ప్రజాసంకల్పయాత్ర దేశ చరిత్రలో ఓ అద్భుతం | YSRCP Leader Sajjala Ramakrishna On YS Jagan Tirumala Visit | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర దేశ చరిత్రలో ఓ అద్భుతం

Jan 10 2019 3:56 PM | Updated on Mar 20 2024 3:59 PM

వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి.. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దేశ చరిత్రలో ఓ అద్భుతమని అన్నారు. కోటిన్నర మంది ప్రజలు ఆయనను నేరుగా కలవడం.. ప్రసంగాలు వినడం.. సమస్యలు చెప్పుకోవడం జరిగిందని తెలిపారు. కష్టం అంటే తెలియని కుటుంబంలో పుట్టిన వైఎస్‌ జగన్‌.. ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాసంకల్పయాత్ర చేపట్టారు. 14 నెలల పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ పరిపూర్ణ నాయకుడిగా ఎదిగారని అన్నారు. తన కోసం కాకుండా.. రాష్ట్ర  ప్రజలను కష్టాలను తొలగించమని కోరుకుంటూ స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఆయన తిరుమలకు వచ్చారని తెలిపారు. వైఎస్‌ జగన్ కుటుంబానికి దూరంగా, ఎండ, వాన, చలి లెక్క చేయకుండా ప్రజల మధ్య ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం తపించారని గుర్తుచేశారు.

Advertisement
Advertisement