Food
-
ఇవాళ ఏ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలబ్బా? ఇపుడిదే ట్రెండ్!
నగరం కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు. విభిన్న రుచుల సంగమం. శతాబ్దాలుగా బిర్యానీ పరిమళాలతో పేరుగాంచిన మన నగరం, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ సంస్కృతిలో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. బిర్యానీ, హలీం వంటి క్లాసిక్ వంటకాలు ఎప్పటికీ చిరపరిచితమైనవే అయినా, ఇప్పుడు కొత్త తరహా ఫ్యూజన్ ఫుడ్, ఇంటర్నేషనల్ వంటకాలతో నగర వీధులు ఘుమఘుమలకు వేదికలుగా మారిపోయాయి. ఫుడ్ అంటే కేవలం తినేది కాదు.. ఇప్పుడు అది అనుభవించే జీవనశైలి భాగంగా మారింది. దీనికి ఫుడ్ బ్లాగింగ్ మరింత ప్రాచుర్యాన్ని కలి్పస్తోంది. విదేశీ ఫుడ్ బ్లాగర్స్ ఫుడ్‌టూర్‌లో భాగంగా నగరంలో సందడి చేస్తున్నారు. వారి వీడియోలు విశ్వవ్యాప్తంగా వైరల్‌గా మారుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోలైఫ్స్టైల్ ఫుడ్‌కి కొత్త నిర్వచనం.. ఇప్పుడు ఫుడ్ తినడం కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు. అది ఫ్రెండ్స్‌తో రాత్రివేళ స్ట్రీట్ టూర్‌కు వెళ్లడం, కొత్త స్టాల్ కనుగొనడం, అందులో ప్రత్యేకమైన ఐటెం రుచి చూసి, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఇవన్నీ ఒక లైఫ్‌స్టైల్‌గా మారిపోయాయి. ‘నేడు ఏ స్ట్రీట్ ఐటెం ట్రై చేయాలి?’ అనే ప్రశ్న, ప్రతీ ఫుడ్ లవర్ డైలీ రొటీన్లో భాగం అయ్యింది. ఇప్పటి యువత కేవలం రెస్టారెంట్లకే పరిమితం కాలేదు. వీధుల్లో అందుబాటులో ఉన్న కొత్త రుచుల కోసం క్యూ కడుతున్నారు. చిన్న చిన్న బండ్లపై కనిపించే పైనాపిల్ డోసా, బబీ బాట్స్, ఫైర్ పానీపూరీ, ఐస్ మలై టిండి వంటి ప్రయోగాత్మక ఐటెమ్స్ ఇప్పుడు హాట్ ట్రెండ్స్. సికింద్రాబాద్ మటన్ కీమా దోసా, హిమాయత్‌నగర్ తిబ్బటన్ మోమోస్, గచ్చిబౌలి కొరియన్ స్ట్రీట్‌ఫుడ్ – ఇవన్నీ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదాఫుడ్ బ్లాగింగ్ ట్రెండ్.. ఈ విప్లవానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది ఫుడ్ బ్లాగింగ్. యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ వేదికలపై హైదరాబాదీ యువత ఫుడ్ రీల్స్, రివ్యూలతో వైరల్ కంటెంట్ సృష్టిస్తున్నారు. బండి వద్ద కూర్చొని తినే ఒక చిన్న వీడియో లక్షల వ్యూస్‌ను తెచ్చిపెడుతోంది. ఫుడ్ బ్లాగర్ల ప్రసారం వల్ల చిన్న స్టాల్స్‌కు కూడా అంతర్జాతీయ గుర్తింపు రావడం విశేషం. ‘‘అవి కేవలం బండ్లు కావు, అవి డ్రీమ్ టేస్టీ హబ్స్‘గా మారుతున్నాయి. ఎక్కడికైనా కొత్తగా ఓ వెరైటీ వంటకం కనిపిస్తే క్యూ కడుతున్నారు. ఇలా బ్లాగర్ల దృష్టిలో పడితే చిన్న ఫుడ్ స్టాల్స్‌కు కూడా గుర్తింపు వస్తోంది.హైదరాబాదీ ఫుడ్ అదుర్స్.. ఈమధ్య యూఎస్ఏకి చెందిన క్రిష్ లూయిస్ ఫుడ్ టూర్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక్కడి స్పైసీ ఫుడ్, స్వీట్లు, పరోటా, చికెన్–65, రోడ్‌సైడ్ మిర్చి తనకు ఎంతో నచ్చాయంటూ వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. ఇటీవల కొంతమంది విదేశీ ఫుడ్ వ్లాగర్లు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి వీధి వంటకాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్న చిన్న పానీపూరీ బండ్ల దగ్గర నిలబడి, ‘ది బెస్ట్ థింగ్ ఐ ఎవర్ ఈట్!’ అంటూ ఇంగ్లిష్‌లో చెప్పే మాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయ్యాయి. వీధి వంటల అద్భుత రుచితో ఇక్కడి ఆతిథ్యం, సరదా వాతావరణం వాళ్లను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో విదేశీయుల కళ్లలో కూడా నగరం ఒక ఫుడ్ డెస్టినేషన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన ఫుడ్ వ్లాగర్లు హైదరాబాదీ స్ట్రీట్ ఫుడ్‌ను మరింతగా ప్రచారం చేస్తున్నారు. ‘ఇంత అతంటిక్ ఫుడ్ వీధుల్లో దొరుకుతుందా?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీఫుడ్ క్రియేటివిటీతో.. హైదరాబాద్ ఇప్పుడు కేవలం చారిత్రక కట్టడాల నగరమే కాదు. ఇది రుచుల పండుగలా మారింది. స్ట్రీట్‌ఫుడ్ ద్వారా స్థానికులు తమ క్రియేటివిటీని చూపిస్తూ, జీవనశైలిని కొత్త కోణంలో నిర్వచిస్తున్నారు. ఫుడ్ బ్లాగర్లు, ఫుడ్ ప్రియులు, ప్రయాణికులు అందరూ కలిసి ఈ నగరాన్ని ఒక రుచుల ప్రయాణ కేంద్రంగా మార్చేశారు. -
హీరో శింబు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రాత్రి పూట అలా నిద్రపోతేనే..
తమిళ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, దర్శకుడిగా, సింగర్‌గా తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శింబు అసలు పేరు సిలంబరసన్. అయితే అంతా ముద్దుగా శింబుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం ఆయన కమల్‌హాసన్ థగ్ మూవీ షూటింగ్ ప్రమోషన్లతో బిజిగా ఉన్నాడు శింబు. ఒకప్పుడు ఆయన ఫుడ్స్టైల్ అంత ఆరోగ్యకరమైన రీతీలో ఉండేది కాదని అంటున్నారు శింబు ఫిట్నెస్ ట్రైనర్. ఆయన ఎంతో పట్టుదలతో ఆరోగ్యకరమైన అలవాట్లును అనుసరిస్తూ దాదాపు 30 కిలోలు బరువు తగ్గారని అన్నారు. మంచి ఆహారపు అలవాట్లను అనుసరించిన విధానం..ఆయన పాటించిన నియామాలు వింటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుందంటున్నారు. ఎందుకంటే తాము ఇచ్చే డైట్‌లోని ఆహారాలు శింబుకి అస్సలు నచ్చనవి అట. అయినా సరే అతడు పట్టుదలతో మంచి పోషకాహారాన్ని ఎలా ఇష్టంగా తినేవాడో వివరించారు. మరీ అంతలా బరువు తగ్గేందుకు అనుసరించిన ఫిట్నెస్ మంత్ర ఏంటో ఆయన ఫిట్నెస్ ట్రైనర్ మాటల్లో విందామా..!.స్మార్ట్‌గా కనిపిస్తూ..యుంగ్ హీరోలకు తీసిపోని దూకుడుతో కనిపించే శింబు(42) పిట్నెస్ సీక్రెట్ గురించి ఓ ఇంటర్యూలో ప్రశ్నించగా..స్థిరత్వం, మితంగా ఆహారం తీసుకోవడమేనని సమాధానమిచ్చారు. ఆయన వెయిట్‌లాస్ జర్నీ ఎందిరికో స్ఫూర్తిగా నిలిచింది కూడా. 2020 నుంచి మంచి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించి బరువు తగ్గానని ఆయన చెప్పారు. ఇక ఆయన ఫిట్నెస్ ట్రైనర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ..శింబు ప్రతి ఉదయం 4.30 గంటలకు నడకతో తన రోజుని ప్రారంభిస్తాడని అన్నారు. ప్రారంభంలో వారానికి నాలుగురోజులు వ్యాయామాలు చేసేవాడని, ఆ తర్వాత ఐదు రోజులకు మార్చుకున్నాడని అన్నారు. అంతేగాదు “ఆల్కలీన్ రిచ్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు” ప్రాధాన్యత ఇచ్చేలా తన డైట్‌ని మార్చుకున్నాడని అన్నారు. కేలరీలు తక్కువుగా ఉండే సలాడ్లు, జ్యూస్‌లు ఎలా ఇష్టంగా తీసుకునేందుకు యత్నించాడో కూడా తెలిపారు. అలాగే రాత్రిపూట తేలికపాటి ఆహారమే తీసుకుని కొద్దిపాటి ఆకలితో నిద్రపోవడం వంటివి పాటించారట శింబు. ఇలా రాత్రిపూట కొంచెం ఆకలితో నిద్రపోవడం మంచిదేనా..ఇది సరైనదేనని న్యూట్రిషనిస్ట్ ఆశ్లేషా జోషి అంటున్నారు. కొంచెం ఆకలితో పడుకోవడం జీర్ణాశయానికి ఎంతో మంచిదని అంటున్నారు. ఎందుకంటే రాత్రిపూట మన జీవక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల రాత్రిపూట అధిక కేలరీలతో కూడిన ఆహారం అధిక బరువు, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు రాత్రిపూట అదిక కేలరీలను నివారించడమే అన్ని విధాల శ్రేయస్కరమని అంటున్నారు. అలాగని ఆకలితో కాకుండా పోషకాహారంతో కూడిన ఆహారం మితంగా శరీరానికి అనుగుణంగా తీసుకోవడం ముఖ్యమని సూచించారు. ఇక్కడ అందరి ఆకలి సంకేతాలు ఒకేలా ఉండవు కాబట్టి ఆయా వ్యక్తుల వారి శరీర సంకేతానికి అనుగుణంగా తీసుకోవాలని అన్నారు. ఆల్కలీన్ రిచ్, పోషకాలు అధికంగా ఉండే ఫుడ్..పండ్లు కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు, ఆల్కలీన్ అధికంగా ఉండే ఆహారాలపై దృష్టిపెట్టడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ పుష్కలంగా అందుతుంది. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: అతనికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే..! వైరల్‌గా కొబ్బరిబోండాల వ్యాపారి) -
డిప్యూటీ సీఎం ‘మల్లు’ సతీమణి ఆవకాయ : గత పదేళ్లుగా..!
మధిర: మధిరలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క మంగళవారం మామిడి పచ్చడి తయారు చేశారు. ఏటా బంధువులతో పాటు కార్యాలయ ఉద్యోగులు, గన్మన్ల కోసం ఆమె పచ్చడి తయారుచేసి అందించడం దశాబ్దకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా మంగళవారం స్థానిక మహిళలతో కలిసి పచ్చడి సిద్ధం చేశారు. ఇదీ చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్ -
భారతీయ వంటకాలు అమోఘం..! విదేశీ జంట ప్రశంసల జల్లు
భారతదేశంలోని పలు ప్రదేశాలు..వాతావరణం తదితరాలను ఎందరో విదేశీయలు మెచ్చుకున్నారు. ఇక్కడ సాంస్కృతి సంప్రదాయాలు ఎంతగానో నచ్చాయని ఇక్కడే నా పిల్లలను పెంచుతానని ఒక విదేశీ తల్లి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఇవన్నీ మరువక ముందే ఇప్పుడు మరో విదేశీ జంట ఇక్కడ వంటకాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారతీయులు వంటకాలు వండే పద్ధతి గురించి ఏం చెబుతున్నారో ఆ జంట మాటల్లోనే విందామా..భారతీయు రోజువారీ వంటల్లో ఆకుపచ్చని పదార్థాలను విరివిగా వినియోగిస్తారని అన్నారు. ఇక్కడ పచ్చిగా ఉన్నవాటిని చక్కగా పచ్చళ్లు పట్టేస్తారు లేదా ఘుమ ఘుమలాడే కూరల్లా మార్చేస్తారు. అదే పండిన వాటిని పండ్లు మాదిరిగా ఉపయోగిస్తారని చెబుతున్నారు. పండని కూరగాయలు, పండ్లతో చేసే వంటకాలని అసాధారణ ఆవిష్కరణలుగా అభివర్ణించారు. ముఖ్యంగా ఆకుపచ్చని మామిడిపండ్లతో పట్టే ఊరగాయ, పనపండుతో చేసే వంటకాలు అమోఘం అని ప్రశంసించారు. భారతదేశంలో తినడానికి ఏది పచ్చిగా ఉండదు. వాళ్ల చేతిమహిమతో అద్భుతమైన రుచిగా మార్చేస్తారు. పువ్వులను పకోడాలుగా మార్చేయడంలో వారి పాక నైపుణ్యం ఊహకందనిదని అన్నారు. పచ్చిగా ఉండే సబ్జీలో ఉడికించి తినడం మరింత అద్భుతమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోకి 'భారతదేశంలో తినడానికి ఏది పచ్చిగా ఉండదు' అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. అయితే నెటిజన్లు..భారతీయులుగా మేము చాలా వాటిని పచ్చిగా తింటున్నామనే విషయాన్ని గమనించలేదు. అయినా మా ఆహార సంస్కృతి ప్రాంతాల వారీగా మారుతుందని అది కూడా తెలుసుకోండి అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Life in India with Guru and Lila (@guru_laila) (చదవండి: గోల్డ్ మ్యాన్ అందించే '24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ'..! ధర ఎంతంటే.. ) -
ఆ ఫుడ్..నాట్ గుడ్..!
ఉరుకుల పరుగుల జీవనయానంలో ప్రజల జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఆహారపు అలవాట్లు కూడా చాలా వరకు మారిపోయాయి. సామాజిక స్థాయిలు మారాయి. నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కిట్టీ పార్టీ కల్చర్ వచ్చింది. బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు, నిశ్చితార్థాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు.. సందర్భం ఏదైనా స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి హోటళ్లల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఆ ఆహారమే అనారోగ్యమని గుర్తించలేపోతున్నారు. మురికి కాలువ గట్ల మీద ఉండే చిన్నపాటి తినుబండారాల తోపుడుబండి నుంచి పెద్దపెద్ద భవనాల్లో ఉండే ఖరీదైన హోటళ్ల వరకు అన్ని వేళలా ఆహార ప్రియులతో కిటకిటలాడుతుంటాయి. శుభకార్యాల నుంచి అశుభకార్యాల వరకు అన్ని సందర్భాల్లోనూ వడ్డించే ఫుడ్ కోసం హోటల్స్‌కు ఆర్డర్లు ఇస్తున్నారు. ఇంటి భోజనం కంటే హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు, బేకరీ ఫుడ్‌కు బాగా ప్రాధాన్యత పెరిగింది. అయితే ఇక్కడ తయారయ్యే ఆహారాలు, నిల్వ ఉన్న పదార్థాలు, పలు రసాయనాలతో చేసినవి కావడంతో ఆ వంటకాలు తిని పలువురు రోగాల బారిన పడుతున్నారు. క్యాన్సర్ రోగుల్లో 53 «శాతం మంది హోటల్స్ ఆహారంతోనే సమస్య తెచ్చుకుంటున్నారని పలు సర్వేలు వెల్లడించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. ఆహారాల్లో ప్రమాదకర రసాయనాలు హోటళ్లల్లో ఆహారాలు కలర్ ఫుల్, రుచికరంగా ఉండేందుకు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తుండడంతో అనేక రోగాలకు కారణమవుతున్నాయి. మెటానియల్ ఎల్లో వాడకం నిషేధించినప్పటికీ చాలా హోటళ్లలో వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై వెంటనే దుష్ప్రభావం చూపించదు. నెమ్మదిగా క్యాన్సర్‌కు కారకమవుతోంది. చిన్నారుల్లో నిద్రలేమి, నరాల సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి. వంటకాల్లో రంగు కోసం వాడే నిషేధిత టార్ట్రాజిన్ చాలా ప్రమాదకరం. దీంతో మానసిక వ్యాధితోపాటు థైరాయిడ్, క్యాన్సర్, ఎలర్జీ, దద్దుర్లు, తామర, రక్తకణ జాలంలో హానికర కణ జాలల వృద్ధి చెందడం, డీఎన్ఏ నష్టపోవడం, నిద్రలేమి, నీరసం వస్తాయి. స్వీట్లు, బిస్కెట్లలో ఆరెంజ్ రంగు కోసం వాడే సన్‌సెటన్, పసుపు రంగు కోసం వాడే కాటారజ్, గ్రీన్ కలర్ కోసం వాడే బ్రిలియంట్ బ్లూ, టారా్ట్రాజీన్లు ప్రమాదకరమే. చాకెట్లలో వాడే రోడ్మన్–బీ కూడా ప్రాణాంతకమే. అయినా చాక్లెట్లు, చిన్న పిల్లలు తినే రంగుల ఆహార పదార్థాల్లో వీటిని వినియోగిస్తున్నారు. పార్టీ కల్చర్.. ప్రమాదకరం కొన్నేళ్ల క్రితం వరకు పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లినా.. సమయానికి ఇంటికి రాలేని పరిస్థితుల్లో కొందరు హోటళ్లలో తినేవారు. కొందరైతే ఎంత సమయమైనా ఇంటికి వచ్చే భోజనం చేసేవారు. ఇప్పుడు కల్చర్ మారింది. సామాజిక నడతలో మార్పు వచ్చింది. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కల్చర్ వచ్చింది. నలుగురు స్నేహితులు కలిస్తేనే కాదు.. వీకెండ్ ఫ్యామిలీస్‌తో కలిసి లంచ్, డిన్నర్ బయటే చేస్తున్నారు. ఖరీదైన ఆహారం తింటున్నామనే భ్రమలో అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రహించలేకపోతున్నారు. నిల్వ ఉంచిన ఆహారం, ప్రమాదకర రసాయనాలు కలిపిన ఆహారాలతో అప్పటికప్పుడు నష్టం లేకపోయినా దీర్ఘకాలంలో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.నిబంధనలు బేఖాతర్ జిల్లాలో చిన్నా, పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలు, చాట్ బండార్లు, నూడిల్స్ షాపులు, అన్ని కలుపుకుని 5 వేలకు పైగా ఉంటాయి. ఒక్క నగరంలోనే 3 వందల వరకు హోటల్స్ ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. వాస్తవానికి హోటల్స్ యజమానులు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంది. ఆ శాఖ నిబంధనల మేరకు ఆహారం తయారు చేయాలి. ఈ చట్టం 2006 నుంచి అమల్లో ఉంది. ఆ శాఖ పరిధిలో జిల్లా స్థాయి అధికారితోపాటు ఓ గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, మరో ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరు నెలకు 12 శాంపిల్స్ సేకరించాలి. శాంపిల్స్‌ను ప్రయోగశాలకు పంపి, పరిశీలన తర్వాత అవి ప్రమాణాల మేరకు లేకపోతే కేసులు నమోదు చేయాల్సి ఉంది. కల్తీని బట్టి క్రిమినల్ లేదా సివిల్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించే వీలుంది. కానీ ఇవి జరగడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని తమ వద్దకు ఎవరూ రారన్న ధీమాతో వ్యాపారులు చెలరేగిపోతున్నారు. విచ్చలవిడిగా ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు.నాసిరకం.. రంగుల మయం హోటళ్లల్లో తయారయ్యే ఆహార పదార్థాలు నాసిరకం.. రంగుల మయంగా ఉంటాయి. పశువుల ఎముకలను సేకరించి వాటిని బట్టీలో అత్యధిక ఉష్ణోగ్రతపై మరిగించి ద్రావణాన్ని తీస్తున్నారు. ఆ ద్రావణాన్ని సాధారణ నూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. దీని వల్ల జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మిరప కాయల్లో ఎరుపు రంగు రావడానికి సూడాన్ రంగులు వాడుతుంటారు. పసుపులో మెటానిల్ ఎల్లో అనే పదార్థాన్ని కలుపుతారు. వీటిని వంటలో వినియోగిస్తే క్యాన్సర్ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆహారాన్ని వండే సమయంలో వాడిన నూనెనే మళ్లీ మళ్లీ కాచి వినియోగిస్తున్నారు. దీని వల్ల క్యాన్సర్, అల్సర్లు వచ్చే ప్రమాద మున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చికెన్, మటన్ బిర్యానీలు, తందూరిలో ఆకట్టుకునేందుకు ఎక్కువగా హానికరమైన రంగులను వాడుతున్నారు. అనారోగ్యానికి గురైన, ప్రమాదాల్లో చనిపోయిన గొర్రెలు, పొట్టేళ్లు, మేకలతోపాటు అనారోగ్యానికి గురైన వాటిని వధించి వినియోగదారులకు విక్రయిస్తున్నారు.చిన్న చిన్న హోటళ్లు, కర్రీస్ పాయింట్లలో వేడి వేడి కూరలు, పప్పు, సాంబారు వంటి ఆహార పదార్థాలు పల్చటి పాలిథిన్ కవర్లలో వేసి ఇస్తున్నారు. పదార్థాల వేడికి ప్లాస్టిక్ కరిగి వాటిని తినే వారికి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. ∙నిషేధిత క్యాట్ ఫిష్‌లను సైతం కొర్రమీనుగా విక్రయిస్తున్నారు. జిల్లాలో వీటిని చికెన్, మటన్ వ్యర్థాలతో గుంతల్లో పెంచుతున్నారు.అల్లం, వెల్లుల్లి పేస్టులను సైతం కల్తీ చేస్తున్నారు. వీటి ధర ఎక్కువగా ఉండడంతో అందులో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ పేస్ట్‌ను కలుపుతున్నారు.నిత్యం తనిఖీలు చేస్తున్నాంహోటల్స్, ఐస్‌క్రీం పార్లర్లు, రెస్టారెంట్లు, పండ్ల దుకాణాలను నిత్యం తనిఖీలు చేస్తూనే ఉన్నాం. పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా చాలా వరకు కాలం చెల్లినవి, ఉంటున్నాయి. 2024–25లో పలు హోటల్స్‌ను తనిఖీ చేసి 296 శ్యాంపిల్స్‌ను సేకరించగా 20 శాంపిల్స్‌లో నాణ్యత తక్కువగా ఉన్నట్లు, 18 శాంపిల్స్ ప్యాకెట్స్‌పై వివరాలు లేకుండా ఉన్నట్లు గుర్తించాం.– వెంకటేశ్వరరావు, జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ కల్తీ వల్ల ఆరోగ్య సమస్యలుకల్తీ ఆహారం తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. అవసరమైన పదార్థాలు అందక శరీరం బలహీనమవుతుంది. పోషకాహారం తీసుకుంటున్నామని ప్రజలు భావిస్తున్నప్పటికీ, కల్తీ వల్ల జీవనక్రియలు నిలిచిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీలైనంత వరకు బయట ఫుడ్‌కు స్వస్తి చెప్పి ఇంటి ఆహారాన్ని తీసుకోవడం శ్రేయస్కరం. ఆరోగ్యానికి ఎంతో మంచిది. – డాక్టర్ ఎంవీ రమణయ్య, రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల(చదవండి: ప్లీజ్..నో సప్లిమెంట్స్..! ) -
మెక్సికన్ 'మే'నూ..! ఫుడ్ లవర్స్‌కు పసందు..
వేసవి సెలవుల్లో అలా విదేశాలు తిరుగుతూ మెక్సికన్ ఫుడ్ తినాలనుకుంటున్నారా..! అవసరం లేదు, తామే మెక్సికన్ రుచులను నగరానికి తీసుకొస్తున్నామని ప్రముఖ చెఫ్ అమన్నా రాజు అంటున్నారు. మే నెల వేసవిలో వారాంతాలను అలా మెక్సికన్ స్మోకీ మెరినేడ్ రుచులను ఆస్వాదించాలనే వారికి తాము ప్రత్యేక వంటలను అందిస్తున్నట్లు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని నోవోటెల్ ఎయిర్పోర్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మెక్సికన్ ఫుడ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. మెక్సికోలోని ఓక్సాకా, వెరాక్రూజ్ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన విభిన్న రుచులను మెక్సికన్ గ్రిల్ నైట్స్‌తో నగరానికి పరిచయం చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ ప్రతి శనివారం ఈ మెక్సికన్ ఫుడ్ ఫెస్ట్ అలరించనుంది. ఓ వైపు భాగ్యనగరం వేదికగా ఈ నెల 31వ తేదీ వరకూ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మెక్సికన్ ఫుడ్ వెరైటీలు నగర వాసులను, నగరానికి విచ్చేస్తున్న విదేశీ అతిథులను ఆతీ్మయ విందుకు ఆహ్వానిస్తోంది. అంతేకాకుండా ఈ ఫెస్ట్ నగరంలోని ఆహార వైవిధ్యానికి, విభిన్న సంస్కృతులకు చెందిన రుచుల సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని నోవోటెల్ ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్ సుఖ్బీర్ సింగ్ పేర్కొన్నారు. గ్యాస్ట్రోనమిక్ సంతృప్తి.. అంతర్జాతీయంగా మెక్సికన్ వంటలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఫ్లేమ్–గ్రిల్డ్ మాంసాహారాలు, స్మోకీ మెరినేడ్లు, అరుదైన సుగంధ ద్రవ్యాల కలయికే ఈ వంటల ప్రత్యేకత. ఈ గ్యాస్ట్రోనమిక్ రుచుల వైవిధ్యాన్ని వేసవి ప్రత్యేకంగా నగరంలో ఆవిష్కరిస్తున్నారు. ఈ ఫుడ్ ఫెస్ట్‌లో అతిథులు వెజిటబుల్ బౌల్, బీన్ ఎన్చిలాడా సూప్‌తో ప్రారంభిస్తారు. అనంతరం మినీ కార్న్ డాగ్స్ వంటి ఆహ్లాదకరమైన స్టార్టర్స్‌ను పచ్చి మిరపకాయ, ఆవాలు, రుచికరమైన గుమ్మడికాయ ఎంపనాడాస్తో కలిపి వడ్డిస్తారు. ప్రత్యేకంగా అందించే సలాడ్ టెక్స్చర్స్, వినూత్న రుచుల మిశ్రమంతో అలరిస్తుంది. ప్రత్యేక దినుసులు.. ఫెస్ట్‌లో భాగంగా సీఫుడ్ సెవిచే, శ్రీరాచా డ్రెస్సింగ్‌తో స్పైసీ మెక్సికన్ చికెన్ సలాడ్, చిపోటిల్ డ్రెస్సింగ్‌లో కలిపి కాల్చిన బెల్ పెప్పర్ సలాడ్ జిహ్వకు సరికొత్త రుచిని అందిస్తుంది. గ్వాకామోల్, పైనాపిల్ సల్సా, టొమాటో సల్సా వంటి క్లాసిక్ మెక్సికన్ రుచులు ఈ మెనూలో మరో ప్రత్యేకం. మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని మసాలాలు దక్షిణాది మసాల రుచులకు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. చికెన్ క్యూసాడిల్లాస్, కాలాబాసిటాస్ కాన్ క్వెసో – చీజ్, వెజిటబుల్ చీజ్ ఎన్చిలాడాస్తో వండిన గుమ్మడికాయ, రుచికరమైన మొక్కజొన్న మిశ్రమాల్లో మసాల పరిమళం నగరవాసులను ఓక్సాకా, వెరాక్రూజ్ ప్రాంతాలకు తీసుకెళుతుంది. సీ ఫుడ్ లవర్స్ కోసం మెక్సికన్ రొయ్యలు, చేపల బిస్క్యూ పిసికాడో, కామరాన్ పోజోల్ను ఆస్వాదిస్తారు. (చదవండి: మిస్ వరల్డ్ మధురమైన పాట) -
ఇది తినండి.. ఇలా ఉండండి!
ఏం తినాలో వారే చెప్తారు... ఎప్పుడు తినాలో సూచిస్తారు.. దగ్గినా తుమ్మినా పరిగెత్తుకొస్తారు. నలతగా ఉందంటే క్షణాల్లో వాలిపోతారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 24 గంటల మెడికల్ కేర్, న్యూట్రీషినిస్టుల సేవలు, నెలసరి సమస్యలు చికాకు పెట్టకుండా అందుబాటులో మహిళా సిబ్బంది.. ఇలా మిస్‌వరల్డ్ పోటీల కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సుందరీమణుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. – సాక్షి, హైదరాబాద్ఐదారేళ్ల శ్రమ..ప్రపంచ సుందరి కావాలన్న కల చాలామంది యువతుల్లో ఉంటుంది. అందం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, ఆకట్టుకునే తెలివితేటలు.. కలబోసిన సంపూర్ణ వ్యక్తిత్వం.. ఈ లక్షణాలున్నవారు ప్రపంచ సుందరి కిరీటం కోసం ఆరాటపడటం సహజం. దీనిని సాధించుకునే లక్ష్యంతో చాలామంది కఠోర దీక్షగా సాగుతారు. ఎంతో ఇష్టమైన పదార్థాలున్నా ముట్టకుండా దూరంగా ఉంటారు. నిరంతరం కఠినమైన వ్యాయామం చేస్తారు. బద్ధకానికి అందనంత దూరంగా ఉండేందుకు నిరంతరం చలాకీతనం తొణికిసలాడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవన్నీ ఆచరణలో పెట్టేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తారు. దాదాపు ఏడెనిమిది ఏళ్లపాటు దీక్షగా ముందుకు సాగుతారు. ఇన్నేళ్ల పట్టుదల, శ్రమ.. పోటీలయ్యేవరకు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వారి సొంత ప్రాంతంలో దీన్ని నిలబెట్టుకున్నా, పోటీల కోసం మరో తరహా వాతావరణం ఉండే ప్రాంతానికి వెళ్లి దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితిలో వారు దాన్ని కొనసాగించటం పెద్ద సవాలే. అక్కడి వాతావరణం, పరిస్థితులు, ఆహారంలో మార్పు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. అందుకే పోటీలు జరిగే ప్రాంతంలో దాదాపు రెండు నెలల ముందు నుంచి అక్కడి యంత్రాంగాన్ని మిస్‌వరల్డ్ లిమిటెడ్ అప్రమత్తం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో మార్చి మొదటి వారంలోనే మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మోర్లే అప్రమత్తం చేశారు. మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి పరిస్థితులు పరిశీలించి, పోటీకి అనువైన వాతావరణం ఉందని తేల్చుకున్నాక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ఈ విషయంపై చర్చించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మెడికల్ టూరిజంలో తెలంగాణ అగ్రభాగాన ఉన్నందున, అక్కడ ప్రపంచ స్థాయి వైద్య వసతులున్నాయని, ఆ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. టాప్ ఆస్పత్రితో ఒప్పందం..ప్రస్తుతం నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రితో మిస్ వరల్డ్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న యువతులు బస చేసిన ట్రైడెంట్ హోట ల్లో ఆ ఆస్పత్రి ఓ ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో షిఫ్టుల వారీగా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. నర్సులు, పారామెడికల్ సిబ్బంది, న్యూట్రిషనిస్టులు సహాయకంగా ఉంటారు.» పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణుల్లో దాదాపు అన్ని ఖండాలకు చెందిన వారున్నారు. వారి శరీరానికి సరిపడే ఆహార పదార్థాలేమిటో తెలిపే జాబితాను మిస్‌వరల్డ్ ప్రతినిధులు ముందుగానే స్థానిక యంత్రాంగానికి అందజేశారు. ఆయా పదార్థాలు నిత్యం హోటల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు.» మంగళవారం చౌమహల్లా ప్యాలెస్‌లో వెల్కం డిన్నర్లో హైబరాబాద్ బిర్యానీని ప్రత్యేకంగా వడ్డించారు. కానీ, ఈ బిర్యానీని మసాలా తక్కువగా, మధ్య రకంగా, పూర్తిస్థాయి మసాలాతో.. ఇలా మూడు రకాలుగా తయారు చేసి ఉంచారు. యూరప్, అమెరికా తదితర ప్రాంతాలకు చెందిన వారిని తక్కువ మసాలా ఉన్న బిర్యానీ తీసుకోవాల్సిందిగా సూచించటం విశేషం.»చాలా ఆరోగ్య సమస్యలు మంచినీటితోనే వస్తాయి. అందుకే సాధారణ నీళ్లు కాకుండా, ప్రస్తుతం సుందరీమణులకు లీటరు రూ.800 ఖరీదు చేసే ప్రత్యేక బ్రాండ్ మంచినీటిని అందిస్తున్నట్టు తెలిసింది.»ప్రస్తుతం హోటల్లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో దాదాపు 80 రకాల ఇంటర్ కాంటినెంటల్ వంటకాలను బఫేలో ఉంచుతున్నారు. తమకు ఏది సరిపోతుందో ఆ ఆహారా పదార్థాలను సుందరీమణులు ఎంచుకునే వెసులుబాటు కల్పించారు.» మిస్‌వరల్డ్ తరపున వచ్చిన న్యూట్రిషనిస్టులు సూచించిన ఆహారాన్నే సుందరీమణులు స్వీకరిస్తున్నారు.»రాష్ట్ర పర్యటనలకు వెళుతున్నప్పుడు కూడా ముందుగానే భోజన వివరాలను తెలిపి, స్టార్ హోటల్లో వండించి మరీ సిద్ధం చేస్తున్నారు.»సుందరీమణులు ఎక్కడకు వెళ్లినా పూర్తి ఎమర్జెన్సీ వైద్య వసతులతో కూడిన అంబులెన్సు ఫాలో అవుతోంది. అందులో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉంటున్నారు -
ఆహా.. ఆవకాయ
విశాఖపట్నం: వేడివేడి అన్నం ..ఆ తర్వాత స్వచ్ఛమైన నెయ్యి ..అందులో కాస్త ఆవకాయ ముక్కను కలుపుకొని తింటే... ఆహా! ఆ రుచిని వర్ణించలేం. మొదటి ముద్దతోనే నోరంతా పులకరించిపోతుంది. వేడి అన్నం, కమ్మటి నెయ్యి, ఘాటైన ఆవకాయ... ఈ మూడు రుచులు ఒకదానితో ఒకటి పోటీపడుతూ, నాలుకపై ఒక మాయాజాలాన్ని సృష్టిస్తాయి. ఒక్కో ముద్ద తింటుంటే కడుపు నిండిపోతున్నా, ఆ రుచి మాత్రం వదలాలనిపించదు. కళ్లల్లో ఒక విధమైన మెరుపు, పెదాలపై చిరునవ్వు అదే వస్తుంది. వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ సీజన్ ఆరంభం అవుతుంది. మహిళలు ఏడాది అంతా తినడానికి సరిపోయే విధంగా ఆవకాయ పెడతారు. ఆవకాయ పెట్టడానికి ఎంతో అనుభవం, నైపుణ్యం అవసరం. ఇటువంటి ఆవకాయ తయారీపై నగరంలో పోటీలు నిర్వహించారు. బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో రెడ్ ఎఫ్ఎం, త్రీ మేంగోస్ స్పైసెస్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందమందికిపైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆవపొడి, కారం, ఉప్పు, నూనె సమపాళ్లలో కలిపి నోరూరించే ఆవకాయను క్షణాలలో సిద్ధం చేశారు. యువతుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొని, ఆవకాయ ఘాటును రుచిచూపించారు. ఆవకాయ తయారు చేసిన మహిళలకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో ఆర్జేలు ప్రదీప్, కృష్ణ, షర్మిల, భావన, మధు కార్తీక్‌లతో పాటు ప్రోగ్రామింగ్ హెడ్ సుష్మ తదితరులు పాల్గొన్నారు. -
సక్సెస్ అంటే...‘సాఫ్ట్వేర్’ ఒక్కటే కాదు బాస్!
తెనాలి: చల్లా లక్ష్మీనారాయణ– ‘ ఏదో ఒక రోజు పెద్ద చెఫ్‌ని అవుతాను’ అంటూ చిన్నప్పుడు అన్నప్పుడు, అందరూ నవ్వుకున్నారు. అయితే, అమ్మను తొలి గురువుగా తీసుకున్న ఆయన, పాకశాస్త్రంలో అపూర్వ శిఖరాలను అధిరోహించారు. ఆధునిక నలభీమునిగా, ప్రత్యేకమైన రెసిపీల సృష్టిలో తన ప్రతిభను చాటారు. ఆయన వంటల ప్రయాణం.. ‘శ్రమ’కు ‘రుచి’ని మేళవించి, ఆహారప్రియులను ‘ఔరా..’ అనిపించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఆయన ప్రస్థానం, నిజంగా ఈ రంగంలో యువతకు ప్రేరణ. ప్రస్తుతం వీసా రెన్యువల్ కోసం భారత్‌కు వచ్చిన ఆయన స్ఫూర్తిదాయక జీవన ప్రయాణం మీ కోసం.. అదృష్టానికి తొలి మెట్లు.. లక్ష్మీనారాయణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలానికి చెందిన అంగలకుదురు. తెనాలిలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, హైదరాబాద్‌లోని ఐఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా పొందారు. ఒక హోటల్లో ఉద్యోగంతోపాటు హోటల్ మేనేజ్మెంట్, టూరిజంలో పీజీ డిప్లొమా కూడా పూర్తి చేశారు. ఆపై సింగపూర్‌లో ఫుడ్ హైజీన్ కోర్సు అభ్యసించి, ముంబయిలోని బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ద్వారా హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీలో దూరవిద్య ద్వారా కోర్సు పూర్తి చేశారు. 1997లో ఆయన వృత్తి జీవితం ప్రారంభమైంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రముఖ హోటళ్లలో చెఫ్‌గా సేవలందించారు. 2007–09 కాలంలో సింగపూర్‌లోని నయూమి హోటల్స్‌లో చెఫ్‌గా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం మైసూరు, కూర్గ్ ప్రాంతాల్లోని రిసార్ట్స్, తిరుపతిలోని ఐసీటీ హోటల్లో సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు కాకినాడ, చెన్నై నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో పనిచేశారు. శ్రమతోపాటు ప్రతిభకు గుర్తింపుగా అదృష్టం తలుపు తట్టినట్లు 2023లో అమెరికా నుంచి ఆహ్వానం లభించింది. అక్కడి కాలిఫోర్నియాలో ప్రసిద్ధ హోటల్లో చెఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: ఎండినా... నిమ్మ అమ్మే! వరించిన అవార్డులు సింగపూర్‌లోని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ చెఫ్స్ సొసైటీ, సౌత్ ఇండియన్ చెఫ్స్ అసోసియేషన్ (ఎస్ఐసీఏ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కలినరీ అసోసియేషన్ (ఐఎఫ్‌సీఏ), అమెరికన్ కలినరీ ఫెడరేషన్ (ఏసీఎఫ్) సభ్యత్వాలు లక్ష్మీనారాయణకు లభించాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ తిరుపతి, విశాఖపట్నం వేదికగా నిర్వహించిన వంటకాల పోటీలతో పాటు అనేక సోలో, గ్రూపు విభాగాల్లో పాల్గొని పలు ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన గెలుచుకున్నారు. ఎన్నో దేశాల వంటకాల్లో మేటిగా.. పలు దేశాల వంటకాలలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. దక్షిణ భారతీయ వంటకాలకే పరిమితం కాకుండా థాయ్, ఇటాలియన్, మెక్సికన్ వంటి అంతర్జాతీయ వంటకాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నీటిపై పెరిగే మొక్కల నుంచి తయారు చేసే ప్రత్యేకమైన ‘హనీ చిల్లీ చెస్ట్ నట్స్’ రెసిపీలో లక్ష్మీనారాయణ సిద్ధహస్తులు. ఆయన తయారు చేసే మరో ప్రసిద్ధ వంటకం ‘చిల్లీ తోఫు’ కూడా ఎంతో ఆదరణ పొందింది. నాన్వెజిటేరియన్ వంటకాల విషయంలో, మటన్ కర్రీతో దోసెలా స్ట్రీమ్ చేసి వడ్డించే ప్రత్యేకమైన ‘మటన్ మొప్పాస్’, మంగళూరు శైలిలో ‘ఘీ రోస్ట్ ప్రాన్స్’, ఆంధ్ర ప్రత్యేకత అయిన ‘నాటుకోడి–రాగిముద్ద’, అరుదైన ‘జాక్‌ఫ్రూట్ బిర్యానీ’, మసాలా రుచులతో నిండిన ‘గుంటూరు మటన్ ఫ్రై బిట్ బిర్యానీ’లు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.‘సాఫ్ట్వేర్’ ఒక్కటే మార్గం కాదునేటి యువతకు ‘సాఫ్ట్వేర్ ఉద్యోగం’ ఒక్కటే మార్గం కాదు. హోటల్, టూరిజం వంటి రంగాలలోనూ అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. నా వృత్తి విషయానికి వస్తే, ప్రతి దేశం నాకు ఒక కొత్త పాఠం, ప్రతి వంటకం ఒక కొత్త సవాలు. ఇన్నేళ్ల ప్రయాణంలో అనుభవించిన అవమానాలు, ఒంటరితనం, సుదీర్ఘమైన పనిగంటలు– ఇవన్నీ నా ఎదుగుదలకు బలమైన మూల స్తంభాలయ్యాయి. వంటకాలు తయారు చేయడం మాత్రమే కాదు, వాటిలో మనసు కలపాలి. పదార్థాలకు భావాలను మేళవించినప్పుడే వంటకానికి ప్రాణం వస్తుంది. – చల్లా లక్ష్మీనారాయణ -
ఎండినా... నిమ్మ అమ్మే!
నిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. అయితే ఏనుగు చచ్చినా పదివేలే అన్నట్టు... పచ్చి లేదా పండు నిమ్మలోనే కాదు... ఎండిన నిమ్మలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, పేగు సంబంధిత రుగ్మతలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఎండిన నిమ్మకాయలోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది తద్వారా వాతావరణంలోని మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. ఎండిన నిమ్మకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన చర్మానికి మంచివి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మంపై ఉన్న మచ్చలు తగ్గి చర్మం శుభ్రంగా, ప్రకాశవంతంగా మారుతుంది.ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తోఎండిన నిమ్మకాయలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎండిన నిమ్మకాయలు నేచురల్‌గానే శరీరంలోని వ్యర్థాలను, విషాలను తొలగించి, కాలేయ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, జీర్ణ రసాయనాలను కూడా అందిస్తాయి.దీన్ని ఎలా తినాలి?ఎండిన నిమ్మకాయలను నేరుగా తినవచ్చు లేదా చాట్స్‌లో లేదా ఇతర వంటకాలకు జోడించడం ద్వారా తినవచ్చు. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా, మీ ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. -
బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ డైట్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..
ఎముకల ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానమైనది. వయసు పెరిగేకొద్దీ ఎముకలు సాంద్రతను కోలపోతాయి. పైగా పగుళ్లు ఏర్పడి ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. దీనికి ప్రధాన కారణం విటమిన్ లోపాలు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఎముకలను బలహీనపర్చడాన్ని వేగవంతం చేస్తాయి. తరుచుగా గాయలయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎముక సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటా వేలల్లో ఉంటుందోని గణాంకాలు చెబుతున్నాయి. అయితే వైద్యలు మాత్రం ఇండియన్ డైట్‌తోనే నివారించుకోవచ్చని చెబుతున్నారు. ఎముక ఆరోగ్యాన్నికాపాడంలో భారతీయ ఆహారాలు చాలా కీలకపాత్ర పోషిస్తాయిని చెబుతున్నారు. పైగా అవి అందుబాటులో ఉండే ఆహారాలేనని అంటున్నారు. అంతేకాదండోయ్ బలమైన ఎముకల బెస్ట్ ఇండియన్ ఫుడ్ గైడ్ ఏంటో కూడా వివరించారు. మరీ అవేంటో తెలుసుకుందామా..!.కాల్షియం అధికంగా ఉండే ఆహారాలుఎముకల బలానికి కాల్షియం అత్యంత ముఖ్యమైన ఖనిజం. పెద్దలకు రోజుకు 1000–1200 mg కాల్షియం అవసరం. భారతీయ ఆహారంలో సహజంగానే అనేక కాల్షియం అధికంగా ఉండే పదార్థాలు ఉన్నాయి.పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, పనీర్ , మజ్జిగ వంటివి కాల్షియం అద్భుతమైన వనరులు.ఆకుకూరలు: పాలకూర (పాలక్), మెంతులు (మేథి), ఉసిరి వంటి మొక్కల ఆధారిత కాల్షియంనువ్వులు: భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించే నువ్వులు (టిల్) గింజలు కాల్షియంతో సమృద్ధిగా ఉంటాయి.రాగి: సాంప్రదాయ భారతీయ ధాన్యం, రాగులు కాల్షియంతో నిండి ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి అద్భుతమైనవి.అంటే పైన చెప్పిన వాటిల్లో కనీసం ఒక గ్లాసు పాలు లేదా మజ్జిగ తీసుకున్నాచాలు కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు.మెరుగైన కాల్షియం శోషణకు విటమిన్ డికాల్షియం శోషణకు విటమిన్ డి అవసరం. సూర్యరశ్మికి గురికావడం ఉత్తమ సహజ వనరులే కానీ ఫుడ్ పరంగా ఏవంటే..గుడ్డు పచ్చసొనసాల్మన్, సార్డిన్ వంటి కొవ్వు చేపలుబలవర్థకమైన పాల ఉత్పత్తులుపుట్టగొడుగులుఇక్కడ అందరికీ ఈజీగా అందుబాటులో ఉండే సూర్యరశ్మిలో గడిపే యత్నం చేయటం వంటివి చేస్తే చాలు.ఎముక ద్రవ్యరాశికి ప్రోటీన్ప్రోటీన్లు ఎముకల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి. భారతీయ ఆహారాంలో ప్రోటీన్‌ని జోడిస్తే ఈ ఎముకల సమస్యను అధిగమించొచ్చు.పప్పుధాన్యాలు, కాయధాన్యాలు (పప్పు, రాజ్మా, శనగ, మూంగ్)పాల ఉత్పత్తులుబాదం, వాల్నట్లు, అవిసె గింజలు, విత్తనాలులీన్ మాంసాలు, గుడ్లుప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం కండరాల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడమే కాకుండా ఎముక సాంద్రతను పెంచుతుంది, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు వైద్యులుఎముక సాంద్రతకు మెగ్నీషియం, ఫాస్ఫరస్ఎముకల నిర్మాణాన్ని నిర్వహించడానికి కాల్షియంతో పాటు మెగ్నీషియం, పాస్ఫరస్ కూడా కీలకమే. ఈ ఖనిజాలు అధికంగా ఉండే భారతీయ ఆహారాలలో ఇవి ఉన్నాయి:అరటిపండ్లు, అంజూర పండ్లు, ఖర్జూరాలుగోధుమ బియ్యం, ఓట్స్ వంటి తృణధాన్యాలుజీడిపప్పు, వేరుశెనగ వంటి గింజలుగుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలుఎముకలకు హాని కలిగించే ఆహారాలు..పోషకాలు అధికంగా ఉండే ఆహారం కీలకం అయినప్పటికీ, కొన్ని ఆహారాలు ఎముకలను బలహీనపరుస్తాయని విషయం గ్రహించాలని హెచ్చరిస్తున్నారు నిపుణులుతినకూడనవి..చక్కెర పానీయాలుశీతల పానీయాలుఎముకల నుంచి కాల్షియం లీక్ అయ్యే అధిక ఉప్పుఅధిక మొత్తంలో కెఫిన్నడక, జాగింగ్, బరువు మోసే వ్యాయామాలు, సమతుల్య ఆహారం తదితరాలు జీవితాంతం ఎముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. అందువల మనకు అందుబాటులో ఉండే ఈ సాధారణ ఆహారాలతో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..) -
మెగా గుమ్మడి!
దక్షిణాఫ్రికాలోని కల్లినన్ ప్రాంత రైతు సంఘం ప్రతి ఏటా గుమ్మడికాయల పోటీ పెడుతుంటుంది. కార్నెలి బెస్టర్ అనే రైతు ఈ ఏడాది 445 కిలోల గుమ్మడి ఫస్ట్ ప్రైజ్ గెల్చుకున్నారు. ఈ అవార్డు ఆయనకు కొత్త కాదు. గత ఏడాది ఏకంగా 730 కిలోల గుమ్మడితో ఆయనే ఫస్ట్ ప్రైజ్ గెల్చుకోవటం విశేషం. ఏడాదిలో అతిపెద్ద గుమ్మడి సైజు అంత ఎందుకు తగ్గిందో తెలీదు. బహుశా భూతాపోన్నతి కావచ్చు. అదలా ఉంచితే, 2023లో ఇంకా బరువైన గుమ్మడి కాయను పండించిన వైకస్ లాంప్రెచ్ట్ విజేతగా నిలిచారు. ఆయన గుమ్మడి కాయ బరువెంతో తెలిస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది.. 890 కిలోలు! వ్యవసాయం పట్ట మక్కువను పెంపొందించే లక్ష్యం తోపాటు నిధుల సమీకరణ కోసం కల్లినన్ రైతు సంఘం ఈ వార్షిక ΄ోటీలు పెడుతుంటుంది. అట్లాంటిక్ జెయింట్ గుమ్మడితో సంకపరచిన వంగడంతో సాగు చేసిన కాయలనే ఇక్కడ పోటీలో ఉంచుతారు. పోటీ ముగిసిన తర్వాత ప్రిటోరియా నగరంలో పేదలకు ఈ గుమ్మడి కాయలను పంచుతారు! (చదవండి: దిల్ మ్యాంగో మోర్..! నోరూరించే వెరైటీ మ్యాంగ్ డెజర్ట్స్..) -
కనుమరుగవుతున్న మామిడి వెరైటీలు ఇవే..!
ప్రపంచంలో మామిడిపండ్లకు చిరునామాగా సగర్వంగా నిలిచిన భారతదేశం, అనేకరకాల ప్రాదేశిక మామిడి పండ్లను కలిగి ఉంది. వీటిలో ప్రతీ మామిడి రకం తనదైన ప్రత్యేకమైన రుచి, సువాసన, సాంస్కృతిక నేపథ్యంతో ప్రసిద్ధి చెందింది. కానీ మార్కెట్ ఆధారిత వ్యవస్థ వల్ల వాణిజ్యపరంగా మొలకెత్తిన హైబ్రిడ్ రకాల ప్రభావంతో, ఈ విలువైన దేశీ మామిడి రకాలు క్రమంగా అదృశ్యం అవుతున్నాయి. ఇప్పటికే అన్ని చోట్లా లభించడం తగ్గిపోయిన ఈ మామిడి రకాలను ఈ వేసవి టూర్ల సందర్భంగా ఎక్కడైనా దొరికితే ఆస్వాదించడం మరచిపోవద్దు. 1. కరుప్పట్టి కాయ – తమిళనాడుతమిళనాడు దక్షిణ ప్రాంతాల్లో పుట్టిన ఈ కరుప్పట్టి కాయ ప్రత్యేకత ఏమిటంటే, ఇది చక్కెర పాకం (పామ్ జాగరీ)ను తలపించే రుచిని కలిగి ఉంటుంది. ఈ మామిడి పచ్చిగా తినడానికి కూడా బాగుంటుంది. అలాగే పచ్చళ్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఆకుపచ్చ రంగు ఫైబర్‌తో నిండిన గుజ్జుతో ఇది ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.2. కన్నిమాంగా – కేరళకేరళలో కన్నిమాంగా అనే చిన్న మామిడికాయలు పచ్చడికి ప్రసిద్ధి. ‘కన్నిమాంగా‘ అంటే ‘కన్య మామిడి‘, అంటే పూర్తి పక్వతకు ముందు కోయబడే కాయలు. ఈ రకాన్ని పచ్చడి రూపంలో వాడితే, కేరళ వంటకాల మసాలా రుచులకు ఇది సరిపోతుంది. అధిక దిగుబడి కలిగిన వాణిజ్య రకాల సాగు పెరిగిన నేపథ్యంలో, ఈ మామిడి మొక్కలు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. అయితే స్థానిక రైతులు గిరిజన సంఘాలు దీన్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.3. కల్భావి మావు – కర్ణాటకకర్ణాటక తీరప్రాంతాలలో పుట్టిన కల్భావి మావు మామిడి, గులాబీ వాసన తీపి రుచితో కొత్తగా ఉంటుందనే పేరు సంపాదించింది. ఇది గోల్డెన్ యెల్లో రంగులో మధ్య పరిమాణంలో ఉంటుంది. అదనపు తీపి కలిగి ఉండడంతో నేరుగా తినడానికి మాత్రమే కాకుండా స్వీట్స్ తయారీలో కూడా వాడేవారు. ఇటీవలి వరకూ మార్కెట్లలో విరివిగా లభించిన ఈ రకం, క్రమంగా తగ్గిపోతోంది. 4. బటాషా – పశ్చిమ బెంగాల్బెంగాల్కు చెందిన బటాషా మామిడి, బాగా తీయగా ఉంటుంది. ఇది చిన్న పరిమాణంలో ఉండి, రసం నిండిన గుజ్జుతో ఉంటుంది అయితే దీని మృదువైన తొక్క ఎక్కువ దూరాలకు తరలించలేనంత సున్నితంగా ఉండటంతో, ఈ మామిడి వాణిజ్యం పెద్దగా పుంజుకోలేదు. దాంతో దీని సాగు కూడా తగ్గిపోతోంది. ప్రస్తుతం ఇది కేవలం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తోంది.5. అమ్మ చెట్టు – ఆంధ్రప్రదేశ్ఈ మామిడి రకాన్ని అందించే చెట్టుకు తెలుగులో ‘‘అమ్మ చెట్టు’’ అనే పేరు, మామిడికి కూడా అదే పేరు. పెద్దదైన పరిమాణం, ఫైబర్‌తో నిండిన గుజ్జుతో ఉన్న ఈ మామిడి చెట్లు గ్రామీణ జీవన విధానంలో భాగంగా ఉండేవి. అయితే, ఈ చెట్ల నిర్వహణ కష్టం కావడంతో, ఈ రకం సాగు తగ్గిపోయింది. ఇక ఇది కేవలం కథల్లో, జ్ఞాపకాలలో మాత్రమే మిగిలిపోనుంది. అధిక దిగుబడి, హైబ్రిడ్ రకాలపై దృష్టి పెరగడంతో దేశీ రకాల మామిడి ప్రాధాన్యత తగ్గిపోయింది. అలాగే టెంక లేని పండ్లను ఇష్టపడే ఆధునిక వినియోగదారుల అభిరుచి వల్ల, స్వాభావికంగా పెరిగే దేశీ రకాల విస్త్రుతికి అడ్డంకి ఏర్పడింది. మరోవైపు నగరీకరణ విస్తరణ వల్ల తోటలపై భౌగోళిక ఒత్తిడి పెరిగింది. యువతలో దేశీరకాల గురించి అవగాహన లేకపోవడం కూడా సాగును దెబ్బతీసింది.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... కారణాలేవైనా మనదైన మామిడి వెరైటీలను మనం కోల్పోతుండడం దురదృష్టకర పరిణామమేనని చెప్పాలి.(చదవండి: కల్తీ పుచ్చకాయను పసిగట్టొచ్చు ఇలా..!) -
జపాన్‌లో శాకాహారమా..? సలాడ్లతో సరిపెట్టుకోవాల్సిన పనిలేదు..
అందమైన దేశంలో ఒకటిగా పేరుగాంచింది జపాన్. అక్కడ నగరాలన్నీ ప్రకృతి రమణీయతతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. తప్పక పర్యటించాల్సిన దేశమే అయినా..పర్యాటకులకు ఇబ్బంది కలిగించేది ఆహారం. అందులోనూ శాకాహారులే అయితే మరింత సమస్య. అక్కడ ఏది ఆర్డర్ చేసిన అందులో తప్పనిసరిగా ఏదో ఒక నాన్‌వెజ్ ఉంటుంది. తినాలంటేనే భయం భయంగా ఉంటుంది. అందుకే అక్కడ పర్యటించే టూరిస్ట్‌లు స్టోర్స్‌లో దొరికే సలాడ్లు వంటి ఇతర పదార్థాలపై ఆధారపడతారు. ఇక అలా ఇబ్బంది పడాల్సిన పనిలేదు అంటూ జపాన్‌లో కూడా శాకాహారం దొరుకుతుందని చెబుతోంది బాలీవుడ్ నటి బర్ఖాసింగ్. ఇంతకీ జపాన్‌లో ఎక్కడ శాకాహారం లభిస్తుందంటే..జపాన్‌లో ఒసాకా, క్యోటో, టోక్యో అంతట మనకు శాకాహార భోజనం లభిస్తుందట. ఇక్కడ అందించే వంటకాల్లో చేపలు లేదా మాంసాన్ని జోడించకుండా టమోటా ఆధారిత రెసిపీలు ఎక్కువగా దొరుకుతాయట. అక్కడ పూర్తి శాఖాహారం తోకూడిన వేగన్ మెనూ పర్యాటకుల్ని ఆకర్షిస్తుందట. అందువల్ల ఎలాంటి సంకోచంల లేకుండా నచ్చిన వంటకాలన్నీ ఆస్వాదించొచ్చు అని చెబుతున్నారు నటి బర్ఖాసింగ్. చాక్లెట్ గ్యో ఐస్ క్రీం, సోబా నూడుల్స్ వంటి టేస్టీ టేస్టీ వంటకాల రుచి చూడొచ్చట. ఇక కోకో ఇచిబన్యా రెస్టారెంట్ కూరగాయలతో చేసిన కర్రీలకు ఫేమస్ అట. అక్కడ మనకు తెలియని కొంగొత్త కూరగాయల రుచులు మైమరిపిస్తాయని చెబుతోంది బర్ఖాసింగ్. అలాగే అక్కడ ఉండే చిన్న చిన్న స్టాల్స్ మెత్తటి చీజ్‌కేక్, కస్టర్డ్ నిండిన పాన్కేక్లకు పేరుగాంచినవని చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాలీవుడ్ నటి, మోడల్ బర్ఖాసింగ్ పలు సినిమాలు, టీవీ షోల్లో నటించింది. అంతేగాదు వైవిధ్యభరితమైన నటనకు ప్రసిద్ధిగాంచిన నటి బర్ఖాసింగ్. View this post on Instagram A post shared by Barkha Singh (@barkhasingh0308) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..) -
Met Gala 2025: ఆ ఐదు ఆహార పదార్థాలపై నిషేధం.. రీజన్ తెలిస్తే!
మెట్ గాలా (Met Gala) అంటే మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ (Costume Institute). ఇది అత్యంత ప్రసిద్ధమైన ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి. దీన్ని ప్రతి ఏడాది మే నెలలో న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో నిర్వహిస్తారు. దీన్ని కొత్త ఫ్యాషన్ ప్రదర్శనకు నిధులు సమకూర్చడం కోసం ప్రతి ఏటా నిర్వహిస్తారు. దీన్ని కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ వార్షిక ఫ్యాషన్ ప్రదర్శనకు సంబంధించిన వేడుకగా పేర్కొంటారు కూడా. ఈ కార్యక్రమానికి ఫ్యాషన్, సినీ, వ్యాపార, క్రీడల, రాజకీయ ప్రముఖులంతా విచ్చేస్తారు. ఈ ఏడాది మే5 సాయంత్రం ఆరు గంటలకు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లో షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, దిల్జిత్ దోసాంజ్ వంటి భారతీయ తారలు అరంగేట్రం చేయనున్నారు. దీన్ని వోగ్ ఎడిటర్-ఇన్-చీఫ్ అన్నా వింటౌర్ నిర్వహిస్తారు. ఇక ఈవెంట్లో అత్యంత ప్రసిద్ధి చెందింది పసందైన విందు మెనూ. ఈసారి ఈవెంట్లో ఎలాంటి వంటకాలు అందించనున్నారనేది వెల్లడి కాకపోయినా..ఆ ఫుడ్స్‌ని మాత్రం పూర్తిగా బ్యాన్ చేశారట. అవేంటి, ఎందుకని నిషేధించారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.అన్నా వింటౌర్ నిర్వహించే ఈ వేడుకలో మెనూలో ఆ ఫుడ్స్‌ని ఆమె ఎందుకు నిషేధించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఏడాది మెట్ గాలా 2025(Met Gala 2025) డిన్నర్ నుంచి నిషేధించిన ఆహారాలు ఇవే..1. వెల్లుల్లి2. ఉల్లిపాయ3. చివ్స్4. పార్స్లీ5. బ్రూషెట్టాఎందుకు నిషేధించారంటే..ఈ ఐదింటిని ఎందుకు బ్యాన్ చేశారో లాస్ ఏంజిల్స్ గ్రేట్ టేస్ట్ క్యాటరింగ్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ జాక్సన్ పరేడ్ వివరించారు. తాము అందించే ఆహారం సెలబ్రిటీల శ్వాసను, దంతాలను ప్రభావితం చేసేలా ఉండకూడదనే ఇలా ఆ ఐదు ఆహారాలకు చోటు ఇవ్వలేదట. అంతేగాదు ఆ ఐదు ఆహారాల వల్ల కలిగే అసౌకర్యం ఏంటో కూడా తెలిపారు. ఉల్లి, వెల్లుల్లి అంటే అలెర్జీ ఉన్నవారు చాలామంది ఉన్నారట. అలాగే పార్సీ కచ్చితంగా దంతాల్లో ఇరుక్కుని ఇబ్బంది పెడుతుందట. అందుకని దాన్ని మెనూలోంచి తొలగించారు. బ్రూషెట్టా కూడా రాత్రిపూట ఇచ్చే విందులో అసౌకర్యంగా ఉంటుందట. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ఇబ్బందిలో పెట్టేస్తుందట. కాగా, ఈ ఏడాది మెట్‌గాలా కోసం ఫుడ్ మోనూని 'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్‌తో అతిథులకు సర్వ్ చేయనున్నారు. దీన్ని అందించేది సెలబ్రిటీ చెఫ్ క్వామే ఒన్వుచి. ఈ అవకాశం తనకు లభించడం ఓ గౌరవమని అన్నారు ఒన్వుచి. న్యూయార్క్ సంస్థలో భాగం కావడం అనే తన ప్రోఫెషనల్ కల ఇన్నాళ్లకు నిజమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఓఫ్యాషన్ ప్రేమికుడిగా 'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్‌కి అనుగుణంగా వంటకాలు సిద్ధం చేసేలా చెఫ్ బృందంలో భాగం కావడం అనేది మర్చిపోలేని అనుభూతి అని అన్నారు. (చదవండి: Water Fitness: నటుడు ధర్మేంద్ర వాటర్ వర్కౌట్లు చూస్తే మతిపోవాల్సిందే..! మంచి గేమ్ ఛేంజర్..) -
మీరు తినే పనీర్.. సహజమైనదేనా?
పనీర్... శాకాహారుల హై ప్రొటీన్‌ఫుడ్! పాలక్ పనీర్.. పనీర్ టిక్కా.. పనీర్ 65.. చిల్లీ పనీర్.. పనీర్ బటర్ మసాలా.. ఇలా రకరకాల వెరైటీలతో రెస్టారెంట్లలో చవులూరిస్తూ ఉంటుంది పనీర్! చాలామంది బయట షాపుల్లో దొరికే పనీర్ తెచ్చుకుని ఇంట్లోనూ ఎన్నో రకాల వెరైటీలు ట్రై చేస్తుంటారు. మీకు తెలుసా.. లీటరు తాజా పాల (గేదె) నుంచిఎంత పనీర్ తయారుచేయవచ్చో? గరిష్ఠంగా 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు, అంతే! మరి ఇన్ని వందల వేల రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లలోఅంతంత పనీర్ ఎలా దొరుకుతోంది? అది ఆర్గానిక్ పనీర్ అంటేతాజా పాలతో తయారైనది కాదన్నట్టే కదా! అన్నట్టే ఏంటీ.. ఉన్న మాటే! - (సాక్షి, స్పెషల్ డెస్క్) మనందరికీ పాల ఉత్పత్తులైన పెరుగు, పనీర్ తెలుసు. కానీ, ప్రత్యామ్నాయ డైరీ ఉత్పత్తుల గురించి మీరు విన్నారా? ఇవి పాలతో కాకుండా సింథటిక్ పదార్థాలతో తయారవుతాయి. అనేక హోటళ్లూ, సూపర్ మార్కెట్లలో వీటి తాకిడి ఇప్పుడు ఎక్కువైపోయింది. అందుకే, పనీర్ సహా ప్రత్యామ్నాయ డైరీ ఉత్పత్తులు అన్నిటి అమ్మకాల మీద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొన్ని నిబంధనలను విధించనుంది. ఇది సహజ పనీర్...సాధారణంగా పనీర్‌ను.. పాలను కాచి అందులో నిమ్మరసమో లేదా వెనిగరో లేదా సిట్రిక్ ఆసిడో వేసి విరగ్గొడతారు. అలా వచి్చన దాన్ని ఒక గుడ్డలో వేసి.. అందులోని నీరంతా పోయేవరకు వడకడతారు. తర్వాత దాన్ని చల్లటి నీటిలో ఓ రెండు మూడు గంటల పాటు వేసి ఉంచుతారు.దాంతో అది మృదువుగా తయారువుతుంది. ఇది పాల నుంచి పనీరు తయారయ్యే ప్రక్రియ. వినియోగదారుడికి తెలియాల్సిందే ఇటీవల ప్రత్యామ్నాయ పనీర్ అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇక నుంచి ప్రతి రెస్టారెంట్.. తమ దగ్గరున్న పనీర్ ఎలాంటిదో మెనూలో స్పష్టంగా తెలియజేయాలనే నిబంధన పెట్టబోతోంది. తాను ఎలాంటి పనీర్‌ను ఆర్డర్ చేస్తున్నాడో వినియోగదారుడికి కచ్చితంగా తెలియాలని.. ఆ చాయిస్ వాళ్లకుండాలని చెబుతోంది.అంతేకాదు అమ్మకందారులు కూడా ఈ కృత్రిమ డెయిరీ ఉత్పత్తుల మీద.. పాల ఉత్పత్తుల కేటగరీలో ఈ కృత్రిమ లేదా ప్రత్యామ్నాయ పాల ఉత్పత్తులను పరిగణించరాదని స్పష్టం చేయనుంది. అంతేకాదు, వాటి మీద డెయిరీ ప్రోడక్ట్స్ అనే లేబుల్ వేయకూడదనే కఠిన నిబంధనను కూడా అమలుచేయనుంది. నిజానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ 2011 నిబంధనల ప్రకారం.. ఈ కృత్రిమ పాల ఉత్పత్తులను డెయిరీ ప్రోడక్ట్స్‌గా, మిశ్రమ పాల ఉత్పత్తులుగా పరిగణించరు. అందుకే వీటి మీద పాల ఉత్పత్తులు అని లేబుల్ వేయకూడదు. కృత్రిమ పాల ఉత్పత్తుల మీద ‘పాల ఉత్పత్తులు’అని లేబుల్ అతికించడం.. కొనుకోలుదారులను తప్పుదోవ పట్టించడమే కాదు, ఒకరకంగా మోసం చేయడం కూడా అని చెబుతున్నారు నిపుణులు. దీనికి సంబంధించి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ త్వరలోనే కొన్ని మార్గదర్శకాలను వెలువరించనుంది. ప్రత్యామ్నాయ పనీర్ ఇలా..ఈ ప్రత్యామ్నాయ పనీర్‌ను పామాయిల్‌లాంటి వెజిటబుల్ ఆయిల్స్, స్టార్చ్‌లు లాంటి వాటితో తయారుచేస్తారు. ఇది చూడటానికి అచ్చంగా సహజమైన పనీర్ లాగే కనపడుతుంది. కానీ రుచిలో కొంత తేడా ఉంటుంది. కృత్రిమంగా తయారైన ఈ పనీర్ ఆరోగ్యం మీద దు్రష్పభావాలను చూపిస్తుంది. హోటళ్లలో ఇలాంటి ప్రత్యామ్నాయ పనీర్నే వండి వడ్డిస్తున్నారని.. ఇటీవల చాలా పేరున్న హోటళ్లలో జరిగిన ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ రైడ్స్‌లో తేలింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇలా ఫిర్యాదు చేయవచ్చు ఒకవేళ ఎవరైనా కృత్రిమ పాల ఉత్పత్తులను సహజమైనవిగా లేబుల్ వేసి అమ్మడం కొనుగోలుదారుల దృష్టికి వస్తే ఎఫ్ఎస్ఎస్ఏఐ యాప్‌లో గానీ, వెబ్సైట్ ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చని చెబుతున్నారు ఎఫ్ఎస్ఎస్ఏఐ సిబ్బంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇకనుంచి ప్రతి కొనుగోలుదారుడు సూపర్మార్కెట్లలో, డెయిరీ ఫామ్స్‌లో, రెస్టరెంట్లలో.. ఇలా ఎక్కడైనా తాము కొనబోయే / ఆర్డర్ చేయబోయే డెయిరీ ప్రోడక్ట్ సహజమైనదా లేదా కృత్రిమంగా తయారైనదా అనే వివరాలు చూసుకోవచ్చు. ఆ వివరాలు లేకపోతే అడిగి మరీ ఆ వివరాలను లేబుల్ మీద.. రెస్టరెంట్లలో అయితే మెనూలో పొందుపరచాలని డిమాండ్ చేయవచ్చు. ఒకవేళ వివరాలు ఉన్నా అవి అస్పష్టంగా ఉంటే ఫిర్యాదూ చేయవచ్చు. -
వీగన్..వీగన్.. : ముద్దముద్దకీ ఆరోగ్యం, ఉల్లాసంగా, ఉత్సాహంగా!
‘ఒక వ్యక్తి మొక్కల ఆధారిత ఆహారాన్ని (plant-based food) ఎంచుకుంటే రోజుకు 1,100 గ్యాలన్ల నీటిని ఆదా చేసినట్టే. పది కేజీల కార్బన్ ఉద్గారాలను తగ్గించి భూమికి మేలు చేసినట్టే. ఒక జంతువు జీవితాన్ని కాపాడిన వారవుతారు. మీ భోజన ఎంపిక మీ ఆరోగ్యం గురించే కాదు, భూమిపైన జంతుజాలం నివసించడానికి, ఆరోగ్యకరమైన భూమి కోసం కూడా’ అంటున్నారు వీగన్ ప్రేమికులు. ‘ఉత్సాహంగా తినండి. ఉత్సాహంగా జీవించండి. ఉత్సాహంగా ఉండండి! పోషకాలతో ఉండండి, దయతో ఉండండి, ఆకుపచ్చగా ఉండండి!’ అనేది వీగన్ ప్రేమికుల మాట.మన ఆహారాల్లో శాకాహారం, మాంసాహారం గురించి తెలుసు. కొన్నాళ్లుగా వినిపిస్తున్నది వీగన్ (Vegan) ఆహారం. జంతు సంబంధిత ఆహారాలకు దూరంగా ఉంటూ మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకోవడం. వీటిలో.. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, గింజలు మొదలైనవి ఉంటాయి. ‘వీగన్ డైట్ ఎంపికలో సవాళ్లెన్నో ఉంటాయి. ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బి12 పోషకాల కోసం ఆహార ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు.. ఉడికించిన శనగలను తీసుకుంటే ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్.. వంటి ΄ోషకాలు లభిస్తాయి. శనగలను ఉడకబెట్టి, కూర లేదా సలార్ రూపంలో తయారుచేసి తీసుకోవచ్చు. సోయాబీన్స్‌లో మాంసాహారంతో సమానంగా ప్రొటీన్లు లభిస్తాయి. ఇందులోని ఐరన్, జింక్, క్యాల్షియం, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి బీపీని కంట్రోల్లో ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు మహిళల్లో మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తాయి. వేరుశనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు,ఫైబర్ లభిస్తాయి. బరువును కంట్రోల్లో ఉంచడానికి సహకరిస్తాయి. ఇదీ చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నాక్వినోవాలో ప్రొటీన్ సమృద్ధిగా లభిస్తుంది. మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బి6 వంటి ΄ోషకాలు మెండుగా ఉంటాయి. చిక్కుడు జాతికి చెందిన రాజ్మా, బ్లాక్ బీన్స్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్ బి, ఫైబర్, ప్రొటీన్లు లభించే ఈ చిక్కుళ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బాదంపప్పు, పిస్తా, అక్రోట్ వంటి నట్స్ రోజూ కొన్ని తీసుకుంటే గుండెకు మేలు చేస్తాయి. నట్స్‌లో క్యాలరీలు ఎక్కువ కాబట్టి మితంగా తీసుకోవాలి. ఇలా మొక్కల ఆధారిత గింజలు, మొలకెత్తిన విత్తనాలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. రుచికరంగా, ఆరోగ్యకరంగా జీవనశైలిని మార్చుకోవచ్చు.’– శారద, ప్లాంట్ప్రెన్యూర్, సిమీస్ వరల్డ్, హైదరాబాద్చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! -
Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?
ఓ మహిళ.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తితో.. జంతుబలి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మా ఇష్టం మాకు నచ్చింది మేం తింటాం.. అంటూ అవతలి వ్యక్తి సమాధానం ఇస్తున్నాడు. మాంసాహారం తింటాం అంటే కుదరదు.. ఎందుకు కుదరదో చెబుతాను వినండి.. అంటూ ఆమె శాకాహారం గొప్పతనం, మన సైక్లింగ్ ప్రకృతి నియమాలు ఇతర అంశాలను వివరించారు. మీరు ప్యూర్ వెజిటేరియన్‌గా మారతారా? అని హామీ తీసుకుంది. ఇంత చెప్పిన తర్వాత ఆ మనిషిలో ఆలోచన మొదలైంది. ఇంతకీ ఎవరా మహిళ.. ఆమె చేస్తున్న ప్రచారం ఏమిటి..? ఆమె పేరే విజయలక్ష్మి.. మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఓ కార్పొరేట్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ టీచర్. ప్రవృత్తి.. పది మంది గుమిగూడి ఉండే చోట శాకాహారంతో ప్రయోజనాలను వివరిస్తూ శాకాహారమే తినాలంటూ ప్రచారం చేయడం. ఎంతలా వారికి అవగాహన కల్పిస్తున్నారంటే ఆమె మాటలు విన్న తర్వాత చాలా మంది ఇక మాంసాహారం జోలికి వెళ్లకూడదని నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. – సికింద్రాబాద్ శాకాహారంలో అనుభూతిని ఆస్వాదిద్దామా..? అంటూ మొదలవుతుంది ఆమె ప్రచారం. యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం పేరుతో సోషల్ మీడియా వేదికగా ఓ పేజీ క్రియేట్ చేశారు. తనలాంటి భావజాలం ఉన్న వ్యక్తుల్ని ఆ వేదికపైకి రమ్మని పిలుపునిచ్చారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు.. అలా 200లకు చేరింది ఆ సంఖ్య. వీలున్నప్పుడల్లా పదిమంది జనం ఉండే చోట ప్రత్యక్షమవుతారు. శాఖాహారంలోని గొప్పతనాన్ని.. అది తీసుకోవడం వల్ల శరీర అవయవాల మీద పనితీరును.. ఇతర అంశాల్ని చక్కగా వివరించి మాంసాహారానికి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ మాటలు విన్న ఎవరైనా క్చతంగా ఆకుకూరలు, కూరగాయలు గొప్పతనాన్ని ‘వంట’ పట్టించుకోవడం నిజం. పక్కా ప్రణాళికతో ప్రచారం.. యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం వ్యవస్థాపకురాలైన ఎన్వీ విజయలక్ష్మి పనితీరు చాలా ఆసక్తికరం. స్వచ్ఛందంగా సేవలందించేందుకు సిద్ధమైన వలంటీర్లు ఎంతమంది అందుబాటులో ఉన్నారో తెలుసుకుంటారు. ఫలానా రోజు ఫలానా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ చిన్న పోస్టులు పెడతారు. ఆ ఏరియాలో ఉండే వలంటీర్లు.. అందుబాటులో ఉండే వారంతా సుముఖత వ్యక్తం చేస్తే వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేస్తారు. తక్కువలో తక్కువ కనీసం 50 నుం 60 మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యేలా చూసుకుంటారు. అక్కడికి వచ్చిన వారంతా బృందాలుగా విడిపోయి నాలుగైదు ప్రదేశాలకు వెళ్లి తమ సంస్థ లక్ష్యాన్ని వివరిస్తారు.మారేందుకు మీరు సిద్ధమా..? సోషల్ మీడియా వేదికగా యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరంలో చేరాలని ఉందా? అయితే అదే పేరుతో ఉన్న ఫేస్బుక్, ఇస్ట్రాగామ్ పేజీల ద్వారా గానీ.. సభ్యులుగా చేరిపోవచ్చు. ఆ మీదట వలంటీర్లుగా సేవలు అందించవచ్చు. ఆ మీదట శాకాహారం గొప్పతనాన్ని తెలుసుకొని మీరు శాకాహార ప్రియులుగా మారిపోవచ్చు. పాఠశాలలే టార్గెట్‌గా.. శాకాహారం వినియోగించాలనే ప్రచారాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలను టార్గెట్ చేసుకుని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చదువుకునే వయసు నుంచే జంతువధ చేయకూడన్న లక్ష్యాన్ని విద్యార్థుల్లో ఇనుమడింపజేయడం ద్వారా ఎక్కువ ఫలితాలు రాబట్టవచ్చన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సదస్సులు, సమావేశాలు నిర్వహించడం, పవర్‌పాయింగ్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం, కరపత్రాలు, స్టిక్కర్ల ద్వారా వీలున్న అన్ని మార్గాల్లో ప్రచారాలు కొనసాగించి శాకాహార భోజన ప్రియులను రూపొందిస్తున్నాం. పాఠశాలల్లో యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం కమిటీలు ఏర్పాటు చేయడం, పోటీలు నిర్వహిస్తూ వారికి బహుమతులు, జ్ఞాపికలు అందజేసి ప్రోత్సహిస్తున్నాం. – ఎన్వీ విజయలక్ష్మి, వ్యవస్థాపకురాలు దేశమంతా ఒకే వేదికగా.. యునైటెడ్ వెజిటేరియన్ ఫోరం అనేది ఒక తెలంగాణకు మాత్రమే కాకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరింపజేసి.. వీలైనంత ఎక్కువ మంది జనాభాను శాకాహారం వైపు తిప్పటిమే తమ ధ్యేయమని చెబుతున్నారు విజయలక్షి్మ. ఆ దిశగా విస్తృతంగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెప్పారామే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉండే తమ వాళ్ళ ద్వారా అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను ఫోకస్ చేస్తున్నారు ఈ వెజిటేరియన్ విజయక్ష్మిఆరోగ్య సూత్రాలు వివరిస్తూఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించడానికి శాకాహారం పాత్ర ఏంటో యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం ప్రతినిధులు వివరిస్తారు. ఎదుటివారు మాంసాహార ప్రియులైన వారు అడిగే ప్రశ్నలకి శాకాహార పూరితమైన సమాధానాలు ఇచ్చి వెజిటేరియన్స్‌గా మారాలంటూ రిక్వెస్ట్ చేస్తారు. ఒక నెల రోజులు టైం తీసుకోండి.. పప్పు దినుసుల మీద దృష్టి పెట్టండి ఆకుకూరల్లో బలమైన పోషకాల కోసం మీరే తెలుసుకోండి.. మీరు తీసుకునే మాంసాహారాన్ని మేము చెప్పే శాకాహారాన్ని బేరీజు వేసుకోండి అంటూ జనం మెదడుల్లోకి శాఖాహార గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చేయడమేంటి చాలామందిని మార్చి చూపించారు కూడా.. -
అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ భార్య, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల ఒక ఆసక్తికరమైన వీడియోను ఎక్స్ (ట్విటర్) లో షేర్ చేశారు. తన అత్తగారు మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖతో కలిసి కొత్త అవకాయ పచ్చడి పట్టారు. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. వేసవి కాలం వచ్చిందంటే.. ఆవకాయ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అత్తా కోడళ్లు ఆవకాయ బిజినెస్ బిజీగా అయిపోయారు. అందులో భాగంగా మామిడి కాయలతో కొత్త ఆవకాయ పచ్చడి కలిపారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. చక్కగా అవకాయ కలిపి జాడిలో పెట్టి, దానిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. దీంతో ఈ ఏడాది వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా సాగిపోవాలని కోరుకున్నట్టున్నారు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇంకా స్వామి కార్యం స్వకార్యం రెండూ ఒక్కసారే , తెలివైన కోడలు ఉపాసన, ఇది అత్తా కోడళ్ళ అనుబంధం, అది ఆవకాయ పచ్చడైనా..మన సాంప్రదాయం అయినా అని ఒకరు, అత్తమ్మ వంటలు ప్రమోట్ చేస్తున్న కోడలు అంటూ మరో యూజర్ కామెంట్ చేయడం విశేషం.Surekha Garu aka my dearest Athamma - has truly rocked it with this season’s Avakaya Pachadi. For her, food is not just about nutrition — it’s a way of preserving culture & heritage.Order - https://t.co/WhQ2JmjsaG pic.twitter.com/l1rDYZRzyr— Upasana Konidela (@upasanakonidela) May 1, 2025 ‘‘సురేఖ గారు నా ప్రియమైన అత్తమ్మ - ఈ సీజన్ కొత్త ఆవకాయ పచ్చడితో మమ్మల్ని ఆకట్టుకున్నారు. ఆమెకు, ఫుడ్ అంటే పోషకాహారం మాత్రమే కాదు , సంస్కృతి & వారసత్వాన్ని కాపాడుకునే వేడుక అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. అత్తమ్మాస్ కిచెన్ పేరిట ఆహార ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
'కిలిమంజారో డైట్' అంటే..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
చాలా రకాల డైట్లు, వాటి ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. అయితే ఆ డైట్లలో కొన్ని మంచివైతే..మరికొన్ని మన శారీరక ధర్మానుసారం వైద్యులను సంప్రదించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటన్నింటిని తలదన్నేలా.. సరికొత్త డైట్ ట్రెండ్ అవుతుంది. దీర్ఘాయువుని అందించే సూపర్ డైట్‌గా శాస్త్రవేత్తలచే కితాబులందించుకుంది. అదీగాక ఈ డైట్‌తో మంచి ఆర్యోగం సొంతం అని హామీ కూడా ఇచ్చేస్తున్నారు. అసలు ఏంటీ డైట్..? అదెలా ఉంటుంది తదితరాల గురించి సవివరంగా చూద్దాం.!.ఐకానిక్ పర్వతం 'కిలిమంజారో' పేరుతో ఉన్న ఈ డైట్ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపోయాలే సత్ఫలితాలనిస్తోందట. డచ్ పరిశోధకులు అధ్యయనం చేసి మరీ నమ్మకంగా చెబుతున్నారు. పాశ్చాత్యా ఆహార విధానం కంటే.. ఈ డైట్‌తోనే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిపారు. అందుకోసం టాంజానియా(Tanzania)లోని ప్రజలు, ముఖ్యంగా అగ్ని పర్వతాలకు సమీపంలో నివశించే ప్రజలపై పరిశోధనలు చేయగా.. వివిధ ప్రాంతాల్లో ఉండే మానవాళి కంటే ఎంతో ఆరోగ్యంగా ఉండటం గమినించారు. వాళ్లంతా కిలిమంజారో డైట్‌ని అనుసరిస్తారట. పరిశోధకులు సగటున 25 సంవత్సరాల వయస్సు గల దాదాపు 77 మంది ఆరోగ్యకరమైన టాంజానియన్ పురుషులపై అధ్యయనం చేశారు. వారిలో 23 మంది కిలిమంజారో ఆహారాన్ని అనుసరించగా, 22 మంది ప్రాసెస్ చేసిన ఆహారం అందించారు. అయితే కిలిమంజారో డైట్ తీసుకున్నావారిలో వాపు తగ్గుదల, మెరుగైనా రోగనిరోధక పనితీరు ఉండటాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. అక్కడితో ఆపకుండా వారాలు తరబడి ప్రయోగాలు కొనసాగించగా..సానుకూల ప్రయోజనాల తోపాటు, దీర్ఘాయువుకి తోడ్పడుతుందని తెలుసుకున్నారు. కలిగే లాభాలు..అనేక దీర్ఘకాలిక పరిస్థితులకు వాపులే మూలం. వాటిని ఈ డైట్ నివారిస్తుంది. జీవక్రియను మెరుగ్గా ఉంచుతుందిగుండె జబ్బులు, మధుమేహం, వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది. చివరగా ఇది దీర్ఘకాలిక ఆరోగ్యప్రయోజనాలతో కూడిన ఆహారం.ఇక టాంజానియా అధికారికంగా బ్లూ జోన్‌గా గుర్తింపు సైతం దక్కించుకుంది. ఇక్కడ బ్లూజోన్ అంటే ఆ ప్రాంతంలోని ప్రజలు సగటున ఎక్కువ కాలం జీవించడం, మంచి ఆరోగ్యపు అలవాట్లు కలిగి ఉంతే..ఆ దేశానికి ఈ గుర్తింపు ఇస్తారు. అంతేగాదు ఇక్కడ సగటు ఆయుర్దాయమే 67 సంవత్సరాలంటే..ప్రజలంతో ఎంత మంచి ఆహారపు అలవాట్లు అనుసరిస్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆ డైట్లో ఏం ఉటాయంటే..కిలిమంజారో ఆహారంలో ఓక్రా, అరటిపండ్లు, కిడ్నీ బీన్స్, మొక్కజొన్న వంటి సరళమైన ఆహారాలే ఉంటాయట. ప్రాసెస్ ఫుడ్‌కి చోటుండదు. మెక్కల ఆధారిత ఆహారాలు, కూరగాయలు, పండ్లు తదితరాలు.ప్రోబయోటిక్‌లను కలిగి ఉన్న సౌర్‌క్రాట్, పులియబెట్టిన ఆహారాలు కూడా ఉంటాయి. మెడిటేరియన్ డైట్‌తో సమానంగా సత్ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలం ఆరోగ్యవంతంగా జీవించాలనుకునే వారికి ఇది బెస్ట్ డైట్ అని అన్నారు. రానున్న కాలంలో కిలిమంజారో ఆహారం దీర్ఘాయువుకు సీక్రెట్‌గా ఉంటుందని అన్నారు నిపుణులు. అలాగే ఈ డైట్లో తీసుకునే ఆహారాలు అకాల మరణాలను చాలా వరకు నివారిస్తాయని నమ్మకంగా చెప్పారు పరిశోధకులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: రన్నింగ్ రేసులో బామ్మ వరల్డ్ రికార్డు ..! ఆమె ఫిట్నెస్కి శాస్త్రవేత్తలు సైతం ఫిదా..) -
తినదగిన 'రోబోటిక్ కేక్'ను చూశారా?
ఎన్నో రకాల కేక్‌లు చూసుంటారు. కానీ ఇలాంటి కేక్‌ని మాత్రం చూసుండరు. అదికూడా సాంకేతికతను, సైన్సుని మిళితం చేసేలా కేక్‌ని రూపొందించారు. అయితే దీనిని భవిష్యత్తులో ఒక పర్పస్ కోసమే తయారు చేశారట. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పేస్ట్రీ చెఫ్‌లు కలిసి ఎంతో శ్రమించి తయారు చేశారు. మరిదాన్ని వేటితో తయారు చేశారో సవివరంగా చూద్దామా..!. వినూత్నంగా తయారు చేసిన కేకులు ఇటర్నెట్లో పెను తుఫాను సృష్టిస్తున్నాయి. అయితే ఈ 'రోబోటిక్ కేక్' మాత్రం అందుకోసం చేసింది మాత్రం కాదు. దీన్ని తినదగిన సాంకేతికతలో పురోగతికి చిహ్నంగా తయారుచేశారు. ఈయూ నిధులతో కూడిన రోబోఫుడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించారు. దీన్ని ఓ వెడ్డింగ్ కేక్ మాదిరిగా తయారు చేశారు. స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లౌసాన్ (EPFL), ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) శాస్త్రవేత్తలు, అలాగే లౌసాన్ స్కూల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (EHL) పాక నిపుణులు కలిసి తయరు చేశారు. ఈ నెల ఏప్రిల్ మధ్యలో ఒసాకాలో జరిగిన ఎక్స్పో 2025లో దీనిని ప్రదర్శించారు. ఈ "రోబోకేక్" అత్యంత వినూత్న భాగాలలో ఒకటి తినదగిన రీఛార్జబుల్ బ్యాటరీలు. వీటిని B2, క్వెర్సెటిన్, యాక్టివేటెడ్ కార్బన్, చాక్లెట్‌తో తయారు చేశారు. కేక్‌పై LED కొవ్వొత్తులను వెలిగించడానికి వాటిని ఉపయోగించారు. ప్రముఖ డిజైనర్ మారియో కైరోని సమన్వయంతో IIT పరిశోధకులు ఈ బ్యాటరీలను రూపొందించారు. అలాగే ఈ కేక్‌పై రెండు పూర్తిగా తినదగిన రోబోటిక్ టెడ్డీ బేర్లు ఉంచారు. వాటిని తయారు చేసేందుకు జెలటిన్, సిరప్, ఫుడ్ కలర్స్‌ని ఉపయోగించారు. అంతర్గత వాయు వ్యవస్థ ద్వారా యానిమేట్ చేయబడతాయి. ఇవి ప్రత్యేక మార్గాల ద్వారా గాలిని ఇంజెక్ట్ చేసినప్పుడు, వాటి తలలు, చేతులు కదులుతాయి కూడా. అలాగే రుచికి ఇవి దానిమ్మ గమ్మీల టేస్ట్‌ని కలిగి ఉంటాయి. ఎందుకోసం ఇలా..రోబోటిక్స్ ,ఆహారం రెండూ వేర్వేరు ప్రపంచాలు. అయితే, వాటిని ఇలా విలీనం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ తినదగిన రోబోట్లను అంతరించిపోతున్న ప్రాంతాలకు ఆహారాన్ని అందించడానికి, మింగడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకు లేదా జంతువులకు వినూత్న మార్గాల్లో మందులను అందింవచ్చట. పైగా తినగలిగే సెన్సార్లను ఉపయోగించి ఆహారాన్ని దాని తాజాదనాన్ని కూడా పర్యవేక్షించొచ్చట. చివరగా ఈ రోబోటిక్స్ భాగాలు తినడానికి సురక్షితంగా ఉన్నాయని, మంచి రుచిని కలిగి ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. రానున్న కాలంలో ఇక కేకులు ఇలానే ఉంటాయేమో కాబోలు. (చదవండి: Free AI healthcare revolution: మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..!) -
చింత చిగురా మజాకా.. కాస్త దట్టిస్తే చాలు ఆహా..!
వేసవి కాలం వచ్చిందంటే చిటారు కొమ్మన కొంచెం పచ్చగా, కొంచెం ఎర్రగా మెరుస్తూ ఊరిస్తూ ఉంటుంది. వగరుగా, వగరుగా, నోటికి పుల్లగా, వెజ్ అయినా నాన్‌వెజ్ అయినా దీన్ని కాస్త దట్టించామంటే అద్భుతమైన టేస్ట్.. ఆహా ఏమి రుచి అంటూ లొట్ట లేసుకుంటూ తినేయాల్సిందే. ఇంతకీ ఏమిటది. అదేనండీ...తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోయే చింత చిగురు. అందుకే చింత చిగురు ఉంటే.. ఆరోగ్యంపై చింత అవసరం లేదు అంటారు పెద్దలు. మరి చింతచిగురుతో లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.వేసవి కాలం వచ్చిందంటే.. దీనికి చాలా డిమాండ్ ఎక్కువ. చాలాసార్లు మటన్ ధరతో పోటీ పడుతూ అత్యంత ఖరీదైన కూరల్లో ఒకటిగా నిలుస్తుంది. చింత చిగురు, రుచి, లభించేపలు పోషకాహారాలు మెండుగా ఉండటంతో అధిక ధర పలుకుతున్నా దీనికి డిమాండ్ బాగుంది. సాధారణంగాచింత చిగురును పప్పుగా, కూరగా , పచ్చడి రూపంలో ఎక్కువగా ఆరగిస్తారు. కానీ చింత చిగురు, రొయ్యలు, చేపల కాంబినేషనే రుచే వేరు. చిగురుతో చేప, రొయ్య, కోడి కూర చింతచిరుగు దట్టిస్తే ఆహార ప్రియులకు పండగే.పోషకాల గని చింత చిగురులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.06 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం, 140 మిల్లీగ్రాముల పాస్ఫరస్, 26 మిల్లీగ్రాముల మెగ్నీషియం, విటమిన్ ‘సి’ 3 మిల్లీ గ్రాములు ఉంటాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చింత చిగురుతో అనేక ప్రయోజనాలు ఉన్నా యని ప్రకటించింది. చింత చిగురుతో ఆరోగ్య ప్రయోజనాలు వేసవికాలంలో చింత చిగురు తినడం చెమటకూడా ఎక్కువ పట్టదట. వేసవిలో వేధించే చెమట పొక్కులనుంచి ఉపశమనం లభిస్తుంది. చింత చిగురులోని ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్టరాల్‌ను తగ్గించి, మంచి కొలెస్టరాల్‌ను పెంచుతాయి. శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. యాంటీ ఇన్ఫల్మేటరీ గుణాలు ఉన్నాయి. చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, నోటి పూత తగ్గుతాయి. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుందిమలబద్ధకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ నివారణకు ఉపయోగపడుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని తగ్గిస్తుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు ఔషధంగా పనిచేస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ఎముకుల దృఢత్వం, థైరాయిడ్ నివారణకు దోహదపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కీళ్ల వాపుల నివారణ, మలేరియా నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. తల్లిపాలను మెరుగుపరుస్తుంది. -
నోరూరించే మామిడి పండ్లతో బిర్యానీ, బొబ్బట్టు చేసేద్దాం ఇలా..!
వేసవి వచ్చిందంటే మామిడి సీజన్ మొదలైనట్లే. నోరూరించే పుల్లటి, తియ్యటి మామిడి రుచులను కాస్త ప్రత్యేకమైన వంటల్లో ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దామా?మామిడి బిర్యానీకావలసినవి: బాస్మతి బియ్యం – ఒక కప్పు; పచ్చి మామిడికాయ – 1 (ముక్కలుగా తరిగినది); పచ్చిమిర్చి – 3 (చిన్నగా తరిగినది); నువ్వులు – ఒక టీ స్పూన్; వేరుశెనగలు – 4 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము – అర కప్పు; బెల్లం తురుము – ఒక టీ స్పూన్; నూనె – సరిపడా; ఆవాలు, శనగపప్పు, మినపప్పు – ఒక టీస్పూన్ చొప్పున; కరివేపాకు, ఇంగువ, పసుపు – కొద్దికొద్దిగా; ఉప్పు – తగినంత; నీరు – 2.5 కప్పులు)తయారీ: ముందుగా బియ్యం కడిగి 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత కుకర్‌లో బియ్యం, నీళ్లు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈలోపు ఒక మిక్సీ బౌల్లో తరిగిన మామిడికాయ ముక్కలు, నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వేరుశెనగలు, కొబ్బరి తురుము, అభిరుచిని బట్టి బెల్లం తురుము వేసుకుని, కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. మందపాటి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని, అందులో మిగిలిన వేరుశెనగలు వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఇంగువ, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, గరిటెతో తిప్పుతూ ఉండాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో మామిడి–కొబ్బరి పేస్ట్ వేసుకుని సుమారు 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఉడికించిన అన్నం వేసి గరిటెతో బాగా కలిపి, మూతపెట్టి, చిన్న మంట మీద మగ్గనివ్వాలి. రైస్ ఉడికిపోతే మామిడికాయ బిర్యానీ సిద్ధమైనట్లే. నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని, వేయించిన పాపడ్లు, చిప్స్, పెరుగు ఇలా వేటితోనైనా సర్వ్ చేసుకోవచ్చు.మామిడి బొబ్బట్లుకావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు; మామిడిపండు గుజ్జు – ఒక కప్పు (బాగా పండి, తియ్యగా ఉన్నది); కొబ్బరి తురుము – పావు కప్పు; బెల్లం తురుము – పావు కప్పు (మామిడి తీపిని బట్టి ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు); యాలకుల పొడి – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; నెయ్యి – సరిపడా; నీరు – కొన్ని;తయారీఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండిని ఉండలు లేకుండా కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ మెత్తని చపాతీ పిండిలా కలిపి, 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో 2 టేబుల్స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని కొబ్బరి తురుము వేయించి, బెల్లం తురుము వేసి కలపాలి. బెల్లం కరిగిన వెంటనే మామిడిపండు గుజ్జు వేసుకుని తిప్పుతూ ఉండాలి. చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. ఇది దగ్గరగా హల్వాలా కాగానే, యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరోవైపు గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పూరీల్లా ఒత్తుకుని, మధ్యలో మామిడి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఉంచి చేత్తో బొబ్బట్లలా చేసుకోవాలి. వాటిని నేతిలో వేయించుకుంటే సరిపోతుంది. (చదవండి: 'టీ లైఫ్'..! మహిళలను ఆంట్రప్రెన్యూర్స్‌గా, ఇండస్ట్రియలిస్ట్‌గా..) -
నార్త్ టు సౌత్ నగరానికి క్యూ కడుతున్న నార్త్ ఫుడ్ బ్రాండ్స్
సాక్షి, సిటీబ్యూరో: విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆహార రుచులు ఆదరణ పొందటం విధితమే. ఈ మధ్య కాలంలో నగరం వేదికగా నార్త్ డిషెస్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో నగరంలో నార్త్ రెస్టారెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగానే నార్త్ ఇండియన్ ఫుడ్‌కు ప్రసిద్ధి చెందిన లజీజ్ అఫేర్ నగరానికి విచ్చేసింది. ఢిల్లీ వేదికగా ప్రసిద్ధి చెందిన లజీజ్ అఫేర్ దక్షిణాదిలో మొదటిసారిగా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–45లో ఆవిష్కరించడం ఇక్కడి ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ అని ఫుడ్ బ్లాగర్స్ చెబుతున్నారు.స్మోక్ తందూరి కబాబ్‌లు మొదలు మటన్ షికంపురి కబాబ్, పత్తర్ కా గోష్ట్ వంటి వంటకాలు ఉత్తరాది లాజీజ్ అఫైర్ ప్రత్యేకత. వీటితో పాటు షాహి దమ్ కా ఆలూ, భట్టి కా పనీర్, షాదీ కా లాల్ చికెన్, దాల్ లాజీజ్, కేసర్ ఫిర్ని వంటి రుచులను నగరవాసులకు చేరువ చేయడానికి జూబ్లీహిల్స్‌లో లజీజ్ అఫేర్ను ప్రారంభించినట్లు ఇన్నాటో హాస్పిటాలిటీ డైరెక్టర్ యాష్ త్రివేది తెలిపారు. ప్రత్యేకించి నార్ట్ స్టైల్ హైదరాబాదీ దమ్ బిర్యానీ మరోసారి నగరవాసులకు రుచి చూపించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికిసుగంధ ద్రవ్యాల సమ్మిళితంతో సాంస్కృతిక వంటకాలు, ఉత్తరాది పాకశాస్త్ర నైపుణ్యాలతో వడ్డించిన పసందైన రుచులు హైదరాబాదీల మనసు దోచేస్తాయన్నారు. అనాది ప్రపంచ స్థాయి వంటకాలకు నగరం వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ప్రజలు వినూత్న రుచులను ఆస్వాదించే లక్షణమే ఈ ఆహార వైవిధ్యానికి కారణం. ఈ ప్రయాణంలో లజీజ్ అఫేర్కు స్పందన వస్తుండటం తమ ప్రయత్నానికి భరోసా లభించిందని సహా డైరెక్టర్ కుష్ త్రివేది వివరించారు. -
బెండకాయ వడలు,జిగురు లేకుండా, క్రిస్పీగా ఫ్రై ట్రై చేశారా?
బెండకాయలు(lady Finger) తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ ఉంచుతుంది. గుండెను ఫిట్‌గా ఉంచుతుంది. అంతేనా బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని పెద్దలు అంటుంటారు. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు చెబుతున్నారు. బెండలోని ఫోలేట్లు అనేక రకాల కేన్సర్లను అడ్డుకుంటాయట. బెండకాయతో చేసుకునే వంటకాలను ఇపుడు చూద్దామా! బెండకాయల్లో జిగురు ఎక్కువగా ఉంటే, కొద్దిగా నిమ్మరసం వేసి ఆ జిగురుని పోగొట్టొచ్చు. అభిరుచిని బట్టి వెనిగర్ కూడా వాడుకోవచ్చు. అలాగే వాడిపోయిన బెండకాయలను తిరిగి తాజాగా మార్చడానికి, ఐస్ క్యూబ్స్ వేసిన చల్లటి నీటిలో వాటిని 10 నిమిషాల పాటు ఉంచాలి. వంట చేసేటప్పుడు బెండకాయలనుమరీ ఎక్కువసేపు ఉడికించకూడదు, అలా చేస్తే అవి బాగా మెత్తగా అయిపోతాయి. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ బర్త్‌డే బాష్, ఇదే హైలైట్!బెండకాయ ఫ్రైలేత బెండకాయ శుభ్రంగా కడిగి కిచెన్ టవల్ తో శుభ్రం చేసి, పొడిగా తుడుచుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా గుండ్రంగా కోసి పక్కన పెట్టుకోవాలి. కోసే తడి లేకుండా ఉండాలి.బాండ్లీ పెట్టుకొని ఆవాలు చిటపటలాడించి, శనగపప్పు మినపప్పు , ఎండుమిర్చి, ఎండు ఎర్ర మిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి సన్న మంట మీద వేగనివ్వాలి. ఇవి కూడా వేగాక తరిగిన బెండకాయ ముక్కలు వేసి, పాన్ మీద మూతపెట్టకుండా తక్కువ మంట మీద వేయించుకోవాలి. మధ్య మధ్యలో ముక్క విరిగిపోకుండా కలుపుకోవాలి. ఆ తరువాత కొద్దిగా కొబ్బరిపొడి (ఆప్షనల్) తగినంత ఉప్పు, కారం, పసుపు చల్లి మరికొంచెం వేగనిచ్చిదింపేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే మంచి రుచి వస్తుంది. వేడి వేడి అన్నంలోగానీ, సాంబారు, రసంతో కానీ నంజుకొని తినవచ్చు. చపాతీ లేదా సాదా పరాఠాతో కూడా లాగించొచ్చు. బెండకాయ వడలుకావలసినవి: బెండకాయలు– 5 (మీడియం సైజ్, చిన్నగా తరగాలి), శనగపప్పు– ఒక కప్పు (15 నిమిషాలు నీళ్లల్లో నానబెట్టుకోవాలి), దాల్చినచెక్క– 2 (చిన్న ముక్కలు), వెల్లుల్లి– 5, జీలకర్ర– అర టీ స్పూన్, ఎండుమిర్చి– 4, ఉల్లిపాయ– 1 (చిన్నగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి– 2 (చిన్నగా తరగాలి), ఉప్పు– తగినంత, నూనె– సరిపడాతయారీ: ముందుగా మిక్సీ బౌల్లో దాల్చినచెక్క ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే నానబెట్టిన శనగపప్పు వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఒక బౌల్ తీసుకుని, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా కలిపి, దానిలో శనగపప్పు మిశ్రమం వేసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి, వడల్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని సాస్‌తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. -
తగ్గినా.. పెరిగినా.. అనారోగ్యమే..
వస్తువుల్ని తూకమేసి అమ్మడం తెలిసిందే.. కానీ కొలత వేసి తినడం ఇప్పుడు సిటీజనులు అలవాటు చేసుకుంటున్నారు. సుషు్టగా తినడానికి బోలెడన్ని అవకాశాలున్నా వాటిని సరిగ్గా జీరి్ణంచుకునేందుకు తగిన శారీరక శ్రమ లేని నేపథ్యంలో నగరవాసుల ‘పొట్ట’తిప్పలు కొత్త దారి పట్టాయి. అవసరాన్ని మించిన ఆహారం ఆరోగ్యానికి చేటు అని గుర్తిస్తూ.. తింటున్న ఆహారాన్ని కొలిచే పనిలో పడ్డారు. వీరికి నగరంలో చెఫ్‌లు, న్యూట్రిషనిస్ట్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన తరగతులు ఉపకరిస్తున్నాయి. ఎంత వరకూ యాప్్ట? పలు యాప్స్ సిటీజనుల ఆహారపు అలవాట్లను పర్యవేక్షిస్తున్నాయి. తింటున్న ఆహారం ద్వారా వారికి అందుతున్న కేలరీలను అవి ఖర్చవుతున్న తీరూ చెబుతున్నాయి. అయితే కొన్ని యాప్స్ అమెరికన్/విదేశాల ఫుడ్ వాల్యూస్‌తో తయారైనవి కాబట్టి మనకి అవి పూర్తిగా కరెక్టా కాదా? అనేది ఖచి్చతంగా చెప్పలేమని న్యూట్రిషనిస్ట్‌లు అంటున్నారు. మెనూలోనూ సమాచారం.. నగరంలోని పలు స్టార్ హోటల్స్, టాప్‌క్లాస్ రెస్టారెంట్లు తమ వంటకాల మెనూలోనే కేలరీల సమాచారాన్ని కూడా పొందుపరుస్తున్నాయి. రెస్టారెంట్స్‌లో తినడం అనే అలవాటు నగరాల్లో పెరిగిపోయిన నేపథ్యంలో 2022లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ(ఎఫ్ఎస్ఎస్ఎఐ) రెస్టారెంట్లు తమ మెనూలోని వంటకాలు అందించే కేలరీల గణనను తప్పనిసరిగా పేర్కొనాలని ఆదేశించింది. దాంతో పలు స్టార్ హోటల్స్ ఈ ఆదేశాలను పాటిస్తుండటం వల్ల నగరవాసులకు తాము తీసుకుంటున్న ఆహారం అందించే కేలరీలపై అవగాహన ఏర్పడుతోంది. కేలరీస్.. కేర్‌ఫుల్ ప్లీజ్.. అధిక కేలరీల వల్ల ఊబకాయం, డయాబెటిస్, కేన్సర్ తదితర వ్యాధులకు దారితీస్తుంది. తగినంత కేలరీలు పొందకపోవడం పోషకాహార లోపం, అలసట, కండరాల నష్టం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. అంటువ్యాధులు, ఆందోళన ఏకాగ్రత లోపం పెంచుతుంది. అధిక కేలరీల భారం లేకుండా కీలకమైన పోషకాలను అందించే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు తృణధాన్యాలు వంటి పూర్తి, ప్రాసెస్ చేయని ఆహారాలను తీసుకోవాలి. తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఆహారాన్ని ప్రోత్సహించడానికి చిన్న ప్లేట్లు గిన్నెలను ఉపయోగించడం ద్వారా అతిగా తినడం తగ్గించాలి. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ సాధారణంగా పోషకాలు లేనివిగా, అధిక కేలరీలు కలిగి ఉంటాయి. అటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాలను ఎంచుకోవాలి. ప్రతి భోజనం నిదానంగా చేయాలి.. నెమ్మదిగా నమలాలి, ప్రతి బైట్‌ను ఆస్వాదించడానికి పరధ్యానాన్ని వదలాలి. రెగ్యులర్ శారీరక శ్రమ శక్తిని ఖర్చు చేయడం ద్వారా కేలరీలను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల మితమైన–తీవ్రతతో వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.రుచికన్నా మన శరీరానికి కలిగే లాభం మిన్న అనే ఆరోగ్య స్పృహ నగరవాసుల్లో బాగా పెరిగిందని నగరానికి చెందిన చెఫ్ కుమార్ అంటున్నారు. గతంలో అత్యంత రుచికరమైన వంటలు ఎలా చేయాలో అడిగిన మహిళలు ఇప్పుడు పోషక విలువలతో కూడిన ఆహారం గురించి అడుగుతున్నారని చెప్పారు. తరచూ తాము నిర్వహిస్తున్న స్మార్ట్ స్నాకింగ్ సెషన్స్‌లో ఒక్కోసారి ఒక్కో దినుసుతో ఆరోగ్యకరమైన వంటలు ఎలా చేయాలో నేర్పుతున్నామని, ఈ క్లాసెస్‌కి ఆదరణ బాగుందన్నారు. అవగాహన తరగతులూ షురూ.. ‘బాదం పప్పులు రోజువారీగా ఆహారంలో తీసుకోవడం మంచిది. కేవలం 4 పప్పులు తీసుకుంటే 29గ్రాముల ప్రొటీన్, 15 గ్రాముల కార్బొహైడ్రేట్స్, 322 మి.గ్రా కాల్షియం, 987 మి.గ్రా పొటాíÙయం, 322 మి.గ్రా కాల్షియం, 16.2 మి.గ్రా పీచు పదార్థాలు, 460 మి.గ్రా సోడియం.. వగైరాలు లభిస్తాయి’.. శ్రీనగర్‌కాలనీలో తన కుమార్తెకు వివరంగా చెబుతున్న మధ్యవయస్కురాలైన సుగుణ ఇటీవల తాజ్ డెక్కన్ హోటల్లో ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోరి్నయా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరవడం ద్వారా ఇలాంటి విషయాలు తెలుసుకోగలిగారు. ఇదేవిధంగా నగరానికి చెందిన మరి కొందరు గృహిణులు సైతం పోషకాహారంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఆచి తూచి.. ఆలోచించి..ఆహారం మీద సిటిజనుల్లో అవగాహన పెరగడం మంచి పరిణామమే. కానీ ఇంకా చాలా విషయాల్లో సరిపడా లేదనే చెప్పాలి. ఉదాహరణకు టీలు, కాఫీలు తాగితే ఏమీ కాదనుకుంటారు. కానీ టీ లేదా కాఫీ కూడా రోజుకి 2 కప్పులు మించకూడదు. దానిలో ఉండే పంచదార, పాలు కేలరీలను పెద్ద సంఖ్యలోనే జమ చేస్తాయి. అలాగే ఆల్కహాల్ తాగితే ద్రవమే కదా కేలరీలు రావనుకుంటారు. కానీ 1ఎం.ఎల్ఆల్కహాల్తో 7 కేలరీలు వస్తాయి. దానికి తోడు మంచింగ్ పేరుతో స్నాక్స్ అవీ జత చేస్తే మరింత హాని కలుగుతుంది. ఒకటే ఆహార పదార్థం ఇంట్లో వండిన దానికి బయట కొన్న దానికి కేలరీల్లో చాలా తేడా ఉంటుంది. బయట వండేవారు రుచి కోసం కలిపే నూనెలు, ఉప్పులు, దినుసుల వల్ల ఆ తేడా వస్తుంది. కూల్ డ్రింక్స్ కూడా అధికంగా కేలరీలను అందిస్తాయి. సగటున ఒక వ్యక్తి 1800 నుంచి 2200 వరకూ కేలరీలను తీసుకోవచ్చు. అయితే శారీరక శ్రమ, చేసే పని బట్టి ఇందులో కొద్దిగా మార్పు చేర్పులు ఉంటాయి. జాగ్రత్త పడినా బరువు పెరుగుతున్నామంటే మనం పాటిస్తున్న, అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లలో లోపం ఉన్నట్లే భావించి తగిన వైద్య సలహా తీసుకోవాలి. – డా.జానకి, న్యూట్రిషనిస్ట్ -
షారూక్ ఖాన్ భార్య హోటల్లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందన
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ రెస్టారెంట్ బిజినెస్‌లో ఉన్నారు. అంతేకాదుఇంటీరియర్ డిజైనర్, చిత్ర నిర్మాత ,వ్యవస్థాపకురాలిగా తన కంటూ ప్రత్యేకమైన పేరు ఫ్రఖ్యాతులు సంపాదించుకున్న సెలబ్రిటీ మహిళ. ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనర్‌గా ఆమెకు అనేకమంది సెలబ్రిటీ కష్టమర్లు ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ,అంతర్జాతీయ ప్రముఖుల క్లయింట్లకు సేవలు అందించే లగ్జరీ ఇంటీరియర్ డిజైన్ స్టోర్ గౌరీ ఖాన్ డిజైన్స్‌ను ముంబైలో నడుపుతోంది.అలాగే ఇటీవల టోరీ పేరుతో ముంబైలో ఒక హై-ఎండ్ రెస్టారెంట్ లగ్జరీ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. తాజాగా ఈ హోటల్ వివాదంలో ఇరుక్కుంది.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ , యూట్యూబర్, సార్థక్ సచ్‌దేవా గౌరీ ఖాన్ టోరీ ఫుడ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇక్కడ 'నకిలీ' పనీర్ వడ్డిస్తున్నారంటూ ఒక వీడియో చేశాడు. దీంతో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఇదీ చదవండి : రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు తరచుగా సెలబ్రిటీలు నడిపే రెస్టారెంట్లను సందర్శించి, వాటి నుండి సమీక్షలను పంచుకుంటూ ఉంటారు. ఇలాంటి వీడియోలు సాదారణంగా ప్రజాదరణ పొందుతాయి. అలాగే సదరు హోటల్ ఖ్యాతిని పెంచుకోవడానికి కూడా దోహదపడతాయి. కానీ ఈ విషయంలో మాత్రం గౌరీ ఖాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. గౌరీ ఖాన్ఖు చెందిన లగ్జరీ హోటల్ టోరీ నకిలీ పనీర్ (కాటేజ్ చీజ్)ను అందిస్తుందని, ఇది కల్తీకి గుర్తు అని తన వీడియోలో పేర్కొన్నాడు సార్థక్ సచ్‌దేవా. తన వీడియోలో టోరీలో వడ్డించే పనీర్ ముక్కపై అయోడిన్ టింక్చర్ పరీక్ష కూడా చేసాడు. ఇది స్టార్చ్ స్థాయిని గుర్తించడానికి ఉపయోగిస్తారట. , అయోడిన్ వేయగానే పనీర్ ముక్క రంగు నలుపు నీలం రంగులోకి మారిపోయింది. దీంతో తాను షాక్ అయ్యానంటూ సార్థక్ సచ్‌దేవా ఆరోపించారు.దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు ఫన్నీగా, మరికొందరు అతణ్ని ట్రోల్ చేస్తూ కమెంట్స్ చేశారు. మరికొందరు యూజర్లు అతనిని సమర్థించారు."గౌరీ, షారూఖ్ ఖాన్ ఇది నిజమేనా, లేదా అతనుఅబద్ధం చెబుతున్నాడా? దయచేసి స్పందించండి అంటూ మరికొంతమంది స్పందించారు. మరొక అభిమాని అయితే హెల్తీ సెలబ్రెటీలు నక్లీ పనీర్ తింటున్నారా అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. గౌరీ ఖాన్ టీం స్పందన"అయోడిన్ పరీక్ష స్టార్చ్ ఉనికిని ప్రతిబింబిస్తుంది తప్ప పనీర్ నాణ్యత ప్రామాణికతను కాదు అంటూ టోరీ టీం స్పందించింది. వంటకంలో సోయా ఆధారిత పదార్థాలు ఉన్నం వల్లే, అలాంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది తప్ప, అది నకిలీదికాదని స్పష్టత ఇచ్చింది. తమ పనీర్ చాలా స్వచ్చమైందనీ, టోరీలో పదార్థాలన్నీ నాణ్యంగా, ఆరోగ్యంగా ఉంటాయని హామీ ఇచ్చింది. -
వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?
స్మార్ట్‌గా..అందంగా కనిపించడం అనేది మోడళ్లు, సినీతారలు ప్రముఖులకే పరిమితం కాలేదు. ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్‌నైట్ స్టార్లుగా మారుతున్న వాళ్లు సైతం అదే బాటపడుతున్నారు. ఇది ఆరోగ్యకరంగా ఉంటే ఏం సమస్య లేదు. తక్కువ సమయంలో సన్నగా మారిపోవాలనుకుంటేనే.. ఆరోగ్యమే చిక్కుల్లో పడుతుంది. చాలామంది ఏదీఏమైనా పర్లేదు అంటూ రిస్క్ చేసి మరీ తప్పుడు డైటింగ్ పద్ధతులు అనుసరిస్తున్నారు. అందుకోసం శరీరాన్ని ఎంతలా కష్టపెడుతున్నారంటే..కేవలం వర్కౌట్లు కాదు, ఆహారం పరంగా శరీరం శుష్కించిపోయేలా చేస్తున్నారు. అవి వింటే.. బరువు తగ్గడం కోసం ఇన్ని పాట్లు పడుతున్నారా అని ఆశ్చర్యమేస్తుంది. ఆకృతికి ఇంత ప్రాముఖ్యత..? అనిపిస్తుంది కూడా. ఒర్రిగా ప్రసిద్ధిచెందిన కంటెంట్ క్రియేటర్ సైతం ఇలాంటి పనులే చేసి బరువు తగ్గాడట. అతడు బరువు తగ్గే క్రమంలో అనుసరించిన విధానాలు తెలిస్తే..నిజంగానే వాంతి చేసుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందులో నో డౌట్.ఒర్రీగా ప్రసిద్ధి చెందిన ఓర్హాన్ అవత్రమణి అనే కంటెంట్ క్రియేటర్ 2023 ప్రారంభం వరకు 70 కిలోల బరువుతో ఉండేవాడు. చూడటానికి కొద్దిగా లావుగా ఉండేవాడు. ఇప్పుడు కాస్త ఫేమస్ కావడంతో టీవీ షోల్లో కనిపించేందుకు స్మార్ట్‌గా ఉండక తప్పదు. అందుకోసం అతను తిన్న ఆహారాన్ని వాంతి చేసుకునేవాడట. అలా చేసుకుంటే కాసేపటి వరకు వాంతి వస్తున్న ఫీలింగే ఉండి.. తిన్న ఆహారం అంతా బయటకొచ్చేస్తుంది. తద్వారా నీరసించి బరవు తగ్గేవాడట. అలా వాంతులు చేసుకుని చివరకు టాయిలెట్లో నిద్రపోయేవాడట. దాంతో మెడనొప్పితో ఇబ్బందిపడేవాడినంటూ తన అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎలా మొదలయ్యాయో వివరించాడు ఓ ఇంటర్వ్యూలో. బరువు తగ్గడం కోసం ఓజెంపిక్ లాంటి మందులు వాడొచ్చు. అయితే అది ఛీటింగ్ అవుతుందే తప్ప బరవుతగ్గడం కాదనే నమ్ముతా అంటున్నాడు ఒర్రీ. అయితే తన దృష్టిలో బరువు తగ్గడానికి అదే బెస్ట్ అని కితాబిస్తున్నాడు. కాగా, ఒర్రీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేయడమే గాక . ఓ సామాజిక కార్యకర్త కూడా. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సెలబ్రిటీల పార్టీల్లో మెరుస్తుంటాడు. అలాగే బాలీవుడ్ టీవీ షోల్లో తళ్లుకుమంటుంటాడు. ఎంత ప్రమాకరమైనదంటే..తనను తాను ఆకలితో అలమటింపచేసుకునేలా పదేపదే వాంతులు చేసుకోవడం అనే ప్రక్రియ అత్యంత హానికరమైనదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శారీరకంగా మానసికంగా అత్యంత ప్రమాదకరమైనదని అంటున్నారు. దీని కారణంగా తీవ్రమైన నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, జీర్ణశయాంతర సమస్యలు, గుండెకు సంబంధించిన రుగ్మతల బారినపడే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. అంతేగాదు ఆకలి శరీరంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కండరాలను బలహీనపరిచి జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. ఫలితంగా మెదడు పనితీరు కూడా దెబ్బతింటుందని అన్నారు. కెరీర్లో విజయం సాధించడానికి ఎలా షార్ట్కట్లు ఉండవో అలాగే బరువు తగ్గడంలో కూడా ఉండవని తేల్చి చెబుతున్నారు. ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సన్నగా మార్చినప్పటికీ..రాను రాను చిరాకు, ఒత్తిడి, వంటి వాటికిలోనై మొత్తం శరీరం పనితీరుపైనే తీవ్ర ప్రభావం చూపిస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. అందువల్ల ఇలాంటి బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మసౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తూ..ఆరోగ్యప్రదంగా బరువు తగ్గే వాటిని అనుసరిస్తే అన్ని విధాల మేలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.(చదవండి: ఇదేం ఫిట్నెస్ స్టంట్..? తిట్టిపోస్తున్న నెటిజన్లు) -
Beat the heat : తాటి ముంజెల్ని ఇలా ఎపుడైనా తిన్నారా?
సీజన్‌కు తగ్గట్టుప్రకృతి అనేక పళ్లను మానవజాతికి అందిస్తుంది ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. మరి సమ్మర్ అనగానే నోరూరించే మామిడిపళ్లతో పాటు తాటి ముంజలు గుర్తొస్తాయి. పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా ముంజలు మనల్ని ఊరిస్తుంటాయి. తాటిముంజలు , నీటిముంజలు, పాల ముంజలు.. ఎలా పిలుచుకుంటేనేం, ఎండకాలంలో వీటిని ఒక్కసారైనా రుచి చూడాల్సిందే. . ‘ఐస్ ఆపిల్స్’ అంటే పిలుచుకునే వీటిల్లో పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.శరీరాన్ని చల్లగా చేస్తాయి తాటి ముంజెలు. మండించే ఎండల్లో ఎండవేడిమిని తట్టుకునేందుకు ముంజెల్లో లభించే పుష్కలమైన నీరు ‘డీహైడ్రేషన్’కు చక్కగా పనిచేస్తాయి. తక్షణమే శక్తినిస్తాయి. తాటిముంజల్లో విటమిన్-బి, ఐరన్, క్యాల్షియం పుష్కలం. వీటిలోని నీరు అధిక బరువు సమస్యను పరిష్కరించడంలో సాయపడుతుంది. వికారం, వాంతులు వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు తాటిముంజల్ని తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కొంతమందికి ఎండకాలం మొహం మీద పొక్కులు వస్తుంటాయి. ముంజల్ని కనుక తింటే, ఆ ఇబ్బంది ఉండదని నిపుణులు అంటారు.అలాగే లివర్ సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. వీటిలోని పొటాషియం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.వేసవిలో మాత్రమే దొరికే తాటి ముంజెలంటే చాలామందికి భలే ఇష్టముంటుంది. అయితే అంత మధురమైన ముంజెలను మరింత మధురంగా చేసుకోవడం ఎలా? ఈజీగా, టేస్టీగా ఇలా ట్రై చేస్తే సరి పిల్లలేంటి... పెద్దలు కూడా ఇష్టంగా లాగించేస్తారు. వంటలు కూడా చేసుకోవచ్చు. ప్రాంతాలు, పద్ధతులనుబట్టి కొందరు వీటిలో సగ్గుబియ్యం, బెల్లం వేసి వండుతారు. చూసేందుకు అచ్చం పాయసంలా కనిపిస్తూ నోరూరిస్తుందీ వంటకం. మనం ఇపుడు తాటి ముంజెల హల్వా, జ్యూస్‌ను తయారు చేసుకోవచ్చు. వాటి తయారీని చూద్దాం.తాటి ముంజెల హల్వాముందుగా చిన్నమంట మీద కళాయిలో 2 కప్పుల చిక్కటి పాలు మరిగించి, అందులో దోరగా వేయించిన ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటూ గరిటెతో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అనంతరం దానిలో రెండు కప్పుల మెత్తటి ముంజెల గుజ్జు వేసుకుని దగ్గరపడే వరకూ తిప్పాపాలి. అభిరుచిని బట్టి కొద్దిగా ఫుడ్ కలర్, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యితో పాటు ఏలకుల పొడి, వేయించిన బాదం, జీడిపప్పు వంటివి కలిపి దగ్గరపడ్డాక ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఆ మిశ్రమం బాగా చల్లారాక ముక్కలుగా కట్ చేసుకుని ఆరగించొచ్చు.తాటి ముంజెల జ్యూస్ రెండు కప్పు ముంజెల గుజ్జు, అర కప్పు కాచిన చిక్కటి పాలు, అర కప్పు పాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ లేదా విప్పింగ్ క్రీమ్, సరిపడా పంచదార కలిపి బాగా గిలకొట్టాలి. లేదా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని డీప్ ఫ్రీజర్‌లో పెట్టి, గడ్డ కట్టాక తింటే సూపర్ ఉంటుంది.ముంజెకాయల గుజ్జులో కొద్దిగా నీళ్లు, తేనె వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. వడకట్టి చల్లగా తాగాలి. ఏలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ మరింత బాగుంటుంది. -
రొటీన్‌గా కాకుండా కొరియన్ వంటకాలు ట్రై చేయండిలా..!
కొరియన్ గామ్జా బొక్కియుమ్కావలసినవి: బేబీ పొటాటో– 6 లేదా 8 (పెద్ద బంగాళదుంపలను చిన్నగా కట్ చేసుకుని వాడుకోవచ్చు), ఉల్లిపాయ ముక్కలు– 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరగాలి), వెల్లుల్లి– 2 లేదా 3 రెబ్బలు (చిన్నగా తరగాలి), క్యారట్ తరుగు– కొద్దిగా, సోయా సాస్– 4 టేబుల్ స్పూన్లు, పంచదార– 3 టేబుల్ స్పూన్లు, నువ్వుల నూనె– 1 టేబుల్ స్పూన్, నువ్వులు– ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, వంట నూనె– 3 టేబుల్ స్పూన్లుతయారీ: ముందుగా బేబీ పొటాటోలను తొక్క తీసి, నచ్చిన విధంగా కట్ చేసుకుని, కాసేపు చల్లని నీటిలో వేసి ఉంచాలి. అనంతరం కళాయిలో నూనె వేడి చేసుకుని, దానిలో ఆ ముక్కలు వేసుకుని, చిన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారట్ తరుగు వేసుకుని వేయించుకోవాలి. ఈలోపు చిన్న బౌల్లో సోయా సాస్, పంచదార వేసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని, ముక్కల్లో వేసుకుని బాగా కలపాలి. ఆపై నువ్వులు, నువ్వుల నూనె వేసుకుని 2 నిమిషాల పాటు బాగా కలిపి, దగ్గరపడగానే స్టవ్ ఆఫ్ చేస్తే సర్వ్ చేసుకోవాలి.త్రిపుర భంగుయికావలసినవి: బియ్యం పిండి– 1 కప్పు, బెల్లం– అర కప్పు (లేదా రుచికి తగినంత), కొబ్బరి తురుము– పావు కప్పు, ఏలకుల పొడి– పావు టీస్పూన్, ఉప్పు– చిటికెడు, నీరు– తగినన్ని, అరిటాకు– ఒకటి (చిన్నచిన్న ముక్కలు చేసి వినియోగించుకోవాలి)తయారీ: ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి, కొబ్బరి తురుము, ఏలకుల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దికొద్దిగా నీరు పోస్తూ ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఈలోపు మరో గిన్నెలో బెల్లం, కొద్దిగా నీరు వేసి బెల్లం కరిగే వరకు వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, దానిని వడకట్టి, బియ్యం పిండి మిశ్రమంలో కలపాలి. అనంతరం అరటి ఆకు ముక్కలుగా కత్తిరించి, వాటిని శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి. ఇప్పుడు ఒక్కొక్క అరటి ఆకు ముక్కను తీసుకుని, పొట్లంలా చేసి, దానిపై కొద్దిగా పిండి మిశ్రమాన్ని వేసి, ఆకును మడిచి, ఊడిపోకుండా పుల్లలు గుచ్చాలి. అవసరమైతే పుల్లలు గుచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని 15 నుంచి 20 నిమిషాల పాటూ ఆవిరిపై ఉడికిస్తే సరిపోతుంది. వీటిని మసాలా కూరలతో లేదా ఫ్రైలతో కలిసి తింటే భలే రుచిగా ఉంటాయి. బాదం బన్స్కావలసినవి: మైదా పిండి– 1 కప్పుగోధుమ పిండి, జొన్న పిండి– అర కప్పు చొప్పున, రాగి పిండి– పావు కప్పు (అభిరుచిని బట్టి మరిన్ని పిండులు జోడించుకోవచ్చు), బాదం పౌడర్ – 1 కప్పు కస్టర్డ్ మిల్క్, బాదం పాలు– పావు కప్పు చొప్పున, ఉప్పు– అర టీ స్పూన్, గుడ్డు– 1, బటర్– అర కప్పు (కరిగించి పెట్టుకోవాలి), దాల్చిన పొడి– కొద్దిగా, జాజికాయ పొడి– అర టీ స్పూన్, వెనీలా ఎక్స్ట్రాక్ట్– 1 టేబుల్ స్పూన్, ఎండు ద్రాక్ష, చెర్రీ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు– కొద్దికొద్దిగా, నీళ్లు– కొద్దిగా, బ్రౌన్ సుగర్– 2 టేబుల్ స్పూన్లుతయారీ: ముందుగా ఒక బౌల్లో మైదాపిండి, గోధుమ పిండి, జొన్న పిండి, రాగి పిండి, దాల్చిన పొడి, జాజికాయ పొడి, బాదం పౌడర్, బ్రౌన్ సుగర్‌తో పాటు తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. అనంతరం మరో బౌల్లో బాదం పాలు, వెనీలా ఎక్స్ట్రాక్ట్, కస్టర్డ్ మిల్క్, కరిగించిన బటర్, ఎండు ద్రాక్ష, చెర్రీ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలతో పాటు గుడ్డు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదా మిశ్రమంలో, బాదం పాల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోసుకుని, ముద్దలా బాగా కలుపుకుని, బన్స్ మాదిరి చేసుకుని, ఓవెన్లో బేక్ చేసుకోవాలి. తర్వాత వేయించిన నువ్వులు, పంచదార పొడి, క్రీమ్ వంటి వాటితో, నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. (చదవండి: అక్కడ న్యూ ఇయర్‌కి శుభాకాంక్షలు చెప్పుకోరు..! ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వుతారు..) -
సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్‌మనీ ఎంతో ?
రుచికరమైన వంటకాలు, కబుర్లు ,కాకర కాయలతో ఇంతకాలం అలరించిన ‘‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్’’కు శుభం కార్డు పడింది. తమ అభిమాన ఓటీటీ తారలు ఈ సిరీస్‌లో పాక నిపుణులుగా రూపాంతరం చెందడాన్ని చూసి అభిమానులు మురిసిపోయారు. ఫరా ఖాన్, వికాస్ ఖన్నా, రణవీర్ బ్రార్ న్యాయ నిర్ణేతలుగా ఉన్న సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ గ్రాండ్ ఫినాలే ఏప్రిల్ 11న గ్రాండ్‌గా జరిగింది. ఇంతకీ ఈ షో విజేత ఎవరు, ప్రైజ్‌మనీ ఎంత? ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి!ప్రముఖ టెలివిజన్ నటుడు, అనుపమ పాత్రతో పాపులర్ గౌరవ్ ఖన్నా ఈ షో విజేతగా నిలిచాడు. సీజన్‌తో తనదైన శైలితో ఆకట్టుకున్న గౌరవ్ చివరి ధశలో కూడా న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్నాడు. సిగ్నేచర్ డిష్‌లు, రుచులు, స్టైల్తోమాత్రమే కాకుండా, కాన్పూర్ నుంచి ముంబై దాకా సాగిన భావోద్వేగ ప్రయాణం గురించి పంచుకున్న కథ కూడా అటు ప్రేక్షకులను, ఇటు న్యాయనిర్ణేతల హృదయాలనూ కదిలించింది. దీంతో ఫలితాలు ప్రకటిస్తూ గౌరవ్‌ను వారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నలుగురు హేమాహేమీలను ఓడించి ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని దక్కించుకున్నాడు గౌరవ్. ఫలితంగా రూ. 20 లక్షల నగదు బహుమతి, ప్రీమియం కిచెన్ ఉపకరణాలను గెలుచుకున్నాడు.నెమ్మదిగా ప్రారంభించి, ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన వంటకాలను నేర్చుకుని అందించి ఈ రోజు ఈ స్థానానికి చేరుకున్నాడు.ఇది నా మొదటి రియాలిటీ షో" నేను ఎప్పుడూ కెమెరా ముందు ఏడవలేదు, అంటూ కన్నీళ్లతో తన కథను చెప్పి అందరిచేత కన్నీళ్లు పెట్టించాడు. ఈ సందర్బంగా ఫినాలేలో అతిథిగా వచ్చిన చెఫ్ సంజీవ్ కపూర్, మాట్లాడుతూ ఇప్పటిదాకా ఎమోషన్స్‌కి దూరంగా పారిపోతూ ఇక్కడి దాకా వచ్చి వుంటావ్... ఇపుడిక భావోద్వాగాల్ని కూడా మిళితం చేస్తూ కొత్త జీవితాన్ని మొదలు పెట్టు ("అబ్ తక్ షాయద్ ఎమోషన్స్ సే భాగ్ కర్ యహాన్ తక్ పోహ్చే హో. ఆజ్ సే జిందగీ షురూ కరో, ఎమోషన్స్ సే జుడ్ కే") అని సలహా ఇచ్చారు.తీవ్రమైన పోటీ మధ్య గౌరవ్ తన ఆవిష్కరణ, సాంకేతికత , నైపుణ్యంతో ప్రత్యేకంగా నిలిచారు. సాంకేతిక సవాళ్లను నేర్చుకోవడం నుండి ప్రస్తుతం వైరల్‌గా మారిన హనీకాంబ్ పావ్లోవా వంటి క్లిష్టమైన డెజర్ట్‌లను తయారు చేయడం వరకు, గౌరవ్ అతని పాక నైపుణ్యం, ప్రయాణం విశేషంగా నిలిచింది. అతని నటనా చాతుర్యంతోపాటు, వంటగదిలో నైపుణ్యం, ప్రావీణ్యం ఆశ్చర్యకరమైన ప్రతిభ, అభిమానులు . ఆహార విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది.స్టార్-స్టడెడ్ పోటీదారుల జాబితాలో ఆయేషా జుల్కా, అభిజీత్ సావంత్, ఉషా నద్కర్ణి, అర్చన గౌతమ్, చందన్ ప్రభాకర్, కబితా సింగ్, దీపికా కాకర్ తదితరులు ఉన్నారు.కాగా సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తొలి సీజన్ ఈ ఏడాది జనవరి 27న మొదలైంది. ఏప్రిల్ 11న ముగిసింది. ఈ గ్రాండ్ ఫినాలేలో, నిక్కీ తంబోలిని తొలిరన్నరప్‌గా నిలవగా, తేజస్వి ప్రకాష్ మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఫైసల్ షేక్ , రాజీవ్ అడాటియా మొదటి ఐదుగురు ఫైనలిస్టుల జాబితాలో నిలిచారు. ఈ ఫైనల్‌కు ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.సెలబ్రిటీ చెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్‌లతో కలిసి ఫైనలిస్టుల తుది వంటకాలను రుచి చూసి,విజేతలను ఎంపిక చేశారు. ఫరా ఖాన్ హోస్ట్ చేసిన ఈ షో కామెడీ, వంటల మేళవింపుతో మధురక్షణాలతో రోలర్‌కోస్టర్‌గా సాగింది. -
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
సాక్షి, హైదరాబాద్: చేప ప్రియులు లొట్టలేసుకొని తినే కొరమీనుకు కరీంనగర్ కేంద్రం కాబోతోంది. కొరమీను చేపలతో రాష్ట్రం కళ కళలాడేలా మత్స్యశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇతర రాష్ట్రాలను నుంచి దిగుమతి చేసుకునే బదులు మన దగ్గరే వాటిని ఎక్కువగా పెంచేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. కరీంనగర్ కేంద్రంగా జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలను కలిసి క్లస్టర్ ఏర్పాటు చేయాలని, ఇక్కడే కొరమీను చేపలను పెంచాలని భావిస్తోంది. మత్స్య శాఖ ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదిస్తే కొరమీనుకు మన దగ్గర కొదువే ఉండదు. ధరల భారం లేకుండా వాస్తవానికి తెలంగాణలో డిమాండ్‌కు సరిపోను కొరమీను చేపలు అందుబాటులో లేవు. ఏపీతోపాటు ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి వీటిని తెచ్చి మన మార్కెట్లలో అమ్ముతుంటారు. ట్రాన్స్పోర్ట్, ప్యాకింగ్, లోడింగ్, అన్లోడింగ్, సరిహద్దు ట్యాక్స్‌లతో పాటు కమీషన్లు కలిపి ఎక్కువ ధరకు వీటి విక్రయాలు జరుగుతుంటాయి. ప్రస్తు తం చేపల మార్కెట్లో కొరమీను కిలో రూ.300–500 వరకు ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు కొరమీనులను చేప ప్రియులకు అందుబాటులోకి తెచ్చేలా మత్స్యశాఖ చర్యలు తీసుకుంటోంది. నీటి వనరులే కీలకం కొరమీను చేపల పెంపకానికి నీటి వనరులు ఎక్కువ అవసరం. ముఖ్యంగా నీటి చలన, ప్రవాహం ఉన్న వనరుల్లో ఇవి త్వరగా, బలిష్టంగా పెరుగుతాయి. నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మత్స్యశాఖ కొరమీను చేపల పెంపకానికి ఎంపిక చేసింది. దీంతోపాటు ఉండ్రుమట్టి ఎక్కువగా ఉంటే, అందులో ఉన్న నాచు కారణంగా కొరమీనుచేపలు మరింత బలంగా పెరిగే అవకాశముంటుంది. అందుకే ఒండ్రుమట్టి లభ్యత ఉన్న ఆ నాలుగు జిల్లాల్లో కొరమీను పెంచాలని నిర్ణయించింది. -
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
భారతదేశంలో ఇష్టమైన చిరుతిండి అనగానే చెప్పేది పానీపూరి. ఇదంటే పెద్దలే కాదు.. చిన్న పిల్లలకు యవతకు ఎంత ఇష్టమో తెలిసిందే. మంచి స్ట్రీట్ ఫుడ్‌గా మహా ఫేమస్. అలాంటి ఈ వంటకం ప్రస్తుతం ఆరోగ్య పరంగా మంచిది కాదని తినొద్దని హెచ్చరిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం అపరిశుభ్రంగా తయారు చేయడమే. అందుకు గతంలో ఎన్నో సంఘటనలు సాక్ష్యంగా నిలిచాయి. అంతేగాదు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కొన్ని రాష్ట్రాల్లో ఈ చిరుతిండి అమ్మకాలను నిషేధించారు కూడా. ముఖ్యంగా ఈ పానీపూరీలో వినయోగించే మసాలా నీరు కోసం కలుషితమైన నీటిని వినియోగించడంతోనే అసలు చిక్కు అంతా వచ్చిపడుతోంది. ప్రస్తుతం ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఈ వంటకం అసలు ఎలా వచ్చిందో..? దీన్ని ఎవరూ తయారు చేశారో తెలిస్తే విస్తుపోతారు. మరీ ఆ కథేంటో చూద్దామా..!పానీ పూరి పురాతన భారతదేశంలో 16 మహాజనపదాల కాలంలో ఉద్భవించిందని చెబుతున్నారు పాకశాస్త్ర నిపుణులు. మొదట్లో స్వీట్ రూపంలో వచ్చి.. ఇలా మసాలతో తయారు చేయడం జరిగిందనేది వాదన. బిహార్ దీని జన్మస్థలంగా చెబుతుంటారు. అంతేగాదు దీనికి మహాభారతం కనెక్షన్ కూడా ఉందంట. ద్రౌపది పాండవులను వివాహం చేసుకుని అత్తగారింటికి వచ్చినప్పుడూ.. ఆమె పాక నైపుణ్యంపై పరీక్ష పెట్టిందట కుంతీదేవి. ఆమెకు తగినంత పూరీ పిండి, కొన్ని బంగాళ దుంపలు, మసాలా దినుసులు ఇచ్చి.. తన కుటుంబానికి సరిపడా రుచికరమైన వంటకం చేయాలని చెప్పింది కుంతీదేవి. అయితే ఆమె ఇచ్చిన పిండి తన భర్తలు ఐదుగురు, అత్తకు సరిపడేలా చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే భీముడి ఎంత తింటాడో తెలియంది కాదు. మరి ఆ కొద్ది మొత్తం పిండితో ఎలా అని ఆలోచించి ద్రౌపది చిన్న చిన్న పూరీలలా గట్టిగా వచ్చేలా చేసిందట. సహజంగా నీళ్లుతాగితే కడుపు నిండిపోతుంది. ఎక్కువ మొత్తంలో తీసుకోవడం కుదరదు. ఎలాగో గట్టిగా కరకరలాడే ఈ పూరీలను తినాంటే.. మాములు కూరతో సాధ్యం కాదు. అదే నీళ్ల మాదిరి రసం లాంటి దానితో తింటే..కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అందరికీ సరిపెట్టొచ్చు అని భావించి ఆమె మసాలాలన్నింటిని కలపి చక్కటి పలుచటి రసంలా తయారు చేసిందట. ఆ తర్వాత ఈ పూరీల మధ్యలో చిల్లుపెట్టి ఈ మసాలా నీటిని పోసి సర్వ్ చేసి అందరికి వచ్చేలా చేసిపెట్టిందట ద్రౌపది. ఆమె తెలివికి అబ్బురపడి నా కోడలు చాలా తెలివైనదని తెగ మురిసిపోయిందట కుంతీదేవి. ఈ కథ నిజమా? కాదా? అనేందుకు సరైన ఆధారాలు లేకపోయినా..పరిస్థితులు సవ్యంగా లేనప్పుడూ ఇంట్లో ఉన్నవాటితో రుచికరంగా అందరికీ సరిపడేలా వంట చేయడం ఎలాగో తెలియజెబుతోంది. పైగా కాబోయే కోడళ్లకు ఇంటిని ఎలా చక్కబెట్టాలో తెలియజేస్తుంది. చివరగా పానీపూరీ మాత్రం స్ట్రీట్ సెంటర్లలో కాకుండా ఇంట్లోనే ఈజీగానే చేసుకునే పలు విధానాలు వచ్చేశాయి. అవి తెలుసుకుని హాయిగా నచ్చిన ఫుడ్ ఆస్వాదిస్తూ ఆరోగ్యంగా ఉందాం..!. ఇంటి వంటే ఆరోగ్యం అని విశ్వసిద్దాం.(చదవండి: అందాల పోటీలో 'సీపీఆర్' స్కిల్ టెస్ట్..! భారత్ 72వ మిస్ వరల్డ్‌లో..) -
సచిన్ మెచ్చిన గుమ్మడికాయ చికెన్ కర్రీ..! ఉబ్బితబ్బిబైన మాస్టర్ చెఫ్
మనం ఎంతో ఇష్టపడే వ్యక్తులను కలిసినా..వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దొరికినా..ఎంతో ఖుషీగా ఫీలవుతాం. అలాంటిది మనం కలలో కూడా కలిసే అవకాశం లేని ఓ ప్రముఖ సెలబ్రిటీ లేదా క్రికెట్‌స్టార్ లాంటి వాళ్లైతే ఇక ఆ మధుర క్షణాలు జన్మలో మర్చిపోం. మళ్లీ మళ్లీ ఆ క్షణాలు కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. అలాంటి అరుదైన అనుభవమే ఈ మాస్టర్ చెఫ్‌కి ఎదురైంది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్ని కలిసే అవకాశం రావడమే కాదు, అతనికి తన ప్రాంతం వంటకాలను రుచి చూపించే ఛాన్స్‌కొట్టేసింది. అసలు తాను ఇలాంటి ఓ అద్భుతం జరుగుతుందని ఎన్నడు అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబవుతోందామె. ఆ చెఫ్ మేఘాలయకి చెందిన నంబీ మారక్. ఆమె మాస్టర్ చెఫ్ రన్నరప్ కూడా. ఆమె షిల్లాంగ్‌లోని తన ఇంటి గోడలపై సచిన్ టెండూల్కర్ పోస్టర్లను చూస్తూ పెరింగింది. అలాంటి ఆమెకు అనుకోని అవకాశం వరంలా వచ్చిపడింది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తమ రాష్ట్రాన్ని పర్యటించడానికి రావడం ఓ ఆశ్చర్యం అయితే..ఆయనకు స్వయంగా తన చేతి వంటే రుచిచూపించడం మరో విశేషం. చెఫ్ నంబీ సచిన్‌కి తన ప్రాంత గారో సంప్రదాయ వంటకాలతో ఆతిధ్యం అందించింది. తన క్రికెట్ హీరోకి వండిపెట్టే ఛాన్స్ దొరికిందన్న సంబరంతో..ఎంతో శ్రద్ధపెట్టి మరీ వెజ్, నాన్‌వెజ్ వంటకాలను తయారు చేసింది. అవన్నీ ఇంటి వంటను మరిపించేలా రుచికరంగా సర్వ్ చేసింది. ఆ రెసిపీలలో.. వెటెపా (అరటి ఆకులలో ఉడికించిన మృదువైన చేప), కపా అండ్ గారో, గుమ్మడికాయ చికెన్(డూ'ఓ గోమిండా)..పితా అనే స్టిక్కీ రైస్ తదితరాలను అమిత ఇష్టంగా ఆరగించాడు సచిన్. వాటిన్నింటిలో సచిన్ మనసును మెప్పించని వంటకం మాత్రం గుమ్మడికాయ చికెన్ కర్రీనే కావడం విశేషం. ఇక చివరగా చెఫ్ నంబీ మాట్లాడుతూ.."గారో వంటకాలు కేవలం ఆహారం మాత్రమే కాదు. ఇవి మా ప్రాంతంలోని ఒక్కో ఇంటి సంప్రదాయానికి సంబంధించిన ప్రసిద్ధ వంటకాలు. ఈ రెసిపీలని నిప్పుల మీద ఎంతో శ్రమ కోర్చి వండుతారు. అలాంటి అపురూపమైన వంటకాలను నా కిష్టమైన క్రికెటర్ సచిన్‌కి వండిపెట్టడం ఓ కలలా ఉంది. నిజంగా ఇది ఓ ట్రోఫీ గెలిచిన దానికంటే ఎక్కువ. "అని ఆనందపారవశ్యంతో తడిసిముద్దవుతోంది చెఫ్ నంబీ.(చదవండి: World Health Day: వ్యాధులకు చెక్‌పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!) -
Sri Rama Navami టెంపుల్ స్టైల్లో ప్రసాదాలు ఇలా చేసుకోండి!
అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ శ్రీరామ నవమి. ఈ రోజున శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం వేడుకలను ఉత్సాహంగా జరుపు కుంటారు. శ్రీరామనవమి అనగానే ముందుగా గుర్తొచ్చేవి చలిమిడి, వడపప్పు పానకం. వేడిని తగ్గించి, శరీరానికి చలువనిచ్చే ఆరోగ్యకరమైన వంటకాలతోపాటు, చక్కెర పొంగలి, పాయసం లాటివాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రత్యేక నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.మండువేసవిలో వచ్చే పండుగ శ్రీరామనవమి ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం వలన శరీరంలో ఉండే ఖనిజాలు (పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం) చెమట రూపంలో బయటికి వెళ్లే ప్రమాదం ఉంది. బెల్లం పానకం తాగడం వలన తిరిగి ఈ ఖనిజాలను పొందవచ్చు. ఎండ తాపాన్ని తట్టుకునే శక్తిని బెల్లంలో ఉండే ఇనుము ఇస్తుంది. అంతేకాదు, వేసవిలో తగ్గుతూ పెరుగుతూ ఉండే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. అలాగే పెసరపప్ప కూడా శరీరానికి చలువనిస్తుంది. చలిమిడి కావాల్సినవి: బియ్యం, బెల్లం, కొబ్బరి తురుము, యాలకులు, నెయ్యి తయారీ: నానబెట్టిన ఉంచుకున్న తడి బియ్యాన్ని వడగట్టుకుని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. బియ్యపిండిని ఒక గిన్నెలో తీసుకుని పచ్చికొబ్బరి తురుము, చక్కర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నెయ్యి, పాలు పోసి ముద్దలా కలపాలి. అంతే చలిమిడి రెడీ. వడపప్పు కావలసినవి: పెసరపప్పు – కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు– పదితయారి: పెసరపప్పును కడిగి పప్పు మునిగేటట్లు నీటిని పోసి నాననివ్వాలి. రెండు గంటల పాటు నానిన తర్వాత నీటిని వడపోసి కొబ్బరి పలుకులు కలపాలి. దేవుడికి నైవేద్యంగా పెట్టే వడపప్పును ఇలాగే చేయాలి. రుచికోసం నానిన పెసరపప్పులో అరకప్పు మామిడి తురుము, చిటికెడు ఉప్పు కలిపిపోపు పెట్టుకోవచ్చు.పానకంకావలసినవి: బెల్లం – 100 గ్రా, మిరియాలు – పది ( పొడి చేయాలి), ఏలకులు - ఆరు (పొడిచేయాలి)తయారి: బెల్లంలో ఒక గ్లాసు నీటినిపోసి కరగనివ్వాలి. ఒక గంట తర్వాత బెల్లం నీటిని పలుచని తెల్లని వస్త్రంతో వడపోయాలి. వడపోసిన బెల్లం నీటిలో మిరియాల పొడి, ఏలకుల పొడి కలిపితే పానకం రెడీ. చక్కెర పొంగలి కావలసినవి: బియ్యం -కప్పు, శనగపప్పు -గుప్పెడు, పాలు-మూడు కప్పులు, చక్కెర - ఒకటిన్నర కప్పు, ఏలకులు -పది, (పొడి చేయాలి), జీడిపప్పు, కిస్మిస్– ఒక్కొక్కటి పది, నెయ్యి-మూడు టీ స్పూన్లుతయారి: ముందుగా బాణలిలో నెయ్యివేసి, జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన ఉంచాలి. బియ్యం, శనగ పప్పు కడిగి అందులో పాలుపోసి, జీడిపప్పు వేయించగా మిగిలిన నేతిని కూడా బియ్యం -పాలలో వేసి ప్రెషర్ కుకర్‌లో ఉడికించాలి. కుకర్‌లో ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి పాయసం మిశ్రమంలో చక్కెర, ఏలకుల పొడి వేసి, చక్కెర కరిగే వరకు కలిపి జీడిపప్పు, కిస్మిస్తో గార్నిష్ చేసి మూత పెట్టాలి. పది నిమిషాలకు అన్నానికి తీపి బాగా పట్టి రుచిగా ఉంటుంది. -
నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా..రుచికరమైన జున్ను: ఎన్నో ప్రయోజనాలు
ఆధునిక కాలంలో, అందులోనూ పట్టణాల్లో జున్ను దొరకడమే గగనంగా మారిపోయింది. మరో విధంగా చెప్పాలంటే జున్ను అంటే భవిష్యత్తరానికి దూరమైపోతోంది. పశువులు, పాడి పంట పుష్కలంగా ఉన్న ఇళ్లల్లో కూడా అరుదుగా దొరుకుతుంది. జున్ను అంటే ఇష్టపడని వారు ఉండరు. అలాంటి జున్నుపాలు సామాన్యులకు దొరికాయంటే పండగ అన్నట్టు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా జున్ను ఎలా తయారు చేయాలో మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం.జున్ను పేరు చెబితేనే నోరు ఊరిపోతుంది కదా.. తియ్య..తియ్యగా, కారం కారంగా, మధ్య మధ్యలో అలా మిరియం గింజలు తగులుతూ ఉంటే ఆ రుచే వేరు. జున్ను మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.కావలసిన పదార్థాలుజున్ను పాలు (ఆవు లేదా గేదె ఈనినపుడు మొదటి మూడు రోజుల్లో వచ్చే పాలు), ఒక గ్లాసు, సాధారణ పాలు - మూడు గ్లాసులు, కప్పు బెల్లం, కొద్దిగా యాలకుల పొడి, మిరియాల పొడి.తయారీ విధానంఒక గిన్నెలో ఒక గ్లాసు జున్నుపాలు, మామూలు పాలను కలపాలి. ఇందులో బెల్లం తురుము, పంచదార కూడా వేసి బాగా కలపాలి. ఇందులోనే మిరియాల పొడి, యాలకుల పొడి వేసి కూడా బాగా కలపాలి. దీనికి ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంటే ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టుకోవాలి. ఇపుడు మరో గిన్నెలో జున్ను పాల మిశ్రమాన్ని పోసి మూతపెట్టి వేడి నీటిగిన్నెలో ఉంచి ఉడికించుకోవాలి. గిన్నెలో సగం మాత్రమే వచ్చేలా చూసుకోవాలి. లేదంటే పొంగిపోయే అవకాశ ఉంది. ప్రెషర్ కుక్కర్లో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు.జున్నుతో ఆరోగ్య ప్రయోజనాలుజున్ను పాలు చాలా చిక్కగా, పసుపు రచ్చ రంగులో ఉంటాయి. జున్నులో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ బి12, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ కె, రిబో ఫ్లావిన్, జింక్, ప్రోటీన్ వంటివి అధికంగా ఉంటాయి. వీటి ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జున్నులో ఉండే అధికంగా లభించే కాల్సియం, పోషకాల కారణంగా ఎముకలు బలంగా తయారవుతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. జున్నులో ఉండే ప్రోటీన్ కంటెంట్ శరీరానికి శక్తిని అందిస్తుంది. కృత్రిమంగా కూడా జున్నుఒక కప్పు చిక్కటి పాలల్లో రెండు ఎగ్స్‌ను వేసి, బాగా గిలక్కొట్టి, మామూలు జున్ను తరహాలోనే బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి ఆవిరిమీద ఉడించుకోవచ్చు. మార్కెట్లో ఆర్టిఫిషియల్ గా చైనా గ్రాస్ తో తయారు చేస్తున్న జున్ను లభిస్తుంది. -
88 ఏళ్ల నాటి స్నాక్ బ్రాండ్..ఏకంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..!
