మెస్సీ 600వ గోల్‌.. ఓ పండగ..!! | Lionel Messi hits 600th goal for Barcelona in style, Commentators, fans, stadium crowd go crazy | Sakshi
Sakshi News home page

మెస్సీ 600వ గోల్‌.. ఓ పండగ..!!

May 2 2019 12:41 PM | Updated on Mar 22 2024 10:40 AM

స్టేడియంలో ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తమదైన శైలిలో వ్యాఖ్యానించడం.. ప్రేక్షకుల్లో జోష్‌ పెంచడం సాధారణంగా కామెంటేటర్ల పని. కానీ, ప్రపంచం ఆరాధించే, తను అత్యంత అభిమానించే గోల్‌ మాస్టర్‌, అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనెల్‌ మెస్సీ అద్భుతాలకే అద్భుతం అనిపించే గోల్‌ సాధిస్తే.. ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇంగ్లండ్‌ మాజీ ఫుట్‌బాలర్‌, కామెంటేటర్‌ గ్యారీ లైన్కేర్ కూడా అదే చేశారు. బార్సీలోనా తరపున మెస్సీ 600వ గోల్‌ సాధించడంతో లైన్కేర్ ఆనందంతో ఊగిపోయారు. ‘వావ్‌’ అంటూ కామెంటరీ క్యాబిన్‌లో సహచరుడు లియో గార్సియోతో హ్యాపీ మూమెంట్స్‌ షేర్‌ చేసుకున్నారు.ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. చాంపియన్స్‌ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన లివర్‌పూల్‌-బార్సిలోనా సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement