ఈ స్కూప్ షాట్ హైలైట్ అయ్యింది
ప్రపంచ క్రికెట్‌లో స్కూప్ షాట్లు కొత్తమే కాదు. కానీ న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కొట్టిన తాజా స్కూప్ షాట్ ప్రతీ ఒక్కర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ పెద్దగా శ్రమించకుండానే ఆడిన స్కూప్ షాట్ హైలైట్ అయ్యింది.శుక్రవారం న్యూజిలాండ్ లిస్ట్-ఎ క్రికెట్‌లో భాగంగా ఒటాగో-వెల్లింగ్టన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఒటాగో తరఫున ఆడుతున్న నీల్ బ్రూమ్.. వెల్లింగ్టన్ కెప్టెన్ హమిస్ బెన్నిట్ వేసిన స్లో బౌన్సర్‌ను వికెట్ కీపర్ తలపై నుంచి ఫోర్‌కు పంపాడు. తన టైమింగ్‌లో ఎటువంటి పొరపాటు చేయకుండా వికెట్ కీపర్ పైనుంచి కచ్చితమైన షాట్ ఆడాడు. ఈ షాట్‌ను చూసిన ప్రత్యర్థి ఆటగాళ్లు, అభిమానులు వాటే షాట్ అనుకోవడం తమ వంతైంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి