తెరపైకి మరో ఇంటర్నెట్‌ సెన్సేషన్

ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా పుణ్యాన ఇన్నాళ్లు వెలుగులోకి రాని ప్రతిభావంతుల గురించి ప్రపంచానికి తెలియడం.. వారు రాత్రికి రాత్రే సూపర్‌ స్టార్‌లుగా మారడం జరుగుతుంది. తాజాగా ఈ లిస్ట్‌లో ఎమిలీ కూడా వచ్చి చేరింది. తన గానంతో నెటిజన్ల మనసు దోచుకుంటుంది ఎమిలీ. ఇంతకు ఎమిలీ ఎవరనేగా మీ అనుమానం గాడిద. అవును మీరు చదివింది కరెక్టే ఎమిలీ ఓ గాడిద. సాధరణంగా గొంతు బాగాలేకపోయినా పాటలు పాడుతూ.. ఇబ్బందికి గురి చేసే వారిని గార్ధబ స్వరం(గాడిద గొంతు) అంటూ వెక్కిరిస్తాం. కానీ ఇక్కడ గాడిద గానమే వైరల్‌ కావడం విశేషం. ఆ వివరాలు.. రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యం పాలైన ఎమిలీని దాని యజమాని రోడ్డు మీద వదిలేసి వేళ్లాడు. దాంతో పూణేకు చెందిన ఓ జంతు సంరక్షణశాల యాజమాన్యం ఎమిలీని తీసుకెళ్లారు. చికిత్స చేసి కోలుకునేలా చేశారు. ఈ సంరక్షణశాలలో ఎమిలీతో పాటు పిల్లులు, కుక్కలు, దున్నపోతులు వంటి ఇతర జంతువులు కూడా చాలానే ఉన్నాయి. ఎమిలీకి సంతోషం కలిగినప్పుడు కూనిరాగాలు తీస్తుందట. ఇది విని మిగతా జంతువులు దాని చుట్టూ చేరి సంతోషంగా ఆడటం గమనించారు. దాంతో వారికి ఓ వినూత్న ఆలోచన వచ్చింది.. ఎప్పుడూ గాయపడిన జంతువుల గురించే వీడియోలు తీసి.. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తాం. ఈ సారి వెరైటీగా ఎమిలీ పాట పడుతుండగా వీడియో తీద్దామనుకున్నారు. అలానే చేసి ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ వీడియో వైరల్‌ అయ్యిందంటున్నారు సదరు ఎన్జీవో ప్రతినిధులు. ఐర్లాండ్‌కు చెందిన హ్యారియేట్‌ అనే గాడిద కూడా ఇలానే ప్రచారం పొందిందని.. దాన్ని చూసే తాము ఇలా ప్రయత్నించామంటున్నారు ఎన్జీవో ప్రతినిధులు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top