మెల్లగా అనుసరిస్తూ.. మెరుపుదాడి..అంతలోనే!

దండిగా వర్షాలు పడ్డాయి. వీధులు చెరువులుగా మారాయి. భారీ వర్షాలతో గుజరాత్‌లోని వడోదరా పట్టణం ఇప్పుడు అతలాకుతలం అవుతోంది. వీధుల్లో వరదనీరు వచ్చి చేరడంతో పట్టణంలోని చాలా వీధులు చెరువుల్ని తలపిస్తున్నాయి. చుట్టూ చేరిన నీరుతో బయటకు వెళ్లలేక పట్టణవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికితోడు వరద నీళ్లో మొసళ్లు తిష్టవేశాయి. వరదనీటిలో ఎక్కడ చూసినా మొసళ్లు తిరుగుతున్నాయి. దీంతో గుండెల్ని అరచేత పట్టుకొని.. వడోదరా వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

వడోదర వీధుల్లోని వరదనీటిలో మొసళ్లు తిష్టవేసిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఓ నెటిజన్‌ పోస్టు చేసిన వీడియోలో వరదనీటిలో మొసలి వేట భయంగొలిపే రీతిలో ఉంది. వరదనీటిలో చేరిన మొసలి.. వరదలో బిక్కుబిక్కమంటూ ఉన్న ఓ కుక్కను మింగేయాలని చూసింది. కుక్కకు ఏమాత్రం అనుమానం కలుగకుండా మెల్లగా దానిని అనుసరిస్తూ.. దగ్గరగా వెళ్లి.. అమాంతం దాడి చేసేందుకు మొసలి ప్రయత్నించింది. అయితే, అప్రమత్తంగా ఉన్న కుక్క వెంటనే పక్కకు తొలగడంతో దాడి నుంచి తప్పించుకుంది. అక్కడే మరో కుక్క బిక్కుబిక్కుమంటూ ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top