టీమిండియాతో జరిగిన చివరిదైన మూడో టీ20లో ఓటమి చెందడం పట్ల దక్షిణాఫ్రికా కెప్టెన్ జేపీ డుమినీ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఓటమికి భారత బౌలర్లు నియంత్రణతో కూడిన బౌలింగ్ చేయడమే ప్రధాన కారణమని డుమినీ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు పవర్ ప్లేలో అద్బుతంగా బౌలింగ్ చేసి తమను హిట్టింగ్ చేయకుండా కట్టడి చేశారన్నాడు. తొలి ఆరు ఓవర్లలో బౌండరీలను సాధించడం కంటే కూడా సింగిల్స్ తీయడమే గగనంగా మారిపోయిందన్నాడు.