
ఆహార ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో అగ్రస్థానం బిర్యానీదే. అంతేగాదు ఆన్‌లైన్ ఎక్కువ ఆర్డర్ చేసేది కూడా బిర్యానీ. అయితే ఈ వంటకం ఇరాన్‌లో ఉద్భవించిందని, మొఘల్ పాలన కారణంగా భారత ఉపఖండంలో నెమ్మదిగా భాగమైందని చెబుతుంటారు పాక నిపుణులు. ఆ విధంగా మనకు బిర్యానీ తెలిసిందేనది చాలామంది వాదన. అయితే అసలు బిర్యానీ అంటే మాంసంతో కలిపి చేసేదే బిర్యానీ అని, కూరగాయలతో చేసే వెజ్ బిర్యానీ అనేది బిర్యానీనే కాదని అంటున్నారు. నెట్టింట దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. మరీ ఇంతకీ వెజ్ బిర్యానీ అనేది ఉందా..?. మాంసం ఆధారిత వంటకమే బిర్యానీనా అంటే..
వెజ్ లేదా నాన్ వెజ్ బిర్యానీ రెండూ వాటి రుచి పరంగా ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. అయితే పాక నిపుణులు మాత్రం బిర్యానీ అనగానే మాంసంతోనే చేసే వంటకమని నమ్మకంగా చెబుతున్నారు. కానీ మరికొందరు మాత్రం కూరగాయలతో చేసినదే బిర్యానీ అని వాదిస్తున్నారు. ప్రముఖ చెఫ్‌లు పాక నిపుణులు బిర్యానీని పూర్వం సుగంధ ద్రవ్యాల తోపాటు, జంతువుల కొవ్వుని కూడా జోడించి మరింత రుచిని తీసుకొచ్చారని చెబుతున్నారు.
అందువల్ల మాంసం లేకుండా తయారుచేసిన వంటకాన్ని నిజంగా "బిర్యానీ"గా పరిగణించలేమని అన్నారు. అయితే కాలక్రమే ఆహార వంటకాలు అభివృద్ధి చెందడంతో.. మాసంహారం తినని వాళ్ల కోసం ఇలా కూరగాయలు జోడించి చేయడంతో అది కాస్త వెజ్ బిర్యానీగా పిలవడం జరిగిందన్నారు. అయితే అది నిజమైన బిర్యానీ కాదని తేల్చి చెబుతున్నారు ప్రముఖ చెఫ్, ఫుడ్ ల్యాబ్ వ్యవస్థాపకుడు సంజ్యోత్ కీర్.
అలాగే కూరగాయలు జోడించినంత మాత్రమే దానికి బిర్యానీ ఘమఘలు రావని, దానికి సుగంధ ద్రవ్యాలు తోడైతేనే.. కూరగాయలు రుచిగా మారి మనకు అద్భుతమైన వెజ్ బిర్యానీ సిద్ధమవుతుందని చెప్పారు. అందువల్ల కూరగాయలతో చేసినదాన్ని బిర్యానీగా పరిగణించరని అన్నారు.
చాలామందికి ఇది నచ్చకపోయినా..వాస్తవం ఇదేనని అన్నారు. అలా అని వెజ్ బిర్యానీని కూడా తీసిపారేయలేం. ఎందుకంటే కాటేజ్ చీజ్ (పనీర్), సోయా బీన్, టోఫు, పుట్టగొడుగులు, జాక్‌ఫ్రూట్ (కథల్) లేదా ఖర్జూరం (ఖజూర్) వంటి కూరగాయలతో మరింత రుచికరంగా చేస్తున్నారు చెఫ్‌లు. చెప్పాలంటే..మాంసంతో చేసినన బిర్యానీ రుచి కూడా దానిముందు సరిపోదేమోనన్నంత టేస్టీగా ఉంటోందన్నారు చెఫ్ సంజ్యోత్ కీర్.
(చదవండి: యూట్యూబ్ చూసి సెల్ఫ్ సర్జరీ..! వైద్య నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్)