టిట్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ఎక్కడాకూడా కనబడటంలేదనీ, సాయం చేయమని అడిగితే ప్రజలపై అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాధితులకు ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు నాయుడు వైఫ్యల్యాన్ని ఎండగట్టారు. నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా? అని ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉంటే తుపానుపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
నిలదీస్తే ప్రజల పైనే కేసులు పెడతారా?
Oct 19 2018 2:28 PM | Updated on Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement