ఒళ్లు గగుర్పొడిచే వీడియో..అది డ్యాన్స్‌ కాదు! | Watch: Hair Raising Video Two Snakes Fight For Dominance | Sakshi
Sakshi News home page

ఒళ్లు గగుర్పొడిచే వీడియో..అది డ్యాన్స్‌ కాదు!

Jul 31 2020 12:03 PM | Updated on Mar 22 2024 11:32 AM

రెండు పాముల సయ్యాటకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు అవి చేస్తున్న విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.‘‘ఆధిపత్యం కోసం ర్యాట్‌ స్నేక్‌ల మధ్య యుద్ధం. రెండు మగ పాములు.. తమ ఉనికిని చాటుకునేందుకు, తమ తోడును రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటం’’ అంటూ అటవీ శాఖ అధికారి సుశాంత నందా ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. 

ఈ క్రమంలో కొంతమంది.. ఇది పాముల సయ్యాట(ఆడ, మగ)కు సంబంధించిన వీడియో అని, ఇలాంటివి చాలానే చూశామని కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు స్పందించిన సదరు అధికారి.. ఇవి మగ పాములు అని, అవి డ్యాన్స్‌ చేయడం లేదని స్పష్టం చేశారు. కాగా ర్యాట్‌ స్నేక్‌లు విష రహితమైనవి. సాధారణంగా అవి రోడెంట్స్‌(ఎలుకలు)ను వేటాడి ఆహారం సంపాదించుకుంటాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement