మనుషులు ఖాళీ సమయంలో బోర్ కొడితే సినిమా చూడటం, ఆటలు ఆడటం వంటివి చేస్తారు. అలాకాకపోతే వారి పెంపడు జంతువులతో ఆడుకుంటారు. కానీ ఇక్కడ ఈ వీడియో చూడండి. ఓ వ్యక్తి ఏం చేశాడో... చూస్తే బాబోయ్ విడేంట్రా బాబు ఆడుకోవాలనిపేస్తే ఏ కుక్కతోనో, పిల్లితోనో ఆడకుండా పాముతో పెట్టుకున్నాడని అనకుండా ఉండలేరు. పాముతో ఆడుకుంటూ దానిని ఆటపట్టిస్తున్న అతగాడికి ఖంగుతినేలా బుద్ది చెప్పిన పాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సెప్టెంబర్ 19న ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 2 లక్షల వ్యూలు, వందల్లో కామెంట్లు రాగా.. ఇప్పటికి వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. వివరాలు.. పాములను పట్టే ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న కొండ చిలువను చేతితో గాలిలో పట్టుకుని దాని మొహంపై ఊదుతూ దానితో ఆడుకుంటు దాన్ని రేచ్చగోట్టెల ప్రవర్తిస్తున్నాడు.
అతను చేసే వేధవ చేష్టలకు అది కూడా నోరు తెరిచి కోపంగా అతని మీదకు లేస్తూ చివరకు సైలెంట్‌గా ఉండిపోయింది. పాము సైలెంట్ కావడంతో అతను దానిని ముద్దు చేస్తూ తలపై పెట్టుకున్నాడు. దీంతో ఛాన్స్ కోసం చూసిన కొండచిలువ ఒక్కసారిగా అతగాడి తలను గట్టిగా పట్టేసింది. ఇక దానిని వదిలించుకోవడానికి ఆ వ్యక్తి నానాతంటాలు పడుతున్న వీడియోను చూసిన నేటిజన్లంతా ‘బాగైంది.. ఇతనికి ఇలా జరగాల్సిందే, నీకు ఇలా జరగడమే కరెక్ట్.. ఇప్పుడు తెలిసిందా నోప్పి ఎలా ఉందో!, అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో ఫేస్‌బుక్ యూజర్ ‘ జంతువులకు, ప్రాణులకు మర్యాద ఇవ్వాలని.. ఇప్పడు ఇతగాడికి తెలిసోచ్చినట్లుందనుకుంటా’ అంటూ కామెంటు పెట్టాడు.