ఆ టీచర్‌ క్లాస్‌రూమ్‌లోనే దర్జాగా..

లక్నో : చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్‌ తరగతి గదిలోనే పొగతాగుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేసిన ఘటన యూపీలో​ వెలుగు చూసింది. మహ్మదాబాద్‌లోని ఓ ప్రైమరీ స్కూల్‌ టీచర్‌ క్లాస్‌రూంలో పొగతాగుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ వీడియోను చూసిన జిల్లా విద్యాశాఖాధికారి డివిజన్‌ అధికారిని సదరు స్కూల్‌కు పంపగా వీడియోలోని వ్యక్తి ఆ టీచరేనని వెల్లడైంది. క్లాస్‌రూంలో పొగతాగిన టీచర్‌ను తక్షణమే సస్పెండ్‌ చేశామని జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి అజయ్‌ కుమార్‌ తెలిపారు. విద్యార్ధులపై ఉపాధ్యాయుల వ్యవహారశైలి ప్రభావం చూపుతుందని, ఉపాధ్యాయులెవరూ పొగతాగరాదని, క్లాస్‌రూమ్‌లో ఇలా చేయడం క్షమించరాని విషయమని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియోలో తరగతి గదిలో విద్యార్ధుల ముందే టీచర్‌ దర్జాగా పొగతాగుతున్న దృశ్యాలు కలకలం రేపాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top