వనదేవతల జాతరకుసర్వం సిద్ధం

all set up for sammakka saralamma jatara - Sakshi

నియోజకవర్గంలో 10 చోట్ల జాతర

ఒక్కో జాతరకు లక్ష మందికి పైనేరానున్న భక్తులు

ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీలు

ఈ నెల 31 నుంచి మొక్కులు ప్రారంభం

హుజూరాబాద్‌ : కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలు సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహణకు ఏర్పాట్లు అంతా సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో 10 చోట్ల జరుగనున్నండగా,  సమ్మక్క–సారలమ్మలు కొలువుదీరనున్న గద్దెలను ఇప్పటికే ముస్తాబు చేశారు. తెలంగాణలో రెండేళ్లకోసారి ఎంతో వైభంగా జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర సందడి వారం రోజుల ముందుగానే ప్రారంభం కాగా,  ఈ నెల 31 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా జరుగునున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఎత్తు బంగారం (బెల్లం) కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్‌లో జాతర సందడి నెలకొంది. నియోజకవర్గంలో ప్రధానంగా హుజూరాబాద్‌ పట్టణ సమీపంలోని రంగనాయకులగుట్ట వద్ద జాతర వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతీ రెండేళ్లకోసారి జరిగే జాతరకు 2 లక్షలకు పైగానే భక్తులు హాజరవుతుండగా, ఆయా మండలాల్లో జరుగనున్న ఒక్కో జాతరకు లక్ష మందికిపైగానే భక్తులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జూపాకలో జాతరకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వీణవంకలో ముమ్మర ఏర్పాట్లు 
మినీ మేడారంగా పిలిచే వీణవంక సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 31న వ నం నుంచి సారలమ్మ గద్దెకు రానుండటంతో జాతర ప్రారంభమవుతుంది. ఇక్కడ 1979 నుంచి పాడి వంశీయుల ఆధ్వర్యంలో జాతర జరుగుతుండగా... సుమారు 2లక్షల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల సమీపంలో వాగు ఉండటంతో మినీ మేడారంగా పేరుగాంచింది. కరీం నగర్‌ నుంచి వీణవంక 40కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తుల స్నానాల కోసం పక్కనే చెక్‌డ్యాం నిర్మించారు. ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సహకారంతో ఎస్సారెస్పీ కెనాల్‌ కాలువ ద్వారా నీటిని నింపడంతో చెక్‌డ్యాం కలకళలాడుతోంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎస్సై కిష్ణారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంచారు. అదేవిధంగా చల్లూరు, కోర్కల్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో కూడా జాతర జరుగుతుంది.

 ఇల్లందకుంటలో గద్దెలు ముస్తాబు  
ఇల్లందకుంట మండలంలోని మల్యాలలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతర కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. 30 ఏళ్లుగా మల్యాలలో ఈ జాతరను నిర్వహిస్తున్నారు. సమ్మక్క–సారలమ్మలను మేడారంకు చెందిన కోయజాతి కులస్తులు తాటి వనం నుంచి తీసుకొస్తారు. ఇప్పటికే పూజరులు వచ్చి ఉన్నారు. గతంలో వేరు ప్రదేశాలకు మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లేవారు అందరు కలిసి కులమతాలు తేడా లేకుండా జాతరను నిర్వహిస్తున్నా రు. దాదాపు ఈ జాతరకు 20వేలకు పై గా జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు చెందిన వివిధ గ్రామాల ప్ర జలు వచ్చి దర్శించుకుంటారు. మూడు రోజుల పాటు జాతర జరుగనుంది.

 జమ్మికుంటలో..
జమ్మికుంట పట్టణంలోని కేశవపూర్‌లో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పాతకాల సంపత్‌ అధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జమ్మికుంట, హైదరాబాద్, ఖమ్మం, మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం జాతర నిర్వహాకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి నూతనంగా సమ్మక్క గద్దె వద్దకు వెళ్లే సమయంలో మేడారంలో ఉండే విధంగా 5 గంటలను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా భక్తులు స్నానాలు చేసేం దుకు శశ్వాత బాత్‌రూంలను ఏర్పాటు చేస్తున్నారు.  ఈ సారి జరిగే జాతరకు మొక్కులు చెల్లించుకునేందుకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు ççహాజరవుతారనే అంచన వేస్తున్నారు.

మానేరు తీర ప్రాంతాన జాతర
జమ్మికుంట మండలం వావిలాల, తనుగుల గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మ జాతరలు కొసాగుతాయి. వావిలాలలో 1982 నుంచి, తనుగులలో 1984 నుం చి ప్రతి రెండేళ్లకోసారి జాతర కొనసాగుతూ వస్తున్నాయి. రెండు గ్రామాల శివారులో ఉన్న మానేరు తీర ప్రాంతాన జాతర వేడుకలు జరుగుతాయి. వావి లాలలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లో నడుస్తుంగా, తనుగులలో ఉత్సవ కమిటీ  ఆధ్వర్యంలో జరుగుతాయి. 
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  తాగునీరు, విద్యుత్, రోడ్ల వసతులను ఏర్పాట్లను చేస్తున్నారు.   

వసతులు ఏర్పాటు చేశాం
జాతరకు వచ్చే భక్తుల కోసం ఇప్పటికే అన్ని వసతులను ఏర్పాటు చేశాం. ప్రధానంగా తాగునీటి వసతి, లైటింగ్‌ పనులు పూర్తి చేశాం. మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. స్నానాల కోసం జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు చేశాం.

 -పోరెడ్డి దయాకర్‌రెడ్డి,జాతర కమిటి చైర్మన్‌ 

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top