సరదాగా సాయంత్రం కాసిన్న వేరుశెనగపప్పులో, మరమరాలు తింటుంటే ఆ మజానే వేరు. అందులోనూ మన భారతీయులకు చిరుతిండి అంటే మహా ఇష్టం. ఎన్ని చిరుతిండి బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చినా..తన హవా చాటుతూ దూసుకుపోతున్న బ్రాండ్ ఏదంటే..ఠక్కున చెప్పేది హల్దిరామ్. నిన్న మొన్నటిది కాదు..ఏకంగా 88 ఏళ్ల నుంచి అశేష ప్రజల ఆధరణతో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనిపించుకున్న స్నాక్ ఐటెం ఇది. మార్కెట్లో దీని టర్నోవర్ వింటే..కళ్లుబైర్లు కమ్మడం ఖాయం. అలాంటి మన భారతీయ చిరుతిండి పెట్టుబడిదారుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలిస్తే..విస్తుపోతారు. నిజమేనా అని నోరెళ్ల బెడతారు. అంతలా అందరి మనసును దోచుకున్న ఈ చిరుతిండి కథకమామీషు ఏంటో చూద్దామా..!.ప్రసిద్ధి చెందిన ఐకానిక్ స్నాకింగ్ బ్రాండ్లలో ఒకటిగా పేరుగాంచింది హల్దిరామ్ భుజియా చిరుతిండి. ప్రస్తుతం ఈ బ్రాండ్ దాదాపు వంద రకాల స్నాక్‌లను అందిస్తోంది. అందరూ మెచ్చిన రకం చిరుతిండి మాత్రం హల్దిరామ్ భుజియానే. దీనికి భారతదేశం అంతటానే గాదు విదేశాల్లో సైతం ఐకానిక్ బ్రాండ్‌గా ఉంది. ఈ బ్రాండ్ యజమాని తన అత్త నుంచి ఈ భుజియా రెసిపీని తెలుసుకున్నాడట. అయితే ప్రజాదరణ పొందడం కోస అత్త ట్రిక్ని ఉపయోగించేవాడట. దీనికి ఎఫ్ఎంసీజీ బ్రాండ్ ఆల్ఫా వేవ్‌లో రూ. 5600 కోట్ల వాటా ఉంది. అంతేగాదు దీనికి టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ పెట్టుబడిదారుడిగా మారడం విశేషం. ఆ నేపథ్యంలోనే ఈ హల్దిరామ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదండోయ్ ఈ విషయాన్ని స్వయంగా హల్దిరామ్ బ్రాండ్ ప్రతినిధే ఖరారు చేశారు. ప్రస్తుతం ఈబ్రాండ్ స్వీట్లు వంటి వాటిని కూడా అందించడంతో దీని విలువ ఏకంగా రూ. 8 లక్షల కోట్లకు చేరుకుందని అంచనా. మొదలైందిలా..మెగాబ్రాండ్గా అవతరించిన ఈ హల్దీరామ్ ప్రస్థానం 1937లో జరిగింది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఒక చిన్న స్వీట్లు, స్నాక్స్ దుకాణంగా ప్రారంభమైంది. ఆ దుకాణం యజమాని గంగా బిషన్ అగర్వాల్‌ని చుట్టపక్కల వాళ్లు ఆప్యాయంగా హల్దిరామ్ జీ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆయనే ఈ హల్దిరామ్ బ్రాండ్ వ్యవస్థాపకుడు. ఆ తర్వాత కోలకతా, నాగపూర్, ఢిల్లీకి విస్తరించి..ఘన విజయాన్ని అందుకుంది. ఆబ్రాండ్ వ్యవస్థాపకుడు గగన్ బిషన్ అగర్వాల్ దూరదృష్టి, అంకితభావం, కృషిల కారణంగా చిరుతిండి సామ్రాజ్యంలో రాణిగా పేరుతెచ్చుకుంది. 1980ల ప్రాంతంలో హల్దిరామ్ పెద్ద మార్కెట్లలోకి అడుగుపెట్టింది. ఎప్పటికప్పుడు సాంప్రదాయ వంటకాలకు ఆధునిక తయారీ పద్ధతులను జోడించి రుచికరంగా తయారుచేయడంతో ఈబ్రాండ్ అతడి ఇంటి పేరుగా మారిపోయింది. ఇది పాపడ్లు నుంచి రెడీ టు ఈట్ మీల్స్, నామ్కీన్ల వరకు మార్కెట్లలో తన ఉత్పత్తులను ఎగుమతి చేయడం ప్రారంభించిన తర్వాత భారత్ తోపాటు విదేశాలలో కూడా గణనీయమైన ఉనికిని సంపాదించగలిగింది. అలాగే ఔత్సాహిక వ్యవస్థాపకులుకు ఓవ్యాపారాన్ని కాలనుగుణ మార్పులతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలో చాటిచెప్పి..స్ఫూర్తిగా నిలిచాడు.(చదవండి: సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?) -
అద్భుతమైన నల్లేరు పచ్చడి : ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
నల్లేరు (సిస్సస్ క్వాడ్రాంగులారిస్) దీని గురించి ఎపుడైనా విన్నారా? సాధారణంగా ఉడుతలు అవి కొరక్కుండా ఉండేందుకు ఈ నల్లేరు తీగను కూరగాయల పాదులపై పాకిస్తారు. ఈ రోజుల్లో నల్లేరు దాదాపుగా మరచిపోయారు గానీ దీని వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నల్లేరు పచ్చడి తింటే కొలెస్ట్రాల్ కరుగుతుంది. కీళ్ల నొప్పులకు చాలా బాగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. ఎముకుల పుష్టికి, విరిగిన ఎముకలు అతకడానికి, ఎముకలు గుల్లబారకుండా ఉండడానికి కీళ్ల సందుల్లోని ఇన్ఫ్లమేషన్ను, వాపును తగ్గించడానికి అట్లు వేసుకుని తింటే దగ్గు కూడా తగ్గుతుంది. మరి నల్లేరు పచ్చడి తయారీ విధానం ఎలాగో చూద్దాం.ఆంగ్లంలో వెల్డ్ గ్రేప్ అని ,హిందీలో హడ్జోరా , తెలుగులో నల్లేరు అని పిలుస్తారు. సంస్కృతంలో, దీనిని కవితాత్మకంగా వజ్రంగి, వజ్రవల్లి అని పిలుస్తారు. అంటే వజ్రం అంత బలమైనది అని దీని అర్తం. నల్లేరు తీగలోని ప్రతి భాగాన్ని వివిధ ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారని ఆయుర్వేద గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఇందులొ విటమిన్ సీ, నీరు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ.నల్లేరు పచ్చడి కావాల్సినవితరిగిన 10 నల్లేరు కాడలు అర కప్పు వేరుశెనగలు , చింతపండు , నాలుగు ఎండు లేదా పచ్చి మిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు 1 టీస్పూన్, కొద్దిగా కొత్తిమీర పచ్చడి తయారీ తీగ నుంచి నల్లేరు కాడలను కోసేముందు చేతికి ఆయిల్ రాసుకోవాలి. ఒట్టి చేతులతో తీస్తే దురద వస్తుంది. నల్లేరు లేత కాడలను తీసుకోవాలి. వాటి ఈనెలను తీసి చిన్న చిన్నముక్కలుగా కట్ చేసుకోని, ఉప్పు నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత ఒక బాణలిలో నూన్ వేసి నల్లేరు ముక్కలను వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత, కొద్ది శనగపప్పు, వేరుశనగలు, పచ్చిమిరప లేదా ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక టమాటా వేసి వేయించుకోవాలి. దీన్ని కొత్తగా చింతపండు కలిపి మెత్తగా రోట్లో రుబ్బుకోవాలి. దీన్ని తాజా కరివేపాకు, పోపు గింజలు వేసి పోపు పెట్టుకుంటే కమ్మటి నల్లేరు పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. దోస, రోటీలో కూడా నంజుకోవచ్చు.నల్లేరుతో ఇతర వంటలునల్లేరు తీగలోని లేత కణుపులు కోసి వాటి నారను తీసి పచ్చడి, పప్పు, కూర చేసుకుంటారు. దీనిని కాడలతో పులుసు చేసుకొని చాలా ప్రాంతంలో తింటారు.నల్లేరుతో లాభాలు వీటి కాడల్ని శుభ్రం చేసి నీడలో ఎండబెట్టి దంచి పొడిగా చేసుకుని భద్రపరచుకొని, వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. నల్లేరు కాడలతో చేసిన పొడిని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చునల్లేరులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి. నల్లేరు ఆస్పిరిన్ వలె ప్రభావవంతంగా పనిచేస్తుంది.రక్తహీనత నివారణలో సహాయపడుతుంది.నల్లేరు బహిష్టు సమస్యలకు చక్కటి పరిష్కారంనల్లేరులో పీచు పదార్థం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.ఇదీ చదవండి: రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్? -
భల్లే భల్లే.. పంజాబీ ఫుడ్ ఫెస్టివల్
నగరం విభిన్న సంస్కృతులకు నిలయమే కాకుండా ఆహార వైవిధ్యానికి కూడా కేంద్రంగా నిలుస్తోంది. దీనికి ప్రతిగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విభిన్న ప్రాంతాలకు చెందిన వంటకాలు నగరంలో అలరిస్తుంటాయి. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌లోని రాయల్ రెవ్ హోటల్ వేదికగా ప్రతిష్టాత్మక పంజాబీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. పంజాబ్ సంప్రదాయ పంటల పండుగ ‘పంజాబీ ఫుడ్ ఫెస్టివల్‘ను అమృత్సర్ గ్యాస్ట్రోనమికల్ యాత్రలో భాగంగా ఈ నెల 4 నుంచి 13వ తేదీ వరకు రాయల్ రెవ్ హోటల్, లాజీజ్ మల్టీక్యూసిన్ రెస్టారెంట్ వేదికగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించి బుధవారం రాయల్ రేవ్ హోటల్ వేదికగా పంజాబీ పసందైన వంటకాలతో ప్రముఖ పంజాబీ మాస్టర్ చెఫ్ రాజుసింగ్ సోన్వాల్ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన మెనూలో మటన్ బెలిరామ్, రారా మటన్, సాగ్ మీట్, తందూరీ కుక్కడ్, కుక్కడ్ మఖన్వాలా, మచ్లీ టిక్కా, మచ్లీ అమృత్సరి వంటి మాంసాహార వంటకాలు ఉన్నాయన్నారు. శాఖాహారులు పనీర్ టిక్కా జలంధరి, పెథివాలి టిక్కీని ఆస్వాదించవచ్చు. వీటితో పాటు మరెన్నో అందుబాటులో ఉన్నాయన్నారు. చదవండి:35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో -
హలీమ్ @ రూ.వెయ్యి కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ వచ్చిoదంటే హైదరాబాదీలకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీమే. ఈ మాసంలో ప్రత్యేకంగా లభించే హలీమ్ కోసం మాంసప్రియులు తహతహలాడతారు. ఈసారి రికార్డు స్థాయిలో జరిగిన హలీమ్ అమ్మకాలే దానికి నిదర్శనం. ఏకంగా రూ.వేయి కోట్ల మేర హలీమ్ వ్యాపారం జరిగిందని అంచనా. దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో హలీమ్ విక్రయాలు సాగాయని వ్యాపారులు చెబుతున్నారు. పోషకాలతో కూడిన రుచికరమైన హలీమ్ కేంద్రాలు, హోటళ్లు రంజాన్ నెలంతా కిటకిటలాడాయి. ప్రతి హోటల్ ముందు ప్రత్యేక బట్టీలు, కౌంటర్ల ద్వారా విక్రయాలు సాగాయి. ఈ సీజన్లో దాదాపు 50 లక్షల ప్లేట్ల హలీమ్ అమ్మకాలు జరిగినట్లు హైదరాబాద్ హోటళ్ల సంఘం చెబుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 20 శాతం అధికంగా హలీమ్ అమ్మకాలు సాగాయని అంటోంది. కేవలం హోటళ్లలోనే కాదు ఫుడ్ డెలివరీ యాప్‌లలోనూ హలీమ్‌కే ఆహారప్రియులు ఓటేశారు. టేక్ ఆవేలు, స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్‌లతో హలీం అమ్మకాలు ఒక రేంజ్లో సాగాయి. ఆరువేల విక్రయ కేంద్రాలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 6 వేల చిన్నా, చితక హలీమ్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాన రెస్టారెంట్లు వీటికి అదనం. చిన్న, మధ్య తరగతి రెస్టారెంట్లే కాదు స్టార్ హోటళ్లలోనూ రంజాన్ సీజన్ మెనూలో హలీం డిష్‌ను తప్పనిసరి చేశారు. హైదరాబాదీ బిర్యానీని హలీం ఓవర్ టేక్ చేసి మెనూలో టాప్‌లో నిలిచింది. చిన్న హలీం కేంద్రాల్లో రోజుకు దాదాపు వంద పేట్ల చొప్పున అమ్మకాలు జరిగితే, పేరున్న హోటళ్లు, కేంద్రాల్లో సుమారు 500–600 ప్లేట్ల హలీం విక్రయించారని అంచనా. వీకెండ్లలో 25 శాతం అధికం..హలీమ్ ప్లేట్ ధర రూ.100 నుంచి 320 వరకు పలికింది. ఎక్కువ శాతం మటన్ హలీమ్ సెంటర్లు ఉండగా, పలు ప్రాంతాల్లో చికెన్, బీఫ్ కేంద్రాలు కూడా వెలిశాయి. వీటిలో అత్యధికంగా 70 శాతం మేర పాతబస్తీలోనే ఉన్నాయి. సగటున రోజుకు దాదాపు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. సాధారణ రోజుల కంటే వీకెండ్లలో 25 శాతం అధికంగా విక్రయాలు జరిగాయని జహంగీర్ అనే హలీం కేంద్ర నిర్వాహకుడు తెలిపారు. పాతబస్తీతో పోలిస్తే సైబరాబాద్‌లో హలీం జోష్ ఎక్కువగా ఉందని, పేరొందిన ఫుడ్ బ్లాగర్స్ కూడా హలీంను ప్రమోట్ చేసేలా వార్తలు ఇవ్వడం అమ్మకాలకు కలిసొచ్చిందని షెరటన్ హోటల్ మేనేజర్ నాసర్ చెప్పారు. -
హల్దీరామ్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఫాస్ట్‌ఫుడ్ కంపెనీ హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్ తాజాగా యూఏఈ సంస్థ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్సీ)తోపాటు ఇన్వెస్ట్మెంట్ సంస్థ అల్ఫా వేవ్ గ్లోబల్‌కు మైనారిటీ వాటా విక్రయించనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం రెండు సంస్థలు సంయుక్తంగా హల్దీరామ్‌లో 6 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. స్నాక్, ఫుడ్ బ్రాండ్ హల్దీరామ్స్‌లో ఇప్పటికే టెమాసెక్ ఈక్విటీ పెట్టుబడులకు సిద్ధపడగా.. మరో రెండు సంస్థలు ఐహెచ్సీ, అల్ఫా వేవ్ గ్లోబల్ సైతం వాటా కొనుగోలు చేయనున్నట్లు హల్దీరామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే డీల్ వివరాలు వెల్లడించలేదు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టెమాసెక్‌కు ఇప్పటికే మైనారిటీ వాటా విక్రయించేందుకు ఒప్పందం కుదిరిన నేపథ్యంలో హల్దీ రామ్ తాజా ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 85,000 కోట్లు) విలువలో హల్దీరామ్ లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అంచనా. -
సమ్మర్ : ఉదయాన్నే ఈ ఫ్రూట్స్ తీసుకుంటే యవ్వనంగా మెరిసిపోవాల్సిందే!
మన ఆరోగ్య సంరక్షణలో తాజా కూరగాయలు, పండ్లకు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు తినాలని ఆరోగ్యనిపుణులు చెబుతారు. అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని పండ్లు తింటే అదనపు ప్రయోజనం ఉంటుందని మీకు తెలుసా. రోజు ఉప్మా, ఇడ్లీ లాంటివి తిని బోర్ కొట్టిందా? మరింత ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లను తీసుకోవాలని భావిస్తున్నారా. ఖాళీ కడుపుతో శక్తికి గేమ్-ఛేంజర్‌గా పనిచేసే కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.ఉదయాన్నే పండ్లు తీసుకోవడంతో రోజంతా ఫ్రెష్ గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. ఖాళీ కడుపుతో కొన్ని పండ్లను తీసుకుంటే మంచి పోషకాలు లభిస్తాయి. మలబద్దకం, కడుపు కేన్సర్, డయేరియా, ఎముకల ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది. జీర్ణక్రియ అద్భుతంగా పని చేస్తుంది. రక్తపోటును నియంత్రించవచ్చు. పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ మెరుస్తూ, యవ్వనంగా కనిపిస్తారు. ముఖ్యంగా అధిక బరువును నియంత్రించుకోవచ్చు. పుచ్చకాయ: జ్యూసీ జ్యూసీగా పుచ్చకాయశరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. రిఫ్రెషింగ్ రుచితోపాటు, మంచి హైడ్రేటింగ్‌గా పనిచేస్తుంది. ఇందులో 92 శాతం నీరు ఉండటం వల్ల ఉదయం తీసుకుంటే చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. పుచ్చకాయలో లైకోపీన్ కూడా అధికంగా ఉంటుంది. ఇది గుండె, చర్మాన్ని రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. లిక్విడ్స్, ఎలక్ట్రోలైట్లతో నిండిన పుచ్చకాయతో రోజును ప్రారంభించడం వల్ల రోజంతా హైడ్రేట్‌గా ఉండేందుకు ఉపయోగపడుతుంది.బొప్పాయి: బొప్పాయిలో పపైన్, కైమోపాపైన్ వంటి ఎంజైమ్‌లు పుష్కలంగా లభిస్తాయి. కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయి. విటమిన్లు A, C , E లతో నిండిన బొప్పాయితో బరువు కూడా తొందరగా తగ్గుతాం. ఇందులోని ఎంజైమ్‌లు జీర్ణక్రియకు మంచిది. మలబద్ధకాన్ని నివారించడానికి తోడ్పడతాయి. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.పైనాపిల్ : విటమిన్ సి , మాంగనీస్ పుష్కలంగా లభించే పైనాపిల్ రోగనిరోధక వ్యవస్థకు ఒక సూపర్ హీరో అని చెప్పవచ్చు. ఎముకలను బలోపేతం చేస్తుంది. ఉబ్బరం , వాపు కూడా తగ్గుతుంది.ఆపిల్స్: పెక్టిన్ తో నిండిన ఆపిల్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. ఆకలికి తట్టుకుంటుంది. క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు బోనస్.మెదడు పనితీరును ,మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.చదవండి: ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించికివి: విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్లతో నిండిన కివీ పండ్లు చాలా శక్తినిస్తాయి. ఈ పండు రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది. చర్మ ఆరోగ్యం , జీర్ణక్రియకు అద్భుతాలు చేస్తుంది. ఇందులో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్యాక్టినిడిన్ కూడా ఉంటుంది. ఉదయమే ఈ పండును తినడం అంటే పోషకాలతో కూడిన ఫుడ్‌ను శరీరానికి అందించడమే. అరటిపండ్లు: అరటిపండ్లు పొటాషియానికి గొప్ప మూలం. ఇవి గుండెకు మంచిది. ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి , కండరాల పనితీరుకు ఇది అవసరం. ఈ పండ్లలో కార్బోహైడ్రేట్లు సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి.బెర్రీ: కడుపు నిండిన అనుభూతికోసం ఈ పండ్లు ఉత్తమం. విటమిన్లు సి , కె, అలాగే పొటాషియం, కాపర్ అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి, ముఖ్యంగా మూత్రపిండాలు, ప్రేగులు, గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, రోగనిరోధక వ్యవస్థకు బలాన్నిస్తాయి కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడతాయి. -
రంజాన్ విందు: టేస్టీ.. టేస్టీగా..షీర్ కుర్మా, కచ్చీ బిర్యానీ చేసేయండిలా..!
రంజాన్ ఉపవాస దీక్షలు ముగించుకుని ఈదుల్ ఫిత్ర్ లేక రంజాన్ వేడుకను బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సెలబ్రెట్ చేసుకుంటారు. ఈ పర్వదినాన్ని ఈద్ అని కూడా పిలుస్తారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్ ఖుర్మా, బిర్యానీ చేసుకుని ఆనందంగా విందు ఆరగిస్తారు. ఈ సందర్భంగా నోరూరించే ఆ వంటకాల తయారీ ఎలానో చూద్దామా..!.షీర్ కుర్మా..కావల్సినవి: పాలు – అర లీటర్ (3 కప్పులు); నెయ్యి – టేబుల్‌స్పూన్; పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్ (డేట్స్ ఎక్కువ వాడితే తక్కువ పంచదార వేసుకోవాలి); సేవియాన్ (వెర్మిసెల్లి)– అర కప్పు; జీడిపప్పు – 8 (తరగాలి); బాదంపప్పు – 8 (సన్నగా తరగాలి); పిస్తాపప్పు – 8 (తరగాలి); ఖర్జూర – 9 (సన్నగా తరగాలి); యాలకులు – 4 (లోపలి గింజలను ΄÷డి చేయాలి); బంగారు రంగులో ఉండే కిస్మిస్ – టేబుల్ స్పూన్; రోజ్‌వాటర్ – టీ స్పూన్‌తయారీ విధానం: సేవియాన్‌ను కొద్దిగా నెయ్యి వేసి బంగారురంగు వచ్చేలా వేయించి తీసి పక్కన పెట్టాలి.అదె గిన్నె లేదా పాన్‌లో మరికాస్త నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీయాలి ∙విడిగా పాలు మరిగించి, సన్నని మంట కాగనివ్వాలి. పాలు కొద్దిగా చిక్కబడ్డాక దీంట్లో వేయించిన సేవియాన్, పంచదార వేసి ఉడికించాలి. సేవియాన్ ఉడికాక మంట తగ్గించి డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, యాలకుల పొడి వేసి కలిపి, మంట తీసేయాలి. తీపిదనం ఎక్కువ కావాలనుకునేవారు మరికాస్త పంచదార కలపుకోవచ్చు. కుంకుమపువ్వు, గులాబీ రేకలు, మరిన్ని డ్రై ఫ్రూట్స్ చివరగా అలంకరించుకోవచ్చు.నోట్: ఎండుఖర్జూరం ముక్కలు కలుపుకోవాలంటే వాటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉపయోగించాలి.కచ్చీబిర్యానీ..కావల్సినవి: బాస్మతి బియ్యం – పావు కేజీ (250 గ్రా.ములు); మటన్ – కేజీ (ముక్కలు 2 అంగుళాల పరిమాణం); అల్లం– వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; ఉల్లిపాయలు – 5 (నిలువుగా సన్నగా తరిగి, విడిగా వేయించి పక్కనుంచాలి); కారం – టేబుల్ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; పచ్చి బొప్పాయి ముక్క – పేస్ట్ చేయాలి; చిలికిన పెరుగు – కప్పు; కుంకుమపువ్వు – కొన్ని రేకలు (గరిటెడు వేడి పాలలో కలిపి పక్కనుంచాలి)మటన్ మసాలా కోసం... (దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 పచ్చ యాలకులు, 3 లవంగాలు, బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ సాజీర) రైస్ మసాలా కోసం... (యాలకులు 2, దాల్చిన చెక్క, పచ్చ యాలక్కాయ, 2 లవంగాలు, నెయ్యి లేదా నూనె 3 టేబుల్‌స్పూన్లు, పుదీనా, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు తగినంత)తయారీ విధానం:బేసిన్లో మటన్ వేసి అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, బొప్పాయి ముద్ద, కారం, పసుపు, మసాలా, ఉప్పు, వేయించిన ఉల్లిపాయల తరుగు సగం వేసి కలిపి, 3 గంటల సేపు నానబెట్టాలి. కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల చొప్పున నీళ్లు, మసాలా, బియ్యం, తగినంత ఉప్పు వేసి ముప్పావు వంతు వరకు ఉడికించి, నీళ్లను వడకట్టాలి. తర్వాత అందులో నెయ్యి వేసి కలపాలి. మరో మందపాటి డేకిసా(గిన్నె) తీసుకొని నెయ్యి వేసి వేడయ్యాక నానిన మటన్ వేసి కలపాలి. పైన పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేయాలి. సగం ఉడికిన బియ్యం పైన లేయర్‌గా వేయాలి. మిగిలిన నెయ్యి, కుంకుమపువ్వు కలిపిన పాలు, నిమ్మరసం వేయాలి. డేకిసా మీద మూత పెట్టి, గోధుమపిండి ముద్దతో చుట్టూ మూసేయాలి. పెద్ద మంట మీద 20–25 నిమిషాలసేపు ఉడకనివ్వాలి. సన్నని మంట మీద మరో 40 నిమిషాలు ఉంచాలి. తర్వాత దించి, రైతా/ఏదైనా గ్రేవీతో వేడి వేడిగా వడ్డించాలి. (చదవండి: ప్రేమను పంచే శుభదినం ఈద్) -
మామా.. ఆర్డర్ చేస్తున్నా..!
ఏడాది కిందట పెళ్లైన ఓ జంట ఉద్యోగం చేసుకుంటోంది. భర్త చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తే... భార్య ప్రైవేటుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరూ వారి వృత్తిలో బిజీగా గడుపుతున్నారు. వంట చేయడం రాదు. దీంతో కొన్ని నెలలు వంట మనిషిని పెట్టుకున్నారు. రుచి లేదని ఆమెను చాలించారు. ఈ కారణంగా ఎక్కువగా ఫాస్ట్‌పుడ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. ఆస్పత్రి ఆవరణం, పలమనేరు రోడ్డు, మురకంబట్టు రోడ్డు, లేకుంటే తమిళనాడులోని వేలూరుకు సైతం వెళుతున్నారు.కొత్త జంటలు వంటపై తంటాలు పడుతోంది. పెళ్లి కూతుర్లు వంటింట్లో అడుగు పెట్టాలంటే తెగ ఫీలైపోతున్నారు. వంట చేయడం రాక కొంత మంది వంట గదికి దూరంగా ఉండిపోతున్నారు. మరికొంత మంది పని ఒత్తిళ్లతో వంట దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. ఇంకొంత మంది యూట్యూబ్ పాఠాలతో వంట వండేందుకు అపసోపాలు పడుతున్నారు. వారు వండిందే వారికే నచ్చక సింపుల్‌గా ఆన్లైన్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. లేకుంటే పాస్ట్ ఫుడ్‌ను వెతుక్కుంటున్నారు. వీటి సంఖ్య జిల్లాలో గణనీయంగా పెరిగింది. ఇలా ఆరగించడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాణిపాకం(చిత్తూరు): ఒకప్పుడు పెళ్లి చూపులంటే.. వరుడు వైపు వరకట్నంతో పాటు అమ్మాయికి వంటా వచ్చా అని అడిగేవాళ్లు. ఏ రకమైనవి ఎక్కువగా వండుతావ్ అని గుచ్చి గుచ్చి ప్రశ్నించేవారు. అప్పట్లో చదువు, ఉద్యోగం చూసేవారు కాదు. అమ్మాయి చక్కగా వండి పెడుతూ..ఇంట్లో ఉంటే చాలనుకునేవారు. ఇప్పుడు అమ్మాయి ఎంత వరకు చదువుకుంది..ఏం చేస్తోంది అని మాత్రమే చూస్తున్నారు. వధువు వైపు నుంచి...వరుడు చదువు, ఉద్యోగం, ఫ్యామిలీ పరిస్థితి చూసి..పెళ్లి ఫిక్స్ చేసేస్తున్నారు. అమ్మాయికి వంట వచ్చా అని అడిగే వాళ్లు పూర్తిగా కరువయ్యారు. చదువులపైనే దృష్టి పెడుతున్నారు.. ఒకప్పుడు ఆడ పిల్లలు 10 ఏళ్ల వయస్సు వచ్చిందంటేనే తల్లులు వంటింటికి తీసుకెళ్లి రకరకాల వంటలు చేయడం నేర్పేవాళ్లు. అత్తారింటికి వెళితే మీ అమ్మ వంట చేయడం నేర్పలేదా అని మమ్మలను చులకనగా మాట్లాడతారని తల్లులు పట్టుబట్టి వాళ్ల పిల్లలకు వంట నేర్పేవాళ్లు. ఇప్పుడు పల్లె, పట్నం అనే తేడా లేకుండా తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. పిల్లల చదువుపై దృష్టి పెడుతున్నారు. బాగా చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రభుత్వం ఉద్యోగం, డాక్టర్ అవ్వాలని, ఇతర ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో చాలా మంది ఉన్నత చదువుల కోసం బయట రాష్ట్రాలకు, విదేశాలకు పంపుతున్నారు. ఒకప్పుడు మగ పిల్లలను చదివిస్తే ప్రయోజకుడై..పోషిస్తారని అనుకునేవాళ్లు. ఇప్పుడు మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలను సమానంగా చదివిస్తున్నారు. చదువు తప్ప మరేది ముట్టుకోనివ్వడం లేదు. ఈ క్రమంలో ఆడ పిల్లలు వంటింటికి దూరమవుతున్నారు. తల్లులు సైతం పెళ్లైతే వంట నేర్చుకుంటుంది లే అని తేలికగా వదిలేస్తున్నారు. వంట చేయడం రాదు పెళ్లైన కొత్త జంటలు లగ్జరీ లైఫ్ వెతుక్కుంటున్నారు. పెళ్లికి ముందు నుంచే ఏ పని ముట్టుకోకుండా జీవించేయాలని కలలు కంటున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలు పుట్టింట్లో ఉన్నట్లుగా ఉండాలని కోరుకుంటున్నారు. అత్తారింటికి వెళ్లినా.. కాఫీ అంటే బెడ్ రూమ్‌కే వచ్చేయాలనే అనుకుంటున్నారు. వంట వచ్చిన మొగుడైతే ఇంకా బెటర్ అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఇలా పుట్టింట్లో వంట నేర్చుకోక కొత్త పెళ్లి కూతుర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా కాపురం పెట్టిన వారైతే వంట కోసం తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్ చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతులు కాల్చుకుంటూ వద్దురా..ఈ వంట తంటా అంటూ చాలించుకుంటున్నారు. ఆ వండిన వంట రుచికరంగా లేకపోవడంతో అబ్బాయిలు ఆమడదూరం వెళ్లిపోతున్నారు. ఇక ఉద్యోగ రీత్యా దంపతులు ఇద్దరూ వంటింటికి దూరంగా ఉంటున్నారు. 8 గంటల పని, తర్వాత ఇంటి పని, ఇతర పనులు వెరసి అలసిపోతున్నారు.బయట ఫుడ్ డేంజర్..? అధికంగా బయట ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్, రక్తనాళాల్లో కొలె్రస్టాల్ తదితర సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా పెళ్లైన వారు లావు కావడానికి ఇది కూడా ఒక కారణమని వెల్లడిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్‌కు జై కొడుతున్నారు దంపతులు ఇద్దరూ సంపాదన మీద పోటీ పడుతున్నారు. బిజీ లైఫ్‌లో పడిపోతున్నారు. నువ్వా నేనా అంటూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ తరుణంలో భార్య వంటింటికి దూరమై బయట ఫుడ్ కోసం అన్వేస్తున్నారు. అలాగే చాలా మంది వంట రాక అల్లాడిపోతున్నారు. యూట్యూబ్ చూసి వండిన ఆ టేస్ట్ రాకపోవడంతో ముద్ద మింగుడు పడడం లేదు. దీంతో ఫాస్ట్ ఫుడ్‌పై పడిపోతున్నారు. మూడు పూటల ఫాస్ట్‌ఫుడ్‌ను ఆరగిస్తున్నారు. లేకుంటే దర్జాగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ల పరిస్థితి అయితే అర్ధరాత్రి కూడా ఆర్డర్లు పెట్టుకుని ఆవురావురమని తినేస్తున్నారు. ఫుడ్ దొరక్కపోయినా ఫిజ్జాలు, బర్గర్లు తెప్పించుకుని కడుపు నింపుకుంటున్నారు. దీని ఫలితంగా జిల్లాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. బిర్యానీ సెంటర్లు సందుకొక్కటి ఉన్నాయి. వీరి రాకతో ఆ సెంటర్లు, హోటళ్లు నిండిపోతున్నాయి. కొత్త జంటలతో కళకళలాడుతున్నాయి. అనారోగ్యం పాలుకావద్దు ఫాస్ట్ ఫుడ్ ప్రస్తుత సమాజంలో ఫ్యాషన్‌గా మారింది. పేద, మధ్య ధనిక తేడా లేకుండా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు చాలా మందికి వంట రాదు అని బయట ఫుడ్ తింటున్నారు. ఇది మంచిది కాదు. వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. తాజాగా వండి తినడం ఉత్తమం. బయట తినడం వల్ల అనేక రోగాలు మనిషిని చుట్టుముడుతాయి. – వెంకట ప్రసాద్, వైద్య నిపుణుడు, చిత్తూరు -
ఉగాది రోజున నోరూరించే కమ్మని పిండివంటలు ఈజీగా చేసుకోండిలా..!
పూర్ణాలు..కావలసినవి: పచ్చిశనగ పప్పు – అర కేజీ, బెల్లం – అరకేజీ, యాలక్కాయలు – పది, బియ్యం – రెండు కప్పులు, పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి ∙నానిన బియ్యం మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ∙నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లు΄ోసి మూడు విజిల్స్ రానివ్వాలి ∙ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి ∙శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి ∙బియ్యం, మినపగుళ్ల రుబ్బులో కొద్దిగా ఉప్పు వేసి తి΄్పాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ∙మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.పరమాన్నం..కావలసినవి: బియ్యం – అర కప్పు, పాలు – కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, జీడి పప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూను, పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ: ముందుగా బియ్యాన్ని కడిగి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలుపోసి కాయాలి. కాగిన పాలల్లో నానబెట్టిన బియ్యం వేసి తిప్పుతూ ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికాక దించి చల్లారనివ్వాలి. స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడి పప్పు పలుకులు వేసి గోల్డ్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. స్టవ్ మీద మరో పాత్ర పెట్టి బెల్లం తురుము వేయాలి. దీనిలో పావుకప్పు నీళ్లుపోసి సిరప్‌లా మారేవరకు ఉడికించి, చల్లారనివ్వాలి. బెల్లం సిరప్‌లోనే యాలకుల పొడి, పచ్చ కర్పూరం వేసి తిప్పాలి. బెల్లం సిరప్ చల్లారక అన్నంలో వేసి బాగా కలపాలి, దీనిలో మిగిలిన నెయ్యి, జీడిపప్పుతో గార్నిష్ చేస్తే పరమాన్నం రెడీ.మామిడికాయ పులిహోరకావలసినవి: బియ్యం – కప్పు, పచ్చిమామిడి కాయ – మీడియం సైజుది ఒకటి, పచ్చికొబ్బరి తురుము – అర కప్పు, ఆవాలు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పచ్చిశనగ పప్పు – టీ స్పూను, వేరుశనగ గుళ్ళు – రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు – మూడు రెమ్మలు, పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి – నాలుగు, మెంతులు – పావు టీస్పూను, ఆయిల్ – నాలుగు టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టీస్పూను, చింతపండు ఉసిరికాయంత, బెల్లం తురుము – రెండు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం పొడి పొడిగా వచ్చేలా వండి ఆరబెట్టుకోవాలి మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా తరగాలి. ఎండు మిర్చి, మెంతులు, అరటీస్పూను ఆవాలను దోరగా వేయించుకుని పొడిచేయాలి. ఈ పొడిలో పచ్చికొబ్బరి, మామిడికాయ ముక్కలు, చింతపండు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేయాలి. చిటపటలాడాక మినప పప్పు, శనగ పప్పు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేయాలి ∙ఇవన్ని వేగాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి. ఇవి వేగాక పసుపు, గ్రైండ్ చేసిన మామిడికాయ మిశ్రమం వేసి ఐదు నిమిషాలు వేయించాలి ∙తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి, ఆరబెట్టిన అన్నాన్ని వేసి కలిపితే మామిడికాయ పులిహోర రెడీ. (చదవండి: 6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు) -
ది బెస్ట్ మాంసాహార రెసిపీగా భారతీయ వంటకం కీమా..!
ప్రపంచంలోనే ఉత్తమ మాంసాహార వంటకాల జాబితాను విడుదల చేసింది ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్. ఎప్పటిలానే బెస్ట్ స్వీట్స్, కర్రీల జాబితాను ఇచ్చినట్లుగానే ఈసారి బెస్ట్ మాంసాహార రెసిపీ జాబితాను విడుదల చేసింది. మొత్తం 100 ఉత్తమ మాంసాహార వంటకాలను విడుదల చేయగా అందులో మన భారతీయ వంటకం కీమా నాల్గోస్థానంలో నిలవడం విశేషం. ఈ కీమాని సమోసాలు, బ్రెడ్లు, పరాఠాలు వంటి వాటిల్లో నొంచుకుని ఆస్వాదిస్తారు. ముఖ్యంగా ఇది మేక లేదా కోడి మాంసాన్ని చాలా చిన్నగా కట్ చేస్తారు. దాంతో చేసే వంటకమే ఈ కీమా రెసిపీ. అయితే దీన్ని ఉడికించడం సులభం, రుచిగానూ ఉంటుంది. ఇక ప్రపంచంలోనే ఉత్తమ మాంసాహార వంటకాల జాబితాలో టర్కీకి చెందిన టైర్ కోఫ్టేసి అగ్రస్థానంలో నిలిచింది. తదుపరిస్థానాల్లో సెర్బియా నుంచి లెస్కోవాకి రోస్టిల్జ్ , టర్కీకి చెందిన అదానా కెబాప్, బారత్ నుంచి కీమా ట్రావ్నిక్, బోస్నియా నుంచి ట్రావ్నిక్కి సెవాపి, అజర్బైజాన్ నుంచి గురు ఖింగల్, ఇటలీ నుంచి పోల్పెట్ బోస్నియా మొదలైనవి చోటు దక్కించుకున్నాయి. కాగా, ఈ కీమా వంటకాలను అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరపకాయ, ఉల్లిపయాలు, నెయ్యి, గరం మసాల, కొద్దిపాటి సుగంధద్రవ్యాలతో రుచికరంగా తయారు చేస్తారు. సాధారణంగా పచ్చి బఠానీలు ఉపయోగించి చేస్తుంటారు చెఫ్‌లు. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: అతడు 95% దృష్టిని కోల్పోయాడు అయినా..! వైరల్‌గా ఆనంద్ మహీంద్రా పోస్ట్) -
చిరాకుగా ఉన్నా.. చిద్విలాసంతో ఉన్నా.. చిరుతిండికే ఓటు ..!
ఆఫీసులో ఉండగా కలుద్దామని ఫ్రెండ్ ఫోన్ చేస్తే సమీపంలో ఉన్న ఏ ఛాయ్ క్యాంటీన్లోనో, కేఫ్‌లోనో కలుద్దాం అని చెబుతాం.. ఏ పార్క్‌లోనో, ట్యాంక్ బండ్ మీదో ఒంటరిగా కూర్చున్నప్పుడు పల్లీలు అమ్మేవాడో, ముంత కింద పప్పు వాడో కనిపిస్తే.. నోటికి పని చెబుతాం.. ఇలా ఎందుకు చేస్తాం? ఆకలి తీర్చుకోడానికా? లేక అవి తినాలనే ఆతృతతోనా? అంటే రెండూ కాదు.. మన మూడ్‌ను మెరుగుపరుచుకోవడం కోసం అంటున్నారు హైదరాబాద్ నగరవాసులు. రోడ్డు పక్కన దొరికే పానీ పూరీ కావచ్చు, థియేటర్లో కరకరమనిపించే పాప్ కార్న్ కావచ్చు.. సరదాగా లాగించే సమోసాలు కావచ్చు.. చిది్వలాసంతో నమిలేసే చిప్స్కావచ్చు.. ఇవన్నీ ఇంట్లో ముప్పూటలా తినేతిండికి అదనం. మన మూడ్స్‌ను మెరుగుపరిచే ఇంధనం.. గోద్రెజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎస్టీటీఈఎమ్ 2.0 స్నాకింగ్ రిపోర్ట్ ప్రకారం గత కొంతకాలంగా అధ్యయనాలు చెబుతున్న ఇదే అంశాన్ని అంగీకరిస్తున్నారు నగరవాసులు. చిరుతిండి మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. మన భావోద్వేగాలను మెరుగుపరచడంలో శక్తిమంతమైన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడు? ఎందుకు? ఏమిటి ఎలా.. సిటిజనులు స్నాక్‌కు సై అంటున్నారు? ఈ రిపోర్ట్‌లో పేర్కొన్న ప్రకారం చూస్తే.. మంచి మూడుకు స్నాక్ బూస్ట్..చిరుతిండి, హ్యాపీ మూడ్స్ ఒకదానికొకటి అనుబంధంగా ఉంటున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 62% మంది మూడ్స్‌ను హ్యాపీగా ఉంచడం కోసం స్నాక్స్ తీసుకుంటారని అంగీకరించారు. అదే విధంగా 45% మంది పార్టీలు, వేడుకల సమయంలో ఫ్రోజెన్ స్నాక్స్ కోసం చూస్తామని చెప్పారు. అంటే విభిన్న రకాల వంటకాలు ఉన్నప్పటికీ స్నాక్స్ విలువ తగ్గదు అని దీనిద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అవి వారి అనుభవాలను మరింతగా మెరుగుపరుస్తాయనే ఆలోచనతోనే అని చెబుతున్నారు. అలాగే నగరంలో 45% మంది వారాంతాల్లో కూడా ఫ్రోజెన్ స్నాక్స్‌ను ఇష్టపడతారు. వారి విశ్రాంతి సమయాలకు కొత్త రుచులను జత చేస్తారు. ఆరోగ్యకరమైనవి ఎంచుకుంటే మేలు.. స్నాక్స్ తీసుకోవడం తప్పుకాకున్నా.. ఒబెసిటీ ముప్పు వెంటాడుతూనే ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మితంగా తీసుకునే చిరుతిండిలో ఆరోగ్యకరమైన బాదం తదితర పప్పులు చేర్చాలని, విటమిన్లు, జింక్, ఫోలేట్ ఐరన్‌తో సహా 15 ముఖ్యమైన పోషకాల సహజ మూలంగా ఆల్మండ్స్ రోగనిరోధకతను మెరుగుపరుస్తాయని పోషక నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎప్పుడైనా ఆస్వాదించడానికి అనుకూలమైన చిరుతిండిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చింది. అలాగే నారింజ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు విటమిన్–సీ అందిస్తాయి. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకం–ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రక్షణ ఇస్తుంది. ఈ పండ్లను స్నాక్స్‌గా మార్చుకోవడం రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అలాగే ఆకుకూరలతో కూడిన వెజ్ సలాడ్స్ కూడా మేలైనవేనని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.టైం ఏదైనా.. అటెన్షన్ కోసం.. పరీక్షల ముందు టెన్షన్ కావచ్చు.. రొమాంటిక్ సమయంలో అటెన్షన్ కావచ్చు.. కాదే సందర్భమూ స్నాకింగ్‌కు అనర్హం అంటున్నారు నగరవాసులు. నగరంలో 17% మంది విద్యార్థులు పరీక్షా సన్నాహక సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం చిరుతిండికి జై కొడుతున్నామని అంటున్నారు. మరోవైపు శృంగార సమయంలోనూ మానసిక స్థితిని బెటర్‌గా ఉంచేందుకు స్నాక్స్ తోడు కోరుకుంటున్నామని 16 శాతం మంది చెప్పారు. ఆట పాటల్లోనూ అదే బాట.. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీ జరుగుతోంది. ఇలాంటి ప్రత్యక్ష క్రీడా ఈవెంట్లను కేఫ్స్లోనో, పబ్స్/క్లబ్స్లోనో వీక్షించే సమయంలో దాదాపు అందరి ముందూ ఏదో ఒక చిరుతిండి కనబడడం మనం గమనించవచ్చు. ఇదే విషయాన్ని అంగీకరిస్తూ నగరంలో 50% మంది తమ వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచుకోడానికి స్నాక్స్‌కి సై అంటారు. అదే విధంగా 54% మంది నగరవాసులు టీవీ/ఒటీటీ/మొబైల్లో వెబ్ సిరీస్, సినిమాలు లేదా షోలను చూస్తున్నప్పుడు స్నాక్స్ తీసుకోడాన్ని ఇష్టపడతామని చెప్పారు. -
చిరాకుగా ఉన్నా.. చిద్విలాసంతో ఉన్నా.. చిరుతిండికే ఓటు
ఆఫీసులో ఉండగా కలుద్దామని ఫ్రెండ్ ఫోన్ చేస్తే సమీపంలో ఉన్న ఏ ఛాయ్ క్యాంటీన్లోనో, కేఫ్‌లోనో కలుద్దాం అని చెబుతాం.. ఏ పార్క్‌లోనో, ట్యాంక్ బండ్ మీదో ఒంటరిగా కూర్చున్నప్పుడు పల్లీలు అమ్మేవాడో, ముంత కింద పప్పు వాడో కనిపిస్తే.. నోటికి పని చెబుతాం.. ఇలా ఎందుకు చేస్తాం? ఆకలి తీర్చుకోడానికా? లేక అవి తినాలనే ఆతృతతోనా? అంటే రెండూ కాదు.. మన మూడ్‌ను మెరుగుపరుచుకోవడం కోసం అంటున్నారు నగరవాసులు. రోడ్డు పక్కన దొరికే పానీ పూరీ కావచ్చు, థియేటర్లో కరకరమనిపించే పాప్ కార్న్ కావచ్చు.. సరదాగా లాగించే సమోసాలు కావచ్చు.. చిది్వలాసంతో నమిలేసే చిప్స్కావచ్చు.. ఇవన్నీ ఇంట్లో ముప్పూటలా తినేతిండికి అదనం. మన మూడ్స్‌ను మెరుగుపరిచే ఇంధనం.. గోద్రెజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎస్టీటీఈఎమ్ 2.0 స్నాకింగ్ రిపోర్ట్ ప్రకారం గత కొంతకాలంగా అధ్యయనాలు చెబుతున్న ఇదే అంశాన్ని అంగీకరిస్తున్నారు నగరవాసులు. చిరుతిండి మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. మన భావోద్వేగాలను మెరుగుపరచడంలో శక్తిమంతమైన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడు? ఎందుకు? ఏమిటి ఎలా.. సిటిజనులు స్నాక్‌కు సై అంటున్నారు? ఈ రిపోర్ట్‌లో పేర్కొన్న ప్రకారం చూస్తే..మంచి మూడుకు స్నాక్ బూస్ట్..చిరుతిండి, హ్యాపీ మూడ్స్ ఒకదానికొకటి అనుబంధంగా ఉంటున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 62% మంది మూడ్స్‌ను హ్యాపీగా ఉంచడం కోసం స్నాక్స్ తీసుకుంటారని అంగీకరించారు. అదే విధంగా 45% మంది పార్టీలు, వేడుకల సమయంలో ఫ్రోజెన్ స్నాక్స్ కోసం చూస్తామని చెప్పారు. అంటే విభిన్న రకాల వంటకాలు ఉన్నప్పటికీ స్నాక్స్ విలువ తగ్గదు అని దీనిద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అవి వారి అనుభవాలను మరింతగా మెరుగుపరుస్తాయనే ఆలోచనతోనే అని చెబుతున్నారు. అలాగే నగరంలో 45% మంది వారాంతాల్లో కూడా ఫ్రోజెన్ స్నాక్స్‌ను ఇష్టపడతారు. వారి విశ్రాంతి సమయాలకు కొత్త రుచులను జత చేస్తారు.టైం ఏదైనా.. అటెన్షన్ కోసం.. పరీక్షల ముందు టెన్షన్ కావచ్చు.. రొమాంటిక్ సమయంలో అటెన్షన్ కావచ్చు.. కాదే సందర్భమూ స్నాకింగ్‌కు అనర్హం అంటున్నారు నగరవాసులు. నగరంలో 17% మంది విద్యార్థులు పరీక్షా సన్నాహక సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం చిరుతిండికి జై కొడుతున్నామని అంటున్నారు. మరోవైపు శృంగార సమయంలోనూ మానసిక స్థితిని బెటర్‌గా ఉంచేందుకు స్నాక్స్ తోడు కోరుకుంటున్నామని 16 శాతం మంది చెప్పారు.ఆట పాటల్లోనూ అదే బాట.. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీ జరుగుతోంది. ఇలాంటి ప్రత్యక్ష క్రీడా ఈవెంట్లను కేఫ్స్లోనో, పబ్స్/క్లబ్స్లోనో వీక్షించే సమయంలో దాదాపు అందరి ముందూ ఏదో ఒక చిరుతిండి కనబడడం మనం గమనించవచ్చు. ఇదే విషయాన్ని అంగీకరిస్తూ నగరంలో 50% మంది తమ వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచుకోడానికి స్నాక్స్‌కి సై అంటారు. అదే విధంగా 54% మంది నగరవాసులు టీవీ/ఒటీటీ/మొబైల్లో వెబ్ సిరీస్, సినిమాలు లేదా షోలను చూస్తున్నప్పుడు స్నాక్స్ తీసుకోడాన్ని ఇష్టపడతామని చెప్పారు.ఆరోగ్యకరమైనవి ఎంచుకుంటే మేలు.. స్నాక్స్ తీసుకోవడం తప్పుకాకున్నా.. ఒబెసిటీ ముప్పు వెంటాడుతూనే ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మితంగా తీసుకునే చిరుతిండిలో ఆరోగ్యకరమైన బాదం తదితర పప్పులు చేర్చాలని, విటమిన్లు, జింక్, ఫోలేట్ ఐరన్‌తో సహా 15 ముఖ్యమైన పోషకాల సహజ మూలంగా ఆల్మండ్స్ రోగనిరోధకతను మెరుగుపరుస్తాయని పోషక నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎప్పుడైనా ఆస్వాదించడానికి అనుకూలమైన చిరుతిండిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చంది. అలాగే నారింజ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు విటమిన్–సీ అందిస్తాయి. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకం–ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రక్షణ ఇస్తుంది. ఈ పండ్లను స్నాక్స్‌గా మార్చుకోవడం రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అలాగే ఆకుకూరలతో కూడిన వెజ్ సలాడ్స్ కూడా మేలైనవేనని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. -
హల్దీరామ్‌లో టెమాసెక్‌కు వాటా
న్యూఢిల్లీ: ప్యాక్డ్ స్నాక్, స్వీట్స్ కంపెనీ హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్‌లో సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ టెమాసెక్ హోల్డింగ్స్ 10 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు అనుమతించమంటూ అనుబంధ సంస్థ జాంగ్‌సాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ పీటీఈ ద్వారా కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు దరఖాస్తు చేసింది. ప్రతిపాదిత లావాదేవీ ద్వారా కంపెనీ చెల్లించిన మూలధనంలో 10 శాతానికంటే తక్కువ వాటా సొంతం చేసుకుకోనున్నట్లు సీసీఐకి తెలియజేసింది. షేర్లు, వోటింగ్ హక్కుల ద్వారా వాటా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 85,700 కోట్లు) విలువలో హల్దీరామ్ స్నాక్స్‌లో 10 శాతం వాటా కొనుగోలుకి టెమాసెక్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బ్లాక్‌స్టోన్, అల్ఫా వేవ్ గ్లోబల్, బెయిన్ క్యాపిటల్ తదితర పీఈ దిగ్గజాలతో చర్చల అనంతరం టెమాసెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అగర్వాల్ కుటుంబ నిర్వహణలోని హల్దీరామ్ స్నాక్స్ రెస్టారెంట్లను సైతం నిర్వహించే సంగతి తెలిసిందే. 1937లో రాజస్తాన్‌లోని బికనీర్‌లో ఏర్పాటైన కంపెనీ వచ్చే ఏడాది(2025–26)లో పబ్లిక్ ఇష్యూ చేపట్టే ప్రణాళికల్లో ఉంది. తాజాగా అందుకోనున్న నిధులను విస్తరణకు వినియోగించే వీలుంది. -
'బిర్యానీ' పూర్తిగా మాంసం ఆధారిత వంటకమా?
ఆహార ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో అగ్రస్థానం బిర్యానీదే. అంతేగాదు ఆన్లైన్ ఎక్కువ ఆర్డర్ చేసేది కూడా బిర్యానీ. అయితే ఈ వంటకం ఇరాన్లో ఉద్భవించిందని, మొఘల్ పాలన కారణంగా భారత ఉపఖండంలో నెమ్మదిగా భాగమైందని చెబుతుంటారు పాక నిపుణులు. ఆ విధంగా మనకు బిర్యానీ తెలిసిందేనది చాలామంది వాదన. అయితే అసలు బిర్యానీ అంటే మాంసంతో కలిపి చేసేదే బిర్యానీ అని, కూరగాయలతో చేసే వెజ్ బిర్యానీ అనేది బిర్యానీనే కాదని అంటున్నారు. నెట్టింట దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. మరీ ఇంతకీ వెజ్ బిర్యానీ అనేది ఉందా..?. మాంసం ఆధారిత వంటకమే బిర్యానీనా అంటే..వెజ్ లేదా నాన్ వెజ్ బిర్యానీ రెండూ వాటి రుచి పరంగా ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. అయితే పాక నిపుణులు మాత్రం బిర్యానీ అనగానే మాంసంతోనే చేసే వంటకమని నమ్మకంగా చెబుతున్నారు. కానీ మరికొందరు మాత్రం కూరగాయలతో చేసినదే బిర్యానీ అని వాదిస్తున్నారు. ప్రముఖ చెఫ్‌లు పాక నిపుణులు బిర్యానీని పూర్వం సుగంధ ద్రవ్యాల తోపాటు, జంతువుల కొవ్వుని కూడా జోడించి మరింత రుచిని తీసుకొచ్చారని చెబుతున్నారు. అందువల్ల మాంసం లేకుండా తయారుచేసిన వంటకాన్ని నిజంగా "బిర్యానీ"గా పరిగణించలేమని అన్నారు. అయితే కాలక్రమే ఆహార వంటకాలు అభివృద్ధి చెందడంతో.. మాసంహారం తినని వాళ్ల కోసం ఇలా కూరగాయలు జోడించి చేయడంతో అది కాస్త వెజ్ బిర్యానీగా పిలవడం జరిగిందన్నారు. అయితే అది నిజమైన బిర్యానీ కాదని తేల్చి చెబుతున్నారు ప్రముఖ చెఫ్, ఫుడ్ ల్యాబ్ వ్యవస్థాపకుడు సంజ్యోత్ కీర్. అలాగే కూరగాయలు జోడించినంత మాత్రమే దానికి బిర్యానీ ఘమఘలు రావని, దానికి సుగంధ ద్రవ్యాలు తోడైతేనే.. కూరగాయలు రుచిగా మారి మనకు అద్భుతమైన వెజ్ బిర్యానీ సిద్ధమవుతుందని చెప్పారు. అందువల్ల కూరగాయలతో చేసినదాన్ని బిర్యానీగా పరిగణించరని అన్నారు. చాలామందికి ఇది నచ్చకపోయినా..వాస్తవం ఇదేనని అన్నారు. అలా అని వెజ్ బిర్యానీని కూడా తీసిపారేయలేం. ఎందుకంటే కాటేజ్ చీజ్ (పనీర్), సోయా బీన్, టోఫు, పుట్టగొడుగులు, జాక్‌ఫ్రూట్ (కథల్) లేదా ఖర్జూరం (ఖజూర్) వంటి కూరగాయలతో మరింత రుచికరంగా చేస్తున్నారు చెఫ్‌లు. చెప్పాలంటే..మాంసంతో చేసినన బిర్యానీ రుచి కూడా దానిముందు సరిపోదేమోనన్నంత టేస్టీగా ఉంటోందన్నారు చెఫ్ సంజ్యోత్ కీర్. (చదవండి: యూట్యూబ్ చూసి సెల్ఫ్ సర్జరీ..! వైద్య నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్
ఉరుకులు పరుగుల జీవితంలో ప్రత్యేకమైక సమయాన్ని కేటాయించి వంటలు చేసుకోవడం చాలా మందికి కష్టతరంగా మారింది. హోటల్స్‌లో భోజనం కూడా ఖర్చుతో కూడుకుంది కావడంతో అన్నం మాత్రం వండుకుని కర్రీస్‌ను బయట కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో నగరంలో వీధికో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. నగరంలోని కర్రీస్ పాయింట్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్లు కొత్త రుచులతో ఆహార ప్రియులకు రోజుకో ఒక స్పెషల్ కర్రీని పరిచయం చేస్తున్నారు. నాన్‌వేజ్ ఐటమ్స్‌లో కొత్త రకాలను పరిచయం చేస్తూ కర్రీస్ సెంటర్లు నగర వాసుల మన్నలను పొందుతున్నాయి. 17 ఏళ్ల క్రితం మాగుంట లేఅవుట్ ప్రాంతంలో గంగోత్రి కర్రీస్ పాయింట్ ఏర్పాటు చేశారు. అప్పట్లో కర్రీస్ పాయింట్లను పరిచయం చేసింది వారే. అయితే ప్రస్తుతం ఆ కర్రీ పాయింట్ లేదు. దాదాపు 400పైగా కర్రీ పాయింట్స్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో కర్రీ పాయింట్స్ అనేకం వెలిశాయి. ఒక్క స్టోన్‌హౌస్‌పేట, బాలాజీనగర్, నవాబుపేట, కిసాన్‌నగర్, మైపాడుగేటు ప్రాంతాల్లోనే 70 కర్రీస్ పాయింట్లు ఉన్నాయి. అదే విధంగా హరనాథపురం, చిల్డ్రన్స్‌పార్క్, చిన్నబజారు, పెద్దబజారు, వీఆర్సీ సెంటర్, మద్రాసు బస్టాండు, దర్గామిట్ట, వేదాయపాళెం, అయ్యప్పగుడి ఇలా ప్రధాన ప్రాంతాల్లోని అధిక సంఖ్యలో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. ఇలా మొత్తం దాదాపు 400కు పైగా కర్రీస్ పాయింట్లు ఉన్నాయి. చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు నిత్యావసరాల ఖర్చులు పెరగడంతో... గతంతో పోలిస్తే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఇంట్లో గ్యాస్, నిత్యావసర వస్తువులకు ఖర్చు చేయడం కన్నా రూ.20 నుంచి రూ.30లకు ఒక కర్రీ ప్యాకెట్ రావడంతో వాటిపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సాంబార్, పప్పు, రసానికి కలిపి రూ.60 నుంచి రూ.80లు వెచ్చిస్తే నలుగురు వ్యక్తులు తినేందుకు సరిపోతుంది. ఇంట్లో అన్నం వండుకుని కర్రీస్ కొనుగోలు చేస్తే రోజు గడిచిపోతుంది. జీవనోపాధికి దోహదం హోటల్స్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారు, సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో ఉన్న వారు కర్రీ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇంటి పెద్ద మాత్రమే కాకుండా ఇంట్లోని భార్య, పిల్లలు కర్రీ పాయింట్లో అవసరమైన పనులు ఒకరికి ఒకరు సహాయ పడుతూ బుతుకు జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ఉదయం 4 నుంచి కర్రీకి సంబంధించి కూరగాయలు, ఇతర వస్తువులను సమకూర్చుకుంటారు. ఉదయం 11 గంటలకే అన్ని రకాల కర్రీస్‌ను అందుబాటులో ఉంచుతారు. సాయంత్రానికి తిరిగి మళ్లీ వంటకాలు చేయాల్సి ఉంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనులను పంచుకుంటారు. వీరిలో రుచిని, నాణ్యతను అందించిన వాళ్లకు మాత్రమే ఆదరణ లభిస్తుంది. సండే స్పెషల్స్ ఆదివారం వచ్చిందంటే నగర వాసులు సినిమాలు, షికార్లుకు వెళ్తుంటారు. రోజంతా పిల్లలతో గడుపుతుంటారు. బయట వంటకాలు రుచి చూసేందుకు ఇçష్ట పడుతుంటారు. దీంతో ఆదివారం హోటల్స్‌తో పాటు కర్రీ సెంటర్లు కూడా ప్రత్యేకంగా నాన్‌వెజ్ రుచులను అందుబాటులోకి తెస్తుంటాయి. రాగి సంగటితో పాటు బొమ్మిడాయల పులుసు, రొయ్యలు, చికెన్, మటన్‌లో ఫ్రైలు, కర్రీల విక్రయాలు చేస్తుంటారు. సాధారణ రోజులో కన్నా ఆదివారం తమ వ్యాపారం జోరుగా ఉంటుందని కర్రీ పాయింట్ నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడికి.. సీసీటీవీలో దృశ్యాలు వివిధ రకాల పచ్చళ్లు... కర్రీ పాయింట్లలో అనేక రకాల పచ్చళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని కర్రీ సెంటర్లు వారంలో ప్రతిరోజు ఒక్కో రకం పచ్చళ్లను అందుబాటులో ఉంచుతుంటాయి. అదే విధంగా కారపు పొడులు సైతం విక్రయిస్తున్నారు. అదే విధంగా నాన్‌వెజ్‌లో ఫ్రై ఐటమ్స్, వెజ్‌లో కూడా పలు కొత్త రకాల ఫ్రై ఐటమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. రుచి, నాణ్యత ఉంటేనే.. చాలా కాలంగా కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నా. అయితే రుచి, నాణ్యత ఇవ్వగలిగితేనే కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు హెచ్చుతగ్గులు ఉన్నా కస్టమర్ల కోసం అందుబాటు ధరల్లో విక్రయాలు చేస్తుంటాం. – వెంకటేశ్వర్లు, కర్రీ పాయింట్ నిర్వాహకుడు -
'విద్యార్థి భవన్ బెన్నే దోసె': యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా..
కొన్ని రెస్టారెంట్ ఏళ్లనాటివి అయినా.. అక్కడ అందించే రుచే వేరు అనిపిస్తుంది. ఎన్నో కొంగొత్త హైరేంజ్ రెస్టారెంట్లు వచ్చినా..! ఏళ్ల నాటి మధురస్మృతులకు నిలయమైన ఆ పాత రెస్టారెంట్లకే ఎక్కువ ప్రజాదరణ ఉంటుంది. ఎన్ని హంగు ఆర్భాటలతో ఐదు నక్షత్రాలలాంటి హోటల్స్ వచ్చినా.. వాటి క్రేజ్ తగ్గదు. కేవలం సామాన్యులే కాదు ప్రముఖులు, సెలబిట్రీలు సైతం అలనాటి రెస్టారెంట్ పాక రుచికే మొగ్గుచూపుతారు. వాటి టేస్ట్‌కి ఫిదా అంటూ కితాబిస్తారు కూడా. అలాంటి ప్రఖ్యాతిగాంచిన రెస్టారెంటే ఈ బెంగళూరుకి చెందిన 'విద్యార్థి భవన్'. ఈ రెస్టారెంట్ అందించే విభిన్న దోసె, వాటిని మెచ్చిన ప్రముఖులు గురించి ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందామా..!. బెంగళూరు వాసులు ఇష్టపడే 1943ల నాటి రెస్టారెంట్ ఈ 'విద్యార్థి భవన్'. ఇది ఐకానిక్ బెన్నే దోసెలకు ఫేమస్. ఇక్కడ చేసే బెన్నే దోసెల రుచే వెరేలెవెల్. గాంధీనగర్‌లోని గల్లో ఉండే ఈ ఐకానిక్ రెస్టారెంట్ స్థానికులు, పర్యాటకులకు నోరూరించే రుచులతో మైమరిపిస్తోంది. ఎవ్వరైనా బెన్నే దోస తినాలంటే అక్కడకే వెళ్లాలనేంతగా పేరు తెచ్చుకుంది ఈ రెస్టారెంట్. నిత్యం రద్దీగా క్యూలైన్లు కట్టి ఉంటారు జనాలు ఆ రెస్టారెంట్ వద్ద. అంతేగాదు అక్కడ యాజమాన్యం 50% అడ్వాన్స్డ్ బుకింగ్ సీటింగ్‌కి ప్రాద్యాన్యత ఇస్తుందంటే..ఆ రెస్టారెంట్ ఎంత బిజీగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందుగా బుక్ చేసుకోకపోతే వారాంతల్లో వెళ్లక పోవడమే బెటర్.ఈ రెస్టారెంట్ చరిత్ర..ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ రెస్టారెంట్లో బెన్నే దోసెలు, ఫిల్టర్ కాఫీలను ఆస్వాదించడానికి వచ్చే కస్టమర్లే ఎక్కువట. ఇక్కడ ఉండే సిబ్బంది కూడా విలక్షణంగా ఉంటారు. ఎందుకంటే ఒకేసారి ఎనిమిది ప్లేట్ల బెన్నెదోసెలను సర్వ్ చేస్తుంటారు. ఆ విధానం చూస్తే..కచ్చితం కళ్లు బైర్లుకమ్ముతాయి. దీన్ని 1943-1944 ప్రారంభంలో వెంకటరామ ఉడల్ నగరం వెలుపల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. అదీగాక ఆ టైంలో రెస్టారెంట్లకు చివర్లో భవన్ అని పెట్టేవారట. అలా దీనికి విద్యార్థి భవన్ అని పెట్టడం జరిగింది. అప్పట్లో ఈ రెస్టారెంట్ సమీపంలో ఉంటే ఆచార్య పబ్లిక్ స్కూల్, నేషనల్ కాలేజ్ తదితర సమీప పాఠశాల విద్యార్థులకు బోజనం అందుబాటులో ఉండేలా దీన్ని ఏర్పాటు చేశారు. అదీగాక ఆ రెస్టారెంట్ ఉన్న ప్రాంతం విద్యాసంస్థలకు నిలయం కావడంతో అనాతికాలంలోనే మంచి ఫేమస్ అయిపోయింది. అంతేగాదు ఇక్కడకు వచ్చే కస్టమర్లలో ఎక్కువ మంది ప్రముఖుల, సెలబ్రిటీలు, రచయితలేనట.ఈ దోసెను మెచ్చిన అతిరథులు..ముఖ్యంగా యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, చెఫ్ సంజీవ్ కపూర్, స్టార్‌బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సీగల్, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి వంటి ఎందరో ఈ రెస్టారెంట్ బెన్నే దోసకు అభిమానులట. అంతేగాదు ఈ రెస్టారెంట్ అనగానే ఠక్కున గుర్తువచ్చేది బెన్నేదోసనే అట. అందువల్ల ఆ హోటల్ సిగ్నేచర్ డిష్‌గా ఆ వంటకం మారిపోవడం విశేషం. ఇక్కడ ఆ దోస తోపాటు ఇడ్లీలు, కేసరి బాత్ లేదా రవా బాత్, మేడు వడ వంటి విభిపకప అల్పాహారాలను కూడా సర్వ్ చేస్తారు. అంతేగాదు అక్కడ టిఫిన్ ముగించి చివరగా ఫిల్టర్ కాఫీని ఆస్వాదించకుండా వెళ్లరట. అంతలా ప్రజాదారణ పొందిన ఈ ఐకానిక్ విద్యార్థి భవన్ రెస్టారెంట్ రుచిని మీరు కూడా ఓ పట్టు పట్టేయండి మరీ..!.(చదవండి: work life Balance: అలా చేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజీ..! టెకీ సలహ వైరల్) -
సరదాగా ఈ సండే చేప, చికెన్‌తో వెరైటీ స్నాక్స్ చేయండిలా..!
ఫిష్ చిప్స్ కావలసినవి: చేప ముక్కలు– 500 గ్రాములు (ముల్లు్ల లేనివి)మైదా పిండి– అర కప్పుమొక్కజొన్న పిండి– పావు కప్పుబేకింగ్ పౌడర్– కొద్దిగాబ్రెడ్ పౌడర్– 1 టేబుల్ స్పూన్మిరియాల పొడి– అర టీ స్పూన్సోడా వాటర్– కొద్దిగాఉప్పు– తగినంతమసాలా దినుసులు– కొద్దికొద్దిగా (మిక్సీ పట్టి పౌడర్లా చేసుకోవాలి)నూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ: ముందుగా చేప ముక్కలను శుభ్రం చేశాక, నీరు లేకుండా ఆరబెట్టాలి. అనంతరం వాటికి ఉప్పు, మిరియాల పొడి పట్టించి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి మైదా పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, బ్రెడ్ పౌడర్, ఉప్పు, మిరియాల పొడి, మసాలా దినుసుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. సోడా వాటర్ కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు ఏర్పడకుండా చేసుకోవాలి. అనంతరం చేప ముక్కలను ఈ మిశ్రమంలో ముంచి, బాగా పట్టించి, నూనెలో దోరగా వేయించుకోవాలి. బంగాళ దుంపలను కూడా ఇదే విధంగా వేయించుకుని, వీటితో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.చికెన్‌తో స్పైసీ ఎగ్స్కావలసినవి: గుడ్లు– 5 లేదా 6 బోన్‌లెస్ చికెన్– 1 కప్పు కారం– 2 టీ స్పూన్లుపసుపు– చిటికెడుగరంమసాలా– 2 టీ స్పూన్ల పైనే చికెన్ మసాలా– 1 టీ స్పూన్ ఉప్పు– తగినంతమిరియాల పొడి– కొద్దిగా, కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలు– గార్నిష్కితయారీ: ముందుగా బోన్‌లెస్ చికెన్‌ను శుభ్రం చేసుకుని, మిక్సీ పట్టి, కొద్దిగా పెరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గుడ్లు ఉడికించి, పెంకులు తీసి, సగానికి కట్ చేసుకుని పసుపు సొనలను ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అనంతరం చికెన్ మిశ్రమాన్ని, పసుపు సొనలతో కలిసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఒక్కో గుడ్డు చెక్కభాగంలో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని పెట్టుకుని కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలను వేసుకుని సర్వ్ చేసుకుంటే.. ఇవి భలే రుచిగా ఉంటాయి.(చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే..! అచ్చం మనిషిని పోలిన రోబో..) -
అరబిక్ వంట.. కడప ముంగిట!
రంజాన్‌లో అత్తర్ల గుబాళింపులే కాదు రకరకాల వంటలూ ఘుమఘుమలాడిస్తున్నాయి. పసందైన రుచులతో నోరూరిస్తున్నాయి. అల్ ఫహమ్... అల్ మంది..షవర్మ.. హలీం.. ఇలా ఒకటా రెండా అనేక అరబిక్ వంట లు.. కడప ముంగిట వాలిపోయాయి. రుచుల పంటను ఆస్వాదించమని ఆహారప్రియులను ఆహా్వనిస్తున్నాయి. అసలే రంజాన్.. ఆపై కొత్త వంటకాలు తొంగిచూసిన నేపథ్యంలో సాక్షి సండే స్పెషల్.కడప కల్చరల్: రంజాన్... మనిషిని మానవత్వంగల పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు అవకాశాలను అందించే పండుగ. శారీరకంగా, మానసికంగా మనిషిని ఉన్నతుడినిచేసే ఆధ్యాత్మికత వేడుక. ఈ సందర్భంగా మార్కెట్లు, వీధులలో సెంట్లు, అత్తర్ల గుబాళింపులు మనసులను దోచేస్తాయి. ఒక్క సెంట్లు.. అత్తర్లే కాదు.. రంజాన్ అనగానే హలీం.. తదితర పౌష్టికాహారం వంటకాలూ గుర్తుకొస్తాయి. కొన్నేళ్లుగా పలు రకాల అరబిక్ వంటలు కడప ముంగిట వాలిపోయాయి. దాదాపు రెండేళ్లకో సారి ప్రత్యేకమైన అరేబియన్ వంటకం పరిచయం అవుతుండడం విశేషం. అల్ ఫహమ్... ఇటీవలి కాలంలో ఎక్కువ ఆదరణ పొందిన వంటకం అల్ ఫహమ్. బొగ్గులపై కాల్చిన కోడి మాంసం కావడంతో రుచి బాగుంటుంది. పైగా నూనెలు.. మసాలాలు లేకపోవడంతో ఆరోగ్యానికీ మంచిదన్న కారణంతో ఇప్పుడందరూ ఈ వంటకాన్ని ఇష్టపడుతున్నారు. కాగా కడప నగరానికి చెందిన జమాల్ వలీ దశాబ్దం పైగా అరబ్ దేశాల్లో వంటమాస్టర్‌గా పని చేశారు. ఆ అనుభవంతో కడప వాసులకు తొలిసారిగా 2006లో ఫహమ్ను పరిచ యం చేశారు. ప్రస్తుతం ‘మాషా అల్లాహ్’ ఫహం నడుపుతూ 8 మందికి ఉపాధి కలి్పస్తున్నారు. అల్ మందీ... రంజాన్ మాసంలోనే కాకుండా ఏడాదంతా లభించే మరో అరబిక్ వంట అల్ మందీ. ఒక పెద్ద పళ్లెంలో పెట్టిన ఆహారాన్ని చుట్టూ ఇద్దరు ముగ్గురు కూర్చుని ఇష్టంగా తింటుంటూరు. సరదాగా ఇతరులతో కలిసి ఆనందించాలనుకునే వారు దీనిని ఇష్టపడతారు. ఆహారంతోపాటు ఆత్మీయతలను కూడా పంచుకునే అవకాశం లభిస్తోంది. ఇక వీటితో పాటు,కబాబ్, షవర్మ, మస్బూస్ తదితర రకాలు ఆహార ప్రియులను ఆకర్శిస్తున్నాయి. సాయంత్రాలలో రంజాన్ ఉపవాస దీక్ష విరమించి స్వీకరించే ఇఫ్తార్‌లో ఇటీవల ఖబాబ్లు సాధారమైపోయాయి. హలీం... రంజాన్ అనగానే ప్రత్యేక వంటకమైన హలీం గుర్తుకు వస్తుంది. ఉపవాస దీక్షల్లో ఉన్న వారితోపాటు ఇతరులకు కూడా ఇది పౌష్ఠికాహారం. నిన్నా మొన్నటివరకు కేవలం రంజాన్ మాసంలో మాత్రమే లభిస్తుండిన ఈ వంటకం ప్రస్తుతం అక్కడక్కడ ఇతర సీజన్లలో కూడా అందుబాటులో ఉంటోంది. దానికి ముస్లిమేతరుల నుంచి కూడా లభిస్తున్న ఆదరణ కారణంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా అందుబాటులో ఉండడంతోపాటు రోజువారి స్పెషల్ వంటకం స్థాయికి ఎదిగింది. పైగా పెళ్లిళ్లలోనూ హలీం దర్శనమిస్తుండడం విశేషం. ప్రస్తుతం కేవలం కడప నగరంలోనే హలీం విక్రయించే హోటళ్లు, దుకాణాలు 50కి పైగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 250కి మించాయి. వ్యాపారం అదుర్స్.. నాన్ వెజ్ వంటకాల దుకాణాలు గణనీయంగా పెరగడంతోపాటు వాటికి ఈ సీజన్లో మంచి వ్యాపారం ఉంది. జిల్లా అంతటా ప్రత్యేకించి అరేబియన్ వంటకాల రెస్టారెంట్లు 100కు పైగానే ఉన్నాయి. ఇవిగాక హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు చిన్నచిన్న రోడ్డుసైడు దుకాణాలలో కూడా వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. ఇటీవల అరేబియన్ ప్రాంతం వంటకాలకు మన ప్రాంతంలో విపరీతమైన ఆదరణ లభిస్తుండడంతో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. స్వీట్లు కూడా.. కేవలం మాంసాహారమే కాకుండా ఇటీవల రంజాన్ సీజన్లో తీపి పదార్థాలను ఆస్వాదించడం కూడా మొదలైంది. ఇటీవల ఇలాంటి వంటకాలలో ఖద్దూకీ ఖీర్, సొరకాయ, ఇతర కాయగూరలతో చేసిన స్వీట్లు ఆరోగ్యాన్ని ఇస్తాయన్న నమ్మకంతో ఆరగిస్తున్నారు. ఇవికాకుండా మంచి శక్తినిచ్చే వస్తువులతో తయారు చేసిన గంజి, ఫలుదా, ఫ్రూట్ సలాడ్ బకెట్ కూడా రంజాన్ స్పెషల్ వంటకంగా ఆదరణ పొందుతున్నాయి. -
వెరైటీ ఇడ్లీ, చట్నీకూడా అదిరింది, ట్రై చేయండి!
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహారం ఇడ్లీ. సాధారణంగా మినప్పప్పు, ఇడ్లీ రవ్యతో చేసే క్లాసిక్ ఇడ్లీ చాలా పాపులర్. అలాగే దీనికి పల్లీ, అల్లం చట్నీ, కారప్పొడి,నెయ్యి మంచి కాంబినేషనల్.అంతేకాదు ఇడ్లీని సాంబారులో ముంచుకొని తింటే ఆ టేస్టే వేరు. దీంతోపాటు సెనగపిండితో చేసే బొంబాయి చట్నీ కూడా చాలా ఫ్యామస్. ఇలా రకాలు ఈసూపర్ టిఫిన్‌ను మనోళ్లు ఆస్వాదిస్తారు. ఇడ్లీలో చాలారకాలుగా రవ్వ ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీతో సహా అనేక రకాల ఇడ్లీలు కూడా ఉన్నాయి. అయితే అరటి ఆకు ఇడ్లీని ఎపుడైనా చూశారా? దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. View this post on Instagram A post shared by jyotiz kitchen (@jyotiz_kitchen) అరటి ఆకుల్లో ఇడ్లీ పిండి వేసి గట్టిగా చుట్టి ఆవిరి మీద ఉడికిస్తారు. ఈ తరహా ఇడ్లీలను కన్నడ/తుళులో 'మూడ్' అని పిలుస్తారు. అరటి ఆకులు ఇడ్లీలకు ప్రత్యేకమైన రుచి ,సువాసనను జోడిస్తాయి. అయితే జ్యోతి కల్బుర్గి అనే ఇన్‌స్టా యూజర్ దీన్ని పోస్ట్ చేశారు. అరటి ఆకును కట్ చేసి, టూత్ పిక్ల సాయంతో చక్కగా చతురస్రాకారంగా కటోరీలు (గిన్నెలు)తయారు చేసింది. ఆ తర్వాత గిన్నెల్లో ఒక లేయర్ ఇడ్లీ పిండి, మరో లేయర్ తురిమిన కొబ్బరి , దానిపై మరొక పొర పిండిని నింపింది. దీన్ని ఆవిరిమీద ఉడికించింది.చదవండి: పోక్సో కేసులో నిందితుడికి టీచర్ ఉద్యోగం, లైసెన్స్ ఇచ్చినట్టా..!?పల్లీలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఎండు మిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, అన్నీ కలిపి మిక్సీలో మెత్తగా చట్నీ చేసింది. వేడి వేడిగా ఉన్న ఇడ్లీలపై (అరటి ఆకు గిన్నెల్లోనే) తురిమిన కొబ్బరితో గార్నిష్ చేసి, చట్నీతో కమ్మగా ఆరగించింది. దీనికి అరటి ఆకు ఇడ్లీ అని పేరు పెట్టింది. దీంతో ఇది నెట్టింట తెగ వైరల్‌గా మారింది.ఫుడ్ లవర్స్, నెటిజన్లు దీనిపై ప్రశంసలు కురిపించారు. 8 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. చాలా బావుంది అంటూ ఫుడ్ లవర్స్ దీన్ని ప్రశంసలతో ముంచెత్తారు. చాలా మంది “చాలా బాగుంది” అని, దయచేసి చట్నీ రెసిపీని పంపండి అని మరొకరు వ్యాఖ్యానించారు. పైన కొద్దిగా దేశీ నెయ్యి వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది అని మరొక యూజర్ సూచించారు. ముఖ్యంగా నూనెలో వేయించకుండా పల్లీ చట్నీ చేయడం ఎక్కువ ఆకర్షించింది. ఆ వైరేటీ ఏంటో మీరు కూడా చూసేయండి మరి. -
ఫుడ్ ప్యాకేజింగ్ లేబుల్స్‌లో ఇంత మోసమా..? వైరల్‌గా హర్ష్ గోయెంకా పోస్ట్
ఆహార ప్యాకేజింగ్ లేబుల్స్‌పై ఉన్న సమాచారం నమ్మి..కొనుగోలు చేయకండి అని హెచ్చరిస్తున్నారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. నెటిజన్లతో మంచి విషయాలను ముచ్చటించే హర్ష్ గోయెంకా తాజాగా ఆహార కంపెనీలు వినియోగదారులను ఎలా మోసం చేస్తున్నాయో వివరించే వీడియోను పంచుకున్నారు. ఇన్ని ప్రముఖ ఆహార కంపెనీలు తన ప్యాకేజీ లేబుల్‌పై ఇంతలా తప్పుదారి పట్టించేలా సమాచారం ఇస్తున్నాయా..? అని తెలిసి షాకయ్యా అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంతకి హర్ష్ గోయెంకా పోస్ట్ చేసిన ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..?హర్ష గోయెంకా ఇటీవల మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఓ సమస్యను బయటపెట్టారు. మన ఆహార కంపెనీలు మనల్ని ఎలా మోసగిస్తున్నాయో ఈ వీడియోలో సవివరంగా ఉందని, అది చూసి విస్తుపోయానంటూ రాసుకొచ్చారు పోస్ట్‌లో. ఆ వీడియోలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ అయిన రేవంత్ హిమత్సింగాక్ ఆహార కంపెనీలు వినియోగదారులను తప్పుపట్టించేలా చేస్తున్న మోసపూరిత వ్యూహాల గురించి మాట్లాడారు. అందులో గుడ్ డే బిస్కట ప్యాకేట్స్, కుకీలు వంటి వాటిల్లో బాదం, జీడిపప్పుల క్యాండిటీ 50-60 శాతం ఉంటాయని లేబుల్‌పై ఉంటుంది. కానీ కేవలం బాదం 1.8 శాతం, జీడిపప్పలు 0.4 శాతం మాత్రమే ఉంటాయన్నారు. మరోక బిస్కెట్ ప్యాకెట్‌ని చూపిస్తూ..దీన్ని హోల్‌వీట్ కుకీగా ప్రచారం చేస్తుంటారు. కానీ దానిలో 52 శాతం శుద్ధి చేసిన పిండి, 19.5 శాతం మాత్రమే హోల్‌వీట్ ఉంటుందన్నారు. అలాగే హెర్బ్ కుకీగా అమ్ముడవుతున్న మరో ప్రొడక్ట్‌లో అశ్వగంధ, పసుపు, తులసి, గిలోయ్, ఆమ్లా (గూస్బెర్రీ) ఉన్నాయని పేర్కొంది. అవి లేబుల్‌లో చెప్పినంత శాతంగా కాకుండా కేవలం 0.1 శాతం మాత్రమే ఉన్నాయి. ఇలా మనకు తెలియకుండా చాలా పెద్ద నకిలీ మార్కెట్ జరుగుతోంది. ఇది ఒక విధమైన పెద్ద సమస్య, ప్రజలు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అని వీడియోలో న్యూట్రిషన్ రేవంత్ చెబుతున్నట్లు కనిపిస్తుంది. మం గనుక ప్రొడక్ట్‌లపై ఉన్న సమాచారాన్ని నమ్మి తింటే ఆరోగ్యం ప్రమాదంలో పడటమేగాక ఆస్పత్రి పాలవ్వుతామని అన్నారు. ఏదో రకంగా వినియోగదారుడుకి కట్టబెట్టడంలో నైపుణ్యం కలిగిన ఆహార కంపెనీలు అవి. అవన్నీ ఒక దానికొకటి పోటీ పడుతూ మనల్ని దారుణంగా తప్పుదారి పట్టించేలా మోసం చేస్తన్నాయని చెప్పారు న్యూట్రిషన్ రేవంత్. అందువల్ల ప్రాసెస్ చేసిన ఆహారాలు కంటే మొక్కల ఆధారిత ఆహరానికే ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటివి కొనుగోలు చేసి ఒళ్లు, జేబు గుల్ల చేసుకుని వాడి లాభాలు తెచ్చిపెట్టే కంటే..ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదన్నారు న్యూట్రిషన్ రేవంత్. చివరగా హర్ష గోయంకా ఆరోగ్యకరంగా తింటూ ఆరోగ్యంగా ఉందాం అని పోస్ట్‌ని ముగించారు. How our food companies are taking us for a ride! I was truly shocked by these revelations. pic.twitter.com/oRWTeVuYxw— Harsh Goenka (@hvgoenka) March 19, 2025 (చదవండి: నటి రాణి ముఖర్జీ టోన్డ్ బాడీ సీక్రెట్..! వంద సూర్యనమస్కారాలు ఇంకా..) -
ఒడియా ఆహార సంస్కృతిలో ఆణిముత్యం ‘పొఖొలొ’
భువనేశ్వర్: ప్రపంచ పొఖాలొ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, శాసన సభ స్పీకరు సురమా పాఢి, మంత్రి మండలి సభ్యులతో కలిసి పొఖాలొ (చద్దన్నం) ఆరగించారు. దేశ, విదేశాల్లో విస్తరించిన ఒడియా ప్రజలు కూడా పొఖాలొ దిబొసొ వేడుకగా జరుపుకున్నారు. పసి పిల్లలకు చద్దన్న ప్రాసనం కూడ సరదాగా నిర్వహించి ముచ్చట పంచుకోవడం మరో విశేషం. పొఖాలొ ఒడియా ప్రజలకు ఇష్టమైన నిత్య ఆహారం. ప్రతి ఇంటా పొఖాలొ ఉంటుంది. ఈ ఆహారం అనాదిగా ఒడియా ప్రజల ఆహార సంస్కృతిలో ఇమిడి పోయింది. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం విశ్వ విఖ్యాత శ్రీ జగన్నాథునికి కూడా దొహి పొఖాలొ (దద్దోజనం) నివేదించడం సనాతన ధర్మ, ఆచారాలకు ప్రతీకగా పేర్కొంటారు. వ్యవహారిక శైలిలో పొఖాలొ (చద్దన్నం) శరీరానికి చల్లదనం చేకూర్చుతుందని చెబుతారు. కొరాపుట్: పొఖాలొ తినాలని బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పిలుపు నిచ్చారు. ఉత్కళ పకాలి దినోత్సవం సందర్భంగా తాను పొఖాలొ తింటున్న చిత్రం విడుదల చేశారు. వేసవిలో పొఖాలొ తినడం వల్ల చల్లదనం చేస్తుందన్నారు. (చదవండి: అవకాడో: పోషకాల పండు.. లాభాలు మెండు) -
Sunita Williams: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..?
తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో దాదాపు 288 రోజులు గడిపారు. నాసా ఎప్పటికప్పుడూ వారి బాగోగులను ట్రాక్ చేస్తూనే ఉంది. ఇరువురు తగినంత పోషకాహారాం తీసుకుంటున్నారా..? లేదా అనేది అత్యంత ముఖ్యం. ఈ విషయంలో నాసా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే గాక వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వెల్లడించేది కూడా. నిజానికి ఆ సున్నా గురుత్వాకర్షణలో వ్యోమగాములు ఆహారం తీసుకోవడంలో చాలా సవాళ్లు ఉంటాయి. మరీ వాటిని సునీతా విలియమ్స్, ఆమెతోపాటు చిక్కుకుపోయిన బుచ్ విల్మోర్ ఎలా అధిగమించారు. ఎలాంటి డైట్ తీసుకునేవారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా, బుచ్ విల్మోర్ ప్రత్యేక డైట్‌ని ఫాలో అయ్యేవారు. ప్రత్యేక పద్ధతిలో నిల్వ చేసిన ఆహారాన్ని (Self-Sable Menu) తీసుకునేవారు. నివేదికల ప్రకారం.. సునీతా పిజ్జా, రోస్ట్ చికెన్, రొయ్యలు, కాక్టెయిల్స్ వంటి కంఫర్ట్ ఫుడ్స్ తీసుకునేవారు. అవన్నీ నాసా స్పేస్ ఫుడ్ సిస్టమ్స్ లాబొరేటరీలో ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలు. పాడవ్వకుండా నిల్వ ఉండే ఈ ఆహారాన్ని ఫుడ్ వార్మర్ ఉపయోగించి వేడిచేసుకుని ఆస్వాదిస్తే చాలు.ఎంత పరిమాణంలో తీసుకుంటారంటే..వ్యోమగామి రోజువారీగా 3.8 పౌండ్ల పౌండ్ల మేర ఆహారం తీసుకునేలా కేర్ తీసుకుంటారు. దీన్ని ఆయా వ్యక్తుల పోషకాల పరిమితి మేర నిర్ణయిస్తారు నాసా అధికారులు. అయితే విలియమ్స్ ఆ పరిమితి పరిధిలోనే తగినంత ఆహారం తీసుకునేలా కేర్ తీసుకున్నారు. అయితే ఆ వ్యోమగాములు ఎనిమిది రోజులు ఉండటానికి వెళ్లి సుదీర్ఘకాలం చిక్కుకుపోవాల్సి రావడంతో మొదటలో తాజా పండ్లు, తాజా ఆహారం తీసుకున్నారు. మూడు నెలలు తర్వాత మాత్రం డ్రై కూరగాయాలు, పండ్లపై ఆధారపడక తప్పలేదు. ఇక బ్రేక్‌ఫాస్ట్‌లో పొడిపాలతో కూడిన తృణధాన్యాలను తీసుకునేవారు. ఇక ప్రోటీన్ల పరంగా మాత్రం వండేసిన ట్యూనా, మాంసం ఉంటాయి. అంతరిక్షంలో భూమ్మీద ముందే వండేసిన వంటకాలనే పాడవ్వకుండా ఉండేలా తయారు చేసుకుని తీసుకువెళ్తారు. అక్కడ జస్ట్ వేడి చేసుకుని తింటే సరిపోతుంది. ఇక అక్కడ ఉన్నంత కాలం వ్యోమగాములు దాదాపు 530-గాలన్ల మంచినీటి ట్యాంక్‌ని ఉపయోగించినట్లు సమాచారం.సుదీర్ఘకాల అంతరిక్ష ప్రయాణంలో తెలుసుకున్నవి..విలియమ్స తన మిషన్‌లో భాగంగా అత్యాధునిక ఆహారం గురించి పరిశోధన చేశారు. ముఖ్యంగా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు తాజా పోషకాలతో కూడిన ఆహారం తీసుకునేలా మంచి బ్యాక్టీరియాను ఉపయోగించి మొక్కల పెంపకం, వ్యవసాయం వంటివి ఎలా చెయ్యొచ్చు. అక్కడ ఉండే తగినంత మేర నీటితోనే కూరగాయలు, పువ్వుల మొక్కలు ఎలా పెంచొచ్చు వంటి వాటి గురించి సమగ్ర పరిశోధన చేశారు. అంతేగాదు ఆ మైక్రోగ్రావిటీలో "ఔట్రెడ్జియస్" రోమైన్ లెట్యూస్ - అనే ఒక రకమైన ఎర్ర లెట్యూస్ మొక్కను పెంచడం వంటివి చేశారు కూడా. అడ్వాన్స్డ్ ప్లాంట్ హాబిటాట్ కార్యకలాపాలతో సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలకు మార్గం సుగమం చేయడమే గాక వ్యోమగాములకు ఉపకరించే ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయగలిగే ఓ కొత్త ఆశను రేకెత్తించారు.(చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ..) -
వేసవిలో పెరుగు పులిసిపోయిందా? బెస్ట్ టిప్స్ ఇవిగో!
పెరుగు లేనిదే అన్నం తిన్నట్టే ఉండదు చాలామందికి. అంతేకాదు పెరుగు కమ్మగా ఉండాలి. కొంచెం పులిసినా ఇక దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇది గృహిణులకు పెద్ద టాస్కే. అందులోనూ వేసవి కాలంలో పెరుగు తొందరగా పులిసిపోతుంది. కానీ పెరుగు మిగిలినా, పుల్లగా అయినా పాడేయక్కర్లేదు. మిగిలిన పెరుగు,పుల్లటి పెరుగుతో రుచికరమైన వంటలు చేసుకోవచ్చు తెలుసా? దీంతోపాటు కొన్ని ఇంట్రిస్టింగ్ టిప్స్ మీకోసం..వేసవికాలంలో ఫ్రిజ్‌లో పెట్టినా కూడా టేస్ట్ మారిపోతుంది. మిగిలిపోయిన, లేదా పులిసిన పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి చాలా మంచింది. అందుకే మిగిలిన పెరుగును తాలింపు పెట్టుకుంటే, రుచిగానూ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది. అలాగే ఈ పెరుగులో కాస్త మైదా, వరిపిండి కలిపి అట్లు పోసుకొని తినవవచ్చు. బోండాల్లా వేసుకొని తినవచ్చు. పుల్లట్లుపెరుగుతో చేసుకునే అట్లు భలే రుచిగా ఉంటాయి. పెరుగులో ఒక కప్పు మైదా, రెండు కప్పుల బియ్యం పిండి కలిపి కొద్ది సేపు పక్కన పెట్టుకోవాలి. ఇందులో కావాలంటే కొద్దిగా బొంబాయి రవ్వ కూడా కలుపు కోవచ్చు. దోసెలు వేసుకునే ముందు సన్నగాతరిగిన ఉల్లి, పర్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర ఉప్పు వేసి దోశల పిండిలా జారుగా ఉండాలి. వేడి వేడి పెనంపై కొద్దిగా నూనె వేసి ఈ దోసలను దోరగా కాల్చుకుంటే సరిపోతుంది. అల్లం లేదా టమాటా చట్నీతో బ్రేక్‌ఫాస్ట్‌లా లేదంటే ఈవినింగ్ టిఫిన్లా తినవచ్చు.మజ్జిగ పులుసు పులిసిన పెరుగును కాస్త నీరు కలిపి మజ్జిగలా చేయండి. దాంట్లో రెండు టీ స్పూన్ల శెనగపిండి కలిపి పక్కనుంచుకోవాలి. కుక్కర్లో సొరకాయ, బెండకాయ ముక్కల్ని పెద్ద ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి కలపాలి. తరువాత పసుపు, ఉప్పు, కాసిన్ని నీరు పోసి కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టండి. రెండు, మూడు కూతలు వచ్చేదాకా ఆగాలి. ఆ తరువాత మూత తీసి, కొత్తి మీర చల్లి, కొద్దిసేపు మరగనివ్వాలి. ఇపుడు ముందుగానే కలిపి పెట్టుకున్న మజ్జిగ కలిపి మరో రెండు నిమిషాలు మరగనిస్తే చాలు. చివరిగా దీన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయించి తాలింపు పెట్టుకోండి. ముద్దపప్పు , మజ్జిగపులుసు కాంబినేషన్ అదుర్స్ . సింపుల్గాఎండుమిర్చి, మెంతులు, కరివేపాకుతో తాలింపు వేసి, పచ్చి ఉల్లిపాయ ముక్కులు, క్యారెట్ తురుము కలుపుకుని వేడి వేడి అన్నంతో తిన్నా కూడా రుచిగా ఉంటుంది. బోండాలుపెరుగులో మైదా, బియ్యం పిండి,కాస్త వంట సోడా కలిపి పెట్టుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే ఎక్కువ సేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. లేదంటే రెండు మూడు గంటలు నానిన తరువాత బాగా బీట్ చేసి బోండాల్లాగా వేసుకుంటే రుచిగా ఉంటాయి. (పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి లేదంటే బోండాలు పేలే అవకాశం ఉంది). కావాలనుకుంటే ఇందులో ఉల్లిపాయ, పర్చిమిర్చి, కొత్తిమీరలను ముక్కలుగా చేసి కలుపుకుని కాగుతున్న నూనెలో పునుగుల్లా వేసుకోవడమే. అల్లం ,లేదా పల్లీ చట్నీతో తింటే ఆహా అనాల్సిందే.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?మరికొన్ని చిట్కాలు మిగిలిపోయిన పెరుగును తినడానికి ఇష్టపడని వారు.. దాన్ని పండ్ల రసాలు, స్మూతీస్ తయారీలోనూ వాడుకోవచ్చు. స్మూతీస్ చేసే క్రమంలోనే బ్లెండర్లో పండ్లు, తేనె, కొన్ని ఐస్‌ముక్కలతో ΄ాటు కొద్దిగా పెరుగు వేసి బ్లెండ్ చేస్తే దాని రుచి పెరుగుతుంది.మటన్, చికెన్ వండే ముందు చాలా మంది మ్యారినేట్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో పెరుగును కూడా కలిపితే మాంసం ముక్కలు మరింత మృదువుగా మారి త్వరగా ఉడకటమే కాదు, కూర రుచి మరింత పెరుగుతుంది.సలాడ్ గార్నిష్/డ్రస్సింగ్ కోసం కొత్తమీర/పుదీనా వంటి ఆకులు, వెల్లుల్లి ముక్కలు, నిమ్మరసం, ఆలివ్ నూనె వంటివి వాడుతుంటారు. అయితే క్రీమీగా చిలికిన పెరుగును వాటి పైనుంచి సన్నటి తీగలాగా పోస్తే సలాడ్ నోరూరిస్తుంది. ఇంకా తింటుంటే మధ్యమధ్యలో పుల్లపుల్లగా నోటికి తగులి టేస్టీగా ఉంటుందని అంటున్నారు.చిప్స్, క్రాకర్స్, కాల్చిన కాయగూర ముక్కలు, ఫ్రెంచ్ ఫ్రై స్ వంటి వాటిని వివిధ రకాల పదార్థాలతో తయారుచేసిన డిప్పింగ్ సాస్‌లో ముంచుకొని తింటుంటారు. అయితే ఈ డిప్స్ తయారీలో కొద్దిగా పెరుగును ఉపయోగిస్తే వాటి రుచి, చిక్కదనం పెరుగుతాయి. పెరుగుతో రుచికరమైన డిప్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం పెరుగును ఒక క్లాత్‌లో వేసి అందులోని నీటిని తీసేయాలి. ఆ తర్వాత దీన్ని బాగా చిలికితే క్రీమీగా తయారవుతుంది. ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి కలుపుకోవాలి. ఇష్టం ఉంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, స్వీట్‌కార్న్ వంటివి జత చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. చదవండి: సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్ రిక్వెస్ట్! -
టెలివిజన్ షోలో హైలెట్‌గా 'కివీ ఐస్ క్రీం డెజర్ట్'! సెలబ్రిటీ చెఫ్‌లే ఫిదా
స్టార్ ప్లస్‌లో మంచి ఫేమస్ అయిన షో సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా. ఇది పాకకళకు సంబంధించిన రియాలటీ షో. ఈ ఈవెంట్లో ప్రముఖ సినీ సెలబ్రిటీలు, మాస్టర్ చెఫ్‌ల సమక్షంలో కంటెస్టెంట్లు తమ పాక కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. దగ్గర దగ్గర 12 నుంచి 15 మంది దాక పోటీదారులు పాల్గొంటారు. అయితే ఈ సారి మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్ 1లో ఓ వైరైటీ వంటకం ఆ షో న్యాయనిర్ణేతలని కట్టిపడేసింది. తప్పనిసరిగా ఆ డెజర్ట్‌ని తమ భోజనంలో భాగంలో చేసుకుంటామని అన్నారు. అదేంటో చూసేద్దామా..:తన పాక నైపుణ్యంతో న్యాయనిర్ణేతను ఫిదా చేసింది అర్చన గౌతమ్ అనే పోటీదారురాలు. ఆమె ఈ సీజన్ పోటీలో జడ్జీలను తన పాక కళతో అమితంగా జడ్జీలను ఆకట్టుకుంది. వండిన విధానమే గాక సర్వ్ చేసే తీరు హైలెట్‌గా నిలిచింది. అయితే ఆమె ఇటీవల జరిగిన ఎపిసోడ్లో చేసిన వంటకంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.ఆ షో న్యాయనిర్ణేతలు కూడా ఆ వంటకం చేసిన తీరు, ప్రెజెంట్ చేసిన విధానానికి ఫిదా అయ్యి ప్రశంసలతో ముంచెత్తారు. మరీ ఆ కంటెస్టెంట్ తయారు చేసిన వంటకం ఏంటంటే.. కివి ఐస్ క్రీం:ఆ షోలో ఆమె కివి ఐస్క్రీంని తయారు చేసింది. ఆకృతిపరంగానే కాకుండా తయారు చేసిన విధానం కూడా వేరెలెవెల్. కివిని పచ్చిపాలతో కలపి, అల్లం, పుదీనా, మిరపకాయలతో అత్యద్భుతంగా తయారుచేసింది. దాన్ని క్యాండీ ఫ్లాస్‌తో అందంగా సర్వ్ చేసింది. చూడటానికి ఏదో కళాత్మక ఖండంతో కలగలిసిన వంటకంల ఆకర్షణీయంగా ఉంది. ఇక ఆ షోలో సెటబ్రిటీలు ఫరా ఖాన్, రణవీర్ బ్రార్ , ప్రముఖ చెఫ్ ఈ వంటకాన్ని ఎంతో బాగుందంటూ ప్రశంసించారు. అంతేగాదు తాము ఇక నుంచి తమ భోజనంలో ఈ వంటకం ఉండేలా చూసుకుంటామని అన్నారు. కొన్ని వంటకాల తయారీ మనలో దాగున్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీస్తాయంటే ఇదే కదూ. అందులోనూ ఆ కంటెస్టెంట్ ఆరోగ్యకరమైన వాటితోనే రుచికరమైన డెజర్ట్ చేసి మరిన్ని ఎపిసోడ్లు కొనసాగేలా అర్హత పొందింది. View this post on Instagram A post shared by Viral Duniya (@viral_duniya_247) (చదవండి: కృత్రిమ గుండెతో వంద రోజులకు పైగా బతికిన తొలి వ్యక్తి..!) -
'విందోదయం': బ్రేక్ ఫాస్ట్‌లకు కేరాఫ్ ఈ టిఫిన్ సెంటర్లు..!
మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఇంటిల్లి పాదీ కలిసి పేరున్న రెస్టారెంట్/కేఫ్‌లకు లంచ్, డిన్నర్లకో వెళ్లడం తెలిసిందే. అయితే ప్రస్తుతం బ్రేక్ ఫాస్ట్ సమయం కూడా సిటిజనుల మీట్ అండ్ ఈట్లకు కేరాఫ్‌గా మారింది. లేట్నైట్స్లోనే బ్రేక్‌ఫాస్ట్ చేసే ప్లేసెస్ గురించి మాట్లాడుకుని ఉదయమే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీజనులు తమ బ్రేక్ ఫాస్ట్, అల్పాహారం కోసం తరచూ ఎంచుకునే వాటిలో ఇవీ.. టేస్టీ ఫుడ్ ఆస్వాదించి సంతృప్తిగా రోజును ప్రారంభించడం కన్నా మంచి రోజు ఏముంది? అద్భుతమైన వంటల వారసత్వానికి ప్రసిద్ధి చెందిన మన నగరం, రుచికరంగా రోజును కిక్‌స్టార్ట్ చేయడానికి అనేక ఎంపికలను అందిస్తుంది. దోసెలు, ఇడ్లీల వంటి సంప్రదాయ దక్షిణ భారతీయ ఇష్టమైన వాటి నుంచి ఆమ్లెట్లు, వాఫ్ఫల్స్ వంటి అంతర్జాతీయ వెరైటీల వరకు మన సిటీలోని అల్పాహార సమయం.. వైవిధ్యంగా ఉంటుంది. రుచులు అనుభవాల విందోదయాల కోసం అందుబాటులో కొన్ని.. కోఠిలోని సందడిగా ఉండే వీధుల్లో ఉన్న ప్రగతి టిఫిన్ సెంటర్ దక్షిణ భారత అల్పాహార ప్రియుల సందడితో నిండి ఉంటుంది. క్రిస్పీ దోసెలు, మెత్తటి ఇడ్లీలు, ఊతప్పమ్లకు ఈ సెంటర్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హైలైట్ ఏమిటంటే ప్రతి వంటకంతో పాటు అందించే చట్నీలు. ఉదయం 7గంటల నుంచి 9 గంటలలోపు హనుమాన్ టేక్డి, హెచ్‌వీఎస్ రోడ్లో ఉన్న ఈ సెంటర్‌ను సందర్శించం అంటే నోరూరించే దక్షిణాది వంటకాలను ఆస్వాదించినట్లే.. సంప్రదాయ రుచులను కోరుకునే వారు గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌లో ఉన్న ఉడిపి ఉపహార్కు చలో అంటున్నారు. ఇడ్లీలు, వడలు, దోసెలు, ఊతప్పమ్ వంటి అనేక రకాల దక్షిణ భారతీయ ప్రధాన వంటకాలను అందిస్తుంది. మెనూలో డబుల్ కా మీఠా, బొబ్బట్టు వంటి స్వీట్ ట్రీట్లు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ అల్పాహారం ఉదయం 7 నుంచి 10.30గంటల మధ్య అందుబాటులో ఉంటుంది.మాదాపూర్‌లోని హమ్మింగ్ బర్డ్ కేఫ్‌లో కేఫ్ స్టైలి ఆరోగ్యకరమైన అల్పాహారం కోరుకునే సిటిజనులు ఎంచుకుంటున్నారు. ఇక్కడ మష్రూమ్ ఆమ్లెట్ల నుంచి బ్రోకలీ చీజ్ ఆమ్లెట్ల వరకు రోజంతా అల్పాహారం అందించడం విశేషం. ఆహారం పోషకాలతో నిండిన సూప్‌లు, సలాడ్లతో పాటు కాఫీలూ ఎంజాయ్ చేయవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.30 దాకా అందుబాటులో ఉంటుంది. పిజ్జాదోస, పాస్తా దోస, మంచూరియా దోస వంటి వెరైటీ ఆధునిక దక్షిణ భారత బ్రేక్‌ఫాస్ట్‌లను కోరుకునేవారు బంజారాహిల్స్‌లోని రాయల్ టిఫిన్ సెంటర్‌ను ఎంచుకుంటున్నారు. వీరి మెనూలో ఉప్మా ఊతప్పమ్ల వంటి క్లాసిక్స్ కూడా ఉన్నాయి. ఆహ్లాదకరమైన అలంకరణ, ప్రత్యేకమైన మెనూతో జూబ్లీహిల్స్‌లోని ది హోల్ ఇన్ ది వాల్ కేఫ్ అల్పాహార ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇంగ్లిష్ బ్రేక్ ఫాస్ట్ వెరైటీల్లో.. వెజ్జీ పిజ్జా ఆమ్లెట్, గోల్డెన్ ఫ్రిటాటా మిక్స్ ఇక్కడ హైలైట్స్‌గా చెప్పాలి. స్వీట్ టూత్ ఉన్నవారు ఇక్కడి చాక్లెట్ వాఫ్ఫల్స్, బ్లూబెర్రీ చీజ్ వాఫ్ఫల్స్ తప్పనిసరిగా టేస్ట్ చేయాలి. ఉదయం 8.30గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. సిటిజనులకు చిరపరిచితమైన పేరే మినర్వా కాఫీ షాప్. ఈ పేరు దక్షిణ భారతీయ వంటకాలకు పర్యాయపదంగా ఉంది. టమాటా చట్నీ రైతాతో కలిపిన రైస్ పొంగల్, నెయ్యితో నింపిన ఇడ్లీలు క్రిస్పీ దోసెలు ఇక్కడ స్పెషల్.. ఇక్కడి ఫిల్టర్ కాఫీ వావ్ అనిపిస్తుందంటారు కాఫీప్రియులు. ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకూ బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేస్తారు. నగరంలోని దారుల్షిఫా, చట్టా బజార్లో ఉన్న హోటల్ నయాబ్ ఉదయం 5 గంటల నుంచే సంప్రదాయ అల్పాహారాన్ని అందిస్తుండటం ఎర్లీ బైకర్స్‌ను ఆకర్షిస్తోంది. బటర్ నాన్, లుక్మీతో పాటు భేజా ఫ్రై వంటి స్థానిక హైదరాబాదీ ప్రత్యేకతలతో బ్రేక్ ఫాస్ట్ చేయిస్తోంది. ఇరానీ చాయ్‌తో సహా మన అసలైన రుచులను ఇష్టపడేవారు నయాబ్‌ను సందర్శిస్తున్నారు. ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఇక్కడ బ్రేక్పాస్ట్ ప్రియుల సందడి కనిపిస్తుంది. (చదవండి: -
ఎండుద్రాక్ష రికార్డు అమ్మకాలు: ఒకేరోజు 17 టన్నులు
సోలాపూర్: పండరీపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో శనివారం రికార్డుస్థాయిలో 17 టన్నుల ఎండుద్రాక్ష విక్రయం జరిగింది. పండరీపురం తాలూకా నాణ్యమైన ఎండుద్రాక్ష ఉత్పత్తికి ప్రస్ధిద్ధి. అందుకే ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పుణే తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడి ఎండు ద్రాక్షను కొనేందుకు ఆసక్తిని చూపుతారు. ఈ నేపథ్యంలో పండరీపురం మార్కెట్లోని స్వప్నిల్ కొటాడియా దుకాణంలో పండరీపురం తాలూకా, భారడీ గ్రామానికి చెందిన రైతు ఆకాష్ వసెకర్కు చెందిన ఎండుద్రాక్ష పంటను కిలోకు రూ. 511 చొప్పున 17 టన్నుల మేర కొనుగోలు చేశారు. సాధారణంగా కిలోకు 200–500 మాత్రమే పలికే ఎండుద్రాక్షను అధిక ధరకు, పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు రైతు ఆకాష్ వసెకర్ను యూటోపియన్ కార్ఖానా చైర్మన్ ఉమేష్ పరిచారక్ మార్కెట్ కమిటీ చైర్మన్ హరీష్ గైక్వాడ్ సన్మానించారు. ఎండు ద్రాక్షతోఉపయోగాలు : ఎండుద్రాక్షల వలన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శక్తిని అందిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎండుద్రాక్షలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ పుష్కలంగా ఉంటాయి కనుక తక్షణ శక్తిని అందిస్తాయి. ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలుపుష్కలంగా లభిస్తాయి.ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.ఎండుద్రాక్షలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , మలబద్ధకాన్ని నివారిస్తుంది.ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. చర్మంపై మొటిమలు, ముడతలు, వృద్ధాప్యం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇనుము రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. వీటిని నీటిలో నానబెట్టి తాగడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది.ఎండుద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు నిద్రలేమికి ఉపశమనం కలిగిస్తుందిఎండుద్రాక్షలో ఇనుము ఉంటుంది, ఇదిచేయడానికి సహాయపడుతుంది.ఎలా ఉపయోగించాలి?మీరు ఎండుద్రాక్షను నేరుగా తినవచ్చు, ఎండుద్రాక్షను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తాగవచ్చు, ఎండుద్రాక్షను పాలలో కలిపి తాగవచ్చు, ఎండుద్రాక్షను వివిధ వంటకాలలో కూడా ఉపయోగించవచ్చు.చదవండి: వైష్ణో దేవి ఆలయం వద్ద వెర్రి వేషాలా? అడ్డంగా బుక్కైన ‘ఓర్రీ’60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్గమనిక: ఎండుద్రాక్షను మితంగా మాత్రమే తినాలి. గర్భవతి అయితే, లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఎండుద్రాక్షను తినే ముందు మీ డాక్టర్ని సంప్రదించాలని చెబుతారు. -
చిన్నారులకు చిప్స్ ప్యాకెట్లు కొనిస్తున్నారా..?
పిల్లాడు అన్నం తినడం లేదు.. వెంటనే ఓ చిప్స్ ప్యాకెట్ తాయిలమైపోతుంది. పాప మారాం చేస్తోంది.. మరో ఎరుపురంగు ప్యాకెట్ తారకమంత్రంగా పనిచేస్తుంది. బుజ్జాయి స్కూలుకు వెళ్తోంది.. ఆ బ్యాగ్‌లో పుస్తకాలు ఉన్నా లేకున్నా చిరుతిళ్ల ప్యాకెట్టు మాత్రం ఉండి తీరుతుంది. చిన్నారి బడి నుంచి వచ్చాడు. ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టకుండా వీధి చివరి దుకాణంలో ఊరూపేరూ తెలియని రంగురంగుల ప్యాకెట్ వాడి నోరు మూయిస్తుంది. ఏ పదార్థంతో తయారు చేశారు, ఎలా తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారో తెలీని ‘ప్యాకెట్లు’ చిన్నారుల పాలిట విషంగా మారుతున్నాయి. ఈ తిను ‘బండారం’ తెలుసుకోకుండా తల్లిదండ్రులు చేతులారా పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. ఏ షాపు చూసినా చిరుతిళ్ల ప్యాకెట్ల తోరణాలు కనిపిస్తుంటాయి. ఏ మాత్రం వాటి ఆకర్షణలో పడినా పిల్లలను ఆస్పత్రుల చుట్టూ తిప్పాల్సిందే. జంక్ ఫుడ్ పేరిట నానా రకా ల పదార్థాలు పాన్‌షాపుల్లో దర్శనమిస్తున్నాయి. ఆకర్షణీయమైన రంగుల్లో ఆకట్టుకునే బొమ్మలతో పిల్లల నోరూరిస్తున్నాయి. కానీ ఇటువంటి చిరుతిళ్లు చిన్నారుల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే భారీమూల్యం తప్పదని చెబుతున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రింగ్స్ చిప్స్ ప్యాకెట్లు ఎక్కువగా జిల్లాలోని దుకాణాల్లో కనిపిస్తున్నాయి. రింగ్స్, ట్రాప్స్ అనే రకాలకు చెందిన రింగ్స్ చిప్స్ ఒడిశా నుంచి వస్తున్నాయని, ట్రాయ్ రింగ్స్ అనే రకం పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా వస్తున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. ఎక్కువగా పాఠశాలలు ఉండే ప్రాంతాల్లో పాన్ షాపుల్లో రెండు, ఐదు రూపాయలకే ఈ చిరుతిళ్లు దొరుకుతుండడంతో.. అవి తినడం బాలలకు వ్యసనంగా మారిపోతోంది. ముప్పొద్దులా వీటినే తింటుండడంతో చాలా మంది ఉదర సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రంగు రంగు ప్యాకెట్లు, నకిలీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి పిల్లలను జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి. జింక్ ఫుడ్స్‌లో కెమికల్స్ ఉంటాయి. ఇవి తిన డం వల్ల చిన్నారులకు ఊపిరితిత్తుల సమస్యలు, కడుపు నొప్పి, విరోచనాలు, ఆకలి మందగించడం వంటి సమస్యలు పిల్లలకు ఎక్కువగా వస్తుంటాయి. పాణిపూరి, చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు, కూల్ డ్రింక్‌లకు పిల్లలను దూరంగా ఉంచాలి. – జి.వేణుగోపాల్, చిన్నపిల్లల వైద్యుడు, సీహెచ్‌సీ, పాతపట్నంవిద్యార్థులు చదువుకు దూరం విద్యార్థులు పాఠశాలకు వచ్చేముందు చిప్స్, రింగ్స్ ప్యాకెట్లు తినుకుంటూ వస్తుంటా రు. పాఠశాలకు వచ్చి కడుపు నొప్పి, విరేచనాలు అంటూ మా కు చెబుతుంటారు. ఇంటికి విద్యారి్థని పంపిస్తుంటాము. మధ్యాహ్నం భోజనం కూడా పాఠశాలలో సరిగా తినడం లేదు. చిరుతిళ్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. – పొడ్డిడి కృష్ణారావు,హెచ్ఎం, ఎంపీపీ మెయిన్ పాఠశాల, పాతపట్నం(చదవండి: 10th Class Exams: ఈ పంచ సూత్రాలతో ఒత్తిడిని అధిగమిద్దాం..గెలుపును అందుకుందాం!) -
మండుతున్న ఎండలు : సమతుల ఆహారంతోనే ఆరోగ్యం
జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మార్చిలోనే ఎండలు ముదురుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రమైన ఎండలతోపాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కాలంలో మనం తీసుకునే ఆహారం అత్యంత కీలకంమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు శరీరం డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. చెమట అధికంగా ఉత్పన్నమవుతుంది. ఇలా ఉంటే శరీరంలోని లవణాలు తగ్గిపోయి వడదెబ్బ బారిన పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు తప్పక పాటించాలని చెబుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ల లోపు నిత్యం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజుల్లో 42 వరకూ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. ఈ నేపత్యంలో వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలామంది చల్లని ద్రవ పదార్థాలు తీసుకునేందుకు ఇష్టపడతారు. వేసవిలో చర్మవ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటంది. ఇవన్నీ ఎదుర్కొవాలంటే రోగ నిరోధకశక్తి పెంచే విధంగా....ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవాలి. మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడుతుందనే ఆలోచన కలిగి ఉండాలి. ఎక్కువ నీరు తీసుకోవాలి శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు తగ్గించడంలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు 3–5 లీటర్ల వరకు నీరు తీసుకుంటూ ఉండాలి. శరీరం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. తాజా పండ్లు తీసుకోవాలి ప్రతి రోజూ నీరు, పోషకాల శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. తాజా పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, జామ, అరటి, యాపిల్ పండ్లు తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, కమల రసాలు శ్రేయేస్కరం. రాగులు, జొన్నలు తదితర చిరుధాన్యాలు తీసుకోవడం కూడా మంచిది. ఇవి శక్తిని ఇవ్వడంతోపాటు ఎండల్లో నిస్సత్తువ రాకుండా చూస్తుంది. ద్రవ పదార్థాలు తీసుకోవాలి ఎండలో ఎక్కువగా తిరిగే వారు ద్రవ పదర్థాలను తీసుకుంటూ రావాలి. మజ్జిగతో పాటు కొబ్బరినీరు, లస్సీ, చెరుకు రసం అధికంగా వినియోగించాలి. ఉల్లిపాయల్లో శరీరాన్ని చల్లబరిచే గుణం కలిగి ఉంది. ఉల్లిని నిత్యం ఆహారంలో తీసుకుంటే వడ దెబ్బ బారిన పడే అవకాశాలు తక్కువ. మజ్జిగ శరీరంలోని జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు అందులో ప్రో బయోటిక్స్ అధికంగా ఉంటాయి. కొబ్బరినీరు ఈ కాలంలో తరుచుగా తీసుకుంటే ఖనిజ లవణాలు ఎక్కువ శక్తిని ఇచ్చి వడగాలులు, వేగి గాలుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. పటిష్టమైన రోగ నిరోధక శక్తి వేసవిలో బలమైన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఖనిజ లవణాలు అధికంగా ఉండేలా చూడాలి. పాలు, గుడ్లు, టమోటా, నారింజ, పసుపు రంగు కూరగాయలు, చిలకడదుంప, చేపలు, బ్లాక్ బెర్రి, బ్లూ బెర్రి తినడం మంచిది. ఆహారంలో సొరకాయ, బీరకాయ, దోసకాయ, పొట్లకాయ తదితర కూరగాయలు వినియోగించడం శ్రేయస్కరం.చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్కరూ ఎండలో అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండడం ఎంతో మంచిది. తలపై రక్షణకు గొడుగు లేదా టోపీ పెట్టుకోవాలి. చేనేత, కాటన్ దుస్తులు ధరించి మంచిది. ఎక్కువ నీరు తాగడంతోపాటు మనిషికి సరిపడేలా నిద్రపోవాలి. ప్రతిరోజు వ్యాయామం మరింత మంచిది. ఎండలు ఎక్కువగా ఉండడంతో కాపీ, టీలు అలవాటున్న వారు వీలైనంత తగ్గించుకుంటే మంచిది. – డాక్టర్ శ్రీనాథరెడ్డి, సూపరింటెండెంట్, వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి, కడప -
Ramadan 2025 హైదరాబాదీ..ప్యార్ కా తోఫా..!
గోల్కొండ: రంజాన్ అంటే మొదట గుర్తుకు వచ్చేది ఉపవాస దీక్ష.. ఉదయం నుంచి కఠిన ఉపవాసం చేసి సాయంత్రం పూట ఇఫ్తార్ విందులో రకరకాలైన పండ్లు ఆరగించి దీక్ష విరమిస్తారు. అందులో భాగంగా మార్కెట్లో పెద్దఎత్తున లభించే సీజనల్ ఫ్రూట్స్‌ను అందంగా ప్యాకింగ్ చేసి స్నేహితులు, బంధువులకు అందజేయడం హైదరాబాదీల ప్రత్యేకత.. కొత్తగా బంధుత్వాలు కలిసిన వారు తమ బంధుత్వాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి వారి వారి స్థాయి మేరకు ఫ్రూట్స్ ప్యాక్స్‌ను అందజేస్తుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, స్నేహితులు ఇలా అందరూ పండ్లను అందజేసి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ మహా నగరంలో ఫ్రూట్స్ గిఫ్ట్ ప్యాక్ అందజేసే సంస్కృతి కొనసాగుతోంది. రంజాన్ మాసంలో కొంత మంది షాపుల యజమానులు ప్యాకింగ్ చేయడంలో సిద్ధహస్తులైన వారిని నియమించుకొని ప్యాకింగ్ చేయించుకుంటారు. గిఫ్ట్ ప్యాక్‌లో పెట్టడానికి వాడే పండ్ల రకాలను బట్టి ధరలు ఉంటాయని మెహిదీపట్నం ఎస్ఏ రాయల్ ఫ్రూట్ మార్ట్ వ్యాపారి అబ్దుల్ అజీజ్ అంటున్నారు. మొత్తం 23 రకాల పండ్లతో సుపీరియర్ గిఫ్ట్ ప్యాక్‌లను ప్రత్యేకంగా తయారు చేస్తామని అన్నారు. ఇందులో 23 రకాల పండ్లతో మొత్తం 19 కిలోల పండ్లు ఉంటాయి. అదే డీలక్స్ ఫ్రూట్ గిఫ్ట్ ప్యాక్‌లో 18 రకాల పండ్లు ఉండగా వీటిలో 14 కిలోల బరువు ఉంటుంది. అదేవిధంగా 11 రకాల పండ్లతో 10 కిలోల బరువు ఉండే ఫ్యాన్సీ గిఫ్ట్ ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఏడు రకాల పండ్లు, ఆరు కిలోల గిఫ్ట్ ప్యాక్‌లు కూడా ఎక్కువగా అమ్ముడవుతాయి. నెంబర్ వన్ క్వాలిటీ ఖర్జూరా పండ్లు ఉపయోగిస్తామని ఆయన వివరించారు. వీటి ధరలు రూ.550 నుంచి రూ.18 వేల వరకు ఉంటాయని చెప్పారు. -
క్షణాల్లో తయారయ్యే ఈ మ్యాగీ నూడుల్స్ రెసిపీని కనిపెట్టిందెవరంటే..
నూడుల్స్‌ని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే వంటకం ఇది. భారతీయుల వంటకాల జాబితాలో ప్రస్తుతం ఇదే అగ్ర స్థానంలో నిలుస్తోంది. ఈజీగా అయిపోయే వంటకం కావడంతో అంతా దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా బిజీగా ఉండే వర్కింగ్ మహిళలకు ఇది ఎంతో తేలిగ్గా చేసే వంటకం. అయితే ఈ రెసిపీ తయారీని ఎవరు కనిపెట్టారు..? ఎలా ప్రజలకు ఇష్టమైన వంటకంగా మారింది తదితరాల గురించి చూద్దామా..!.క్షణాల్లో తయారు చేసే వంటకం ఏదన్నా ఉందంటే అది మ్యాగీ నూడుల్సే. భారతీయ సంస్కృతిలో కూడా అంతర్భాగమైపోయింది. అంతలా ప్రజాదరణ చూరగొన్న ఈ వంటకం తయారీ ఎవరు కనుగొన్నారంటే..ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని చూరగొన్న ఈ వంటకం విజయవంతమైన బ్రాండ్‌గా నిలిచి అందరి మన్ననలకు అందుకుంటోంది. ఈ మ్యాగీ వంటకం పుట్టింది 19వ శతాబ్దంలో స్విట్జర్లాండ్‌లోని కెంప్తాల్ అనే సుందరమైన పట్టణంలో జరిగింది. 1884లో యువ ఔత్సాహిక వ్యవస్థాపకుడు జూలియస్ మ్యాగీ అనే వ్యక్తి ఈ మ్యాగీ నూడుల్స్ ఒక బ్రాండ్లా తీసుకొచ్చాడు. తక్కువ సమయంలో మంచి పోషకాలతో రుచికరమైన వంటకం చేయాలనే సంకల్పంతో జనించిన వంటకం ఇది. అయితే మొదట్లో ఇది ఉప్పు, మిరియాలతో తయారైంది. అనాతికాలంలోనే దీని ఉత్పత్తులకు తర్వగా ప్రపంవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దాంతో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, యూఎస్ వంటి ఇతర దేశాల్లో కూడా దాని శాఖలు తెరిచే స్థాయికి చేరుకుంది. 1900 సంవత్సరంలో, జూలియస్ ఉత్పత్తులు స్విట్జర్లాండ్ వంటి అనేక దేశాలకు విస్తరించాయి. ఇక జూలియస్ మొత్తం 18 రకాల వెరైటీ ఫ్లేవర్డ్ నూడిల్స్‌ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈమ్యాగీ ప్యాకేజ్ ఉత్పత్తులను ఈజీxe ఐడెంటిఫై చేయగలం. కానీ ఆకాలంలో ఇవి ఎరుపు, పసుపు, నలుపు రంగుల ప్యాకింగ్‌ల ద్వారా మాత్రమే గుర్తించేవారు. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ని నెస్లే కొనుగులు చేసి చౌక ధరల్లో నాణ్యతతో కూడిన పోషకాహారాన్ని అందించాలనే ఆకాంక్షను నెరవేర్చుకుంది. అలాగే నెస్లే నివేదిక ప్రకారం.. "ప్రతి సెకనుకు, ప్రపంచవ్యాప్తంగా 21000 కంటే ఎక్కువ ఆహారాలు మాగీ ఉత్పత్తులతో తయారైనవే." సంవత్సరాలుగా, ఈ బ్రాండ్ చాలా మంది హృదయాల్లో మంచి స్థానాన్ని ఏర్పరుచుకుంది. చకచక తయారై ఈ వంటకం ఆల్-టైమ్ సొల్యూషన్‌తో వచ్చిన రెసిపీ. ఎప్పటికీ మహిళలకు, బ్యాచిలర్లకు, నిమిషాల్లో ఎలాంటి శ్రమ లేకుండా క్షణాల్లో తయారై వంటకంగా పేరు తెచ్చుకుంది.(చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..) -
ఆన్లైన్ ఫుడ్ క్రేజ్..! ఎంతలా ఆర్డర్లు ఇస్తున్నారంటే..
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం..వ్యాపార నిమిత్తం ఉదయం నుంచి ఉరుకుల పరుగులమయం.. రాత్రి ఎప్పటికో ఇంటికి చేరే వైనం.. దీనికితోడు పిల్లల అభ్యున్నతికి ఆరాటం.. నిత్యం బతుకు పోరాటం.. ఇదీ నేటి నగర జీవనం.. ఈ స్థితిలో వంట తయారీకి దొరకని సమయం.. కొత్తజంటలకు వంట చేయడం తెలియనితనం.. వెరసి..హోటళ్లలో భోజనమే ఆధారం..అక్కడి వరకూ వెళ్లడానికి ఓపిక లేనితనం.. ఆన్లైన్ భోజనం ఆరగించడానికే మొగ్గు చూపుతున్న జనం. ఫలితం రోజురోజుకూ పెరుగుతున్న ఇంటి వద్దకే భోజనం సంప్రదాయం. నగర జీవనం బిజీబిజీగా గడుస్తోంది. మెరుగైన జీవనం కోసం భార్యాభర్తలిద్దరూ కష్ట పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులుగానో.. వ్యాపారం వైపో పరుగులు పెడితేగాని కుటుంబాలు ముందుకు సాగడంలేదు. ఈ క్రమంలో పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, బిజీలైఫ్‌తో మహిళలు వంటగది వైపునకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పిల్లలు, కుటుంబం, ఉద్యోగం ఇతర పనుల్లోనూ మహిళలు భాగస్వాములు కావడంతో వంట అదనపు భారం అవుతోంది. ఈ క్రమంలోని ఎక్కువ కుటుంబాలు ఆన్లైన్ ఫుడ్‌పై ఆధారపడుతున్నాయి. ఇక సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు కుటుంబ సమేతంగా హోటల్లోకి వెళ్లి పూట గడిపేస్తున్నాయి. మరికొందరు అన్నం వండుకుని కర్రీలు తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి నగరంతోపాటు జిల్లాలోని కొన్ని పట్టణాల్లో ఆన్లైన్ డెలివరీ ఇచ్చే జొమోటో, స్విగ్గీ వంటి సంస్థలు విస్తరించాయి. ఇంట్లో కూర్చొని కావాల్సిన ఆహారం నచ్చిన హోటల్ నుంచి తెప్పించుకోవడం చాలా మందికి ఫ్యాషన్‌గా మారింది. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ క్రమేణా పెరుగుతోంది. నగరంలో ఆన్లైన్ ఆహారంపై ఆధారపడిన వారి వివరాలను ఓ సర్వే సంస్థ అంచనా వేసింది. విలాస జీవనానికి కొత్త జంటల ఆరాటం కొత్త జంటలు విలాసవంత జీవనానికి అలవాటు పడ్డాయి. దీనికితోడు పలువురు యువతులు పుట్టింట్లో వంటల ఓనమాలు నేర్చుకోకుండా అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఈ క్రమంలో అత్తారింట సైతం అలానే కొనసాగాలనే ఉద్దేశంతో పెళైన కొత్తలోనే వేరు కాపురాలు పెడుతున్నారు. దీంతో భార్యాభర్తలిద్దరూ ఆన్లైన్ ఆర్డర్లు, హోటళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు కొత్తగా కాపురం పెట్టి వంట చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్ చానళ్లు చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. వండిన వంట రుచికరంగా లేకవపోవడంతో అబ్బాయిలు ఆమాడదూరం వెళ్లిపోతున్నారు. దీంతో వంట తంట నుంచి తప్పించుకునేందుకు ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్ల వైపు మొగ్గు కుటుంబ వ్యవహారాలతోపాటు ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ పురుషులతోపాటు మహిళలు సైతం అలసిపోతున్నారు. ఒత్తిడి కారణంగా ఇంటికి వచ్చి వంట చేసే ఓపిక లేక చాలా మంది మహిళలు వంట తయారీపై ఆసక్తి చూపడం లేదు. అన్నం, కూరలు లేదా టిఫిన్ కర్రీలను వండుకునేందుకు గంటకుపైగా సమయం పడుతుంది. ఆ సమయంలో పిల్లలతో గడపడం, విశ్రాంతి తీసుకోవడం, ఇంట్లో ఇతర పనులను చక్కబెట్టుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లపై కు టుంబ సమేతంగా మొగ్గు చూపుతున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు జొమోటా, స్విగ్గీ సేవలను అందుబాటులో ఉంచడంతో ఆన్లైన్ రేటింగ్ ఆధారంగా హోటల్‌ను ఎంపిక చేసుకుని నచ్చిన ఆహారం తెప్పించుకుంటున్నారు. అలానే మరి కొన్ని హోటళ్ల లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికి తెచ్చించే వెసులుబాటును యజమానులు కల్పించారు. ఆర్డర్ పెట్టుకున్న అర్థగంటలోపే ఇంటికే నచ్చిన ఆహారం తెప్పించుకుని ఆరగిస్తున్నారు. 40 శాతం కుటుంబాలు ఆన్లైన్ ఆహారంతో గడిపేస్తున్నారు. హోటల్‌కు వెళ్లడం ఫ్యాషన్ సెలవు రోజులు, ఇతర ప్రత్యేక దినాలు, కుటుంబంలో ఎవరికైనా పుట్టిన రోజు వంటివి ఉన్నప్పు డు కుటుంబ సమేతంగా, మరికొందరు బంధుమిత్రులతో కలిసి హోటళ్లకు వెళ్లి తినడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. సాయంత్రం పూట అలా బైక్‌లో నో కారులోనో వెళ్లి హోటల్లో కొంతసేపు సరదాగా గడిపి, ఎవరికి నచ్చిన ఆహారం వారు తినేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బ్యాచిల ర్లు రూమ్‌ల్లో అన్నం వండుకుని కర్రీలు తెచ్చుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. డబ్బు పొదుపులో భాగంగా బ్యాచిలర్లు కర్రీ పాయింట్లపైన ఆధారపడుతున్నారు. అలానే రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడే ఆహారప్రియులు రోజూ హోటల్ నుంచి తప్పించుకుని లాగియిస్తున్నారు. పిల్లలు, యువత ముఖ్యంగా రుచికరమైన ఆహారం వైపు ఆకర్షితులవుతున్నారు. తిరుపతి నగరంలో 11 గంటలకు అన్ని హోటళ్లు బంద్ చేస్తున్నారు. అయితే ఆన్లైన్ ఫుడ్ మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట వరకు దొరుకుతుంది. ఆన్లైన్ ఆహారం వివరాలివీ.. మహిళా ఉద్యోగులు 12,875 నూతన జంటలు 2,140 భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన కుటుంబాల సంఖ్య 7,396 బ్యాచులర్లు 10,250 విశ్రాంత ఉద్యోగులు 3,256 ఒంటరి మహిళలు, పురుషులు 895 వ్యాపారవేత్తలు 1,276 సందర్భం ఆధారంగా ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నవారు 2,564 ఇంటి వంటతోనే ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఇంటి వంటలతో పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అయితే కాలానుగుణంగా ఇళ్లలో ఒత్తిడి పెరగడం, తీరికలేని జీవనంతో వంటగదికి వెళ్లేందుకు కొంతమంది ఆసక్తి చూపడం లేదు. ఈ విషయాన్ని తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు. ఉన్న సమయంలో ఇంట్లోనే వంట వండుకుని తినేందుకు ఆసక్తి చూపాలి. బయటి రుచులకు అలవాటు పడితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. రుచికరమైన ఆహారంతో అనారోగ్యం తప్పదు. పిల్లలకు ఇంట్లో ఆహారంపై ఆసక్తి పెంచేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలి. –డాక్టర్ మంజువాణి, పోషకాహార నిపుణురాలు, తిరుపతి కొత్తగా పెళ్లి అయ్యింది..వంట సరిగ్గా రాదు మాకు కొత్తగా పెళ్లి అయ్యింది. ఏడాది కావస్తోంది. వంట చేయడం రాదు. ఎంటెక్ వరకు చదివాను. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా ను. నా భర్త నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకుడు. ఇద్దరికీ వంట చేయడం తెలియకపోవడంతో ప్రతిరోజు ఆన్లైన్ ఆర్డర్లతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. సెలవు రోజుల్లో మాత్రం వంట ప్రయోగాలు చేస్తుంటాం. తప్పని పరిస్థితి. –సరళ, ప్రైవేటు ఉద్యోగిని, తిరుపతి ఇద్దరం ఉద్యోగులం తప్పని పరిస్థితి మాది కర్నూలు. నా కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. నా భర్త ఓ ప్రైవేటు కంపెనీ లో ఉద్యోగం చేస్తా రు. ఇద్దరం ఉద్యోగులం కావడంతో ఉదయమే విధులకు హాజరు కావాలి. దీంతో ఆదివారం సెలవు దినాలలో తప్ప ఇంట్లో వంట వండుకునేందుకు అవకాశం దొరకదు. దీంతో మాకు ఆన్లైన్ ఆర్డర్లే గతి. ఏమీ చేయలేని పరిస్థితి. పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు.–పార్వతి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, తిరుపతి (చదవండి: పుట్టుకతో తోడై..జీవితం సూదిపోటై!) -
Sunday Special: నాటుకోడి కూర, ఫిష్ ఫ్రై, బగారా రైస్
సండే వచ్చిందంటే.. మాంచి ఫుడ్ ఉండాల్సిందే.. ఇష్టమైన కూర అదీ అదిరిపోయే రుచి ఉంటే.. ఆ ఆనందమే వేరు. టమ్మీ ఫుల్.. దిల్ ఖుష్. మరి అలాంటి ఆదివారం ఆనందాన్ని పొందాలనుకుంటే.. బగారా రైస్ పచ్చిపులుసు, చేప వేపుడు, నాటుకోటి కూర.. దిల్ఫుల్గా ఇంట్రస్టింగ్ రెసిపీస్ మీకోసం...పచ్చిపులుసుకావల్సినవి: చింతపండు – నిమ్మకాయ పరిమాణం (వేడి నీళ్లలో నానబెట్టి, గుజ్జు తీయాలి); ఉప్పు – తగినంత; నీళ్లు – 3 కప్పులు; పచ్చిమిర్చి – 4; జీలకర్ర – టీ స్పూన్; కొత్తిమీర – టేబుల్‌స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉల్లిపాయ – 1; ఎండుమిర్చి – 2; వెల్లుల్లి – 4 రెబ్బలు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – రెమ్మ; ధనియాల పొడి – అర టీ స్పూన్.తయారీ: ∙ చింతపండు గుజ్జులో నీళ్లు కలపాలి. ∙రోట్లో పచ్చిమిర్చి, ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, పసుపు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఈ మిశ్రమాన్ని చింతపండు రసంలో కలపాలి. స్టౌ మీద మూకుడు పెట్టి నూనె వేసి అందులో మిగిలిన జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ధనియాల పొడి వేసి, వేయించి ఈ పోపు మిశ్రమాన్ని చింతపండు రసంలో కలపాలి. తీపి కావాలనుకున్న వారు టీ స్పూన్ పంచదార / బెల్లం కలుపుకోవచ్చు. ఉల్లిపాయ తరుగు పైన వేసి, అన్నంలోకి వడ్డించాలి.నాటు కోడి కూరకావల్సినవి: నాటు కోడి ముక్కలు-అరకేజీ; పచ్చిమిర్చి-4, టొమాటోలు - 2(తరగాలి); అల్లం-వెల్లుల్లి పేస్ట్-2 టీ స్పూన్లు; గరం మసాలా (లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు)-2 టీ స్పూన్లు; ఉల్లిపాయలు-2, ఎండుమిర్చి -2; పసుపు-అర టీ స్పూన్; ఉప్పు-తగినంత; కారం - టీ స్పూన్; ఎండుకొబ్బరి- 2 టీ స్పూన్లు; నూనె-3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు-2 టేబుల్ స్పూన్లుతయారీ: ∙నాటుకోడి ముక్కలలో కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం– వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కనుంచాలి. మందపాటి గిన్నె/కుకర్‌లో నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి, కలపాలి. అల్లం–వెల్లుల్లి ముద్ద వేసి, వేగాక కలిపి ఉంచిన చికెన్ వేసి 10 నిమిషాలు ఉడికించాలి. టొమాటో వేసి మగ్గనివ్వాలి. 2 కప్పుల నీళ్లు పోసి, ఉప్పు, కారం, ఎండుకొబ్బరి వేసి మరో 15 నిమిషాలు ఉడికించాలి. కుకర్‌లో అయితే 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. దించే ముందు సిద్దం చేసుకున్న గరం మసాలా, కొత్తిమీర వేయాలి. రోటీలు, అన్నంలోకి ఈ కూరను వడ్డించాలిచేప వేపుడుకావల్సినవి: చేప ముక్కలు- 6; కారం -అర టీ స్పూన్; మొక్కజొన్న పిండి – టీ స్పూన్; ఉప్పు -తగినంత; నిమ్మరసం- అర టీ స్పూన్; గుడ్డు-1; నూనె – తగినంత; ధనియాల పొడి-టీ స్పూన్; గరం మసాలా- అర టీ స్పూన్; అల్లం-వెల్లుల్లి పేస్ట్ -టీ స్పూన్; కొత్తి మీర – టీ స్పూన్; నూనె – 3 టేబుల్ స్పూన్లు (తగినంత).తయారీ: గిన్నెలో చేప ముక్కలు వేసి కారం, మొక్కజొన్నపిండి, ఉప్పు, నిమ్మరసం, గుడ్డు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి అరగంట పక్క నుంచాలి. కడాయిలో నూనె వేసి అందులో చేప ముక్కలు వేసి, వేయించాలి. చేప ముక్కలు వేగిన తర్వాత కొత్తిమీర చల్లి దించాలి. గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలను అలంకరించి చేప ముక్కలను అన్నంలోకి సైడ్ డిష్‌గా వడ్డించాలి. ఇవి స్నాక్స్‌గానూ బాగుంటాయి.చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?బగారా రైస్ కావల్సినవి: బాస్మతి బియ్యం/బియ్యం - 2 కప్పులు+ ఉల్లిపాయలు 3 (సన్నగా నిలువుగా తరగాలి); బిర్యానీ ఆకు3; పచ్చి మిర్చి7 (సన్నగా తరగాలి); కొత్తిమీర -2 టేబుల్ స్పూన్లు ; పుదీనా ఆకులు -గుప్పెడు; అల్లం - వెల్లుల్లి పేస్ట్ -2 టీ స్పూన్లు; ఉప్పు-తగినంత; నెయ్యి / నూనె -అర కప్పు; నీళ్లు-5 కప్పులు; లవంగాలు-10; యాలకులు -7; కరివేపాకు.తయారీ: గిన్నెలో నూనె వేడి చేసి, ఉల్లి తరుగు గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. అందులో పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కరివే΄ాకు, పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సన్నని మంట మీద పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ∙దీంట్లో బియ్యం వేసి 2 నిమిషాలు వేయించాలి. ఉప్పు కూడా వేసి మరో మారు కలిపి, 5 కప్పుల నీళ్లుపోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర, వేయించిన ఉల్లి తరుగు చల్లి దించాలి.చదవండి: ఇక్కడ జిమ్‌లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!నోట్: పోపులో పచ్చిబఠాణీలు, మొక్కజొన్న గింజలు, బీన్స్ వేసి కూడా బగారా రైస్ చేసుకోవచ్చు. దీనిలోకి మాంసాహార వంటకాలే కాదు బంగాళదుంప కూర, గుత్తి వంకాయ కూర, పప్పు వంటి శాకాహార రుచులను కూడా వడ్డించవచ్చు. -
హల్దీరామ్స్‌లో టెమాసెక్‌కు వాటా
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ హల్దీరామ్స్ స్నాక్స్ ఫుడ్‌లో సింగపూర్ సావరిన్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం టెమాసెక్ 10 శాతం వాటా కొనుగోలు చేస్తోంది. కంపెనీ విలువను 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 85,000 కోట్లు)గా మదింపు చేసి వాటాను సొంతం చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ఈ వారం మొదట్లో ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. అంటే 10 శాతం వాటాకు సుమారు బిలియన్ డాలర్లు(రూ. 8,500 కోట్లు) వెచి్చంచనున్నట్లు అంచనా. దేశీయంగా ప్యాక్డ్ స్నాక్, స్వీట్స్ తయారీలో దిగ్గజంగా నిలుస్తున్న హల్దీరామ్స్ రెస్టారెంట్లను సైతం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24లో రూ. 12,500 కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీలో మరింత వాటా విక్రయం ద్వారా ప్రమోటర్లు అగర్వాల్ కుటుంబం మరో ఇన్వెస్టర్‌కు సైతం చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలలుగా పీఈ దిగ్గజాలు బ్లాక్‌స్టోన్, అల్ఫావేవ్ గ్లోబల్, బెయిన్ క్యాపిటల్ కన్సార్షియం తదితరాలతో వాటా విక్రయానికి హల్దీరామ్స్ చర్చలు నిర్వహించింది. కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో పబ్లిక్ ఇష్యూ చేపట్టే అవకాశముంది. తొలుత మెజారిటీ వాటాను విక్రయించాలని భావించిన ప్రమోటర్లు తదుపరి మైనారిటీ వాటా విక్రయానికే ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ప్రధాని మోదీ మెచ్చిన ‘మిల్లెట్ కేక్’.. దెబ్బకు వ్యాపారం కోట్లకు పడగలెత్తింది
సేల్స్‌మ్యాన్‌గా, ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ కెరియర్లో అంచలంచెలుగా ఎదిగాడు. అయితే పనిలో భాగంగా బేకరి పనులను అర్థం చేసుకోవడానికి బ్రిటానియా, అమూల్ వంటి కంపెనీలను సందర్శించడంతో బేకరీ ఫుడ్స్ తయారీపై ఆసక్తి ఏర్పరుచుకున్నాడు. అలా సొంతంగా వ్యాపారం చేద్దామన్నా ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. అందుకోసం విదేశాలకు వెళ్లి మరీ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నాడు. చివరిక బేకరీ పెట్టాడు..అలా మిల్లెట్స్ కేక్ తయారీతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించి..కోట్లకు పడగలెత్తాడు. ఎందరికో యువతకు ఆదర్శంగా నిలిచాడు. అతడి విజయ ప్రస్థానం ఎలా జరిగిందంటే..రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పుట్టి పెరిగిన అమిత్ సోనీ ఆభరణాల కళాకారుల కుటుంబం నేపథ్యం నుంచి వచ్చాడు. అమిత్ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి, అనంతరం ఎలక్ట్రానిక్స్ రంగంలో సేల్స్‌మ్యాన్ నుంచి ఈవెంట్ మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు. అలా వివిధ ఉద్యోగాలు చేశాడు. అయితే తన ఉద్యోగంలో భాగంగా బేకరీ పనులను అర్థం చేసుకోవడానికి తరుచుగా బ్రిటానియా, అముల్ వంటి కంపెనీలను సందర్శిస్తుండేవాడు. ఆ నేపథ్యంలో బేకరీ పెట్టాలనే ఆలోచన వచ్చింది అమిత్‌కి. అయితే బేకరీ ఉత్పత్తులను ఎలా తయారుచేస్తారనేది తెలియదు, కానీ బిజినెస్ గురించి మాత్రం బాగా తెలుసు అమిత్‌కి. ఉద్యోగంలో బాగానే రాణిస్తున్నా..వ్యాపారం చేయాలనే కోరికతో 2017లో ఉద్యోగానికి రిజైన్ చేశాడు. ముందుగా బేకరీలోని ఆహార పదార్థాల తయారీలో శిక్షణ తీసుకునేందుకు (ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్)కి వెళ్లాడు. తర్వాత థాయిలాండ్ వంటి విదేశాలకు వెళ్లి ఆ రంగంలో మరింత మెరుగులు దిద్దుకున్నాడు. అయితే అమిత్‌కి విదేశాల్లో మంచి ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి కానీ తల్లిదండ్రులు ఇక్కడే ఉండాలని పట్టుబట్టడంతో..అలా 2019లో జోథ్‌పూర్‌లో తన సొంత బేకరీ RDz 1983ని ప్రారంభించాడు. మొదట్లో ఇది బ్రెడ్, కేక్‌లను అందించేది. అయితే అనూహ్యంగా ఐసీఏఆర్ రాజస్థాన్ నుంచి బజ్రా చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేయాలనే ఆర్డర్‌తో మిల్లెట్ల వైపుకి ఆకర్షితుడయ్యాడు అమిత్. అయితే మిల్లెట్లో గ్లూటెన్ లేకపోవడంతో కేక్ తయరీ చాలా సవాలుగా మారింది. దాదాపు 96 సార్లు విఫలమయ్యాక చివరికి మిల్లెట్ కేక్‌ని తయారు చేశాడు. 80 కిలో గ్రాముల కేక్‌ని ఓ పది కిలోగ్రాముల ముక్కలుగా విభజించాడు. వాటిని కొంతమంది CAZRI (సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) అధికారులు ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI)కి తీసుకువెళ్లారు. రెండు రోజుల తర్వాత వీడియోతో కూడిన సందేశం పంపించారు వారు. అమిత్ దాన్ని ఓపెన్ చేసి చూశాకగానీ తెలియలేదు..ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా ఆ మిల్లెట్ కేక్‌ను కట్ చేస్తున్నారని. ఆ సమయంలో నరేంద్ర సింగ్ తోమర్, కైలాష్ చౌదరి, రాజ్‌నాథ్ సింగ్ వంటి ప్రముఖులు అతని పక్కనే ఉన్నారు. ఆయనలా అమిత్ తయారు చేసిన మిల్లెట్ కేక్ కట్ చేసి ప్రారంభించారో లేదో ఒక్కసారిగా ఆర్డర్లు వెల్లువలా రావడం జరిగింది. ఇక అమిత్ ఎక్కువ కాలం నిల్వ ఉండే కుకీలు, బ్రౌనీలపై దృష్టిసారించాడు. అలా పెర్ల్ మిల్లెట్ కుకీలను అందించే స్థాయికి చేరుకున్నాడు. దీంతో అమిత్ UN సమావేశాలు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఉదయపూర్‌లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశం వంటి ఉన్నత స్థాయి కార్యక్రమాలకు మిల్లెట్ కుకీలను అందించే పెద్ద పెద్ద ఆర్డర్లు అందుకున్నాడు. అంతేగాదు దేశీయంగా దాదాపు వందకి పైగా హోటళ్లలో ఈ మిల్లెట్ కుక్కీలు అమ్ముడయ్యాయి. బహ్రెయిన్, దుబాయ్ వంటి విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం అతడి బేకరీ ప్రతిరోజూ 150 కిలోల కుకీలను తయారు చేస్తోంది, అలాగే నెలకు 15 వేలకుపైగా కస్టమర్లకు సర్వ్ చేస్తోంది. ఈ వ్యాపార రంగంలోకి అమిత సోదరుడు ఫిజియోథెరపిస్ట్ అయిన డాక్టర్ సుమిత్ సోనీకూడా చేరారు. ఇలా అమిత్ కుటుంబ బేకరీ బిజినెస్ ఏడాదికి రూ. 1.5 కోట్లను ఆర్జిస్తోంది. బెంగళూరు, ముంబై వంటి నగరాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం అమిత్ సీఆర్పీఎఫ్ జవాన్లకు మిల్లెట్ కుకీలను అందించే ఆర్డర్ తయారీకి రెడీ అవుతున్నాడు. నిజంగా ఇది మహర్షి మూవీలో హీరో మహేష్ చెప్పినట్లు "సక్సస్ ఈజ్ జర్నీ నాట్ ఏ డెస్టినేషన్ (విజయం అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు)" అంటే ఇదే కదా..!. View this post on Instagram A post shared by RD'Z 1983 BAKERY (@rdz_1983) (చదవండి: మహిళలు నిర్మించిన అద్భుత స్మారక కట్టడాలు..! నాటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..) -
ఉపవాసాలు: స్విగ్గీ కొత్త అప్డేట్ చూశారా?
ప్రస్తుత రంజాన్ మాసంతో పాటు నవరాత్రి వంటి ఇతర ఉపవాస సమయాల్లో కస్టమర్లను నోటిఫికేషన్లతో ఇబ్బంది పెట్టకుండా ‘ఫాస్టింగ్ మోడ్’ అనే వినూత్న ఎంపికను ‘స్విగ్గీ’ ప్రారంభించింది. ఇది ఉపవాస సమయాల్లో వినియోగదారులు ఫుడ్ డెలివరీ నోటిఫికేషన్లను పాజ్ చేయడానికి అనుమతించే సరికొత్త ఫీచర్. ఈ ఫీచర్ ఉపవాస సమయాల్లో జోక్యం చేసుకోదు. వినియోగదారులకు అవసరమైనప్పుడు మాత్రం ఈ వేదిక సిద్ధంగా ఉంచుతుంది. వినియోగదారులు యాప్ నుంచి ఈ సెట్టింగ్‌ను సులభంగా ప్రారంభించ వచ్చు. అవసరం లేని సమయంలో నిలిపివేయవచ్చు. వినియోగదారులు స్విగ్గీ యాప్ నుండి ఎప్పుడైనా ఫాస్టింగ్ మోడ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. యాక్టివేట్ చేసిన తర్వాత.. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండే వినియోగదారులు అందరికీ సహర్ (తెల్లవారుజామున), సాయంత్రం 4 గంటల మధ్య ఫుడ్ నోటిఫికేషన్లు పాజ్ చేయబడతాయి. వినియోగదారుల ఉపవాస సమయం పూర్తయిన తరువాత నోటిఫికేషన్లు తిరిగి ప్రారంభమవుతాయి. మనం ఆన్ చేయాల్సిన అవసరం లేదు. స్విగ్గీ ఆహార పదార్థాలపై 50 శాతం వరకూ తగ్గింపుతో రుచికరమైన వంటకాలు, ప్రత్యేక రంజాన్ భోజనాలను అందిస్తుందని యాజమాన్యం తెలిపింది. ఈ ఫీచర్‌ను సంస్థ సృజనాత్మక భాగస్వామి టాలెంటెడ్ రూపొందించింది. రోబోఆల్–ఇన్–వన్ కిచెన్ వండర్చెఫ్లోపద్మశ్రీ అవార్డు గ్రహీత చెఫ్ సంజీవ్ కపూర్దక్షిణ భారత్‌లో వండర్‌చెఫ్ ఔట్లెట్లను రెట్టింపు చేస్తామని పద్మశ్రీ అవార్డు గ్రహీత చెఫ్ సంజీవ్ కపూర్ తెలిపారు. కొత్తగూడలోని శరత్‌సిటీ క్యాపిటల్ మాల్లో వండర్‌చెఫ్ ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణాది మార్కెట్లో వంట గది వినూత్న పరిష్కారాలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. వండర్‌చెఫ్ బ్రాండ్ ఔట్లెట్లను రెట్టింపు చేస్తామని, ఇందులో హైదరాబాద్ మార్కెట్ ముఖ్యమైందని తెలిపారు. వండర్ చెఫ్ వినూత్న ఆవిష్కరణలతో హోమ్ చెఫ్‌లు ఆరోగ్యకరమైన వంటకాలు తయారు చేసుకునేందుకు వీలుంటుందన్నారు. అధునాతన మౌల్డింగ్ టెక్నాలజీలో కాస్ట్ ఐరన్ వంట సామగ్రి ‘ఫెర్రో’ని ప్రవేశపెట్టింది. కత్తిరించడం, ఆవిరి చేయడం, సాటింగ్, కలపడం, బ్లెండింగ్ చేసేందుకు ఆల్–ఇన్–వన్ కిచెన్ రోబోలా పనిచేస్తుంది. చెఫ్ సంజీవ్ కపూర్ స్వయంగా క్యురేట్ చేసిన 370కి పైగా వంటకాలతో కూడిన గైడ్ సహాయంతో స్క్రీన్లపై చూస్తూ హోమ్ చెఫ్‌లు వివిధ రకాల వంటలు చేసుకోవచ్చని తెలిపారు. -
Filter Coffee: ఫిల్టర్ కాఫీ క్రేజ్ అలాంటిది మరి..అందుకే!
ఉదయాన్నే గుక్కెడు కాఫీ కడుపులో పడితే గానీ.. మనసు ప్రశాంతంగా ఉండదు. అసలా ఆ వాసన పీల్చగానే వచ్చే ఫీలింగే చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. మరి అలాంటి కాఫీ లవర్స్‌కు గుడ్‌న్యూస్. అదేంటంటే..ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫామ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన 'టాప్ 38 కాఫీస్ ఇన్ ది వరల్డ్' జాబితాలో మన ఫిల్టర్ కాఫీ ట్యాప్ ప్లేస్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో ఫిల్టర్ కాఫీకి రెండో స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల కాఫీ గింజలు, పలురకాల కాఫీలు పలురకాలున్నప్పటికీ ఫిల్టర్ కాఫీ కున్నప్రత్యేకతే వేరు. అందులోనూ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్ కాఫీనే. మరీ ముఖ్యంగా సౌతిండియాలో ఫిల్టర్ కాఫీకి ఉన్న డిమాండే వేరు.ఫుడ్ అండ్ ట్రావెల్ టావెల్ గైడ్ ప్లాట్‌ఫాం టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్ కాఫీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నది.కాఫీ రుచి,వాసన, కాఫీ తయారీకి ఉపయోగించే సాంప్రదాయ , ప్రత్యేకమైన పద్ధతుల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లను ఇచ్చారు.మొదటి ప్లేస్‌లో క్యూబాకు చెందిన ఎస్ప్రెస్సో నిలిచింది. దీన్ని డార్క్ రోస్టెడ్ గింజలతో కాఫీ కాచేటప్పుడు చక్కెర కలుపుతారు. దీనిని స్టవ్టాప్ ఎస్ప్రెస్సో మేకర్లో లేదా ఎలక్ట్రిక్ ఎస్ప్రెస్సో మెషీన్లో తయారు చేస్తారు. ఇండియన్ ఫిల్టర్ కాఫీని ఇండియన్ కాఫీ ఫిల్టర్ మెషీన్‌ని ఉపయోగించి తయారు చేస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ పైభాగంలో కాఫీ పౌడర్ వేసి, వేడి నీళ్లు పోస్తారు. దీని అడుగు భాగా ఉన్న చిన్న చిన్న రంధ్రాల ద్వారా, చుక్క చుక్కలుగా కింద వున్న మరో గిన్నెలో పడతాయి. దీన్ని పాలతో మరిగించి, చక్కెర కలుపుకొని తాగుతారు.ఘిక మూడు, నాలుగు స్థానాల్లో గ్రీస్‌కు చెందిన రెండు రకాల కాఫీలు చోటు దక్కించుకున్నాయి. ఇటలీకి చెందిన క్యాపచినో ఐదో స్థానంలో, తుర్కియేకు చెందిన టర్కిష్ కాఫీ ఆరోస్థానంలో, ఇటలీకే చెందిన కాఫీ రిస్ట్రెట్టో 7వ స్థానంలో, గ్రీస్‌కు చెందిన ఇంకో రకం ఫ్రాప్పె 8వ స్థానంలో, జర్మనీకి చెందిన ఐస్కాపీ 9వ స్థానంలో నిలువగా.. చివరిగా పదో స్థానంలో వియత్నాంకు చెందిన వియత్నాంకు చెందిన ఐస్డ్ కాఫీ నిలిచింది. -
ప్రధాని మోదీ స్ఫూర్తితో ‘భారత్ డిష్'..! ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..
ఇంటిగ్రేటివ్ లైఫ్‌స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్హో ‘భారత్ డిష్'ని ఆవిష్కరించారు. దీన్ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ప్రతిష్టాత్మక NXT కాన్క్లేవ్ 2025లో ప్రారంభించారు. ఇది స్వదేశీ ఆహార పదార్థాల ఆరోగ్య ప్రయోజనాలను హైలెట్ చేసేలా లైఫ్‌స్టైల్ నిపుణుడు రూపొందించారు. ఇది భారతదేశ గొప్ప పాకకళ వారసత్వానికి నివాళి. భారతదేశ ఆహార సంస్కృతిలో పాతుకుపోయిన పోషకాహారాలు, వాటి రుచి సమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఈ ‘భారత్ డిష్'. అంతేగాదు రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహారాన్ని భాగం చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తుందని చెబుతున్నారు ల్యూక్ కౌటిన్హో . దీన్ని అగ్రశ్రేణి చెఫ్‌లచే రూపొందించినట్లు తెలిపారు. మరి ఇంతకీ అందులో ఎలాంటి ఆహార పదార్థాలు, వంటకాలు ఉంటాయంటే..ప్రధాని మోదీ క్రమశిక్షణా జీవనశైలిని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించానని అన్నారు ల్యూక్ కౌటిన్హో. ఇందులో ముఖ్యంగా పోషకాలు అధికంగా ఉండే చిరుధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే సత్తు, సాంప్రదాయ మఖానా, రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, తాజా శీతాకాలపు ఆకుకూరలు, స్థానికంగా లభించే, కాలానుగుణ పదార్థాలు తదితరాలు ఉంటాయి. అంతేగాదు భారతీయ వంటకాలు సమతుల్యతకు పెద్దపీట వేసేలా కాలనుగుణంగా ఉంటాయని చెబుతున్నారు జీవనశైలి నిపుణుడు. కలిగే లాభాలు..పేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తయారు చేస్తారు. ఇవి దీర్ఘాయువుని, ఆరోగ్య ప్రయోజనాలని అందించే పదార్థాలు. ఆరోగ్యకరమైన భోజనాన్ని హైలెట్ చేయడమే గాక, అతిగా తినడం, బరువు సమస్యలకు చెక్‌పెట్టేలా ఉంటుందట. భారతీయ ఆహారం శరీరానికి మాత్రమే కాకుండా మనసులో భావోద్వేగాలకు కూడా ఔషధమేనట. దీన్ని ఆవిష్కరించడానికి ప్రధాన కారణం ప్రజలు అనారోగ్య సమస్యలతో పోరాటాన్ని నివారించడమేనట. ఇక ఈ భారత్డిష్ అనేది పూర్వీకులు చేసినట్లు కాలనుగుణంగా ఉండటమేగాక, ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకునేలా ప్రోత్సహిస్తుందట.ప్రధాని మోదీ చెప్పినట్లుగా వంట నూనెల వాడకం తగ్గించి, ఏ2 నెయ్యి, కోల్డ్-ప్రెస్డ్ నూనెలు, నట్స్ వంటివి మాత్రమే ఉంటాయట.చివరిగా ఇది శాకాహారులైన, మాంసాహారులైన బరువుని అదుపులో ఉంచే ఆరోగ్యకరమైన వంటకాలే ఉంటాయట ఇందులో.At the NXT Conclave 2025, I had the honor of unveiling The Bharat Dish & Lifestyle Tips, inspired by Hon. Prime Minister Narendra Modi Ji’s disciplined lifestyle and health practices.This is more than just a dish—it’s a celebration of India’s rich culinary wisdom and the power… pic.twitter.com/OR8PzeGV8b— Luke Coutinho (@LukeCoutinho17) March 1, 2025 ఈ మేరకు జీవనశైలి నిపుణుడు ల్యూక్ కౌటిన్హో మాట్లాడుతూ..ప్రపంచ నాయకులు భాగస్వామ్యం అయ్యే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత్ డిష్‌ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. భారతీయ వెల్నెస్ జ్ఞానాన్ని ప్రపంచవేదికపై తీసుకువెళ్లేందుకు ఉపకరించిన అద్భుత అవకాశం అని అన్నారు. ఈ 'భారత్ డిష్' అనేది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ప్రోత్సహించే ఒక ఉద్యమం, ప్రభావంతమైన మార్పుకి నాంది. ఇది ఇక్కడితో ఆగదు. ప్రతి కుటుంబం, పాఠశాలు, ఇతర సంఘాలకు చేరకునేలా చేసే ఒక గొప్ప చొరవ. అంతేగాదు ఆరోగ్య స్ప్రుహతో కూడిన సాధికారతకు మార్గం వేస్తుందని కూడా చెబుతున్నారు ల్యూక్ కౌటిన్హో.#StopObesity | Today, Mr. @LukeCoutinho17, Co-Founder, Luke Coutinho Holistic Healing Systems while visiting an Anganwadi Centre in New Delhi stressed on the importance of tackling obesity to build a healthier India. Highlighting Prime Minister Shri @narendramodi’s vision for a… pic.twitter.com/WgNqoM1pzk— Ministry of Health (@MoHFW_INDIA) February 28, 2025(చదవండి: కశ్మీర్ వివాదాస్పద ఫ్యాషన్ షో: నిర్వహించింది ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్..ఆ డిజైనర్లు ఎవరంటే..?) -
సండే వెరైటీగా రొయ్యల దోసెలు, కాజు రవ్వ వడ చేసేయండిలా..!
