెందిన లింగాల శ్రీను నంబర్ నుంచి గుర్తు తెలియని నంబర్‌కు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడు. అయితే.. శ్రీను అకౌంట్లో అమౌంట్ తక్కువగా ఉందని చెప్పడంతో శ్రీను తమ్ముడు లింగాల రమేష్ నంబర్ నుంచి ఫోన్‌చేసి కాన్ఫరెన్స్ కాల్ కలిపి ముగ్గురూ సైబర్ నేరగాళ్లతో మాట్లాడారు. అతని మాటలు నమ్మిన రమేష్ తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్లతో పాటు ఫోన్‌పేకు సంబంధించిన పాస్‌వర్డ్‌ను చెప్పటంతో లింగాల రమేష్ అకౌంట్లోని రూ.6.90 లక్షల నగదు మాయమైంది. అయితే.. మాయమైన డబ్బు నుంచి రూ.79 వేల నగదు తిరిగి బాధితుడి అకౌంట్‌కు జమ అయినట్లు ఎస్సై తెలిపారు. తమకు వచ్చిన ఫోన్ నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది స్విచ్చాఫ్ వస్తుండటంతో తాము మోసపోయినట్టు సోదరులు గ్రహించారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్‌తో పాటు స్థానిక బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి ఫోన్లు వచ్చాయని, ఏ రాష్ట్రానికి ఫోన్ చేయాలనుకుంటే అదే భాషలతో మాట్లాడే వాళ్లతో ఫోను చేయిస్తారని, డబ్బులు వస్తాయని నమ్మకంగా ఆశ చూపి అకౌంట్లలోని డబ్బులు మాయం చేస్తారని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
దూసుకొచ్చిన మృత్యువు
బొమ్మలసత్రం: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె వంతెనపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. గర్భిణిగా ఉన్న భార్యకు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని సొంతూరుకు తిరిగి వెళ్తున్న ఓ వ్యక్తిని మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కూడా దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ సీఐ ఇస్మాయిల్ తెలిపిన వివరాల మేరకు.. బనగానపల్లె పట్టణానికి చెందిన ఇక్బాల్ (36), ఆఫ్రిన్ దంపతులకు ఆప్స అనే రెండేళ్ల చిన్నారి ఉంది. ఇతను సొంతూరులోనే చెప్పుల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆఫ్రిన్ రెండవ సారి గర్భం దాల్చి నాలుగు నెలలు నిండటంతో నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యురాలి వద్ద చూయించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఇక్బాల్‌తో పరిచయమున్న భాస్కర్ ఆటోలో కుటుంబంతో సహా బయలుదేరారు. నూనెపల్లి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. నూనెపల్లి బ్రిడ్జి నుంచి ఆటో కిందకు వస్తుండగా ముందున్న లారీ బ్రిడ్జి కుడివైపుకు నెమ్మదిగా తిరుగుతుండగా భాస్కర్ ఆటోను నిలిపాడు. అంతలోనే వెనుక నుంచి వేగంగా వస్తున్న ఐచర్ వాహనం ఆటోను బలంగా ఢీకొని ఎదురుగా ఉన్న లారీ వద్దకు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆటో రెండు లారీల మధ్య చిక్కుకుని నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ భాస్కర్ (42), ఇక్బాల్ (36) అక్కడికక్కడే మృతిచెందారు. ఇక్బాల్ భార్య ఆఫ్రిన్‌కు, కూతురు ఆప్సకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోలో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన ఐచర్ వాహనం డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. -
లాడ్జిలో ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య
కర్నూలు(టౌన్)/నందికొట్కూరు: వివాహేతర సంబంధం ఇరువురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన శనివారం కర్నూలు నగరంలోని వుడ్‌ల్యాండ్స్ లాడ్జిలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న విజయకుమార్(35) వృత్తిరీత్యా అకౌంటెంట్. బీటెక్ పూర్తి చేసిన ఇతను పదేళ్ల క్రితం పట్టణానికి చెందిన ముస్లిం అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. మిడుతూరు మండలం నాగలూటికి చెందిన రుక్సానా(45)కు పట్టణానికి చెందిన కార్పెంటర్‌తో 2001లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఒకే కాలనీలో ఉంటున్న విజయకుమార్, రుక్సానా మధ్య ఏర్పడిన పరిచయం మూడేళ్లుగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా శుక్రవారం ప్రియుడు రుక్సానాకు ఫోన్ చేసి కర్నూలులోని వుడ్‌ల్యాండ్స్ లాడ్జిలో ఉన్నట్లు చెప్పాడు. దీంతో బాబుకి ఆరోగ్యం బాగోలేదని కర్నూలుకు వెళ్లి ఆస్పత్రిలో చూపిస్తానని భర్తకు చెప్పి రూ.5 వేలు తీసుకుని బయలుదేరింది. అయితే కుమారుడిని ప్రభుత్వాసుపత్రి వద్ద వదిలి ఆమె కనిపించకుండా పోయింది. రాత్రి అయినా రాకపోవడంతో కుమారుడు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఇదే సమయంలో ప్రియుడు విజయ్‌కుమార్ ఆమె కుమారుడికి ఫోన్ చేసి ఇద్దరం లాడ్జిలో ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. ఫోన్ పే ద్వారా రూ.300 అకౌంట్లో వేశాడు. అయితే ఏ లాడ్జి అనే సమాచారం లేకపోవడంతో కుమారుడు అన్ని చోట్ల వెతికాడు. చివరకు వుడ్‌ల్యాండ్స్ వద్ద పార్కు చేసిన ద్విచక్రవాహనాన్ని గుర్తు పట్టి లాడ్జిలో విచారించారు. విజయ్‌కుమార్ అక్కడే ఉన్నట్లు తెలుసుకుని రూమ్ వద్దకు వెళ్లి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తెరువ లేదు. రూమ్ సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శనివారం లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సైతం ఎంత ప్రయత్నించినా రూం తలుపులు తెరవకపోవడంతో బద్దలు కొట్టారు. ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు ఈ ఘటన వివాహేతర సంబంధం వల్లే జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఇరువురి మధ్య గొడవ జరిగి రుక్సానాను కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువాత క్రిమి సంహారక మందు తాగి తనూ ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటనా స్థలంలో ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. హత్య, ఆత్మహత్యకు సంబంధించి కారణాలపై విచారణ చేస్తున్నాం. – మురళీధర్ రెడ్డి, మూడవ పట్టణ సీఐ