దేశాధ్యక్షులకు లేదా దేశ ప్రధాన మంత్రులకు మీడియాను చూస్తే చిర్రెత్తుకొస్తుందో ఏమో! వారడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటేనే చికాకు పడతారేమో! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నలడిగిన జర్నలిస్టుల వైపు గుర్రుగా చూస్తారు. ‘అసలు నీవు రాసే వార్తలన్నీ నకిలీ వార్తలంటూ’ కొట్టి పారేస్తారు.