తిరుమల: గోడ మీద దర్జాగా కూర్చున్న చిరుత

సాక్షి, తిరుపతి: తిరుమలలో గత అర్ధరాత్రి చిరుత హల్ చల్ చేసింది. శ్రీవారి పాదాల ఆటవీ ప్రాంతం నుంచి మ్యూజియం ముందర గోడమీద దర్జాగా కూర్చుంది. చిరుత కదలికలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ విషయం తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీవారి దర్శనం అనతరం లడ్డూ ప్రసాదం తీసుకుని భక్తులు బయటకు వచ్చే రోడ్డులోనే చిరుత తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భక్తులు బసచేసే ప్రాంతాల్లో చిరుతలు సంచరించిన ఘటనలూ గతంలోనూ వెలుగుచూశాయి. ఇటీవల ఓ చిరుత రెండో ఘాట్ రోడ్డులో వాహన దారులపై దాడికి దిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద చిరుత సంచారం అధికారులు, భక్తుల్లో కలవరం పుట్టిస్తోంది

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top