ఈ ఆదివారం చిన్న పెద్ద అంతా ఇంట్లోనే సందడిగా ఉంటారు. ఆదివారం అంటే ఆటవిడుపులా అనిపిస్తుంది అందరికి. అమ్మపై భారం వేయకుండా..అందరూ తలో చేయి వేసి ఈ సండే ఇలా వెరైటీ వంటకాలు ట్రై చేసి మరింత ఖుషీగా ఉండండి. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసేయాలో చూసేయండి మరీ..!.రొయ్యల దోసెలుకావలసినవి: సోయా పాలు– 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్– 2 టీ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు– 2 లేదా 3 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి– అర టీ స్పూన్ పసుపు– కొద్దిగా ఉప్పు– తగినంత రొయ్యలు– 250 గ్రాములు (శుభ్రం చేసుకుని హాఫ్ బాయిల్ చేసుకుని, పక్కన పెట్టుకోవాలి) మిరియాల పొడి– పావు స్పూన్ కొత్తిమీర తురుము– కొద్దిగా కరివేపాకు– కొద్దిగా పచ్చిమిర్చి– 2 (చిన్నగా తరగాలి) గరం మసాలా– 1 టీ స్పూన్ దోసెల పిండి– రెండు మూడు కప్పులు గుడ్లు– రెండు లేదా మూడు (అభిరుచిని బట్టి) నూనె– సరిపడాతయారీ: ముందుగా కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఉప్పు, కారం వేసుకుని దోరగా వేయించుకోవాలి. అనంతరం దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, గరిటెతో తిప్పుతూ అర నిమిషం పాటు వేయించాలి. తర్వాత మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మరికొద్దిగా కారం వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు సోయా పాలు పోసి మూత పెట్టి, చిన్న మంట మీద ఉడికించాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గరపడుతున్న సమయంలో రొయ్యలు వేసుకుని, ఒకసారి రుచి చూసి, సరిపడా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుకోవాలి. ఆ మిశ్రమం మరింత దగ్గర పడిన తర్వాత ఆ కళాయి దించి పక్కన పెట్టుకుని, స్టవ్ మీద దోసెల పెనం పెట్టుకోవాలి. దానిపై దోసెలు వేసుకుని, ఒక్కో దోసెపై ఒక్కో గుడ్డు కొట్టి, అభిరుచిని బట్టి పసుపు సొనను కదిలించకుండా ఉడికించి, ఆపైన కొద్దికొద్దిగా రొయ్యల కర్రీ, కొత్తిమీర తురుము వేసుకుని, దోసెను ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. కాజు రవ్వ వడ..కావలసినవి: జీడిపప్పు– అర కప్పు రవ్వ– కప్పు అల్లం తురుము– టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుము– 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి– 1 (చిన్నగా తరగాలి) ఉప్పు– తగినంత కరివేపాకు– 1 రెమ్మ (చిన్నచిన్నగా తుంచి వేసుకోవాలి) కుకింగ్ సోడా– అర టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ తరుగు– కొద్దిగా పెరుగు– అర కప్పు పైనే నూనె– డీప్ ఫ్రైౖ కి సరిపడాతయారీ: ముందుగా జీడిపప్పును పొడిపొడిగా మిక్సీ పట్టుకోవాలి. దానిలో రవ్వ, అల్లం తురుము, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కుకింగ్ సోడా, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసుకుని, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో పెరుగు కొద్దికొద్దిగా పోసుకుంటూ, ముద్దలా చేసుకోవాలి. అనంతరం చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని, వడల్లా ఒత్తుకుని, నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చట్నీలో లేదా సాస్‌లో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. -
స్వీట్ చేంజ్.. విందులో పసందైన రుచులు
ఏదైనా శుభవార్త చెప్పే ముందు నోరు తీపి చేస్తారు. ఇది ఒకప్పటి మాట. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.. ప్రతి చిన్న విషయానికీ స్వీట్‌తో పండుగ చేసుకుంటున్నారు. అంతేనా! అంటే కాదు..కొందరు భోజనానికి ముందు.. కొందరు భోజనానికి తర్వాత కూడా స్వీట్ తినే అలవాటు చేసుకుంటున్నారు. ఈ అలవాటుకు అనుకూలంగా నగరంలోని పలు రెస్టారెంట్స్, హోటల్స్ ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు చివరి వంటకంగా డిసర్ట్స్ సర్వ్ చేస్తున్నారు. స్టార్టర్స్, మెయిన్ కోర్సు వగైరాలన్నీ పూర్తయ్యాక ఫైనల్‌గా అందించే తీపి కబురు కోసం ఫుడ్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటిని తరచూ మారుస్తూ చెఫ్స్ కూడా ఆ ఆసక్తిని సజీవంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు మిఠాయి అంటే స్వీట్ షాప్ మాత్రమే గుర్తొచ్చే నగరవాసులు.. ఇప్పుడు కొన్ని రకాల డిసర్ట్స్‌ను ఎంజాయ్ చేసేందుకు రెస్టారెంట్స్‌కు క్యూ కడుతున్నారు. భోజనం అయిపోగానే కాస్తంత తీపి రుచిని ఆస్వాదించడం చాలా కాలంగా ఒక సంప్రదాయంగా స్థిరపడింది. ఇప్పుడు ఆ సంప్రదాయం ఇంతింతై వటుడింతై అన్నట్లు.. రెస్టారెంట్స్ వడ్డించే విందులో డిసర్ట్స్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన భాగంగా మార్చేసింది. మిఠాయిలు ఆస్వాదించాలంటే కేవలం స్వీట్ షాప్స్ మాత్రమే శరణ్యం అనే పరిస్థితి మారి కేవలం డిసర్ట్స్ కోసం రెస్టారెంట్స్‌కి వెళ్లడం ఇప్పుడు సాధారణంగా మారింది. జామ్.. బూమ్.. రెస్టారెంట్ల తొలినాళ్లలో గులాబ్ జామ్ వంటి అందరికీ తెలిసిన స్వీట్లను మాత్రమే వడ్డించేవారు. అయితే ఆ తర్వాత క్రమంలో పూర్తి భోజనాన్ని మూడు భాగాలుగా విభజించిన తర్వాత డిసర్ట్స్ పేరుతో మెనూలో ప్రత్యేక స్థానాన్ని తీపి వంటకాలకు కేటాయించారు. తొలినాళ్లలో గులాబ్ జామ్, హల్వా, జిలేబీ, రస్మలాయ్, కోవా మాత్రమే చాలాకాలం డిసర్ట్స్గా రాజ్యమేలాయి. అయితే మల్టీ క్యుజిన్ల వెల్లువ ధాటికి మెయిన్ కోర్సుతో పాటు డిసర్ట్స్ కూడా విభిన్న రుచులకు విస్తరించాయి. ఒకప్పుడు ఆరు వెరైటీల దగ్గర నుంచి ఇప్పుడు అతిథులకు తీపి రుచులను పెద్ద సంఖ్యలో లంచ్, డిన్నర్లలో వడ్డిస్తున్నారు.బేకరీ ఉత్పత్తులకూ చోటు.. తొలుత అందరికీ బాగా తెలిసిన ప్రాంతీయ తీపి వంటకాలు ఆ తర్వాత పేస్ట్రీలకు కూడా డిసర్ట్స్ స్టైల్ మారుతూ వచి్చంది. రస్మలాయ్కి బదులు అదే ఫ్లేవర్‌లో ఐస్‌క్రీమ్ పెడుతున్నారు. బఫేలో కాంటినెంటల్ చీజ్ కేక్, బ్రౌనీ, చాకోలావా, మథుపై.. ఇలా బేకరీ ఐటమ్స్ కూడా భాగం చేస్తున్నారు. కొంత కాలంగా ఐస్‌క్రీమ్ కూడా డిసర్ట్స్‌లో తప్పనిసరి భాగం అయిపోయింది. ఐస్‌క్రీమ్‌కి కాంబినేషన్‌గా గులాబ్‌జామ్/పేస్ట్రీస్/ మూంగ్‌దాల్ హల్వా వంటివి అతిథుల నోరూరిస్తున్నాయి. కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాలైన ఖద్దూ కా ఖీర్, ఫ్రూట్ కస్టర్డ్.. సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసం, పూర్ణాలు, బొబ్బట్లు కూడా వడ్డిస్తున్నారు. ఆరోగ్య ‘తీపి’..రస్తు.. ఇటీవల ప్రారంభమైన ఆరోగ్యకరమైన వంటకాల ప్రభావం రెస్టారెంట్స్ మీద కూడా పడింది. దీనిలో భాగంగా కొత్తగా పరిచయమైన మిల్టెట్స్తో తయారైన తీపి వంటకాలను అతిథులకు అందిస్తున్నారు. కొర్రల పరమాన్నం, జవారి లడ్డు, రాగుల పాయసం, ఊదల లడ్డు, సామల పరమాన్నం.. వంటివి నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. ఇవన్నీ పంచదార కాకుండా తృణధాన్యాలు, బెల్లంతో తయారవడం డయాబెటిక్ రోగులకు కూడా పెద్దగా హానికారకం కాకపోవడంతో వీటి పట్ల నగరవాసుల్లో మోజు పెరిగిందని చెఫ్ యాదగిరి చెబుతున్నారు. ఆయా సీజన్లలో వచ్చే పండ్లను ఉపయోగించి తయారు చేసే సీజనల్ డిసర్ట్స్ కూడా రెస్టారెంట్స్‌లో సందడి చేస్తున్నాయి. సీతాఫలం దొరికే సీజన్లో సీతాఫల్ రబ్డీ, ప్రస్తుతం జామకాయలు విరివిగా దొరుకుతాయి కాబట్టి జామూన్ డిలైట్ ఇలా ఆయా సీజన్స్ ప్రకారం కొత్త రుచులను అందిస్తున్నారు. అలాగే మల్బరీ పండ్లు విరివిగా లభించే సమయంలో ఐస్‌క్రీమ్ మల్బరీస్ మిక్స్, మల్బరీ జ్యూస్ వంటివి అందిస్తున్నారు. -
'వంట చేయడం గొప్ప టాలెంట్'..!: థైరోకేర్ వ్యవస్థాపకుడు
వంట చేయడం లేదా వంట వృత్తిని తక్కువగా లేదా తేలిగ్గా చూస్తారు చాలామంది. పైగా గబగబ ఏదో ఒకటి టైంకి వండిపెట్టేవాళ్లు లేకపోతే అల్లాడిపోతాం. అలాంటిది ఆ వృత్తిని మాత్రం చీప్‌గా చూస్తాం. ఇప్పుడు నెట్టింట థైరోకేర్ వ్యవస్థాపకుడు షేర్ చేసిన ట్వీట్ చూసి కచ్చితంగా మనసు మార్చుకుంటారు. ఎందుకుంటే వంట ప్రాముఖ్యతను హైలెట్ చేస్తూ వివరించిన విధానం నెటిజన్ల మనసును హత్తుకుంది. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ వేలుమణి ఇటీవల రెండు రకాల వ్యక్తులపై తన దృక్పథాన్ని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో వంట ప్రాముఖ్యతను ఆయన హైలెట్ చేయడంతో ఒక్కసారిగా నెట్టింట ఈ పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. వేలుమణి వంట చేయడం నేర్చుకునేవారు, వంట చేయడాన్ని టైం వేస్ట్ పనిగా భావించే వారు అంటూ రెండు విరుద్ధ అభిప్రాయల గల వ్యక్తుల గురించి పోస్ట్‌లో రాశారు. వంటను రుచికరంగా చేసేవారు వైవాహిక జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తారని, అత్యంత సంపన్న కుటుంబ నేపథ్యం ఉండి, వంట చేయడాన్ని టైం వేస్ట్‌గా భావించేవారికి వైవాహిక జీవితంలో సత్సంబంధాలు సవ్యంగా ఉండవని అన్నారు. అంటే ధనవంతుడైనా భాగస్వామి దొరికినా.. ఆమెకు వంట చేయడం పట్ల సరైన ఆసక్తి లేకపోతే ఇరువురి మధ్య సరైన సత్సంబంధాలు లేక ఇబ్బంది పడతారని అన్నారు వేలుమణి. అంతేగాదు తన పోస్ట్‌లో థైరోకేర్ వ్యవస్థాపకుడు వేలుమణి తన భార్య సుమతి వేలుమణి ఇరు కుటుంబాలను చక్కగా చూసుకునేదని అన్నారు. ఆమె స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఉద్యోగం చేస్తూ కూడా కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహించేదని, వంట చక్కగా చేసేదంటూ తన దివంగత భార్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆహారమే ఓ వ్యక్తి ప్రేమను మరింత హృదయానికి హత్తుకునేలా చేస్తుందని అన్నారు. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ పిలల్లకు వంట నేర్పించండి. ఆ విషయంలో పేరెంట్స్‌గా విఫలమై ఆ తర్వాత పశ్చాత్తాపం పడినా ప్రయోజనం లేదంటూ రాసుకొచ్చారు వేలుమణి ఆ పోస్ట్‌లో.There are two kinds. 1. Intelligent enough to Learn a good deal of cooking. They enjoy a happy married life by building bilateral relationships. 2. Lazy enough to think that cooking is waste of time. Even if they find a rich spouse, they struggle in generating or sustaining… pic.twitter.com/rVHR6jM3fu— Dr. A. Velumani.PhD. (@velumania) March 5, 2025 (చదవండి: ఆ వ్యక్తికి 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు..! కుటుంబమే..) -
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
దివంగత టాలీవుడ్ నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అచ్చం తల్లిలానే తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. అలనాటి అందాల తార శ్రీదేవిని తలపించేలా ముగ్ధమనోహరంగా ఉంటుంది. దేవర మూవీలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ సరసన నటించి నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ ఏడాది మార్చి 06తో 28 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆమె గ్లామర్ పరంగా తన తల్లికి ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్‌గా స్లిమ్‌గా ఉంటుంది. మరో అతిలోక సందరిలా కళ్లు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం. అంతలా ఫిజిక్ మెయింటైన్ చేయడం వెనుకున్న రహస్యం ఏంటో చూద్దామా..!.జాన్వీ తరుచుగా తన ఫిట్నెస్కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో బ్యూటీ సీక్రెటని బయటపెట్టింది. తన ఆహారపు అలవాట్లు, ఫిటెనెస్ సీక్రెట్ తదితరాల గురించి షేర్ చేసుకుంది. తాను ఎక్కువుగా ఇంట్లో వండిన ఆహారాలనే ఇష్టంగా తింటానని అంటోంది. కఠినమైన డైట్‌ని ఫాలోఅవుతానని అంటోంది. అల్పాహారం అవకాడో, రెండు గుడ్ల మాత్రమేనని, భోజనంలో గ్రిల్డ్ చికెన్, పాలకూర, సూప్ తీసుకుంటానని చెబుతోంది. ఎక్కువగా జపనీస్, ఇటాలియన, ఆంధ్ర, మొఘలాయ్ వంటకాలంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే తాను గ్లూటైన్ రహిత ఫుడ్‌నే తీసుకుంటానంటోంది. ఎందుకంటే గ్లూటైన్ తనకు పడదని, అలెర్జీ వస్తుందని తెలిపింది. తనకు బాగా నచ్చిన ఆరోగ్యకరమైన మంచీలను లేదా పండ్లు ఎక్కువగా ఇష్టంగా తింటానని చెప్పింది. వాటిలో చక్కెర ఎలాగో ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వీట్స్ జోలికి వెళ్లనంటోంది. బాగా, పానీపూరీ, ఐస్‌క్రీం, స్ట్రాబెర్రీలు అంటే మహా ఇష్టమని చెబుతోంది. చాలామటుకు అన్ని కూరగాయలు, పళ్లు తింటానని, కాకపోతే బరువు పెరగకుండా చూసుకునేందుకు ఎక్కువగా వ్యాయామాలు చేస్తానని చెప్పింది. తేలికగా జీర్ణమయ్యే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తుందట. అందుకే ఎక్కువగా రెడ్‌రైస్ బిర్యానీనే తింటుదట. తన చివరి భోజనం తొందరగానే పూర్తి చేశానని ఒకవేళ షూటింగ ఉంటే 10 గంటల కల్లా పూర్తి చేస్తానని చెబుతోంది. ఇంతకుమునుపు చిలగడదుంప, పరాఠా వద్దకు వెళ్లేదాన్నికాదని, నో కార్బ్సో డైట్‌ను పాటించేదాన్ని అని తెలిపింది. అయితే ఇప్పుడు కార్బోహైడ్రేట్లు పెంచడం ప్రారంభించినట్లు వెల్లడించింది జాన్వీ కపూర్. గ్లామర్ పీల్డ్‌లో రాణించాలంటే ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే కష్టమే కదూ..!.(చదవండి: కోచింగ్ లేకుండానే నీట్లో 720కి 720 మార్కులు..!) -
హలో హలీమ్.. చలో తినేద్దాం..
హైదరాబాద్: నగరంలో రంజాన్ మాసం అంటే ఆధ్యాత్మికతకు నెలవు. అయితే రుచుల ప్రియులకు అది హలీమ్‌కు కొలువు. రద్దీ బజార్ల నుంచి సందు గొందుల దాకా తినుబండారాల స్టాల్స్ నుంచి లగ్జరీ ఫైన్‌డైనింగ్ రెస్టారెంట్ల వరకు, ఎందెందు వెదకినా.. అందందే హలీమ్ ఘుమఘమలు గుబాళిస్తూ ఉంటాయి. నగరవాసులకు మాత్రమే కాదు విదేశాలకు సైతం ఎగుమతి అయ్యే సిటీ హలీమ్‌ను అందించడంలో స్పెషల్‌గా నిలవాలని తయారీదారులు పోటీపడుతుంటారు. కొందరు తమ సంప్రదాయ తయారీ పద్ధతులకు కట్టుబడి ఉంటారు, మరికొందరు సమకాలీన రుచులతో ప్రయోగాలు చేస్తారు. పలువురు ఫుడ్ లవర్స్‌ను ఫ్యాన్స్‌గా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఆదరణ పొందిన టాప్ 10 హలీమ్ స్పాట్స్ విశేషాలివి.. భలే ‘సర్వీ’స్.. ప్రముఖ రెస్టారెంట్.. సర్వి గత కొంతకాలంగా అత్యంత ఆదరణ పొందుతున్న హలీమ్‌కు కేరాఫ్‌గా ఉంది. ఈసారి చికెన్ 65, ఉడికించిన గుడ్డు, జీడిపప్పు, క్రీమ్‌లతో కూడిన ప్రత్యేక ఇరానీ హలీమ్‌ను అందిస్తున్నారు. మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, మాదాపూర్, సికింద్రాబాద్‌లలో సర్వి రెస్టారెంట్స్ ఉన్నాయి. ‘వజ్రం’లా.. హోటల్ సిటీ డైమండ్ హలీమ్ ప్రియుల ఫేవరెట్ ప్లేస్‌గా పేరొందింది. నెయ్యితో తయారైన వీరి హలీమ్ సుగంధ మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. దీనిని సంప్రదాయ భట్టిలో వండుతారు. మెహదీపట్నంలో సిటీ డైమండ్ ఉంది. హుషార్.. పెషావర్.. ప్రత్యేక టాపింగ్స్ లేని హలీమ్‌ను ఇష్టపడే వ్యక్తులకు, పెషావర్ సరైన ప్లేస్. గత కొన్ని సంవత్సరాలుగా సువాసన గల హలీమ్‌తో హైదరాబాదీలను ఆకట్టుకుంటోన్న పెషావర్ లక్డీకాపూల్, మలక్‌పేట్‌లో ఉంది. వహ్వా.. అని‘పిస్తా’.. నగరవాసులు అత్యంత ఇష్టపడే పిస్తా హౌస్ ప్రస్తావన లేకుండా హైదరాబాద్ హలీమ్ పండుగ ఉండదు. ప్రతి ఏటా మాంసం, మసాలాతో కూడిన హలీమ్‌తో తనదైన రుచిని పిస్తా హౌస్ అందిస్తుంది. నగరంలో దాదాపు ప్రతీ ప్రధాన ఏరియాలో పిస్తా హౌస్‌లు ఉన్నాయి. మది దోచే.. మందార్ అచ్చమైన సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి వండే హలీమ్‌కు మందార్ పేరొందింది, కాసింత ఇంటిశైలి రుచిని ఇష్టపడేవారికి కరెక్ట్ ప్లేస్. ఈ హలీమ్‌ను రుచి చూడాలంటే టోలీచౌకిలోని మందార్ను సందర్శించాల్సిందే. ట్రిపుల్ ‘ఫై’న్.. ఫ్యూజన్ హలీమ్‌కు ప్రసిద్ధి చెందింది కేఫ్ 555.. చికెన్ 65, నల్లి ఘోష్్ట, తలవా ఘోష్్ట, ఉడికించిన గుడ్డు లేదా క్రీమ్ వంటి విభిన్న టాపింగ్స్‌తో వెరైటీ రుచులను అందిస్తుంది మాసాబ్ ట్యాంక్‌లో ఉన్న ఈ కేఫ్. సుభాన్.. మహాన్.. ఉస్మానియా బిస్కెట్ల సృష్టికర్త సుభాన్ బేకరీ రెండేళ్ల క్రితం హలీమ్ వ్యాపారంలో అడుగు పెట్టింది. స్వల్పకాలంలోనే నగరవాసుల మనసులను గెలుచుకుంది. నాంపల్లి, అత్తాపూర్ ప్రాంతాలలో ఈ బేకరీ ఉంది. గ్రిల్.. భారీ థ్రిల్.. బాహుబలి హలీమ్‌తో ప్రత్యేకంగా గుర్తింపు పొందింది గ్రిల్(3 ప్లేట్ల హలీమ్, ఉడికించిన గుడ్లు, చికెన్ 65, పత్తర్ కా ఘోష్ట్, నల్లి, వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, బాదం క్రీమ్)తో కూడిన హలీమ్‌లను వడ్డిస్తూ ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ హలీమ్ టేస్ట్ చేయాలంటే ఛలో సికింద్రాబాద్.మటన్కా.. బాద్‘షా’ షాగౌస్ పేరు తెలియని మాంసాహార ప్రియులు సిటీలో ఉండరేమో. ఆ క్రమంలోనే హలీమ్ లవర్స్నూ తనదైన శైలితో ఆకట్టుకుంటోంది. వినియోగించే మాంసపు రుచి పరంగా ఫ్యాన్స్‌ను దక్కించుకున్న ఈ రెస్టారెంట్ సిటీలోని లక్డికాపూల్, టోలిచౌకి, గచి్చ»ౌలి షాలీబండాల్లో ఉంది. ఆదాబ్.. షాదాబ్.. ఓల్డ్ సిటీ నడి»ొడ్డున ఉన్న షాదాబ్ హోటల్ ప్రతి రంజాన్‌కు హలీమ్ ఆదరణలో అగ్రగామిగా ఉంటుంది. నాణ్యమైన ముడిదినుసులు సాంప్రదాయ వంట శైలిని ఉపయోగించడం వీరి ప్రత్యేకత. ఘాన్సీ బజార్లో షాదాబ్ ఉంది. -
వీ ఆర్ వీగన్స్
కొన్ని సంవత్సరాలుగా వీగన్స్, వీగనిజంపై విస్తృతంగా అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో వీగనిజంకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, ప్రాముఖ్యత తెలిపే సదస్సులు నిర్వహిస్తున్నారు. జంతు సంరక్షణ, మూగజీవాల హక్కుల కోసం పాటు పడటం వంటి అంశాలపై వీగన్లు, వీగన్ సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా నగరం వేదికగా మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీతార దక్ష నాగర్కర్ భాగస్వామ్యంతో మొక్కల–ఆధారిత ఆహార జీవనాన్ని ప్రోత్సహించే అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. స్వతాహ వీగన్ అయిన దక్ష నాగర్కర్ వీగనిజం ప్రాముఖ్యత, జంతువులపై హింస వద్దంటూ ఈ ప్రచారం ద్వారా తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో వీగనిజం గురించి, ప్రస్తుత తరుణంలో దాని ప్రాధాన్యత.. తదితర అంశాల గురించి ‘సాక్షి’తో పంచుకుంది. ప్రస్తుత మానవ జీవన విధానం జంతువులను అత్యంత హీనంగా హింసిస్తోంది. ముఖ్యంగా మాంసం కోసం 2, 3 నెలల జంతువులను కృత్రిమ విధానాలతో బలవంతంగా ఎక్కువ బరువు పెంచి సృష్టి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా డైరీ పామ్స్, ఫౌల్ట్రీ, పిగ్ ఫామ్స్‌లో కనీసం ఒక జంతువు స్వేచ్ఛగా తిరగకుండా కేజ్‌లలో బందించి వాటి ఉత్పత్తులను సేకరిస్తున్నారు. కొన్ని జంతువులైతే వాటి జీవిత కాలంలో సూర్యరశి్మకి కూడా చూడకుండా పెరుగుతున్నాయి. ఇది జీవవైవిధ్యానికి విరుద్దం. దేశంలో జనాభా పెరిగిపోయింది, ఇంతమందికి సరిపడా జంతు ఉత్పత్తులు అందించలేక, బ్యాలెన్స్ చేయలేక అనైతిక బ్రీడింగ్‌తో హింసిస్తున్నారు. ఈ సందర్భంగా ‘పవర్డ్ బై వెజ్జీస్‘ అంటూ కూరగాయలను మాత్రమే తినాలని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీలు, వాహనాల కాలుష్యం కన్నా ఫ్యాక్టరీ ఫార్మమింగ్తో ఎక్కువ కాలుష్యం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం కోసం బాగా స్పందిస్తున్నారు. వారి జీవనంలో కొనసాగుతున్న ప్రాంతీయ వీగన్ వంటకాల విశిష్టతను తెలుసుకుంటున్నారు. కానీ నగరాల్లో మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా అని వాదిస్తున్నారు. కానీ మొక్కల్లో స్టిమ్యులే మాత్రమే ఉంటుంది, జంతువుల్లో వలె నొప్పిని తెలియజేసే నాడీ వ్యవస్థ ఉండదని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీగన్స్ అంటే మాంసాన్ని మాత్రమే కాదు.. పాలు, పెరుగు, గుడ్లు వంటి జంతు పదార్థాలతో పాటు జంతు ఉత్పత్తులతో తయారు చేసిన బ్యాగ్‌లు, దుస్తులు ఏ ఇతర వస్తువులను వినియోగించరు. జంతువులకు వాటి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు హింసకు దూరం చేయడం అవసరం. నేను నటించిన జాంబిరెడ్డి సినిమా షూటింగ్ సమయంలో మా దర్శకులు ఒక మేకను ఎంత జాగ్రత్తగా, సురక్షితంగా చూసుకున్నారో చూసి సంతోషపడ్డాను. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జంతువుల హింసించకూడదనే అంశంపై కొత్త చట్టాలను వెలువరించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా జంతు పెంపకాలపై దృష్టి సారిస్తూ నియమాలను పాటిస్తుంది. సినిమాల విషయానికొస్తే త్వరలో మరో 2 సినిమాలు చేస్తున్నాను. తెలుగు ప్రజలకు దగ్గరవ్వడం చాలా సంతోషంగా ఉంది. – దక్ష నాగర్కర్జంతు సంరక్షణే లక్ష్యంగా 2016లో ప్రారంభించిన మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా కృషి చేస్తోంది. సంస్థ పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో క్రూరంగా పందులను పెంచడం నిషేధించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. శాఖాహారం, మాంసాహారం ఉన్నట్లుగానే వీగన్ ఫుడ్‌కు కూడా లేబుల్ ఉండేలా మార్పు తీసుకొచ్చాం. జాన్ అబ్రహం, సోనాక్షి సిన్హ, సాక్షి మల్లిక్ మాదిరిగానే హైదరాబాద్‌లో వీగనిజం కోసం దక్షా నాగర్కర్ క్యాంపెయిన్ చేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఒక జంతువును చంపితే రూ.50 ఫైన్ కట్టి హాయిగా తిరుగుతున్నారు. ఒక మనిషిని చంపితే ఎలాంటి చట్టం ఉంటుందో జంతు హత్యలపై కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఉన్నత న్యాయస్థానాలకు విన్నవించాం. – నికుంజ్ శర్మ, సీఈఓ, మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా -
పప్పుధాన్యాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందంటే..!
పప్పుధాన్యాలు పోషకాల గనులు. ఇవి తీసుకోకపోయినా..లేక అవి లేకపోతే పర్యావరణ పరంగానే కాదు మానువుల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడిపోతుంది. అవి తీసుకోకపోతే జీవనమే అస్తవ్యస్తంగా అయిపోతుంది. మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్‌తో కూడిన పోషక కేంద్రాలివి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకి మద్దతిస్తాయి. అలాగే స్థిరమైన వ్యవసాయానికి కీలకం ఇవి. పోషకాహారంలో వాటి పాత్ర అపారమైనది. అవి లేకుండా జీవనం అంటే.. ఊహకే అందని విషయం. ఇవి మానవ ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దామా..ప్రోటీన్లు కోల్పోతాం.పప్పుధాన్యాలు తీసుకోకపోతే కండరాల నష్టం, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. శాకాహారులు మాంసకృత్తుల కోసం ప్రత్యామ్నాయంగా వాడే పప్పుధాన్యాలతో ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఈ పప్పుధాన్యాలు తీసుకోకపోతే గుండెకు ఆరోగ్యకరమైన ప్రోటీన్లను కోల్పోతాం. హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వీటిని పూర్తిగా తీసుకోవడం మానేస్తే ప్రోటీన్ కొరత ఏర్పడి కీళ్ల సమస్యలు అధికమయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.ఫైబర్లు అందవు: జీర్ణక్రియ, గట్ సమస్యలు మొదలవుతాయి. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, గట్ సంబంధిత సమస్యలు అధికమవ్వుతాయి. కొలొరెక్టల్ కేన్సర్, టైప్ 2 డయాబెటిస్ , హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. నిజానికి పప్పుధాన్యాల్లో ఉండే ఫైబర్లు గట్ ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తికి, జీర్ణక్రియకు మద్దతిస్తాయి. అలాంటిది వాటిని అస్సలు తీసుకోకపోవడమంటే.. ఆరోగ్యాన్ని కోల్పోవడంతో సమానమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.ఐరన్ లోపం:పప్పుధాన్యాల్లో ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటివి ఉంటాయి. ఎప్పుడైతే వీటిని తీసుకోమో అప్పటి నుంచి శరీరంలో రక్తహీనత వంటి సమస్యలు అధికమవుతాయి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా సులభంగా వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఐరన్, ఫోలేట్లు రక్తహీనతను నివారించగా, మెగ్నీషియం, పొటాషియ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. జింక్ రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.పర్యావరణానికి కూడా నష్టమే..ఈ పప్పుధాన్యాలు మానవులకు మాత్రమే కాదు పర్యావరణానికి కూడా మంచివి. వాటి నత్రజని-స్థిరీకరణ సామర్థ్యం నేలను సారవంతంగా ఉంచుతుంది. వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తుంది. ఇతర పంటలతో పోలిస్తే ఈ పప్పుధాన్యాల పంటలకు తక్కువ నీరు చాలు. అంతేగాదు రైతులు వనరులు అధికంగా అవసరమయ్యే పంటలు, జంతువుల పెంపకంపై ఆధారపడవలసి వస్తుంది. దీని వల్ల అధిక నీరు వినియోగం కోసం భూమిపై అధిక ఒత్తిడి తెస్తుంది. ఫలితంగా ఆహార ఉత్పత్తి తగ్గుతుంది పర్యావరణ నష్టం మరింత పెరుగుతుంది.చెడు ఆహారపు అవాట్లు ఎక్కువ అవుతాయి..ఎప్పుడైతే పప్పుధాన్యాలు లేవో అప్పుడు ప్రజలు అనారోగ్యకరమైన ఆహారపదార్థాలకు ఎడిక్ట్ అవుతారు. ఇవి రుచికరంగా ఉన్నా..ఆరోగ్యానికి అంతగా మంచివి కావు. ఎప్పుడైతే ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం మొదలవుతుందో పోషకాహారం లోపం ఏర్పడి వివిధ వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా ఎక్కవ అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రక్తంలో చక్కెర అధికమవుతుంది:డయాబెటిస్ ప్రమాదం పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ పప్పుధాన్యాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)ని కలిగి ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి కీలకమైన ఆహారంగా మారుతాయి. డయాబెటిస్ రోగులు పప్పుధాన్యాలు తీసుకోకపోవడం వల్ల చక్కెరను అదుపులో ఉంచే మార్గాన్ని కోల్పోవడం జరగుతుంది. జీవక్రియ రుగ్మతలు, బరువు పెరగడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి.చూడటానికి చిన్నగా ఉండే ఈ పప్పుధాన్యాలు శక్తిమంతమైనవి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచడం లేదా దరిచేరనీయవు. ఇవి మానవ ఆరోగ్యాన్ని కాపాడి, ఆకలిని నియంత్రించే అద్భుతమైన పోషకాలని కలగి ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి లేని ప్రపంచమంటే అనారోగ్యకరమైన జీవనం లేదా ప్రాణాపాయకరమైన జీవనంగా పేర్కొనవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఆరోగ్యకరమైన హైడ్రేటెడ్ చర్మ కోసం తప్పక తీసుకోవాల్సిన ఆహారాలివే..! -
ముడతలు లేని ఆరోగ్యకరమైన చర్మం కోసం..!
చర్మం గరుకుగా పొడిబారినట్లుగా అయిపోయి వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తున్నాయా..?. అందుకోసం చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఆధారపడటానికి బదులుగా తీసుకునే ఆహారంపై శ్రద్ధ చూపితే మేలు అని చెబుతున్నారు చర్మ నిపుణులు. మొక్కల ఆధారిత ఆహారాలు చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలతో నిండి ఉంటాయని పలు పరిశోధనల్లో నిరూపితమైంది కూడా. వీటిలో చర్మానికి కావాల్సిన విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, చర్మంపై వచ్చే మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు చర్మం ఆకృతికి, ఆర్థ్రీకరణను ప్రోత్సహించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. మరీ అందుకోసం తీసుకోవాల్సిన సూపర్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఏంటో చూద్దామా..!.జర్నల్ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెక్స్ 2022లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం..నిర్దిష్ట పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు , పాలీఫెనాల్ అధికంగా ఉండే పానీయాలు తదితరాలు మెరుగ్గా ఉండే ఆరోగ్యకరమైన చర్మంలో కీలకపాత్ర పోషిస్తాయని తేలింది. ఈ ఆహారాలు యవ్వనంతో నిగనిగలాడే చర్మాన్ని అందిస్తాయని పరిశోధన వెల్లడించింది. మరి యవ్వన చర్మానికి దోహదపడే మొక్కల ఆధారిత ఆహారాలు ఏవంటే..నారింజ: ఇది విటమిన్ 'సీ'కి అద్భుతమైన మూలం. ఇది కొల్లాజెన్ సంశ్లేషణ, చర్మం మరమత్తులో కీలకపాత్ర పోషిస్తుంది. ముదురుఎరుపు రంగు కండ కలిగిన బ్లడ్ ఆరెంజ్‌లతో మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. సుమారు 20 నుంచి 27 ఏళ్ల వయసు గల యువత 21 రోజుల పాటు ప్రతిరోజూ 600 ఎంఎల్ బ్లడ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల డీఎన్ఏ నష్టం తగ్గడం తోపాటు విటమిన్ సీ, కెరోటినాయిడ్ల స్థాయిలు పెరిగినట్లు పరిశోధనలో వెల్లడైంది.టమోటాలు..దీనిలో లైకోపీన్ ఉంటుంది. ఇది చర్మానికి శక్తిమంతమైన యాంటీ ఆక్సీడెంట్లను అందిస్తుంది. పెద్దలు ప్రతిరోజు ఆలివ్‌నూనె తోపాటు 55 గ్రాముల టమోటా పేస్ట్ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు గణనీయంగా తగగుతాయని పరిశోధనలో తేలింది. దీనిలో చర్మ నష్టం నుంచి రక్షించే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు సూర్యరశ్మి, కాలుష్యం, పర్యావరణ ఒత్తిళ నుంచి చర్మాన్ని రక్షించడంలో టమోటాలు సమర్థవంతంగా ఉంటాయని అన్నారు.బాదంపప్పుబాదంపపపులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు(ఎంయూఎఫ్ఏ), విటమిన్ ఈ, పాలీఫైనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మరక్షణకు దోహదం చేస్తాయి. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు 16 వారాల పాటు మొత్తం రోజువారీ కేలరీల్లో 20% బాదంపప్పులు తీసుకోవడంతో గణనీయమైన మార్పులు కనిపించాయని అన్నారు. సోయబీన్స్..దీనిలో ఐసోఫ్లేవోన్లుగా పిలిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఈస్ట్రోజెన్‌తో సమానమైన నిర్మాణాలను కలిగి ఉంటాయి. రుతువిరతి సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం తోపాటు చర్మం పొడిబారడం, గాయలయ్యే అవకాశాలు ఎక్కుగా ఉంటాయట. ఎప్పుడైతే సోయాబీన్ తీసుకోవడం మొదలుపెడతామో..అప్పటినుంచి చర్మ స్థితిస్థాపకతలో మంచి మార్పుల తోపాటు ఆర్థ్రీకరణ పెరిగి గీతలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కోకోకోకోలో ఫ్లేవనోల్స్ నిండి ఉన్నాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. పరిశోధనలో 24 వారాలపాటు ఓ వృద్ధ మహిళ ప్రతిరోజూ కోకో పానీయం తీసుకోవడంతో ఆమె చర్మంలో ముడతలు, గరుకుదనం తగ్గి యవ్వనపు కాంతి సంతరించుకుందని శాస్తవేత్తలు చెబుతున్నారు. అందువల్ల పోషకాలు అధికంగా ఉండే ఈ మొక్కల ఆధారిత ఆహారాలను డైట్లో చేర్చుకోవడం వల్ల చర్మ ఆర్థ్రీకరణ, స్థితిపాకత తోపాటు మొత్తం రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యకరమైన యవ్వన చర్మాన్ని ప్రోత్సహించడంలో కీలకంగా ఉంటాయని చెబుతున్నారు చర్మ నిపుణులు. (చదవండి: మహిళల రక్షణకు ఉపకరించే చట్టాలివే..) -
'చికెన్ 65'కి ఆ పేరెలా వచ్చిందో తెలుసా..?
చికెన్ రెసిపీల్లో అందరికీ నచ్చేది చికెన్ 65. దీనికున్న క్రేజ్ అంత ఇంత కాదు. అయితే ఎన్నో రకాల రెసిపీలు వాటి తయారీ విధానం లేదా తయారీకి పురికొల్పిన విధానం బట్టి వాటి పేర్లు వస్తాయి. మరికొన్ని రెసిపీలైతే కొందరు సెలబ్రిటీలు లేదా ప్రముఖులు కాంబినేషన్‌గా తిన్న తీరు అనుసరించి వారి పేరు మీదుగా రెపిపీల పేర్లు రావడం జరిగింది. కానీ ఈ చికెన్ 65(Chicken 65)కి ఆ పేరు వచ్చిత తీరు తెలిస్తే విస్తుపోతారు. ఆ..! ఇలానా దానికి ఆ పేరు వచ్చింది అని నోరెళ్లబెడతారు. మరీ ఆ గమ్మత్తైన కథేంటో చదివేయండి మరీ..గతేడాది ప్రముఖ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోనే బెస్ట్ ఫ్రైడ్ చికెన్ వంటకాల జాబితా ఇచ్చింది. అందులో మన భారతదేశ వంటకం చికెన్ 65 మూడో స్థానాన్ని దక్కించుకుంది. అంతలా ఫేమస్ అయిన ఈ చికెన్ 65ని ఆ నెంబర్‌తో ఎందుకు పిలుస్తారనేది అతిపెద్ద డౌటు. అందుకు గల రీజన్ కూడా తెలియదు. అయితే చాలామంది 65 చికెన్ ముక్కలతో చేస్తారేమో లేక అన్ని రోజులు లేదా గంటలు ఈ చికెన్‌ని మ్యారినైట్ చేస్తారేమో అంటూ..పలు వాదనలు కూడా వినిపించాయి. కానీ అవేమీ కారణం కాదట. అలా పిలిచేందుకు ఓ తమాషా కథ ఉంది. అదేంటంటే..చాలమంది దీన్ని స్నాక్ రూపంలో తింటారు. కొందరు నాన్స్, చపాతీలు, భోజనంగానూ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి టేస్టీ చికెన్ 65 పేరు రావడానికి కారణం చెన్నైలోని బుహారీ రెస్టారెంట్ అట. అక్కడ మద్రాస్ మాజీ షెరీఫ్ ఎ ఎం బుహారీ కొలంబోలో పాకశాస్త్రంపై ఇష్టంతో దానికి సంబంధించిన హోటల్‌మేనేజ్‌మెంట్ చదువుని పూర్తి చేసుకుని భారత్‌కి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత చెన్నైలో రెస్టారెంట్‌ని ప్రారంభించాడు. నాటి బ్రిటిష్ వాళ్లకు భారతీయ ఆహారంతో కూడిన సరికొత్త భోజనాన్ని అందించింది ఆయనే. బుహరీ హోటల్ ద్వారా అక్కడి స్థానిక ప్రజలకు విభిన్న రుచులను అందించాడు. నాటి రోజుల మెనూలో సుదీర్ఘ వెరైటీల జాబితా ఉన్న హోటల్‌గా ప్రసిద్ధి చెందింది ఈ హోటల్. ఆ నెంబర్‌తోనే ఎందుకంటే..అయితే మనకేది కావాలో ఆర్డర్ చేయడానికి ఒక సైనికుడు భాషా సమస్య కారణంగా ఆ మెనూలోని నెంబర్ ఆధారంగా ఆర్డర్ చేశాడంట. అతడు ఎప్పుడు 65 నెంబర్లో ఉన్న చికెన్ రెసిపీని ఇమ్మని చెప్పేవాడట. పైగా అది క్రంచీగా ఉండే చికెన్ అని చెప్పేవాడట. దీంతో మిగతా కస్టమర్లు కూడా అతడిలా ఆ నెంబర్లో ఉన్నచికెన్ని ఆర్డర్ చేయడం మొదలు పెట్టారు. చెప్పాలంటే ఆ మెనూలో 65వ నెంబర్లో ఉన్న చికెన్ ఆర్డర్లే ఎక్కువగా ఉండేవి. అలా క్రమేపి అది కాస్త చికెన్ 65గా స్థిరపడిపోయింది. ఆ విధంగా ఆ రెసిపీకి చికెన్ 65 అని పేరొచ్చింది. కాలం గడిచేకొద్ది ఈ వంటకానికి ప్రజాదరణ పెరిగిందే కానీ తగ్గలేదు. ఇప్పటికీ ప్రతి రెస్టారెంట్లలో నువ్వానేనా అనే రెసిపీలు ఎన్ని ఉన్నా.. ఈ చికెన్ 65కి ఉన్న క్రేజ్ మరే రెసిపీకి లేదని చెప్పొచ్చు. ఈ వంటకం దొరికే ఫేమస్ రెస్టారెంట్లుచెన్నైలో ఈ వంటకానికి పేరుగాంచిన రెస్టారెంట్లు ఇవే..ఈ రోడ్ అమ్మన్ మెస్: ఇక్కడ చికెన్ 65 తోపాటు ఆంధ్రా చిల్లీ చికెన్ ఫేమస్. అయితే ఈ ఆంధ్రా చిల్లీ చికెన్‌ని పెద్దపెద్ద పచ్చి మిర్చితో వెల్లుల్లి మసాలతో డెకరేట్ చేసి ఉంటుంది. బుహారీ హోటల్: ఇక్కడ చికెన్78, చికెన్ 82, చికెన్ 90 అనే వంటి రకాల డిషెస్ కూడా ఫేమస్దక్షిణ్ రెస్టారెంట్: తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటకాల మెనూ ఉంటుంది. అయితే ఓన్లీ రుచికరమైన చికెన్ 65 మాత్రమే ఉంటుంది. (చదవండి: కాఫీ నాణ్యతను డిసైడ్ చేసేది ఆమె..! ది బెస్ట్ ఏంటో..) -
కేరాఫ్ కాంటినెంటల్ : ఇంటర్నేషనల్ చెఫ్‌లతో స్పెషల్ చిట్‌చాట్
కాంటినెంటల్ వంటకాలకు నగరం కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందుతోంది. సాధారణంగా సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాలతో నగరానికి ప్రత్యేక అనుబంధముంది. ఈ మూడు దేశాల వంటకాలు భాగ్యనగరంలో విరివిగా లభ్యమవుతుండడం.. ప్రధానంగా సింగపూర్, మలేషియాలో దక్షిణాది వంటకాలకు మంచి ఆదరణ ఉండడం..చైనీస్ వంటకాలకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని ‘ది లీలా హైదరాబాద్’ ఆధ్వర్యంలో ఆగ్నేయాసియా వంటకాలను అందుబాటులోకి తీసుకురావడానికి, వినూత్న భోజన గమ్యస్థానం టిగా (టీఐజీఏ)ను ప్రారంభించింది. ‘త్రీ’ అనే మలయ్ పదం నుంచి పుట్టుకొచ్చిన టీఐజీఏ సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాల సమ్మేళనాన్ని అందిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో సాధారణంగా ఏ కాంటినెంటల్ వంటకం నగరానికొచ్చినా కాసింతైనా స్థానిక రుచులకు అనుగుణంగా వాటి ఫ్లేవర్స్, రుచిని మార్చుతారు. కానీ ఇక్కడ ఎలాంటి మార్పూ లేకుండానే స్వచ్ఛమైన ఆగ్నేయాసియా వంటకాలను అందిస్తామని ప్రముఖ సింగపూర్ మాస్టర్ చెఫ్ ఆల్బర్ట్ రాయన్ తెలిపారు. దీని ఆవిష్కరణ సందర్భంగా నగరంలో సందడి చేసిన ప్రముఖ చెఫ్‌లు ఆల్బర్ట్ రాయన్, మలేషియా వంటకాల నిపుణుడు, ప్రముఖ చెఫ్ ‘షా’ సాక్షితో ముచ్చటించారు. వారు పంచుకున్న అనుభవాలు వారి మాటల్లోనే.. దాదాపు 20 ఏళ్లకు పైగా ప్రొఫెషనల్ చెఫ్‌గా వివిధ దేశాల్లో వినూత్న వంటకాలను వండి వడ్డించాను.. కానీ హైదరాబాద్ నగరం ఆహ్వానించినంత ఉన్నతంగా మరే ప్రాంతం లేదని చెప్పగలను. ఆగ్నేయాసియాకు చెందిన పసందైన వంటకాలను చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌కు చేరువ చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి వినూత్న భోజన గమ్యస్థానం టిగా (టీఐజీఏ) ‘మూడు’ అనే మలయ్ పదంలో భాగంగా సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాల సమ్మేళనాన్ని అందిస్తుంది. నగరంలోని కాంటినెంటల్ రుచుల ఆసక్తికి అనుగుణంగా విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులతో మాత్రమే అరుదైన పసందైన డిషెస్ తయారు చేస్తున్నాం. ఈ వంటకాల్లో ఆయా దేశాల సంస్కృతి, పాకశాస్త్ర పరిపూర్ణ ప్రామాణికత నిర్ధారించడానికి రెస్టారెంట్ నిరి్థష్ట మూలికలు, సుగంధ ద్రవ్యాలను పెంచడం ప్రారంభించింది. చైనీస్, మలయ్, ఇండియన్ సంస్కృతుల నుంచి ప్రేరణ పొందిన సింగపూర్ అద్భుత వంటల వారసత్వం, చిల్లీ క్రాబ్, హైనానీస్ చికెన్ రైస్ వంటి ఐకానిక్ వంటకాలను కలినరీ స్పెషల్‌గా అందిస్తున్నాం. నాసి లెమాక్, రెండాంగ్, సాటే వంటి మలేషియా ప్రత్యేకతలు ఆయా దేశం టేస్ట్ ప్రొఫైల్, పాక శాస్త్ర నైపుణ్యాలను హైలైట్ చేస్తాయి. వీటికి అనుబంధంగా అద్భుతమైన టీలు, ప్రసిద్ధ సామాజిక భోజన సంస్కృతి అయిన ఆరి్టసాన్ డిమ్ సమ్ వంటి క్లాసిక్ కాంటోనీస్ యమ్ చా అనుభవం చేయవచ్చు. ఇలా ఒక ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక వైభవాన్ని స్వచ్ఛంగా కలుషితం లేకుండా కొనసాగిస్తున్న నగరం హైదరాబాద్ కావడంవిశేషం. – ఆల్బర్ట్ రాయన్, చెఫ్ దక్షిణాది ప్రేరణతో.. మలేషియాలో దక్షిణాది వంటకాలకు ప్రత్యేక ఆదరణ ఉంది. ఇక్కడి నుంచి మలేషియాకి వచ్చినన ఫుడ్ లవర్స్ మామ అని సంబోధిస్తూ ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. ఇందులో భాగంగా కొన్ని మలేషియాయా వంటకాలకు మామ కలిపి వాటి పేర్లను తయారు చేశాము. మలేషియాలో చాలా వంటకాలు దక్షిణాది ప్రేరణతో వాటి వైవిధ్యాన్ని, తయారీ విధానాన్ని రూపొందించుకున్నాయి. ఆహారాన్ని ఆస్వాదించడంలో, గౌరవించడంలో దక్షిణాది ప్రజలు ఉన్నత స్థాయిలో ఉంటారు. ముఖ్యంగా హైదరాబాదీలు. ఈ నేపథ్యంలో నగరం వేదికగా సింగపూర్, మలేషియా, చైనా సాంస్కృతిక వంటకాలను అందించడం సంతోషంగా ఉంది. – షా, చెఫ్ -
నోవోటెల్లో నోరూరిస్తున్న ఫుడ్ ఫెస్ట్
విభిన్న వంటకాలకు నెలవైన నగరంలో గుజరాత్ రుచులు ఆహార ప్రియుల నోరూరిస్తున్నాయి. భౌగోళిక సమ్మేళనానికి ఈ ఫెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెఫ్ పూనమ్ చెబుతున్నారు. గుజరాత్ గ్రామీణ పాంతాల్లోని ప్రత్యేక వంటకాలతో పాటు, విశ్వవ్యాప్తంగా ఇష్టపడే తమ సిగ్నేచర్ డిషెస్ వండి వడ్డిస్తున్నారు. ఎయిర్‌పోర్టు వేదికగా నోవోటెల్లో ఏర్పాటైన ఈ ఫెస్టివల్ మార్చ్ 2 వరకూ కొనసాగనుంది. ఇందులో సూర్తి ప్యాటీలు, కుచ్చి దబేలి వంటి వెరైటీలు లైవ్ కౌంటర్లలో ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. – సాక్షి సిటీ బ్యూరో నగరంలోని నోవోటెల్ ఎయిర్పోర్ట్ వేదికగా కొనసాగుతున్న గుజరాత్ కతియావాడి వంటకాలు నగరవాసుల నోరూరిస్తున్నాయి. గుజరాత్ ప్రాంతానికి చెందిన ప్రముఖ చెఫ్ పూనమ్ దేధియ ఆధ్వర్యంలో అక్కడి సంప్రదాయ వంటకాలను ఆహారప్రియులకు వడ్డిస్తున్నారు. ఈ ఫెస్ట్ నగరంలో మరో సాంస్కృతిగా సమ్మేళనంగా కనిపిస్తోంది. ‘స్వాద్ కతియావాడ్ కా’ పేరుతో ఏర్పాటైన ఈ పసందైన రుచులు బఫే నుంచి స్నాక్స్ వరకూ అక్కడి పురాతన రుచులను అందిస్తుంది. కోప్రా పాక్.. ఎండు కొబ్బరి, చక్కెర, నెయ్యి, కొత్తిమీరతో తయారు చేసే వినూత్న రుచికరమైన వెరైటీ. ఇది గుజరాతీ స్పెషల్. ఇందులో విభిన్న రకాల డ్రై ఫ్రూట్స్ వినియోగిస్తారు. 100 గ్రాములకు సుమారు 280 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. క్లాసిక్ హ్యాండ్వో.. ఇది గుజరాత్‌కి చెందిన ప్రత్యేక స్నాక్. ఈ క్లాసిక్ హ్యాండ్వో ఫెర్మెంటెడ్ రైస్, బటర్, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కూరగాయల మిశ్రమం, గుజరాత్లో మాత్రమే లభించే మసాలాలు కలిపి తయారుచేస్తారు. వంటకాల్లో వైవిధ్యంవిభిన్న కూరగాయల మిశ్రమంతో, ఘాటైన మసాలాల ఘుమఘుమలతో తక్కువ సెగపై నెమ్మదిగా వండేవంట వరదియు.. మంచి సువాసనతో కాసింత సూప్‌తో గుజరాతీ వెరైటీని నోటికి అందిస్తుంది. బిజోరా పికిల్.. ఈ అరుదైన వంటకం గుజరాత్లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గుర్తింపు పొందిన ప్రత్యేక వంటకం. ఈ బిజోరా పికిల్ కేవలం గుజరాత్లో మాత్రమే లభిస్తుందని చెఫ్ తెలిపారు. ఇది స్థానిక సాంస్కృతిక వంటకమే కాకుండా ఎన్నో ఆరోగ్య సంరక్షణ గుణాలున్న రుచికరమైన పికిల్. లిల్వాని కచోరి.. కరకరలాడించే లడ్డూ లాంటి స్పెషల్ గుజరాతీ కచోరి ఇది. ఇందులో ప్రత్యేక రుచికరమైన పదార్థాలతో పాటు బఠానీల మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేసి వడ్డిస్తారు. చదవండి: టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ? -
మనసు 'దోసే'స్తారు..!
టాలీవుడ్ ప్రముఖులను సిటీలో చూడాలనుకుంటే.. కాస్ట్లీ క్లబ్లోనో, సగటు మనిషి తొంగిచూడలేని లగ్జరీ కేఫ్‌లోనో.. ఒక్కోసారి అనుకోకుండా మరో చోటనో తారసపడవచ్చు. కొన్ని సార్లు.. సాదా సీదా ఇడ్లీలు, దోశలు విక్రయించే టిఫిన్ సెంటర్ దగ్గర కూడా కావచ్చు. అవును మరి.. విలాస వంతమైన రెస్టారెంట్లు, ప్రత్యేకమైన క్లబ్‌లు హై–ఎండ్ కేఫ్‌లకు మాత్రమే వెళ్లడం అలవాటైన వారిని కూడా ఓ టిఫిన్ సెంటర్ రారమ్మంటోంది. అదే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో ఉన్న రాయలసీమ శైలి ప్రత్యేకమైన అల్పాహారంతో చవులూరిస్తోంది.పంచెకట్టు అంటే.. తెలుగింటి వస్త్రధారణ గుర్తొస్తుంది. ఈ టిఫిన్ సెంటర్ తన పేరుకు తగ్గట్టే మెనూలో సంప్రదాయం ప్రతిబింబిస్తుంది. నెయ్యి, కారం ఇడ్లీ, కారం పాళ్యం దోసె, ఉల్లి, నెయ్యి కారం దోశ, నన్నారి ఫిల్టర్ కాఫీ వంటి వెరైటీలే ఇక్కడ ఉంటాయి. ఇక దోశల తయారీ చూడటం ఒక చక్కటి అనుభవం. ప్రతి దోశనూ తక్కువ మంటపై రెండు వైపులా దోరగా కాల్చి, నెయ్యి పోసి, కారం పొడితో ప్లేట్లో ఉంచుతారు. పల్య (బంగాళదుంప కూర), టాంగీ మిరపకాయ చట్నీ క్లాసిక్ కొబ్బరి చట్నీతో కలిపి వడ్డిస్తారు.అలా మిస్సై.. ఇలా క్లిక్కై.. తాడిపత్రి మా సొంతూరు. అక్కడి నుంచి నగరానికి ఐటీ ఉద్యోగం రీత్యా వచ్చాం.. మా ప్రాంతపు వంటకాలను బాగా మిస్సయ్యేవాడిని. నాలాంటి ఫీలింగ్ మరికొందరిలోనూ చూశాక.. 2019లో ఒక ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశాను. పంచెకట్టుతో దోశలు వేయడం, తినడం మా ప్రాంతంలో సర్వసాధారణం. అందుకే ఆ పేరు పెట్టాను. అనంతరం నగరవాసుల ఆదరాభిమానాలతో పూర్తి స్థాయి రెస్టారెంట్‌గా మార్చాను. ఇడ్లీ, దోశలతో పాటు ఉప్మా, పొంగలి.. వంటి అల్పాహారాలు అందిస్తున్నాం. నెయ్యి, మసాలా తదితర ముడి దినుసులతో సహా చాలా వరకూ రాయలసీమ నుంచే తీసుకొచ్చి స్థానిక ఫ్లేవర్ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు పాటిస్తున్నాం. – నాగాభరణ్, పంచెకట్టు దోసె నిర్వాహకులు టాలీవుడ్ ఫేవరెట్ స్పాట్.. తొలుత ఫుడ్ ట్రక్‌గా ప్రారంభమైన పంచెకట్టు దోశ, ఇప్పుడు నగరం చుట్టూ నాలుగు శాఖలకు విస్తరించింది. దీని కస్టమర్లుగా టాలీవుడ్ సెలబ్రిటీలైన ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి, హీరో సిద్ధార్థ, నటుడు మురళీ శర్మ, నటి లక్ష్మి మంచు తదితరులతో పాటు బ్యూటీ క్వీన్ మానుషి చిల్లర్, మేఘాంశ్ శ్రీహరి, గాయకుడు మనో, దర్శకుడు పరశురామ్ కూడా ఉన్నారు. బంజారాహిల్స్, మాదాపూర్, ప్రగతి నగర్ కొండాపూర్‌లలో పంచెకట్టు దోశ సెంటర్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by FORAGE HOUSE| Shreya Gupta (@forage_house) (చదవండి: అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్‌లో..!) -
వాటర్ ఫిల్టర్ నీళ్లలో స్వచ్ఛత ఎంత? ఎలా ఎంచుకోవాలి?
ఈ రోజుల్లో శుద్ధమైన నీటిని తాగడమూ కొంత ప్రయాసతో కూడిన అంశంగా మారింది. భూగర్భ, నదీ జలాల కాలుష్యం, కొన్నాళ్ల పాటు నిల్వ ఉంచే వాటర్ ట్యాంకుల వల్ల స్వచ్ఛమైన నీటి కోసం వెతుకులాట తప్పడం లేదు. దీంతో చాలా మంది వాటర్ ప్యూరిఫైయర్లను ఎంచుకుంటున్నారు. మార్కెట్లో లభించే రకరకాల వాటర్ ప్యూరిఫైయర్లలో కొన్ని నీటిని వడకట్టేవి, మరికొన్ని నీటి నుంచి పోషకాలు పోకుండా కాపాడేవి, ఇంకొన్ని మోతాదులో పోషకాలు కలిపేవి లభిస్తున్నాయి. ప్రకృతి సిద్ధంగా లభించే నీటిలోఉండే స్వచ్ఛత తెలుసుకోవడానికి అవగాహనే ప్రధానమైనది.ఎంపిక చేసుకున్న ప్యూరిఫైయర్ని ఆపరేటర్లు ఇంట్లో అమర్చాక టిడిఎస్ ఎంత ఉందో నాణ్యత చూపించి, మరీ వాటి గురించి వివరిస్తుంటారు. వరప్రదాయినిగా లభించే నీటిలోపోషకాలు ఏంటి, టిడిఎస్ ఏంటి.. అంటూ కొంత ఆందోళన పడుతుంటాం. ఖనిజాలు, లవణాలు, లోహాలతో సహా నీటిలో కరిగిన పదార్థాల మొత్తాన్ని కొలవడమే టిడిఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్).నీటిలో టిడిఎస్ స్థాయి ఎంత మేరకు ఉండాలంటే...0-50 పిపిఎమ్ (పార్ట్స్ పర్ మిలియన్) ఉంటే... దీనిని స్వేదనజలం అంటారు. అవసరమైన ఖనిజాలు,పోషకాలు లేకపోవడం వల్ల ఈ నీటిని తాగడానికి ఉపయోగించలేం 50-150 పిపిఎమ్ ఉంటే అవసరమైన ఖనిజాలు,పోషకాలు ఉన్నాయని, తాగడానికి మేలైనదని గుర్తించాలి 150 - 300 పిపిఎమ్ ఉంటే తాగడానికి మేలైనది300 - 500 పిపిఎమ్ ఉంటే ఆ నీరు ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి 500-600 పిపిఎమ్ కంటే ఎక్కువ ఉంటే తాగడానికి మేలైనది కాదు.నీటి శుద్ధి యంత్రాల రకాలు: ఆర్వో (రివర్స్ ఓస్మోసిస్):అధిక టిడిఎస్ (300 పిపిఎమ్ కంటే ఎక్కువ)కు ఆర్వో ఉత్తమమైనది. ఇది, నీటిలో భార లోహాలు, రసాయనాలు, అదనపు లవణాలను తొలగిస్తుంది. అయితే, ముఖ్యమైన ఖనిజాలను కూడా తొలగించవచ్చు, కాబట్టి దీనిలోనూ మినరలైజర్ ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం మేలు.యూవీ (అతినీలలోహిత) ఫిల్టర్: బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా, ప్రభావవంతంగా పనిచేస్తుంది. నీటిలో తక్కువ టిడిఎస్ ఉన్నప్పుడు యువి మోడల్ మంచిది.యూఎఫ్ అతినీలలోహిత ఫిల్టర్: ఈ మోడల్ వాటర్ ఫిల్టర్ యూవీ లాగానే ఉంటుంది. కానీ సస్పెండ్ చేయబడిన కణాలను కూడా యుఎఫ్ మోడల్ తొలగిస్తుంది. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు: రుచిని మెరుగుపరచడానికి, క్లోరిన్, సేంద్రీయ మలినాలను తొలగించడానికి ఈ ఫిల్టర్ బాగా ఉపయోగపడుతుంది. సరైన ప్యూరిఫైయర్‌ను ఎంచుకోవడం: అధిక టిడిఎస్ కోసం (300 పిపిఎమ్)RO లేదా RO+UV/UF ఎంచుకోవచ్చు తక్కువ టిడిఎస్ (300 పిపిఎమ్ లోపల ) కోసం UV+UF లేదా గురుత్వాకర్షణ ఆధారిత ప్యూరిఫైయర్లు సరిపోతాయి.మున్సిపల్ నీటి కోసం సాధారణ టిడిఎస్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు బాగా పనిచేస్తా.బోర్వెల్/హార్డ్ వాటర్‌లో అధిక టిడిఎస్ స్థాయిలు ఉంటాయి కాబట్టి ఆర్వో ఫిల్టర్ బాగా పనిచేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను తిరిగి కలపడానికి మినరలైజర్/టిడిఎస్ కంట్రోలర్ వంటి కొన్ని ఆర్వో ప్యూరిఫైయర్లు ఉన్నాయి ఇంట్లో వాడే వాటర్ ఫిల్టర్ ఎంపికను బట్టి టిడిఎస్ స్థాయిని కొలవడానికి మీరు టిడిఎస్ మీటర్‌ను ఉపయోగిస్తూ ఉండాలి. ఏవైనా మార్పులు కనిపిస్తే సంబంధిత ఆపరేటర్‌కు తెలియజేసి, ఫిల్టర్‌ను మార్చుకోవాలి. చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!శుద్ధమైన నీటిని తాగితే చాలు...గతంలో సంప్రదాయ పద్ధతిలో మరిగించడం అనేది ఒక పద్ధతిగా ఉండేది. దీని వల్ల కూడా కొన్ని పోషకాలు పోతున్నాయి అని గ్రహించారు. వాటర్ క్వాలిటీ కోసం టిడిఎస్‌ను చెక్ చేస్తాం. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని అవలంబిస్తుంది. ఆర్వో సిస్టమ్ అయితే సురక్షితం అనుకుంటాం. ఫిల్టర్ వరకు పర్వాలేదు. కానీ, వీటి ద్వారా కూడా నీటిలో కొన్ని పోషకాలు పోతుంటాయి. 100 శాతం క్లోరిన్, కాలుష్య శుద్ధి చేసి, నీటి నుంచి మనకు కావల్సిన పోషకాలు లభిస్తే చాలు. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ తాగితే చాలా ప్రయోజనాలు అని చెబుతుంటారు. వాటికి సంబంధించిన ఫిల్టర్లు కూడా వస్తున్నాయి. నీటిలో ప్రధానంగా ఉండే పొటాషియం, మెగ్నిషియమ్, ఐరన్ వంటివి ఉంటే చాలు. ఎక్కువ ΄ోషకాలు కలిపి మరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. – సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ -
మాంసాహారం మరింత ప్రియం
సాక్షి, అమరావతి: నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో ఇంటి వంటా మంట పుట్టిస్తోంది. భోజనం తయారీ ఖరీదు భారీగా పెరుగుతోంది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ సంవత్సరం జనవరి నెలలో శాకాహార భోజన వ్యయం 2 శాతం, నాన్ వెజ్ భోజన వ్యయం 17 శాతం పైగా పెరిగినట్లు క్రిసిల్ తాజాగా విడుదల చేసిన రోటీ రైస్ రేట్ (ఆర్ఆర్ఆర్) నివేదిక వెల్లడించింది. రైస్, చికెన్, పెరుగు, సలాడ్ ఆధారంగా ఒక ప్లేట్ నాన్‌వెజ్ థాలీ ధరను నిర్ణయిస్తారు. అదే వెజ్ థాలీ అయితే రైస్, దాల్, పెరుగు, సలాడ్ ఉంటాయి. నాన్ వెజ్ థాలీ తయారీ వ్యయంలో 50 శాతం చికెన్‌దే. బ్రాయిలర్ చికెన్ ధరలు 33 శాతం పెరగడంతో నాన్ వెజ్ భోజనం ఖర్చు పెరగడానికి ప్రధాన కారణమని తెలిపింది. గతేడాది జనవరి నెలలో రూ.52గా ఉన్న ఒక ప్లేట్ నాన్ వెజ్ థాలీ ధర ఈ ఏడాది రూ.60.6కి పెరిగింది. గతేడాది చికెన్ ఉత్పత్తి అధికంగా ఉండి ధరలు తక్కువగా ఉండటంతో థాలీ వ్యయం బాగా తగ్గిందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఉత్పత్తి తగ్గడం, దాణా ధరలు ముఖ్యంగా మొక్కజొన్న ధర పెరగడంతో థాలీ ఖర్చు పెరిగిందని తెలిపింద. రానున్న కాలంలో కూడా నాన్ వెజ్ థాలీ ధరలు పెరిగుతాయని పేర్కొంది.వెజ్‌కి కలిసొచ్చిన గ్యాస్, టమోటాటమోటా, గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గడం వెజ్ థాలీకి కలిసొచ్చింది. పప్పులు, ఆయిల్ ధరలు పెరిగానా వెజ్ థాలీ వ్యయం స్పల్పంగా ఉండటానికి టమోటా, గ్యాస్ ధరలు తగ్గడమేనని క్రిసిల్ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బంగాళా దుంపల ధరలు ఏకంగా 35 శాతం, వంట నూనెల ధరలు 17 శాతం, పప్పు దినుసులు 7 శాతం పెరిగాయి. ఇదే సమయంలో గ్యాస్ సిలెండర్ ధర రూ.903 నుంచి 803కు తగ్గింది. టమోటా ధరలు గతేడాదితో పోలిస్తే 34 శాతం తగ్గాయి. దీంతో వెజ్ థాలీ కేవలం 2 శాతం పెరిగి రూ.28 నుంచి రూ.28.7కి చేరినట్లు క్రిసిల్ పేర్కొంది. -
BirdFlu భయమేల చికెన్‌ను తలదన్నే గింజలు గుప్పెడు చాలు!
బర్డ్ ఫ్లూ (Bird Flu)అంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్, గుడ్ల వైపు చూడాలంటేనే వణికి పోతున్నారు. ఆందోళన అవసరం లేదు నిపుణులు చెబుతున్నప్పటకీ జనం చికెన్ తినడం మానేశారు. మరోవైపు పోషకాలు ఎలా అందోళన కూడామొదలైంది. అయితే కేవలం మాంసాహారంలోనే కాదు, శాకాహారంలో కూడా మంచి ప్రోటీన్ లభిస్తుంది ఈ నేపథ్యంలో చికెన్ కంటే ఎక్కువ బలాన్నిచ్చే గింజలు గురించి తెలుసుకుందాం.సంపూర్ణమైన ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఫుడ్ అవసరం. చికెన్ ప్రత్యామ్నాయంగా ప్రొటీన్లతో కూడిన అత్యంత సాధారణమైనవి గింజలు. కూరల్లో సలాడ్లు , ఇతర వంటకాల్లో మంచి రుచిని అందిస్తాయి. అందుకే వీటిని చాలా మంది చెఫ్‌లు శాకాహార వంటకాలను వండేటప్పుడు వాటిని చికెన్ ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. వీటిల్లో వేరుశనగ, జీడిపప్పు, బాదం, వాల్నట్స్, బఠానీ, రాజ్మా ఇలా చాలానే ఉన్నాయి.బాదం: ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్ ఇలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు బాదంపప్పులో ఉన్నాయి. 100 గ్రాముల బాదం గింజల్లో 23 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.శనగలు: శనగలను పోషకాహార పవర్‌హౌస్ అని అంటారు. వీటి ద్వారా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు అందుతాయి.మాంసం మానేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్. 100 గ్రాముల శనగల్లో 23 గ్రాముల ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.ఇదీ చదవండి: Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?!వాల్ నట్స్ : వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది . ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం వంటి అనేక పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. 100 గ్రాముల వాల్ నట్స్ లో 26 గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి.రాజ్ మా: పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్, ఖనిజాలతోపాటు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్, జింక్, ఐరన్ లభిస్తాయి. ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రోగ నిరోధక శక్తినిస్తుంది. 100 గ్రాముల రాజ్ మా గింజల్లో 25 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.చదవండి: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!జనపనార గింజలు(Hemp seeds) ఖనిజాలు, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి.మంచి కొవ్వులు, ఆహార ఫైబర్స్, ఖనిజాలు, విటమిన్లు ,ప్రోటీన్లు. ఎడెస్టిన్ , అల్బుమిన్ వంటి అత్యంత జీర్ణమయ్యే ప్రోటీన్లను కలిగి ఉంటాయి, జనపనార గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల జనపనార గింజల్లో 21 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.వీటిని నానబెట్టుకొని తినవచ్చు. లేదా సలాడ్లలో, కూరల్లో వాడుకోవచ్చు. చక్కగా నేతిలో వేయించుకొని, ఉప్పు కారం చల్లుకొని స్నాక్స్‌లాగా కూడా తినవచ్చు. -
పుట్టనిండా రుచులు, పొట్టనిండా విందు! ట్రై చేశారా!
పుట్టగొడుగులు...(Mushrooms) అదేనండీ.. మష్రూమ్స్ పోషకాలకే కాదు... రుచికి కూడా పెట్టింది పేరు. కాస్త ఉప్పూకారం వేసి మరికాస్త మసాలా దట్టించామంటే ఆ టేస్ట్ అదుర్స్.. అందుకే పుట్టనిండా రుచులు... పొట్టనిండా విందు! అందుకే పుట్టగొడుగులతో మంచి రుచికరంగా చేసుకునే వంటకాలను గురించి తెలుసుకుందాం.ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.మష్రూమ్స్ మంచూరియా కావలసినవి: మైదా – అర కప్పు; మష్రూమ్స్ – 250 గ్రాములు; కార్న్‌ఫ్లోర్-3 టేబుల్ స్పూన్లు; అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; నీళ్లు -కప్పు; ఉప్పు -తగినంత; పంచదార-అర టీ స్పూన్; పచ్చి మిర్చి- 3 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్; ఉల్లికాడల తరుగు-టేబుల్ స్పూన్; బెల్ పెప్పర్-1 (సన్నగా తరగాలి). సాస్ కోసం: నల్ల మిరియాల పొడి -చిటికెడు; పంచదార – చిటికెడు; సోయా సాస్ – టీస్పూన్తయారీ: ∙పుట్టగొడుగులను కడిగి, తుడిచి, సగానికి కట్ చేయాలి ∙ఒక గిన్నెలో సాస్ మినహా పై పదార్థాలన్నీ తీసుకోవాలి ∙తగినన్ని నీళ్లు ΄ోసి పిండిని బాగా కలుపుకోవాలి ∙స్టౌ పై బాణలి పెట్టి, తగినంత నూనె పోసి, వేడి చేయాలి. పుట్టగొడుగులను పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, తీసి, పక్కన పెట్టుకోవాలి ∙అదే నూనెలో, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి కాడలను వేసి, నిమిషం సేపు వేయించి, తీసి పక్కనుంచాలి ∙నల్ల మిరియాలు, ఉప్పు, చక్కెర, సోయా సాస్ కలిపి పక్కనుంచాలి. ఈ సాస్‌లో వేయించిన పుట్టగొడుగులను వేసి, అన్నింటికీ సాస్ పట్టేలా బాగా కదిలించాలి. తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీరతో అలంకరించి, సర్వ్ చేయాలి.మష్రూమ్స్ పులావ్ కావలసినవి: నూనె- 3 టేబుల్ స్పూన్లు; బాస్మతి బియ్యం – ఒకటిన్నర కప్పు; మష్రూమ్స్- 250 గ్రాములు; ఉల్లిపాయ-1 (సన్నగా తరగాలి); టమోటా-1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి); బంగాళదుంప-1; పచ్చిమిర్చి- 2; అల్లం వెల్లుల్లి పేస్ట్-టీ స్పూన్; కొబ్బరిపాలు-కప్పు; నీళ్లు -3 కప్పులు; ఉప్పు-తగినంత; మసాలా దినుసులు - (బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు -3, లవంగాలు -5, నల్లమిరియాలు - 6, జీలకర్ర – టీ స్పూన్) తయారీ: బియ్యాన్ని కడిగి అరగంటసేపు నానబెట్టాలి. అన్ని కూరగాయలతో పాటు మష్రూమ్స్ కూడా కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి ∙ప్రెజర్ కుక్కర్లో, నూనె వేసి వేడిచేయాలి. జీలకర్రతో సహా మొత్తం మసాలా దినుసులు వేసి, సువాసన వచ్చే వరకు వేయించాలి ఉల్లిపాయ తరుగు వేసి, వేయించుకోవాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన టమోటాలు, బంగాళదుంప ముక్కలు వేసి ఉడికించాలి. తర్వాత పుట్టగొడుగులను కలపాలి. సన్నని మంట మీద పుట్టగొడుగులు సగం ఉడికేంత వరకు 5 నిమిషాలు ఉంచాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి వేసి, వేగాక, బియ్యం పోసి కలపాలి.దీంట్లో కొబ్బరి పాలు, నీళ్లు కలపాలి. ఉప్పు వేసి, రుచి సరిచూసుకొని, కుకర్ మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, స్టౌ ఆపాలి. 5–10 నిమిషాలు ఆగి, కుకర్ మూత తీసి, కొత్తిమీర, పుదీనా ఆకులతో అలంకరించాలి. గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలతో సర్వ్ చేయాలి. దీనికి కాంబినేషన్‌గా రైతాను వడ్డించాలి. -
World Best Egg Dishes: మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..
గుడ్లను ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. వాటితో డెజెర్ట్ల దగ్గర నుంచి వివిధ రకాల వంటకాల వరకు పలు రకాలు చేసుకుని ఆస్వాదిస్తుంటా. అలాంటి గుడ్డు వంటకాలలో ది బెస్ట్‌గా భారతీయ వంటకం నిలిచింది. ప్రతి ఏడాది ది బెస్ట్ డెజర్ట్, బెస్ట్ కర్రీ వంటి వాటికి ర్యాంకులిచ్చి మరీ జాబితాను విడుదల చేసే ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ గుడ్డు వంటకాల జాబితానను కూడా విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే టాప్ వంద గుడ్డు వంటకాల జాబితాను వెల్లడించింది. వాటిలో మన భారతీయ వంటకం మసాలా అమ్మేట్ 22వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. మొదటి 50 బెస్ట్ గుడ్డు వంటకాల్లో మసాలా ఆమ్లేట్ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ జాబితాలో జపాన్‌కి చెందిన అజిత్సుకే టమాగో అనే గుడ్డు వంటకం అగ్రస్థానంలో నిలిచింది. ఈ అజితసుకే టమాగో అనేది మిరిన్, సోయా సాస్‌తో నానబెట్టి ఉకించిన గుడలతో చేసే సంప్రదాయ జపనీస్ వంటకం ఇది. ఇక నోరూరించే మన భారతీయ మసాలా అమ్మెట్ తయారీ ఎలాగో చూద్దామా..!దీనిని గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, కొత్తిమీర, కారం, పసుపు పొడితో తయారు చేస్తారు. అన్ని పదార్థాలను గుడ్లతో కలిపి, ఆ మిశ్రమాన్ని పాన్‌లో (సాధారణంగా వెన్న లేదా నూనెతో) వండుతారు. ఈ స్పైసీ ఆమ్లెట్‌ను సాంప్రదాయకంగా పావ్ లేదా బ్రెడ్‌తో అల్పాహారంగా వడ్డిస్తారు. తాజాగా వండిన రోటీతో కూడా తినవచ్చు. చాలా మంది దీనిని టమోటా కెచప్ లేదా కొత్తిమీర-పుదీనా చట్నీతో ఆస్వాదిస్తారు. వీధి దుకాణాలలో ఈ వంటకాన్ని ఎక్కువగా విక్రయిస్తుంటారు. కొందరూ టమోటాలను కూడా ఉపయోగిస్తారు. చివరగా ప్రపంచంలోని టాప్ 10 గుడ్డు వంటకాల జాబితా ఏంటంటే..అజిత్సుకే టమాగో (జపాన్) టోర్టాంగ్ టాలాంగ్ (ఫిలిప్పీన్స్) స్టాకా మే అయ్గా (గ్రీస్) స్ట్రాపట్సదా (గ్రీస్) ఇస్పానక్లి యుమూర్త (టర్కీ) టోర్టిల్లా డి బెటాన్జోస్ (స్పెయిన్) యుఎస్ఎ బెనెడిక్ట్ (జపాన్) షక్షౌకా (ట్యునీషియా ప్రాంతాలు) మెనెమెన్ (టర్కీ)(చదవండి: -
పోషకాల పరంగా బెస్ట్ చట్నీలివే..!
భారతీయ ఆహారంలో ఎన్ని రకాల కూరలు ఉన్నా.. పక్కన కాస్త రోటి పచ్చడి లేదా కొద్దిపాటి చట్నీతో గానీ భోజనం పూర్తి చేయరు. ఇవి భోజనాన్ని శక్తిమంతంగా మార్చుతాయి. ఓ గొప్ప రుచిని అందిస్తాయి. అయితే మనం ఎన్నో రకాల వెరైటీ చట్నీలు చేసుకుంటాం. హాయిగా లాగించేస్తుంటాం. కానీ పోషకాల ప్రొఫెల్ పరంగా ఏ చట్నీ ఆరోగ్యానికి మంచిదనేది తెలియదు. అయితే కొన్ని చట్నీలు బరువు తగ్గేందుకు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉపకరిస్తాయట. వాటి పోషకాల ఆధారంగా ఆయా చట్నీలకు ర్యాంకుల ఇచ్చి మరీ వివరంగా చెబుతున్నారు ప్రముఖ డైటీషియన్ కనిక మల్హోత్రా. అవేంటంటే..చట్నీలను మాగ్జిమం సుగంధ ద్రవ్యాలు, కొన్ని రకాల ఆయుర్వేద సంబంధిత మూలికలు వంటి వాటితో తయారు చేస్తుంటాం. అందువల్ల వాటి తయారీ ఆధారంగా పోషక విలువలు గణనీయంగా మారతాయని చెబుతున్నారు మల్హోత్రా. ఆ నేపథ్యంలోనే మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన చట్నీలకు పోషకాల ఆధారంగా ర్యాంకులిచ్చి మరీ వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. అవేంటో చూద్దామా..పుదీనా-కొత్తిమీర చట్నీ: దీనిలో విటమిన్లు ఏ,సీ, కేలు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.వెల్లుల్లి చట్నీ: గుండె ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.కొబ్బరి చట్నీ ఆరోగ్యకరమైన కొవ్వులు (ఎంసీటీలు), ఫైబర్ అధికంగా ఉంటాయి, జీవక్రియ, జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. మాంగనీస్, రాగి వంటి ఖనిజాలను అందిస్తుంది.వేరుశెనగ చట్నీ: ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. శక్తి వంతమైనది. సంతృప్తికరంగా ఉంటుంది. మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.టమాటో చట్నీ: లైకోపీన్ (గుండె ఆరోగ్యానికి సంబంధించిన యాంటీఆక్సిడెంట్), విటమిన్లు సీ, ఈలు సమృద్ధిగా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.చింతపండు చట్నీ: విటమిన్ బీ, మెగ్నీషియం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే దీనిలో ఎక్కు చక్కెర ఉండటం వల్ల దీన్ని అంతగా ఆరోగ్యకరమైనదిగా పరిగణించలేదు నిపుణులు. మామిడి చట్నీ: ఇందులో కూడా ఎక్కువ చక్కెర ఉంటుంది. అయితే దీనిలో విటమిన్లు ఏ, సీ, ఫైబర్లు సమృద్ధిగా ఉంటాయి. ఎర్ర మిరప చట్నీ: క్యాప్సైసిన్ అధికంగా ఉంటుంది,. జీవక్రియను పెంచుతుంది. అయితే మితంగానే తీసుకోవాలి.“కారపు చట్నీలు వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా ప్రకాశవంతమైన రంగును ప్రోత్సహిస్తాయి. ఇంట్లో తయారుచేసిన చట్నీలు స్టోర్-కొనుగోలు చేసిన వెర్షన్ల కంటే ఎక్కువ పోషకాలను ఉంటాయి. ఎందుకంటే వాటిలో ప్రిజర్వేటివ్‌లు, అదనపు చక్కెరలు ఉండవు కాబట్టి చెబుతున్నారు మల్హోత్రా .మితంగా తీసుకోవాల్సిన చట్నీలుకొన్ని భారతీయ చట్నీలు అధిక కేలరీలు లేదా సోడియం కంటెంట్ కారణంగా మితంగా తినాలి అని మల్హోత్రా సూచించారు.కొబ్బరి చట్నీ: రుచికరమైనది అయినప్పటికీ, 100 గ్రాములకు 217 కేలరీలు, 19.84 గ్రాముల కొవ్వును కలిగి ఉంటుంద., ప్రధానంగా సంతృప్త కొవ్వు నుంచి ఎల్డీఎల్ (LDlL) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె సంబంధితన సమస్యలు ఉన్నవారికి మంచిది కాదని చెబుతున్నారువేరుశెనగ చట్నీ: కేలరీలు అధికంగా ఉంటాయి. దీనిలో 100 గ్రాములకు సుమారు 331.78 కేలరీలు, 22.82 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లను అందిస్తున్నప్పటికీ.. ఇందులో జోడించిన ఉప్పు, చక్కెర మధుమేహం ఉన్నవారికి ప్రమాదకరం.చింతపండు చట్న: తయారీ పద్ధతులను బట్టి ఈ చట్నీలో అదనపు చక్కెరలు, సోడియం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ. అందువల్ల ఇది ఒకరకంగా అదనపు కేలరీల తీసుకునేందుకు దోహదం చేస్తుందని హెచ్చరిస్తున్నారు మల్హోత్రా. చివరగా ఈ చట్నీలన్నీ రుచి, పోషక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ఆహార సమతుల్యత, ఆరోగ్య పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడానికి తక్కువగా తీసుకోవడమే మంచిదని సూచించారు మల్హోత్రా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యలను సంప్రదించడం ముఖ్యం. (చదవండి: Vicky Kaushal: 'ఛావా' కోసం వంద కిలోలు దాటేసిన హీరో.. ఏ డైట్ ఫాలో అయ్యాడంటే?) -
కొత్త.. రుచుల కోకా కట్టుకున్నదీ పేట..
ఒకప్పుడు తెంగాణలోని హైదరాబాద్ నగర శివారు ప్రాంతంగా ఉన్న కోకాపేట్ ఇప్పుడు ఐటీ నిపుణుల ప్రవాహంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కార్పొరేట్ కల్చర్‌కు తోడు స్కై స్క్రాపర్స్, అపార్ట్మెంట్లు, విల్లాలు నగరానికి విలాసవంతమైన కేంద్రంగా మారుతోంది. దీంతో ఉన్నతస్థాయి ఫైన్–డైనింగ్ రెస్టారెంట్ల నుంచి కేఫ్స్, స్ట్రీట్ ఫుడ్ వరకూ ఇక్కడ అందుబాటులోకి వచ్చేశాయి. రుచికరమైన భోజనం, స్పీడ్ బ్రేక్ ఫాస్ట్, అల్పాహారం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే అధునాతన కేఫ్ కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి తప్పకుండా సిద్ధంగా ఉంటుంది. ఒకప్పుడు కొన్ని తినుబండారాలకే పరిమితమైన ఈ ఏరియాలో ఇప్పుడు ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, ట్రెండీ కేఫ్‌లు మాత్రమే కాదు స్ట్రీట్ఫుడ్లతో డైనమిక్ మిక్స్‌గా రూపాంతరం చెందింది. కోకాపేట్లో పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా ఫుడ్ బ్రాండ్స్ ఇక్కడకు విస్తరిస్తున్నాయి, వినూత్న మెనూలను మోసుకొస్తున్నాయి. సంప్రదాయ రుచులు ఆధిపత్యం చెలాయించే నగరంలోని మరికొన్ని సంప్రదాయ ప్రాంతాల వలె కాకుండా, కోకాపేట్లో మల్టీ క్యుజిన్ రెస్టారెంట్లు, ఆర్టిసానల్ బేకరీలు ప్రయోగాత్మక ఫ్యూజన్ కిచెన్లు స్థానిక కాస్మోపాలిటన్ కల్చర్‌ను ప్రతిబింబిస్తాయి. వీకెండ్ బ్రంచ్ స్పాట్లు, రూఫ్‌టాప్ డైనింగ్ అనుభవాలు, లేట్–నైట్ డెజర్ట్ కేఫ్‌లు కూడా ఈ ప్రాంతంలో పెరుగుతున్నాయి, ఇవి యువ వృత్తి నిపుణుల జీవనశైలికి అద్దం పడుతున్నాయి. ఇవి డైన్–ఇన్ స్పేస్‌లకు మాత్రమే పరిమితం కాలేదు–క్లౌడ్ కిచెన్స్‌తో డెలివరీ–మాత్రమే కలిగిన బ్రాండ్లు కూడా ఇక్కడ తగిన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇవి ఇంటి నుంచి పని చేసేవారికి ప్రయాణంలో ఉన్న వారికి అవసరమైన సేవలు అందిస్తాయి. కోకాపేట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న వైవిధ్యమైన దాని నానాటికీ విస్తరిస్తున్న ఆహార సంస్కృతికి నిదర్శనం. కోకాపేట్ ప్రసిద్ధ బ్రాండ్ల మిశ్రమానికి నిలయంగా ఉంది. కోకాపేట్‌లోని కరాచీ కేఫ్, రోస్టరీ కాఫీ హౌస్, కేఫ్ శాండ్‌విచో, ప్రెజ్మో, కేఫ్ ట్వంటీ వన్, క్రెమా కేఫ్, రిఫ్లెక్షన్స్.. వంటి టాప్ కేఫె బ్రాండ్స్.. (చదవండి: వయసు 14 ఏళ్లే.. కానీ లక్ష మొక్కలు నాటింది..!) -
తాజా కాదు.. ఈజీ ఫుడ్డుకే జై
సాక్షి, హైదరాబాద్: అధిక పోషకాలుండే తాజా ఆహార పదార్థాల కంటే సులభంగా అందుబాటులో ఉండే నిలువ ఉండే ఆహారంపైనే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆహారానికి చేస్తున్న ఖర్చులో.. ప్రాసెస్డ్ ఆహారానికి సంబంధించిన వ్యయమే ఎక్కువగా ఉంటోంది. దేశ వ్యాప్తంగా ప్రాసెస్డ్ ఆహారంపైన చేస్తున్న ఖర్చు 24.44 శాతం ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘కుటుంబ వినియోగ వ్యయ సర్వే– 2023–24’ స్పష్టం చేస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలు 20.93 శాతం ఖర్చు చేస్తుండగా.. పట్టణ ప్రాంత ప్రజలు 27.95 శాతం ఖర్చు పెడుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉన్నప్పటికీ... వినియోగం మాత్రం వేగంగా పెరుగుతూ వస్తోంది. ఆధునిక జీవనశైలికిఅనుగుణంగా.. ఆధునిక జీవనశైలికి అనుగుణంగాఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా ఉద్యోగులు,విద్యార్థులు వారి రోజువారీ కార్యకలాపాల్లో బిజీ ఉంటూ వెంటనే అందుబాటులో ఉండే (అత్యవసర ఆహారం) నిల్వ ఉండే, శుద్ధి చేసి భద్రపర్చిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఈ ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగాఉండకపోవడం, ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వీలుగా ఉపయోగించే రసాయనాల కారణంగా అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూల్‌డ్రింక్‌లు, చిరుతిళ్లు, బేకరీ పదార్థాలు ఎక్కువగా తినడం మంచిది కాదని అంటున్నారు.పాలు, పండ్లను మించి ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ వినియోగ వ్యయ సర్వేలో ఆహారంపై చేసే ఖర్చును ఏడు కేటగిరీల్లో లెక్కించారు. తృణధాన్యాలు, పాలు.. పాల ఉత్పత్తులు తదితర ఈ ఏడు కేటగిరీల్లోనూ ప్రాసెస్డ్ ఆహారం, బేవరేజెస్ (పానీయాలు) ఖర్చే ఎక్కువగా ఉండడం గమనార్హం. మొత్తం మీద పట్టణ ప్రాంతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంత ప్రజలు కొంత పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. తృణధాన్యాలు, గుడ్లు, చేపలు, మాంసాహారాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం అందుకు భిన్నంగా ప్రాసెస్డ్ ఆహారంపైనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. పోషకాలు ఎక్కువగా ఉండే తృణధాన్యాలు, కూరగాయలకు ప్రాధాన్యత తక్కువగా ఉంది. ఇక్కడ ఈ సరుకులకు డిమాండ్ ఎక్కువగా ఉండగా, తాజా సరుకుల లభ్యత కష్టంగా ఉండడంతో వీటి వినియోగానికి ప్రాధాన్యత తగ్గుతోంది. మరోవైపు హోటళ్లు, కర్రీ పాయింట్లకు ప్రాధాన్యత ఇవ్వడం కూరగాయల కొనుగోలుపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రాల్లో తమిళనాడు టాప్ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో (పట్టణ ప్రాంతం) తమిళనాడు (34.30 శాతం) మొదటి వరుసలో ఉంది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ, కర్ణాటక, అసోం, పంజాబ్ రాష్ట్రాలున్నాయి. గ్రామీణ ప్రాంత కేటగిరీలోనూతమిళనాడు (29.89 శాతం)ముందుండగా.. అసోం, కర్ణాటక, పంజాబ్, రాజస్తాన్, ఒడిశా, గుజరాత్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 10వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో జాతీయ సగటును మించి.. రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఆహారం కోసం చేస్తున్న వ్యయంలో ప్రాసెస్డ్ ఫుడ్ కోసమే 27.23 శాతం ఖర్చు చేస్తున్నారు. ఇది జాతీయ సగటు కంటే 2.79 శాతం అధికంగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం మొత్తం ఆహారంలో ప్రాసెస్డ్ ఆహారంపై 20.84 శాతం ఖర్చు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఇది ఏకంగా 33.63 శాతంతో దేశంలో రెండో స్థానంలో ఉంది. దేశ సగటుతో పోలిస్తే మన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాసెస్డ్ ఆహారంపైన చేస్తున్న ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ.. పట్టణ ప్రాంతంలో ఆందోళనకర స్థాయిలో ఉండడం గమనార్హం. -
దక్షిణ భారత వంటకం 'సాంబార్'కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!
దక్షిణ భారత వంటకం సాంబార్ ఎంత ఫేమస్ రెసిపీనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భోజనంలోకే కాదు, బ్రేక్‌ఫాస్ట్‌లోనూ అది ఉండాల్సిందే. అలాంటి ఈ రెసిపీ తయారీని ఎవరు కనుగొన్నారు. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దామా..దేశవ్యాప్తంగా బాలీవుడ్ మూవీ చావా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో అందిరి దృష్టి మహారాష్ట్ర చారిత్రక రాజు శంభాజీ మహారాజ్ పైనే ఉంది. ఆ మూవీలో మరాఠా రాజు శంభాజీ రాజు పాత్రలో హీరో విక్కీ కౌశల్ ఒదిగిపోయాడు. ఇక్కడ చావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఆ శంభాజీ మహారాజు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, విజయాలు ఆధారంగా తీసిన సినిమా ఇది. అయితే ఆ మహారాజు పేరు మీదనే దక్షిణ భారత వంటకం ఉంది. ఆ మరాఠా పాలకుడి పేరు మీదగానే సాంబార్ అనే రెసిపీ వచ్చిందట. దాదాపు 400 ఏళ్ల క్రితం తంజావూరు రాజ వంటగదిలో తయారయ్యిందట. ఆహారప్రియుడైన రాజు శంభాజీకి మహారాష్ట్ర వంటకం అమీ(పుల్లని పప్పు) అంటే చాలా ఇష్టం. దీన్ని కోకుమ్ అనే పుల్లని పండుతో తయారు చేస్తారు. అయితే ఒకరోజు కోకుమ్ అయిపోయింది. వంటగదిలో ఉన్న వంటవాళ్లు ఎలా వండాలతో తెలియక ఆందోళనకు గురవ్వుతారు. అప్పుడే ఆ విషయాన్ని వణికిపోతు మహారాజుకి విన్నవించుకుంటారు. అప్పుడు శంభాజీ స్థానికంగా దొరికే చింతపండుతో ఎందుకు తయారు చేయకూడదు అని అన్నారు. అలా ఆయన సూచన మేరకు కందిపప్పు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో తయరు చేయగా దానికి శంభాజీ మహారాజు పేరుమీదుగా సాంబార్ అని పేరు పెట్టారని కథనం. అయితే దక్షిణ భారతదేశంలో మరొక కథనం ప్రకారం శ్రీ కృష్ణుడు కొడుకు సాంబుడి తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడని. ఆ వ్యాధి తగ్గాలంటే రోజు సూర్యుడిని ఆరాధించాలని మునులు చెప్పడంతో రోజుకో నైవేద్యం చేసే నివేదించేవాడట. ఆ క్రమంలోనే ఇలా కందిపప్పు, కూరగాయలతో చేసిన వంటకం సూర్యుడికి నివేదించగా..ఆయన ప్రీతి చెంది సాంబుడికి వ్యాధిని నయం చేశాడని చెబుతారు. అలా ఆయన పేరు మీదుగా సాంబర్ వంటకం వచ్చిందన్న కథనం కూడా ప్రచారంలో ఉంది. అయితే మరాఠా మూలం నుంచి వచ్చిందంటే కొందరూ పాక నిపుణులు ఎందుకనో అంగీకరించారు. ఏదీఏమైనా ఈ రుచికరమైన వంటకాన్ని తమిళులు మునగకాయలతో చేసుకోగా మహారాష్ట్ర ప్రజలు ప్రత్యేక మసాలాతో తయారు చేస్తారు. ఇక కేరళ వాళ్లు, క్యారెట్లు, బంగాళదుంపలు వేసి చేస్తారు. ప్రస్తుతం ఈ రెసిపీ మనలో భాగమైపోయింది.(చదవండి: కాఫీ బ్రేక్, మ్యాంగో మూడ్ చాక్లెట్లు గుర్తున్నాయా..? అవెలా వచ్చాయంటే..) -
తయారీ ఆహరంపైనే మక్కువ ఎక్కువ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలు తయారీ ఆహారం (ప్రాసెస్డ్ ఫుడ్)పైనే మక్కువ చూపుతున్నారు. వీటిపైనే అత్యధిక వ్యయం చేస్తున్నారు. ఈ విషయాన్ని 2023–24 గృహ వినియోగ సర్వే వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఆహార వ్యయంలో 20.93 శాతం ప్రాసెస్ చేసిన ఆహారంపై వ్యయం చేస్తుంటే.. పట్టణ వాసులు ప్రాసెస్ ఆహారంపై 27.95 శాతం వ్యయం చేస్తున్నారు. ఏపీలోనూ ఇదే ఒరవడి కనిపిస్తోంది. ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో 20.07 శాతం, పట్టణ ప్రాంతాల్లో 25.72 శాతం ప్రాసెస్ చేసిన ఆహారాన్ని వినియోగిస్తున్నారు. గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామాల్లో మొత్తం ఆహార వ్యయంలో పాల ఉత్పత్తులపై గరిష్టంగా వినియోగిస్తున్నారు. కేరళలోని గ్రామాల్లో మొత్తం ఆహార వ్యయంలో గుడ్లు, చేపలు, మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. -
PM Modi: రైతు మాదిరిగా ఆహారపు అలవాట్లు ఉండాలి..!
పరీక్ష పై చర్చ(పీపీసీ(Pariksha Pe Charcha 2025) ఎనిమిదవ ఎడిషన్ గత సోమవారం(ఫిబ్రవరి 10, 2025న) న్యూఢిల్లీలో జరిగింది. ఆ సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి సంభాషించారు. ఈ కార్యక్రమం లక్ష్యం విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో మార్గదర్శకత్వం చేయడమే. అయితే ఈ కార్యక్రమంలో మోదీ ఆహారపు అలవాట్లు, ఎలా తినాలి వంటి వాటి గురించి కూడా విద్యార్థులకు చక్కటి సూచనలిచ్చారు. అవేంటో చూద్దామా..ఇక మోదీ ఈ సెషన్లో మంచి ఆరోగ్యం, జ్ఞాపక శక్తికోసం పోషకాహారం ప్రాముఖ్యత గురించి హైలెట్ చేశారు. శరీరానికి చిరుధాన్యాలు, కాలానుగుణ కూరగాయలు వంటివి ఎంత ముఖ్యమో వివరించారు. అంతేగాదు ఆ సెషన్లో మోదీ విద్యార్థులకు తిల లడ్డూ(నువ్వుల లడ్డూ)లను ఇస్తూ..వీటిని శీతాకాలంలో ఎందుకు తినాలో తెలుసా అని ప్రశ్నించారు. దానికి విద్యార్థులు నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయని బదులిచ్చారు. ఆ తర్వాత చిరుధాన్యాల వినియోగం గురించి కూడా మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి 2023ని 'అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం'గా ప్రకటించిందని, అలాగే భారత్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రోత్సహించిందో వివరించారు. మన దేశంలో సహజసిద్ధంగా లభించే వాటిలో ఉండే పోషకాల గురించి అవగాహన కల్పించడంపై భారత ప్రభుత్వం ఎలా ఆసక్తి కనబరుస్తుందో కూడా ప్రస్తావించారు. అలాగే వాటికి పలు రకాల వ్యాధులను నివారించే శక్తి ఉండటమేగాక రాకుండా నివారించే శక్తి ఉందని చెప్పారు. ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలంటే..ఆ కార్యక్రమంలో పరీక్షల ప్రిపరేషన్‌కి సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తోపాటు సకాలంలో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా చెప్పారు. అంతేగాదు ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఏమి తినాలి వంటి ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చారు. అయితే విద్యార్థులకు పోషకాహారానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారతదేశంలోని రైతులు(farmers) ఉదయాన్నే నిద్రలేచి భోజనం చేస్తారు, రోజంతా పని చేస్తారు మళ్లా ఇంటికి వచ్చి సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం(dinner) చేస్తారు. నిజంగా ఇది వేళ్లకు భోజనం చేసే మంచి అలవాటుగా పేర్కొన్నారు. ఇది జీర్ణక్రియకు మెరుగ్గా ఉంచుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉండేలా చేయడమే గాక దీర్ఘాయువుని అందిస్తుందని అన్నారు. నిపుణలు అభిప్రాయం ప్రకారం..ప్రధాని మోదీ చెప్పినట్లుగా సాయంత్రం ఏడు గంటలకు ముందు తినడం వల్ల ఆయుష్షు సుమారు 35% పెరుగుతుందని సర్వేలో తేలింది. ఇటలీలోని ఎల్'అక్విలా ప్రాంతంలో నిర్వహించిన మరో పరిశోధనలో సెంచరీ దాటిన చాలమంది వ్యక్తుల్లో సైతం వృద్ధాప్య లక్షణాలు తక్కువుగా ఉన్నట్లు చెప్పారు. వారంతా మెక్కలు ఆధారిత ఆహార పదార్థాలు, కేలరీలు తక్కువుగా ఉన్న భోజనమే తీసుకున్నట్లు కూడా పరిశోధన పేర్కొంది. కాబట్టి అందరూ ఎంత పని ఒత్తిడి ఉన్నా వేళకు పోషకాలతో కూడిన ఆహారం తీసుకునే యత్నం చేసి ఆరోగ్యంగా ఉందామా..!:.Had a wonderful interaction with young students on different aspects of stress-free exams. Do watch Pariksha Pe Charcha. #PPC2025. https://t.co/WE6Y0GCmm7— Narendra Modi (@narendramodi) February 10, 2025(చదవండి: తేనె-నిమ్మకాయ నీటితో బరువు తగ్గరు: హర్ష్ గోయెంకా ఫైర్) -
తేనెతో ఎన్నో లాభాలు : కానీ కల్తీని ఎలా గుర్తించాలి!
భారతదేశంలో చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్లకు నిస్పందేహంగా వాడే పదార్థం తేనె (Honey). తేనెటీగల ద్వారా సహజంగా లభించే ఒక తీపి పదార్థం (Natural Sweetener). తేనె వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాగే కొలెస్ట్రాల్, కొవ్వు సోడియం లేని చక్కటి ఆహారం కూడా తేనె. ప్రపంచవ్యాప్తంగా తేనెను ఎక్కువగా ఉపయోగించేది మన భారతీయులే. అయితే కోవిడ్ తరువాత తేనె వినియోగం విపరీతంగా పెరిగింది. ఇది విశ్వవ్యాప్తమైంది. పెరిగిన డిమాండ్ తో తేనె కల్తీ కూడా పెరిగింది. మార్కెట్లో ఇప్పుడు స్వచ్ఛమైన తేనె, బ్రాండ్లు చాలా తక్కువే అని చెప్పవచ్చు. మరి స్వచ్ఛమైన తేనెను ఎలా గుర్తించాలి.తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. తేనెలో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఎంజైమ్‌లు, ఖనిజాలు దండిగా లభిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాల మాట దేవుడెరుగు కల్తీ తేనె అనేక సమస్యలకు కారణమవుతోంది. అందుకే స్వచ్ఛమైన తేనె ఏది. నకిలీది ఏది గుర్తించడం, దాని గురించి అవగాహనకలిగి ఉండటం చాలా అవసరం.తేనె కల్తీ ఎలా?తేనె కల్తీ చౌకైన పదార్థాలతో చేయబడుతుంద. ఇది ప్రయోగశాల పరీక్ష పారామితులను తేలిగ్గా దాటేస్తుంది. . మొలాసిస్: ఇది మందపాటి , జిగటగా చెరకు రసం. చెరకు రసం మరిగించడం వల్ల తేనెలా తీపిగా ఉండే టర్బిడ్, ముదురు ద్రావణం లభిస్తుంది.ద్రవ గ్లూకోజ్: ఇది మిఠాయి చ బేకింగ్ పరిశ్రమలో ఉపయోగించే మెరిసే , మందపాటి ద్రావణం. ఇది మార్కెట్లో సులభంగా లభిస్తుంది.ఇన్వర్ట్ షుగర్: ఇది మెరిసే , మందపాటి ద్రవం, శుద్ధి చేసిన చక్కెరను ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని ఉత్పత్తి చేస్తారు.హై గ్లూకోజ్ కార్న్ సిరప్ (HFCS): ఇది స్వీట్‌కార్న్‌ను ప్రాసెస్ చేసినప్పుడు ఉత్పత్తి అవుతుంది.ఇది అచ్చం తేనెలాగానే కనిపిస్తుంది. రైస్ సిరప్: ఈ సిరప్ బియ్యం ప్రాసెసింగ్ సమయంలో ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తేనెను కల్తీ చేసే వాటిలో ఒకటి.ఇదీ చదవండి: సిల్వర్ స్క్రీన్ క్వీన్ : దేవుడా, ఇలాంటి జీవితం పగవాడిక్కూడా వద్దు! తేనె స్వచ్ఛమైనదా లేదా కల్తీదా ఎలా తనిఖీ చేయాలి?బొటనవేలిపై కొద్దిగా తేనె రాసుకొని చూడండి. నిజమైన తేనె చిక్కగా ఉంటుంది. తేనెను ఒక గ్లాసు నీటిలో నెమ్మదిగా వేయండి. తేనె నీటిలో కరగకుండా గ్లాసు అడుగు భాగానికి చేరుకుంటే తేనె స్వచ్ఛమైనది. నీటిలో కరిగిపోతుంటే అది నకిలీది అని అర్థం. వెనిగర్ నీటిలో కొన్ని చుక్కల తేనె కలపండి. మిశ్రమం నురగలు రావడం ప్రారంభిస్తే అది కచ్చితంగా నకిలీదే. తేనెలో అగ్గిపుల్లను ముంచి, ఆపై వెలిగించడానికి ప్రయత్నించడం ద్వారా ఇంకో పరీక్ష చేయవచ్చు. తేనె స్వచ్ఛంగా ఉంటే, అగ్గిపుల్ల సులభంగా మండుతుంది. కల్తీ దైతే అగ్గిపుల్లను వెలిగించడం కష్టం కావచ్చు.ఇదీ చదవండి: భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!తేనె-ప్రయోజనాలు తేనె సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. తేనె అనేది గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.కాలిన గాయాలు, దెబ్బలకు పై పూత చికిత్సగా వాడవచ్చు.యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో పాటు సూపర్-హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అందుకే మొటిమల నివారణలోకూడా పనిచేస్తుందితేనెలో కాటలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది చిన్న మంట నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుందిహృదయనాళ వ్యవస్థను రక్షించండి గ్యాస్ట్రోఎంటెరిటిస్ లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుంది. జ్ఞాపకశక్తి లోపాలను నివారిస్తుంది. -
భాగ్యనగరంలో బెంగాలీ రుచులు.. లొట్టలేస్తున్న ఆహార ప్రియులు
విభిన్న సంస్కృతుల సమ్మేళనం, విభిన్న రుచుల సంగమం హైదరాబాద్.. వారసత్వం పేర్చిన ఈ ఆహార సంస్కృతిలో దేశవ్యాప్తంగా అన్ని రుచులనూ నగరవాసులు ఆదరిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఈ కల్చరల్ డైవర్సిటీలో తన ప్రశస్తి సువాసనలు నలుదిశలా వెదజల్లుతున్నాయి. అందుకు చక్కని వేదికైంది బెంగాలీ రుచులు (Bengali Recipes) ప్రదర్శన. నగరంలో బెంగాలీలు ఉన్నప్పటికీ దాదాపు 40 శాతం వరకూ స్థానికులు కూడా ఆదరణ చూపిస్తున్నారని హైటెక్ సిటీలోని ‘ఓ కలకత్తా’ రెస్టారెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫిరోజ్ సాద్రి తెలిపారు. గత 25 సంవత్సరాలుగా బెంగాలీ రుచులను అందిస్తున్న ‘ఓ కలకత్తా’.. హైదరాబాద్ వేదికగా బెంగాలీ ఆహార సంస్కృతిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో నగరానికి బెంగాలీ ఫుడ్ కల్చర్ వచ్చిన తీరు, ఇక్కడ వినూత్నంగా అందుబాటులో ఉన్న వెరైటీ డిషెస్ గురించి ఫిరోజ్ సాద్రి వెల్లడించారు.– సాక్షి, సిటీబ్యూరో దేశాన్ని వందల ఏళ్లు పాలించిన బ్రిటిష్ వారు బెంగాల్ కేంద్రంగా ఎంచుకున్నారు.. ఎందరో ముస్లిం రాజవంశస్తులు పరిపాలించిన ప్రాంతం కూడా బెంగాల్. ఈ ఇద్దరికీ ప్రధాన కేంద్రం హైదరాబాద్ (Hyderabad). ఇలా సాంస్కృతిక పరిణామంలో నగరానికి బెంగాలీ ఆహారం వచ్చింది. బ్రిటిష్‌వారు స్పైసీ తక్కువ, తీపి ఎక్కువ ఇష్టపడతారు. ఇందులో భాగంగా వారు ప్రత్యేకంగా తయారుచేసుకున్న బెంగాలీ వెరైటీ అడాబ్ చిగిరీ. ఇది కొబ్బరి నీరు (Coconu Water), కొబ్బరి క్రీంతో తయారు చేసే అరుదైన వంటకం. ఈ వెరైటీ ‘ఓ కలకత్తా’లో లభిస్తుంది. దీనిని నగరవాసులు ఇష్టంగా ఆరగిస్తున్నారు. ఇదీ చదవండి: Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి! హిల్సా ఆఫ్ పాతూరి.. ఈ వెరైటీ మాన్సూన్ సీజన్లో మాత్రమే లభించే అరుదైన హిల్సా చేపతో తయారు చేస్తారు. దీనిలో మిలియన్ల సంఖ్యలో సన్నని ఎముకలుంటాయి. వీటన్నింటినీ సృజనాత్మకంగా తొలగించి, అరిటాకులో కొబ్బరిని కలిపి స్టీమ్ చేసి వడ్డించే వినూత్న వంటకం. ఇది కలకత్తా స్పెషల్, ఖరీదైనది కూడా. మాన్సూన్ సీజన్లో బ్రహ్మపుత్ర నదిలో బ్రీడింగ్ కోసం వలస వచ్చే అరుదైన చేప కావడమే దీని ప్రత్యేకత. మోచా.. అరటి పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేసే కలకత్తా వంటకం. అరటి పువ్వులో పోషక విలువలుంటే చిన్న చిన్న పెటల్స్‌తో దీనిని తయారు చేస్తారు. ఆరోగ్యంతో పాటు రుచికరమైనదని చెఫ్ వెల్లడించారు. గోబిందో బోగ్.. బెంగాల్లో గోబిందో బోగ్ రైస్‌ను దేవుని ఆహారంగా భావిస్తారు (ఫుడ్ ఫర్ ది గాడ్). ఇది బెంగాల్లో తప్ప మరెక్కడా దొరకదు. సాధారణ బియ్యం, బాస్మతి బియ్యానికీ భిన్నంగా, రుచికరంగా ఉంటుంది. అత్యంత సాధారణమైన బెంగాలీ వంటకం ఈ రైస్ వెరైటీ. జర్నా ఘీ.. తెలుగువారి ఆహారంలో నెయ్యికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాగే బెంగాలీలు కూడా ఆహార పదార్థాల్లో నెయ్యికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇందులో భాగంగానే ఫ్లేవర్ కోసం బెంగాలీలు జర్నా నెయ్యిని వాడతారు. ఇది ఒక్క స్పూన్‌తో మొత్తం రుచినే మార్చేస్తుంది. ఇవే కాకుండా ఇండియన్ చికెన్ కట్లెట్, రాయల్ మటన్ చాన్ప్,కోల్‌కతా బిర్యానీ, రాధూనీ మసాలా, రాధా తిలక్ రైస్, చానా పాతూరి, జాక్ ఫ్రూట్ టిక్కీ (స్పైసీ.. సూపర్ ఫుడ్), పెఫెటా చీజ్, మలాయీ కర్రీ, పెటాయ్ పరోటా, ఆమ్ఆచావో ఇలా.. విభిన్న రకాల బెంగాలీ రుచులతో ఓ కలకత్తాలో నోరూరిస్తుందని చెఫ్‌లు పేర్కొన్నారు. 1992లో ముంబై వేదికగా నాలుగు టేబుళ్లతో ‘ఓన్లీ ఫిష్’ పేరుతో అంజన్ ఛటర్జీ ప్రారంభించిన హోటల్ క్రమంగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి 8 ప్రాంతాలతో పాటు యూఏఈ, లండన్‌లో వండి వడ్డిస్తున్నారు. ఆమ్ అదా అల్లంనగరవాసులకు సరికొత్త బెంగాలీ రుచులను అందించడానికి కలకత్తా పరిసర ప్రాంతాల నుంచి ఆమ్ ఆదా అల్లంను పరిచయం చేశారని ఫిరోజ్ సాద్రి తెలిపారు. దీనిని మామిడి అల్లం అని పిలుస్తారు. దీంతో చేసే ఆమ్ ఆదా మాచ్‌కు నగరంలో ఆదరణ పెరుగుతోంది. మిస్టీ దహీ(దోయి) బెంగాల్ నుంచి ఎవరైనా హైదరాబాద్ వస్తున్నారంటే విమానంలో కూడా ఓ బాక్స్‌లో పార్సిల్ తెచ్చుకునే ప్రియమైన వెరైటీ ఈ మిస్టీ దహీ(దోయి). ఇది కూడా బెంగాలీ సిగ్నేచర్ వెరైటీ. మటన్ టిక్యాముస్లింలు ఎక్కువగా ఉండే కలకత్తాలో వారి ప్రత్యేక వంటకం ఇది. షాఫ్రాన్, రోజ్ వాటర్ సమ్మిళితంగా సంప్రదాయ వంటగా దీనిని చేస్తారు. దీనిని నగరవాసులు సైతం ఇష్టంగా తింటున్నారు. చదవండి: Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట -
'ఎగ్స్ కేజ్రీవాల్' రెసిపీ..: ఢిల్లీ మాజీ సీఎంకి ఏంటి సంబంధం..!
కొన్ని రెసిపీల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటి పేర్లు భలే తమాషాగా ఉంటాయి. అసలు వాటికా పేరు ఎలా వచ్చిందో వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ రెసిపీకి కూడా అలానే పేరు వచ్చింది. కాకపోతే మన దేశ రాజధాని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పేరు మీద ఉండటం చూస్తే..ఆయనే పేరు మీద రెసీపీ పేరేంటీ అని అనుకోకండి. నిజానికి ఆయనకి ఈ రెసిపీతో సంబంధం లేకపోయినా..ఆ రెసీపీ స్టోరీ మాత్రం వెరీ ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది ఎందుకంటే..?.ఆ వంటకం పేరు ఎగ్స్ కేజ్రీవాల్(Eggs Kejriwal) అనే ప్రసిద్ధ బ్రేక్‌ఫాస్ట్. భారతీయ వంటకాల్లో ఎగ్స్‌తో చాలా వెరైటీ వంటకాలు ఉన్నాయి. అయితే ఈ వంటకం మాత్రం చాలా గమ్మతైనది. ఈ వంటకం ఆవిష్కరణ కూడా అత్యంత విచిత్రమైనది. ఈ వంటకం మూలం ముంబై(Mumbai). ఈ వంటకానికి కేజ్రీవాల్ పేరు ఎలా వచ్చిందంటే..1960లలో ముంబైలోని నాగరిక విల్లింగ్డన్ స్పోర్ట్స్ క్లబ్ దేవీ ప్రసాద్ కేజ్రీవాల్ అనే వ్యాపారవేత్త కారణంగా వచ్చిందట. ఆయనది పూర్తిగా శాకాహారులైన మార్వాడీ కుటుంబం. కాబట్టి ఇంట్లో గుడ్డు తినే ఛాన్స్ లేకపోయింది. అయితే ఆయనకు గుడ్లంటే మహా ప్రీతి. వాటిని ఆరగించేందుకు విల్లింగ్డన్ స్పోర్ట్స్ క్లబ్(Willingdon Sports Club) వెళ్లిపోయేవాడట. అక్కడ ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా గుడ్లు ఎలా తినాలన్నా ఆలోచన నుంచే..ఈ రెసీపీని కనిపెట్టారట పాకనిపుణులు. ఆయన బ్రెడ్‌ని చీజ్‌లో వేయించి దానిపై రెండు గుడ్లు వేయించుకుని ఆపై ఉల్లిపాయలు, కొత్తిమీర, మిరియాల పొడితో గార్నిష్ చేయించుకుని మరీ తెప్పిచుకునేవాడట. చూసే వాళ్లకు ఏదో చీజ్ బ్రెడ్ తిన్నట్లు కనిపిస్తుంది అంతే..!. ఆయన ఆవిధంగా అక్కడకు వెళ్లిన ప్రతిసారి అలా ఆర్డర్ చేయించుకుని తినడంతో మిగతా కస్టమర్లలో ఆయన ఏం ఆర్డర్ చేస్తున్నాడనే కుతుహాలం పెరిగింది. ఆ తర్వాత అందరికీ అలా తినడమే నచ్చి ఆర్డర్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ఆ రెసిపీకి ఎగ్స్ కేజ్రీవాల్ అనే పేరు స్థిరపడిపోయింది. అంతేగాదు ఈ రెసిపీకున్న క్రేజ్ చూస్తే నోరెళ్లబెడతారు. ఎందుకంటే న్యూయార్క్, లండన్ రెస్టారెంట్లలో ప్రసిద్ద బ్రేక్‌ఫాస్ట్ ఇది. అలాగే న్యూయార్క్ టాప్ 10 వంటకాల జాబితాలో చోటు కూడా దక్కించుకుంది ఈ రెసిపీ. తమషాగా ఉన్న ఈ రెసిపీ స్టోరీ..ఓ మనిషి అభిరుచి నుంచే కొత్త రుచులతో కూడిన వంటకాలు తయారవ్వుతాయన్న సత్యాన్ని తెలియజేసింది కదూ..!. మరీ ఈ రెసిపీ తయారీ విధానం సవివరంగా చూద్దామా..!.కావాల్సిన పదార్థాలు తురిమిన చీజ్: 80 గ్రాములుబ్రెడ్: రెండు స్లైసులుస్ప్రింగ్ ఆనియన్స్ : 2పచ్చి మిరపకాయ: 1నూనె: 1 టీస్పూన్పెద్ద గుడ్లు: 2నల్ల మిరియాలు: రుచికి సరిపడతురిమిన చీజ్‌లో చక్కగా గోల్డెన్ కలర్లో బ్రెడ్లు కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మందపాటి గిన్నెలో రెండు గుడ్లను పగలకొట్టి వేసుకోవాలి. వాటిని చిదపకుండా అలానే బ్రెడ్‌పై వేసి కొద్దిసేపు కాల్చాలి. ఆ తర్వాత దానిపై ఆనియన్స్ తురిమిన చీజ్, పచ్చిమిర్చి, మిరియాల పౌడర్ చల్లి సర్వ్ చేయడమే. హెల్తీగానూ కడుపు నిండిన అనుభూతి కలిగించే మంచి బ్రేక్‌ఫాస్ట్ ఇది.(చదవండి: పుష్ప మూవీలో హీరో అన్నట్లు వర్క్‌లో బ్రాండ్ కావాలి..!) -
మీ కాఫీ మరీ చేదుగా ఉందా? దీనికి కారణం తెలుసా? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ఉదయాన్నే కమ్మని ఫిల్టర్ కాఫీ తాగితే మనసంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది మనలో చాలామందికి. ఘుమఘుమలాడే కాఫీ వాసన ముక్కు పుటాలకు తగలగానే అదొక మధురానుభూతి కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతిరోజూ కాఫీ తాగుతున్నారు. అయితే మరికొంతమందికి అబ్బా..ఆ చేదు ఎలా తాగుతార్రా బాబూ! అనిపిస్తుంది కదా. అసలు కాఫీ ఎందుకు చేదుగా ఉంటుందో ఎపుడైనా ఆలోచించారా? కాఫీలోని కెఫిన్ ఉండటం వల్లే చేదుగా ఉంటుంది అనుకుంటున్నారా? కానీ కెఫిన్ లేని కాఫీ కూడా చేదుగా ఉంటుందట. అదేంటి అనుకుంటున్నారా? ఇదిగో ఈ వివరాలు మీకోసం.మ్యూనిచ్‌లోని టెక్నికల్ యూనివర్సిటీలోని లీబ్నిజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫుడ్ సిస్టమ్స్ బయాలజీ పరిశోధకులు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించారు. రోస్ట్ చేసిన అరబిక్ కాఫీలో చేదు సమ్మేళనాల కొత్త సమూహాన్ని గుర్తించారు. చేదును అవి ఎలా ప్రభావితం చేస్తాయో పరిశోధించారు. అలాగే ఈ వేయించే పదార్థాలు ఎంత చేదుగా ఉంటాయో నిర్ణయించడంలో వ్యక్తిగత జన్యు సిద్ధత కూడా పాత్ర పోషిస్తుందని వారు మొదటిసారి ప్రదర్శించారు. అరబికా బీన్స్‌లో ఉండే ‘మోజాంబియోసైడ్‘ అసలైన కారణమట. ఇది కెఫిన్ కంటే పది రెట్లు ఎక్కువ చేదుగా ఉంటుంది. మానవ శరీరంలో కనిపించే సుమారు 25 చేదు రుచి గ్రాహక రకాల్లో రెండు, అవి TAS2R43, TAS2R46 గ్రాహకాలు. వీటిని ఇది బాగా యాక్టివేట్ చేస్తుంది. ‘కోఫియా అరబికా’ మొక్కకు చెందిన గింజలను కూడా కాల్చి పొడి చేస్తారు. అయితే ఈ గింజలను రోస్ట్ చేసే ఉష్ణోగ్రత, సమయాన్ని బట్టి అవి ఏడు రకాలుగా మారతాయి. ఈ ఏడు దశల్లోని కాఫీ రుచి గ్రాహకాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఒక్కో దశలో ఒక్కో రుచి వస్తుందని పరిశోధకుడు లాంగ్ చెప్పారు. రుచి, దాని సున్నితత్వం అనేవి జన్యు సిద్ధతపై ఆధారపడి ఉంటుందని ఒక జన్యు పరీక్షలో వెల్లడైంది.చదవండి: హీరోయిన్ల బాటలో 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయంమోజాంబియోసైడ్ పదార్థం ఉన్న కాఫీ గింజలతో తయారు చేసిన కాఫీ తాగిన పదకొండు మందిలో ఎనిమిది మందికి ఎక్కువ చేదుగా రుచిని గ్రహించడానికి మోజాంబియోసైడ్ దారితీసిందని ఒక పరీక్షలో తేలింది. వారిలో ఒక గ్రాహక జన్యువు లోపభూయిష్టంగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. రెండు జన్యువులు చెక్కు చెదరకుండా ఉన్న ఇద్దరికి మాత్రం కాఫీ చేదుగా అనిపించలేదు. అయితే తమ కొత్త పరిశోధనలు కాఫీ రుచిని వేయించే ప్రక్రియ ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై మన అవగాహనను పెంచుతాయని మరింత సమన్వయంతో కూడిన కొత్త కాఫీ రకాల అభివృద్ధికి దోహదపడతాయని పరిశోధకులు తెలిపారు. చేదు పదార్థాలు ,వాటి గ్రాహకాలు శరీరంలోని ఇతర అంశాలను బట్టి ఉంటుందనీ, వీటిలో చాలా వరకు ఇప్పటికీ తెలియని పరిశోధకులు తెలిపింది. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని లాంగ్ తెలిపారు. -
పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్
Palakura Pachadi : శ్రేష్టమైన ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరతో, పాలకూర పప్పు, పాలకూర ఆలూ, పాలక్ పనీర్ .. ఇలా రకరకాల వంటలను చేసుకుంటాం. అలాగే పాలకూర పచ్చడి కూడా చేసుకోవచ్చు. గోంగూర పచ్చడి లాగానే పాలకూరను కూడా రుచికరంగా తయారు చేసుకోవచ్చు. పాలకూర ఎలా చేసుకోవాలో చూద్దామా.పాలకూరతో బీపీ, మధుమేహం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. బీపీ అదుపులో ఉంటుందని భావిస్తారు.పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే తో పాటుగా క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, తక్కువ క్యాలరీలు ఉంటాయి. పాలకూరను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కావలసిన పదార్థాలుపాలకూర ఒక కప్పు, కొంచెం శుభ్రం చేసుకున్న చింతపండు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ కొద్దిగా నూనె, రుచికి సరిపడినంత ఉప్పు , చిటికెడు పసుపు, ఇంగువ, నాలుగైదు ఎండుమిచ్చి,ధనియాలు-ఒక స్పూను పోపు కోసం: పప్పులు,ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ(ఆప్షనల్) జీలకర్ర, ఆవాలు,తయారీపాలకూరను శుభ్రంగా రెండుమూడుసార్లు బాగా కడగాలి. ఇసుక, మట్టి శుభ్రంగా పోయాయని నిర్ధారించుకున్నాక సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. చూసుకోవాలి.స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి, ఎండుమిర్చి వేయించాలి. ఇందులోనే కొద్దిగా ధనియాలు, మెంతులు కూడా బాగా వేగనివ్వాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు అదే కళాయిలో పాలకూరను వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉత్తినే మగ్గిపోతుంది. అవసరం పడితే కొద్దిగా నూనె వేసుకోవచ్చు. పాలకూర బాగా దగ్గరికి వచ్చాక, చింతపండును కూడా వేయాలి. బాగా ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులోనే చిటికెపు పసుపు వేయాలి. ఆతరువాత శుభ్రంగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిరెబ్బల్ని కూడా (ఇష్టంలేనివారు మానివేసి నువ్వులను చిటచిటపలాడేలూ వేయించి కలుపుకోవచ్చు) వేసి, ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మినప్పప్పు మెంతులు ఎండుమిర్చి, పచ్చి ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా మెత్తగా అయ్యాక ఉడికించిన పాలకూరను కూడా మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు,పులుపు కారం సరిపోయిందోఒకసారి చెక్ చేసుకోవాలి.ఇపుడు కాస్త మినపప్పు,శనగపప్పు,ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకులు వేసి వేయించి చివర్లో కాస్త ఇంగువ కూడా వేసి పోపు పెట్టుకోవాలి. అంతే ఘుమఘుమలాడే పాలకూర చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలో గానీ, రోటీ, చపాతీలో టేస్టీటేస్టీగా తినవచ్చు. దోశ, ఇడ్లీల్లో కూడా చట్నీలా వాడుకోవచ్చు. ఒకసారి చేసుకుంటే రెండు రోజుల వరకు తాజాగా ఉంటుంది.పాలకూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తం శుద్ధి అవుతుంది గుండె జబ్బులు కూడా రాకుండా అడ్డుకుంటాయి. మహిళలు పాలకూరను తరచూ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. అలాగే ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి కూడా పాలకూరకు ఉందని చెబుతారు. అధిక బరువు ఉన్నవారు పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వారు బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. -
అంతర్జాతీయ చెఫ్‌లతో హైదరాబాద్‌లో కలీనరీ ఫెస్ట్
50 దేశాలకు చెందిన చెఫ్‌ల పాకశాస్త్ర ప్రదర్శన ఐఐహెచ్‌ఎమ్, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహణ నగరంలోకలినరీ ఫెస్ట్.. ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లో యునైటెడ్ వరల్డ్ యంగ్ చెఫ్స్ (UWYC) ఎక్స్పీరియన్స్" పేరుతో కలిరీఫెస్ట్ జరగనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 మంది యువ పాకశాస్త్ర నిపుణులు తమ దేశాల నుండి సాంప్రదాయ వంటకాలను ప్రదర్శిస్తారు. ఆహార ప్రియులు వివిధ ప్రపంచ వంటకాలు ఇక్కడ ప్రదర్శిస్తారు.సాక్షి, సిటీబ్యూరో: నగరం మరో సారి వివిధ దేశాలకు చెందిన పససందైన రుచులకు వేదికగా మారనుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ కౌన్సిల్ లండన్ భాగస్వామ్యంతో నగరంలోని ది గ్లాస్ ఆనియన్ వేదికగా యునైటెడ్ వరల్డ్ యంగ్ చెఫ్స్ గ్యాస్ట్రోనమిక్ ఎక్స్పీరియన్స్ నిర్వహించనున్నారు. ఈ కలినరీ ఫెస్ట్‌లో 50కి పైగా దేశాల నుంచి ప్రముఖ చెఫ్‌లు అంతర్జాతీయ వంటకాలను దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రదర్శించనున్నారు. ఇందులో 10 మంది చెఫ్‌లు హైదరాబాద్‌లో విభిన్న రుచుల సమ్మేళనాన్ని సృష్టించనున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!ఫిబ్రవరి 3న జరగనున్న ఈ ఫెస్ట్‌లో భారత్‌తో పాటు అల్బేనియా, ఆస్ట్రేలియా, గ్రీస్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తైమూర్–లెస్టే, నైజీరియా, ఉగాండా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు చెందిన చెఫ్‌లు తమ పాకశాస్త్ర నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. ఇదీ చదవండి: గ్లోబల్ పాప్ స్టార్ జెన్నీ స్కిన్ కేర్ సీక్రెట్ : రెండే రెండు ముక్కల్లో! -
పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా : రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అదుర్స్!
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించాలంటే కత్తిమీద సామే. ఏదో ఒకటి వంక పెడుతూ ఇంటి ఫుడ్‌ను దూరం పెడుతూ ఉంటారు. చిప్స్, న్యూడిల్స్ అంటూ పరుగులు పెడతారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనీర్‌తో చేసుకునే అద్భుతమైన రెసిపీలను ఇక్కడ చూద్దాం. రెస్టారెంట్ రుచి కావాలంటే.. మరిన్ని టిప్స్ మీకోసం.పాలక్ పనీర్...ఇది ఫేమస్ పంజాబీ రెసిపీ కానీ ప్రపంచ వ్యాప్తంగా దీనికి అభిమానులున్నారు. పాలక్ పనీర్ చపాతీ, రోటీలు, పుల్కా, ఇంకా జీరా రైస్ లో చాలా రుచిగా ఉంటుంది. పాలక పనీర్ రెసిపీ చాలా సింపుల్ కొన్ని చిన్న టిప్స్ కొలతలు సరిగా పాటిస్తే.. అదిరిపోయేటేస్ట్ వుస్తుంది. కావాల్సిన పదార్థాలు: అర కప్పు సన్నగా తరిగిన పాలకూర, అర కప్పు పనీర్ ముక్కలు , సన్నగా తరిగిన ఉల్లిపాయ, సగం కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటిన్నర టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర,1/4 స్పూన్ గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్తయారీ మీడియం వేడి మీద పాన్ వేడెక్కాక, నూనె వేసి, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయలవేయించుకోవాలి. ఇవి బాగా వేగాక సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి పాన్ ని మూత పెట్టి మీడియం మంట మీద 10 నిమిషాలు ఉడికించాలి. అడుగు అంటుకోకుండా ఉండటానికి తిప్పుతూ ఉండాలి. పాలకూర ఉడికిన తర్వాత, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసి ఉడికించాలి. ఇందులోనే క్రీమ్ లేదా చక్కెర వేసుకోవాలి. బాగా దగ్గరికి ఉడికిన తరువాత పనీర్ వేసి కలిపి మరో 4-5 నిమిషాలు ఉడికనివ్వాలి. మంటను ఆపివేసి. కసూరి మేథీ వేసి కలుపుకోవడమే. టేస్టీ టేస్టీ పాలక్ పనీర్ రెడీ.రుచిని పెంచే టిప్స్:పాల కూర ఆకులు మరిగే నీళ్ళలో వేసి 3 నిమిషాలు ఉడికించి వెంటనే చన్నీళ్ళ లో వేయాలి. అప్పుడు గ్రీన్ కలర్లోనే ఉంటుంది. లేదంటే ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది.ఇంట్లో చేసుకున్న పనీర్ ఎప్పుడూ బెస్ట్, రెడీమేడ్ తెస్తే పనీర్ ముక్కలుగా చేసి వేడి నీళ్ళలో 10 నిమిషాలు ఉంచితే పనీర్ మెత్తబడుతుంది. ఉల్లిపాయ ఎర్రగా వేగాలి.కసూరి మేథి తప్పక వేయాలి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో పాల మీగడ లేదా ఫ్రెష్ క్రీమ్ వాడితే టేస్ట్ అదిరిపోతుంది.పాలకూర కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి, చేదును తగ్గించడానికి కొంచెం క్రీమ్ లేదా చక్కెర వాడతారు. వెల్లుల్లి ఇష్టం లేనివారు మానేయవచ్చు.కొంతమంది టమాటా గుజ్జుకూడా కలుపుకుంటారు.పనీర్ బటర్ మసాలాకావలసినవి: పనీర్ ముక్కలు– ఒకటిన్నర కప్పు; ఉల్లిపాయ ముక్కలు-ముప్పావు కప్పు; టొమాటో ముక్కలు-కప్పు; వెల్లుల్లి రేకలు-4; అల్లం తురుము-టీ స్పూన్; పచ్చిమిర్చి-2; జీడిపప్పు-పది పలుకులు; పాలు- అర కప్పు; మీగడ-పావు కప్పు; కసూరీ మేథీ లేదా తాజా మెంతి ఆకు-టీ స్పూన్; ధనియాల పొడి- టీ స్పూన్; మిరపపొడి-టీ స్పూన్; పసుపు - పావు టీ స్పూన్; వెన్న-2 టీ స్పూన్లు; ఉప్పు-అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; కొత్తిమీర తరుగు– 3 టేబుల్ స్పూన్లు.పోపు కోసం... నూనె - టేబుల్ స్పూన్; యాలకులు-2; లవంగం – 1; దాల్చిన చెక్క- అంగుళం ముక్క;తయారీ: పనీర్ ముక్కలను వేడి నీటిలో వేసి మెత్తబడే వరకు పక్కన ఉంచాలి. బాణలి లో నూనె వేడి చేసి మీగడ, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి ఒక మోస్తరుగా వేయించాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే బాణలిలో మిగిలిన నూనెలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయించాలి. ఆ తర్వాత మిరకపొడి, ధనియాల పొడి,పసుపు, మేథీ వేసి పచ్చిదనం పోయే వరకు వేయించాలి. ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, జీడిపప్పు చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని బాణలిలో వేయాలి. అందులో పాలు పోసి, ఉప్పు వేసి కలిపి చిక్కదనం, రుచి చూసుకోవాలి. మిశ్రమం ఉడకడం మొదలై బుడగలు రావడం మొదలైన తర్వాత పనీర్ ముక్కలను నీటిలో నుంచి తీసి బాణలిలో వేసి కలపాలి. మంట తగ్గించి, వెన్న వేసి, కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయాలి.ఇవీ చదవండి: అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్ ఛేంజర్’ ఇది!శానిటరీ ప్యాడ్ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహం -
కర్బూజా– కాజు, అవిసె గింజలతో హెల్తీ స్నాక్స్ చేసుకోండిలా..!
కర్బూజా– కాజు స్వీట్కావలసినవి: కర్బూజా– 1 (తొక్కలు, గింజలు తీసి, ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలను మిక్సీలో వేసుకుని, మెత్తగా గుజ్జులా చేసుకోవాలి)పంచదార– సరిపడాజీడిపప్పు గుజ్జు– పావు కప్పుకొబ్బరి కోరు– పావు కప్పు పైనే (గార్నిష్‌కి కూడా వాడుకోవచ్చు)తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, ఒక కళాయిలో కర్బూజా గుజ్జు వేసుకుని, చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. ఒక నిమిషం తర్వాత పంచదార వేసుకుని దగ్గరపడే వరకు తిప్పుతూ ఉండాలి.అనంతరం జీడిపప్పు గుజ్జు, పావు కప్పు కొబ్బరి కోరు వేసుకుని తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని, చల్లారనివ్వాలి. ఆ తర్వాత నచ్చిన విధంగా ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న స్వీట్స్‌లా చేసుకుని, కొద్దికొద్దిగా కొబ్బరికోరుతో అందంగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.అవిసె గింజల నేతి లడ్డూ..కావలసినవి: అవిసె గింజలు– 1 కప్పు, జీడిపప్పు, నువ్వులు– 1 టేబుల్ స్పూన్ చొప్పున (నేతిలో వేయించి పౌడర్లా చేసుకోవాలి), వేరుశనగలు– అర కప్పు (దోరగా వేయించి, మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి), బెల్లం కోరు– అర కప్పు, బాదం గింజలు–10 (దోరగా వేయించి పొడి చేసుకోవాలి), నెయ్యి– సరిపడా, ఏలకుల పొడి– కొద్దిగాతయారీ విధానం: ముందుగా అవిసె గింజలను దోరగా వేయించి, చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం అందులో బాదం పొడి, ఏలకుల పొడి, జీడిపప్పు మిశ్రమం వేసుకుని నెయ్యి పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. అప్పుడు ఆ ముద్దను, చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిపై జీడిపప్పు లేదా బాదం ముక్కలను ఒత్తుకుని.. సర్వ్ చేసుకోవచ్చు.(చదవండి: తాత మొండి పట్టుదల ఎంత పనిచేసింది..! ఏకంగా ఇంటి చుట్టూ..) -
Republic Day 2025: సర్వ ఆహార సమ్మేళనం..!
‘‘సన్నగా ఉండాలని కడుపు మాడ్చుకుంటే అనారోగ్యమే. చక్కగా తినాలి... చక్కగా ఎక్సర్సైజ్లు చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం’’ అని ఉష మూల్పూరి(Usha Mulpuri)అన్నారు. నిర్మాతగా తన తనయుడు నాగశౌర్యతో ‘ఛలో, నర్తనశాల, కృష్ణా వ్రింద విహారి’ తదితర చిత్రాలను నిర్మించారు. తొలి చిత్రం ‘ఛలో’ తోనే నిర్మాతగా సక్సెస్‌ని టేస్ట్ చేసిన ఉష ఇప్పుడు తన రెస్టారెంట్ ‘ఉష మూల్పూరి’స్ కిచెన్(Usha Mulpuri's Kitchen)’ ద్వారా రుచికరమైన వంటకాలు అందిస్తున్నారు. ఇక గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా ‘సాక్షి’ కోసం ప్రత్యేకంగా కొన్ని వంటకాలు(Recipes) తయారు చేశారు. ఆ వంటకాలు తెలుసుకుందాం. ‘‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్... ఆ మనుషుల ఆరోగ్యం మా బాధ్యత... అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా చేసిన వంటకాల్లోనూ పోషక విలువలు ఉండేలా చూసుకున్నాను’’ అంటూ దేశభక్తిని చాటుతూ, జెండా రంగులకు తగ్గట్టుగా తాను కూడా రెడీ అయి, కిచెన్‌లోకి ఎంటరయ్యారు ఉష. ముందుగా నాన్ వెజ్ స్టార్టర్ చేశారు.. ‘పండుమిర్చి కోడి వేపుడు, క్రీమ్ చికెన్, కరివేపాకు కోడి వేపుడు’ చేసి, ఆ కాంబోని అందంగా ప్రెజెంట్ చేశారు. ‘‘పండు మిర్చిలో విటమిన్ ఎ, బి, సి వంటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే కేన్సర్‌తో పోరాడే ఔషద గుణాలు ఉంటాయి. కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ వంటివి ఉంటాయి. కంటికి, జుట్టుకి మంచిది. ఎముకల ఆరోగ్యానికి కూడా కరివేపాకు బెస్ట్. అందుకే ఆహారం ఆరంభమే ఆరోగ్యంగా ఆరంభించాలని ఈ స్టార్టర్స్ చేశాను’’ అని వివరించారు ఉష. రైస్ ఐటమ్స్‌లో పుదీనా మాంసం పులావ్, చికెన్ ఫ్రైడ్ రైస్, పండుమిర్చి కోడి పులావ్ చేశారు. ‘‘పుదీనాకి మంచి వాసన ఉంటుంది. దాంతోపాటు రుచి కూడా బాగుంటుంది. అలాగే ఆహారం జీర్ణం కావడానికి పుదీనా మంచిది. ఐరన్ పుష్కలంగా ఉన్న పుదీనాని మీరు రోజూ తీసుకోవచ్చు. మనలో చాలామందికి రోజూ టీ తాగే అలవాటు ఉంటుంది. ఆ టీలో కొన్ని పుదీనా ఆకులు వేసుకుని, తాగి చూడండి. మీకే తేడా తెలుస్తుంది. ఇక నాన్‌వెజ్ తినేవారికి చికెన్‌లో ఎన్ని పోషక పదార్థాలు ఉన్నాయో తెలిసిందే’’ అని పేర్కొన్నారామె. మాంసాహారం మాత్రమే కాదు... శాకాహారం కూడా చేశారు ఉష. వెజ్‌లో కరివేపాకు వెజ్ పులావ్, పండుమిర్చి పనీర్ పలావ్, కర్డ్ రైస్ చేశారు.‘‘కరివేపాకు, పండుమిర్చి ఎంత మంచిదో ముందే చెప్పాను. పనీర్ మంచి ప్రోటీన్ ఫుడ్. నాన్‌వెజ్ తినేవారికి మాంసం రూపంలో ప్రోటీన్లు అందుతాయి. వెజిటేరియన్స్‌కి పనీర్ బెస్ట్. పనీర్‌లో తక్కువ కార్బోహైడ్రేట్స్... ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇక మన ఇండియన్స్‌లో చాలామందికి ఫైనల్‌గా పెరుగన్నం తింటేనే సంతృప్తిగా ఉంటుంది. పెరుగులో కావాల్సినంత కాల్షియం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పొట్ట చల్లగా ఉండటానికి పెరుగన్నం కూడా చేశాను’’ అని తెలిపారు ఉష మూల్పూరి. ఎనిమిది పదుల వయసులవాళ్లకూ... ‘‘మనం ఆహారం తీసుకున్నాక పొట్ట బరువుగా ఉండకూడదు. తేలికగా అనిపించాలి. ఫుడ్ బిజినెస్ ఆరంభించాలనుకున్నప్పుడు నా మెయిన్ టార్గెట్ ఇదే. మా రెస్టారెంట్‌కి ఎనభై ఏళ్ల వయసు, ఆ పైన ఉన్నవాళ్లు కూడా వస్తారు. ‘పొట్ట చాలా తేలికగా ఉందమ్మా’ అని వారు చెప్పినప్పుడు హ్యాపీగా ఉంటుంది’’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.సెలబ్రిటీలకూ... ‘‘మా కిచెన్ వంటకాలను ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఉపాసన, కృష్ణారెడ్డి, హరీష్ శంకర్, బాబీ, బుచ్చిబాబు, కోటి, మెగా కృష్ణారెడ్డి, నందినీ రెడ్డిగార్లు వంటివారు ఇష్టపడతారు. మా దగ్గర బ్రొకోలీ కాషూనట్ చిల్లీ గార్లిక్ ఫేమస్. ఇవి ఎక్కువగా తెప్పించుకుంటారు’’ అని చెప్పారు ఉష. అవగాహన పెంచుకోవాలి ‘‘నేను రెస్టారెంట్ పెట్టాలనుకున్నప్పుడు నాకు పెద్దగా ఏమీ తెలియదు. జీతాలిచ్చి మనుషులను పెట్టుకుని, వాళ్లతో చేయించేయొచ్చు. కానీ అందులో పరిపూర్ణత ఉండదు. వంటకు కావల్సినవి కొనడం నుంచి వాటిని సరిగ్గా శుభ్రం చేసి వండటం వరకూ అన్నింటినీ దగ్గరుండి చేయించేదాన్ని. ‘సర్వ మత సమ్మేళనం’ అంటారు... ‘సర్వ ఆహారం సమ్మేళనం’ అంటాను. రెస్టారెంట్ అంటే రకరకాల వాళ్లు వస్తారు. వాళ్లకి తగ్గట్టుగా ఉండాలి కదా. నా కుటుంబ సభ్యులకు వండుతున్నట్లుగా భావించి వంట చేయిస్తాను. వీలున్నప్పుడల్లా అన్ని టేబుల్స్ దగ్గరికి వెళ్లి, అందర్నీ పలకరిస్తుంటాను. ‘మాకు ఇంటికి వచ్చినట్లుగా ఉంది’ అని అంటుంటారు. అందరికీ ‘సాక్షి’ ద్వారా థ్యాంక్స్ చెబుతున్నాను’’ అంటూ ముగించారు ఉష.– డి.జి. భవాని (చదవండి: నీ రీప్లేస్మెంట్ రోబో: సు'నీ'శితంగా శస్త్రచికిత్స) -
తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?
చలికాలం మొదలు కాగానే మార్కెట్టులో విరివిగా కనిపించే వాటిలో తేగలు ఒకటి. వీటిని కొన్ని ప్రాంతాలలో గేగులు అని అంటారు. వీటిని తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా వున్నాయి. అవేంటో తెలుసుకుంటే ఇప్పుడైనా వీటిని తినేందుకు త్వరపడతారు. తేగల్లో పొటాషియం, విటమిన్ బి1, బి2, బి3, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి పోషకాల లోపాన్నీ తగ్గిస్తాయి. తేగలతో ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా? తేగలను ఉడికించి మిరియాలు, ఉప్పు అద్దుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. తేగలు తింటే బరువు తగ్గడంతోపాటు కాన్సర్ కూడా దూరం అవుతుంది. అలాగే తేగలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పిండి కొట్టి, కొబ్బరి పాలు, బెల్లం, ఏలకుల పొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది.తేగలపిండితో రొట్టెలు చేసుకుని తినొచ్చు. ఇందులోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది. పెద్ద పేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులోని కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో తెల్ల కణాలను వృద్ధి చేస్తుంది. శరీరానికి చలువనిచ్చి, నోటిపూతను తగ్గిస్తుంది. తేగలను పాలలో ఉడికించి ఆ పాలను చర్మానికి పూతలా రాసుకుంటే చర్మం మిలమిల లాడుతంంది.తేగలు దొరికే రోజుల్లో పిల్లలకు రెగ్యులర్‌గా వీటిని పెడితే ఎముకల ఎదుగుదలకు దోహద పడుతుంది. తాటి తేగలను మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించి మధుమేహాన్ని అదుపు చేస్తుంది. రక్తం తక్కువగా ఉండి అనీమియాతో బాధపడుతున్నవారు ఈ సీజన్లో వచ్చే తేగలను తింటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. తాటి చెట్ల ద్వారా... తేగలకు మూలం తాటిచెట్టే. వేసవిలో తాటికాయల కాపు మొదలవుతుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో తాటి ముంజులు మార్కెట్లోకి వస్తాయి. అవి ముదిరి తాటికాయలుగా తయారై పండ్లుగా మారతాయి. అలా రాలిన తాటి పండ్ల గుజ్జును వినియోగించి పిండి వంటలు తయారు చేస్తారు. ముఖ్యంగా తాటి తాండ్ర, తాటి రొట్టెలు మొదలైనవి. ఈ తాటి కాయల టెంకలతో పాటు,కాయలను కూడా ప్రత్యేక ప్రాంతాల్లో రైతులు వ్యాపారులు తేగల పాతరలు వేస్తారు. వీటికి ఎటువంటి ఎరువులు అవసరం లేదు. భూమి ఇసుక పొరలలో దృఢంగా పెరుగుతాయి. డిసెంబర్ నాటికి ఇవి తేగలుగా తయారవుతాయి. వీటిని మొలకలు రాకముందే తీసి, కుండల్లో ప్రత్యేకంగా అమర్చి నిప్పుల్లో కాల్చతారు. ఇవి తినడానికి కమ్మగా ఉంటాయి. వీటి మార్కెట్లో విక్రయంచి రైతులు ఉపాధి పొందుతారు.ఆహా ఆరోగ్యం.. తేగలు గుండె జబ్బులు, డయాబెటిస్ ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెడతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తాయి. నోటి సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. డయాబెటిస్తో బాధపడే వారు వీటిని తింటే డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా తాటి తేగలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను కలిగించే తాటి తేగలను ప్రతిరోజు క్రమం తప్పకుండా దొరికినప్పుడు ఒకటి చొప్పున తీసుకుంటే చాలా మంచిది. ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పెరిగే ఈ తాటి తేగలు మంచి పోషకాహారంగా మనం చెప్పవచ్చు. వీటిల్లో ఉండే పీచు పదార్థం మన జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది. మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలని భావించే వారికి తాటి తేగలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఇవి మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సమస్య రాకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తెల్లరక్త కణాలను పెంచి, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.ఇవీ చదవండి :ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!అపుడు వాచ్‌మెన్‌గా, ఇపుడు దర్జాగా : శభాష్ రా బిడ్డా! వైరల్ స్టోరీ నోట్: మంచిది కదా అని అతిగా తింటే మాత్రం చెరుపు చేస్తుంది. -
సంక్రాంతికి వస్తున్నాం ‘అప్పడాలు’ కాదు... సోషల్ మీడియాను షేక్ చేస్తున్నవీడియో!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కామెడీ పండించిన ‘బుల్లిరాజు’ గుర్తున్నాడా? ‘‘అప్పడాలు వడియాలు అయ్యాయా’’అంటూ చెప్పిన కొన్ని డైలాగులు సోషల్ మీడియాను షేక్ చేశాయి. థియేటర్ లో నవ్వులు పూయించిన బుల్లిరాజు క్యారెక్టర్ విమర్శల పాలయ్యింది. పిల్లాడితో బూతు డైలాగులా అంటూ జనం మండిపడ్డారు. ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే...అక్కడికే వస్తున్నా... అప్పడాలు, వడియాలతోపండగ చేసుకుంటున్న నెటిజనుల దృష్టిలో అప్పడాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. పప్పు, సాంబారు, అప్పడాలు కాంబినేషన్ ఎంత ఫ్యామస్సో తెలుసు కదా. చాన్స్ దొరికితే కరకరమనే అప్పడాలను ఇంకో రెండు వేసుకుని మరీ లాగించేస్తాం. అయితే ఈ అప్పడాలను ఎలా తయారు చేస్తారో ఎపుడైనా ఆలోచించారా? దీనికి సంబంధించిన ఒక వీడియోపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.అప్పడాల్లో చాలా రకాలు మార్కెట్లో లభిస్తుంటాయి. బియ్యం పాపడ్, మసాలా పాపడ్, కలి మిర్చ్ పాపడ్, రాగి పాపడ్, వెల్లుల్లి పాపడ్, సాబుదానా పాపడ్, అబ్బో ఇలా చాలా రకాలే ఉన్నాయి. ఈ అప్పడాలు లేనిదే ఫంక్షన్స్, పార్టీలు సంపూర్ణం కాదంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పడాలను తయారు చేస్తున్న వీడియో ఒకటి ట్విటర్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం ఒక పెద్ద గిన్నెలో అప్పడాల పిండి కలిపి ఉంది. దీని ఆవిరి మీద ఉడికేలా.. వేడినీటి గిన్నెపై ఉన్న మూతపై పూతలా వేసింది ఒక మహిళ.దాన్ని తీసి ఒకచోట పేర్చింది. ఆ తర్వాత వరుసగా పేర్చిన వాటిపై పదునైన గుండ్రటి స్టీల్ డబ్బాల సాయంతో కాళ్లతో తొక్కుతూ పెద్ద అప్పడంపై ఒత్తిడి పెంచి, దాన్ని గుండ్రటి అప్పడాలుగా తయారు చేశారు. అలా ఒక్కోటి వేరు వేరుగా తీసి వాటిని ఎండబెట్టడం ఈ వీడియోలు చూడవచ్చు.తేజస్ పటేల్ అనే యూజర్ దీన్ని ఎక్స్‌లో షేర్ చేశారు. కష్టపడి పనిచేస్తున్నారు... కానీ శుభ్రతగురించి పట్టించుకోవడం లేదు అన్నట్టుగా కమెంట్ చేశారు. ఇలాంటి వాటిని తినడం తినకపోవడం మీ ఇష్టం అన్నట్టుగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు విభినంగా స్పందించారు. కాళ్లతో తొక్కడం తప్ప అంతా బానే ఉందని కొందరు, అప్పడం రుచిలోని రహస్యం అదే అంటూ వ్యాఖ్యానించారు. ( టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి)Very hardworking ppl, let's support. Why care about hygiene🤡 pic.twitter.com/4HmsxZIgWC— Tejas Patel (@237Stardust) January 22, 2025ఫాస్ట్ ఫుడ్, హోటల్స్‌లో పాటించే శుభ్రత కంటే బెటరేగా?గతంలో ఇలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టాలో చర్చకు తెరతీసింది. దీనిపై చాలామంది విమర్శలు గుప్పించినప్పటికీ, చాలామంది సమర్ధించారు. "ఫాస్ట్ ఫుడ్" కంటే మెరుగే అని కొందరు "చాలా హై-ఎండ్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కంటే ఇది చాలా బెటర్ అని ఒకరు,"కనీసం ఈ మహిళ అప్పడాలపై డైరెక్ట్‌గా పాదం పెట్టకుండా తగినంత జాగ్రత్త పడుతోంది.. ఇంత కంటే ఘోరంగా చాలా హోటల్స్ ఉంటాయి అంటూ ఇంకొందరు అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. View this post on Instagram A post shared by Karansingh Thakur (@dabake_khao)అప్పడం ఒక ఎమోషన్సౌత్ ఇండియాలో అప్పడాలు, వడియాలు విందు భోజనాన్ని అస్సలు ఊహించలేం. అప్పడాలలో ఫైబర్, ప్రోటీన్, ఇతర మంచి పోషకాలు వుంటాయి. జీవక్రియను ప్రోత్సహించేందుకు అప్పడాలు దోహదపడతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించగల శక్తి అప్పడాలకు వుంది.అయితే ఇటీవల ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో ఆయిల్ లేకుండా వేయించుకునే అప్పడాలు కూడా వచ్చాయి ఎందుకంటే అప్పడాలతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వున్నాయి ముఖ్యంగా ఆయిల్లో వేయించడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. రక్తపోటు, గుండె జబ్బుల నుంచి క్యాన్సర్ వరకు ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. సో.. చాయిస్ ఈజ్ యువర్స్. -
ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు
జీవితంలో అనుకున్నది సాధించాలంటే పట్టుదల, కఠోర శ్రమ కచ్చితంగా ఉండాలి. జీవితంలో రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే సక్సెస్‌లో కిక్ ఉంటుందని నమ్మేవారు చాలామందే ఉంటారు. అలాగే ఎవరి దగ్గరో పనిచేయడం కాకుండా తమంతట తాముగా ఏదైనా చేయాలనే తపనతో ఉన్నత శిఖరాలకు చేరింది. బెంగళూరుకు చెందిన దివ్య. నెలకు వెయ్యి రూపాయల ప్యాకెట్‌మనీ కోసం కష్టపడిన ఈమె ఇపుడు నెలకు నాలుగున్నర కోట్లు ఆర్జిస్తోంది. ఎలా? తెలుసుకోవాలని ఉందా?దివ్య రావు సాధారణ మధ్య తరగతి కుటుండంలో పుట్టి పెరిగింది. కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు బావుంటుందన్న తల్లిదండ్రుల మాటలను అక్షరాలా నమ్మింది. అచంచలమైన దృఢ సంకల్పంతో 21 సంవత్సరాల వయస్సులోనే సీఏ చదివింది. తరువాత IIM అహ్మదాబాద్‌లో ఫైనాన్స్‌లో MBA చేసింది. ఈ సమయంలో ఆర్థికంగా చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఒక ఎగ్ పఫ్ తినడానికి కూడా ఎంతో ఆలోచించాల్సి వచ్చేది. కష్టపడి చదివి కుటుంబంలోనే సీఏ చదవిన యువతిగా పేరు తెచ్చుకుంది. అయితే నల్లేరుమీద నడకలా ఏమీ సాగలేదు. ఆర్థికంగా పలు సవాళ్లు ఎదుర్కొంది. అయినా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది.వ్యాపారవేత్తగా ఎలా మారింది?ఐఐఎంలో చదువుకునే సమయంలోనే కొన్ని ప్రముఖ ఆహార సంస్థలు, వాటి సక్సెస్‌పై అధ్యయనం చేసింది దివ్యా. ఆ సమయంలోనే ఫుడ్ బిజినెస్ ఆలోచనకు బీజం పడింది. ముఖ్యంగా దక్షిణాది రుచుల్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఆసక్తి పెరిగింది. ఫుడ్ బిజినెస్ అంటే దివ్య తల్లి అస్సలు ఇష్టపడలేదు. 10-20 రూపాయలకు రోడ్లపై ఇడ్లీ, దోసెలు అమ్మాలనుకుంటున్నావా?" అని తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సీఏగా ఉద్యోగం మొదలు పెట్టింది. కానీ మనసంతా వ్యాపారం పైనే ఉండేది. (ముఖం చందమామలా మెరవాలంటే, ఇలాంటి తప్పులు చేయకండి!)ఆహార పరిశ్రమలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న రాఘవేంద్రరావును కలిసే వరకు ఆమె ఆలోచనలకు ఒక రూపం రాలేదు. సీఏగా అతడికి పరిచయమైంది. అలా రాఘవ్‌కు ఫుడ్ బిజినెస్‌లో, ఆర్థికాంశాల్లో దివ్య అతనికి సలహాలిచ్చేది. దీంతో బిజినెస్ పార్ట్‌నర్స్‌గా మారారు. ఆ తరువాత అభిరుచులుకలవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. భర్త రాఘవేంద్రతో కలిసి 2021లో ‘రామేశ్వరం కెఫే’ ప్రారంభించింది. ఆహారం నాణ్యత పరంగా, టేస్ట్ పరంగా ప్రత్యేకంగా ఉండాలని ప్లాన్ చేసింది.తొలుత బెంగళూరులో రెండు బ్రాంచీలతో మొదలై ఇపుడు కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే స్థాయికి చేరింది. రాబోయే ఐదేళ్లలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, విదేశాలలో కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ దంపతులు. దుబాయ్, హైదరాబాద్ , చెన్నైలలో బ్రాంచెస్ తెరవనుంది. దాదాపు 700 మందికి ఉపాధి కల్పిస్తోంది. నివేదికల ప్రకారం ప్రతి స్టోర్ నుండి నెలకు రూ. 4.5 కోట్లు అమ్మకాలు సంపాదిస్తున్నారు. సంవత్సరానికి రూ. 50 కోట్లు సంపాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Rupa (@ruparavi21578)రామేశ్వరం కెఫేకర్ణాటకలోని బెంగళూరు నగరంలో రామేశ్వరం కెఫే చాలా పాపులర్. అక్కడికి వెళ్లినవారు ఈ కేఫేకు వెళ్లకుండా రారు. అంత ఫేమస్. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంది. ఈ కేఫును ఈ స్థాయికి తీసుకు రావడంలో భర్తతో కలిసి దివ్య అహర్నిశలు కష్టపడింది. ఇంత చదువూ చదివి, ఇడ్లీలు, దోసెలు అమ్ముతావా? అని గేలిచేసినా వెనుకడుగు వేయలేదు. తనకిష్టమైన ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టి తానేమిటో నిరూపించుకుంది.కెఫే వేదికగా ఇడ్లీ, దోసె, వడ, పొంగల్, బాత్, రోటీ, పరోటాతోపాటు, రైస్ వెరైటీలనూ ఆహార ప్రియులు ఆరగిస్తారు. అలాగే టీ, కాఫీలను స్పెషల్‌గా అందిస్తూ మరింతమందిని ఆకట్టుకుంటోంది. ప్రతీ వంటలోనూ ఆరోగ్య, నాణ్యతా ప్రమాణాల్ని తప్పకుండా పాటిస్తున్నామని ,సహజ పద్ధతుల్లో తయారుచేసిన నెయ్యి, ఇతర పదార్థాలను వాడతామని చెబుతుంది. తమ వంట తిన్న వారు తృప్తిగా.. ఆహా, ఏమిరుచి అన్నపుడు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటుంది సంతోషంగా దివ్య. తన వ్యాపారాన్ని విదేశాలకు సైతం విస్తరించాలని లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. -
హీరో రాణా సహా సంపన్నుల నివాసగృహాలు కేఫ్స్, రెస్టారెంట్స్‌గా
ప్రస్తుతం స్పెయిన్‌లో నివసిస్తూ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగర్‌గానూ పాపులర్ అయిన ఆశ్రిత ప్రముఖ నటుడు వెంకటేష్ కుమార్తె. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటితో కలిసి ఆశ్రిత దగ్గుబాటి ఇటీవల తాము సందర్శించిన ఓ రెస్టారెంట్ గురించి తన యూట్యూబ్ ఛానెల్లోని కొత్త వీడియోలో పంచుకున్నారు. అది గతంలో తమ దగ్గుబాటి కుటుంబానికి చెందిన పాత నివాసగృహం కాగా ఇప్పుడు రెస్టారెంట్‌గా మారింది. నాటి దగ్గుబాటి నివాసం.. ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్లతో శాంక్చురీ బార్ అండ్ కిచెన్ అనే అత్యాధునిక రెస్టారెంట్‌గా మారిన తర్వాత ఆ ఇంటిని సందర్శించడం ఇదే తొలిసారి అని ఆశ్రిత తెలిపారు. కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ పాత ఇంటిలో నివసించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.ప్రకృతి మధ్యకు.... ఇళ్లను రెస్టారెంట్లుగా మార్చడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తమ పిల్లలు విదేశాల్లో నివసిస్తూ ఉండడంతో తాము ఇక్కడ ఒంటరిగా లంకంత ఇళ్ల నిర్వహణ చూడలేక లీజ్‌కి ఇస్తున్నట్టు కొందరు సంపన్న తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు ఈ రెస్టారెంట్లు.. పన్నులు విద్యుత్ బిల్లులతో సహా ఎంత అద్దె అయినా సరే చెల్లించడానికి వెనుకాడడం లేదు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అన్వేషకులు అద్దె బదులు ఇఎమ్ఐలు చెల్లించడానికి ఇష్టపడతారు. కానీ ఈ కేఫ్స్ అద్దెలు ఎక్కువైనా సై అంటాయి. ‘అని ఓ ప్రాపర్టీ యజమాని చెప్పారు. కరోనా తర్వాత కొన్ని కుటుంబాలు తమ ఆస్తులను లీజుకు ఇచ్చేసి నగరం నడిబొడ్డు నుంచి కాలుష్య రహిత ప్రాంతాలకు, శివార్లలోని విల్లాలకు తరలివెళ్లారు. ‘నా జీవితాంతం కష్టపడి పనిచేశాను. ఇప్పుడు నేను ప్రకృతి నీడలో నివసించాలని కోరుకుంటున్నాను. అందుకే గండిపేటలోని మా అర ఎకరం స్థలంలో చిన్న ఇంటిని నిర్మించుకుని అక్కడకు మారాను’ అని ఐదేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో నివసించిన వ్యాపారి దినకర్ చెబుతున్నారు. మరికొందరు సినిమా సెలబ్రిటీలు.. గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు తమ నివాసాలను మారుస్తూ.. హిల్స్‌లోని తమ ఇళ్లను రెస్టారెంట్స్‌కి అద్దెకు ఇవ్వడం లేదా తామే రెస్టారెంట్స్, బ్రూవరీ.. వంటివి ఏర్పాటు చేయడం కనిపిస్తోంది. నాటి ఇంట్లో.. నేటి రెస్టారెంట్లో.. ‘మా ఇంటికి స్వాగతం. నేను 20 సంవత్సరాల పాటు ఇక్కడే నివసించాను’ అంటూ రానా సైతం గుర్తు చేసుకున్నారు. రానా, ఆశ్రిత ఆ రెస్టారెంట్లో తిరుగుతున్నప్పుడు గోడలపై రంగురంగుల కళాఖండాలు కనిపించాయి. కుటుంబ సభ్యులకు చెందిన వేర్వేరు గదుల్లో కలియ తిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ తాము చాలా కాలం క్రితం నడిచిన బ్లాక్ రైలింగ్‌తో కూడిన స్పైరల్ చెక్క మెట్ల మీద నడిచారు. ఇంటి మొదటి అంతస్తు’ అని రానా గుర్తు చేసుకున్నారు. మొదటి అంతస్తులో చాలా గాజు తలుపులు కనిపించాయి. ఇప్పుడు బార్గా ఉన్న ఆ ప్రదేశం గురించి చెబుతూ ‘ఈ బార్ ఉన్న ప్లేస్లోనే అప్పట్లో నేను సినిమాలు చూసేవాడిని’ అని రానా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన పాత బెడ్రూమ్లో బ్లాక్ షాండ్లియర్లు, రెస్టారెంట్ అతిథుల కోసం సీటింగ్స్ ఏర్పాటు చేశారు. రానాకు ఇష్టమైన బాల్కనీ ఇప్పుడు ‘పిజ్జా ప్లేస్’ గా మారింది. హిల్స్‌లో.. ఇవే ట్రెండ్స్.. ఒక్క దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఇల్లు మాత్రమే కాదు జూబ్లీహిల్స్‌లోని పలు ఇండిపెండెంట్ ఇళ్లు రెస్టారెంట్స్‌గా మారిపోతున్నాయి. రోడ్డు నెం.1, 10, 36, 45, 92లు మినహాయిస్తే మిగిలినవన్నీ నివాసప్రాంతాలే అయినప్పటికీ.. దాదాపు 350 దాకా వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పబ్‌లు, బార్లు, కాఫీ హౌస్‌లు కాగా కొన్ని మాత్రం బొటిక్స్. జూబ్లీ హిల్స్‌లోని అనేక నివాసాలు ఇప్పుడు భారతీయ, ఇటాలియన్ జపనీస్ తదితర దేశ విదేశీ రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రెస్.నగరంలో విశాలమైన స్థలంలో విలాసవంతంగా నిర్మించిన పలు నివాసాలకు ఒకేఒక చిరునామా జూబ్లీహిల్స్ అని చెప్పాలి. మరెక్కడా అంత చల్లటి, ప్రశాంతమైన వాతావరణం కనిపించదు.రెస్టారెంట్స్‌తో పాటు కేఫ్స్ సందర్శకులు, కేఫ్స్‌లో ఆఫీస్ వర్క్ చేసుకునే కార్పొరేట్ ఉద్యోగులు తరచూ ప్రశాంతమైన, హోమ్లీ వాతావరణాన్ని కోరుకుంటారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కెఫేలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఐదారేళ్ల క్రితం ఒకటో రెండో కేఫ్స్ ఉండే పరిస్థితి నుంచి పదుల సంఖ్యకు విస్తరించడానికి ఈ పీస్ఫుల్ వాతావరణమే దోహదం చేసింది.ఇళ్లను మారుస్తున్నారు.. : గత కొంత కాలంగా ఈ ట్రెండ్ ఊపందుకుంది. మా రెస్టారెంట్ సైతం అలా ఏర్పాటు చేసిందే. మాలాంటి కొందరు పూర్తిగా రూపురేఖలు మారుస్తుంటే.. మరికొందరు మాత్రం స్వల్ప మార్పులకు మాత్రమే పరిమితమై ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చూస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్‌ని ఎంజాయ్ చేయడానికి జూబ్లీహిల్స్ ఒక మంచి ప్లేస్. -సంపత్, స్పైస్ అవెన్యూ రెస్టారెంట్ ఆపాతమధురం -
మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలు
స్కూలుకెళ్లే పిల్లలున్న ఇంటి కళ వేరు. డ్రాయింగ్ రూమ్‌లో స్కూలు బ్యాగ్‌లు. వంటగదిలో లంచ్ బాక్సులు పలకరిస్తాయి. ఆ వంటింటి మెనూ భిన్నంగా ఉంటుంది. రోజూ కొత్తగా వండాలి... హెల్దీగా ఉండాలి. ఆ తల్లికి వంట రోజూ ఓ మేధోమధనమే. వారంలో ఓ రోజు ఇలా ట్రై చేయండి. మార్కెట్లో ఇపుడు ఎక్కడ చూసిన పచ్చి బఠానీ విరివిగా కనిపిస్తోంది. బఠానీలతో ఎలాంటి వంటలు చేయాలి అని ఆలోచిస్తున్నారా? పచ్చిబఠానీలను దాదాపు అన్ని కూరల్లోనూ కలిపి వండుకోవచ్చు. బంగాళా దుంప, బఠానీతో పానీ పూరీ స్టఫింగ్‌ను ఇంట్లోనే చేసుకోవచ్చు. ఉదాహరణకు, వంకాయ, బంగాదుంప, క్యారట్, క్యాబేజీ లాంటి వాటితో కలిపి బచ్చి బఠానీని వండుకుంటే, రుచితోపాటు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బఠానీ పులావ్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.పీస్ పులావ్కావలసినవి: బాసుమతి బియ్యం- కప్పు; పచ్చి బఠాణీ-పావు కప్పు; నీరు-3 కప్పులు; బిర్యానీ ఆకు-ఒకటి; ఒక యాలక్కాయ, లవంగం-1; దాల్చిన చెక్క – అర అంగుళం ముక్క; ఉప్పు-పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నిమ్మరసం- అర టీ స్పూన్.పోపు కోసం... నెయ్యి– 2 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి-1 (నిలువుగా చీరాలి); షాజీరా-టీ స్పూన్.తయారీ: ∙బియ్యాన్ని కడిగి పది నిమిషాల సేపు మంచినీటిలో నానబెట్టాలి. బఠాణీలను కడిగి పక్కన పెట్టాలి. ∙నీటిని ఒక పాత్రలో మరిగించాలి. నీరు మరగడం మొదలైన తర్వాత అందులో బఠాణీలు, బియ్యం వేయాలి. బియ్యం ఉడికేటప్పుడే నిమ్మరసం, యాలక్కాయ, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉప్పు వేయాలి. అన్నం ఉడుకుతున్నప్పుడే మరో స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో నెయ్యి వేడి చేసి పచ్చిమిర్చి, షాజీరా వేసి వేగిన తర్వాత ఉడుకుతున్న అన్నంలో వేసి అన్నం మెతుకులు విరగకుండా జాగ్రత్తగా కలిపి మూత పెట్టాలి. మంట తగ్గించి నీరు ఇంకిపోయిన తర్వాత దించేయాలి. పచ్చి బఠానీతో ఆరోగ్య ప్రయోజనాలుబఠానీలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. పిల్లలకు శక్తినిస్తుంది. జీర్ణశక్తికి మంచిది. జింక్, రాగి, మాంగనీస్, ఇనుము లాంటివి లభిస్తాయి. రోగాల బారిన పడకుండా ఉంటారు.ప్రోటీన్‌తో పాటు విటమిన్ కె బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తాయి. పిండానికి తగిన పోషణను కూడా అందిస్తాయి. అలాగే ఇవి రుతుక్రమ సమస్యలలో కూడా ఉపయోగపడతాయి.బఠానీలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండెపోటు, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కూడా అదుపులో ఉంటుంది. రెగ్యులర్‌గా తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ముఖ్యంగా కడుపు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. పచ్చి బఠానీలను తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు, వృద్ధాప్య ప్రభావం త్వరగా కనిపించదు. గమనిక: ఎండు బఠాణీలైతే రాత్రంతా నానబెట్టాలి. ఇవి చదవండి: బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
చిటికెలో హెల్దీగా..చియా కర్డ్ పుడ్డింగ్
చియా గింజలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. అందులో ఒకటి చియా కర్డ్ పుడ్డింగ్. ఇందులో పెరుగు, క్యారెట్, కీరా లాంటి కూరగాయలు జోడించడం వల్ల రుచికీ రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేకాదు ఇది బరువు తగ్గడంలో కూడా సాయపడుతుంది. చియా కర్డ్పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలికావలసినవి: చియా సీడ్స్ (నల్ల గసగసాలు) – 4 టేబుల్ స్పూన్లు (రెండు గంటల సేపు నానబెట్టాలి); క్యారట్ తురుము-పావు కప్పు; బీట్ రూట్ తురుము-పావుకప్పు, కీరకాయ తురుము-పావుకప్పు. పెరుగు – కప్పు; పచ్చిమిర్చి – 2 (నిలువుగా తరగాలి); దానిమ్మగింజలు -పావుకప్పు ఉప్పు రుచిని బట్టి; ఇంగువ – చిటికెడు; తరిగిన కొత్తిమీర – టేబుల్ స్పూన్;పోపు కోసం...: నెయ్యి– టీ స్పూన్; ఎండుమిర్చి– 2; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చి శనగపప్పు – గుప్పెడు; వేరుశనగపప్పు – గుప్పెడు.తయారీ: ఒక పాత్రలో నానబెట్టిన చియా సీడ్స్, పెరుగు, ఉప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, క్యారట్ , బీట్రూట్, కీరకాయ తురుము వేసి బాగా కలపాలి. ∙ఒక బాణలిలో నెయ్యి వేడి చేసి అందులోఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు వేయించి కరివేపాకు వేసి దించేయాలి. ఈ పోపును పెరుగు మిశ్రమంలో కలపాలి. చివరగా దానిమ్మ గింజలు, కొత్తిమీర చల్లి వడ్డించాలి. పోషకాలు: మ్యాక్రో న్యూట్రియెంట్స్: కేలరీలు – 230; ప్రొటీన్ – 8 గ్రాములు;కార్బోహైడ్రేట్లు – 20 గ్రాములు;ఫైబర్– 7 గ్రాములు;చక్కెర – 6 గ్రాములు;ఫ్యాట్ – 12 గ్రాములు;సాచ్యురేటెడ్ ఫ్యాట్ – 3 గ్రాములు;మైక్రో న్యూట్రియెంట్స్: క్యాల్షియమ్– 280 మిల్లీగ్రాములు;ఐరన్– 2.5 మిల్లీగ్రాములు;మెగ్నీషియమ్– 90 మిల్లీగ్రాములు; పొటాషియమ్– 450 మిల్లీగ్రాములు;విటమిన్ సి– 8– 1– మిల్లీగ్రాములు;విటమిన్ ఏ – 350 మైక్రోగ్రాములు;ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు – 3–4 గ్రాములు ఇదీచదవండి : అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుఅలాగే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ చియా కర్డ్ పుడ్డింగ్. అంతేకాదు సులువుగా చేసుకునే అల్పాహారం. స్ట్రాబెర్రీ, దానిమ్మ, యాపిల్, ఇలా పండ్ల ముక్కలను కూడా యాడ్ చేసుకుంటే మరింత ఆరోగ్యకరమైంది కూడా. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుతో నిండిన ఈ పుడ్డింగ్ చాలాసేపు పొట్టనిండుగా, సంతృప్తికరంగా ఉంచుతుంది. చదవండి: లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ : శారీ స్నీకర్స్ -
Kanuma special recipe : చిట్టి గారెలు, నాటు కోడి పులుసు, డెడ్లీ కాంబినేషన్
సంక్రాంతి పండగ అంటేనే పిండివంటలు.భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా నాలుగు రోజులు అనేక రకాల పిండి వంటలు తయారు చేసుకుంటారు. అరిశెలులు, సున్నుండలు, సకినాలు, పొంగడాలు, జంతికలు, తీపి బూంది ఇలా ఆయా ప్రాంతాలను బట్టి వీటికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా పొంగల్, పరమాన్నం, బెల్లం అన్నం ఇలా ఒక్కో చోట ఒక్కో రకం. కానీ కనుమ రోజు అయితే మాంసాహార ప్రియులకు పండగే. మరీ ముఖ్యంగా గారెలు, నాటుకోడి పులుసు మరింత ప్రత్యేకం. మరి క్రిస్పీగా గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం!ప్రాంతం ఏదైనా, పండగ ఏదైనా మినపగారెలు , నాటు కోడి కాంబినేషన్ చాలా ఫ్యామస్. ఈ రెండింటి కాంబినేషన్ రుచితోపాటు, ప్రోటీన్లను కూడా అధికంగా అందిస్తాయి. తయారీముందుగా 2 కప్పుల మినపప్పు, కొంచెం బియ్యం వేసి కనీసం నాలుగైదు గంటల పాటు నానెబట్టుకోవాలి. ఇందులో ఇనుప గరిటె, లేదా అట్ల కాడ వేస్తే తొందరగా నానుతుందని చెబుతారు. పొట్టు పప్పుఅయితే పొట్టు పోయేలా శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు లేకుండా వంపుకోవాలి. దీన్ని మెత్తగా, కొంచెం గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి(రుబ్బుకుంటే ఇంకా బావుంటుంది). ఇందులో పచ్చిమిర్చి,కొత్తిమీర,అల్లం, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు కలిపి బాగా కలుపుకోవాలి.తరువాత స్టవ్‌మీద బాండ్లీ పెట్టుకుని ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి. గారెలు వేసే ముందు నీటితో చేతులను తడి చేసుకుని, అరిటాకుపై చక్కగా గుండ్రంగా అద్దుకోవాలి,మధ్యలో మధ్యలో చిన్న రంధ్రం చేసి వేడి నూనెలో జాగ్రత్తగా వేయాలి. ఆ తర్వాత మీడియం మంటపై గారెలను రెండు వైపులా సమానంగా వేయించుకోవాలి. దీని వల్ల నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. టిష్యూ పేపర్ వేసిన గిన్నెలో వేసుకుంటే అదనపు నూనెను పీల్చేస్తుంది. నాటుకోడి పులుసు తయారీముందుగా నాటు కోడి(మరీ ముదురు కాకుండాస్త్ర మాంసాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, పసుపు వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు,ఎండుమిర్చి, లవంగాలు,యాలకులు, వెల్లుల్లి, జాజికాయ ,స్పూన్ ధనియాలను నూనెలేకుండా మూకుడులో దోరగా వేయించుకిన పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు,ఎండు కొబ్బరి , గసగసాలు,సారపప్పు జీలకర్ర కలిపి మెత్తగా మిక్సీ లో పేస్ట్ చేసుకోవాలి.కుక్కర్లో తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని యించుకోవాలి. వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికాసేపు ఫ్రై చేయాలి. ఇపుడు ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకుని మరికాసేపు వేయించుకోవాలి. ఇందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ పెరుగు వేసి, సన్న మంట మీద మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలాక, మ్యారినేట్ చేసుకున్ననాటుకోడి ముక్కల్ని వేసి కొద్దిగా వేగనివ్వాలి. తరువాతమసాలా పేస్ట్, కొద్దిగా కారం,ఉప్పు కూడావేసి బాగా కలిపి వేగనివ్వాలి. ఉప్పు, కారం టేస్ట్ చెక్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి..అనంతరం కుక్కర్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. మూత వచ్చాక,ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడిని కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా ఉంటే మరికొద్దిసేపు చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. అంతే ఘుమఘుమలాటే, టేస్టీ టేస్టీ నాటుకోటి పులుసురెడీ. ఈ నాటుకోడి పులుసుతో లేదా చికెన్ కూరతో వేడి వేడి గారెలను నంజుకుని తింటే ఆహా ఏమి రుచి అంటారు.ఇదీ కూడా చదవండి: Kanuma Importance: కనుమ పండుగ ఈ విశేషాలు తెలుసా? -
చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ‘సూపర్ పండు’ ఎన్ని లాభాలో!
ప్రకృతి చాలా మహమాన్వితమైంది. సీజన్‌కు తగ్గట్టు మనకు ఎన్నో అద్భుతమైన ఫలాలను అందిస్తుంది. అందుకే ఏ కాలంలో దొరికే పళ్లు, కూరగాయలు ఆకాలంలో విరివిగా తినాలని పెద్దలు చెబుతారు. మరి శీతాకాలంలో మాత్రమే దొరికే ఒక అద్భుతమైన చిట్టి పండు గురించి తెలుసుకుందాం. రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏమిటా పండు? దాని లాభాలేంటి? చూద్దామా. శీతాకాలంలో మాత్రమే దొరికే రేగి పండు(jujube fruit)తీపి పులుపు కలగలిపిన అద్భుతమైన రుచి. చూడ్డానికి చిన్నగా కనిపించినా పోషక విలువలు మాత్రం మెండుగా లభిస్తాయి. అందుకే ఆయుర్వేద చికిత్సలో, ఔషధాల్లో ప్రాముఖ్యత కూడా ఉంది. రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. తలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది.ఈ పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతగానో ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా రేగు పళ్లతో చేసే ఒడియాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్కసారి అలవాటు పడితే తినకుండా ఉండలేం. వీటి రుచి మహాగమ్మత్తుగా ఉంటుంది. రేగి పళ్ళపై ఉప్పు కారం చల్లుకుని తింటారు. ఇంకా వీజామ్లూ, జెల్లీలూ, జ్యూస్, టీ, వినెగర్, క్యాండీలూ లాంటి వాటిని కూడా తయారు చేస్తారు. రేగుపళ్లలో పురుగులు బాగా ఉంటాయి. చూసుకొని తినాలి రేగు పండ్లలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీరం దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. రేగిపండులో ఉన్న పోటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.రక్తహీనతతో బాధపడేవారికి రేగుపళ్లు చాలా మేలు చేస్తాయి. గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే వేవిళ్లు, వాంతుల సమయంలో రేగుపళ్లుతో తయారు చేసిన రేగుపళ్లను కొద్ది కొద్దిగా చప్పరిస్తూ ఉంటే నోటికి పుల్లగా బావుంటుంది. అలాగే వాంతులు కూడా తగ్గే అవకాశాలున్నాయి. అద్బుతమైన ప్రయోజనాలురేగిపండులోని విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ పళ్లలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వైరస్లు, బాక్టీరియా వంటి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తాయి శీతాకాలంలో వచ్చే సీజనల్ జలుబు, దగ్గు వంటి ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సహజసిద్ధమైన చక్కెరలు , బీ విటమిన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.రక్తహీనతను (Anaemia) నివారిస్తుంది. రేగిపండులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా రక్తహీనత తగ్గుతుంది. అనీమియాసమస్యలతో బాధపడేవారు కొన్ని రేగిపండ్లను రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.రేగిపండులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పాడతాయి. ముఖంపై మచ్చలు, ముడతలు , తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి,చర్మానికి మెరుపునిస్తుంది. సౌందర్యం కోసం రేగిపండును ఫేస్ ప్యాక్ లాగా కూడా ఉపయోగిస్తారు.అంతేనా...ఇంకాదీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడితో బాధపడేవాళ్లకి రేగుపండ్లు ఔషధంలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లు తింటే డిప్రెషన్ దూరం అవుతుంది. అలాగే నిద్రలేమి (Insomnia) సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ మతిమరుపూ ఆల్జీమర్స్ రాకుండానూ అడ్డుకుంటుందని ఒక అధ్యయనంలో తేలింది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ (Phytochemicals) వల్ల రక్తంలో ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రేగిపండును (మితం) తీసుకోవచ్చు.రేగిపండులో కూడా క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. కనుక బరువు పెరుగుతామనే బెంగ అవసరం లేదు. పైగా ఇది కడుపుని తేలికగా,తృప్తిగా ఉంచుతుంది. రేగిపండులో కేల్షియం, ఫాస్పరస్, మ్యాగ్నీషియం ఎముకలను బలపరుస్తాయి. ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సమస్యలకు ఉపశమనం పనిచేస్తాయి.రేగిపండులో యాంటీ-క్యాన్సర్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని నియంత్రిస్తాయి . ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ , లివర్ క్యాన్సర్ ముప్పును తగ్గించే అవకాశం ఉంది.ఎవరు తినకూడదుయాంటీ డిప్రెసెంట్ మందులువాడేవారుమూర్చ వ్యాధితో బాధపడుతున్న వారుస్కిన్ అలెర్జీ, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నవారు.ఆస్తమా వ్యాధితోబాధపడుతున్నారు కూడా రేగుపళ్ళను అతిగా తినకూడదు.ఎక్కువగా తింటే విరేచనాలు అయ్యే ప్రమాదముంది గనుక, ఇప్పటికే ఈ సమస్యతో బాధపడేవారు కూడా దూరంగా ఉండాలి. నోట్: ఇది అవగాహన కోసం అందించిన మాత్రమే. ఏదైనా అతిగా తినకూడదు. అతిగా తింటే కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు. గొంతులో కఫం పెరగడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. -
'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ
‘జెరోదా’ సహ వ్యవస్థాపకుడు(Zerodha co-founder) నిఖిల్ కామత్(Nikhil Kamath)కు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తొలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూలో పలు అంశాలపై విస్తారంగా ముచ్చటించారు. ముఖ్యంగా భోజనం విషయంలో తన ఆహార వ్యవహారంకి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్వూలో కామత్ ఇటలీలో జరిగిన G7 సమ్మిట్(G7 Summit) గురించి మాట్లాడుతూ ఇటలీ గురించి మోదీకి బాగా తెలుసనని ప్రజలు అంటున్నారని నవ్వుతూ అన్నారు. ఇంటర్నెట్లలో ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని పేరుతో వచ్చిన మెలోడి మీమ్‌లు గురించి కూడా ప్రస్తావించారు. వాటన్నింటిని తోసిపుచ్చుతూ..తనకు ఇటలీ నుంచి తనకెంతో ఇష్టమైన పిజ్జా వచ్చిందని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఆహారం విషయంలో తాను ఎలా ఉంటాననే దాని గురించి వివరించారు. తాను స్వతాహాగా ఫుడ్డీని కాదన్నారు. ఏదేశంలోనైనా తనకు ఏది వడ్డించినా సంతోషంగా తింటా. ప్రత్యేకంగా ఇది అని నియమం లేదు. అయితే అది శాకాహారమే అయ్యి ఉండాలనేది షరతు. ఇప్పటికీ తనికి రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మెనూ ఇవ్వగానే ఏం తినాలో తెలియదని, అదసలు తనకు అర్థం కాదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో తన తొలినాళ్ల నాటి కథను గుర్తుచేసుకున్నారు. ఆ టైంలో తనకు దివంగత అరుణ్ జైట్లీ తరచుగా తనకు ఆహారం ఆర్డర్ చేయడంలో ఎలా సహాయం చేశారో చెప్పారు. తనకు కూడా ఫుడ్‌ని ఆర్డర్ చేయమని కోరేవాడిని. అయితే అది శాకాహారమే అయ్యి ఉండాలని షరతు విధించేవాడినని నాటి రోజులని గుర్తు చేసుకున్నారు. ఈ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ శ్రోతలకు ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని మరింతగా పరిచయం చేసింది. (చదవండి: నాడు టెక్కీ ఇవాళ లెహంగాల వ్యాపారవేత్త.. ఏడాదికి రూ. 5 కోట్లు.. ) -
గోల్డెన్ గ్లోబ్స్ 2025 వేడుక: 24 క్యారెట్ల బంగారంతో వంటలా..!
82వ గోల్డెన్ గ్లోబ్స్(Golden Globes) ఈ నెల జనవరి 6, 2025న లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్టన్‌లో అట్టహాసంగా జరిగింది. ఇది స్టార్ స్టడ్స్ అవార్డుల ప్రధానోత్సవం. ఏదైన హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (HFPA) గతేడాది సినిమా, టెలివిజన్లలోని ఆయా విభాగాల్లో అత్యుత్తమ విజయాన్ని సాధించిన వారికి అవార్డులు అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లో వడ్డించే విందు కూడా అత్యంత గ్రాండ్‌గానే ఉంటుంది. సాదాసీదా చెఫ్‌లు తయారు చేయరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ మెనూలో ఉండే వెరైటీ వంటకాలెంటో చూద్దామా..!.ఈ వేడుకలో వంటకాలను తయారు చేసేది పాక ప్రపంచంలో ప్రముఖ లెజెండ్ అయిన నోబు మత్సుహిసా(Chef Nobu Matsuhisa). ఆయన సాంప్రదాయ జపనీస్ రుచులకు వివిధ పద్ధతుల మిళితం చేసి అందించడంలో ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో రెస్టారెంట్లో నోబు తన పాక నైపుణ్యాన్ని రుచి చూపించారు ఆహారప్రియులకు. ఇలాటి లగ్జరీయస్ ఈవెంట్‌లోని మెనూ బాధ్యతను చెఫ్ నోబు తీసుకోవడం రెండోసారి. ఇక ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్స్ 2025లోని అతిథులకు చెఫ్ నోబు ..ఎల్లోటైల్ జలపెనో, సిగ్నేచర్ మాట్సుహిసా డ్రెస్సింగ్‌తో సాషిమి సలాడ్, మిసో బ్లాక్ కాడ్, సీవీడ్ టాకోస్ విత్ కేవియర్, సాల్మన్, ట్యూనా, తాయ్ వంటి వాటితో రకరకాల డిష్‌లు తయారు చేశారు. ఈ రుచికరమైన పదార్థాలన్నింటిలో అత్యంత లగ్జరీయస్ రెసిపీ కూడా షేర్ చేసుకున్నారు. ఆ మెనూలో హైలెట్‌గా గోల్డ్ స్టాండర్డ్ రోల్(Gold Standard Roll) నిలిచింది. దీన్ని ఈ గోల్డెన్ గ్లోబ్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారట చెఫ్ నోబు. ఈ అద్భుతమైన రోల్‌ని కింగ్ క్రాబ్, సాల్మన్ ఉపయోగించి తయారు చేశారట. అలాగే 24-క్యారెట్ బంగారు రేకులు(24-karat gold ), కేవియర్తో అలంకరించి సర్వ్ చేశామని తెలిపారు చెఫ్ నోబు. అంతేకాదండోయ్ ఈ వేడుకలో ప్రీమియం షాంపైన్, వైన్‌ను హాయిగా సిప్ చేయొచ్చట. View this post on Instagram A post shared by Golden Globes (@goldenglobes) (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!) -
Sankranti 2025 : భోగి ‘మంట నూనెలు’ పిండి వంటలు ఎలా?
సాక్షి, హైదరాబాద్: వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. ఎంతకూ తగ్గమంటున్నాయి. సంక్రాంతి పండుగ వేళ సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. పిండివంటల నూనెలు మండిపోతున్నాయి. ఇక రోజూ వంటల్లో సరిపడా నూనె వాడేందుకే ఒకటికి, రెండుసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. హైదరాబాద్ నగరంలో రోజుకు వందల టన్నుల వంటనూనెల అమ్మకాలు జరుగుతున్నాయి. గృహ అవసరాలకే కాకుండా హోటల్స్, క్లబ్బులు, బార్లలో అత్యధికంగా వివిధరకాల వంట నూనెలు భారీగా వినియోగిస్తుంటారు. సంక్రాంతి పండుగ రావడంతో నగరంలో వంట నూనెల డిమాండ్ మూడింతలు ఎక్కువైంది. దీంతో నూనె ధరలు ఆమాంతం పెరిగాయి. హోల్‌సెల్ మార్కెట్ అన్ని రకాల నూనెలపై ధర రూ.5 నుంచి రూ.8 పెరిగింది. రిటైల్, బహిరంగ మార్కెట్లో ప్రతి లీటరు నూనెపై రూ.12 నుంచి రూ.15 పెరిగింది. అన్ని రకాల నూనెల ధరలు భగ్గుమంటున్నాయి పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్, వేరుశనగ, రైస్‌బ్రాన్.. ఇలా అన్ని రకాల నూనెల ధరలు భారీగా పెరిగాయి. వంట నూనెలకు సంబంధించి హోల్‌సేల్ ధరలు, రిటైల్ మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం రూ.10 నుంచి రూ.20 వరకు ఉంది. హోల్‌సేల్ మార్కెట్లో పామాయిల్ కిలో ధర రూ.100 నుంచి రూ.105కు చేరింది. రిటైల్ మార్కెట్లో రూ.115కు చేరింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.130 నుంచి రూ.140 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.145–150 పలుకుతోంది. కిలో వేరుశనగ నూనె ధర నెల క్రితం రూ.150 ఉండగా, ఇప్పుడు రూ.165కు పెరిగింది. వీటితోపాటు రైస్‌బ్రాన్ ఆయిల్ ధర రూ.140 నుంచి రూ.150 ఉండగా, ప్రస్తుతం రూ.160 పలుకుతోంది. ఈ స్థాయిలో వంటనూనెల ధరల మంటకు కారణం నూనెలపై దిగుమతి సుంకం పెరగడమేనని వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రానికి దిగుమతయ్యే ముడి ఆయిల్‌పై సుంకాన్ని 5–10 శాతం నుంచి ఏకంగా 45 శాతానికి ప్రభుత్వం పెంచిందని, అందుకే ధరలు మండిపోతున్నాయని పేర్కొన్నారు. వంటనూనెల ధరలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వంటనూనెలపై దిగుమతి సుంకం పెరగడం కొందరు వ్యాపారులకు వరంగా మారింది. పాత స్టాక్‌ను గోడౌన్లలో దాచేసి ధరలు పెంచి అమ్ముతున్నారు.ఇదీ చదవండి: వింటర్ కేర్ : పాదాల పగుళ్లకు స్ప్రే -
'గోంద్ లడ్డు'..పోషకాల గని..!
కావలసినవి: గోంద్ (ఎడిబుల్ గమ్) – ము΄్పావు కప్పు; బాదం పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; పిస్తా – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు; రైజిన్స్ – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము– 2 కప్పులు; బెల్లం పొడి– ఒకటింపావు కప్పు; ఖర్జూరాలు (గింజలు తొలగించినవి) – అర కప్పు; గసగసాలు– 2 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – టేబుల్ స్పూన్. తయారీ: మందపాటి బాణలిలో నెయ్యి వేడి చేసి గోంద్‌ను వేయించాలి. చల్లారిన తర్వాత చిదిమి పొడి చేయాలి లేదా చపాతీలు చేసే పీట మీద వేసి చపాతీల కర్రతో ΄పొడి చేయవచ్చు. చిన్న రోలు ఉంటే అందులో వేసి దంచి పొడి చేసుకోవచ్చు. ఒక బాణలిలో కొబ్బరి తురుము, గసగసాలు, కిస్మిస్, మిగిలిన గింజలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేయిస్తూ, వేయించిన దినుసులన్నింటినీ ఒకే పాత్రలో వేయాలి. అందులో యాలకుల పొడి, ఖర్జూరాలు, గోంద్ పొడి వేసి సమంగా కలిసే వరకు స్పూన్‌తో కలపాలి. మరొక పాత్రలో బెల్లం పొడి వేసి మూడు టేబుల్ స్పూన్ల నీటిని ΄ోసి తీగ పాకం వచ్చేవరకు మరిగించాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి అందులో గోంద్పొడి తోపాటు దినుసులన్నింటినీ కలిపిన మిశ్రమాన్ని వేసి కలపాలి. వేడి తగ్గే వరకు ఆగాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని లడ్డులు చేయాలి. పై కొలతలతో చేస్తే 16 లడ్డులు వస్తాయి. గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి. గమనిక: ఇది గోధుమ జిగురు. మార్కెట్లో గోంద్ కటిరా పేరుతో దొరుకుతుంది. ఒక్కో లడ్డులో పోషకాలు ఇలా ఉంటాయి..కేలరీలు – 120–130; కార్బోహైడ్రేట్లు – 15–18 గ్రాములు; ప్రోటీన్లు – 2–3 గ్రాములు;ఫ్యాట్ – 6–7 గ్రా.; ఫైబర్– 1–2 గ్రాములుప్రయోజనాలు..గోంద్ దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకలను శక్తిమంతం చేస్తుంది. చల్లటి వాతావరణంలో దేహానికి తగినంత వెచ్చదనాన్నిస్తుంది. గింజల నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, దేహానికి అవసరమైన మైక్రో న్యూట్రియెంట్స్ అందుతాయి.బెల్లంలో ఐరన్, జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉంటుంది. కొబ్బరి తురుములో ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉంటుంది. ఖర్జూరాలు, రైజిన్స్లోని యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ఉండటంతోపాటు అవి శక్తినిస్తాయి. (చదవండి: భారతదేశపు తొలి స్టంట్ విమెన్..ధైర్యానికి కేరాఫ్ అడ్రస్..!) -
ఉపాధికి ‘కిక్’ కామర్స్!
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ జోరుతో బ్లూకాలర్ ఉద్యోగాలకు (కార్మికులకు) పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. 2027 నాటికి వివిధ రంగాల్లో 24 లక్షల మంది కార్మికులకు డిమాండ్ ఉంటుందని హైరింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఇండీడ్’ వెల్లడించింది. ఇందులో ఒక్క క్విక్ కామర్స్ రంగమే 5 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్టు పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో క్విక్‌కామర్స్ కంపెనీలు 40,000 మందిని నియమించుకున్నట్టు ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ సతీష్ కుమార్ తెలిపారు. ‘‘ఈ రంగం విస్తరించే కొద్దీ, నైపుణ్య, పాక్షిక నైపుణ్య కార్మికులకు డిమాండ్ వృద్ధి చెందుతూనే ఉంటుంది. వేగవంతమైన, టెక్నాలజీ ఆధారిత ప్రపంచానికి అనుగుణంగా నడుచుకునే నైపుణ్యాల కోసం యాజమాన్యాల అన్వేషణ పెరిగింది’’ అని వివరించారు. బ్లూ కాలర్ ఉద్యోగులు అంటే విద్యతో పెద్దగా అవసరం లేకుండా శారీరక శ్రమతో, నైపుణ్యాలతో పనులు నిర్వహించే వారు. డెలివరీ డ్రైవర్లు, రిటైల్ సిబ్బంది ఈ విభాగం కిందకే వస్తా రు. ఇండీడ్ నిర్వహించిన సర్వేలో వీరికి బేసిక్ వేతనం రూ. 22,600గా ఉన్నట్టు తెలిసింది. పండుగల సీజన్లో క్విక్‌కామర్స్ కంపెనీలు డెలివరీ డ్రైవర్లు, వేర్‌హౌస్ అసోసియేట్ లు, మార్కెటింగ్, ప్రమోషనల్, ప్యాకేజింగ్ సిబ్బంది, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్లను నియమించుకోనున్నట్టు ఇండీడ్ నివేదిక తెలిపింది. దీంతో ఇలాంటి డిమాండ్ సీజన్లలో కార్మికులకు బోనస్‌లు, నగదేతర ప్రయోజనాలు అధికంగా అధించనున్నట్టు వివరించింది. వీరికి డిమాండ్.. : నేవిగేషన్ అండ్ డ్రైవింగ్, డిజిటల్ లిటరసీ, డేటా అనలిటిక్స్, మేనేజ్మెంట్, టెక్ సపోర్ట్ నైపుణ్యాలున్న వారికి ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు ఇండీస్ నివేదిక వెల్లడించింది. ఆటోమేషన్, డిజిటల్ టూల్స్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తెలిపింది. కస్టమర్లు నిమిషాల వ్యవధిలో గ్రోసరీ, నిత్యావసరాలను కోరుకుంటున్నారని.. దీంతో వేగవంతమైన డెలివరీలకు డిమాండ్ పెరుగుతున్నట్టు పేర్కొంది. క్విక్‌కామర్స్ సంస్థల మధ్య పోటీ పెరిగిపోవడంతో అవి మరింత వేగంగా డెలివరీకి, మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఇది ఈ రంగంలో ఉపాధి అవకాశాల విస్తరణకు దారితీస్తోందని వివరించింది. చెన్నై, పుణె, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో బ్లూకాలర్ ఉద్యోగ నియామకాలు చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగినట్టు తెలిపింది. టైర్–2 నగరాలైన చండీగఢ్, అహ్మదాబాద్‌లోనూ ఇదే ధోరణి నెలకొన్నట్టు వివరించింది. -
దొన్నె బిర్యానీ.. ఈ డిష్ వెరీ స్పెషల్
విభిన్న సంస్కృతుల సమ్మేళనం ‘హైదరాబాద్’లో ఒక్కో గల్లీ ఒక్కో ప్రత్యేకత సంతరించుకున్న విషయం విదితమే. ముఖ్యంగా ఆనాటి నుంచి విభిన్న రుచులకు సైతం భాగ్యనగరం కేంద్రంగా కొనసాగుతోంది. స్థానిక ఆహార వంటకాలు మొదలు విదేశాల కాంటినెంటల్ రుచుల వరకు మన నగరం విరాజిల్లోతోంది. ఈ ఆనవాయితీలో భాగంగానే ఈ మధ్య ‘దొన్నె బిర్యానీ’ సైతం నగరానికి చేరుకుంది.విశ్వవ్యాప్తమైన హైదరాబాద్ బిర్యానీ గురించి అందరికీ తెలుసు.. కానీ.. దొన్నె బిర్యానీ ఏంటనే కదా..?! ఇది కూడా దక్షిణాది ప్రత్యేక వంటకమే. కర్ణాటక, ప్రధానంగా బెంగళూరులో ఈ డిష్ వెరీ స్పెషల్. కొంత కాలంగా దొన్నె బిర్యానీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది. అయితే బెంగళూరులో 90 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న శివాజీ మిలటరీ హోటల్ నగరంలోని మాదాపూర్‌కు విస్తరించింది. ఈ నేపథ్యంలో నగరంలో మరో కొత్త రుచి చేరిపోయిందని ఆహారప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దక్షిణాది రుచులకు ఆదరణ.. బెంగళూరులోని ప్రముఖ శివాజీ మిలిటరీ హోటల్, నోరూరించే మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందింది. వందేళ్ల క్లబ్లో చేరబోతున్న ఈ ప్రముఖ భారతీయ హోటల్ మొదటిసారి మరో నగరంలో ఆవిష్కృతం అవడం, అది కూడా హైదరాబాద్‌ను ఎంచుకోవడంతో ఇక్కడి వైవిధ్యాన్ని మరింత పెంచుతోంది. కన్నడ వంటకాలు నగరంలో ఇది మొదటిసారి ఏమీ కాదు.. ఎస్ఆర్నగర్, మాదాపూర్, గచి్చ»ౌలి వంటి ప్రాంతాల్లో కన్నడ రుచులు ఇప్పటికే లభ్యమవుతున్నా.. పూర్తిస్థాయిలో అక్కడి రుచులకు ఆదరణ లభిస్తోందనడానికి ఇదో నిదర్శనం. దొన్నె బిర్యానీ, మటన్ ఫ్రై వంటి పలు వంటకాలకు ప్రసిద్ధి చెందిన శివాజీ హోటల్ హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో తమ సేవలను విస్తరించింది. 1935 నుంచి దక్షిణాదిలో తన ప్రత్యేకత పెంచుకున్న శివాజీ మిలిటరీ హోటల్ నగరవాసులకూ చేరువైంది. స్పైసీగా ఉండే మన హైదరాబాదీ బిర్యానీకి దొన్నె బిర్యానీ కాస్త బిన్నంగా ఉన్నప్పటికీ.. భౌగోళిక సమ్మేళనంలో భాగంగా ఇప్పటికే తెలుగు వారు సైతం ఈ బిర్యానీని రుచి చూస్తున్నారు. -
మళ్లీ జొమాటో క్విక్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో రెండేళ్ల తదుపరి క్విక్ సర్విసులను తిరిగి ప్రారంభించింది. ఎంపిక చేసిన పట్టణాలలో 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ సేవలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వినియోగదారులకు 2 కిలోమీటర్ల పరిధిలో ఎంపిక చేసిన రెస్టారెంట్ల నుంచి ఫుడ్ అందించనుంది. తద్వారా రేసులోకి వచ్చింది. ప్రత్యర్ధి సంస్థ స్విగ్గీ స్నాక్ పేరుతో 15 నిమిషాల్లోనే ఆహారం, పానీయాలు తదితరాలను అందిస్తోంది. -
సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ : నోరూరించేలా, ఈజీగా ఇలా ట్రై చేయండి!
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ మకర సంక్రాంతిని సంబరంగా జరుపుకుంటాం. ఏడాదిలో తొలి పండుగ కూడా. మరి అలాంటి పండగకి ఘుమఘుమ లాడే పిండి వంటలు లేకపోతే ఎలా? కొత్త అల్లుళ్లు, అత్తారింటి నుంచి ఎంతో ఆశతో పుట్టింటికి వచ్చిన అమ్మాయిలతో సంక్రాంతి అంతా సరదా సరదాగా గడుస్తుంది. ఈ సంబరాల సంక్రాంతికోసం కొన్ని స్పెషల్ స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ పొంగల్, బూందీ లడ్డూని సులభంగా తయారుచేసే రెసిపీ గురించి తెలుసుకుందాం.సంక్రాంతి అనగానే ముందుగానే గుర్తొచ్చే స్వీట్ పొంగల్. కొత్త బియ్యం, నెయ్యి, బెల్లంతో పొంగల్ తయారు చేసిన బంధు మిత్రులకు పంచి పెడతారు.స్వీట్ పొంగల్స్వీట్ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు : బియ్యం - ఒక కప్పు, పెసరపప్పు లేదా శనగపప్పు-అరకప్పు, పాలు - ఒక కప్పు, బెల్లం - అరకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, ఏలకులు - 4, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు కొద్దిగా, నెయ్యి-అరకప్పు.తయారీమొదటపెసరపప్పును నేతిలో దోరగా వేయించుకోవాలి. తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. కుక్కర్లో కడిగిన బియ్యం, వేయించిన పప్పు రెండింటినీ వేసుకోవాలి. అందులో సరిపడా నీరు పోసి మూతపెట్టాలి. మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ మూత వచ్చేదాకా బెల్లాన్ని సన్నగా తరిగిఉంచుకోవాలి. యాలకుల పొడి చేసుకోవాలి. కొబ్బరిని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్షల్ని నేతిలో వేయించుకోవాలి. కుక్కర్ మూత వచ్చాక, ఉడికిన అన్నం, పప్పులో మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఒక కప్పు పాలు, బెల్లం నీళ్లు పోసి బాగా కలపాలి. సన్నని మంటమీద ఉడకనివ్వాలి. ఇందులో తురిమిన పచ్చి కొబ్బరి వేసి కలపి మరో పది నిమిషాలు ఉడికిస్తే చాలు. తరువాత నేతిలో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ స్వీట్ పొంగల్ రెడీ.బూందీ లడ్డు కావలసిన పదార్థాలు: శనగ పిండి - 1 కేజీ, నీరు - తగినంత. నూనె - వేయించడానికి సరిపడాపాకం కోసం: బెల్లం - 1కేజీ,కొద్దిగా నీళ్లు, యాలకుల పొడి - 1 టీస్పూన్, నిమ్మరసం - నాలుగు చుక్కలు, జీడిపప్పు ఎండు ద్రాక్ష, చిటికెడు పచ్చకర్పూరం తయారీ విధానం : ముందుగా శనగపిండిని జల్లించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని జల్లించిన శనగపిండి వేసుకుని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా , మృదువుగా ఉండేలా జారుడుగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి మూకుడు పెట్టి, సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక, బూందీ గరిటె సాయంతో ముందుగానే కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేయాలి. సన్నగా ముత్యాల్లా బూందీ నూనెలో పడుతుంది. పిండిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో బూందీ గరిటెలో వేయకూడదు. ఇలా చేస్తే పిండి ముద్దలు ముద్దలుగా పడుతుంది. కొద్దికొద్దిగా వేసుకుంటూ సన్న మంటమీద బూందీ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మొత్తం బూందీనీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం తయారీఒక కడాయిలో బెల్లం,నీళ్లు పోసి మరిగించాలి. బెల్లం కరిగి కాస్త పాకం వచ్చాక యాలకులు, పచ్చ కర్పూరం వేసి కలపాలి. తీగ పాక వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకుంటే పాకం గట్టిపడకుండా ఉంటుంది. పాకం వచ్చాక జీడిపప్పులు,కిస్మిస్తోపాటు ముందుగా రెడీ చేసుకున్న వేడి వేడి బూందీలను పాకంలో వేసి బాగా కలపండి. కాస్త వేడి వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో గుండ్రంగా ఉండలుగా చేసుకోవాలి. అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్నలాంటి బూందీ లడ్డు రెడీ! -
బీరకాయ కూరను బాలింతలకు ఎందుకు పెడతారో తెలుసా?
బీరకాయ అనగానే ‘అబ్బా.. ఇపుడది తినాలా’ అంటారు పిల్లలు. పెద్దల్ల కూడా చాలామంది బీరకాయ తినడానికి ఇష్టపడరు. కానీ బీరకాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మన పెద్దలనాటి నుంచి అనారోగ్యం నుంచి కోలుకున్న వారికి, బాలింతలకు బీరకాయ ఎక్కువ పెడతారు. దీనికా కారణం ఏమిటంటే.. కోలుకోవడానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. తేలిగ్గా జీర్ణం అవుతుంది కూడా. బీరకాయల్లో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రొటీన్ పవర్‌హౌస్. బీరకాయ. అందుకే ఆయుర్వేద వైద్యంలో ఫంగల్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ, సహా వివిధ పరిస్థితులకు చికిత్సగా చాలా కాలంగా వాడుతున్నారు.బీరకాయలో వాటర్, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ, సీ, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం లభిస్తాయి. ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. బీరకాయలో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నొప్పి, అలసట వంటి లక్షణాలను తగ్గిస్తుంది. దీంతో రక్తహీనత దరి ఉండదు.బీరకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బీరకాయలో సెల్యులోజ్, డైటర్ ఫైబర్ కూడా లభిస్తుంది. బీరకాయను తినడంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. మలబద్దకం దూరం అవుతుంది. శరీరంలోని టాక్సిన్లను బయిటకు పంపించడంలో బీరకాయ సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుద్ది చేస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది.బీరకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు నిజానికి పెప్టిక్ అల్సర్లను ఎదుర్కోవడంలో సహాయ పడతాయి. విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం పోషకాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.బీరకాయ వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇందులోని పొటాషియం, సోడియం, జింక్, రాగి, సెలీనియం శరీరంలోని యాసిడ్స్‌ను నియంత్రిస్తాయి.బీరకాయ రసంతో తయారు చేసిన హోమియోపతిక్ మాత్రలను సైనసైటిస్ లక్షణాల నుండి ఉపశమనం కోసం వాడతారట. బీరకాయలో జింక్, ఐరన్, పొటాషియం విటమిన్లతో పాటు ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి. బీరకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మూత్రంలోని చక్కెర స్థాయిలను సైతం తగ్గించేందుకు సహాయపడుతుంది.బరువు తగ్గడానికి అల్సర్లు , అజీర్ణం చికిత్సకు కూడా సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను పెప్టిక్ అల్సర్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. వాటర్కంటెంట్ ఫైబర్ ఎక్కువ, కొవ్వు తక్కువ కాబట్టి బరువు తగ్గడంలో కూడా గణనీయంగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.బీరకాయను ఎన్ని రకాలుగా వండుకోవచ్చుకంది పప్పుతో కలిపి బీరకాయ పప్పును తయారు చేసుకోవచ్చుపెసరపప్పుతో, శనగపప్పుతో కలిపి పొడి కూరలాగ వండుకోవచ్చుగానుగ నూనెతో చేసిన బీరకాయ కూరను బాలింతకు, పేషెంట్లకు పెట్టవచ్చుబీరకాయ, పాలు కూర వండుకోవచ్చుబీరకాయను పచ్చడిగా చేసుకోవచ్చు.బీరకాయను కూర చేసుకొని, తొక్కలతో పచ్చడి చేసుకోవచ్చు.బీరకాయతో బజ్జీలు కూడా తయారు చేసుకోవచ్చుఅంతేకాదు బీరకాయ, ఎండురొయ్యలతో కూడా రుచికరమైన కూరను వండుకోవచ్చు. -
Sankranti 2025 : సులువుగా చేసుకునే పిండి వంటలు మీకోసమే!
భారతదేశం అంతటా మకర సంక్రాంతిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగువారు ఎంతో పవిత్రంగా భావించే అతి ముఖ్యమైన పండుగ. భోగి, సంక్రాంతి, కనుక, ముక్కనుమ ఇలా ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతి వస్తోందంటే బోలడెన్ని పిండి వంటలు చేయాలి. చుట్టాలు, బంధువులు ముఖ్యంగా కొత్త అల్లుళ్లకి మర్యాదల సందడి ఎక్కువగా ఉంటుంది. మరి సంక్రాంతికి ఈజీగా చేసుకునే కొన్ని వంటకాల్ని చూద్దాం. పూర్ణం బూరెలుకావల్సినవి: పచ్చి శనగపప్పు - 2 కప్పులుమినప్పప్పు - కప్పుకొత్త బియ్యం - 2 కప్పులుబెల్లం తురుము - 2 కప్పులునెయ్యి - అర కప్పునూనె -సరిపడతయారి: మినపప్పు, బియ్యం కడిగి సరిపడా నీళ్లు పోసి కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత జారుగా కాకుండా, మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. శనగపప్పులో తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. చల్లారాక మందపాటి గిన్నెలో ఉడికించిన శనగపప్పుతోపాటు తరిగిన బెల్లం వేసి మళ్లీ ఉడికించాలి. బెల్లం పాకం వచ్చి, ఈ మిశ్రమం ఉండ చేసుకునే విధంగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. చివరగా యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఆ తరువాత కడాయిలో నూనె పోసి బాగా కాగనివ్వాలి. ఇపుడు ముందే చేసిపెట్టిన ఒక్కో ఉండనూ మెత్తగా రుబ్బిన పప్పు మిశ్రమంలో ముంచి జాగ్రత్తగా నూనెలో వేసి, బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. వేడివేడిగా బూరెల్లో నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటాయి. నువ్వుల బొబ్బట్లు, బెల్లంతోకావల్సిన పదార్తాలు : తెల్ల నువ్వులు - 2 కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; యాలకుల పొడి - ఒకటిన్నర టీ స్పూన్; మైదాపిండి- ఒకటిన్నర కప్పులు; నెయ్యి - సరిపడినంతతయారి: మైదాపిండిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి చపాతీ పిండిలాగా మృదువుగా కలుపుకోవాలి. ఆ తరువాత దీనిని కొద్దిసేపు తడిబట్ట కప్పి ఉంచాలి. ఈలోపు బాణలిలో నువ్వులు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. నువ్వులు చల్లారిన తర్వాత బెల్లం తురుము వేసి, రెండూ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రుచికి, సువాసన కోసం యాలకులకు కూడా కలపాలి.ఇపుడు కలిపి ఉంచుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని, చపాలీగా వత్తి అందులో నువ్వుల మిశ్రమం పెట్టి బొబ్బట్టు మాదిరిగా వత్తాలి. దీనిని పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా మాడిపోకుండా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇదీ చదవండి : ఆంధ్ర దంగల్‌కు సై అంటున్న.. తెలంగాణ కోళ్లు! ఇంట్రస్టింగ్ విషయాలు పాకం గారెలుకావల్సినవి: మినప్పప్పు -అర కిలో, బెల్లం అర కిలో, కొద్దిగా నీళ్లు, నూనె - వేయించేందుకు సరిపడా నెయ్యి - 50 గ్రాములు యాలకుల పొడి - 1 టీ స్పూన్ ఉప్పు - రుచికి సరిపడాతయారి: పొట్టు తీసిన మినప్పప్పును ముందురోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లన్నీ వంపేసి, గారె చేయడానికి అనువుగా పిండి గట్టిగా ఉండేలా రుబ్బుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కలుపుకోవాలి.బెల్లం తురుములో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి, అందులో యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి.గారెలు వత్తుకొని, నెయ్యి కలిపిన నూనెలో దోరగా వేయించి, వేడిగా ఉండగానే పాకంలో వేయాలి. వీటిని ఓ పూటంతా కదపకుండా ఉంచితే పాకంలో గారెలు బాగా నాని రుచిగా ఉంటాయి.గోధుమరవ్వ హల్వాకావల్సినవి: చిన్నగోధుమ రవ్వ - 1కప్పుపాలు - 2 కప్పులు; నీళ్లు - 1 కప్పుయాలకుల పొడి - చిటికెడుజీడిపప్పు పలుకులు - 10కిస్మిస్ - 10పంచదార - 2 కప్పులునెయ్యి - 4 పెద్ద చెంచాలుకుంకుమపువ్వు - కొద్దిగాతయారీ: మందపాటి గిన్నెలో నెయ్యి కొద్దిగా వేసి వేడిచేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నెయ్యిలో రవ్వ వేసి దోరగా కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు మరో గిన్నెలో చిక్కని పాలు, నీళ్లు కలిపి బాగా మరిగించాలి. దానిలో గోధుమరవ్వను కొద్ది కొద్దిగా పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉడకనివ్వాలి. రవ్వ బాగా ఉడికాక అందులో పంచదార, నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. పంచదార కరిగి, హల్వా కొద్దిగా దగ్గరకి వచ్చేవరకు కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. దీంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కుంకుమ పువ్వు వేసి మంట తీసేయాలి. ఘుమఘుమలాడే గోధుమరవ్వ హల్వా రెడీ. ఇదీ చదవండి : HMPV : మళ్లీ మాస్క్ వచ్చేసింది.. నిర్లక్ష్యం వద్దు! -
Sankranti 2025 : పర్ఫెక్ట్ కొలతలతో, ఈజీగా అరిసెలు, కజ్జికాయలు
సంక్రాంతి వస్తోందంటే తెలుగు లోగిళ్లలో సంబరాలు మొదలవుతాయి. ఉపాధి కోసం దేశ విదేశాలకు తరలిపోయిన పిల్లలంతా రెక్కలు కట్టుకొని మరీ సొంత ఊరిలో వాలిపోతారు. పిండివంటలు, కొత్తబట్టలు, గొబ్బెమ్మలు.. ఇలా సంకురాత్రి సంబరాలతో పల్లెలన్నీ మురిసి పోతాయి. మరి అరిసెలు లేని సంక్రాంతిని అస్సలు ఊహించగలమా. అందులోనూ ఈ చల్లని వేళ, శ్రేష్టమైన నువ్వులద్దిన అరిసెలు తింటూ ఉంటే... పంటికింద నువ్వులు అలా తగులుతుంటే.. ఆహా అని మైమరిచిపోమూ. ఆరోగ్యం, ఆనందం రెండింటినీ అందించే అరిసెలు, అలాగే అందరికీ ఎంతో ఇష్టమైన, మరో ముఖ్యమైన స్వీట్ కజ్జికాయలను సులువుగా, రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి! నువ్వుల అరిశెలుకావలసినవి: బియ్యం – ఒక కిలో; బెల్లం పొడి – 800 గ్రా.; నువ్వులు, గసగసాలు– కొద్దిగా; నెయ్యి – కేజీతయారీబియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని జల్లించాలి. పిండి గాలికి పొడిబారకుండా ఒకపాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి. ఇప్పుడు పాకం సిద్ధం చేసుకోవాలి. మందపాటి పాత్రలో ఒక గ్లాసు నీరు పోసి బెల్లం పొడి వేసి పాకం వచ్చేదాకా తెడ్డుతో కలుపుతూ మరిగించాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా తెడ్డుతో కలపాలి. బాణలిలో నెయ్యి పోసి కాగనివ్వాలి. పాకంపిండిని పెద్ద నిమ్మకాయంత తీసుకుని గసాలు, నువ్వులలో అద్ది పాలిథిన్ పేపర్ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది కాగిన నెయ్యిలో వేసి దోరగా కాలిన తర్వాత తీసి అరిశెల పీట మీద వేసి అదనంగా ఉన్న నెయ్యి కారిపోయేటట్లు వత్తాలి. గమనిక: అరిశె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండి కలుపుకోవాలి. గట్టిగా ఎక్కువ తీపితో కావాలనుకుంటే ముదురు పాకం పట్టాలి. ఈ అరిశెలు పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. నువ్వుల కజ్జికాయలుకావలసినవి : మైదా లేదా గోధుమ పిండి – కేజి; నువ్వులు – కేజి; బెల్లం పొడి – 800 గ్రా.; ఏలకులు– 10 గ్రా. జీడిపప్పు– వందగ్రాములు; నూనె– కేజీ;ఇదీచదవండి : సోషల్ మీడియా DPDP నిబంధనలు : 18 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిరితయారీ:పిండిని చపాతీలకు కలుపుకున్నట్లుగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. నువ్వులను దోరగా వేయించి చల్లారిన తర్వాత కాస్త పలుకుగా గ్రైండ్ చేయాలి. బెల్లం పొడి, యాలకుల పొడి వేసి అన్నీ సమంగా కలిసే వరకు కలపాలి. గోధుమ పిండిని చిన్న గోళీలుగా చేసుకోవాలి. ఒక్కొక్క గోళీని ప్రెస్సర్‌తో పూరీలా వత్తుకుని దానిని సాంచా (కజ్జికాయ చేసే చెక్క మౌల్డ్) లో పరిచి ఒక స్పూను నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని, ఒక జీడిపప్పును పెట్టి సాంచా మూత వేయాలి. సాంచాలో నుంచి తీసి కజ్జికాయను మరుగుతున్న నూనెలో వేసి దోరగా కాలనివ్వాలి. ఇవి దాదాపుగా ఇరవై రోజుల వరకు తాజాగా ఉంటాయి. -
2024లో వార్తల్లో నిలిచిన 'సూపర్‌ఫుడ్స్' ఏంటో తెలుసా?
2024 ఏడాదికి బైబై చెప్పేసి2025 సంవత్సరానికి ఆహ్వానం పలికాం. అనేక రంగాల్లో ఎన్నో పరిశోధనలు, సరికొత్త అధ్యయనాలకు సాక్ష్యం 2024. ఈ క్రమంలో 2024లో సూపర్ ఫుడ్‌గా వార్తల్లో నిలిచిన ఆహారం గురించి తెలుసుకుందాం. గతంలో లాగానే 2024 కూడాసహజమైన ఆహారాలు , పదార్దాల ఆరోగ్య ప్రయోజనాలపై కొత్త పరిశోధనలకు బలమైన సంవత్సరంగా నిలిచింది వీటిలో కొన్ని శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించ బడుతున్నవే. బరువు తగ్గడం, కణాల మరమ్మత్తు, వాపు లేదా గుండె ఆరోగ్యం తదితర విషయాల్లో 'సూపర్‌ఫుడ్స్' అద్భుత నివారణలు కాకపోవచ్చు. కానీ కొన్ని మాత్రం ఆరోగ్య సంరక్షణ మించి ఉన్నాయని తేలింది. అలాగే చాలా మంచి ఫుడ్ కూడా కొంతమందికి ప్రాణాపాయంగా ఉండవచ్చిన నిపుణులు చెప్పారు.చీజ్‌తో మానసిక ఆరోగ్యం2.3 మిలియన్ల మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనంలో, షాంఘై జియావో టోంగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చీజ్ వినియోగంతో మెరుగైన మానసిక ఆరోగ్యం ముఖ్యంగా వృద్ధుల్లో సామాజిక ఆర్థిక కారకాలతో సంబంధం లేకుండా ఎక్కువ ప్రభావం ఉంటుందని తేలింది. జన్యపరంగా వృద్ధాప్యం సహజమే అయినా, చీజ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ముఖ్యమైన సాంఘికీకరణ వంటి ఇతర కార్యకలాపాలతో ముడిపడి ఉందని పరిశోధన సూచించింది.నట్స్ - మెదడుగింజలు చిత్తవైకల్యం నుండి మెదడును రక్షించడంలో సహాయపడతాయి మెల్బోర్న్లోని మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు 49-ఐటమ్ ఫుడ్-ఫ్రీక్వెన్సీ సర్వేను పూర్తి చేసిన 70 ఏళ్లు పైబడిన 9,916 మంది వ్యక్తుల రికార్డులను పరిశీలించారు. ఇతర కారకాలను పరిశీలించిన తరువాత, తక్కువ నట్స్ తినే వారితో పోలిస్తే,తమ ఆహారంలోరోజుకు ఒకటి లేదా రెండుసార్లు నట్స్‌ను తీసుకునేవారిలో మంచి అభిజ్ఞా పనితీరు శారీరక ఆరోగ్యాన్ని నిలుపుకోవటానికి మంచి అవకాశం ఉందని గుర్తించింది. ఫాక్స్ నట్స్ఫాక్స్ నట్స్ ఆగ్నేయాసియాతోపాటు ఇండియాలో చాలాకాలంగా సంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు. నీటి కలువ కుటుంబానికి చెందిన నీటి మొక్క (యురేల్ ఫెరోక్స్ ఫ్లవర్) గింజలే ఫాక్స్ నట్స్. వీటిల్లోని యాంటీ ఏజింగ్ లక్షణాలు ఈ ఏడాది పరిశోధకులకు ప్రత్యేక ఆసక్తిని కలిగించాయి. 2012, 2018, 2020లో అధ్యయనాలతో పాటు, ఇటీవల 2023లోని యాంటీఆక్సిడెంట్ల అధ్యయనాలను సమీక్షించారు. తద్వారా ఇవి కణాల ఆరోగ్యానికి, వాపును ఎదుర్కోవడానికి ముఖ్యమైన సమ్మేళనాలు అని గమనించారు. అంతేకాదు ప్రోటీన్- స్టార్చ్-రిచ్ సీడ్స్ పాప్‌కార్న్ లాగా చేసుకోవచ్చు. ఇవి ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ నివారణలో బాగా ఉపయోగడతాయని గుర్తించారు.గాలి నుండి తయారైసూపర్ ప్రోటీన్సొలీన్ ప్రొటీన్ ఉత్పత్తికి ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య-స్థాయిఫ్యాక్టరీ ఫిన్లాండ్లో ఏర్పాటైంది 2024లోనే. సోలిన్ ప్రొటీన్ (సోలెంట్ గ్రీన్ కాదు) శక్తి కోసం హైడ్రోజన్‌ను ఆక్సీకరణం చేసే రహస్య సింగిల్-సెల్ మట్టిలో ఉండే సూక్ష్మజీవి ద్వారా తయారు చేస్తారు. సోలిన్ అని పిలువబడే పొడి లాంటి పదార్ధంలో 65-70% ప్రోటీన్, 5-8% కొవ్వు, 10-15% డైటరీ ఫైబర్స్ , 3-5% ఖనిజ పోషకాలు ఉంటాయి కేవల ఐదో వంతు కర్బన ఉద్గారాలతో, 100 రెట్లు తక్కువ నీరు, 20 శాతం కంటే తక్కువ మొక్క ప్రోటీన్ ఉత్పత్తి. డయాబెటిస్‌కు డార్క్ చాక్లెట్డార్క్ చాక్లెట్ ఆరోగ్య ప్రయోజనాలపై పరిశోధనా ప్రపంచంలో చర్చనీయాంశంగా ఉన్నాయి. కానీ ఈ ఏడాది హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వారానికి ఐదు సార్లు డార్క్ చాక్లెట్ వల్ల మంచిదని తేల్చారు. దీని వల్ల బరువు పెరగకుండానే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 21శాతం తగ్గుతుందని కనుగొన్నారు. అధిక-ఫ్లావనాల్ కోకో ఉత్పత్తులు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఇది ఇతర రకాల చాక్లెట్లలో కనిపించదు. ఫ్లేవనోల్స్, పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు మెరుగైన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చి, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అంచనా.తేనె- ప్రొబయాటిక్స్ఇల్లినాయిస్ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ పరిశోధకులు పెరుగులో ఒక టేబుల్ స్పూన్ తేనెను జోడించడం వల్ల జీర్ణకోశంలో ప్రోబయోటిక్ మనుగడను పెంచుతుందనికనుగొన్నారు. జీర్ణక్రియను పెంచడంలో సహాయ పడుతుంది. ముఖ్యంగా క్లోవర్ తేనె - మంచి బ్యాక్టీరియాను రక్షిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఎగువ జీర్ణశయాంతర ప్రేగుల ద్వారా గట్ మైక్రోబయోమ్‌కు ప్రయాణిస్తుంది, అక్కడ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.అలర్జీ నివారణలో స్ట్రాబెర్రీటోక్యో యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, స్ట్రాబెర్రీ అలర్జీల నివారణలో సాయపడతాయి. ఫ్లేవనాయిడ్ కెంప్ఫెరోల్ రోగనిరోధక వ్యవస్థపై దాని ప్రభావం ద్వారా ఆహార అలెర్జీలతో సహా,ఇతర శరీరం అలెర్జీలను ఇవి తగ్గిస్తాయి. కెంప్ఫెరోల్ టీ, బీన్స్, బ్రోకలీ, యాపిల్స్, స్ట్రాబెర్రీలలో పుష్కలంగా ఉంటుంది. ఈ నిర్దిష్ట ఫ్లేవనాయిడ్ మైక్రోబయోలాజికల్ యాంటీగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
హెల్దీ డైట్ : మిక్స్డ్ చుడువా : ఇలా ట్రై చేయండి!
బరువు తగ్గాలనుకునేవారికి, ఈజీగా ఏదైన స్నాక్ చేయానుకునేవారికి బెస్ట్ ఆప్షన్ మిక్స్డ్ చుడువా. ఒకసారి చేసుకుని నిల్వ ఉంచుకుని కూడా వినియోగించుకోచ్చు. మరి అలాంటి హెల్దీ అంట్ టేస్టీ మిక్స్డ్ చుడువాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి! కావలసినవి: మఖానా– కప్పు; జీడిపప్పు– కప్పు; బాదం పలుకులు– కప్పు అటుకులు – కప్పు; కిస్మిస్– కప్పు; ఎండు కొబ్బరి పలుకులు– కప్పు; వేరుశనగపప్పు– కప్పు; గుమ్మడి గింజలు – అర కప్పు; కరివేపాకు– 2 రెమ్మలు; నల్ల ఉప్పు – చిటికెడు; ఉప్పు– అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; జీలకర్ర పొడి– టేబుల్ స్పూన్; ఆమ్చూర్ పౌడర్– అర టీ స్పూన్; చక్కెర పొడి– టేబుల్ స్పూన్; నూనె– 2 టీ స్పూన్లు. తయారీ:మఖానీ, జీడిపప్పు, బాదం, వేరుశనగపప్పు, గుమ్మడి గింజలను విడివిడిగా నూనె లేకుండా మందపాటి బాణలిలో దోరగా వేయించాలి. బాణలిలో నూనె వేడి చేసి ఎండుకొబ్బరి, అటుకులను వేయించాలి. అవి వేగిన తరవాత అందులో కరివేపాకు, ఉప్పు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ కిస్మిస్, చక్కెర పొడి వేసి కలపాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న గింజలన్నింటినీ వేసి సమంగా కలిసే వరకు కలపాలి. పోషకాలు: వందగ్రాముల మిశ్రమంలో... ∙కేలరీలు– 480 ప్రొఒటీన్– 10 గ్రాములు ∙కార్బొహైడ్రేట్లు – 35 గ్రాములు ∙ఫ్యాట్ – 35 గ్రాములు ∙ఫైబర్ – 6 గ్రాములు ∙ఐరన్ – 2.5 గ్రాములు ∙క్యాల్షియమ్ – 50మిల్లీగ్రాములు ∙విటమిన్ ఈ– 3 మిల్లీగ్రాములు మఖానాలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. గుమ్మడి గింజల్లో జింక్, మెగ్నీషియం ఉంటాయి. నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఈ, బీ6 వంటి విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ దేహక్రియలను మెరుగుపరచడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.డాక్టర్ కరుణన్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
Manmohan Singh: స్వతహాగా శాకాహారి కానీ ఆ ఫేమస్ రెసిపీ కోసం..!
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో యావత్తు దేశం దిగ్బ్రాంతికి లోనైంది. ఆర్థిక వేత్తగా, ప్రధానిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, సేవలను గుర్తించేసుకుంటూ..ప్రముఖలు, రాజకీయనేతలు నివాళులర్పించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా చేసిన తొలి సిక్కుగా ఘనత దక్కించుకున్నా మన్మోహన్ వ్యక్తిగత అలవాట్లు గురించి పెద్దగా ఎవ్వరికి తెలియవు. ఎందుకంటే మితభాషిగా ఉండే ఆయన వ్యవహారశైలినే కారణమని చెప్పొచ్చు. అయితే విదేశాలకు వెళ్లినప్పుడూ..అక్కడ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో తాను ఇష్టపడే వంటకాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అవేంటో చూద్దామా.ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతావనిగా రూపు ఇచ్చి.. యావత్ ప్రపంచం మనవైపు చూసేలా చేసిన దార్శనికుడు. పాలన, దౌత్యపరంగా ఆయన చేసిన కృషి అసామాన్యమైనది. రాజీయ చతురత, వినయపూర్వకమైన ప్రవర్తనకు తగ్గటుగానే ఆయన అభిరుచులు ఉండేవని చెప్పొచ్చు. ప్రత్యేకించి ఆయన ఆహారపు అలవాట్లు ఓ సాధారణ వ్యక్తి ఇష్టపడేవే. ఎందుకంటే ఆయన అమితంగా ఇష్టపడేది పెరుగు అన్నమే. దానిమ్మ, ఊరగాయలు అంటే మహా ఇష్టం. ఉత్తర భారతదేశంలో కధీ చావల్గా పిలిచే పెరుగన్నం(Curd Rice) మన్మోహన్ మెచ్చే వంటకమని చెబుతుంటారు సన్నిహితులు. ఇది శరీరానికి చలువ చేస్తుంది, పైగా మనసును ప్రశాంతంగా ఉంచే రెసిపీ అని అంటుంటారట మన్మోహన్. అయితే మధుమేహం(Diabetes) కారణంగా స్వీట్స్‌కి దూరంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చేవారట. చెప్పాలంటే ఇక్కడ మన్మోహన్ పూర్తి శాకాహారి(Vegetarian). అయితే బంగ్లాదేశ్ పర్యటనలో ఆ శాకాహార నియమాన్ని ఉల్లంఘించే గమ్మతైన ఘటన జరిగిందంటే. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పేరుగాంచిన డిష్ బెంగాలీ హిల్సా ఫిష్ కర్రీ. ఈ రెసిపీలో చేపకు ఆవపిండిని పట్టించి అరటి ఆకుల్లో ప్యాక్ చేసి ఆవిరిపై వండుతారట. ఈ వంటకం రుచి గురించి తెలుసుకుని మరీ తెప్పించుకుని ఆస్వాదించారట మన్మోహన్. పైగా దీని రుచికి ఫిదా అయ్యి శాకాహార నియమాన్ని ఉల్లంఘించక తప్పలేదని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారట. ప్రస్తుతం ఆయన మన మధ్యలేకపోయినా..ఆయన విశిష్ట వ్యక్తిత్వం, ఆదర్శవంతమైన జీవితం తాలుకా జ్ఞాపకాలు సదా నిలిచే ఉంటాయి. (చదవండి: మన్మోహన్ సింగ్ ఆ డ్రైస్సింగ్ స్టైల్‌నే ఎంచుకోవడానికి రీజన్ ఇదే..!) -
New Year 2025 : ఒక్కో హోటల్ ఒక్కో తీరు..ఆహా.. ఏమి రుచి!
సాక్షి, సిటీబ్యూరో: వచ్చేది ఏడాది ముగింపు సెలబ్రేషన్స్.. ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి పండగ.. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు వివిధ హోటల్ యాజమాన్యాలు ప్రత్యేక రుచులను సిద్ధం చేస్తున్నాయి. సాధారణ రెసిపీలకు భిన్నంగా సంప్రదాయ, గ్రామీణ, స్థానిక, అంతర్జాతీయ వంటకాలను మరోమారు పరిచయం చేస్తున్నాయి. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ఆహారం వేగంగా తినడం, పానీయాలు త్వరగా తాగడం, ఇతర వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నాయి. ఈ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి జ్ఞాపకాలను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం. ఒక్కో హోటల్లో ఒక్కో రకం.. మినీ భారత దేశంగా ఖ్యాతిగాంచిన భాగ్యనగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 1.5 కోట్ల మంది జనాభా నివాసం ఉంటున్నారు. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా విభిన్నమైన ఆహారపు అలవాట్లు వారి సొంతం. ఒక్కో ప్రాంతంలో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఒక్కో విధంగా ఉంటాయి. దీనికి అనుగుణంగానే నగరంలోని పలు హోటల్స్ సైతం ప్రాంతీయ అభిరుచులకు తగ్గట్లుగా ప్రత్యేకించి చెఫ్‌లను తెప్పించి వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో హోటల్లో ఒక్కో రకమైన మెనూ ప్రత్యక్షం అవుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకించి బర్గర్ ఈటింగ్, పానీపూరీ, జూస్ స్పీడ్ డ్రింకింగ్ వంటి పోటీలను నిర్వహిస్తున్నారు. -
చిట్టి లవంగం : గట్టి లాభాలు, బరువు కూడా తగ్గొచ్చు!
లవంగం అనగానేపురాతన కాలం నుంచి వంటలలో వాడే మసాలాగా మాత్రమే గుర్తొస్తుంది. అలాగే పంటినొప్పులకు వాడే లవంగ తైలం గురొస్తుంది. వాస్తవానికి మసాలా దినుసు లవంగాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఔషధ గుణాలున్న లవంగ మొగ్గను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చలి విపరీతంగా ఉన్న ప్రస్తుతం తరుణంలో లవంగాలు చాలా కీలకంగా పనిచేస్తాయి.ఆహారానికి మంచి రుచి, వాసన ఇచ్చే లవంగాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలో వచ్చే అనేక రోగాల బారి నుండి కాపాడుకునేందుకు లవంగాలు ఉపయోపడతాయి. ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తాయి. లవంగాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. రోజుకి రెండు లవంగాలను నమలడం వల్ల బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు.ప్రధాన ప్రయోజనాలు లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువముఖ్యమైన పోషకాలూ లభిస్తాయికడుపులోని అల్సర్లను తగ్గిస్తుంది.కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.చెడు బ్యాక్టీరియాను మన దరి చేరకుండా కాపాడుతుంది.రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.శీతాకాలంలో లవంగాలలో ఉండే విటమిన్ ‘సి’ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను లవంగం దూరం చేస్తుంది. శీతాకాలంలో లవంగాల తయారు చేసిన టీ తాగితే జలుబు, గొంతునొప్పి, శ్వాసకోస సమస్యలు, దగ్గ లాంటివాటికి ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు దరి చేర నీయవు. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు పొడిదగ్గు, కఫంతో బాధపడే వారికి చాలామంచిది. కఫం సమస్య బాగా తగ్గుతుంది. ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మం మృదువుగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.లవంగాలలో యుజైనాల్ అనే మూలకం యాంటీసెప్టిక్ లా పనిచేస్తుంది. పళ్ళ చిగుళ్ళను కాపాడుతుంది, పంటి సమస్యల నివారణలో పనిచేస్తుంది. లవంగాలను నమలడం వల్ల పంటినొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది.ఇతర నొప్పుల నివారణలో కూడా ఇది మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్‌గా లవంగాలను వాడడం వల్ల ఉపశమనం కలుగుతుంది. లవంగాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా టైప్ 2 మధుమేహాన్ని తగ్గిస్తుంది.చర్మ దురదలను తగ్గించడంలో పెట్రోలియం జెల్లీ, ప్లేసిబో కంటే లవంగం నూనె బాగా పనిచేస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. ఇదీ చదవండి: భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్ -
టీ లవర్స్ : టీ మంచిదా? కాదా? ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్ ఇదిగో!
