టెక్సాస్: సాధారణంగా చిన్నపిల్లలు అన్నం తినమని మారాం చేస్తే కార్టూన్ వీడియోలు చూపించి తినిపిస్తాము. ఇక వాటిని చూసి ఆకర్షితులైన పిల్లలు.. నచ్చిన కార్టూన్ పాత్రలను అనుకరిస్తూ ఉంటారు. అలాగే ఈ చిన్నారి కూడా. తనకు నచ్చిన ‘ఫ్రాజెన్’ కార్టూన్ సినిమాలోని లీడ్‌రోల్ పాత్ర ‘ఎల్సా’ లాంటి దుస్తులను ధరించి మంచులో పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ.. అచ్చం ‘ఎల్సా’లా మారిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. టెక్సాస్‌కు చెందిన 2 ఏళ్ల చిన్నారి మాడెలిన్ ‘ఫ్రాజెన్’ సినిమాలోని యువరాణి ‘ఎల్సా’ ఫ్రాక్‌ను ధరించి.. ఆనందంగా మంచులో డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పాపపై ముద్దుల వర్షం కురిపిస్తూ.. వీడియో షేర్ చేసిన చిన్నారి తల్లికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.