వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, చంద్రబాబు జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలేనని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.