ధోని చెత్త డ్యాన్సర్‌

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కొన్ని సరదా ప్రశ్నలకి సమాధానమిచ్చిన వీడియోనే ఐసీసీ షేర్‌ చేసింది. నిర్వాహకులు అడిగిన కొన్ని సరదా ప్రశ్నలకు జడేజా సమాధానంగా పలువురి ఆటగాళ్ల పేర్లను వెల్లడించారు. ‘సెల్ఫీలను ఎవరు ఎక్కువ ఇష్టపడతారు- ధావన్‌, చెత్త డ్యాన్సర్‌ ఎవరు- ధోని, మైక్‌లో సందడి చేసేదేవరు-కోహ్లి, రొమాంటిక్‌ కామెడీస్‌ ఇష్టపడేదెవరు-బుమ్రా, తన గురించి తానే గూగుల్‌ చేసే వ్యక్తి- చహల్‌,  కాఫీ ఎవరు ఎక్కువగా ఇష్టపడతారు- రోహిత్‌ శర్మ, ఆలస్యంగా వచ్చేవారు- రోహిత్‌, ఎప్పుడూ జిమ్‌లో ఉండేదెవరు- కోహ్లి, ఎప్పటికీ ఫోన్‌ పట్టుకుని ఉండేదెవరు-ధావన్‌’అంటూ రవీంద్ర జడేజా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top