breaking news
-
మాంబట్టు సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం
తడ (తిరుపతి జిల్లా): పరిశ్రమల్లో లభించే పాత వస్తువులను సేకరించే ఒక సంస్థ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలకు సమీపంలో నెలకొలి్పన డంపింగ్ యార్డులో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా తడలోని మాంబట్టు ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నిల్వ ఉంచిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పొగ ఆకాశాన్ని అంటుకుని చీకట్లు కమ్మేయడంతో సమీప పరిశ్రమల్లోని కార్మికులు ఆందోళన చెందారు.నాయుడుపేట సీఐ శ్రీనివాసులురెడ్డి, సూళ్లూరుపేట సీఐ మధుబాబు, తడ, సూళ్లూరుపేట ఎస్ఐలు నరశింహారావు, రహీంరెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సూళ్లూరుపేట, అపాచీ పరిశ్రమలకు చెందిన రెండు ఫైరింజన్లు మంటలు అదుపు చేసేందుకు శ్రమించాయి. మంటలతోపాటు మంటల్లో నుంచి భారీ శబ్దాలతో పేలుళ్లు వస్తుండటంతో పోలీసులు ఆ దారిన రాకపోకలు అడ్డుకుని ఇతర మార్గాల్లో వాహనాలు మళ్లించారు.కాగా పరిశ్రమలకు సమీపంలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఉన్న డంపింగ్ యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు జరుగుతాయని ఏడాది క్రితం సూళ్లూరుపేట ఫైర్ అధికారులు తిరుపతికి చెందిన స్థల యజమాని హర్షవర్ధన్, చెత్త సేకరించి నిల్వ చేసుకునేందుకు స్థలాన్ని లీజుకు తీసుకున్న షేర్ అలీ అనే వ్యక్తులకు సమాచారం ఇచ్చినా వారు పెడచెవిన పెట్టారని ఫైర్ సిబ్బంది తెలిపారు. డంపింగ్ యార్డులో పనికి రాని చెత్త మాత్రమే కాలిపోగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆనుకుని ఉన్న అల్యూమినియం క్యాస్టింగ్ కంపెనీ తీవ్రంగా నష్టపోయింది. -
జగనన్న లేఅవుట్లోని ఇళ్లు ధ్వంసం
దుత్తలూరు: జగనన్న లేఅవుట్లలోని ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో జగనన్న లేఅవుట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు 36 ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో 20 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీవాసులు వైఎస్సార్సీపీకి ఓటేశారనే అక్కసుతో సోమవారం సాయంత్రం అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశ్నిaస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు.ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. ఇళ్ల కూల్చివేతను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కావలి డీఎస్పీ వెంకటరమణ, ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్సై ఉమాశంకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తమ ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ నాయకుడు పిడికిటి వెంకటేశ్వర్లును, జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జేసీబీని స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
సరిపల్లిలో టీడీపీ, జనసేన కార్యకర్తల విధ్వంసం
కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో సచివాలయ భవనాన్ని ఆదివారం జనసేన, టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాలరాజు శిలాఫలకాన్ని, సచివాలయం నిర్మించ తలపెట్టిన సామగ్రిని ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ పేరిట ప్రణాళిక ప్రకారం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం వద్దకు చేరుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డిŠ, తెల్లం బాలరాజు ఫ్లెక్సీలను, శిలాఫలకాలను ధ్వంసం చేశారు.సచివాలయ కార్యాలయంలోని సామగ్రిని పగలగొట్టి వీరంగం సృష్టించారు. ఎవరైనా అడ్డుకుంటే అంతుచూస్తామంటూ భవన నిర్మాణ కారి్మకులను బెదిరించారు. పక్కన నిర్మాణంలో ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహం, స్మారక మందిరం వద్ద దాడులకు పాల్పడుతున్న సమయంలో సమీపంలోని రైతులు ఎదురు తిరగడంతో విరమించుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు పీఏసీఎస్ అధ్యక్షురాలు మందపాటి శ్రీదేవి తెలిపారు.కొయ్యలగూడెం మండలం సరిపల్లి సచివాలయ భవనంపై దాడి చేస్తున్న కూటమి పార్టీ కార్యకర్త -
Medical Student Dies: ఆరిపోయిన ఆశల దీపం
కర్నూలు(హాస్పిటల్)/ రొళ్ల: ఆశల దీపం ఆరిపోయింది. రోడ్డు ప్రమాదం ఓ వైద్య విద్యార్థిని బలితీసుకుంది. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఆర్.తేజేశ్వర్‌రెడ్డి(22) ఆదివారం మృత్యువాత పడ్డాడు. ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన రంగనాథ్ (రత్నగిరి జెడ్పీ హైసూ్కల్ టీచర్), గీతాలక్ష్మి (పిల్లిగుండ్ల గొల్లహట్టి ప్రాథమిక పాఠశాల టీచర్) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు తేజేశ్వర్‌రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక చిన్న కుమారుడు వర్షిత్‌రెడ్డి బెంగళూరులో ఇంజినీరింగ్ కోర్సు చేస్తున్నాడు. తేజేశ్వర్‌రెడ్డి ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో కాలేజీలోని రీడింగ్ రూమ్‌లో చదవడం ముగించుకుని.. వసతిగృహానికి బుల్లెట్ బండి (ద్విచక్రవాహనం)పై బయల్దేరాడు. కళాశాల గేటు దాటి బయటకు రాగానే పెట్రోల్ బంక్ దాటిన తర్వాత అదే రోడ్డులో నందికొట్కూరు నుంచి కర్నూలుకు వేగంగా వస్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. కిందపడిన తేజేశ్వర్‌రెడ్డిని దాదాపు 50 మీటర్ల వరకు బస్సు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో తేజేశ్వర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చురీకి తరలించారు. మధ్యాహ్నం తల్లిదండ్రులు రావడంతో పోలీసులు పంచనామా చేసి మృతదేహాన్ని అప్పగించారు. చదువు పూర్తయ్యాక పెద్ద డాక్టర్ అయి తమకు అండగా ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులు.. కుమారుని మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. 20 రోజుల కిందటే కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వచ్చారు. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిపోయిందంటూ బంధువులు, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పిల్లిగుండ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు, వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు విద్యార్థి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ప్రగతి సీబీఎస్ఈ పాఠశాలపై టీడీపీ దౌర్జన్యం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ప్రగతి సీబీఎస్ఈ పాఠశాలపై శనివారం టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. 200 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాఠశాలపై దాడి చేసి పాఠశాలలో ఉన్న డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్ అపహరించుకెళ్లారు. పాఠశాల భవనానికి, గేట్లకు తాళాలు వేసి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారు. దీనిపై ప్రగతి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ మక్కెన అచ్చయ్య మాట్లాడుతూ.. తాను, తన సతీమణి మక్కెన పద్మజ 2013లో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ గుంటూరు (ఏఈఎల్సీ) వారి నుంచి విద్యాసంస్థలు నిర్వహించడానికి 2.20 ఎకరాల స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాల భవన నిర్మాణ సమయంలో మొక్కపాటి చంద్రశేఖర్, వెలినేడి కోటేశ్వరరావు, సూర్యదేవర శ్రీనివాసరావు తనను కలిసి విద్యాబోధన అంటే ఇష్టమని నమ్మబలికి 2015లో ప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీలో సభ్యులుగా చేరారని, ఆరునెలలు గడవక ముందే తనతో గొడవపడ్డారని చెప్పారు. పాఠశాలకు చిన్న భవనం సరిపోతుందని, రెండెకరాల ఖాళీస్థలంలో వాణిజ్య సముదాయం ని ర్మించాలని ప్రతిపాదిస్తే తాను తిరస్కరించానని, ఆ స్థలం విద్యాసంస్థల నిర్వహణకు మాత్రమే ఉపయోగించాలని చెప్పానని పేర్కొన్నారు. అందుకోసమే ఆ స్థలాన్ని లీజుకి ఇచ్చారని చెప్పడంతో ఘర్షణ మొదలైందన్నారు. విద్యా సంవత్సరం మొదలయ్యే సమయంలో పాఠశాల మీద అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ నాయకులు దాడిచేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి? రక్షణ కల్పించమని ఎవరిని అడగాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెయ్యిమంది విద్యార్థులు సీబీఎస్ఈ విద్యా విధానానికి దూరమవుతారేమోనని ఆందోళనగా ఉందన్నారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం మూడుగంటలకు టీడీపీ నాయకుడు సూర్యదేవర శ్రీనివాసరావు తన అనుచరులతో పాఠశాల మీద దాడిచేసి కార్యాలయ తలుపులు పగలగొట్టి, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి వాచ్‌మన్‌ను చంపుతామని బెదిరించి పాఠశాల డాక్యుమెంట్స్‌ను తస్కరించడానికి ప్రయత్నించారని చెప్పారు. ఆయన, ఆయన అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఆ ఫిర్యాదును నమోదు చేయలేదని, ఎటువంటి చర్య తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సూర్యదేవర శ్రీనివాసరావు స్పందించారు. గత ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని మక్కెన అచ్చయ్య తన స్కూల్‌ను కబ్జా చేశాడని, తన స్కూల్‌ను తాను స్వాధీనం చేసుకుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నాడని ఒక ప్రకటలో పేర్కొన్నారు. దీనికి, టీడీపీకి సంబంధం లేదని ఆయన తెలిపారు. -
పోలీసుల వేధింపులతో ఉప సర్పంచ్ ఆత్మహత్య
సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన ఉప సర్పంచి, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు (37) నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మృతిచెందాడు. అతడి మృతితో సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఉద్రిక్తత నెలకొంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈనెల 4న పాకాలపాడు పీఏసీఎస్ అధ్యక్షుడు కొర్లకుంట వెంకటేశ్వర్లు కౌంటింగ్‌కు వెళ్లాడు. ఆయన కుమారుడు రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఇంటి వద్ద ఉన్నాడు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఈనెల 4వ తేదీ ఉదయం ఏడుగంటల సమయంలో నాగమల్లేశ్వరరావును ట్రబుల్ మంగర్స్ బైండోవర్‌లో భాగంగా పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టారు. మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా రావడంతో రెంటపాళ్లలోని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నాగమల్లేశ్వరరావు ఇంటిపై, ఎస్సీ కాలనీపై దాడులకు దిగారు. నాగమల్లేశ్వరరావు ఇంట్లో ఆయన భార్య నందిని, కుమార్తె యశస్విని ఉన్నారు. ఇంటిమీద దాడిచేస్తున్న విషయాన్ని యశస్విని తన తండ్రి నాగమల్లేశ్వరరావుకు ఫోన్‌చేసి చెప్పింది. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఆయన ఫోన్ మాట్లాడబోతుండగా పోలీసులు ఫోన్ లాక్కున్నారు. ఈ నెల 5న సాయంత్రం మర్యాదగా గ్రామం విడిచి వెళ్లు .. లేకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తానంటూ సత్తెనపల్లి రూరల్ సీఐ రాజే‹Ùకుమార్ బెదిరించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో నాలుగు రోజులపాటు దూరంగా ఉంటే గొడవలు సర్దుబాటవుతాయని భావించిన తండ్రి వెంకటేశ్వర్లు కూడా నాగమల్లేశ్వరరావును గుంటూరులో సోదరుడు కొర్లకుంట శ్రీకాంత్ వద్దకు పంపాడు. తనపై ఒక్క కేసు కూడా లేకపోయినా, ఇంటిపైకి వచ్చి గొడవచేసి దాడులు చేసిన టీడీపీ, జనసేన నాయకులను వదిలేసి పోలీసులు తనను బెదిరించటంతో మనస్తాపానికి గురైన నాగమల్లేశ్వరరావు ఈనెల 6న పేరేచర్ల వద్ద గడ్డిమందు కొనుగోలు చేసి 14వ మైలు వద్ద తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటినుంచి మృత్యువుతో పోరాడిన నాగమల్లేశ్వరరావు ఆదివారం మరణించాడు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సమయంలో మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడ పోలీసులు ఫిర్యాదును ట్యాంపరింగ్ చేశారు. నాగమల్లేశ్వరరావు మృతి వార్తతో రెంటపాళ్లలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసు బలగాలను మోహరించారు. నాగమల్లేశ్వరరావు మృతదేహాన్ని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, అంబటి అల్లుడు ఉపేష్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, నాయకులు నల్లబోతు శివనారాయణ, చల్లా శ్రీను, కొమెర శివశంకర్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లును ఓదార్చారు. తన కుమారుడి మృతికి కారకులపై పోలీసు ఉన్నతా«ధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నాగమల్లేశ్వరరావు మృతదేహానికి గుంటూరు జీజీహెచ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. -
మనస్తాపంతో ఇద్దరు వైఎస్సార్సీపీ అభిమానులు ఆత్మహత్య
బల్లికురవ/టి.నరసాపురం: వైఎస్సార్సీపీ ఓటమిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో ఇద్దరు అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గంగపాలెం గ్రామానికి చెందిన పెయ్యల రామయ్య(64) 4వ తేదీ ఉదయం ఎన్నికల ఫలితాలను టీవీలో చూస్తూ బాధపడ్డాడు. ప్రజలకు ఎంతో మేలు చేసిన వైఎస్సార్సీపీని ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా ఓడించారంటూ మనోవ్యథకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి గంగపాలెం గ్రామం నుంచి మల్లాయపాలెం వెళ్లే రోడ్డులోæని వ్యవసాయ భూమిలో ఉన్న విద్యుత్ స్తంభానికి తాడుతో ఉరి వేసుకుని ప్రాణాలొదిలాడు. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న కటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని భార్య సులోచన మాట్లాడుతూ.. ‘జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు అందడంతో మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోవడంతో నా భర్త ఎంతో బాధపడ్డాడు. ఆయన్ను ఎంతగానో ఓదార్చాం. కానీ, ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు’ అంటూ విలపించింది. రామయ్య కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు, ఎంపీపీ బడుగు శ్రీలక్ష్మి సురేష్, కొణిదెన సర్పంచ్ కె.లేపాక్షి విష్ణు, పెయ్యల రంగనాథ్, గుంజి ఆంజనేయులు తదితరులు పరామర్శించారు. అన్యాయం జరిగిందంటూ.. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం పుట్రేపు గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాస్(24) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వైఎస్సార్సీపీ అంటే విపరీతమైన అభిమానం ఉన్న శ్రీనివాస్.. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో గెలిచి.. మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి చేపడతారని భావించాడు. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు రావడంతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎక్కడో అన్యాయం జరిగిందంటూ ఆవేదన చెందాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం కొద్దిసేపటికి ఇంటికి వచి్చన కుటుంబసభ్యులు శ్రీనివాస్‌ను వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న శ్రీనివాస్ మరణించడంతో భార్య, ముగ్గురు పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
‘సిగ్నల్’ చోరీ
సాక్షి, అమరావతి: దేశంలో సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్య పెరుగుతోంది. ఫోన్ చేస్తే మధ్యలోనే కాల్ డ్రాప్ అవుతోంది. ఒక్కోసారి సిగ్నల్ ఉన్నట్టే ఉంటుంది.. కానీ ఫోన్ మాత్రం కలవదు. ఇవన్నీ తమ వల్ల వచ్చిన సమస్యలు కావని.. సెల్ టవర్లపై దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో తలెత్తిన సమస్యలని నెట్వర్క్ ఇంజనీర్లు, టెలికాం సంస్థలు చెబుతున్నాయి. గత 6 నెలల్లో దేశవ్యాప్తంగా 17 వేల రేడియో రిమోట్ యూనిట్లు(ఆర్ఆర్యూ) చోరీకి గురయ్యాయి. టెలి కమ్యూనికేషన్స్‌లో ట్రాన్స్ రిసీవర్‌గా ఆర్ఆర్యూ ఉపయోగపడుతుంది. ఇది ట్రాన్స్మిషన్ పనితీరును, మొబైల్ సిగ్నల్ల స్వీకరణను మిళితం చేస్తుంది. ఆర్‌ఆర్‌యూలు చోరీకి గురవుతుండటంతో సిగ్నల్ సమస్యలు పెరిగిపోతున్నాయని టెలికాం నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా దొంగతనాలతో దేశవ్యాప్తంగా టెలికాం కంపెనీలు రూ.800 కోట్ల మేర నష్టాలను చవిచూశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దొంగిలించిన ఆర్ఆర్ యూనిట్లును చైనా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెల్యులార్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ).. ఆర్ఆర్యూ దొంగతనాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. దేశ డిజిటల్ భవిష్యత్‌కు ఉపయోగపడే కీలక మౌలిక సదుపాయాలను రక్షించడానికి కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడుతోంది.ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ.. గతేడాది అక్టోబర్ నుంచి ఈ తరహా దొంగతనాలు పెరిగాయి. గుజరాత్‌తో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. -
ఆస్తి కోసమే బాలిక హత్య
కంభం: ఆస్తి కోసం తొమ్మిదేళ్లు పెంచుకున్న బాలికను పెంపుడు తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ నెల 6న ప్రకాశం జిల్లా అర్థవీడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. శనివారం మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పుచ్చకాయల వెంకట రమణ, పుచ్చకాయల లక్ష్మీపద్మావతికి పిల్లలు లేకపోవడంతో అతని సోదరుడు వెంకట రంగారెడ్డి కుమార్తె పుచ్చకాయల శాన్విరెడ్డిని ఆరునెలల వయసు ఉన్నప్పుడే.. అనగా 9 ఏళ్ల నాడు దత్తత తీసుకున్నారు.ప్రస్తుతం ఆ బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల శాన్విరెడ్డి కన్నతల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కన్నతల్లిదండ్రులు శాన్విరెడ్డిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుండటాన్ని గమనించిన పెంపుడు తల్లి..ఎంతబాగా పెంచినా కన్నతల్లిదండ్రులం కాలేమని భావించింది. బాలికను చంపేస్తే తమ ఆస్తి ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, తామే అనుభవించుకోవచ్చని ఆలోచించింది. ఈ నెల 6న శాన్విరెడ్డి ఒంటరిగా బెడ్రూంలో ఫోన్ చూసుకుంటున్న సమయంలో పెంపుడు తల్లి అయిన లక్ష్మీపద్మావతి బాలిక వద్దకు వెళ్లి మొహంపై దిండు వేసి గట్టిగా నొక్కిపట్టి గొంతుకోసి హత్య చేసింది. ఆ సమయంలో ఆమె భర్త గేటు వద్ద నిలబడి ఎవరూ రాకుండా చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఓ పథకం ప్రకారం వారిద్దరూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్విరెడ్డిని హత్య చేశారని చుట్టుపక్కల వారిని, బంధువులను నమ్మించారు. బాలికను అర్థవీడులోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పాప సొంత తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కన్న తండ్రి ఫిర్యాదు మేరకు అర్థవీడు ఎస్ఐ అనిత కేసు నమోదు చేశారు. మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ఆదేశాల మేరకు సీఐ జె.రామకోటయ్య ఆధ్వర్యంలో కంభం, బేస్తవారిపేట, అర్థవీడు ఎస్ఐలు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తామే నేరం చేసినట్లు వారు అంగీకరించారు. -
ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ
కూడేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా, కూడేరు మండలంలో చోటుచేసుకుంది. ఏటీఎంను పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, అందులోని రూ.18,41,300 నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కూడేరులో దళితవాడకు ఎదురుగా అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన అనంతపురం సాయినగర్‌లోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖ ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కట్టర్‌తో ఏటీఎంను కట్ చేశారు. మిషన్‌లో ఉంచిన నగదు చోరీ చేశారు. అదే సమయంలో మిషన్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించి పైభాగం కాలిపోయింది. శబ్దం కూడా రావడంతో స్థానికుడొకరు బయటకు వచ్చి చూడగా.. ఏటీఎం సెంటర్ నుంచి కొందరు కార్లో వెళ్లిపోవడం, సెంటర్లో నుంచి పొగ రావడం గమనించాడు. కొంత సమయం తర్వాత విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. సీఐ శివరాముడు ఏటీఎం సెంటరును పరిశీలించారు. చోరీ జరిగిందని నిర్ధారించుకుని సమాచారాన్ని బ్యాంకు అధికారులకు అందించారు. సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించారు. నగదు నిల్వ, విత్‌డ్రాలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి డేటా తీసుకున్నారు. రూ.18,41,300 చోరీకి గురైనట్టు పోలీసులకు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కవ్వింపులు.. ఆపై గొడవలు
పెళ్లకూరు (తిరుపతి జిల్లా): పెళ్లకూరు మండలం చిల్లకూరులో టీడీపీ కార్యకర్త దుందుడుకు చర్యలతో గొడవ చోటుచేసుకుంది. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడులతో సంబంధం లేని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. వివాదాస్పద ఈ గ్రామంలో కొద్ది రోజులుగా పోలీసు పికెట్ ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నేత దువ్వూరు విజయసేనారెడ్డి టీడీపీ విజయం సాధించిన నేపథ్యంలో గురువారం రాత్రి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చాడు. గడ్డివాములు, చిన్న పిల్లలపై నిప్పు రవ్వలు పడ్డాయి. దీంతో అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు మురళి, మరి కొందరు విజయసేనారెడ్డితో మాట్లాడేందుకు వెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగి వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల వారు దాడులకు పాల్పడటంతో పలువురు గాయపడ్డారు. నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వేర్వేరు వాహనాల్లో చికిత్స నిమిత్తం ఒక వర్గాన్ని శ్రీకాళహస్తికి, మరో వర్గాన్ని నాయుడుపేట ఆసుపత్రులకు తరలించారు. అదే సమయంలో సత్యనారాయణరెడ్డిపై కక్ష సాధించడం కోసం దాడుల్లో గాయపడిన రాకే‹Ùరెడ్డికి మద్దతుగా నాయుడుపేటకు చెందిన కొందరు టీడీపీ యువత పెళ్లకూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సత్యనారాయణరెడ్డి తమపై దాడి చేయించాడంటూ రాకే‹Ùరెడ్డి, విజయసేనారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇరు వర్గాల ఫిర్యాదులతో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డితో పాటు ఆయన వర్గానికి చెందిన పిల్లిమిట్ట మురళి, వంశీకృష్ణ, ఆళ్ల చంద్రబాబు, సుజిత్, మణి, నాగార్జున్, చెంచయ్య, పుట్టయ్యలతో పాటు రాకే‹Ùరెడ్డి, విజయసేనారెడ్డిలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యనారాయణరెడ్డిని కూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో సంబంధంలేని సత్యనారాయణరెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. నాయుడుపేట రూరల్ సీఐ జగన్మోహన్రావు అత్యుత్సాహం వల్లే సత్యనారాయణరెడ్డిని అన్యాయంగా కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. అడిషనల్ ఎస్పీ జక్కా కులశేఖర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని కేసు వివరాలను పరిశీలించారు. సత్యనారాయణరెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని అరెస్టు చేసి సూళ్లూరుపేట కోర్టులో హాజరు పరిచారు. ఎన్నికల సమయంలో డబుల్ గేమ్ అడుతున్న సీఐని బదిలీ చేయాలని అప్పట్లో ఎమ్మెల్యే సంజీవయ్యకు సూచించడాన్ని మనసులో పెట్టుకొని అన్యాయంగా తనను కేసులో ఇరికించినట్లు సత్యనారాయణ రెడ్డి తెలిపారు. -
దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర
మచిలీపట్నం టౌన్: కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను నియంత్రించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులపై హైకోర్టులో ప్రైవేటు కేసులు వేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు. శనివారం వారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పేర్ని నాని మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన రౌడీ మూకలు ఉద్దేశ పూర్వకంగా, అధికార మదంతో మారణహోమం సాగిస్తున్నా, విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు, జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు.. వారి కార్యకర్తలు చేస్తున్న దాడులపై ప్రేక్షకపాత్ర వహించేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఆ ఆదేశాలను పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తుండటం విచారకరం అన్నారు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లు ఆంధ్రప్రదేశ్‌లోనూ తీసుకొచ్చారని విమర్శించారు. రౌడీషీటర్లు స్థానికంగా ఉన్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ఏరా.. ఉద్యోగం చేయాలని లేదా.. నువ్వు ఇక్కడే ఉంటావా.. లేక వీఆర్‌కు వెళతావా.. అని మాట్లాడుతున్నా పోలీసులు మిన్నకుండి పోవడం విచారకరం అన్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలతో కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. కళ్లెదుటే దాడులు.. అచేతనంగా పోలీసులు‘బందరు గొడుగుపేటలోని ఎంకులు బంకులు ఎదురుగా ఉన్న సందులో ఒక యాదవ కుటుంబం ఇంట్లో సామగ్రి, టీవీని ధ్వంసం చేస్తే, కేసు పెట్టినా ఇనుగుదురుపేట పోలీసులు పట్టించుకోలేదు. బాధితులను వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించి సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తే మళ్లీ సామగ్రి కొంటే ఇలాగే ధ్వంసం చేస్తామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం. స్థానిక చిలకలపూడి గోడౌన్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ కాలనీలో కూలీ పనులు చేసుకునే భార్యాభర్తలు వైఎస్సార్సీపీకి పని చేశారనే కారణంతో వారి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేశారు. అడ్డుపడిన వీరిద్దరినీ తీవ్రంగా గాయపరిచారు. ఆ దంపతులను ఆసుపత్రిలో చేర్చుకోకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో 25కు పైగా కేసులు ఉన్న రౌడీషీటర్ నవీన్.. ఆసుపత్రికి వెళ్లి నెలల పిల్లాడిని ఎత్తుకున్న ఆ మహిళను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇదంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. అయినా రౌడీ షీటర్‌పై కేసు పెట్టకపోగా, బాధితులపైనే ఎదురు కేసు పెట్టారు. మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీలే డీఎస్పీలు, సీఐలుగా భావించేలా చంద్రబాబు తయారు చేశారు. మహేష్ అనే వ్యక్తి విచ్చలవిడిగా బరితెగించి కుర్చీలతో ఎస్ఐ పైనే దాడి చేశాడు. కార్లు ధ్వంసం చేశాడు. అయినా ఇంత వరకు కేసు నమోదు చేయలేదు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ స్పందించకపోవటం విచారకరం. మాజీ ఎమ్మెల్యేలు అందరం ఎస్పీని కలిసి విన్నవించాలని నిర్ణయం తీసుకున్నాం. విజయవాడ నుంచి బయలుదేరిన వల్లభనేని వంశీ, కైలే అనిల్కుమార్లను పోలీసులు రానివ్వకుండా నిర్బంధించారు. రేపో, ఎల్లుండో డీజీపీ, ఎస్పీలను కలిసి దాడుల ఘటనలపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. ఈ దాడుల ఘటనలపై వీడియో ఆధారాలతో హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తున్నాం’ అని పేర్ని నాని తెలిపారు.మేం వస్తున్నాం.. ధైర్యంగా ఉండండి...మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భౌతిక దాడులకు దిగుతూ చేతులు, కాళ్లు విరగ్గొట్టడంతో పాటు గ్రామాల్లో ఉండొద్దని హెచ్చరిస్తున్నారన్నారు. ఈ ఘటనలకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని తెలిపారు. ‘దాడులు జరుగుతుంటే పోలీసులు నిలబడి చూస్తూ ఎంజాయ్ చేస్తుండటం దారుణం.స్థానికంగా దాడులు జరుగుతున్న సమయంలో ఆయా ప్రాంతాల పోలీసులకు సమాచారం అందించినా, స్పందించడం లేదు. వచ్చినా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఈ ఘటనలపై కేసులు కట్టడం లేదు. దాడులు చేస్తున్న వారే కాకుండా దాడులను చూస్తూ మిన్నకుండిపోయిన పోలీసులపై కూడా కేసులు వేస్తాం. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో జిల్లాలోని ముఖ్య నాయకులందరం ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులకు గురైన వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెబుతాం. ఇకనైనా దాడులు ఆగకుంటే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పైకి వస్తారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఎదురైతే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, మచిలీపట్నం, పెడన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రమేష్ (రాము) పాల్గొన్నారు.పేర్ని కిట్టు, నాయకులను అడ్డుకున్న పోలీసులుటీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన బాబి దంపతులను పరామర్శించేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బందరు పట్టణంలోని చిలకలపూడి ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే బాబి దంపతులు వైఎస్సార్సీపీ పక్షాన నిలిచారనే నెపంతో కూటమి శ్రేణులు వారి నివాసంపై దాడికి పాల్పడ్డారు. సామగ్రి ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా శనివారం బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తన నివాసం నుంచి నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్‌దాదా, కార్పొరేటర్లతో కలిసి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి పరామర్శకు వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు.అదనపు బలగాలను రప్పించి దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరామర్శకు అనుమతి ఏమిటని పేర్ని కిట్టు, తదితరులు పోలీసులను దాటుకుని వెళ్లి బాబి దంపతుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. పరామర్శించిన వారిలో కార్పొరేటర్లు మేకల సుబ్బన్న, జోగి చిరంజీవి, ఐనం తాతారావు, మాచవరపు రాంప్రసాద్, పల్లి శేఖర్, పర్ణం సతీష్, శ్రీరాం చిన్నా ఉన్నారు. -
మహిళ దారుణ హత్య
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లిలో శుక్రవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కొన్నాళ్లుగా వేధిస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడగా ఆయన కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించి వివరాలు... బైరవునిపల్లి గ్రామానికి చెందిన కోళ్ల సైదమ్మ(47)తో ఆమె భర్త దూరంగా ఉంటుండగా, సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓప్రైవేట్ పాఠశాల హాస్టల్లో వార్డెన్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం సెలవులు కావడంతో స్వగ్రామమైన బైరవునిపల్లి వచ్చింది. అదే గ్రామానికి చెందిన సొంటి శ్రీను తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆమెను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లి కొట్టినట్లు తెలిసింది. ఈనేపథ్యాన శుక్రవారం కూడా సైదమ్మ ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకున్న శ్రీను వెళ్లి గొడవకు దిగాడు. ఆమె తనను నిరాకరించిందన్న కోపంతో ముందుగానే సిద్ధం చేసుకున్న కత్తితో మూడు చోట్ల బలంగా పొడిచాడు. ఆపై చేతులను కత్తితో ఇష్టానుసారంగా కోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైదమ్మ రక్తపు మడుగులో పడి పోయింది. దీంతో స్థానికులు ఆమెను నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా శ్రీను సైతం అదే కత్తితో పొడుచుకోగా పేగులు బయటకు రావడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆయనను ఖమ్మం తరలించగా పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉండగా, సెలవుల్లో ఇంటికి రాకుండా కోదాడలో ఉన్నా బతికేదని వారు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.భారీ బందోబస్తుహత్య జరగడంతో బైరవునిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సైదమ్మ కుటుంబ సభ్యులు, బంధువులు హత్య చేసిన శ్రీను కోసం గ్రామంలో గాలించారు. కానీ ఆయన సైతం ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుసుకున్న వారు ఆగ్రహంతో ఉండగా.. ఎలాంటి ఘటనలు జరగకుండా ఖమ్మం రూరల్ సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యాన నేలకొండపల్లి, ముదిగొండ ఎస్సైలు తోట నాగరాజు, నరేష్, సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
బార్‌పై టీడీపీ శ్రేణుల దాడి...
నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట శివారు జొన్నలగడ్డ రోడ్డులో తాను నిర్వహిస్తున్న పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్‌పై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడిచేసి రూ.1.40 లక్షల విలువైన మద్యం అపహరించారని బార్ యజమాని, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు షేక్ నూరుల్ అక్తాబ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. బార్‌కు బలవంతంగా తాళాలు వేశారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... ‘తొలుత గురువారం నాకు ఓ వ్యక్తి ఫోన్ చేసి నూతన ఎమ్మెల్యేతో మాట్లాడుకున్న తర్వాతే బార్ వ్యాపారం చేయాలని చెప్పారు. ఈ మేరకు నేను బార్‌కు తాళాలు వేసి వెళ్లాను. అనంతరం రాత్రి 10గంటల సమయంలో ఇద్దరు టీడీపీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో 20మంది బార్ వద్దకు వచ్చి తాళాలు పగులకొట్టి కౌంటర్లోని మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. అదే సమయంలో మీ యజమాని వచ్చి మా ఎమ్మెల్యేను కలవాలని వారు అక్కడున్న సిబ్బందిని హెచ్చరించారు. వారు వెంట తెచ్చుకున్న తాళాలను బార్‌కు వేసుకుని వెళ్లారు. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే బార్ వద్దకు వెళ్లి తాళాలను పరిశీలించి జిల్లా ఎస్పీ మలికాగార్గ్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేశాను.’ అని షేక్ నూరుల్ అక్తాబ్ పేర్కొన్నారు. తాను ఎస్పీకి ఫోన్లో సమాచారం ఇచ్చిన వెంటనే రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ రోశయ్య, పోలీసు సిబ్బంది వచ్చి పరిశీలించారని తెలిపారు. శుక్రవారం రూరల్ పోలీసు అధికారులు, క్లూస్‌టీమ్, ఎక్సైజ్ ఎస్ఈబీ సీఐ నయనతార, ఎస్ఐలు వచ్చి పంచనామా చేసి స్టాకు వివరాలు తనకు ఇచ్చారని చెప్పారు. తన ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. -
AP: వైఎస్సార్ విగ్రహాల విధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని టీడీపీ కార్యకర్తలు విధ్వంస కాండను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ కార్యకర్తలపై దాడులకు పాల్పడటంతో పాటు పనిగట్టుకుని వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. ట్రాక్టర్లతో కూల్చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి గురువారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. పొగ రావడాన్ని గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలార్పారు.అంతకు ముందు విగ్రహానికి తాళ్లు కట్టి ట్రాక్టర్‌తో లాగి కూల్చేయడానికి విఫలయత్నం చేశారు. విగ్రహం ముందు వైపు ట్రాక్టర్ స్లిప్ అయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అనంతరం మడ్డి ఇంజన్ ఆయిల్ తీసుకొచ్చి విగ్రహం మీద పోసి నిప్పు పెట్టారు. ఆ మేరకు విగ్రహం పక్కనే మడ్డి ఆయిల్ డబ్బాలు కూడా ఉన్నాయి. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుమన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం పెదగోగులపల్లెలో శుక్రవారం సాయంత్రం టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి.వైఎస్సార్ హెల్త్ క్లినిక్ సమీపంలో ఉన్న బోర్డును నేలమట్టం చేశారు. సమీపంలోని ఆర్వో ప్లాంటులోకి చొరబడి పైపులను విరిచేశారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం చీకటీగలపాలెం అడ్డరోడ్డులో కూడా ఇదే రీతిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించారు. ⇒ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట, పుత్తూరు–చిత్తూరు జాతీయ రహదారిలోని దీపిక కల్యాణ మండపం వద్ద ఉన్న వైఎస్సార్సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి ఎన్నికల్లో ఈ వాహనాన్ని ఉపయోగించారు. పోలింగ్ అనంతరం ఆ వాహనాన్ని దీపిక కల్యాణ మండపం వద్ద పార్కింగ్ చేశారు. దుండగులు వాహనానికి నిప్పంటించిన తర్వాత కల్యాణ మండపంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. వీవీ.పురం, కొత్తపల్లి మహభారతం, వినాయకస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసి శిలాఫలకాల్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మండలాధ్యక్షడు మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ⇒ కూటమి శ్రేణులు విజయవాడలో వైఎస్సార్ విగ్రహం మెడలో టీడీపీ కండువా, చేతిలో ఆ పార్టీ జెండా పెట్టారు. ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డులో శుక్రవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ బీజేపీ కార్యాలయం దాటి శివాలయం సెంటర్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఓ యువకుడు పొక్లెయిన్‌పైకి ఎక్కి మహానేత వైఎస్సార్ విగ్రహం మెడలో పచ్చ కండువా వేశాడు. చేతిలో టీడీపీ జెండా పెట్టాడు. భవానీపురం పోలీసులు వారిస్తున్నా కార్యకర్తలు పట్టించుకోలేదు. ర్యాలీ ముందుకు కదిలిన తర్వాత పోలీసులు టీడీపీ కండువా, జెండాను తొలగించారు.⇒ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని కుప్పంబాదూరు గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గ్రామంలోని ప్రధాన రహదారి సమీపంలో ఎన్నో ఏళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 10 గంటల వరకు విగ్రహం అక్కడే ఉందని, ఉదయం లేచి చూసేసరికి విగ్రహం లేకపోవడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.⇒ టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో హల్ చల్ చేశారు. పట్టణంలోని పలుచోట్ల శిలాఫలకాలు ధ్వంసం చేయడంతో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, మొండితోక అరుణ్ కుమార్ల బోర్డులను తొలగించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. -
బెజవాడలో టీడీపీ విధ్వంసకాండ
విజయవాడ: బెజవాడలో పట్టపగలే టీడీపీ కార్యకర్తలు విధ్వంసకాండకు దిగారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై దాడికి విఫలయత్నం చేశాయి. నగరంలోని లబ్బీపేట మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని వంశీ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రాత్రి వరకు ఈ విధ్వంసకాండ కొనసాగింది.అరుపులు, కేకలు, బూతులతో ఆ ప్రాంతాన్ని అట్టుడికించారు. పోలీసులనూ తరిమేశారు. చివరకు సీఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచి్చంది. ఇటీవలి ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అక్కడికి వచ్చి అల్లరి మూకలకు మరింతగా రెచ్చగొట్టడం గమనార్హం. ముందస్తు వ్యూహంతోనే దాడి టీడీపీ అధినాయకత్వం అండతో, ముందస్తు వ్యూహంతోనే విజయవాడ సెంట్రల్, తూర్పు, గన్నవరం నియోజకవర్గాల నుంచి గంజాయి, మద్యంతో పాటు ఇతర మత్తు పదార్థాలు సేవించిన టీడీపీకి చెందిన యువకులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. తొలుత మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాలుగు కార్లలో కత్తులు, ఇటుకలు, కంకర రాళ్లు, కర్రలతో కొందరు టీడీపీ కార్యకర్తలు వంశీ ఉంటున్న అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. వస్తూనే బూతులు తిడుతూ కార్లలో తెచ్చుకున్న రాళ్లను విసిరారు. రాళ్ల దాడిలో వంశీ కారుతో పాటు ఆ ప్రాంతంలోని కొన్ని కార్లు, ద్విచక్ర వాహనాలు, సమీపంలోని ఇళ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.కొందరు సమీపంలోని ఇళ్లలోకి చొరబడి కర్రలతో కుండీలు, కిటికీలు పగలకొట్టి భీభత్సాన్ని సృష్టించారు. టీడీపీ జెండాలను పట్టుకుని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి కవి్వంపు చర్యలకు దిగారు. బూతులు, అరుపులతో అక్కడున్న అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. అపార్ట్మెంట్ గోడ దూకి సెల్లార్లో ఉన్న పలు కార్ల అద్దాలను పగులగొట్టారు. ప్రతి అర గంటకు మరికొందరు అక్కడకు చేరుకోవడంతో ఆ ప్రాంతం పూర్తిగా టీడీపీ వారితో నిండిపోయింది. 300 మందికి పైగా ఈ దాడిలో పాల్గొన్నారు. ఒక్కసారిగా భీభత్సం సృష్టించడంతో స్థానికులు భయకంపితులయ్యారు.పలువురు మహిళలు భయాందోళనకు గురయ్యారు. పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ ఆదేశాలతో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూడగానే అల్లరి మూకలు మరింతగా రెచి్చపోయాయి. విధ్వంసాన్ని అదుపు చేసేందుకు వచి్చన పోలీసులను వెంటబడి తరిమారు. పరిస్థితి అదుపు తప్పడంతో సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి.సీఆర్పీఎఫ్ పోలీసులు వచ్చీ రాగానే లాఠీచార్జీ ప్రారంభించడంతో టీడీపీ కార్యకర్తలు పరుగులు పెట్టారు. దాడులకు పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు సమీపంలోని ఇళ్లలోకి దూరి దాక్కున్నారు. పోలీసులు వారిని వెతికి పట్టుకుని మరీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విధ్వంసానికి ఆజ్యం పోసిన యార్లగడ్డ టీడీపీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అక్కడకు చేరుకుని విధ్వంసానికి ఆజ్యం పోసేందుకు ప్రయత్నించారు. అదుపులోకి తీసుకుంటున్న వారిని అక్కడే వదిలేయాలని పోలీసులకు హుకుం జారీ చేశారు. పోలీసులు ససేమిరా అనడంతో వారితో వాగ్వాదానికి దిగారు.టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతోనే ఈ దాడికి దిగినట్లు చెప్పడంతో అక్కడున్న పోలీసులు సైతం నివ్వెరపోయారు. స్వయంగా చంద్రబాబు వచ్చి విడిపిస్తారంటూ అరెస్ట్ అయిన వారిని మరింత రెచ్చగొట్టేందుకు వెంకట్రావు ప్రయత్నం చేశారు. పోలీసులు అక్కడివారిని తరిమేస్తున్నా అక్కడే తిరుగుతూ కవి్వంపు చర్యలు కొనసాగించారు. అర్ధరాత్రి వరకు పరిస్థితి ఇలానే కొనసాగింది. గవర్నర్ కార్యాలయ ఉద్యోగి వాహనం ధ్వంసం టీడీపీ కార్యకర్తలు మద్యం, గంజాయి మత్తులో విచక్షణరహితంగా చేసిన దాడిలో గవర్నర్ కార్యాలయ ఉద్యోగి కారు కూడా ధ్వంసమైంది. ఆ ఉద్యోగి అదే అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సెల్లార్లో పార్క్ చేసిన ఆయన కారుపై టీడీపీ వారు రాళ్లు రువ్వడంతో అద్దాలన్నీ పూర్తిగా పగిలిపోయాయి.దేవినేని అవినాశ్‌కు భద్రత పెంపు గుణదల (విజయవాడ తూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి దేవినేని అవినాశ్‌కు పోలీసులు భద్రత పెంచారు. విజయవాడ ఏలూరు రోడ్డులోని ఆయన ఇల్లు, కార్యాలయం వద్ద మాచవరం పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. బారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఆయన్ని కలిసేందుకు వచ్చే అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.సమీపంలో అనుమానంగా సంచరించే వారిని గమనిస్తున్నారు. యువకులు గుంపులుగా ఉండకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ అల్లరి మూకలు రాష్ట్రవ్యాప్తంగా విచక్షణరహితంగా విధ్వంసం సృష్టిస్తుండటంతో అవినాశ్‌కు భద్రత పెంచినట్లు మాచవరం పోలీసులు తెలిపారు. -
ఆగుతున్న అభిమానుల గుండెలు
సాక్షి, నెట్వర్క్: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమిని తట్టుకోలేక గురువారం కూడా పలువురు గుండెపోటుతో మృతిచెందారు. మృతుల కుటుంబాలను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులకు సమీపంలోని గాం«దీగనర్కు చెందిన వైఎస్సార్సీపీ నేత కిల్లో మోహన్ తండ్రి కిల్లో అప్పారావు(55) ఈ నెల నాలుగో తేదీన ఓట్ల లెక్కింపులో జగన్‌కు వ్యతిరేకంగా వస్తున్న ఎన్నికల ఫలితాలను చూసి గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి.. మెరుగైన వైద్యం కోసం 108లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.తిరుపతి జిల్లాలో..తిరుపతి జిల్లా చియ్యవరం గ్రామానికి చెందిన శ్రీరాములు(24) వైఎస్సార్సీపీకి వీరాభిమాని. ఆయన తన తల్లి పోలమ్మతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి పాలవడం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బియ్యపు మధుసూదన్‌రెడ్డికి విజయం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అన్నం తినడం మానేశాడు. తల్లి ఎంత బతిమాలినా మెతుకు ముట్టలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అబ్బయ్యచౌదరి ఓటమితో అభిమాని ఆత్మహత్యదెందులూరులో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఓటమితో వైఎస్సార్సీపీ వీరాభిమాని రామారావుగూడెం యువకుడు సూరవరపు సాయిలింగాచార్యులు(23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడేనికి చెందిన సాయిలింగాచార్యులు వైఎస్సార్సీపీకి, కొఠారు అబ్బయ్యచౌదరికి వీరాభిమాని. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. జూన్ నాలుగో తేదీన వెలువడిన ఫలితాలు చూసి మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం అబ్బయ్యచౌదరిని కలుస్తానని చెప్పి బయలుదేరగా వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల దాడులు జరుగుతున్న నేపథ్యంలో రెండు రోజులు ఆగి వెళదామని స్థానిక వైఎస్సార్సీపీ నేతలు నచ్చజెప్పారు. ఈ క్రమంలో అభిమాన నేత ఓటమిని భరించలేక.. తీవ్ర మనోవేదనతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి ఆత్మహత్య సమాచారం అందుకున్న అబ్బయ్యచౌదరి ఏలూరు వైద్యశాలకు వెళ్లి సాయి భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.వైఎస్సార్ జిల్లాలో..వైఎస్సార్ జిల్లా తెల్లపాడుకు చెందిన వైఎస్సార్సీపీ అభిమాని మాలేపాటి పెద్దనరసింహులు (65) గురువారం మృతిచెందాడు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తన స్వగృహంలో టీవీ చూస్తూ వైఎస్సార్సీపీ ఓటమిని చూసి తట్టుకోలేక ఒక్కసారికి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతుడికి భార్య పార్వతి, కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. గుంటూరు జిల్లాలో.. గుంటూరు జిల్లా కొమ్మూరు ఎస్సీ కాలనీకి చెందిన మూకిరి ఏషయ్య(46)వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అంటే ఎంతో అభిమానంగా ఉండేవాడు. మూడు రోజుల కిందట వెలువడిన ఎన్నికల ఫలితాలను చూసి అన్యాయం జరిగిందంటూ తీవ్ర మనో వేదనకు లోనవుతూ బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యుడు చెప్పాడు. ఆటో నడుపుకొనే ఏషయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.అనకాపల్లి జిల్లాలో.. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపూడికి చెందిన చిరుకూరి రాజుబాబు(72) వైఎస్సార్సీపీ అభిమాని. వైఎస్ జగన్ రెండోసారి సీఎం అవుతారని గ్రామంలో అందరితో చెబుతుండేవాడు. కౌంటింగ్ పూర్తయ్యాక వైఎస్సార్సీపీకి ఎక్కువ సీట్లు రాలేదని తెలియడంతో ఆందోళన చెందాడు. ఇక వలంటీర్లు పెన్షన్లను ఇంటికి తీసుకువచ్చి ఇవ్వరంటా.. అనే ప్రచారం జరగడంతో రెండు రోజులుగా దిగాలుగా ఉన్నాడు. గురువారం గుండెల్లో మంట వస్తుందంటూ కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ప్రకాశం జిల్లాలో.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేములకు చెందిన వైఎస్సార్ వీరాభిమాని అన్నపురెడ్డి చినగురవారెడ్డి(71) వైఎస్సార్సీపీ అభిమాని. దర్శి ఎమ్మెల్యేగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి గెలవడంతో బుధవారం గ్రామస్తులతో కలిసి దర్శి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డితో చినగురవారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎవరికీ అన్యాయం చేయలేదని, అందరికీ న్యాయం చేశారని, ఆయనకు ఇంత అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే దిగులుతో ఇంటికి చేరుకున్న చినగురవారెడ్డి గురువారం రాత్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. మృతుడి కుటుంబానికి కొడాలి నాని రూ.5 లక్షల సాయం తన ఓటమిని జీర్ణించుకోలేక ఆత్మహత్యచేసుకున్న కుటుంబానికి భరోసాసార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కొడాలి నాని ఓటమిని జీర్ణించుకోలేక కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని సైదేపూడికి చెందిన పిట్టా అనిల్‌కుమార్(26) ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కాగా గురువారం రాత్రి అనిల్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, పార్టీ నాయకులతో కలసి వెళ్లి పరామర్శించారు. రూ.5 లక్షల సాయమందించారు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనిల్ పిల్లల చదువుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. -
మా ప్రాణాలు కాపాడండి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులపై ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై రాజకీయ ప్రత్యర్థులు, అసాంఘిక శక్తులు దాడులతో వ్యవస్థీకృత హింసకు పాల్పడుతుండటంపై బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గ్రామాలు, ఆస్తులను వదిలేసి కట్టుబట్టలతో వెళ్లకుంటే హతమారుస్తామంటూ హెచ్చరిస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తూ పిల్లలు, మహిళలను సైతం హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ఘటనలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయని విన్నవించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వ్యవస్థీకృత హింసను సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా స్వీకరించి ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించాలని అభ్యర్థించారు. వ్యవస్థీకృత హింసకు సంబంధించి మీడియా కథనాలు, సోషల్ మీడియా వీడియోల సాక్ష్యాధారాలతో బాధితులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం ఈ–మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు. బాధితుల ఆక్రందన ఇదీ..⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని పాలనా యంత్రాంగంలో నెలకొన్న అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకుని అసాంఘిక శక్తులు వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులు, పిల్లలు, మహిళలపై వ్యవస్థీకృత హింసకు పాల్పడుతున్నాయి. ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. ⇒ పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించడంతో అసాంఘిక శక్తులు యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడుతున్నాయి. గత 24 గంటల్లో హింసాత్మక సంఘటనలు భారీగా పెరిగాయి. ⇒ సర్వోన్నత న్యాయస్థానం తక్షణమే స్పందించి చర్యలకు ఆదేశించకుంటే ఈ వ్యవస్థీకృత హింస నుంచి బాధితులకు రక్షణ లభించదు. ఈ అంశాన్ని సుమోటో పిల్‌గా స్వీకరించి విచారించాలి. రాష్ట్ర ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడాలి. -
వివాహిత ఆత్మహత్య
కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ పంచాయతీ ఎన్ఎన్ కాలనీలో నివాసం ఉంటున్న వన్నాల రేవతి(27) బుధవారం ఇంటిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేవతి భర్త కృష్ణారావు స్థానిక ఫైర్ స్టేషన్లో ఫైర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన కృష్ణారావుకు పాతపట్నం మండలం పాచిగంగుపేటకు చెందిన రేవతితో తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే ఎప్పటి మాదిరిగానే కృష్ణారావు విధుల నుంచి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. ఇంటిలోకి వెళ్లే సరికి రేవతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. దీంతో వెంటనే ఆమెకు కిందకు దించి స్థానికుల సహకారంతో స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వీరికి ఆరేళ్ల వయసు గల కుమార్తె ఉంది. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏంఏ ఆహ్మద్ తెలిపారు. -
టీడీపీ, జనసేన విధ్వంసం.. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. యథేచ్ఛగా విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నాయి. వాహనాలను ధ్వంసం చేస్తున్నాయి. మంగళవారం మొదలుపెట్టిన ఈ అరాచకపర్వాన్ని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు బుధవారం కూడా కొనసాగించారు. ఈ రెండురోజులు ప్రభుత్వ భవనాల వద్ద ఫలకాలను చిత్రపటాలను ధ్వంసం చేస్తూ స్వైరవిహారం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేసి, విగ్రహాల వద్ద కూటమి జెండాలు ఏర్పాటు చేశారు.ఇప్పటంలో ప్రజల భాగస్వామ్యంతో నిర్మించిన దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా పేరుతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ భవనం పైభాగంలో జనసేన, టీడీపీ జెండాలను ఏర్పాటు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో 1, 2 సచివాలయాల వద్ద వైఎస్ జగన్ డిజిటల్ బోర్డులను తొలగించి రోడ్డుపై పడవేసి చిత్రపటంపై రాళ్లు వేశారు. నూతన సచివాలయం శిలాఫలకంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాన్ని చిన్నపిల్లలతో పగులగొట్టించారు. రైతుభరోసా కేంద్రంపై నవరత్నాల బోర్డును ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా గోళ్ళపాడులో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ శిలాఫలకాన్ని పగులగొట్టారు. తిరుపతి జిల్లా పుత్తూరులో పలు ఆలయాల వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలాఫలకాలను బుధవారం సాయంత్రం తెలుగుదేశం నాయకులు ధ్వంసం చేశారు. శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి ఆలయం లోపల ఏర్పాటు చేసిన అన్నదాన, కళ్యాణోత్సవ మండప శిలాఫలకాన్ని, ఆరేటమ్మ ఆలయం వద్ద పలు అభివృద్ధి పనుల పేరిట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, గేట్పుత్తూరులోని గోవిందమ్మ ఆలయం వద్ద ప్రారంభించిన జగనన్న సమావేశమందిర శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తెలుగుదేశం నాయకులు డి.జి.ధనపాల్, బి.శ్రీనివాసులు చేసిన ఈ విధ్వంసంపై పుత్తూరు సెంగుంధర్ మక్కల్ నల సంఘం ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎస్.ఎన్.గోపిరమణ, టి.జి.శక్తివేలు, ఎం.ఎస్.తిరునావక్కర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలోని యలమంచిపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త షేక్ మస్తాన్‌పై టీడీపీ నాయకులు దాడిచేశారు. అడ్డుకోబోయిన ఆయన తల్లి షేక్ బీబీ తలపైకొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆమెను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తడకలూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త యలమా వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. మరికొన్ని గ్రామాల్లో కూడా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. గ్రామాల్లో వివాదాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కోరారు. పంచాయతీలో ఫైళ్ల అపహరణ ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు సచివాలయం, హెల్త్‌క్లినిక్ ఆవరణలోని శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, అబ్బయ్యచౌదరి ఫొటోలను సుత్తితో పగులగొట్టారు. తన కార్యాలయంలో వస్తువుల్ని ధ్వంసంచేసి ఫైళ్లు అపహరించారని సర్పంచ్ జిజ్జువరపు నాగరాజు చెప్పారు. కొప్పులవారిగూడెంలోని సచివాలయ ఆవవరణలోని శిలాఫలకాలను, ప్రభుత్వ సామగ్రిని ధ్వంసం చేశారు. సచివాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసే స్థూపానికి టీడీపీ జెండా కట్టారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో బొర్రా నారాయణరావు చికెన్ దుకాణాన్ని టీడీపీ, జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీనిపై నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం సచివాలయం–1పై ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. వార్డు సభ్యులు ముప్పిడి లక్ష్మణరావు, లక్ష్మణరావులపై దౌర్జన్యానికి దిగారు. నంద్యాల జిల్లా అవుకు మండలం సంగపట్నంలో సచివాలయం, హెల్త్‌క్లినిక్ పైలాన్లను ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసాలకు పాల్పడుతుండగా సమాచారం ఇచ్చినా పోలీసులు స్పందించలేదని పలు గ్రామాల్లో బాధితులు తెలిపారు.కైకలూరులో వైఎస్సార్‌విగ్రహం ధ్వంసంకైకలూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం వడ్లకూటితిప్పలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద 2010లో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆకతాయిలు కూలగొట్టారు.ఈ ఘటనను వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డీఎన్నార్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఖండించారు. విగ్రహాల కూలి్చవేత ఘటనలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.నీ జీవితం నా చేతుల్లో..వలంటీర్‌కు టీడీపీ నేత బెదిరింపుపల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామానికి చెందిన వలంటీర్ బాబురావును గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తీవ్రంగా బెదిరించారు. ‘అరేయ్ బాబురావుగా నీ పతనం స్టార్ట్ కాబోతుంది.. ఇక నువ్వు ఫిక్స్ అయిపో.. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉందిరా.. నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకున్నా.. నిన్ను వేరే వాళ్ళు కాపాడాలన్నా.. నీ జీవితాన్ని నేను తిరగరాసినా ఇప్పుడు. నీకు భయం అంటే ఏంటో చూయిస్తారా.. నా కొడకా. అరేయ్ బాబురావుగా.. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉంది రా.. నీ తలరాత బ్రహ్మ రాసినా ఇప్పుడు నీ జీవితాన్ని నేను తిరగరాస్తా.. కొడకా..’ అంటూ స్టేటస్ పెట్టి మరీ హెచ్చరించారు. మరోవైపు పెదమక్కెన గ్రామంలోని ఎస్సీ కాలనీలో దళితుల ఇళ్లపై టీడీపీ వారు రాళ్లు, సీసాలు విసిరారు. అజయ్‌కుమార్ జీవనాధారమైన ఆటోను ధ్వంసం చేశారు.వైఎస్సార్సీపీ నేతలు,కార్యకర్తలపై దాడులు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ వర్గీయులపై కర్రలు, రాళ్లతో దాడులు చేస్తున్నారు. అడ్డొచ్చినవారిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఏలూరు రూరల్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరాజు, రాష్ట్ర వడ్డికుల కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్‌కుమార్, గార్లమడుగు వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణ కారులో వెళుతుండగా విజయరాయి వద్ద టీడీపీ వారు దాడిచేశారు. ‘గెలిచింది మేమే.. మాకు తిరుగులేదు.. రండి ఇప్పుడు..’ అంటూ కర్రలు, రాళ్లతో కారు అద్దాలు పగులగొట్టారు. కారులో ఉన్న కృష్ణను బలవంతంగా బయటకు లాగి పిడిగుద్దులు గుద్ది రోడ్డుపై పడేశారు. కొంతదూరం లాక్కెళ్లి కొట్టారు. గతంలో చింతమనేని ప్రభాకర్‌పై చేసిన విమర్శలకు క్షమాపణలు చెబుతున్నా అంటూ కృష్ణతో చెప్పించి వీడియో రికార్డు చేశారు. అడ్డుపడేందుకు ప్రయత్నించిన శ్రీనివాసరాజు, సంజీవ్‌కుమార్‌లను తోసేశారు. కారు అద్దాలు పగలడంతో వైఎస్సార్సీపీ నాయకులకు గాయాలయ్యాయి. ఈ దాడిని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కొచ్చెర్లకోట పంచాయతీ సిద్ధాయపాలెంలో సింహం లలిత, ఆమె తండ్రి చొప్పరపు బాలస్వామిపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన బాలస్వామిని తొలుత మార్కాపురం జిల్లా వైద్యశాలకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యూట్యూబర్ సుంకేసుల ఆదిశేషు ఇంటిపై టీడీపీ వర్గీయులు కొడవళ్లతో దాడిచేశారు. ఆ సమయంలో ఆదిశేషు ఇంట్లో లేకపోవడంతో వారు మహిళలతో దురుసుగా మాట్లాడి సామగ్రిని చిందరవందర చేశారు. ఆదిశేషు భార్య, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
టీడీపీ వేధింపులకువైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బలి
పెదవేగి: టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మండల కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్యారావుపేటకి చెందిన ప్రవీణ్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన మండలంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి అహర్నిశలు శ్రమించాడన్న కక్షతో ఓట్ల లెక్కింపు రోజు (ఈనెల 4న) సాయంత్రం ప్రవీణ్ ఇంటి మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, బీరు సీసాలు విసిరి, దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారు. పెదవేగి పెట్రోల్ బంక్ వైపు వస్తే కొడతామని, బైక్, కారు తగలబెట్టేస్తామని హెచ్చరించారు. బుధవారం ఉదయం ప్రవీణ్ విజయరాయి పెట్రోల్ బంక్‌కి వెళ్లగా.. బండిపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఫొటోతో ఉన్న వైఎస్సార్సీపీ స్టిక్కర్ తీసేవరకు బీభత్సం సృష్టించి దాడిచేశారు. టీడీపీ వారి బెదిరింపులకు భయపడి, వేధింపులు భరించలేక ప్రవీణ్.. తన ఇంటి సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేçÜుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ తల్లిదండ్రులు యలమంచిలి ఝన్సీరాణి, ప్రకాశరావు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఉరుకోం టీడీపీ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ భౌతికకాయానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్‌ను బలితీసుకున్న టీడీపీ కార్యకర్తల అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని, వారి ఇళ్ల మీదకు వెళ్లి భౌతికదాడులు చేస్తూ, వాహనాలు, ఇంట్లో వస్తువులు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఊరుకునేదిలేదని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులంతా సంయమనం పాటించాలని కోరారు. -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ హత్యాయత్నం
చంద్రగిరి (తిరుపతి జిల్లా)/తిరుపతి క్రైమ్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మత్తులో టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఈ దాడులు బుధవారమూ కొనసాగాయి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలు కొందరు గంజాయి మత్తులో వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన మరో వ్యక్తిని కూడా గాయపరిచారు. మరో చోట వార్డు సభ్యుడిపై దాడి చేసి, గాయపరిచారు. తిరుపతి నగరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కత్తులు, రాడ్లతో దాడి బుధవారం రాత్రి వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి, పార్టీ మండల కనీ్వనర్ మస్తాన్‌పై టీడీపీ కార్యకర్తలు చంద్రగిరిలో హత్యాయత్నానికి పాల్పడ్డారు. గంజాయి మత్తులో ఉన్న టీడీపీ కార్యకర్తలు కొందరు బుధవారం రాత్రి మస్తాన్ ఇంటి వద్దకు వచ్చారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంతో ఇంటి నుంచి బయటకు వస్తున్న ఆయనపై కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఓ వ్యక్తి కత్తితో మస్తాన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకొన్నప్పటికీ వారు ఆగలేదు. టీడీపీ వారిని అడ్డుకోబోయిన మస్తాన్ బంధువైన సాదిక్‌ను కూడా గాయపరిచారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నాయకులు పలువురు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ వారు జారుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో ధాబా ధ్వంసం అదే విధంగా చంద్రగిరి మండలం పరిధిలోని ఐతేపల్లి వద్ద ఉన్న ధాబాను టీడీపీ కార్య కర్తలు కొందరు ధ్వంసం చేశా రు. బుధవారం మద్యం సేవించిన కొందరు టీడీపీ కార్యకర్తలు ధాబా వద్దకు వెళ్లి గొడవకు దిగారు. సమాచారం అందుకున్న వార్డు సభ్యుడు సక్కూరు వంశీ అక్కడి వెళ్లారు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. మాపైనే పోలీసులకు చెప్తావా అంటూ వార్డు సభ్యుడు వంశీపై టీడీపీ వారు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ధాబాలోని కురీ్చలు, టేబుళ్లు ధ్వంసం చేశారు. తీవ్రంగా గాయపడిన వంశీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్యాలయం ధ్వంసం తిరుపతి నగరం 8వ డివిజన్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూటమి కార్యకర్తలు ధ్వంసం చేశారు. సంజయ్ కాలనీలో ఉన్న ఈ కార్యాలయాన్ని మురళి నిర్వహిస్తున్నారు. షట్టర్ ఓపెన్ చేసి గ్లాస్ డోర్‌కు తాళం వేసుకుని వెళ్లిన సమయంలో కూటమి మూకలు రాళ్లతో దాడిచేసి లోపలికి ప్రవేశించి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. టీవీలు, కంప్యూటర్లు, బల్లలు అన్నింటినీ విరగ్గొట్టారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కార్యాలయం నిర్వాహకుల నుంచి ఫిర్యాదు తీసుకొన్నారు. -
ఓటర్లపైనా రౌడీషీట్లు!
దర్శి: నిన్నటి వరకూ వారిపై ఎలాంటి కేసులూ లేవు.. అయితే ఒక్కసారిగా వారిపై రౌడీఓటర్లపైనా రౌడీషీట్లు ఓపెన్ అయ్యాయి.. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఎనిమిది మందిపై. అందులో ముగ్గురు వైఎస్సార్సీపీకి చెందిన బూత్ ఏజెంట్లు. మరో ముగ్గురు ఓట్లు వేసేందుకు వచ్చిన వారు. వారికి ఎలాంటి క్రిమినల్ చరిత్ర లేదు. పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఈవీఎం ధ్వంసం చేసిన వారిపై నామమాత్రం కేసులు పెట్టి చేతులు దులుపుకున్న దర్శి పోలీసులు.. వీరిపై ఎందుకు రౌడీషీట్ పెట్టారో అర్థంకాని విషయం. వాస్తవానికి ఎవరిపైనైనా రౌడీషీట్ తెరవాలంటే మూడు క్రిమినల్ కేసులు తప్పనిసరిగా ఉండాలి. కనీసం 307 కేసైనా అయి ఉండాలి. లేదా తరచూ నేరాలు చేసేవారి పైరౌడీషీట్ వేస్తారు. కానీ ఎలాంటి కేసులు లేని సామాన్యులపై వైఎస్సార్సీపీ మద్దతుదారులు అనే నెపంతో రౌడీషీట్లు తెరిచిన దర్శి పోలీసులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి దర్శి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వెళ్లారు. ఆయన వెళ్లాక పోలీసులు రౌడీషీట్లు ఓపెన్ చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు పోలింగ్ రోజు ఏం జరిగిందంటే.. టీడీపీ అరాచకం సృష్టిస్తున్నా.. అడ్డుకోని పోలీసులు ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు దర్శి పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలోని 117, 118 బూత్‌లలోకి సాయంత్రం ఆరు గంటలు దాటాక టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త లలిత్ సాగర్లతో పాటు అభ్యర్థి మామ కడియాల వెంకటేశ్వరరావు, తమ్ముడు గొట్టిపాటి భరత్‌లతో పాటు మరో 50 మంది నరసరావుపేటకు చెందిన వారు బూత్‌లోకి ఎగబడి ఈవీఎంలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసు సిబ్బంది తోపాటు ఎస్ఐ, సీఐ, డీఎస్పీలు కూడా అక్కడే ఉన్నా, వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. 6 గంటలు దాటాక బూత్‌లోకి రావడంపై ఏజెంట్లు ప్రశ్నిస్తున్నా పోలీసులు నోరు మెదపలేదు. దీంతో అక్కడ ఓటర్లుగా ఉన్నవారు, ఏజెంట్లు బూత్‌లోకి రాకుండా వారిని అడ్డుకున్నారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీ అక్కడే ఉన్నా చోద్యం చూస్తూ ఊరుకున్నారే గానీ వారిని అడ్డుకున్న పాపాన పోలేదు. అంతే కాకుండా అభ్యర్థి మామ కడియాల వెంకటేశ్వరరావు.. నిబంధనలకు విరుద్ధంగా నేరుగా పోలింగ్ బూత్‌లోకి చొరబడి నానా రభస చేసినా వారిని బయటకు పంపలేదు. ఏ పోలీసు ఆయన్ను అడ్డుకుని బయటకు పంపేందుకు సాహసం చేయకపోవడం గమనార్హం. అదే సమయంలో ఓటు వేసేందుకు లైన్లో నిలబడిన వారు సమయం దాటినా ఎందుకు లోపలకు వెళ్తున్నారని వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో గొడవ కాస్త పెద్దదైంది. చోద్యం చూస్తున్న పోలీసులను ఓటర్లు నిలదీయడంతో అప్పుడు పోలీసులు వారిని బయటకు పంపారు. దీంతో రెచి్చపోయిన టీడీపీ అభ్యర్థి పోలీసుల కళ్లెదుటే తన అనుచరులను(నరసరావుపేటకు చెందిన వారిని) రెచ్చగొట్టి వెళ్లిపోయారు. అనంతరం వాళ్లు పోలీసులపై, పోలింగ్ బూత్‌పై రాళ్లు రువ్వారు. దీంతో తమిళనాడుకు చెందిన పోలీస్ కానిస్టేబుల్‌కు ఓ రాయి కడుపులో తగిలింది. దీంతో కిందపడిపోయిన పోలీసుపై కూడా విచక్షణ రహితంగా రాళ్లు రువ్వారు. అల్లరి మూకలు డీఎస్పీపై కూడా రాళ్లు రువ్వడంతో పోలీసులు తమ గార్డులు అడ్డుపెట్టి డీఎస్పీని బూత్ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఇంత రభస చేసినా నరసరావుపేటకు చెందిన వారిని వదిలేసి స్థానికులపై కేసులు పెట్టి మమ అనిపించారు. అలాగే పట్టణంలోని ఎంఈవో కార్యాలయంలో పోలింగ్ బూత్‌లో ఈవీఎంను టీడీపీ నాయకుడు వీసీరెడ్డి ధ్వంసం చేశాడు. పోలీసులు పట్టుకుని వచ్చి 41 నోటీసులు ఇచ్చి సరిపెట్టారేగానీ, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత కళ్లు తిరుగుతున్నాయంటూ వీసీ రెడ్డి డ్రామా ఆడి ఆస్పత్రి నుంచి పోలీసుల కన్ను కప్పి పారిపోయాడు. పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగుల గొట్టారన్న ఆరోపణ వీడియో బయటకు వచ్చాక హడావుడిగా పోలీసులు వీసీరెడ్డిని పిలిపించి అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. ఇంత చేసిన వీసీరెడ్డి పై మాత్రం ఎలాంటి రౌడీïÙట్ పెట్టక పోవడం పోలీసుల తీరుపై అనుమానాలకు తావిస్తోంది. అలాగే పోలింగ్ బూత్‌లో చొరబడి గందరగోళం సృష్టించిన, పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై మొక్కుబడిగా కేసులు పెట్టిన పోలీసులు.. వైఎస్సార్సీపీకి చెందిన బూత్ ఏజెంట్లు, సామాన్యులపై రౌడీషీట్లు తెరవడం విస్మయం కలిగిస్తోంది. పోలింగ్‌కు 48 గంటల ముందే బయట ప్రాంతానికి చెందిన వారు నియోజకవర్గాల్లో ఉండకూడదన్న నిబంధన ఉంది. అయితే అంత మంది నరసరావుపేటకు చెందిన వారు పట్టణంలో ఎలా ఉన్నారో దర్శి పోలీసులే చెప్పాలి. -
మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ పెట్టి..
సాక్షి, కృష్ణా జిల్లా: యనమలకుదురులో విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణీ సందు కావ్య శ్రీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కావ్య శ్రీ మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. విజయవాడలో స్కానింగ్ తీయించిన భర్త శ్రీకాంత్.. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇష్టం లేదని పలుమార్లు భర్త శ్రీకాంత్‌కు కావ్యశ్రీ చెప్పిన కానీ తమకు వారసుడిని ఇవ్వాలంటూ అత్త, మామ వేధింపులకు పాల్పడ్డారు.శ్యామ్ అనే కానిస్టేబుల్ స్కానింగ్ తీసుకెళ్లాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు తన భర్తకు మెసేజ్ చేసిన కావ్య శ్రీ.. మీకు వారసుడిని ఇవ్వలేనంటూ భర్తకు మెసేజ చేసింది. పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మ్యూల్ సిమ్‌కార్డుల ముఠాగుట్టు రట్టు
భవానీపురం (విజయవాడపశ్చిమ): సైబర్ నేరగాళ్లకు మ్యూల్ సిమ్‌కార్డులు సరఫరా చేస్తున్న ముఠాగుట్టును విజయవాడ సైబర్ పోలీసులు రట్టుచేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశా రు. నిందితుడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. కోటిని స్తంభింపజేశారు. సైబర్ మోసంతో సీని యర్ సిటిజన్ పోగొట్టుకున్న రూ.30,37,627 ఆయనకు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా సీపీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. గతనెల 24వ తేదీన విజ యవాడ సూర్యారావుపేటకు చెందిన సీనియర్ సిటిజన్ తాను సైబర్ నేరానికి గురైనట్లు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. తనకు వాట్సప్ ద్వారా వీడియో కాల్ చేసి ముంబై సైబర్ క్రైమ్ డీసీపీగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. తన పేరుమీద ముంబయిలో రెండు సిమ్‌కార్డులు, రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, ముంబయిలో పలు కేసుల్లో నిందితుడైన రాజ్ కుంద్రా నిత్యం తనతో ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ముంబయిలో కేసు నమోదు అయిందంటూ ఎఫ్ఐఆర్, అరెస్ట్ వారెంట్ పత్రాలను వాట్స ప్లో పంపించాడని తెలిపారు. అతడి బెదిరింపులకు భయపడిన తాను అతడు చెప్పిన ఖాతాకు రూ.30,37,627 జమచేసినట్లు తెలిపారు. అయినా ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖలో తీసుకున్న సిమ్‌కార్డుల వినియోగం ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.డి.తేజేశ్వరరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ కోమాకుల శివా జి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉపయోగించిన సిమ్ కార్డులు విశాఖపట్నంలో తీసుకున్నట్లు గుర్తించి ఎస్ఐ ఆర్.ఎస్.సీహెచ్.మూర్తి ఆధ్వర్యంలో ఒక బృందం విశాఖపట్నంలో దర్యాప్తు చేసింది. సిమ్‌కార్డులు అమ్మే ఎగ్జిక్యూటివ్‌లు.. వినియోగదారుల బొటనవేలి ముద్రలను ఉపయోగించి మరో మ్యూల్ సిమ్‌కార్డు తీసుకుని యాక్టివేట్ చేసి సంఘవ్యతిరేక శక్తులకు అమ్ముకుంటున్నట్లు గుర్తించారు. సైబర్ నేరస్తులకు మ్యూల్ సిమ్‌కార్డులు విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టుచేసి వా రి వద్ద నుంచి 998 సిమ్‌కార్డులు, బయోమెట్రిక్ మెషిన్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన రేపాక రాంజీ, నంబాల నితిన్, బండి నారాయణమూర్తి అలియాస్ రవి, విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన తేలు ప్రణయ్‌కుమార్, నంద రూపేష్, కాగితాల సింహాద్రి, నిడమర్రు ఎండీఎల్ సూరయ్యగూడేనికి చెందిన పందిరి సత్యనారాయణలను అరెస్టు చేశారు. బాధితుడు డబ్బు జమచేసిన బ్యాంకు ఖాతాను గుర్తించి 1930 పోర్టల్ ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదించి ఆ ఖాతాలో ఉన్న రూ.1,21,73,156.98ని నిలుపుదల చేశారు. బా ధితుడు పోగొట్టుకున్న రూ.30,37,627ను కోర్టు ద్వారా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరస్తులు కాంబోడియా నుంచి ఈ మోసానికి పా ల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని సీపీ తె లిపారు.దోషుల్ని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.