క్యాచ్‌ మిస్ చెలరేగిపోతున్న రోహిత్‌

ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రోహిత్‌ శర్మ చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ఆరంభానికి ముందు రోహిత​ ఖాతాలో మూడు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. కాగా, రోహిత్‌ సాధించిన రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీలో అతనికి లైఫ్‌లు లభించడం ఇక్కడ గమనార్హం. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ క్యాచ్‌ వదిలేసినందుకు ఆ జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది. రోహిత్‌ (122 నాటౌట్‌) సెంచరీ నమోదు చేశాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ క్యాచ్‌ను జారవిడచగా అతను హాఫ్‌ సెంచరీ సాధించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top