ఐపీఎల్ వచ్చిందంటే చాలు భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని అభిమానులకు పండుగే పండుగ. మైదానంలో ధోని అలరిస్తే.. ప్రేక్షకుల గ్యాలరీలో అతని కూతురు జీవా తన అల్లరితో ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి అయిపోయే వరకు ఆమె గురించి సోషల్ మీడియా ముచ్చటించాల్సిందే.. టీవీ చానళ్లు, వెబ్‌సైట్స్ వార్తలు రాయాల్సిందే. మొన్న ఆరు భాషల్లో సమాధానం చెప్పి అబ్బుర పరిచిన జీవా.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన అల్లరితో మరోసారి వార్తల్లో నిలిచింది.ధోని బ్యాటింగ్ చేస్తుండగా గ్యాలరీలో ఉన్న జీవా.. ‘పప్పా.. కమాన్ పప్పా’ అని బిగ్గరగా అరుస్తూ తండ్రిని ప్రోత్సహించింది. ఈ వీడియోను చెన్నైసూపర్ కింగ్స్ తన అధికారిక ట్విటర్‌లో పంచుకోగా తెగ వైరల్ అయింది.
పప్పా.. కమాన్ పప్పా.. జీవాధోని హల్‌చల్
Mar 27 2019 10:38 AM | Updated on Mar 27 2019 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement