షేన్ వార్న్ బాల్ ఆఫ్‌ది సెంచరీ గుర్తుందా.. అదేనండి ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ 1993 యాషెస్ సిరీస్‌లో మాంచెస్టర్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మైక్ గ్యాటింగ్‌ను అవుట్ చేసిన బంతి గుర్తుండని క్రికెట్ అభిమాని ఉండరు. వార్న్ వేసిన బంతి లెగ్‌స్టంప్ వద్ద పిచ్ అవ్వగానే అనూహ్యంగా టర్నై ఆఫ్‌స్టంప్‌ను ఎగరగొట్టింది. ఈ బంతికి ఆశ్చర్యపోని వారుండరు. దీంతో ఈ బంతిని వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీగా పిలుస్తున్నారు.