అరంగేట్రం చిత్రం '1920'తో నటిగా మార్కులు కొట్టేసింది అదాశర్మ. తన కొత్త డ్యాన్స్ పార్ట్‌నర్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను ఆమె పోస్ట్ చేశారు. మీ డ్యాన్స్ పార్ట్‌నర్ ఎవరో చెప్పాలంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 24 గంటల వ్యవధిలో 14 లక్షల మంది వీడియోను వీక్షించారు. మీరు, మీ అమ్మమ్మ సూపర్ అంటూ నటి అదాశర్మను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వీడియో బాగుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.