ఉదయం నిద్రలేచింది మొదలు గొంతులో రాత్రి పడుకునేదాకా కాసిన్ని ‘టీ’ నీళ్లు పడితే తప్ప ఏ పనీ జరగదు చాలామందికి. బ్లాక్‌టీ, హెర్బల్ టీ, మసాలా టీ, లెమన్ టీ, హనీ టీ..ఇలా ఏదో ఒక‘టీ’ పడాల్సిందే. తాజాగా టీకు సంబంధించిన ఒక మంచి వార్త ముఖ్యమైన ఆరోగ్య నియంత్రణ ఏజెన్సీ అందించింది . అదేంటంటే..టీ ఆరోగ్యకరమైనదే అని యూఎస్ ఎఫ్‌డీఏ టీకి సర్టిఫికెట్ ఇచ్చింది. టీ హెల్దీ డ్రింకా కాదా అనే అంశంపై తన తుది నిర్ణయాన్ని డిసెంబరు 19న ప్రకటించింది.ఈ నిర్ణయం టీ ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి ప్రపంచ టీ పరిశ్రమ వాదనలను ధృవీకరిస్తుందంటూ ఆనందం వెల్లువెత్తింది.అయితే ఇది కామెల్లియా సినెన్సిస్ (తేయాకు) నుండి తీసుకోబడిన టీకి మాత్రమే వర్తిస్తుందని ఎఫ్‌డీఐ స్పష్టం చేసింది. ఐదు కేలరీల కంటే తక్కువ ఉన్న నీరు, టీ , కాఫీ వంటి పానీయాలు మాత్రం "ఆరోగ్యకరమైన" హోదాకు అర్హత పొందుతాయని ఎఫ్‌డీఏ పేర్కొంది. అయితే, చామోమిలే, పిప్పరమెంటు, అల్లం, లావెండర్, మందార, శంఖంపువ్వు (అపరాజిsత) లేదా మసాలా టీతో సహా ఇతర హెర్బల్ టీలకు "ఆరోగ్యకరమైన" ఈ గుర్తింపు వర్తించదని ఏజెన్సీ స్పష్టం చేసింది. కామెల్లియా సైనెన్సిస్ను కొన్ని క్యాన్సర్ సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలకు ముందస్తు పరిశోధనలను కూడా ఎఫ్‌డీఏ అంగీకరించింది.నార్త్ ఈస్టర్న్ టీ అసోసియేషన్ (NETA), ఇండియన్ టీ అసోసియేషన్ (ITA) U.S. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కూడా కామెల్లియా సినెన్సిస్ టీని ఆరోగ్యకరమైన పానీయంగా గుర్తించడాన్ని స్వాగతించాయి. దేశంలోని అతిపురాతన టీ ఉత్పత్తిదారుల సంస్థ ఇండియన్ టీ అసోసియేషన్ (ITA), ఇది ల్యాండ్‌మార్క్ నిర్ణయంగా అభివర్ణించింది. అటు ప్రపంచ తేయాకు పరిశ్రమకు ఇది "అద్భుతమైన వార్త" అంటూ అమెరికా టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటర్ ఎఫ్. గోగీ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే టీ బోర్డ్ ఆఫ్ ఇండియా మాజీ వైస్ చైర్మన్ బిద్యానంద బోర్కకోటి కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఏ గుర్తింపు, టీ ఆరోగ్య ప్రయోజనాల నేపథ్యంలో టీని ఒక వెల్నెస్ ,జీవనశైలి పానీయంగా ప్రచారం చేయాలని తాము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: మోతీ షాహీ మహల్ : ఐరన్ మ్యాన్ మెమోరియల్ -
భాగ్యనగర్.. బిస్కెట్ కా ఘర్..
హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ.. అంటే హైదరాబాద్.. ఈ రెండింటికీ మధ్య విడదీయరాని బంధం అలాంటిది. ఈ విషయం భాగ్యనగర వాసులతోపాటు ప్రపంచమంతా తెలిసిందే.. ఎందుకంటే దశాబ్దాల తరబడి బిర్యానీకి హైదరాబాద్ నగరం కేరాఫ్ అన్నట్టుగా మారింది. అయితే మన చవులూరించే చరిత్ర కేవలం బిర్యానీ మాత్రమే కాదు.. దీంతోపాటు పలు రకాల బిస్కెట్లకు కూడా గుర్తింపు ఉందని అంటున్నారు నగరానికి చెందిన బేకరీ నిర్వాహకులు. ఈ బిస్కెట్స్‌లో ఇరానీ చాయ్‌తో జోడీ కట్టేవి కొన్నయితే.. క్రిస్మస్ లాంటి పండుగల సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్ ప్యాకెట్స్గా మారేవి మరికొన్ని. అలాంటి కొన్నింటిపైనే ఈ కథనం.. నాటి నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాస్త సాల్ట్, కాస్త స్వీట్ కలగలిసిన రుచికరమైన ఈవెనింగ్ స్నాక్స్ కోసం చేసిన అన్వేషణే ఉస్మానియా బిస్కెట్‌కి ఊపిరిపోసిందని చరిత్ర చెబుతోంది. ఆయనే నిర్మించిన ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు అల్పాహారంగా కూడా ఇది వినియోగించారని చరిత్రకారులు చెబుతుంటారు. దేశంలోనే రాజ ప్రాసాదం నుంచి వచి్చన రాయల్ గుర్తింపు కలిగిన తొలి బిస్కెట్‌గా దీన్ని చెప్పొచ్చు. వెన్న, పంచదార, కస్టర్డ్ పౌడర్, సోడా, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, పాల మేళవింపుతో ఈ బిస్కెట్ అప్పుడు రోగుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తయారైందట. తొలి రాయల్ బిస్కెట్.. కాగా ఈ రాయల్ బిస్కెట్‌ని నగర మార్కెట్‌కి పరిచయం చేసింది మాత్రం సుభాన్ బేకరీ. ఉస్మానియా బిస్కెట్ పేరుతో మార్కెట్లోకి విడుదలైన ఈ బిస్కెట్‌ను ఒక కప్పు ఇరానీ చాయ్‌తో ఆస్వాదించడం అప్పుడు.. ఇప్పుడూ.. ఎప్పుడూ హైదరాబాదీలకు నిత్యకృత్యం. హిస్టారికల్ టూటీ ఫ్రూటీ.. పురాతన హైదరాబాదీ బిస్కెట్‌గా గుర్తింపు పొందిన మరొకటి ఫ్రూట్ బిస్కెట్. ఇది రోజువారీ వినియోగం కన్నా.. ఇచ్చి పుచ్చుకునే బహుమతిగా టూటీ ఫ్రూటీ ప్యాక్ బాగా పేరొందింది. నగరవాసులు విదేశీ పర్యటనకు వెళ్లడానికి ముందుగా కరాచీ బేకరీ నుంచి పుట్టిన ఫ్రూట్ బిస్కెట్‌ను ప్యాక్ చేయించుకోవడం చాలా మందికి అలవాటు.వెనీలా రుచుల చంద్రవంక.. చంద్రవంక ఆకారంతో ఉంటుంది కాబట్టి ఈ బిస్కెట్‌కి ఆ పేరు పెట్టారు. ఇది తేలికపాటి తీపితో మధ్యకు విరిగిన ఆకృతి కలిగి ఉంటుంది. ఈ బిస్కెట్లను తరచూ వెనిలా లేదా పాలతో బేక్ చేసి, వాటికి సున్నితమైన, లలితంగా ఉండే రుచిని అందజేస్తారు. వీటినే టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ అని కూడా అంటారు. వీటి ధరలు సుమారు కిలో రూ.400 నుంచి రూ.500 మధ్యలో ఉన్నాయి. చాయ్‌తో.. ఫైన్ బిస్కెట్.. నగరంలోని బేకరీలలో దీర్ఘకాల వారసత్వం కలిగిన మరొక హైదరాబాదీ ట్రీట్‌గా దీన్ని చెప్పొచ్చు. దీనిని పలుచని పొరలుగా వేయడం అనేది కొంత శ్రమతో కూడిన ప్రక్రియగా తయారీదారులు చెబుతారు. ఈ బిస్కట్లో పంచదార పాకం, కొద్దిగా మంచిగా పెళుసైన క్రస్ట్ ఉంటుంది. ఇది ఇరానీ చాయ్‌తో మరో చక్కని కాంబినేషన్. చాయ్‌లో ముంచినప్పుడు మెత్తగా మారి దానికి సరికొత్త తీపిని జోడిస్తుంది. ఇది కిలో రూ.300 నుంచి ఆపైన అందుబాటులో ఉన్నాయి. రుచికి దాసోహం ‘కారా’.. ఇది నగర టీ సంస్కృతి ప్రత్యేకతకు దోహదం చేసే మరో రుచికరమైన బిస్కెట్ ఖారా.æ వీటిని పిండి, వెన్నతో పాటు మరికొన్ని సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేస్తారు. తరచుగా జీలకర్ర లేదా నువ్వులు కూడా ఈ మేళవింపులో చోటు చేసుకుంటాయి. ఇవి చాయ్ రుచికి మసాలాని జోడించి వైవిధ్యభరితమైన ఆస్వాదనను అందిస్తాయి. ఇది కిలో రూ.350 నుంచి రూ.400 మధ్య అందుబాటులో లభిస్తుంది.ఛాయ్ అండ్ ‘టై’.. సూపర్ భాయ్.. ప్రత్యేకమైన విల్లు–టై ఆకృతి ద్వారా ప్రసిద్ధి చెందిన ఈ బిస్కెట్లు కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవి ఒక కప్పు ఇరానీ చాయ్‌కి అద్భుతమైన కాంబినేషన్‌గా చెప్పొచ్చు. వీటి తేలికైన, పొరలతో కూడిన రుచి తియ్యటి బిస్కెట్ల నుంచి వేరు చేస్తుంది. కిలో రూ.300 నుంచి రూ.350 వరకూ ఉంటుంది.బిస్కెట్ల చరిత్ర అ‘పూర్వం’.. బిర్యానీ కన్నా అతి పురాతన చరిత్ర కలిగిన బిస్కెట్లు మన నగరానికి ఉన్నాయి. అయితే చాలా మందికి వాటి విశేషాలు తెలియవు. బిస్కెట్స్‌లో మేం పరిచయం చేసిన ఉస్మానియా బిస్కెట్ విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంది. చాంద్ బిస్కెట్, టై బిస్కెట్ వంటివి ఇప్పటికీ పలువురు రాజకీయ ప్రముఖులు సైతం రెగ్యులర్‌గా ఆర్డర్ చేస్తుంటారు. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఛాయ్‌కి డిమాండ్ ఎక్కువ.. దీంతో పాటే ఖారా వంటి బిస్కెట్స్‌కి డిమాండ్ పెరుగుతుంది. – సయ్యద్ ఇర్ఫాన్, సుభాన్ బేకరీ టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే.. ఈ బిస్కెట్ల ఒరిజినల్ టేస్ట్‌ని ఎంజాయ్ చేయాలంటే కొంత ఎంక్వయిరీ చేసుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే.. కొన్ని పాత బేకరీలు మాత్రమే వాటిని పాత పద్ధతిలో తయారు చేస్తున్నాయి. ‘1951లో మా తాత మొహమ్మద్ యాసీన్ ఖాన్ బేకరీని ప్రారంభించినప్పుడు, జనాదరణ పరంగా అగ్రస్థానంలో ఉస్మానియా బిస్కెట్ ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఖారా బిస్కెట్, చాంద్ బిస్కెట్, ఫైన్ బిస్కెట్, టై బిస్కెట్ ఉండేవి. ఇవి అప్పట్లో ఎంతగా ప్రాచుర్యం పొందాయంటే, అవి లేకుండా అల్పాహారం, టీ సమయం మాత్రమే కాదు, పెళ్లి విందులు సైతం ఉండేవి కావు. ఇప్పటికీ వీటిని రెగ్యులర్‌గా వినియోగించేవాళ్ల వల్ల తగినంత డిమాండ్ ఉంది’ అని రోజ్ బేకరీ యజమాని ముజాఫర్ ఖాన్ అంటున్నారు. కాగా సోషల్ మీడియా ట్రెండ్స్‌తో మమేకమవుతున్న నేటి యువతకు హైదరాబాద్ సంప్రదాయ బిస్కెట్ల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు నగరంలోని పలువురు బేకరీల నిర్వాహకులు. -
శీతాకాలంలో ఈ సూపర్ ఫుడ్‌తో అనేక సమస్యలకు చెక్
చలి కాలంలో శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. అందుకే ఈ సీజన్‌కు తగినట్టుగా మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి. చలికాలంలో బాడీని వేడిగా ఉంచుకోవడంతోపాటు, కొవ్వులేని ఆహార పదార్థాలను తీసుకోవాలి. వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించే చియా గింజలను వింటర్ సూపర్ ఫుడ్‌గా చెబుతారు ఆహార నిపుణులు. వీటిల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA)లో పుష్కలంగా లభిస్తాయంటున్నారు నిపుణులు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె, మెదడు పనితీరును మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు , మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని పలు రకాలుగా మన ఆహారంలో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా చియా వాటర్, స్మూతీస్, యోగర్ట్స్, లలాడ్స్, పుడ్డింగ్ రూపంలో తీసుకోవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి, మంటను తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.చియా గింజల్లో ఎక్కువగా లభించే డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మంచి శక్తి నిస్తుంది.యాంటీఆక్సిడెంట్లతో నిండిన చియా విత్తనాలు పర్యావరణ కారకాలు, కాలానుగుణ హెచ్చుతగ్గుల వల్ల కలిగే సమస్యల్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలనుంచి ఉపశమనానికి తోడ్పడతాయి.అలాగే చలికాలంలో నీళ్లు ఎక్కువగా తాగుతాం కాబట్టి చియా గింజల వాటర్ తీసుకోవడం మంచిది. చియా విత్తనాలు హైడ్రోఫిలిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఫలితంగా శీతాకాలంలో శరీరంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. చియా విత్తనాలు చర్మం తేమను కోల్పోకుండా కాపాడుతాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి.హెర్బల్ టీ లేదా హాట్ చాక్లెట్ వంటి వేడి పానీయాలకు చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు.ఒక గ్లాస్ నీటిలో, కొద్దిగా చియా గింజలు వేసి, రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం పరగడుపునే తాగితే, రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. పీచు పదార్థం పుష్కలంగా అందుతుంది. తద్వారా జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్ధకం నుంచీ ఉపశమనం లభిస్తుంది.చియా గింజల్లో యాంటి ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సాయపడతాయి. ఇందులోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కేన్సర్ లక్షణాలను తగ్గిస్తాయి. చియా పుడ్డింగ్: పాలలో (బాదం లేదా కొబ్బరి పాలతో కూడా) చియా గింజలను నానబెట్టి రాత్రంతా రిఫ్రిజిరేటర్లో ఉంచి, నచ్చిన మరికొన్ని పండ్ల ముక్కలను కలుపుకొని చియా సీడ్ పుడ్డింగ్‌ను చేసుకోవచ్చు. సౌందర్య పోషణలోనూ, జుట్టు సంరక్షణలో కూడా చియా గింజలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. -
యునెస్కో సాంస్కృతిక ఫుడ్స్ 2024
యునెస్కో ప్రతి యేటా వివిధ దేశాల సాంస్కృతిక వారసత్వాలను, అక్కడి కళారూ΄ాలను గుర్తించి మనముందుకు తీసుకువస్తుంది. ఈ యేడాది అత్యంత ప్రాచీనమైన వివిధ రుచికరమైన వంటకాల జాబితాను తీసుకొచ్చింది. వాటిలో...అరబిక్ కాఫీఅరబ్ ప్రపంచంలో కాఫీ తయారీ, దానిని అతిథులకు అందజేసే విధానం అత్యద్భుతంగా ఉంటుందట. ఈ విధానం కూడా వారి తరతరాల భాగస్వామ్యం ఉందని, దీనిని యునెస్కో జాబితాలో చేర్చింది.జపాన్ వారి సాకె రైస్వైన్గా గుర్తింపు పొందిన సాకె ను స్థానిక సాంస్కృతిక వేడుకలలో సేవిస్తారు. దీని తయారీ వెనక తరాలుగా వస్తున్న కుటుంబాల శ్రమ ఉంటుంది.మలేషియన్ బ్రేక్ఫాస్ట్వంటకాల రుచి గురించి చెప్పుకోవాలంటే ఉదయం అల్పాహారంగా మలేషియా ‘నాసి లెమక్, రోటీ కనాయ్’ని ఈ దేశపు హిస్టరీగా చెప్పుకోవచ్చు. వందల ఏళ్ల ఈ ఆహార తయారీ ఫార్ములా వారికి మాత్రమే తెలుసు.కొరియా జంగ్కొరియా వంటకాలలో జంగ్ అనే వంటకం తయారీ, రుచి, దానిని నిల్వ చేసే పద్ధతలు శతాబ్దాలుగా ఒక తరం నుంచి మరో తరానికి వస్తున్నాయి.అజెర్బైజాని బ్రెడ్మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల బ్రెడ్స్ చూసి ఉంటాయి. కానీ, అజెర్బైజాని బ్రెడ్ తయారీలో వారి సంస్కృతి పరమైన ప్రభావం ఎంతో ఉందంటున్నారు. ఈ బ్రెడ్ తయారీలో వాడే పదార్థాలు, తయారీలో తరాల వారసత్వం ఉందని జాబితాలో పొందుపరిచారు. -
‘దేవర’ బ్యూటీ ఫేవరెట్ : రాగి–చిలగడ దుంప పరాఠా
రోజంతా పని చేయాలంటే శక్తి ఉండాలి. అందుకోసం కడుపు నిండా తినాలి. కంటినిండా నిద్ర΄ోవాలి. ఈ రొటీన్లో ఏం తింటున్నామో తెలియకపోతే స్లిమ్‌గా ఉండడం కష్టం. ఆహారం బలాన్ని పెంచాలి కానీ బరువును పెంచకూడదు. నాజూగ్గా ఉండే జాన్వి కపూర్... అంత స్లిమ్ గా, ఎనర్జిటిక్‌గా ఉండడానికి ఏం తింటుంది? డిన్నర్లో రాగి – చిలగడ దుంప (స్వీట్ పొటాటో) పరాఠా తింటానని చెప్పింది. ఆమె షెఫ్ ఎలా వండుతున్నారో చూద్దాం.రాగి–చిలగడ దుంప పరాఠాకావలసినవి: చిలగడ దుంప – ఒకటి (పెద్దది); రాగి పిండి – 250 గ్రాములు; నువ్వులు– టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం తురుము – అర టీ స్పూన్; పచ్చిమిర్చి– 2 (సన్నగా తరగాలి); ఉల్లిపాయ– ఒకటి (సన్నగా తరగాలి); జీలకర్ర పొడి– అర టీ స్పూన్; మిరప పొడి– అర టీ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; మిరియాల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – టేబుల్ స్పూన్;తయారీ∙ఒక పాత్రలో పావు లీటరు నీటిని పోసి వేడి చేయాలి. అందులో నెయ్యి (సగం మాత్రమే), నువ్వులు, కొద్దిగా ఉప్పు, రాగి పిండి వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని చేత్తో అదుముతూ పూరీల పిండిలా కలిపి పాత్ర మీద మూత పెట్టి పక్కన పెట్టాలి.ఈ లోపు ప్రెషర్ కుక్కర్లో నీటిని పోసి గెణుసుగడ్డను ఉడికించాలి. వేడి తగ్గిన తరవాత తొక్కు వలిచి మరొక పాత్రలో వేసి చిదమాలి. ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర పొడి, మిరప పొడి, ఉప్పు, మిరియాల పొడి కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు చేయాలి.రాగి పిండి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకోవాలి. ఒక్కొక్క గోళీని చపాతీల పీట మీద వేసి కొద్దిగా వత్తి అందులో గెనుసు గడ్డ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. ఆ తరవాత జాగ్రత్తగా (లోపలి మిశ్రమం బయటకు రాకుండా) పరాఠా చేసి వేడి పెనం మీద వేసి నెయ్యి రాస్తూ కాల్చాలి. -
విదేశీ పండ్లకు పెరిగిన క్రేజ్
అమెరికా స్ట్రాబెర్రీ, న్యూజిలాండ్ కివీ, వాషింగ్టన్ యాపిల్, కాలిఫోర్నియా ద్రాక్ష, ఆస్ట్రేలియా ఆరెంజ్, థాయిలాండ్ డ్రాగన్ ఇలా అనేక రకాల విదేశీ పండ్లు ప్రసుత్తం నగర మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. దీంతో విదేశీ పండ్ల రుచులను ఆస్వాదించడానికి నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రోజు రోజుకూ నగరంలో వీటి అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సగటున రోజుకు 50–60 టన్నుల మేర అమ్మకాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సుమారు 18 దేశాల నుంచి వివిధ రకాలు దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపార వర్గాల చెబుతున్న మాట. కాగా ఈ మొత్తం ప్రక్రియలో అమ్మకాలు, దిగుమతులు గణనీయంగా పెరిగాయని, దీంతో విదేశీ పండ్ల విక్రయాల్లో నగరం దేశంలోనే మూడో స్థానంలో ఉందని తెలుస్తోంది.. ఒకప్పుడు స్థానికంగా దొరికే ఫలాలే సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసేవారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫలాలు ఎగువ మధ్య తరగతి వారు, లేదా ధనవంతులు మాత్రమే కొనుగోలు చేసేవారు. అయితే మారుతున్న పరిస్థితులు, గ్లోబల్ మార్కెటింగ్‌లో భాగంగా ప్రతిదీ సామాన్యులకు అందుబాటులకి వచి్చంది. పైగా వాటికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు వాటి అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశంలో అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లు నగర మార్కెట్లో అందుబాటులో అమ్మకాలు జరుగుతున్నాయి... మాల్స్ నుంచి లోకల్ మార్కెట్‌కి.. విదేశీ పండ్లు ఒకప్పుడు పెద్ద పెద్ద మాల్స్‌లోనో.. లేదా సూపర్ మార్కెట్స్‌లోనో అమ్మకాలు జరిగేవి... అయితే విదేశీ పండ్లు నగరంలో మాల్స్, ఫ్రూట్ షాప్స్ నుంచి తోపుడు బండ్లపై అమ్మకాలు జరుగుతున్నాయి. పైగా దేశీయ పండ్ల ధరలకు సమానంగా వీటిని విక్రయిస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఏదో ఒక సీజన్లో మత్రమే దేశయ మార్కెట్లో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వివిధ దేశాల పండ్లు అక్కడి సీజన్ల ప్రకారం మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి. దీంతో యేడాది పొడవునా ఏదో ఒక దేశం నుంచి అన్ని రకాల పండ్లూ అన్ని సీజన్లలో లభ్యమౌతున్నాయి. దేశంలోనే మూడో స్థానంలో.. విదేశీ పండ్లుగా పేరుగాంచిన కివీ, స్ట్రాబర్రీ, బ్లాక్ బెర్రీస్, అవకాడో వంటి పళ్లు నగరంలో విరివిగా లభ్యమవుతున్నాయి. భారీగా అక్కడి నుంచి దిగుమతులు చేయడం ఒక కారణమైతే.. లోకల్ మార్కెట్‌తో పాటు ఇళ్ల వెంబడి కూడా అమ్మకాలు చేయడమే మరో కారణమని బాటసింగారం మార్కెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నారు. నగరంతో పాటు ఇతర రాష్ట్రాలకూ, జిల్లాలకూ ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతాయి. అందుకే రాష్ట్రంలోనే బాటసింగారం పండ్ల మార్కెట్‌కు అతి పెద్దదిగా పెట్టింది పేరు. అయితే విదేశీ పండ్ల వినియోగంలో ముంబయి, బెంగళూరు తర్వాత నగరం మూడో స్థానంలో నిలిచింది. దిగుమతులు ఇలా.. గ్రీన్ యాపిల్‌కు ఇటీవల అదరణ పెరిగింది. నెదర్లాండ్స్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. యాపిల్ పళ్లను వాషింగ్టన్, చైనా, న్యూజిల్యాండ్, చిలీ, బెల్జియం నుంచి ముంబాయి, చెన్నై పోర్టు ద్వారా నగరానికి దిగుమతవుతాయి. అవకాడో టాంజానియా నుంచి, కివీ పండ్లు న్యూజిల్యాండ్, ఇటలీ, ఇరాన్‌తో పాటు చైనా నుంచి వస్తాయి. ఇదే క్రమంలో వివిధ పళ్లు ఇతర దేశాల నుంచి దిగుమతవుతున్నాయి. ప్రతి ఫలం..ఔషధ గుణం.. ప్లమ్.. చూడడానికి పెద్ద రెగు పండు సైజులో యాపిల్‌ను పోలివుంటుంది. ఇందులో క్యాల్షియం, సీ, బీ విటమిన్లు, మెగీ్నíÙయంతో పాటు ఇతర పోషకాలు మొండుగా ఉంటాయి. కివీ ఫ్రూట్లో విటమిన్ సీ, కే, ఇ అధికంగా ఉంటాయి. ఇక డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సీ, ఫాస్పరస్, క్యాల్షియం, ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తితో పాటు కేన్సర్‌ను నియంత్రిస్తుంది. చెర్రీలో కార్బోహైడ్రేట్లు, షుగర్, విటమిన్ సీ, పోటాషియం పుష్కలంగా లభిస్తాయి. స్ట్రాబెర్రీలో విటమిన్ సీ, క్యాల్షియం అధిక స్థాయిలో ఉంటుంది.ఆన్లైన్లోనే ఆర్డర్స్.. వివిధ దేశాల నుంచి ఇక్కడి వ్యాపారులు ఆయా సీజనల్ ఫ్రూట్స్‌ని ఆన్లైన్ ద్వారానే దిగుమతి చేసుకుంటారు.. అదెలా అంటే.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాట్సాప్, మెయిల్ ద్వారా పండ్ల నమునా ఫొటోలు పంపిస్తారు. దీంతో వ్యాపారులు ఆన్లైన్లో అడర్ ఇస్తారు. విదేశాల నుంచి ముంబయికి దిగుమితి అవుతాయి. అక్కడి నుంచి ఫ్రీజర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా నగరానికి వస్తాయి.మార్కెట్లో వివిధ దేశాల పండ్లు ప్రపంచ వ్యాప్తంగా లభించే దాదాపు 20 రకాల విదేశీ పండ్లు గడ్డిఅన్నారం మార్కెట్‌కు కమీషన్ ఏజెంట్ల ద్వారా దిగుమతి అవుతున్నాయి. గతం కంటే ప్రస్తుతం దిగుమతులు పెరిగాయి. ట్రేడర్స్‌కు రెఫ్రిజిరేటర్ చాంబర్లు ఏర్పాటు చేశాము. దేశంలోని ఇతర పండ్ల మార్కెట్లతో పోలిస్తే నగర మార్కెట్లో అన్ని సౌకార్యలూ ఉన్నాయి. – ఎల్ శ్రీనివాస్, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపెరిగిన అమ్మకాలు గతంతో పోలిస్తే విదేశీ పండ్ల అమ్మకాలు పెరిగాయి. దీంతోపాటు నగరం ప్రజలకు కూడా విదేశీ పండ్లపై ఆసిక్తి పెరిగంది. కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెరగడం మరో కారణం.. దిగుమతులు కూడా విరివిగా జరుగుతుండడంతో ధరలు కూడా దేశీ పండ్ల స్థాయిలోనే ఉంటున్నాయి. యాపిల్, కివీ, పియర్స్‌తో పాటు మరికొన్ని విదేశీ రకాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. – క్రాంతి ప్రభాత్‌రెడ్డి, విదేశీ పండ్ల హోల్‌సేల్ వ్యాపారి -
మఖానా స్మూతీ ఎపుడైనా ఇలా ట్రై చేశారా?
కమ్మని రుచి, చక్కని పోషకాలతో ఆరోగ్యాన్ని అందించే మఖానా స్మూతీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసినవి:వేయించిన మఖానా– కప్పుబాదం పప్పు– 3 టేబుల్ స్పూన్లుఅరటిపండు – ఒకటి; ఖర్జూరాలు– 4;పీనట్ బటర్– టేబుల్ స్పూన్;పాలు– 300 ఎం.ఎల్;గుమ్మడి గింజలు– టీ స్పూన్;తయారీ:గుమ్మడి గింజలుమినహా మిగిలిన అన్నింటినీ మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేయాలి. గ్లాసుల్లో పోసి పైన గుమ్మడి గింజలు చల్లి సర్వ్ చేయాలి. చల్లగా కావాలంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది మంచి ΄ోషకాహారం. పిల్లలు ఆటల్లో మునిగి తినడానికి ఇష్టపడక పరుగులు తీస్తుంటారు. పోషకాలన్నింటినీ ఒక గ్లాసులో పోసి ఇచ్చినట్లే. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇది ఒక గ్లాసు తాగితే రోజుకు అవసరమైన పోషకాలన్నీ దాదాపుగా అందినట్లే. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ బదులుగా కూడా ఈ స్మూతీని ఇవ్వవచ్చు. ఫిట్నెస్ చేసేవాళ్లు వర్కవుట్ తర్వాత ఈ డ్రింక్‌ను తీసుకోవచ్చు.పోషకాలు:శక్తి– 764 కిలోకేలరీలు ప్రొటీన్– 26.1 గ్రాముకార్బొహైడ్రేట్లు– 87.2 గ్రాములుఫ్యాట్ – 36.3 గ్రాములుఫైబర్– 10 గ్రాములుడాక్టర్ కరుణన్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారం!
భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మకమైన మిచెలిన్ స్టార్ పురస్కారం లభించింది. ఇది వంటకాలకు సంబంధించి.. పాక ప్రపంచంలో అత్యున్నత గౌరవంగా పరిగణిస్తారు. నిజానికి భారతదేశంలో మిచెలిన్ స్టార్ల లభించిన రెస్టారెంట్లు లేవు విదేశాల్లో ఉన్న భారతీయ రెస్టారెంట్లే ఈ అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకున్నాయి. తాజాగా దోహాలో జరిగిన మిచెలిన్ గైడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారతీయ రెస్టారెంట్ జమావర్ దోహాకి ఈ మిచెలిన్ స్టార్ అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో రెండు రెస్టారెంట్లకే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. వాటిలో మన భారతీయ రెస్టారెంట్ కూడా ఉండటం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో తమ రెస్టారెంట్ కూడా భాగమవ్వడం సంతోషంగా ఉందన్నారు వ్యవస్థాపకులు ఈ తండ్రికూతుళ్ల ద్వయం దినేష్ , సంయుక్తలు. ఈ రెస్టారెంట్ పేరుని కాశ్మర్లోని 16వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ శాలువాల పేరుని ఎంచుకున్నారు ఆ తండ్రి కూతుళ్లు. అత్యాధునిక హంగులతో ఉండే ఈ రెస్టారెంట్లో ఢిల్లీ, కేరళకు సంబంధించిన ప్రసిద్ధ వంటకాలతో సహా వివిధ అద్భుత రుచులతో కూడిన వంటకాలను సర్వ్ చేస్తారు . ఈ జమావర్ రెస్టారెంట్‌ని మొదటిసారిగా 2001లో ది లీలా ప్యాలెస్ బెంగళూరులో ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రసిద్ధ ఐదు భారతీయ నగరాల్లో బ్రాంచ్‌లుగా విస్తరించారు. ఆ తర్వాత 2016లో లండన్, 2021లో దోహాలలో కూడా తమ రెస్టారెంట్లను ప్రారంభించారు. అయితే జమావర్ లండన్ కూడా ఈ ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారాన్ని దక్షించుకోవడం విశేషం. కాగా, దోహా జమావర్ రెస్టారెంట్ చెఫ్ సురేందర్ మోహన్ ఇన్‌స్టాగ్రాంలో "ఇది తమ టీం సమిష్ట కృషి, అంకిత భావానికి నిదర్శనం. మా కష్టాన్ని గుర్తించి ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించినందుకు మిచెలిన్ గైడ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు". అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు చెఫ్ సురేందర్ . ఇక సంయుక్త నాయర్ కూడా ఇది కేవలం మా జమావర్ దోహకే గర్వకారణం కాదు. ఆ ప్రాంతంలో భారతీయ ఆహారానికి దక్కిన గొప్ప గౌరవం అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. మిచెలిన్ స్టార్ అంటే..అత్యుత్తమ వంటలను అందించే రెస్టారెంట్లకు ఈ పురస్కారాని ఇస్తారు. మొత్తం ఐదు ప్రమాణాలలను పరిగణలోనికి తీసుకుని ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. పదార్థాల నాణ్యత, రుచుల సామరస్యం, సాంకేతికతలలో నైపుణ్యం, వంటకాలను ప్రెజెంట్ చేసే చెఫ్ నైపుణ్యం, ముఖ్యంగా మెనూలో వంటకాల వైవిధ్యం తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫ్రాన్స్‌కి చెందిన మిచెలిన్ గైడ్ ఈ పురస్కారాలను అందజేస్తుంది. ఇలా 1900 సంవత్సరం నుంచి అందజేస్తోంది. View this post on Instagram A post shared by Samyukta Nair (@samyuktanair) (చదవండి: బిడ్డకు తల్లైనా అంతే అందంగా హీరోయిన్! ‘చందమామ’ సీక్రెట్ ఇదే!) -
స్లిమ్ సెట్.. డైట్ మస్ట్
ఆధునిక జీవన శైలిలో నగరవాసుల ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. యువత నుంచి మొదలైతే వయోవృద్ధుల వరకు స్లిమ్‌తో పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధిక బరువు నుంచి ఉపశమనం పొందాలని, శరీరంలోని అనవసరమైన కొవ్వులు కరిగించాలని తినే ఆహారం తగ్గిస్తున్నారు. మరో వైపు వ్యాయామంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో నీరసించిపోవడం, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నిత్యం మనతోనే ఉండే వారు లావుగా ఉన్నావని ఎత్తిపొడుపు మాటలకు బాధపడి కొంతమంది.. అధిక బరువు ఉన్నారని పెళ్లికి నిరాకరించడం, కాలేజీ, ఉద్యోగ ప్రాంగణంలో ఆకర్షణీయంగా కనిపించాలని మరికొంత మంది.. ఇలా ఎవరి అవసరాలు వారికి ఉన్నాయి. అవే స్లిమ్ సెట్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. నగరంలో సుమారు 60 శాతం మంది 30 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారే నాజూగ్గా కనిపించాలని ఆరాటపడుతున్నారంటే ఆశ్చర్యం లేదు. మరో 20 శాతం నుంచి 30 శాతం మంది 14 నుంచి 29 ఏళ్ల వయస్కులు ఉండగా, సుమారు 10 శాతం మంది 50 ఏళ్లు దాటిన వారు ఈ తరహా స్లిమ్ సెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కావాలనుకునేవారు పౌష్టికాహారం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది మంచిదే.. అయితే.. ఎవరైనా సరే నిపుణుల సూచనలు ఆచరణాత్మకంగా పాటిస్తారో అక్కడే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మితంగా తింటున్నారు.. నాజూగ్గా కనిపించాలని చాలా మంది యువత తిండి తగ్గించేస్తున్నారు. దీనికి తోడు ప్రొసెసింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. శరీరంలో ఉన్న ఫ్యాట్ తగ్గించడానికి డైట్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలి. కొంత మంది ప్రత్యేకంగా నడుము, పొట్ట, చేతులు వంటి ఒక పార్ట్నే లక్ష్యంగా స్లిమ్ చేయాలనుకుంటున్నారు. వారంలో 750 గ్రాముల నుంచి ఒక కేజీ వరకు బరువు తగ్గితే ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం సాధారణ పనులు చేసుకోవడానికి నిత్యం శరీరానికి శక్తి అవసరం. దానికి అవసరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం తగ్గిస్తే దాని ప్రభావం కండలు (మజిల్)పై కనిపిస్తుంది. నీరసం వస్తుంది. ఏ పని చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. వివిధ సంస్థలు ఒక కేజీ బరువు తగ్గడానికి సుమారుగా రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తీసుకుంటున్నాయి. ప్రొటీన్ పౌడర్ వాడేస్తున్నారు.. చాలా మంది ఈ మధ్య కాలంలో భోజనానికి ప్రత్యామ్నాయంగా ప్రొటీన్ పౌడర్ తీసుకుంటున్నారు. ప్రొటీన్ డబ్బా బయట మార్కెట్లో రూ.650 నుంచి రూ.1,500 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆ వ్యక్తి లైఫ్ స్టైయిల్, బాడీ ప్యాటర్న్ బట్టి ప్రొటీన్ పౌడర్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. మూడు పూటలా మీల్ రీప్లేస్మెంట్ ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం మొలకెత్తిన గింజలు, రాగి జావ, తృణధాన్యాలు, ఫైబర్ ఫుడ్ వంటివి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. అయితే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాత్రం నిపుణుల సూచనల మేరకు తీసుకోవడం మంచిది. ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పోతాయి. ఆ ఆలోచన చేయవద్దు డైట్ నిరంతర ప్రక్రియగా ఉండాలి. ఒక్కసారి స్లిమ్ అయిపోవాలి.. వేగంగా బరువు తగ్గిపోవాలనే ఆలోచన చేయవద్దు. అది ఒక్క రోజులో వచ్చే ఫ్యాట్ కాదు. మూడు నెలల పాటు హెల్దీ లైఫ్ స్టైల్‌కు అలవాటు పడాలి. వ్యక్తి శరీరానికి ప్రధానంగా ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవసరం. ఉదయం బాడీ డిటాక్సేషన్ కోసం నిమ్మరసం, జీరా నీరు, మెంతుల నీరు, దనియాలు, జీలకర్ర, కాంబినేషన్లో సూచిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రత్యేక మెనూ ఉంటుంది. – బి.కవిత, పౌష్టికాహార నిపుణురాలు, హైదరాబాద్సుమారు 30 కేజీలు బరువు తగ్గాను అధిక బరువుతో ఇబ్బందిగా ఉండేది. వెయిట్ లాస్ కోసం 2023 నుంచి న్యూట్రిషన్ సూచనలు ఫాలో అవుతున్నాను. ఇప్పటి వరకు సుమారు 30 కేజీలు తగ్గాను. అప్పటి ఇప్పటికి చూస్తే మనకి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. బరువుతో బాధపడే సమయంలో నెమ్మదిగా ఉండేది. ఇప్పుడు పిల్లలతో చురుగ్గా పనులు చేసుకోగలుగుతున్నాను. లుక్ వైజ్‌గా చాలా తేడా వచి్చంది. ఫీల్ గుడ్. – వై.నిషిత, కూకట్పల్లి -
వరల్డ్ టాప్ ఫుడ్ సిటీస్ : టాప్-5లో ముంబై, అయ్యో హైదరాబాద్!
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆహారం నగరం జాబితాలో వాణిజ్య రాజధాని టాప్ -5లో చోటు దక్కించుకుంది.ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్, టేస్ట్ అట్లాస్ 2024-25 సంవత్సరానికి సంబంధించిన తాజా లిస్టును ప్రకటించింది. వాటిలో అనేక స్థానాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ముంబై నగరం టాప్ప్లేస్కి ఎగబాకగా హైదరాబాద్, 50వ స్థానానికి పడిపోయింది.ముంబై ప్రపంచంలో 5వ అత్యుత్తమ ఆహార నగరంగా నిలిచింది. టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ఫుడ్ గైడ్ వివిధ వర్గాలలో ర్యాంకింగ్‌లను విడుదల చేసింది."ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల" జాబితాలో ముంబై 5వ స్థానంలో నిలిచింది.తొలి నాలుగు స్థానాలకు ఇటలీలోని నగరాలు చోటు సంపాదించాయి. నేపుల్స్, మిలన్, బోలోగ్నా, ఫ్లోరెన్స్. ముంబై తర్వాత రోమ్, పారిస్, వియన్నా, టురిన్ , ఒసాకా టాప్ 10లో ఉన్న నగరాలుగా ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఇతర భారతీయ నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి, వాటిలో మూడు ముంబైతో పాటు టాప్ 50లోకి వచ్చాయి. అమృత్సర్ 43వ స్థానంలో, న్యూఢిల్లీ 45వ స్థానంలో, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 50వ స్థానంలో నిలిచాయి. కోల్‌కతా 71వ స్థానంలో ఉండగా, చెన్నై 75వ స్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) అలాగే టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల ర్యాంకింగ్‌ను కూడా ప్రకటించింది. భారత్ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ మెరుగ్గానే ఉందని తెలిపింది. కాగా గత ఏడాది ఈ జాబితాలో ముంబై35, హైదరాబాద్ 39వ స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ 56వ స్థానంలోనూ, చెన్నై, లక్నో 65, 92 స్థానాల్లోనూ నిలిచాయి. -
చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న, సన్నకారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పండ్లు, కూరగాయలు వినియోగదారుల నోటికి చేరే లోగా దాదాపు 30–40 శాతం వరకు కుళ్లిపోతున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) అంచనా. దుంపలైతే ఏకంగా 40–50% పాడవుతున్నాయి. కోత అనంతర రవాణా వ్యవస్థ, శీతల సదుపాయాలు లేకపోవటం పెద్ద సమస్య. ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించడానికి ఉపయోగపడే గొప్ప ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఉగాండాకు చెందిన ఫ్రెజా నానోటెక్ లిమిటెడ్ అనే స్టార్టప్ సంస్థ సేంద్రియ పదార్థాలతో రూపొంచిన ఇన్స్టంట్ టీ బ్యాగ్ అంత సైజు ఉండే పౌడర్ ప్యాకెట్ కూరగాయలు, పండ్లను కుళ్లిపోకుండా నెల రోజుల వరకు రక్షించగలుగుతుంది. ఎటువంటి రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండా, రసాయన రహితంగానే షెల్ఫ్ లైఫ్‌ను గణనీయంగా పెంచే ఈ ఆవిష్కరణ ‘ఎఫ్ఎఓ ఇన్నోవేషన్ అవార్డు–2024’ను ఇటీవల దక్కించుకుంది. శీతల గదుల్లో పెట్టని పండ్లు, కూరగాయలు మగ్గిపోయి కొద్ది రోజుల్లోనే కుళ్లియే ప్రక్రియ ‘ఫాస్ఫోలిపేస్ డి’ అనే ఎంజైమ్ కారణంగానే జరుగుతుంటుంది. ఫ్రెజా నానోటెక్ సంస్థ రూపొదించిన పౌడర్ ఈ ప్రక్రియను నెమ్మదింపజేయటం ద్వారా కూరగాయలు, పండ్లను దీర్ఘకాలం పాటు తాజాగా ఉంచుతుంది.టీ బ్యాగ్ అంతటి చిన్న ప్యాకెట్ (దీని ధర రూ. 20)ను 5 కిలోల పండ్లు, కూరగాయల మధ్య ఉంచితే చాలు.. నెల రోజులైనా అవి కుళ్లిపోకుండా ఉంటాయని ఎఫ్ఎఓ తెలిపింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి మెరుగవుతుంది, పోషకాలలభ్యత పెరుగుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, జీవనోపాధులు మెరుదలపై ఈ ఆవిష్కరణ సానుకూల ప్రభావం చూపుతుందంటూ ఎఫ్ఎఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు ప్రశంసించారు. కోత అనంతర దశలో రైతులకు ఎదురయ్యే నష్టాలను ఇది తగ్గిస్తుంది. త్వరగా పాడుకావు కాబట్టి రిటైల్ వ్యవస్థలో జరిగే నష్టాల భారం తగ్గుతుంది. ఆవిధంగా వినియోగదారులపై కూడా భారం తగ్గుతుందని ఆయన అన్నారు. -
మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!
ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ఓ సెలబ్రిటీ. ఆమె శీతాకాలంలో తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చ్యవన్రప్రాశ తీసుకుంటోంది. చరక సంహిత, భావప్రకాశ, రస రత్న సముచ్చయ వంటి ఆయుర్వేద గ్రంథాలు చెప్పిన ఔషధం ఇది. దీనిలోని ఆరోగ్యకారకాలను వివరించాలంటే ఒక్కమాటలో ఆల్ఇన్వన్ అని చెప్పవచ్చు. చ్యవన ముని కనుక్కున్న ఫార్ములా ఇది. ఈ ఔషధం ఎనర్జీ బూస్టర్, ఇమ్యూనిటీని పెంచుతుంది. శక్తినిస్తుంది, జీవనకాలాన్ని పెంచుతుంది. మూలికల సూక్ష్మమైన ΄ోషకాల సమ్మిళితం ఇది. తన కంటిచూపు తగ్గినప్పుడు ఈ ఔషధాన్ని వాడడం ద్వారా తిరిగి మునుపటి చూపును పొందినట్లు రాశాడు చ్యవనుడు. అయితే చ్యవన ప్రాశను ఇంట్లో సులువుగా తయారు చేసుకునే విధానాన్ని సెలబ్రిటీ షెఫ్ అనన్యా బెనర్జీ ఇలా వివరించారు. కావలసినవి: ఉసిరి కాయలు– అర కేజీ; బెల్లం లేదా తేనె– 300 గ్రాములు; నెయ్యి– 100 గ్రాములు; నువ్వుల నూనె – టేబుల్ స్పూన్; దాల్చిన చెక్క పొడి– టీ స్పూన్; యాలకుల పొడి– టీ స్పూన్; లవంగాల పొడి– అర టీ స్పూన్; జాజికాయ పొడి– అర టీ స్పూన్; అశ్వగంధ పొడి– టీ స్పూన్; శతావరి పొడి– టీ స్పూన్; డ్రై ఫ్రూట్స్ : కిస్మిస్, డేట్స్, ఫిగ్స్ – 50 గ్రాములు (అన్నీ కలిపి). తయారీ: డ్రైఫ్రూట్స్‌ను సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఆవిరి మీద కానీ నేరుగా నీటిలో కానీ ఉడికించాలి. చల్లారిన తర్వాత కాయలను కొద్దిగా చిదిమి గింజలు తొలగించి గుజ్జు అంతటినీ ఒక పాత్రలో వేసుకోవాలి ∙మందపాటి పాత్రను వేడి చేసి అందులో నెయ్యి, నువ్వుల నూనె వేయాలి. అవి వేడెక్కిన తర్వాత ఉసిరికాయల గుజ్జు వేసి గరిటెతో కలుపుతూ పది నుంచి పదిహేను నిమిషాలపాటు మగ్గనివాలి. మిశ్రమం చిక్కబడి, దగ్గరగా అయిన తర్వాత అందులో బెల్లం పొడి లేదా తేనె కలిపి చిన్న మంట మీద ఉంచాలి. మిశ్రమం అడుగుపట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ తీపి... ఉసిరితో సమంగా కలిసిన తర్వాత యాలకుల పొడి, లవంగాల పొడి, దాల్చినచెక్క పొడి, జాజికాయ పొడి, అశ్వగంధ, శతావరి, కిస్మిస్తో పాటు మిగిలిన డ్రైఫ్రూట్స్ పలుకులను వేసి సమంగా కలిసేవరకు గరిటెతో కలియబెట్టి దించేయాలి. దించిన తర్వాత కూడా పాత్ర వేడికి అడుగున ఉన్న మిశ్రమం మాడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దించిన తర్వాత చల్లారేలోపు రెండు –మూడు సార్లు గరిటెతో కలపాలి.చల్లారిన తరవాత తేమ లేని బాటిల్లోకి తీసుకుని గాలి దూర కుండా గట్టిగా మూత పెట్టాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుని శీతాకాలమంతా వాడుకోవచ్చు దించిన తర్వాత ఒకసారి రుచి చూసుకుని తీపి సరిపోలేదంటే మరికొంత తేనె కలుపుకోవచ్చు ఉసిరికాయలు వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి, అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడానికి, నెయ్యితోపాటు ఇతర సుగంధద్రవ్యాలు జఠరాగ్నిని పెంచి పోషకాలను దేహం సమర్థంగా శోషించుకోవడానికి దోహదం చేస్తాయి.రోజుకు పెద్దవాళ్లు రోజూ ఉదయం ఒక టేబుల్ స్పూన్ తినాలి (15–20 గ్రాములు). పిల్లలకైతే టీ స్పూన్ (5–10 గ్రాములు) చాలు. చ్యవన్ర΄ాశ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత కఫం సమస్యలు కనిపిస్తే మోతాదు తగ్గించాలి లేదా చ్యవన ప్రాశను వేడినీటిలో కలిపి తీసుకోవాలి. -
ఈ సూప్ తయారీకి మూలం బ్రిటిష్ అధికారులట..!
దక్షిణ భారతీయ సూప్‌గా పేరుగాంచిన 'ముల్లిగటావ్నీ సూప్' రెసిపీని తీసుకొచ్చింది బ్రిటిష్ అధికారులట. వాళ్ల కారణంగా మన భారతీయ పాకశాస్త్ర నిపుణులు ఈ సూప్ తయారీని కనుగొన్నారట. అంతకముందు వరకు ఈ సూప్ తయారీ గురించి ఎవ్వరికి తెలియదట. కాలక్రమేణ అదే అందరూ ఇష్టంగా ఆరగించే ఫేవరెట్ సూప్‌గా మన భారతీయ వంటకాల్లో భాగమయ్యిందని చెబుతున్నారు పాకశాస్త నిపుణులు. భారతదేశంలో బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో ఈ సూప్ ఉద్భవించిందట. అదెలా? బ్రిటిష్ వాళ్లు మనలా మసాలాలు, పప్పు, కూరగాయలు అంతగా తినరు కదా..మరీ వాళ్లెలా ఈ సూప్ తయారీకి కారణమయ్యారంటే..ముల్లిగటావ్నీ సూప్‌ని బ్రిటిష్ వలస రాజ్యల పాలనా కాలంలో ఉద్భవించిందట. చెప్పాలంటే ఈ రెసిపీని సాంస్కృతిక మార్పిడిగా పేర్కొనవచ్చు. తమిళ పదాలు మియాగు(మిరియాలు, టాన్నీర్(నీరు) మీదుగా దీని పేరు వచ్చింది. దీన్ని దక్షిణ భారతీయ పులసుగా చెప్పొచ్చు. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం కోసం వచ్చి మనపై పెత్తనం చెలాయించే స్థాయికి చేరి భారతీయులను నానా బాధలకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇక్కడ ఉండే కొందరు బ్రిటిష్ అధికారులు వారి సంప్రదాయ భోజనం అనుసరించి ముందుగా ఏదో ఒక సూప్‌తో భోజనం ప్రారంభించేవారు. అలాంటి భోజనశైలి భారత్‌లో ఉండదు. దీంతో వాళ్లు తినేందుకు సూప్ కోసం అని మన భారతీయ పాకశాస్త్ర నిపుణులు కూరగాయాలతో చేసే పులుసునే వాళ్ల కోసం కొద్దిపాటి మాంసం వంటి వాటిని చేర్చి సూప్ మాదిరిగా తయారు చేసి అందించారు. దీని రుచికి ఫిదా అయిన బ్రిటిష్ అధికారులు..వాళ్ల పబ్‌లోనూ, రెస్టారెంట్లలోనూ ఈ వంటకం ఉండేలా ఏర్పాటు చేశారు. అంతలా ఈ సూప్‌ని బ్రిటిష్ వాళ్లు అమితంగా ఇష్టపడేవారట. అయితే ఈ సూప్‌ని తయారు చేసింది ఆంగ్లో ఇండియనే అని చెబుతుంటారు. తయారీ విధానంతేలిక పాటి కూరగాయలు, అన్నం, మిరియాలు, మాంసాలతో తయారు చేస్తారు. చివరగా క్రీమ్ మాదిరిగా అందంగా కనిపించేలా చివర్లో కొబ్బరి పాలు వేసి సర్వ్ చేస్తారు. దీనిలో జీలకర్ర, కొత్తిమీర, కరివేపాలకు వంటి వాసనతో ఘుమఘమలాడుతూ ఉంటుంది. చెప్పాలంటే భారతదేశంలో శాకాహారులు ప్రోటీన్ల కోసం చేసుకునే ఈ కూరగాయ పులుసునే ఇలా కొద్దిపాటి మార్పులతో బ్రిటిష్ వాళ్ల రుచికి అనుగుణంగా ఈ సూప్‌ని ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత అదే అందరికీ ఇష్టమైన సూప్‌గా ప్రజాధరణ పొందడం విశేషం.(చదవండి: ఏడు ఖండాలను చుట్టువచ్చిన వందేళ్ల బామ్మ..!) -
ప్లాస్టిక్ బాటిల్ వాటర్‌తో హై రిస్క్: ఇండస్ట్రీ ఇవి కచ్చితంగా పాటించాల్సిందే!
ఎన్ని హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నా, ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా ఇబ్బడి ముబ్బడిగా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగుతున్న మనందరికి భారతదేశ ఆహార నియంత్రణ సంస్థ ఒక హెచ్చరిక లాంటి వార్తను అందించింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ , మినరల్ వాటర్‌ను "హై-రిస్క్ ఫుడ్" కేటగిరీలో చేర్చింది. అంతేకాదు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ధృవీకరణను తొలగించాలనే ఆదేశాలు జారీ చేసింది. అలాగే కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌ను ఆయా కంపెనీలు కచ్చితంగా పాటించాలని పేర్కొందిఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నోటిఫికేషన్ ప్రకారం, కొత్త మార్గదర్శకాలకనుగుణంగా ప్రకారం, తయారీదారులు , ప్రాసెసర్లు లైసెన్స్‌లు లేదా రిజిస్ట్రేషన్లను మంజూరు చేయడానికి ముందు తప్పనిసరిగా తనిఖీలు చేయించుకోవాలి. అక్టోబరులో, ప్యాకేజ్డ్ వాటర్‌కి సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ అవసరాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన నిబంధనల ప్రకారం, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ మరియు మినరల్ వాటర్ తయారీ దారులందరూ ఇప్పుడు లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందేందుకు తప్పనిసరిగా వార్షిక, రిస్క్ ఆధారిత తనిఖీలు చేయించుకోవాలి.గతంలో, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ BIS , FSSAI రెండింటి ద్వారా ద్వంద్వ ధృవీకరణ అవసరాల తొలగించాలి డిమాండ్ చేసింది. కానీ ఈ వాదనలను తోసిపుచ్చిన సంస్థలు తప్పని సరిగా తనిఖీలు చేయించాలని, సంబంధిత ధృవీకరణ పత్రాలను పొందాలనిస్పష్టం చేశాయి. దీనికి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి హై-రిస్క్ ఫుడ్ కేటగిరీలలో వ్యాపారం చేస్తున్నవారు, FSSAI-గుర్తింపు పొందిన మూడవ-పక్ష (థర్డ్‌పార్టీ) ఆహార భద్రతా ఏజెన్సీల వార్షిక ఆడిట్లను పొందాల్సి ఉంటుంది.హై-రిస్క్ ఫుడ్ కేటగిరీల క్రింద వచ్చే ఇతర ఉత్పత్తులు:పాల ఉత్పత్తులు, అనలాగ్స్పౌల్ట్రీతో సహా మాంసం , మాంసం ఉత్పత్తులు,మొలస్క్లు, క్రస్టేసియన్లు , ఎచినోడెర్మ్లతో సహా చేపలు , చేప ఉత్పత్తులుగుడ్లు , గుడ్డు ఉత్పత్తులునిర్దిష్ట పోషక అవసరాల కోసం ఉద్దేశించిన ఆహార ఉత్పత్తులుతయారుచేసిన ఆహారాలు (ప్రిపేర్డ్ ఫుడ్)భారతీయ స్వీట్లుపోషకాలు, వాటి ఉత్పత్తులు (ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే)కాగా ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీళ్లు తాగడం చాలా ప్రమాదమని ఇప్పటికే చాలామంది నిపుణులు హెచ్చరించారు. ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు కలిగించటమే కాదు, మానవ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. అనేక రసాయనాలతో తయారైన ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీరు తాగటం వల్ల ఒక్కోసారి కేన్సర్ లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
వింటర్లో వ్యాధులు : మిరియాలతో చాలా మేలు!
లేదు..రాలేదు అనుకుంటూ ఉండగానే చలి పులి పరుగెత్తుకొచ్చేసింది. మరోవైవు ఫంగెల్ ప్రభావం, వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశంఉంది. చలికాలంలో వచ్చే కొన్ని అనారోగ్యసమస్యల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని వంటింటి చిట్కాలను పాటించాల్సిందే. ఇంట్లోనే లభించే నల్ల మిరియాలతో చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు మొదలైన సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. నల్ల మిరియాల్లో ఎన్నో ఔషధగుణాలుంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్నాయి. ఉంటాయి. ఇవి అంటువ్యాలులు సోకకుండా కాపాడతాయి. అలాగే నొప్పులనుంచి ఉపశమనం కలిగిస్తాయి. నల్ల మిరియాల్లోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా మెగ్నీషియం, రాగి, ఇనుము, కాల్షియం, భాస్వరం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలకు మంచి మూలం. ఇందులో విటమిన్లు ఎ, కె, ఇ బి విటమిన్ కూడా ఉన్నాయి. ఇందులోని పైపెరిన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రేగులను శుభ్రం చేస్తుంది.మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా నల్ల మిరియాలను సేవిస్తే మలబద్ధకం సమస్య తీరుతుంది.రక్త ప్రసరణను మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తాయి.అంతేకాదుబరువు తగ్గడంలో కూడా మిరియాలు బాగా పనిచేస్తాయి. ఇందులో లభించే ఫైటో న్యూట్రియెంట్స్ అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి.అలాగే చలికాలంలో కీళ్లు,ఎముకల నొప్పులు బాగా వేధిస్తాయి. ఈ బాధలనుంచి ఉపశమనం కలిగించే ఔషధ గుణాలు మిరియాల్లో ఉన్నాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకు కూడా ఇవి మేలు చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. నల్ల మిరియాలు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి. క్యాన్సర్‌ను నివారణలోనూ ఉపయోగపడ తాయంటున్నారు నిపుణులుమనకున్న అనారోగ్య సమస్యను బట్టి తులసి ఆకులు, పసుపు మిరియాలతో చేసిన కషాయం, మిరియాల పాలు,మిరియాలు తేనె, మిరియాలు, తమలపాకు రసం కలుపుకొని తాగవచ్చు.గ్రీన్ టీకి చిటికెడు నల్ల మిరియాలు కలుపుకోవచ్చు.కూరలు, సలాడ్లలో మిరియాల పొడి జల్లు కోవచ్చు. మిరియాలు ,యూకలిప్టస్ నూనె వేసి మరిగించిన నీళ్లో ఆవిరి పట్టవచ్చు. నోట్: ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. మిరియాలు అందరికి ఒకేలా పనిచేయవు. శరీర తత్వాన్ని బట్టి, నిపుణుల సలహామేరకు తీసుకోవాలి. మిరియాలను ఎక్కువగా తీసుకుంటే కొన్ని నష్టాలు కూడా ఉంటాయనేది గమనించాలి. -
బ్రెడ్‌ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?
బ్రెడ్‌ఫ్రూట్ (ఆర్టోకార్పస్ ఆల్టిలిస్) చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతాయి. పనస, బ్రెడ్నట్, అంజీర, మల్బరీలకు దగ్గరి జాతికి చెందినదే. తెలుగులో ‘సీమ పనస’, ‘కూర పనస’ అంటారు. ఫిలిప్పీన్స్, న్యూగినియా, మలుకు దీవులు, కరిబియన్ దీవుల ప్రాంతం దీని పుట్టిల్లు. ఇప్పుడు దక్షిణాసియా, ఈశాన్య ఆసియా, పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలు, కరిబియన్, సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో సాగవుతోంది. ఈ చెట్లకు కాచే కాయలు లేత ఆకుపచ్చని రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కాయలనే (పండుగా కాదు) అనేక రూపాల్లో తింటూ ఉంటారు. పసిఫిక్ దీవుల్లోని ప్రజలు అనాదిగా దీన్ని బ్రెడ్ లేదా బంగాళ దుంపల మాదిరిగా దైనందిన ఆహారంగా తింటున్నారు. బ్రెడ్‌ఫ్రూట్ చెట్లలో విత్తనాలు ఉన్న, లేని రెండు రకాలున్నాయి. ఈ చెట్టు 26 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. అదే చెట్టుకు ఆడ, మగ పూలు పూస్తాయి. లేతగా ఉన్నప్పు లేత ఆకుపచ్చగా, పండినప్పుడు ముదురు పసుపు రంగులో దీని కాయలు ఉంటాయి. తొక్కపైన చిన్నపాటి బుడిపెలు ఉంటాయి. లోపలి గుజ్జు లేత గోధుమ రంగులో చక్కని వాసనతో కొంచెం తియ్యగా ఉంటుంది. దీని కాయలు కిలో నుంచి 5 కిలోల వరకు బరువు పెరుగుతాయి. పోషక విలువలుబ్రెడ్ఫ్రూట్ తినగానే జీర్ణమైపోయేది కాదు. నెమ్మదిగా అరుగుతుంది. దీనిలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు, జీర్ణమయ్యే పీచుపదార్థం, ముఖ్యమైన విటమిన్లు, విటమిన్ సి, పొటాషియం వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లకు కూడా ఇది నెలవు. ఉత్పాదకత, సుస్థిరతఎదిగిన ఒక బ్రెడ్‌ఫ్రూట్ చెట్టు ఏడాదికి 200 కిలోలకు పైగా కాయలు కాస్తుంది. నాటిన తర్వాత వేరూనుకొని బతికితే చాలు. తర్వాత ఢోకా ఉండదు. మొండిగా పెరిగి, కాయలనిస్తుంది. ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొని, నిస్సారమైన భూముల్లోనూ బతుకుతుంది. అందువల్లే ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రజలకు కరువు కాలాల్లో కూడా సుస్థిరంగా ఆహారాన్ని అందిస్తుంది. ఎన్నో రకాలుగా తినొచ్చుబ్రెడ్ఫ్రూట్ను పచ్చిగా, లేతగా, పండుగా.. ఇలా ఏ దశలోనైనా తినొచ్చు. పూర్తిగా మగ్గిన పండుకు బంగాళ దుంప రుచి వస్తుంది కాబట్టి అనేక వంటకాలు చేసుకోవచ్చు. పెరిగిన కాయను ఉడకబెట్టుకొని, కుమ్ములో పెట్టుకొని, వేపుకొని, కాల్చుకొని తినొచ్చు. పచ్చి బ్రెడ్‌ఫ్రూట్ కాయలను పిండి చేసి పెట్టుకొని, బేకరీ ఉత్పత్తుల్లో కూడా కలుపుకోవచ్చు. ఇందులో గ్లుటెన్ ఉండదు కాబట్టి సెలియాక్ జబ్బు ఉన్న వారు కూడా తినొచ్చు. తీపి పదార్ధాల్లో, రుచికరమైన ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవచ్చు. పోషక విలువలుబ్రెడ్ఫ్రూట్లో పోషకవిలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఉన్నాయి. మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడే ముఖ్యమైన అమినోయాసిడ్లు, ప్రొటీన్లు, పీచుపదార్థం ఇందులో ఉంటాయి. విటమిన్ సి, బి1, బి5తో పాటు పొటాషియం, రాగి వంటి మినరల్స్ ఉన్నాయి.చదవండి: వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ.. ఆదాయం ఎంతో తెలుసా?ఈ కాయలో కొవ్వు, సోడియం స్వల్పంగా, పీచుపదార్థం అధికంగా ఉంటాయి. రెండు కప్పుల బ్రెడ్‌ఫ్రూట్ ముక్కల్లో 4.4 మిల్లీ గ్రాముల సోడియం, 60 గ్రాముల పిండిపదార్థాలు, 2.4 గ్రాముల మాంసకృత్తులు, 227 కేలరీల శక్తి, 24.2 గ్రాముల చక్కెర, 0.5 గ్రామలు కొవ్వు, 10.8 మిల్లీ గ్రాముల పీచు పదార్థం ఉంటాయి. రెండు కప్పుల బ్రెడ్‌ఫ్రూట్ ముక్కలు తింటే ఆ రోజుకు సరిపోయే పొటాషియంలో 23% లభించినట్లే. రోగనిరోధక శక్తిపుష్కలంగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లను అందించటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించటం, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచగలగటం బ్రెడ్‌ఫ్రూట్ ప్రత్యేకత. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను నిర్మూలించటం, దీర్ఘరోగాల బెడదను తగ్గించటంతో పాటు దేహం బరువును తగ్గించుకోవటానికి ఉపకరిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముక పుష్టికి దోహదపడుతుంది. విటమిన్ ఎ ఉండటం వల్ల కంటి చూపునకు కూడా మంచిదే. వెంటనే అరిగిపోకుండా క్రమంగా శక్తినిస్తుంది కాబట్టి రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. -
ఔరా! అంజీరా! ఇది మాంసాహారమా?
సాధారణంగా ఎవరైనా పండ్లను చూపించి.. ‘ఇవి శాకాహారమా? మాంసాహారమా?’ అని అడిగితే చిత్రంగా అనిపిస్తుంది. ‘ఏమిటా పిచ్చి ప్రశ్న.. పండ్లలో ఎక్కడైనా మాంసం ఉంటుందా?’ అంటూ కోపం తన్నుకొస్తుంది. అయితే చాలామంది ‘అంజీరా పండ్లు శాకాహారమా? మాంసాహారమా?’ అనే ప్రశ్నే వేస్తున్నారు. ఎందుకంటే ‘పండులందు అంజీరా పండు వేరయా’ అంటున్నారు నిపుణులు. సైంటిఫిక్ రీజన్స్ చూపిస్తూ ‘ఈ పండు ముమ్మాటికీ మాంసాహారమే!’ అని తేల్చేస్తున్నారు.అసలెందుకు అంజీరాను మాంసాహారం అంటున్నారంటే.. ఆ పండులో జరిగే పరాగ సంపర్క క్రియనే దానికి ప్రధాన కారణమని వివరిస్తున్నారు. పరాగ సంపర్కం కోసం కందిరీగలు.. అంజీర్ పండ్లను ఆశ్రయిస్తుంటాయి. ఆ పండ్ల సూక్ష్మ రంధ్రాల్లోనికి వెళ్లిన కందిరీగలు పరాగ సంపర్కం చేస్తాయి, అనంతరం బయటకి రాలేక కొన్ని అందులోనే చనిపోతాయి. దాంతో వాటి అవశేషాలు అంజీర్ పండులోనే విలీనమవుతాయి. అందువల్ల అది పరోక్షంగా మాంసాహారమవుతుంది కాబట్టి అంజీర్ పండ్లు మాంసాహారమే నంటున్నారు నిపుణులు. (శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..!)అలాగని శాకాహారులు అంజీరాని తినడం మానేస్తే చాలా నష్టపోతారు. ఎందుకంటే అంజీరాతో ఎన్నో ఆరోగ్య ఫలితాలు అందుతాయి. వీటిలో విటమిన్లు, ఐరన్, ఫైబర్, ప్రొటీన్లు ఇలా అన్నీ పుష్కలంగా లభిస్తాయి. రోజూ తింటే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. వీటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టుకుని, ఉదయం నిద్ర లేచిన వెంటనే తింటే చాలా మంచిది. మలబద్ధకం, మూలశంక వంటి సమస్యలను ఈ పండ్లు నయం చేస్తాయి. చెడు కొవ్వును వేగంగా కరిగిస్తాయి. బరువు, హైబీపీ, షుగర్ వంటి సమస్యలను అదుపులోకి తెస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు, నెలసరి సమస్యలున్నవారు, కిడ్నీ సమస్యలున్నవారు వీటిని తింటే మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యానిచ్చే ఈ పండును శాకాహారులూ నిరభ్యంతరంగా తినచ్చు. (కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి!) -
ట్రెండ్ మారింది.. ఫుడ్ మారాలి
ఫ్యాషన్ ట్రెండ్స్లాగానే ఆహారంలో కూడా కొంతకాలం పాటు ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రతి సందర్భంలోనూ ఆ ట్రెండ్ ఎవరికి మంచిది, ఎవరికి హానికరం అనే వివరాలను తన బ్లాగ్‌లో రాస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి. హెల్త్ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న షీలా కృష్ణస్వామి ఈ వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యసంరక్షణ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.న్యూట్రిషన్, వెల్నెస్ రంగంలో నలభై ఏళ్ల అనుభవం ఉన్న షీలా కృష్ణస్వామి రోజూ 30 గ్రాముల నట్స్, సీడ్స్ తీసుకోవాలని చెప్పారు. ముప్ఫై గ్రాములంటే ఎన్ని అని తూకం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఓ గుప్పెడు చాలు. రోజూ గ్లాసు నీరు, గుప్పెడు బాదం పప్పులతో తన రోజు మొదలవుతుందన్నారు. ఉదయం ఇలాంటి శక్తినిచ్చే సహజాహారం తీసుకుంటే రోజంతా నీరసం రాదు. విటమిన్లు, ప్రొటీన్లతో కూడిన ఆహారం కోసం మన డైట్లో పప్పులు, ధాన్యాలు, పీచు, పాలు, పండ్లను తీసుకుంటున్నాం. బాదం, గుమ్మడి విత్తనాలను కూడా తప్పనిసరిగా చేర్చుకోవాలి. సమయానికి భోజనం చేయడం కుదరనప్పుడు కూడా బాదం తింటే దేహానికి దాదాపుగా సంపూర్ణ ఆహారం అందినట్లే. జంక్ బదులు గింజలు! వందేళ్ల కిందట ఇప్పుడున్న అనారోగ్యాలు లేవు. గడచిన తరాలు ఆహారం విషయంలో ఇంత ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఏం తినాలనిపిస్తే అది తిన్నారు. ఏం పండితే వాటినే తిన్నారు. ఊబకాయం, గుండె వ్యాధులు, డయాబెటిస్ వంటి అనారోగ్యాల్లేవు. అందుకు కారణం వారికి ఆహారం ద్వారా అందిన శక్తిని కరిగించేటంతటి వ్యాయామం ఉండేది. తగినంత వ్యాయామం ఉండడంతో మంచి నిద్ర ఉండేది. ఈ రెండింటి వల్ల దేహక్రియలు చక్కగా జరిగేవి. గట్ హెల్త్ అంటే అదే. ఆ గట్ హెల్త్ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. ‘బెంగళూరులో నా కళ్లారా చూస్తుంటాను. ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లడానికి పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఇంటికి వెళ్లేలోపు ఆకలి వేస్తుంటుంది. కారులో వెళ్తూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రై, సమోసాలు, బేకరీ ఫుడ్ వంటి జంక్ తింటూ ఉంటారు. నేనేం చె΄్తానంటే జంక్ స్థానంలో సహజ ఆహారాన్ని తీసుకోండి. ఆఫీసుకెళ్లేటప్పుడు పండ్లను బ్యాగ్‌లో తీసుకెళ్లడం కొన్నిసార్లు సాధ్యంకాకపోవచ్చు. బాదం వంటి నట్స్ ఒక చిన్న బాక్సులో పెట్టుకుంటే మధ్యలో ఆకలి అనిపించినప్పుడు పది గింజలు తింటే చాలు’ అన్నారు షీలా కృష్ణస్వామి. అరవై నాలుగేళ్ల వయసులో ఇంత చురుగ్గా ఉండడానికి సరైన ఆహారమే కారణమన్నారు. ‘అందంగా ఉండడానికి రహస్యం ఏమీ లేదు, ఆరోగ్యంగా ఉండడమే’నని నవ్వారామె. ఎలాగైనా తినండి!పరిపూర్ణ ఆరోగ్యానికి, దీర్ఘకాలం యవ్వనంగా ఉండడానికి దోహదం చేసే బాదం పప్పులను ఇలాగే తినాలనే నియమం ఏదీ అవసరం లేదు. పచ్చిగా లేదా నానబెట్టి తినవచ్చు. డ్రై రోస్ట్, నానిన వాటిని వేయించి,పోపు పెట్టి చాట్ మసాలా చల్లి తినవచ్చు. బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయం తినేటప్పుడు పొట్టు వలిచేస్తుంటారు. కానీ పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఆ ఫైబర్ కూడా దేహానికి అవసరమే. వృద్ధులకు పొట్టుతోపాటు తినడం ఇబ్బందవుతుంది. పొట్టు తీసి తినాల్సింది దంతాలు సరిగా లేని వాళ్లు మాత్రమే. – షీలా కృష్ణస్వామి, న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్, బెంగళూరు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటో : టి.దయాకర్ -
పొయ్యిపై సల.. సల..ఆరోగ్యాలు విల విల!
పుట్టపర్తికి చెందిన 30 ఏళ్ల మహిళ తిన్న ఆహారం జీర్ణం కాలేదని ఆస్పత్రిలో చేరింది. కడుపు నొప్పితో పాటు ఆకలి మందగించినట్లు డాక్టర్లకు తెలిపింది. పలు వైద్య పరీక్షల అనంతరం కల్తీ ఆహారం తినడం కారణంగానే ఆరోగ్య సమస్య తలెత్తినట్లు వైద్యులు నిర్ధారించారు. కల్తీ నూనె, మసాలా పదార్థాలు తినడం తగ్గించాలని డాక్టర్లు సూచించారని ఆమె తెలిపింది.పెనుకొండలో ఓ చిన్నారి పుట్టినరోజు సందర్భంగా ఐదు కుటుంబాలు విందులో పాల్గొనేందుకు హోటల్‌కు వెళ్లాయి. వాళ్లందరూ రకరకాల వంటకాలు తిన్నారు. చివరగా ఇంటికి చేరే సమయంలో దారిలో కనిపించిన స్ట్రీట్ ఫుడ్ కూడా రుచి చూశారు. ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు. కానీ ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫుడ్ పాయిజనింగ్‌గా తేల్చారు. సాక్షి, పుట్టపర్తి : నిత్యావసర సరుకుల ధరలతో పాటు వంటనూనె ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ వాడకం మాత్రం తగ్గడంలేదు. మరోవైపు హోటళ్లలో తిండి ధరలు ఉన్నఫలంగా పెంచడం కుదరదు. దీంతో చాలా మంది కల్తీనూనె వాడటం మొదలుపెట్టారు. దీనికితోడు పొయ్యిపై నూనెను పదే పదే మరిగించేస్తున్నారు. ఫలితంగా తాజా నూనె అయినప్పటికీ మరిగించడంతో రుచి మారుతోంది. ఆ నూనెలో తయారు చేసిన పదార్థాలను తింటున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనలు పట్టణ ప్రాంతాల్లో తరచూ వెలుగు చూస్తున్నాయి. రోడ్డు పక్కన తయారు చేసే ఆహార పదార్థాలు దుమ్ము, ధూళి రేణువులు చేరి అనారోగ్యానికి గురి చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పట్టణాల్లోనే అధికం.. పల్లెలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే హోటళ్లు అధికం. అందులో రోడ్ల పక్కన చిన్న చిన్న హోటళ్లు, తోపుడు బండ్లు ప్రతి వంద మీటర్లకు ఒకటి కనిపిస్తాయి. ఇతర ప్రాంతాల నుంచి పలు పనులపై వచ్చే వాళ్లు గత్యంతరం లేక ఇక్కడే తినాల్సి వస్తోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలోని హోటళ్లలో ఎక్కువ మంది ఆహార పదార్థాలను తింటుంటారు. అయితే నూనెను పదే పదే మరిగించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి దాకా.. మద్యం దుకాణాల సమీపంలోని చికెన్ కబాబ్ సెంటర్లలో ఎక్కువసార్లు మరిగించిన నూనెలో చేసిన పదార్థాలను తినడం కారణంగా మందుబాబులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మద్యం కంటే కల్తీ నూనె పదార్థాలు ఎక్కువగా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయనే విషయం మత్తులో గమనించలేకపోతున్నారు. మటన్, చికెన్, కోడిగుడ్ల వంటకాల్లో ఎక్కువగా కల్తీ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రైవేటు మద్యం దుకాణాలు రావడంతో ఒక్కో దుకాణం వద్ద పదుల కొద్దీ చికెన్ కబాబ్ సెంటర్లు వెలిశాయి. ఒకసారి పొయ్యి పెట్టిన నూనె సాయంత్రం వరకూ కాగుతూనే ఉంటోంది. ఫలితంగా ఆ ఆహారాన్ని తీసుకునే వారు ఫుడ్ పాయిజన్‌తో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అటకెక్కిన తనిఖీలు.. పదే పదే మరిగించిన నూనెలో వంటకాలు చేయడం.. ఆ పదార్థాలు తిన్న వారు అనారోగ్యం బారిన పడటం.. సైకిల్ చక్రంలా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు లేకపోవడంతోనే ఇదంతా జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వస్తే కానీ తనిఖీలు చేయరని అంటున్నారు. మరి కొన్ని చోట్ల ఆర్నెల్లకు ఒకసారి కూడా తనిఖీలు చేయడం లేదని రికార్డులు చెబుతున్నాయి. పండుగ సమయంలో మాత్రమే అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. నూనె డబ్బాల్లో ఎంతమేరకు కల్తీ ఉందనే విషయం ఎవరూ బయటపెట్టడంలేదు. కబేళాలకు తరలించే పశువుల ఎముకల పిండి కూడా నూనెలో కలిపేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కల్తీ అని తేలితే కఠిన చర్యలు మా సిబ్బంది ఆధ్వర్యంలో నిత్యం తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఎక్కడ కల్తీ జరుగుతోందో పక్కా సమాచారం ఇస్తే.. తనిఖీ ముమ్మరం చేస్తాం. శ్యాంపిళ్లు తీసి ల్యాబ్‌కు పంపిస్తాం. కల్తీ చేసినట్లు నిర్ధారణ అయితే చర్యలు తప్పవు. ఇప్పటికే చాలా చోట్ల తనిఖీలు చేశాం. కల్తీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నాం. ప్రజలు బయట ఫుడ్ తినడం తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుంది. – రామచంద్ర, ఫుడ్ ఇన్స్పెక్టర్, పుట్టపర్తి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారంతోనే ఆరోగ్యం బాగుంటుంది. బయట ఎక్కడ పడితే అక్కడ హోటళ్లలో తింటే అనారోగ్యం బారిన పడటం ఖాయం. మసాలా, నూనె వంటలు తినడం తగ్గించాలి. నూనె వంటకాలతో కొవ్వు శాతం పెరగడంతో పాటు కల్తీ నూనె వంటకాలు తింటే వివిధ రోగాలు సోకే ప్రమాదం ఉంది. – డాక్టర్ మంజువాణి, డీఎంహెచ్ఓరోగాలు ఇలా.. ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ (టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూనెతో ఆహార పదార్థాలు వండితే శరీరంలో అధికంగా ఫ్రీరాడికల్స్ పెరిగిపోతాయి. నూనె రంగు మారిపోతుంది. అడుగున నల్లటి పదార్థం తయారవుతుంది. ఆమ్లం అధికమవుతుంది. కొన్ని నూనెలలో నిల్వ ద్వారా విష పదార్థాలు కూడా ఏర్పడతాయి. స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌తో సహా చాలా వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.