మైదానంలో సర్ఫరాజ్‌ అహ్మద్‌‌‌కు అవమానం!

పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌‌ మైదానంలోనే తీవ్ర అవమానానికి గురయ్యాడు. ఆదివారం భారత్‌తో జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 89 పరుగుల (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) తేడాతో ఘోర పరజాయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ అనంతరం మైదానంలో కోచ్‌ మిక్కి ఆర్థర్‌తో సర్ఫరాజ్‌ నిలబడగా.. అతన్ని ఉద్దేశించి గ్యాలరీలో ఉన్న అభిమానులు చాలా జుగుప్సాకరంగా వ్యాఖ్యానించారు. ‘ సర్ఫరాజ్‌ నీకు చాలా కొవ్వెక్కింది. బ్యాటింగ్‌ పిచ్‌లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకుంటావా? మన దేశ ప్రధాని మాట వినవా? అంటూ అరవసాగారు. ఈ మాటలు విని వారివైపు చూసిన సర్ఫరాజ్‌.. స్వయంకృత అపరాధంగా భావించి నిశ్శబ్ధంగా ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top