బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈడెన్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో సైతం ఇన్నింగ్స్‌ను గెలుపును అందుకుంది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే పరిమితం చేసిన భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్ గంటలోపే ఇన్నింగ్స్‌ను ముగించింది. ఓవర్‌నైట్ ఆటగాళ్లు తైజుల్ ఇస్లామ్(11), ముష్పికర్ రహీమ్(74)లతో పాటు ఎబాదత్ హుస్సేన్(0)ను సైతం ఉమేశ్ యాదవ్ ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ 184 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది.
పింక్ బాల్ టెస్టులో టీమిండియా విజయం
Nov 24 2019 2:58 PM | Updated on Nov 24 2019 3:02 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement